Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్‌ | Woman Dances At Canadian Airport As She Meets Boyfriend After 5 Years | Sakshi
Sakshi News home page

Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్‌

Published Thu, Nov 9 2023 9:22 PM | Last Updated on Fri, Nov 10 2023 9:46 AM

Woman Dances At Canadian Airport As She Meets Boyfriend After 5 Years - Sakshi

ప్రేమ ఒక అద్భుతమైన భావోద్వేగం, ప్రేమించడం మాటల్లో చెప్పలేని ఒక ప్రత్యేక అనుభూతి. ప్రేమను మాటల్లోనే కాదు.. మన భావాలు, పనుల ద్వారా గొప్పగా చెప్పవచ్చు. లాంగ్‌ డిస్టెన్స్‌ రిలేషన్‌షిప్స్‌లో ప్రేమ భిన్నంగా ఉంటుంది. ప్రేమించిన వారు దూరంగా ఉన్న వారి మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. పక్కన లేకపోయినా, రోజూ కలవకపోయినా ఆప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే 

అయిదు సంవత్సరాల తరువాత కలవబోతున్న తన ప్రియుడికి ఓ యూవతి వినూత్నంగా స్వాగతం చెప్పాలనుకుంది. ఎంతో కాలంగా  దూరంగా ఉన్న ప్రియుడి కోసం  ఆలోచించి వినూత్నంగా వెల్‌కమ్‌ చెప్పింది. ఎయిర్‌పోర్టులో అతడి ముందు ఎంతో అందంగా డ్యాన్స్‌ చేసి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఈ దృశ్య కావ్యానికి ఈ కెనడాలోని ఎయిర్‌పోర్టు వేదికగా మారింది. ఓ యువకుడు లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవగానే కొంతమంది అతనికి గులాబి పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతారు. కానీ అతడు మాత్రం తన ప్రేయసి ఎక్కడుందంటూ వెతుకుతూ ఉంటాడు.

ఇంతలోనే యువతి ఎదురుపడి  ఎవరూ ఊహించని విధంగా ప్రియుడికి వెల్‌కమ్‌ చెప్పింది. బాలీవుడ్‌ మూవీ షేర్షాలోని ‘రతన్‌ లంబియాన్’ పాటకు ఎంతో డ్యాన్స్‌ చేసింది. ప్రేమికుడిని దగ్గరగా చూస్తూ అయిదు సంవత్సరాలు తన కోసం వేచి ఉన్న నిరీక్షణను సాంగ్, డ్యాన్స్‌ రూపంలో అతడికి తెలియజేసింది. క్యూట్‌ స్టెప్పులతో ఆహా అనిపించింది. ప్రియురాలి సర్‌ప్రైజ్‌కు ఉబ్బితబ్బైన వ్యక్తి.. ఆమె మరో పాటకు డ్యాన్స్‌ చేయాల్సి ఉండగానే దగ్గరకొచ్చి గట్టిగా హగ్‌ చేసుకున్నాడు. ఈ వీడియోను నిక్కి షా అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్‌వచ్చాయి. ఒకటిన్నర లక్ష మంది లైక్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement