మద్యం సేవిస్తూ, బార్‌ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు! | Video: Vulgar Dancing, Drunken Celebration At Government School In Bihar | Sakshi
Sakshi News home page

మద్యం సేవిస్తూ, బార్‌ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు!

Published Fri, Sep 27 2024 8:54 PM | Last Updated on Fri, Sep 27 2024 8:54 PM

Video:  Vulgar Dancing, Drunken Celebration At Government School In Bihar

పాఠశాల అంటే టీచర్లు, విద్యార్ధులు, క్లాస్‌లు, విద్యాబోధన ఇవే మనకు తెలుసు. సాయంత్రం వేళ ఆటలు, సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కానీ ఓ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ, బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో మంగళవారం వెలుగు చూసింది.

సహర్సా జిల్లా జలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్‌, నలుగురు బార్‌ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ ఆశ్లీల డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్‌ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్‌ చేయడం కూడా చూడొచ్చు. 

అయితే స్కూల్లో తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మరోవైపుఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందిస్తూఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్‌ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement