band
-
ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!
ఇటీవల కాలంలో మన నగరాల్లో కూడా చిన్ని చిన్న మ్యూజిక్ బ్యాండ్లు వచ్చాయి. ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు కూడా. అయితే పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచే ఉంది. అక్కడ పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రాక్ మ్యూజిక్‌కి క్రేజ్ ఎక్కువ. 60ల కాలంలో ఓ ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. ఇప్పటికీ వివిధ పాటల ఆల్బమ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్. దీని నుంచి విడుదలై ప్రతి మ్యూజిక్ హిట్. అలాంటి ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ లోగో డిజైన్ చూస్తే కంగుతింటారు. ఆ డిజైన్‌కి ప్రేరణ మన హిందువుల ఆరాధ్య దైవమైన కాళిమాత అట. 1962లో, ది రోలింగ్ స్టోన్స్ పేరుతో బ్రిటిష్ రాక్ బ్యాండ్ స్థాపించారు కొందరూ పాప్ గాయకులు. ఆ బ్యాండ్‌లోని సభ్యులు మిక్ జాగర్, కీత్ రిచర్డ్స్, బ్రెయిన్ జోన్స్, బిల్ వైమాన్, చార్లీ వాట్స్ తదితరులు. బ్రిటన్‌లో 1963 ఆ టైంలో వీరి బ్యాండ్ నుంచి విడుదలైన 'కమ్ ఆన్' అనే మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. దీంతో తమ బ్యాండ్ అని తెలిసేలా ఓ ప్రత్యేక లోగో ఉంటే బాగుంటుందని బ్యాండ్ సభ్యులు భావించారు. కానీ సరిగ్గా ఆ టైంలో ఉన్న యూరోపియన్ పర్యటన ఉండటంతో ఫేమస్ బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాన్ పాస్చేచే హడావిడిగా యూరప్‌లో ఉండే మిస్టీరియస్ స్టోన్స్నే లోగోగా డిజైన్ చేయడం జరిగింది. అయితే బ్యాండ్‌కి అనతి కాలంలో మంచి పేరు రావడంతో తమ మ్యూజిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీ గ్రాఫిక్‌ని డిజైన్ చేసేలా జాన్ పాస్చేకే మళ్లీ పని పురమాయించారు బ్యాండ్ సభ్యులు. అప్పుడే మంచి లేబుల్‌తో కూడిన లోగో ఉండాలి. అంది తమ బ్యాండ్ దర్పాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేట్టు ఉండాలనుకున్నారు బ్యాండ్ సభ్యులు. ఆ దిశగా రాక్ అండ్ రోల్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్ లోగోని ఆవిష్కరించమని పాస్చేకి చెప్పారు. అయితే ఆ బ్యాండ్ సభ్యుల్లో ఒకరైన మిక్ జాగర్‌ని కాళి దేవత రూపం ఎంతగానో ఆకర్షించింది. ఆ రూపం చిహ్నమైన నాలుక, పెదాలనే లోగోగా తీసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే డిజైనర్ జాన్ పాస్చేకే చెప్పి డిజైన్ చేయించాడు. ఆ బ్యాండ్ ధరించే టీ షర్ట్‌లపై కూడా ఆ లోగోనే ఉంటుంది. ఇక జాగర్‌కి హిందూ దేవత కాళిమాత గురించి ఎలా తెలిసిందంటే..తన తమ్ముడు ద్వారా తెలుసుకున్నాడు. ఆయన భారతదేశ పర్యటనలు చేస్తుంటాడు. అలా అతడు భారత్ నుంచి తెచ్చిన కొన్ని పుస్తకాలను జాగర్‌కి ఇస్తుండేవాడు. అందులో కనిపించిన కాళి మాత రూపం జాగర్‌ని బాగా ఆకర్షించింది. దీంతో ఆమె చిహ్నలతోనే లోగో తయారు చేయాలనే ఆలోచన జాగర్‌కి తట్టడం జరిగింది. ఆయన కోల్‌కతాలో కాళీ పూజలు చేసి వచ్చి మరీ ఈ లోగోని డిజైన్ చేయించుకున్నారట. ఈలోగో కాళిమాత విగతమైన నాలుక, పెదాలతో ఉంటుంది. అయితే అందరూ మత్రం ఆబ్యాండ్ అసలు సభ్యలైన గాయకుడు జాకర్ పెదాలుగా భావిస్తుంటారు. అసలు కాళీమాత అంటే.. ధిక్కారణ, స్థితిస్థాపకత, శక్తిని సూచిస్తుంది. అలానే తమ బ్యాండ్ ఉనికిని చాటుకుంటూ.. ప్రజలను ఆకట్టుకునేలా.. శక్తిమంతమైన మ్యూజిక్‌ని అందించే బ్యాండ్ అని అర్థం ఇచ్చేలా ఈ విధంగా లోగోని డిజైన్ చేయించినట్లు తెలిపారు. అందుకుగానూ డిజైనర్ పాస్చేకి అప్పట్లో సుమారు రూ. 5 వేల రూపాయలకు పైనే చెల్లించారట. అయితే 1976లో ఆ లోగో ఆ బ్యాండ్ అధికారిక చిహ్నంగా మారడంతో పాస్చేకి దాదాపు రూ.27 లక్షలు చెల్లించి మరీ కాపీరైట్ హక్కలును తీసుకుంది ది రోలింగ్ స్టోన్స్ బ్యాండ్.(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
మద్యం సేవిస్తూ, బార్ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు!
పాఠశాల అంటే టీచర్లు, విద్యార్ధులు, క్లాస్‌లు, విద్యాబోధన ఇవే మనకు తెలుసు. సాయంత్రం వేళ ఆటలు, సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కానీ ఓ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో మంగళవారం వెలుగు చూసింది.సహర్సా జిల్లా జలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్, నలుగురు బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ ఆశ్లీల డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు. అయితే స్కూల్లో తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మరోవైపుఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందిస్తూఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారుबिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमकेसहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp— Republican News (@RepublicanNews0) September 26, 2024 -
కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!
అందానికి సహజ చిట్కాలు పాటించేవాళ్లు కొందరైతే.. మేకప్‌తో కవర్ చేసుకునేవారు మరికొందరు. అయితే ఏ పద్ధతి పాటించినా.. ముఖం కళగా, అందంగా కనిపించాలంటే.. కళ్లు ప్రత్యేకంగా అగుపించాలి. ఈ చిత్రంలోని సౌందర్య సాధనం కళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది. ఇది కళ్లను పెద్దవిగా, కలువ పువ్వులా మారుస్తుంది. ఈ ఐ బ్యాండ్.. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతాన్ని సాగదీసి.. ముఖానికి సొగసులు అద్దుతుంది. దీన్ని స్నానం చేస్తున్నప్పుడు కూడా సులభంగా ధరించొచ్చు. టీవీ చూస్తున్నప్పుడు.. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు.. ల్యాప్‌టాప్ వర్క్ చేసుకునేటప్పుడూ చక్కగా వాడొచ్చు. చిత్రంలో చూపించినట్టుగా కేవలం 10 నిమిషాల పాటు కళ్లకు పెట్టుకుంటే చాలు. కళ్లు కలువల్లా ఆకర్షణీయంగా మారుతాయి. ఈ బ్యాండ్ లోపలివైపున 50కి పైగా చిన్న చిన్న పవర్ బాల్స్ అమరి ఉంటాయి. ఈ బ్యాండ్‌ని సులభంగా చెవులకు తగిలించుకుంటే.. కళ్లకు బిగుతుగా, పట్టినట్లుగా ఉంటుంది. దీని ధర 25 డాలర్లు. అంటే 2,074 రూపాయలు. (చదవండి: లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!) -
ఐదు జాతీయ రహదారులతోపాటు 475 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా కురుస్తున్న మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రహదారులను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లాహౌల్-స్పితిలోని తొమ్మిది ప్రాంతాలలో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
సోరెస్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్ బంద్!
బీహార్ తర్వాత జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌కు చెందిన పలు సంస్థలు గురువారం జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజు (గురువారం) హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్‌పై విచారణ జరగనుండగా, మరోవైపు చంపై సోరెన్ పట్టాభిషేకంపై చర్చలు జరుగుతున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఈడీ కార్యాలయంలో నేటి (గురువారం) ఉదయం నుంచి దర్యాప్తు సంస్థ అధికారులు హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా ఈడీ తనను అరెస్ట్ చేయడంపై హేమంత్ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. यह एक विराम है जीवन महासंग्राम है हर पल लड़ा हूं, हर पल लड़ूंगा पर समझौते की भीख मैं लूंगा नहीं क्या हार में, क्या जीत में किंचित नहीं भयभीत मैं लघुता न अब मेरी छुओ तुम हो महान, बने रहो अपने लोगों के हृदय की वेदना मैं व्यर्थ त्यागूंगा नहीं हार मानूंगा नहीं... जय झारखण्ड! pic.twitter.com/oduWMRGOmQ — Hemant Soren (@HemantSorenJMM) January 31, 2024 ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కవితను పోస్ట్ చేసి.. ఇది తనకు కేవలం విరామమేనని రాశారు. తాను ఎప్పుడూ పోరాడుతుంటానని, భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని, ఎప్పుడూ రాజీ కోసం వేడుకోననని దానిలో పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Morning visuals from Enforcement Directorate's office, in Ranchi where the ED is interrogating Hemant Soren in a money laundering case related to the alleged land scam. Hemant Soren stepped down as the Chief Minister of Jharkhand yesterday. pic.twitter.com/681hhYs5sy — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి చంపై సోరెన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. #WATCH | On Jharkhand CM Hemant Soren, state BJP spokesperson Pratul Shah Deo says, "...This was bound to happen in Jharkhand. CM was accused of being involved in a Rs 70,000 Crore scam. After selling everything, he sold defence land in Ranchi too. His problems increased after… pic.twitter.com/Na8fQ6Xmux — ANI (@ANI) February 1, 2024 హేమంత్ సోరెన్ గురించి బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ మాట్లాడుతూ హేమంత్ సోరెన్ రూ. 70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, చివరికి రాంచీలోని డిఫెన్స్ భూమిని కూడా అమ్మేశారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ చట్టమే అత్యున్నతమనే విషయాన్ని మర్చిపోయారని, 40 గంటల పాటు కనిపించకుండా పోయారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జార్ఖండ్‌కు మచ్చతెచ్చారని ఆరోపించారు. -
వైట్‌హౌస్‌లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్‌లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్‌లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్‌ట్రాక్‌గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
కోనసీమ వీధుల్లో.. కేరళ దరువు
సాక్షి, అమలాపురం/అయినవిల్లి: కేరళతో చాలా విషయాల్లో కోనసీమకు దగ్గర పోలికలుంటాయి. ప్రకృతి అందాలు.. కొబ్బరి చెట్లు.. పచ్చని చేలు.. విస్తారమైన సముద్ర తీరంతో రెండు ప్రాంతాలూ దాదాపు ఒకేలా అగుపిస్తాయి. కోనసీమను మినీ కేరళగా కూడా అభివర్ణిస్తారు. ఆ ప్రభావమో ఏమో కానీ అరుదైన వాయిద్య కళ కేరళ చెండా మేళానికి ఈ సీమలో ఘనమైన గుర్తింపు లభిస్తోంది. దేవాలయాల వద్ద జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో నిర్వహించే ఊరేగింపుల్లో కేరళ చెండా మేళం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ కళలో కేరళలో శిక్షణ పొందిన స్థానిక కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అని కితాబులందుకుంటున్నారు. కేరళ అనగానే కథాకళి, కొడియాట్టం, తెయ్యం వంటి కళారూపాలు గుర్తుకు వస్తాయి. అటువంటి వాటిలో చెండా మేళం ఒకటి. దీని ప్రదర్శనలో స్థూపాకార పెర్కషన్ వాయిద్యాన్ని వాయిస్తారు. దాని నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వీరు చేసే ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బృందంలోని మహిళా కళాకారులు పెద్దపెద్ద చిడతలతో తాళం వేస్తారు. కేరళలో 300 సంవత్సరాలకు పైగా అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం చెండా మేళం. ఇందులో 30 నుంచి 100 మంది వరకూ సభ్యులుంటారు. కేరళలోని అన్ని పండగల్లో చెండా మేళం తప్పనిసరి. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో దీనికి విశేష ఆదరణ ఉంది. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన తరువాత దీనికి దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. కేరళ కళాకారులకు దీటుగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ కళా ప్రదర్శన జరుగుతోంది. తొలి రోజుల్లో కేరళ నుంచి వచ్చిన కళాకారులు దీనిని ప్రదర్శించేవారు. అయితే ఇది వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. దీంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఈ కళలో శిక్షణ పొంది, 30 మందితో బృందాన్ని తయారు చేశారు. స్థానికంగా ఉన్న ఎల్.గురునాథం తొలుత మంగళ వాయిద్యాలు వాయించేవారు. తరువాత తీన్మార్లోకి మారారు. వీటికన్నా కేరళ చెండాకు ఆదరణ ఉందని తెలుసుకుని ఈ బృందాన్ని తయారు చేశారు. తరువాత ముక్తేశ్వరంతోపాటు ఇదే మండలంలో అయినవిల్లి, విలస గ్రామాల్లో కూడా కేరళ చెండా బృందాలు తయారయ్యాయి. గురునాథం కేరళలోని త్రిశూర్‌లో ప్రముఖ గురువు రాజేష్ మాలా వద్ద శిక్షణ పొందారు. అనంతరం ఇక్కడకు వచ్చి, స్థానికులకు శిక్షణ ఇచ్చారు. అయితే మెరుగైన మేళంగా శిక్షణ ఇచ్చేందుకు ఏటా కొంతమందిని త్రిశూర్ పంపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కేరళ చెండా కళను ప్రదర్శించే కోనసీమ బృందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ బృందాలు కేరళ సంప్రదాయ వ్రస్తాలు ధరించి మరీ ప్రదర్శన ఇవ్వడం విశేషం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు ఇచ్చారు. సింహాచలం, అన్నవరం, అంతర్వేదితో పాటు హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాల వద్ద వీరు ప్రదర్శన ఇచ్చారు. వీటితో పాటు పలు జిల్లాల్లో ఆలయాల ప్రారంభోత్సవం, రథోత్సవాలు, అమ్మవార్ల ఊరేగింపులు, తీర్థాలు, జాతర్లలో చెండా ప్రదర్శన తప్పనిసరిగా మారింది. ఇక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార హోరు, పెళ్లి ఊరేగింపుల్లో కేరళ చెండా ప్రదర్శన ఉండాల్సిందే. చివరకు చిన్న పిల్లల పుట్టిన రోజులకు సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రదర్శనకు దూరం, సమయాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కేరళలో చెండా మేళం తరహాలోనే తంబోళా మేళానికి కూడా ఆదరణ పెరుగుతోంది. దీంతో స్థానిక కళాకారులు ఈ కళను సైతం నేర్చుకుని రాణిస్తున్నారు. మా ప్రదర్శన ప్రత్యేకం వివిధ రకాల ఊరేగింపుల్లో మా ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. వీక్షించేందుకు వచ్చే వారిలో ఎక్కువ మంది మా ప్రదర్శన తిలకిస్తారు. ఇటీవలి కాలంలో మా చెండా మేళానికి డిమాండ్ పెరుగుతోంది. – కోటి, చెండా మేళం కళాకారుడు త్వరలో కాంతారా ప్రదర్శన మొదట తారసాలు, తరువాత తీన్మార్ వాయించే వాళ్లం. ఇప్పుడు కేరళ చెండా, తంబోళం మేళాలు ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాం. ఇటీవల విశాఖ జిల్లాలో కాంతారా కళను ప్రదర్శించాము. కాంతారాను త్వరలో పూర్తి స్థాయి ప్రదర్శనగా మారుస్తాం. – ఎల్.గురునాథం, ముక్తేశ్వరం, అయినవిల్లి మండలం -
బీటీఎస్ బ్యాండ్ బాయ్స్‌కి గడ్డం ఉంటే.. ఎలా ఉంటుందో చూడండి..
-
దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే...
ఇది చూడటానికి ఫ్యాషన్ రిస్ట్బ్యాండ్లా కనిపిస్తుంది. దీనిని చేతికి తొడుక్కుంటే, దోమలు ఆమడదూరం పరారైపోతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజినీర్ కర్ట్ స్టోల్ రూపొందించిన ఈ పరికరాన్ని స్విస్ కంపెనీ ‘నోపిక్స్గో’ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! దోమల నుంచి రక్షణ కల్పించే ఈ హైటెక్ రిస్ట్‌బ్యాండ్, పరిసరాల్లో దోమలను గుర్తించగానే, విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది. ఇందులోంచి వెలువడే విద్యుత్ తరంగాల తాకిడికి ఏదో తుఫాను ముంచుకొస్తున్నట్లుగా దోమలు గందరగోళంలో పడి, వెంటనే పారిపోతాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి ప్రారంభించాలని ‘నోపిక్స్గో’ భావిస్తోంది. దీని ధర 70 యూరోల (రూ.6,255) వరకు పెట్టవచ్చని అంచనా! ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
Hyderabad: తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. విభిన్న భాషల మేలు కలబోతతో విలసిల్లుతున్న హైదరాబాద్.. భాషలో, యాసలో ఆంగ్ల అనుకరణం కారణంగా కొన్నాళ్లుగా తెలుగుపై కాస్త మక్కువ తగ్గింది. ప్రస్తుతం నగర వేదికగా సంగీత వేదికలపై తెలుగు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ రాక్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన వేదికలపైనే ఇప్పుడు తెలుగు పాటలు, జానపద సాహిత్యం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్ బ్యాండ్స్ నగరంలో సందడి చేసేవి. కానీ ఇప్పుడు దాదాపు పాతిక తెలుగు బ్యాండ్స్ ప్రాంతీయ భాషలో అలరిస్తున్నాయి. నగరంలోని బార్లు, పబ్‌లలో జస్టిన్ బీబర్ సాంగ్స్‌కు బదులు బుల్లెట్టు బండి పాటలు మార్మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొడితే ఎలక్ట్రిక్ మ్యూజిక్కు బదులు టాలీవుడ్ మాస్ పాటలు వినిపిస్తున్నాయి. నగర జీవన విధానంలో పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక స్థానముంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్, క్లబ్‌లలో ఇంగ్లిష్, హిందీ సంగీతం వినిపించేది. కొన్నేళ్లుగా ఈ స్పాట్లలో తెలుగు పాటలు ప్రారంభమయ్యాయి. కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం కేవలం తెలుగు సాహిత్యమే ప్రధానాంశంగా ప్రారంభించాయి. అయిదేళ్ల క్రితం ఇలాంటివి రెండు, మూడు ఉంటే ఇప్పుడు 40 వరకు పెరిగాయి. ఈ మధ్య కాలంలో అనూహ్యంగా తెలుగు బ్యాండ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్‌పైన లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌తో మెలోడీ, మాస్, క్లాస్, జానపద పాటలు అలరిస్తుంటే ఫుడ్, సిప్‌ను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఈ పరిణామంతో తెలుగు బ్యాండ్స్‌కు ఉపాధి పెరిగింది. తెలుగు మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కోవిడ్ కారణంగా కాస్త నెమ్మదించాయి. నైట్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో మాత్రం తెలుగు పాటలే కొత్త ట్రెండ్. నగరం నలుమూలల్లోని ఏ బార్, రెస్టారెంటైనా తెలుగు పాటే క్రేజీనెస్. తెలుగు సాహిత్యం ఉన్న రిసార్ట్స్, బార్లకు కస్టమర్లు కుటుంబ సమేతంగా వస్తుండటం విశేషం. తెలుగు సాహిత్యమే ప్రస్తుత నేపథ్యం.. నగరవాసులు ఇప్పుడు తెలుగు పాటల ట్రెండ్‌నే అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే ప్రదర్శించాలనే నేపథ్యంతోనే తబులా రాసా బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు లైవ్ మ్యూజిక్ బ్యాండ్లకు మంచి వేదికను ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో తెలుగు పాటలను వింటూ కుటుంబంతో సరదాగా గడపాలనే వారి సంఖ్య పెరిగింది. నైట్ కల్చర్‌కు పేరొందిన ప్రదేశాల్లో తెలుగు పాటలున్నవాటినే ముందు రిజర్వ్ చేసుకుంటున్నారు. – జువ్వాడి శ్రవణ్, తబులా రాసా వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్ -
‘బ్యాండ్ లేని లాయర్.. బ్యాట్ లేని టెండూల్కర్ ఒక్కటే’
న్యూఢిల్లీ: కోర్టులో వాదించే న్యాయవాదులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తులు నల్ల కోట్ ధరించి ఉంటారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలనే అంశంపై కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ యువ న్యాయవాది బ్యాండ్(టై) ధరించకుండా కోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు వినిపించే సమయంలో బ్యాండ్ ధరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ లాయర్‌కు కీలక సూచనలు చేశారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ‘కోర్టులో ధరించవద్దు.. అది చాలా అసహ్యంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీ కళాశాలలో నమూనా కోర్టు నిర్వహించాల్సింది. దీనిని నమూనా కోర్టుగా భావించు. లంచ్‌కు వెళ్లేందుకు మాకు 10 నిమిషాల సమయం ఉంది. అన్ని వివరాలను తెలుసుకుని వాదనలు వినిపించు. నీవు వాదించగలవని అనుకుంటున్నాం. మీ సీనియర్ గైర్హాజరైనప్పుడు వాదనలు వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక న్యాయవాది బ్యాండ్(టై) లేకుండా రావటం.. బ్యాటు లేకుండా క్రికెట్ గ్రౌండ్లోకి సచిన్ టెండూల్కర్ రావటం ఒక్కటే.’ అని పేర్కొన్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. అయితే, ఒక యువ న్యాయవాదికి జస్టిస్ డీవై చంద్రచూడ్ సలహాలు ఇవ్వటం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది ఓ యువ న్యాయవాది కోర్టుకు సమర్పించాల్సిన రాతపూర్వక పత్రాన్ని తీసుకురాకపోవటంతో పలు సూచనలు చేశారు. #Courtroomexchange Counsel appears before #SupremeCourt without his band. Justice Chandrachud: A lawyer without his band is like Sachin Tendulkar without his bat. J. Kohli: Well said. Counsel attempts to wear band in Court DYC: Now don’t dress up in Court, that is worse. — Live Law (@LiveLawIndia) September 1, 2022 ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటాపై సుప్రీంకోర్టులో విచారణ -
పాప్ బ్యాండ్ బీటీఎస్‌తో బైడెన్ భేటీ : వీడియో వైరల్
Biden says it was great to meet BTS: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ సూపర్ గ్రూప్ బీటీఎస్ బృందం అమెరికా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమవేశమైంది. ఈ సమావేశంలో ఆసియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, వివక్షత తదితర అంశాలకు సంబంధించిన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. ఈ మేరకు పాప్ బృందం బైడెన్‌ని కలవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, వివక్ష పెరుగుదల గురించి అవగాహన పెంచడానికి బైడెన్ చేస్తున్న కృషిని ప్రశంసించింది. కరోనాకి సంబంధించిన ద్వేష పూరిత నేరాల చట్టంపై సంతంకం చేయడం వంటి బైడెన్ నిర్ణయాలను పాప్ బృందం కొనియాడింది. గత కొంతకాలంలో వైట్‌హౌస్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు బైడెన్ చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధంలో జరిగిన సమావేశానాకి సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. It was great to meet with you, @bts_bighit. Thanks for all you’re doing to raise awareness around the rise in anti-Asian hate crimes and discrimination. I look forward to sharing more of our conversation soon. pic.twitter.com/LnczTpT2aL — President Biden (@POTUS) June 1, 2022 (చదవండి: అందుకే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయం: ఎట్టకేలకు బైడెన్ కీలక ప్రకటన) -
శాటిలైట్ సర్వీసుల కోసం 27.5 గిగాహెట్జ్ స్పెక్ట్రం!
త్వరలో నిర్వహించబోయే వేలంలో 27.5–28.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయించకపోవచ్చని తెలుస్తోంది. దీన్ని శాటిలైట్ సర్వీసుల (టీవీ,రేడియో, ఇంటర్నెట్) కోసం పక్కన పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫ్రీక్వెన్సీని మొబైల్, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. అయితే, 5జీ, శాటిలైట్ ట్రాన్స్మిటర్లు పక్కపక్కనే పని చేయడం కుదరదని, ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీని రెండు రకాల సర్వీసుల కోసం షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని టెలికం శాఖ భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే, ఇవన్నీ వదంతులేనని టెలికం శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. దీనిపై డిపార్ట్మెంట్లో పలు అభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. 5జీ తదితర సేవల కోసం వివిధ ఫ్రీక్వెన్సీల్లోని స్పెక్ట్రంను దాదాపు 7.5 లక్షల కోట్లకు వేలం వేయవచ్చంటూ ట్రాయ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందంటూ టెల్కోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
శ్రీవల్లి సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీసులు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. చదవండి: 'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్లో అందులో ముఖ్యంగా 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్‌పై కవర్ సాంగ్స్ చేస్తూ అనేకమంది నెటిజన్స్ అలరించారు. 'తగ్గేదే లే..' అంటూ శ్రీవల్లి సాంగ్‌లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేస్తూ అదరగొట్టారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ఇప్పుడు తాజాగా ఈ పాటను సంగీత వాయిద్యాలతో ట్యూన్ చేశారు ముంబై పోలీసులు. ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసులు తమలోని మరో కళను బయటపెట్టారు. బ్యాండ్‌తో శ్రీవల్లి సాంగ్‌ను కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇవే కాకుండా సినిమాల్లోని పలు హిట్ సాంగ్స్‌ను ట్యూన్ చేస్తున్నారు ఈ పోలీసులు. అలాగే మహిళల రక్షణ కోసం పలు వీడియోలు చేసి తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తున్నారు. చదవండి: శ్రీవల్లి పాటకు 100 మిలియన్ల వ్యూస్ -
వైరల్: చిన్నారి మొదటి రోజు స్కూల్..ఎప్పటికీ గుర్తుండేలా చేశారు
న్యూఢిల్లీ: ఎవరికైనా తమకో లేక తమ వారికో జీవితంలో మొదటి సారి జరిగే వాటిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. అందుకే మొదటి సంతానం, ఫస్ట్ శాలరీ, ఫస్ట్ క్రష్ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇలాంటి మధుర జ్ఞ్యాపకాలను మదిలో గుర్తుపెట్టుకుంటే, ప్రస్తుత ట్రెండ్ లో వాటినే వీడియోలో షూట చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన బాబు మొదటి రోజు స్కూల్ కి వెళ్తున్నాడు. దాన్ని గుర్తుండి పోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఇంకేముంది పెళ్లి కి ఊరేగింపులా ఏకంగా బ్యాండ్ ట్రూప్ నే ఏర్పాటు చేశాడు. సాధారణంగా పిల్లల కూడా స్కూల్ కి వెళ్ళాలంటే బాగా మారం చేస్తారు. ఇక్కడ మాత్రం ఆ చిన్నారి సంతోషంగా కేరింతలు కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. Kid will need therapy growing up…. https://t.co/PpgUfHH5Jc — Nistula Hebbar (@nistula) November 13, 2021 -
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
మ్యూజిక్ కోసం అబ్బాయి అవతారం.. ట్విస్ట్ ఏంటంటే..
మ్యూజిక్ అంటే ఇష్టంతో ఓ బాలిక.. అబ్బాయిగా అవతారం ఎత్తింది. చైనాకు చెందిన 13 ఏళ్ల ఫు జియువాన్ అనే బాలిక.. అబ్బాయిగా ప్రముఖ యూఎన్‌జీ యూత్ క్లబ్ సంస్థ మ్యూజిక్ బ్యాండ్‌లో చేరింది. అయితే బ్యాండ్ ట్రైనింగ్‌లో భాగంలో పలు వీడియో పర్ఫార్మేన్స్లను ఆమె సోషల్ మీడియాలో షేర్చేసింది. దీంతో ఫు జియువాన్ అబ్బాయి కాదని.. బాలిక అని యూఎన్‌జీ యూత్ క్లబ్ అభిమానులు, నెటిజన్లు గుర్తించారు. అయితే ఈ విషయంపై ఫు జియువాన్ స్పందించింది. ‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నన్ను క్షమిచండి. ఇక నేను భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ రంగంలోగాని, వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో గాని కనిపించను’ అని తెలిపింది. అయితే ఈ విషయంపై యూఎన్‌జీ యూత్ క్లబ్ ప్రతినిధి స్పందిస్తూ.. యూఎన్‌జీ క్లబ్ కేవలం 11 నుంచి 13 ఏళ్ల అబ్బాలను మాత్రమే చేర్చుకుంటుదని తెలిపారు. వారికి మ్యూజిక్, డ్యాన్స్‌లపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ ఆడిషన్స్‌ను సరిగా చేయకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ఇటువంటి తప్పులు మళ్లీ జరగవని తెలిపారు. చైనాలో ఈ బ్యాండ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మ్యూజిక్, డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఇందులో చేరి శిక్షణ పొంది ఫేమస్ కావాలని ఆశపడుతుంటారు. మ్యూజిక్‌పై ప్రేమతో ఆమె చేసిన ధైర్యాన్ని అభిమానులు కొందరు ప్రశంస్తున్నారు. యూఎన్‌జీ క్లబ్ లాభాలు పొందాలనే ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. -
సంగీతంతో సమరభేరి.. అయినా సరే, ‘తగ్గేదే లేదు’
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు... అదేమిటోగానీ సెర్బియాలోని ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో శతాబ్దాలుగా తిష్ట వేసిన పురుషాధిక్య భావజాలంపై సమరభేరీ మోగిస్తోంది. బాల్య వివాహాలను నుంచి గృహహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తుంది. కేవలం సమస్య గురించి మాట్లాడడమే కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది.ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్‌ది నల్లేరుపై నడకేమీ కాదు. ‘పెళ్లివిందు దగ్గర బ్యాండ్ వాయించండి. మీ వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వెక్కిరించిన వాళ్లు కొందరైతే ‘మా పిల్లల పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు!’ అంటూ భౌతికదాడులు చేసినవారు ఇంకొందరు. అయినా సరే, ‘తగ్గేదే లేదు’ అంటు ముందుకు సాగుతున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని అరికట్టడానికి సెర్బియన్ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం రాలేదు. అయితే రోమా బ్యాండ్ ప్రచారం వల్ల తరతరాల సంప్రదాయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ‘మీకంటూ ఒక సొంతవ్యక్తిత్వం ఉంది. భవిష్యత్‌ను నిర్మాణం చేసుకునే హక్కు పూర్తిగా మీ మీదే ఉంది’లాంటి మాటలు వినేవారికి మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను గ్రహించడం మొదలైంది’ అంటోంది 24 సంవత్సరాల సిల్వియా సినాని అనే సభ్యురాలు. ఫిమేల్ బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో చాలామంది బాల్యవివాహాలకు దూరంగా ఉన్నారు. చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ తెలియని వయసులో బాల్యవివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది! ర్యాప్ అండ్ ట్రెడిషనల్ రోమా–ఫోక్ బీట్ మిళితం చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్–ఫిమేల్ బ్యాండ్’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్ బ్యాండ్’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్–ఫిమేల్ బ్యాండ్ మొదలైంది. అప్పుడు కేవలం వినోదం కోసం అయితే ఇప్పుడు ‘స్త్రీ చైతన్యం’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తోంది. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన ఈ బ్యాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శం అయింది. -
వైరల్ వీడియో: పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు
-
వైరల్ : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు
కరోనా వ్యాప్తితో దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మీరు పెళ్లి చేసుకోండి.. కాకపోతే కరోనా నిబంధనల్ని పాటించాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో జరగాల్సిన పెళ్లితంతు పూర్తిగా మారిపోయింది. కరోనాకు ముందు పెళ్లంటే.. పెళ్లి మండపాల్లో చుట్టాలతో కళకళలాడేవి. మేళ తాళాలు కొత్త జీవితానికి శుభం పలుకుతూ ఆహ్వానించేవి. అతిథులు సమక్షంలో నూతన వధూవరులు ఒక్కటయ్యేవారు. కానీ, ఇప్పుడు అదేం లేదు. పెళ్లిళ్లు కళతప్పి ఎవరి పెళ్లి వాళ్లే చేసుకుంటున్నారు. అతిథులు లేకుండానే శుభకార్యాలు జరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు తన పెళ్లికి తానే డప్పుకొట్టుకుంటున్నాడు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఆ వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి తంతు అనంతరం వధూవరులు పెళ్లి మండపం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో డప్పు చప్పుళ్లతో, మేళతాళాలతో ఆహ్వానిస్తారు. కానీ రూపిన్ శర్మ షేర్ చేసిన వీడియోలో పెళ్లి తర్వాత పెళ్లి కుమారుడు డప్పు వాయిస్తుంటే పెళ్లి కుమార్తె అతని వైపు చూస్తూ సిగ్గుపడుతుంది. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి కొడుకే కానీ పక్కా ప్రొఫెషనల్ డ్రమ్స్ వాయిస్తున్నాడని ఓ నెటిజన్ అంటుంటే.. నా పెళ్లికి నేను డప్పు కొట్టుకుంటున్నా.. మీ పెళ్లికి మీరే డప్పు కొట్టుకోవాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. పెళ్లికూతురు సిగ్గుపడుతుంటే, పెళ్లికొడుకు పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నాడంటూ మరోనెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. -
వేలంలో రొనాల్డో ఆర్మ్బ్యాండ్కు రూ. 55 లక్షలు
బెల్గ్రేడ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిఫరీ నిర్ణయంపై ఆగ్రహంతో మైదానంలో విసిరేసిన కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ (చేతికి ధరించేది) 64 వేల యూరోల (రూ. 55 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గత ఆదివారం పోర్చుగల్, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆట అదనపు సమయంలో తాను కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించడంతో ఆగ్రహించిన రొనాల్డో... తన చేతికి ఉన్న నీలి రంగు ఆర్మ్‌బ్యాండ్‌ను విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న ఫైర్ ఫైటర్ ఒక చారిటీ సంస్థకి అందజేశాడు. వాళ్లు దానిని ఆన్లైన్ వేలంలో ఉంచడంతో ఒక అభిమాని పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం వినియోగిస్తామని ఆ చారిటీ సంస్థ తెలిపింది. -
ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా?
సంగీతానికి అవధుల్లేవు అన్నది అందరికీ తెలిసిన మాట. అయితే సంగీత కచేరీకీ షరతుల్లేవు అని నిరూపించింది ఓ ట్రాన్స్‌జెండర్ గ్రూప్. ఆరుగురు ట్రాన్స్జెండర్లు కలిసి మ్యూజిక్ బ్యాండ్‌గా ఏర్పడి పాటలను వదిలారు. చెడామడా తిట్టిన నోళ్లే తమను మెచ్చుకుంటుంటే పొంగిపోయారు. ఆత్మస్థైర్యం పెంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ భారత్‌లోనే తొలి ట్రాన్స్జెండర్ల సంగీత సమూహం కావడం విశేషం. (చదవండి: వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్) ఈ బ్యాండ్‌లో ఫిదా ఖాన్, రవీనా జగ్తప్, ఆశ జగ్తప్, చాందిని సువర్ణకర్, కోమల్ జగ్తప్, భవికా పాటిల్ అనే ఆరుగురు ట్రాన్స్జెండర్లు ఉంటారు. 2016లోనే ఏర్పడ్డ ఈ బ్యాండ్ నుంచి ఇప్పటి వరకు ఐదు పాటలు వెలువడ్డాయి. పాట రిలీజైన ప్రతిసారి అభిమానులు వాటిని విని, కొత్తగా ఉన్నాయంటూ మెచ్చుకునేవారు. సాధారణ ప్రేక్షకులే కాదు హృతిక్ రోషన్, సోనూ నిగమ్, అర్జున్ కపూర్, రహత్ ఫతే అలీ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం బ్యాండ్ ప్రతిభకు సపోర్ట్ చేస్తూ వారి పాటల వీడియోలో తళుక్కున మెరిశారు. సోనూ నిగమ్ అయితే వీరిని సంగీత పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్నారు. (చదవండి: అరవై రోజులు ఆగకుండా షూటింగ్...!) నిజంగానే సమాజంలో వివక్షకు గురవుతున్న వీళ్లు ఇక్కడివరకు రావడం అంటే మాటలు కావు. అందరి ట్రాన్స్జెండర్ల లాగే వీళ్లకు కూడా ఎన్నో అవమానాలు, చీత్కారాలు, వేధింపులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటి ముందడుగు వేశారు. సంగీత సరిగమలతో ప్రజల మనసు దోచుకునే బ్యాండ్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అదే సంగీతాన్ని అస్త్రంగా చేసుకుని జెండర్ ఈక్వాలిటీ కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. (చదవండి: సుశాంత్ వదిలేసుకున్న 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు!) -
మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ప్రోడక్ట్
వన్‌ప్లస్ ఫిట్నెస్ బ్యాండ్ మార్కెట్ లోకి జనవరి 11న రానున్నట్లు ముకుల్ శర్మ, ఇషాన్ అగర్వాల్ టిప్స్టర్లు పేర్కొన్నారు. వన్‌ప్లస్ ఇండియా ఫిట్నెస్ బ్యాండ్ అధికారిక పేరు, ప్రత్యేకతలు ప్రకటించకుండా కేవలం టీజర్ చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకుంది. ఈ చిత్రంలో 'ది న్యూ ఫేస్ ఆఫ్ ఫిట్నెస్'తో పాటు 'కమింగ్ సూన్' కూడా ఉంది. ఫిట్నెస్ బ్యాండ్ యొక్క ప్రత్యేక వెబ్సైట్లో 'నోటిఫై మీ' అనే వివరాలతో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. టిప్స్టర్లు తెలిపిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ బ్యాండ్ జనవరి 11న రూ.2,499 లభించనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రేపే షియోమీ ఎంఐ 10ఐ లాంచ్) వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్: యూట్యూబ్‌లో ముకుల్ శర్మ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. వన్‌ప్లస్ బ్యాండ్ లో 1.1-అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లే, 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 3-యాక్సిస్ యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.0, ఐపి 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. వన్‌ప్లస్ బ్యాండ్ కూడా 50 మీటర్ల లోతు వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న 100 ఎంఏహెచ్ బ్యాటరీతో 14 రోజుల వరకు పనిచేస్తుందని తెలుపుతున్నారు. ఇది 10.3 గ్రాముల బరువు ఉంటుంది(ట్రాకర్ మాత్రమే). ఇది బ్లాక్, నేవీ, టాన్జేరిన్ గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నుంచి రానున్న మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను కూడా ఈ సంవత్సరంలోనే లాంచ్ చేయనున్నట్లు సంస్థ సీఈఓ పీట్ లా గత నెలలో ప్రకటించారు. -
దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
-
బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
BTS (బీటీఎస్).. దక్షిణ కొరియాలో ఫేమస్ బాయ్ బ్యాండ్. దీన్ని బ్యాంగ్టన్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్‌లో ప్రారంభమైన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్‌కి మాషప్స్ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, హిందీపాటలతోపాటు విభిన్న భాషల్లోని పాటలకు డాన్స్ చేయడం వీరి ప్రత్యేకం. ఈ బాయ్ బాండ్లో ఏడుగురు సభ్యులున్నారు. వీళ్లుచేసే ఒక్కే పార్ఫమెన్స్ ఒక్కో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్‌కి డాన్స్ చేసి భారత్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది బీటీఎస్ బ్యాండ్. ఇటీవల అల్లు అర్జున్ బబ్లాక్ బాస్టర్ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి బుట్టబొమ్మ పాటకు డాన్స్ చేసి దుమ్ములేపారు. (అంధాధున్ రీమేక్: టబు పాత్రలో నటించేది ఆమే!) తాజాగా బాలీవుడ్ చాద్దీ జవానీ, తుమ్సే మిల్కే దిల్ కాపై అనే పాటలకు కూడా మాషప్ చేశారు. ఈ వీడియోను క్వాలిటాపోసస్ట్స్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ పాటకు బీటీఎస్ బ్యాండ్ సభ్యులు తమ స్టైల్లో అద్భుతమైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. భాష రాకున్న స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఈ డ్యాన్స్‌పై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో చక్కగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ‘ఈ డాన్స్ చూస్తుంటే నాకు కూడా వీళ్లతో కలిసి స్టెప్పులు వేయాలనిపిస్తోంది.’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి) -
‘త్వరలో కరోనా లక్షణాలకు ఐఐటీ బ్యాండ్’
సాక్షి, చెన్నై: కరోనాను త్వరగా గుర్తించేందుకు దేశీయంగా వివిధ పరికరాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్ వియర్‌బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాలను గుర్తించే బ్యాండ్‌ను వచ్చే నెలల్లో మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. అయితే ఈ బ్యాండ్‌ను చేతి మణికట్టుకు ధరించవచ్చు. ఈ బ్యాండ్ కరోనా లక్షణాలను గుర్తించే ముఖ్యమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, గుండె, ఆక్సిజన్, రక్త పనితీరును బ్యాండ్ ద్వారా గుర్తించవచ్చు. ఈ బ్యాండ్‌కు రూ.3,500కు ధర నిర్ణయించారు. కాగా ఈ బ్యాండ్‌ను మొబైల్ ఫోన్, బ్లూటూత్‌లలో ధరించవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లకు ప్రవేశించగానే ఈ బ్యాండ్‌ను ధరిస్తే ఆరోగ్య సేతు యాప్‌ను అలర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 2లక్షల బ్యాండ్ల అమ్మకాలకు ప్రణాళిక ఉందని, రాబోయే 2022సంవత్సరానికి 10లక్షలకు పెంచనున్నారు. -
‘చౌరస్తా’నుంచి మరో సాంగ్.. బాహుబలినై
చౌరస్తా బ్యాండ్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఈ పేరు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా తమ కంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను అలవరుచుకున్న ఈ బృందం నయాట్రెండ్‌కు తగ్గ పాటలను అందిస్తూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తాజాగా లాక్డౌన్ సందర్భంగా ప్రస్తుతం ఇళ్లల్లోని పరిస్థితులను వివరిస్తూ మరో పాటను విడుదల చేశారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో కష్టాలు పడుతున్న భర్తలకు.. ఆ భర్తలను భరిస్తున్న భార్యలకు ఈ పాట అంకితం అంటూ మొదలైన సాంగ్ ‘బాహుబలినై బట్టలుతికితే.. అవాక్కయ్యే తెలుపు లేదని, బంటు నేనై అంట్లు తోమితే.. అద్దమంటి మెరుపే లేదని’ అంటూ వచ్చే లిరిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్, శ్రీనివాస్, యశ్వంత్, బాలా ఈ నలుగురు కలిసి చౌరస్తా అనే జానపద బ్యాండ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఊరెళ్లిపోతా మామా, మాయ వంటి పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. -
బాండ్‌పేపర్‌పై హామీలు
కొడిమ్యాల(చొప్పదండి): ఈనెల 22న నిర్వహిం చనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నా రు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్‌రెడ్డి బాండ్‌పేపర్‌పై హామీలను ముద్రించి, పోస్ట్‌ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే సీపీఎస్‌ను రద్దుచేపిస్తానని, కాంట్రాక్టు అధ్యాపకులకు హెల్త్‌కార్డులు మంజూరు చేపిస్తానని, అధ్యాపకులకు ఇంటిస్థలాలు సమకూరుస్తానని బాండ్‌పై హామీ లు ముద్రించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను 20 సంవత్సరాల భావి ఉద్యోగ జీవితాన్ని వదులుకుని పోటీలోఉన్నానని, దివ్యాంగుడినైనందున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందున బాండ్ద్వారా హామీలను తెలుపుతున్నానని, ఆశీర్వదించాలని కోరుతున్నారు. -
కవాతుకు నో.. బాలికల కన్నీరు
శివాజీనగర: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో అందరూ మునిగితేలుతుంటే, ధార్వాడలోని ప్రెజన్టేషన్ స్కూల్ పిల్లలు కన్నీరు కార్చారు. అయితే అవి ఆనందభాష్పాలు కాదు. కర్ణాటకలోని ఆర్.ఎన్.శెట్టి క్రీడా మైదానంలో కవాతులో బ్యాండ్ వాయించటానికి వారం రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థినులకు అధికారులు అవకాశం ఇవ్వలేదు. పిల్లలు పదే పదే వేడుకున్నా కూడా బ్యాండ్ బాయించటానికి అధికారులు ససేమిరా అనడంతో బాలికలు క్రీడా మైదానంలో విలపిస్తూ బయటికి వెళ్లిపోయారు. కొన్నిరోజుల క్రితమే బాలికల ప్రతిభను చూసిన జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం కవాతులో మీరు పాల్గొనవచ్చని చెప్పారు. దీంతో వారందరూ ఉదయాన్నే టిఫిక్ కూడా తినకుండా ఉత్సాహంగా బ్యాండు బాజాలు తీసుకుని వస్తే, అధికారులు సైంధవుల్లా అడ్డుపడ్డారు. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉధృతంగా ఉద్యమం
-
గిన్నిస్ బుక్‌లో డప్పు కళాకారులు
హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 700 మంది డప్పు కళాకారులతో గిన్నిస్ బుక్ నమోదు చేసేందుకు ‘తెలంగాణ స్థాయి డప్పు మహోత్సవం’ను ఘనంగా నిర్వహించారు. 1200 సెకన్లు నిరంతరంగా డప్పు వాయించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మెమోంటోలను అందజేసి అభినందించారు. కళాకారులకు గుర్తింపు మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని, కళాకారులకు తగిన గుర్తింపును ప్రభుత్వమిచ్చిందని, రానున్న రోజుల్లో డప్పు కళాకారులకు కూడా తగిన న్యాయం చేసేలా సీఎం ఆలోచన చేస్తున్నారని, తొందర్లోనే డçప్పు కళాకారులు శుభవార్త వింటారని అన్నారు. రాష్ట్రంలోనే హుజూరాబాద్ గడ్డ సాహసం, త్యాగాల్లో ఎప్పుడూ ముందుంటుందని, ఇక్కడి కళాకారులు ప్రతినిత్యం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారని గుర్తు చేశారు. కళాకారులతోపాటు క్రీడలు, కోలాటాలకు కూడా హుజూరాబాద్ గడ్డ నిలయంగా నిలుస్తోందని కొనియాడారు. ఇక్కడి స్ఫూర్తితోనే జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కోలాట నృత్య ప్రదర్శన వ్యాప్తి చెందిందన్నారు. డప్పు కొట్టడం నామూషీగా భావించొద్దని, అది కూడా ఓ కళే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, ఎంపీపీ వొడితెల సరోజనీదేవి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత శ్రీనివాస్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుదాస్ గోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శి కన్నన్దురైరాజ్, గౌరవ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కన్వీనర్ వంగల హన్మంత్‌గౌడ్, ఉపాధ్యక్షులు చాడ గంగాధర్‌రెడ్డి, క్యాస చక్రధర్, సహాయ కార్యదర్శి కలకోటి కిషన్‌రావు, పిల్లి సమ్మయ్య, కోశాధికారి చిట్టంపెల్లి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు బూర్ల నాగభూషణం, ఎస్కే షౌకత్‌పాషా, మార్కండేయులు, రాజురి రాజు, ఇంద్రకరన్, అందాసి నారాయణ, దాసరపు కుమార్, బండ కిషన్, ముఖ్య సలహాదారులు పంజాల రాంనారాయణగౌడ్, వనమమలై జగన్మోహనచారి, దామెర గిరిజామనోహర్రావు, బుర్ర నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్యాయం జరిగిందనే బంద్‌లో పాల్గొన్నాం
-
తూర్పు గోదావరి జిల్లాలో బంద్‌కు ప్రజల మద్దతు
-
తిరుపతిలో కొనసాగుతున్న బంద్
-
ఏపీలో కొనసాగుతున్న బంద్
-
ఏపీ బంద్‌లో పాల్గొన్న వైఎస్ జగన్
-
సురక్ష బ్యాండ్‌తో లైంగిక వేధింపులకు చెక్
మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి సేఫ్ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్లను అందించనుంది. జీపీఎస్ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది. సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్ ఆధారిత సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు. ఎలా పనిచేస్తుంది... పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్స్టేషన్లు తదితర ఏడు ఫోన్ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్లు ఎంతో సహకరించనున్నాయి. ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్లు అందించనుంది. -
అక్కడ హైహీల్స్ నిషేధం
మగువలు అత్యంత ఇష్టంగా ధరించే హైహీల్స్‌ను నిషేధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. కెనడాలోని బ్రిటీస్ కొలంబియా ప్రావిన్స్‌లోని అన్ని పని ప్రదేశాల్లో ఈ నిషేధం విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రత, ఆరోగ్య కారణాల దృష్ట్యా కార్మికుల పాదరక్షల నియంత్రణ చట్టానికి సవరణలు చేసినట్లు గ్లోబల్ న్యూస్ సంస్థ తెలిపింది. పని చేసే సమయంలో మహిళలు ఎక్కువ సేపు హీల్స్ ధరించి పనిచేస్తుండంటంతో ఎక్కువ మంది అనారోగ్యానికి గురౌతున్నారని తెలిపింది. అయితే దీనిపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది వ్యతిరేఖిస్తున్నారు అయితే కొన్ని సందర్భాల్లో పని చేసే ప్రాంతాల్లో మహిళలు హైహీల్స్ ధరించాల్సిఉంటుందని,వాటిని ఎలా నిషేధిస్తారని ప్రావిన్సియల్ ప్రీమియర్ క్రిష్టి క్లార్క్ ప్రశ్నించారు. గ్రీన్పార్టీకి చెందిన నేత పార్లమెంట్లో ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టడంతో ఈఅంశం వెలుగులోకి వచ్చింది. కెనడాలో ఎక్కువ శాతం మంది మహిళలు హైహీల్స్ ధరించి బార్లు, రెస్టారెంట్లలో పనిచేస్తుంటారు. -
ముగిసిన బంద్
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్ష నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాసెంటర్‌లో కోదాడ– మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఉద్యోగ జేఏసీ నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్, గొట్టె రామయ్య, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, చావా కిరణ్మయి, వేముల శేఖర్‌రెడ్డి, శీలం శ్రీను, పాలకూరి బాబు, గూడెపు శ్రీనివాస్, మేకల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, ఎంఏ.మజీద్, బాచిమంచి గిరిబాబు, జడ రామకృష్ణ, పిల్లి మల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, రౌతు వెంకటేశ్వరరావు, శీలం¯ éగరాజు, కుక్కడపు మహేష్, కలకుంట్ల రామయ్య, పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో... పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోఎస్కె.మన్సూర్‌అలీ, ఎస్కే. సైదా, షేక్ అక్బర్, ఎండి.మొయిన్, ఎండి. రహీం, రఫీ, హసన్మియా, జానీమియా, బడేమియా, బాజీ, సుభానీ, ఖాసిం పాల్గొన్నారు. -
జనగామ బంద్ సక్సెస్
అధికార పార్టీతో సహా ప్రతిపక్షాల నిరసనలు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నిర్మానుష్యంగా రహదారులు జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. హన్మకొండ వద్దు... జనగామ జిల్లా చేయాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలు రహదారులపైకి వచ్చి గర్జించారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజే పీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బహుజన సమాజ్‌వాది, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ప్రాంగణం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సైతం జనగామ బంద్‌కు మద్దతు పలికారు. యువత బైక్‌ర్యాలీలతో వాడవాడలా తిరుగుతూ జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని జనగామ, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్లోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితోపాటు పారామిలటరీ బలగాలు, మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. బంద్‌లో వ్యాపార, వాణి జ్య సంస్థలతోపాటు ప్రైవేటు పాఠశాలు స్వచ్ఛందం గా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచి ప్రయాణీలు చాలా ఇబ్బందులు పడ్డారు. జనగామ పట్టణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సంపూర్ణ బంద్‌తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. జనగామ జిల్లా చేయకపోతే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, నెల్లుట్ల నర్సిం హారావు, నాగారపు వెంకట్, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, వజ్జ పర్శరాములు, బొట్ల శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, మామిడాల రాజు, పెద్దోజు జగదీష్, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, పసుల ఏబేలు, ఉల్లెంగుల క్రిష్ణ, తిప్పారపు ఆనంద్, రావెల రవి ఉన్నారు. -
చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టులు
– బంద్ విఫలయత్నానికి సర్కారు కుట్ర – 11 గంటల వరకూ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు – స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రై వేట్ స్కూళ్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ మంగళవారం తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఆందోళన చేస్తోన్న వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. సాయంత్రం 5 గంటల వరకూ నేతలను పోలీస్ స్టేషన్లలోనే నిర్భందించారు. తిరుపతిలో ఆందోళన చేస్తోన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో అడ్డు తగిలిన మహిళా నాయకులు, కార్యకర్తలపై నిర్దయగా వ్యవహరించారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా మహిళల చీరలు చిరిగాయి. కొంతమంది చేతులకు గాయాలయ్యాయి. శాంతారెడ్డి అనే మహిళ మంగళసూత్రం తెగి కింద పడింది. ఇకపోతే వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుపతిలో కరుణాకర్‌రెడ్డితో పాటు జిల్లాపార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్టూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో బంద్‌కు నేతత్వం వహిస్తోన్న ఎంపీ మి«థున్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవిలను పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు, మదనపల్లిల్లో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలను కూడా బలవంతంగా అరెస్టు చేశారు. పుంగనూరులో బంద్ నిర్వహిస్తోన్న తంబళ్లపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని, తిరుపతి యూనివర్సిటీలో బంద్‌కు నేతృత్వం వహించిన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు మద్దతు పలికి ప్రతక్షంగా బంద్‌కు సహకరిస్తోన్న సీపీఐ, సీపీఎం నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డిలను కూడా అరెస్టు చేసి ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా అంతటా పోలీసులు 1000 మందికి పైగా అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేసినట్లు సమాచారం. పైవేటు స్కూళ్లు, కళాశాలలు బంద్.. జిల్లా వ్యాప్తంగా ప్రై వేట్స్కూళ్లు, కళాశాలలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. తిరుపతిలోని ఎస్వీ, మహిళా, వేదిక్, విద్యాపీఠం, వెటర్నరీ, వ్యవసాయ యూనివర్సిటీలు కూడా బంద్ పాటించాయి. జిల్లా అంతటా ఉదయం 11 గంటల వరకూ ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీనివల్ల చిత్తూరు రీజియన్ మంగళవారం రూ.1 కోటి నష్టపోయినట్లు ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు మాత్రమే నడిచాయి. అన్ని పట్టణాల్లోనూ మధ్యాహ్నం 12 గంటల వరకూ కిరాణా,ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తుల షాపులు మూతపడ్డాయి. -
ఆకర్షించినన 'మహిళా' మ్యూజిక్ బ్యాండ్
-
నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల బంద్
-
వాళ్లు 'బంద్'ను భుజానేసుకున్నారు
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పైన ఎండ, కడుపులో ఆకలి సుర్రుమంటున్నాయి. నెత్తిన ముసుగు సరిచేసుకుంటూ .. రోడ్డు క్రాస్ చేస్తున్నా.. ఈ ఆర్టీసీ బంద్ ఏమో గానీ దేవుడా... ఇంటికి ఎలా వెళ్లాలిరా బాబూ.. పక్కన ఇద్దరు అమ్మాయిల మాటలు లీలగా వినబడుతున్నాయి. హుమ్! అనుకుంటూ.. రోడ్డు క్రాస్ చేసి బస్టాప్‌లో నిలబడ్డా.. ఏదో ఒక ప్రైవేటు వెహికల్ రాకపోతుందా అనుకుంటూ.. రోడ్డు మీద ఒక ఆర్టీసీ బస్సు కూడా లేకపోయినా.. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది.. నగరంలో ఉన్న వాహనాలన్నీ రోడ్లమీదికి వచ్చేసినట్టున్నాయి. ఇంతలో.. ఓయ్! అని పిలిచారు ఎవరో.. తిరిగి చూస్తే నా ఫ్రెండ్.. రావోయ్.. నేను అటే వెళుతున్నా.. కొంతదూరం డ్రాప్ చేస్తా.. అంది కారు డోర్ తీసి.... వేరే ఆలోచించే టైమ్ కూడా ఇవ్వలేదు నాకు.. దాదాపు కారులోకి గుంజినంత పనిచేసింది. కూర్చునే సర్దుకునే లోపే సోమాజిగూడ రానేవచ్చింది... నన్ను అక్కడ దించేసి తను వెళ్లిపోయింది. హు! మళ్ళీ బస్సుకోసం ఎదురు చూపులు.. చకోరపక్షిలా... ఇంతలో సడన్‌గా టపా టపా కాదు.. ధబీ...ధబీ.. పెద్ద పెద్ద చినుకులతో వాన మొదలైంది. అమీర్ పేట్.. ఎస్ఆర్ నగర్.... అరుస్తున్నాడు ఒక ప్రైవేటు బస్సువాలా... హమ్మయ్య అనుకుంటూండగానే.. .. ఎక్కడనుంచి వచ్చారో తెలియదు బిలబిల మంటూ పదిహేనుమంది మహిళలు... సినిమాల్లోని స్పీడ్ సీన్లో లాగా ఎక్కేసి కూర్చున్నారు. దాదాపు అందరికీ సీట్లు దొరికాయి. ఒకసారి అందరినీ చూశా.... కొందరు ముభావంగా.. ..ఏదో ఒకటి దొరికింది.. సగం దూరం వెళ్లిపోవచ్చు అన్న ఊరటలో మరికొంతమంది. చాలా మంది ఎపుడు ఇంటికి చేరతామా అన్నట్టుగా దిగులుగా కనిపించారు. వాళ్లను అలా చూడగానే .. ''ఆయన ప్యాంటుతొడుక్కొని ఆఫీసుకు వెళితే.. నేను నా ఇంటిని తొడుక్కొని బయలుదేరాను'' అన్నప్రముఖ రచయిత్రి శిలాలోలిత కవిత పాదాలు గుర్తొచ్చాయి. అందరూ ఉద్యోగినులే. తలా బ్యాగులో ఒడిలో పెట్టుకుని కూచున్నవారి మొహాల్లో ఆఫీసులో అలసట కంటే బంద్ ప్రభావమే ఎక్కువ కనిపిస్తోంది. ఎన్నాళ్లండీ ఈ బంద్ బాబూ? అన్నారెవరో.. ఏమోనండీ ప్రభుత్వం కూడా మొండిగానే కనిపిస్తోంది కదా.. ఇంకో గొంతు. అయినా ఈ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసెయ్యాలండీ.. అపుడు గానీ బుద్ధి రాదు.. ఆవేశంగా ఓ యువతి. ఇంతలో ఓ పెద్దావిడ కలుగజేసుకొని.. నో. నో.. అలా అనకూడదమ్మా.. మనం కూడా కొంచెం స్థిమితంగా ఆలోచించాలి. వాళ్ల కోరికలు తీరాలంటే సమ్మె చేయక తప్పదు కదా... పీత కష్టాలు పీతవి.. అన్నారు. వానొచ్చినా వరదొచ్చినా.. చివరికి ఏ బంద్ వచ్చినా మనకే బాధలు.. బస్సుల కోసం తిప్పలు...ఆటోల కోసం పరుగులు. ఏం చేస్తాం... నిట్టూర్చింది. ఏయ్! మీకో విషయం తెలుసా...అసలు ఈ నిరసనలు.. సత్యాగ్రహాలు... మన ఆడవాళ్ల నుంచే మన జాతిపిత గాంధీ కాపీ కొట్టేశారట తెలుసా..అంది ఉత్సాహంగా అంది మరో యవతి. అవునా... మనల్ని కాపీకొట్టి. మనల్ని వెనక్కి నెట్టేసి వాళ్లు జాతీయ నాయకులు అయిపోయారన్నమాట....మోసం..అన్యాయం... ఛీటింగ్ అన్నాను నేను సినీ ఫక్కీలో.. నవ్వులే.. నవ్వులు. ఇంతలో ఎస్ఆర్ నగర్ వచ్చేసింది దిగండి.. అన్నాడు డ్రైవర్ .. అందరూ అయోమయంగా చూస్తున్నాం. .. దిగండమ్మా... దిగండి.. ఏదో పోనీలే అని ఎక్కించుకుంటే.. అంటున్నాడు.. మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ...ఫ్రీగా తీసుకొచ్చినట్టు ఫోజు. అదేంటి.. మైత్రీవనంలో ఆపి ఎస్ఆర్నగర్ అంటాడు...పైగా ఏదో సేవ చెసినట్టు బిల్డప్పూ... వీడూనూ.. అన్నారు ఇందాకటి పెద్దావిడే. విసుగ్గా. అందరం ..మా బ్యాగులతో పాటూ 'బంద్' ను కూడా భుజాన వేసుకొని నిలబడ్డాం మరో వాహనం కోసం ఎదురు చూస్తూ. (సూర్యకుమారి) -
కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు
నిజామాబాద్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాతే న్యాయశాఖలో పోస్టుల భర్తీ చేపట్టాలనే డిమాండ్ తో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బార్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నగర బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ లో ఆందోళనకు దిగిన న్యాయవాదులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బంద్ కు వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.ఎన్.చారి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
బంద్ కు పిలుపునిచ్చిన న్యాయవాదులు
నిజామాబాద్: తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు బంద్ కు పిలుపునిచ్చారు. గత పదిరోజులుగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా పిబ్రవరి 21 న బంద్‌కు పిలుపునిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతును తెలుపాలని కోరారు. కాగా హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు చేస్తున్న అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. -
ఏజెన్సీలో ప్రశాంతంగా మావోయిస్టుల బంద్
విశాఖపట్టణం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల కోసం ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంత సర్వీస్‌లను నిలిపివేసింది. (పాడేరు) -
నేడు బంద్