కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్‌ ఉంటే చాలు! | Eye Band To Beautify The Eyes | Sakshi

కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్‌ ఉంటే చాలు!

Feb 18 2024 12:32 PM | Updated on Feb 19 2024 11:13 AM

Eye Band To Beautify The Eyes - Sakshi

అందానికి సహజ చిట్కాలు పాటించేవాళ్లు కొందరైతే.. మేకప్‌తో కవర్‌ చేసుకునేవారు మరికొందరు. అయితే ఏ పద్ధతి పాటించినా.. ముఖం కళగా, అందంగా కనిపించాలంటే.. కళ్లు ప్రత్యేకంగా అగుపించాలి. ఈ చిత్రంలోని సౌందర్య సాధనం కళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది. ఇది కళ్లను పెద్దవిగా, కలువ పువ్వులా మారుస్తుంది. ఈ ఐ బ్యాండ్‌.. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతాన్ని సాగదీసి.. ముఖానికి సొగసులు అద్దుతుంది.

దీన్ని స్నానం చేస్తున్నప్పుడు కూడా సులభంగా ధరించొచ్చు. టీవీ చూస్తున్నప్పుడు.. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు.. ల్యాప్‌టాప్‌ వర్క్‌ చేసుకునేటప్పుడూ చక్కగా వాడొచ్చు. చిత్రంలో చూపించినట్టుగా  కేవలం 10 నిమిషాల పాటు  కళ్లకు పెట్టుకుంటే చాలు. కళ్లు కలువల్లా ఆకర్షణీయంగా మారుతాయి. ఈ బ్యాండ్‌ లోపలివైపున 50కి పైగా చిన్న చిన్న పవర్‌ బాల్స్‌ అమరి ఉంటాయి. ఈ బ్యాండ్‌ని సులభంగా చెవులకు తగిలించుకుంటే.. కళ్లకు బిగుతుగా, పట్టినట్లుగా ఉంటుంది. దీని ధర 25 డాలర్లు. అంటే 2,074 రూపాయలు. 

(చదవండి: లీఫ్‌ ఆర్ట్‌: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement