కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు | lawyers call band in nizamabad distirict. | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

Published Sat, Feb 21 2015 12:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

నిజామాబాద్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాతే న్యాయశాఖలో పోస్టుల భర్తీ చేపట్టాలనే డిమాండ్ తో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బార్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నగర బంద్ కొనసాగుతోంది.


బస్టాండ్ లో ఆందోళనకు దిగిన న్యాయవాదులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బంద్ కు వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.  ఆందోళన కార్యక్రమాల్లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.ఎన్.చారి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement