నిజామాబాద్: తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు బంద్ కు పిలుపునిచ్చారు. గత పదిరోజులుగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా పిబ్రవరి 21 న బంద్‌కు పిలుపునిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతును తెలుపాలని కోరారు. కాగా హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు చేస్తున్న అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.