Nijamabad
-
రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్ వరకే తిరుపతి–కరీంనగర్ రైలు..
కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని అధికారులు పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఆకస్మిక పరిణామంతో జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.. ► సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురు, శుక్రవారాల్లో రద్దయ్యాయి. ► సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దవగా శుక్రవారం ఉదయం కూడా రద్దు చేశారు. ► సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘన్పూర్–సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నారు. ఘన్పూర్–కాగజ్‌నగర్ వరకు రద్దు చేశారు. ఈ మూడు రైళ్ల వల్ల నిత్యం హైదరాబాద్ వెళ్లాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ► తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌కే పరిమితం చేశారు. వరంగల్–కరీంనగర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పిల్లాపాపలతో తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా లగేజీతో వర్షంలో తడుస్తూ తిరిగి బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ► సికింద్రాబాద్–పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పెద్దపల్లి, రామగుండం నుంచి వెళ్లాల్సి ఉండగా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ► చైన్నె–అహ్మదాబాద్ వెళ్లాల్సిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి, మంచిర్యాల కాకుండా వాడి–సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు. ► న్యూఢిల్లీ–హైదరాబాద్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్షా–ఆదిలాబాద్–ముత్కేడ్ జంక్షన్ మీదుగా నిజామాబాద్ నుంచి దారి మళ్లించారు. ► గోరక్‌పూర్–సికింద్రాబాద్ రైలును పెద్దపల్లి–కరీంనగర్– నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. -
తెలంగాణలో వానలే వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోరు వానలు నమోదవుతున్నాయి. సీజన్ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా సంతృప్తికర వర్షాలే కురుస్తున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 60.7 సెంటీమీటర్ల సగటు వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా... శుక్రవారం ఉదయం వరకు 75.54 సెం.మీ. నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సాధారణం కంటే 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం 72.05 సెం.మీ... కానీ ఇప్పటికే సీజన్ సగటు వర్షపాతానికి మించిన వాన లు నమోదు కావడం విశేషం. గత రెండ్రోజులుగా రాష్ట్రం లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. రానున్న పక్షం రోజుల్లో వర్షాలు మరింత విస్తారంగా కురిసే అవకాశం ఉందన్నారు. 24 జిల్లాల్లో అధిక వర్షాలు సీజన్ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు ఒకేతీరుగా నమోదవుతున్నాయి. వానాకాలంలో ఇప్పటివరకు ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సంతృప్తికరమైన వర్షాలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురవగా, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత నెలలో మందకొడిగా... జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. జూన్ 3న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పట్నుంచి రుతుపవనాలు చురుకుగా కదిలినప్పటికీ ఆగస్టులో మాత్రం కాస్త మందకొడిగా సాగాయి. జూన్, జూలైల్లో సాధారణానికి మించి వర్షాలు కురవగా... ఆగస్టులో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ నెలలో 21.9 సెం.మీ. సగటు వర్షపాతానికిగాను 18.6 సెం.మీ. మాత్రమే నమోదైంది. దక్షిణాది జిల్లాల్లో అతి తక్కువగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తమ్మీద గతేడాది సాధారణం కంటే 50 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్‌లో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల నడుం ఎత్తు వరకు నీళ్లున్నాయి. దీంతో బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు వచ్చిచేరడంతో అక్కడివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మోటార్లతో నీటిని తోడేసుకుంటున్నారు. సెల్లార్లు జలమయం కావడంతో లిఫ్టులు ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు, గోడలు కూలిపోయాయి. గతంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూల్చివేయాలని అధికారులు చెప్పినా కొందరు యజమానులు పెడచెవిన పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది. నీటమునిగిన పంట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు భారీ వర్షాలకు నీట మునిగాయి. గత నెలలో కురిసిన వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినగా తాజాగా మరో లక్ష ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం. ఇప్పుడు 60వేల ఎకరాల్లో పత్తి పంట మునిగిపోగా, 20 వేల ఎకరాల్లో వరి, మరో 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అనధికారిక అంచనాలు ఉన్నాయి. పంట నష్టంపై అంచనాలు వేయమని సర్కారు ఆదేశించక పోవడంతో వ్యవసాయశాఖ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అత్యధిక వర్షపాతం: సిద్దిపేట, నారాయణపేట్ అధిక వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫా బాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నల్లగొండ, ఖమ్మం సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ములుగు. -
ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం...
సాక్షి, నిజామాబాద్: ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ డ్రైనేజీ మరమ్మతులు చేస్తుండగా రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మట్టిలో మృత దేహాలు కూరుకుపోవడంతో జేసీబీ, ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రపూర్‌క్ చెందిన కిషోర్, బాదల్‌గా గుర్తించారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఈ అంశంపై పార్లమెంట్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ‘నిజామాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు ఆ పట్టణంలో స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను అప్‌గ్రేడ్ చేసి రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. నిజామాబాద్‌లో పలు రకాల సుగంధ ద్రవ్యాలు పండుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. టీఐఈఎస్, ఏఈపీ స్కీమ్‌ల ద్వారా మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖల మధ్య ప్రభావవంతమైన సమన్వయం ఏర్పడుతుంది. గతంలో పసుపు బోర్డు గురించి మాట్లాడేవారు. అది చాలా చిన్నది. ఇన్ని అధికారాలు దక్కేవి కాదు. ఇంత సమన్వయం, మంత్రిత్వ శాఖల మద్దతు ఉండేది కాదు. అందుకే ఈ సెంటర్ తెచ్చాం. ఇది రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడుతుంది. బోర్డుకు ఉండే అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రాంతంలో టర్మరిక్ క్లస్టర్లు ఉన్నాయి. వాటికి ఈ సెంటర్ అండగా ఉంటుంది’అని వివరించారు. పంటకు ఎక్కువ ధరే లక్ష్యం... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... ‘స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ప్రకటన హర్షణీయం. టైస్ స్కీమ్ కింద ఎగుమతుల వృద్ధి, మౌలిక వసతులు పెంచడానికి, క్లస్టర్ స్కీమ్ కింద విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ బోర్డు వాణిజ్య శాఖకు మాత్రమే పరిమితమవుతుంది. వివిధ శాఖలతో సమన్వయం చేసే అధికారాలు ఉండవు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలేటైస్, క్లస్టర్. పసుపు ఎగుమతులకు అవకాశం పెరగడంతో డిమాండ్ అధికం అవుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. అంతిమంగా రైతుకు పంట మీద ధర ఎక్కువ రావాలన్నదే మన లక్ష్యం. రైతులు డిమాండ్ చేసిన దాని కంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది’అని పేర్కొన్నారు. రైతులు.. పసుపు బోర్డు అడిగితే సుగంద ద్రవ్యాల బోర్డు ఇవ్వడాన్ని ఎలా చూడాలని మీడియా ప్రశ్నించగా.. ‘అంబాసిడర్ కారు కావాలా, మెర్సిడెస్ బెంజి కారు కావాలా? అని ఆలోచించి బెంజి కారు ఇచ్చింది. పసుపు బోర్డు డిమాండ్ చాలా కాలంనాటిది. అది ఇప్పుడు ఇచ్చినా ప్రభావవంతంగా ఉండదు’అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల... నిజామాబాద్‌లోని స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్.పి.కంచన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సెంటర్‌కు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని, ఎగుమతుల వృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్పత్తులు, సంబంధిత అంశాలను సమన్వయం చేస్తారన్నారు. అలాగే సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్(మార్కెటింగ్) రెండేళ్లపాటు ఈ ప్రాంతీయ కార్యాలయం కార్యక్రమాలను ప్రతి నెలా పర్యవేక్షిస్తారని అన్నారు. దానిపై మంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తారని వివరించారు. రైతులను మభ్య పెడుతున్నారు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులను మభ్యపెడుతూ మరోసారి మోసం చేయడానికి ఎత్తుగడ వేస్తోందని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. నిజామాబాద్ కేంద్రంగా మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై మంగళవారం జిల్లాలోని ఆర్మూర్‌లో కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీయే నడిపిస్తోంది’
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద కొడుకులా మారారని ఎద్దేవా చేశారు. పూర్వీకుల గురించి బయట పడుతుందనే ఎన్ఆర్సీని ఓవైసీ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీఎఎ, ఎన్ఆర్సీలపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని, ఖరాఖండిగా అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యానే ఓవైసీ సభ పెట్టారన్నారు. జనగణమన పాడని ఓవైసీ.. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. మైనారిటీ ఏరియాలో తన పర్యటన వద్దని పోలీసులు చెబుతున్నారని.. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. ఎంపీకే రక్షణ ఇవ్వలేకపోతే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు అని మండిపడ్డారు. ఎన్ఆర్సీ పై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. అభివృద్ధిని చూసి మైనారిటీలు ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్,ఎంఐఎం లకు ప్రజలు బుద్ధి చెబుతారని అరవింద్ పేర్కొన్నారు. -
బీజేపీకి షాక్.. శివసేన నుంచి పోటీ
సాక్షి, నిజామాబాద్ : రెబల్స్ బెడద మహాకూటమినే కాదు బీజేపీకి కూడా వెంటాడుతోంది. ఈ పార్టీ నుంచి టికెట్ అశించిన నిజామాబాద్ బీజేపీ సీనియర్ నేత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గుప్తా సీటు రాకపోవడంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ రెబల్‌గా పోటీకి దిగారు. శివసేన పార్టీ తరుఫున బరిలోకి దిగిన గుప్తా సోమవారం కాషాయ జెండాల నడుమ భారీ ర్యాలీని నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ బలంగా భావించే ఈస్థానంలో ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పోటీపడుతున్నారు. గుప్తా రెబల్‌గా బరిలోకి దిగడంతో ఈస్థానంలో బీజేపీకి పెద్దదెబ్బగా ఈ పార్టీ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ తరుఫున తెలంగాణలో పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థి నారాయణ గుప్తానే కావడం విశేషం. ఇదిలావుండగా ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఇంకా ఆమోదించలేదని.. గుప్తాకు శ్రమను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ గుప్తా తెలిపారు. -
చూడలేకపోతున్న ‘మూడో కన్ను’..
జంగంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దారుణం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకేసారి ఇద్దరు హత్యకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పంచాయతీ పరిసరాల్లోనే ఉండడంతో నేరాన్ని రికార్డు చేయలేకపోయాయి. ఆర్థికభారం కావడంతో గ్రామంలో వేరే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ కూడా నిర్వీర్యం కావడంతో నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిక్కనూరు : ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జంగంపల్లి వీడీసీ అధ్యక్షుడు అత్తెలి రమేశ్, మరో వ్యక్తి ముదాం రాములు దారుణంగా హత్యకు గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ప్రతి గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న వివాదాలే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా మారుతాయని భావించిన పోలీసు అధికారులు.. వాటిని నివారించడం కోసం ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని నియమించారు. గ్రామంలోని గోడలపై గ్రామ పోలీస్ అధికారి పేరు, ఫోన్ నంబర్ రాయించారు. ఆ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీస్ అధికారికి సమాచారం వెళ్లేది. మొదట్లో ఈ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత ఈ వ్యవస్థను పట్టించుకోవడం మానేశారు. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వారు పల్లెలవైపు చూడడం లేదని తెలుస్తోంది. కొనుగోలు భారం.. నేరాల నియంత్రణకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటిని కొనుగోలు చేయడానికి పంచాయతీల వద్ద ఎలాంటి నిధులు లేవు. దాతలు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల కొనుగోలు భారం కావడంతో చాలా గ్రామాలు వీటి ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి పంచాయతీ వద్దో.. కూడళ్లలోనే ఉన్నాయి. అంతగా సీసీ కెమెరాలు లేకపోవడంతో మిగతా చోట్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోంది. గ్రామ ముఖద్వారం వద్ద లేకపోవడంతో.. భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో గతంలో దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో సీసీ కేమెరాలు ఉన్నాయి. కానీ గ్రామ ముఖద్వారం వద్ద ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో పోలీసులు దుండగుల ఆచూకీ కనుక్కోలేకపోయారు. జంగంపల్లిలోనూ సీసీ కెమెరాలున్నా.. గ్రామ ముఖద్వారం వద్ద ఒక్కటీ లేకపోవడంతో హంతకులను గుర్తించలేకపోయారు. అక్కరకు రాని కెమెరాలు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను సులువుగా ఛేదించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి నాణ్యమైనవి కాకపోవడంతో తరచుగా చెడిపోతూ సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో జంట హత్యలు జరిగిన ప్రదేశానికి సమీపంలో గ్రామ స్వాగత తోరణం ఉన్నప్పటికీ అక్కడ సీసీ కేమెరాలు లేవు. గ్రామపంచాయతీ సమీపంలోనే నాలుగు సీసీ కేమేరాలు ఉన్నాయి. అవి కూడా చెడిపోవడంతో ఇటీవల పోలీసుల సూచన మేరకు మరమ్మతులు చేయించారు. ఈ మరమ్మతులు చేయించిందీ హత్యకు గురైన అత్తెల్లి రమేశ్ కావడం గమనార్హం. సీసీ కెమెరాలను ప్రారంభ కార్యక్రమాల్లో పోలీసులు కనబడతారు కానీ వాటి పనితీరు ఎలా ఉందో అని మాత్రం తెలుసుకోరని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రారంభించడడమే కాదు వాటి పనితీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ ప్రజలు కోరుతున్నారు. పోలీసులకు సవాల్.. సంఘటన స్థలంలో లభించే చిన్న క్లూతోనయినా పోలీసులు నేరాన్ని ఛేదిస్తారు. జంగంపల్లి జంట హత్యల కేసులో మాత్రం హంతకులు హతుల సెల్ఫోన్లు ఎత్తుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఇద్దరిని చంపిన హంతకులు.. హతుల ఫోన్లను తీసుకుని జాతీయ రహదారి మీదుగా పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం కూడా జాతీయ రహదారి వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ హత్య కేసు మిస్టరీ కూడా ముందుకు సాగడం లేదు. భయాందోళనల్లో గ్రామస్తులు జంట హత్యలు జంగంపల్లివాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరిని కదిలించినా భయంభయంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో జంట హత్యలు కల్లోలం రేపాయని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గ్రామ శివారులో గ్రామానికి చెందిన దుమాల బాలవ్వ హత్యకు గురైంది. ఆ సంఘటన తర్వాత బుధవారం వేకువ జామున జరిగిన హత్యల సంఘటనే పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. మృతులు రమేశ్, రాములు వరుసకు బావమరుదులు అయినప్పటికీ వారి మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఏడాది క్రితం భూమి విషయంలో రమేశ్‌తో రాములు వాగ్వాదానికి దిగాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని గ్రామస్తులు తెలిపారు. అయితే వీరిరువురు హత్యకు మూడు రోజుల ముందు నుంచే మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బోనాలు తీసే విషయమై మాట్లాడుకుంటున్నారని తెలిసింది. ఈ ఇద్దరూ హత్యకు గురికావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. హంతకులను పట్టుకునేందుకు.. జంట హత్యల కేసుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని మరోమారు సందర్శించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రదేశాలనూ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హంతకులను పట్టుకునేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగంపల్లి పంచాయతీ వద్దనున్న సీసీ కెమెరా -
హద్దురాళ్లు తొలగించిన గ్రామస్తులు
మెట్‌పల్లిరూరల్: అధికారులు సూచించిన జిల్లా సరిహద్దు భూమిలో అక్రమంగా నిజామాబాద్ జిల్లా హసకోత్తూర్ గ్రామస్తులు పాతిన హద్దురాళ్లను మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామస్తులు బుధవారం తొలగించారు. అధికారులు మండల, డివిజన్, జిల్లాస్థాయి భూసర్వే చేసి.. సరిహద్దు నిర్ణయిస్తూ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర భూరికార్డులు సర్వే కార్యాలయం నుంచి తీర్మానం పత్రాన్ని ఆయా గ్రామ పంచాయతీలకు పంపించారు.కాని ఇటీవల హసకొత్తూర్ గ్రామస్తులు మెట్లచిట్టాపూర్ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా హద్దురాళ్లను పాతారు. సుమారు 75 ఎకరాల మేరకు చొచ్చుకు వచ్చారని ఆరోపిస్తూ రాళ్లను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగిరెడ్డి రాజేందర్‌రెడ్డి, మెట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ బిక్యానాయక్, నాయకులు అంజిరెడ్డి, భూమ య్య, శ్రీనివాస్, భీమయ్య, రాములు, లింగం, గంగారెడ్డి, మహిపాల్ పాల్గొన్నారు. విషయం తెలిసిన మెట్పల్లి తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి, ఎస్సై శంకర్రావు తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. -
గల్ఫ్‌లో నిజామాబాద్ యువకుడి ఆత్మహత్య
ఇంల్వాయి(నిజామాబాద్ రూరల్) : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారానికి చెందిన బొద్దుల సాగర్(27) శుక్రవారం రాత్రి మస్కట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సాగర్‌కు రెండేళ్ల కింద వివాహం అయింది. భార్య భార్గవితో పాటు ఏడాది వయసున్న పాప ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం 45 రోజుల కింద రూ. లక్ష అప్పు చేసి మస్కట్‌కు వెళ్లిన సాగర్ జీతం తక్కువ ఉందని తరచూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పేవాడు. క్రమంలో తమకున్న రూ. 5 లక్షల అప్పు గురించి ప్రస్తావించేవాడని, చాలీచాలని జీతంతో అప్పులు ఎలా తీర్చాలో మానసిక ఆందోళతో సాగర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ఇంటికి వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకొవాలని తల్లిదండ్రులు కోరారు. కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కంటతడి పెట్టిన కలెక్టర్ యోగితారాణా
-
11న నిజామాబాద్‌లో తెరసం సాహిత్య సదస్సు
–తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్ సాక్షి, కామారెడ్డి : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ కళాశాలలో గురువారం తెరసం సాహిత్య సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి హాజరవుతారని, వక్తలుగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, సంపాదకులు కె.శ్రీనివాస్ పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరసం బాధ్యులు మోతుకూరి అశోక్‌కుమార్, తగిరంచ నర్సింహారెడ్డి, బి.చలపతి, సీహెచ్ ప్రకాశ్, శేరోజు శ్రీనివాస్, సతీష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను తరిమికొట్టండి
ఆర్మూర్ జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ - దేశంలో దరిద్రానికి ఆ పార్టీయే కారణం - దొంగ కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు - ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు - ఏపీలో చెప్పిన మాటలకు తలూపే టీడీపీ డూడూ బసవన్నలను పట్టించుకోవద్దు - టీఆర్ఎస్ది నిరుపేదల ప్రభుత్వమని వెల్లడి - అన్న కేటీఆర్‌ను ఆశీర్వదించండి: ఎంపీ కవిత సాక్షి, నిజామాబాద్: దేశంలోని దరిద్రానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలని ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) పిలుపునిచ్చారు. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఉండేవారు చెప్పిన మాటలకు.. ఇక్కడ (తెలంగాణలో) తలూపే డూడూ బసవన్నలను పట్టించుకోవద్దని టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో టీఆర్ఎస్ జనహిత ప్రగతి సభ నిర్వహించింది. అందులో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదావరి నీళ్లను బీడు భూములకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ నేతలు దొంగ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లతో కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే అంగీకరించారని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? సుమారు ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఉద్ధరించి ఉంటే ప్రజలు వేరే వారికి అవకాశమిచ్చేవారు కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘మూడేళ్ల పసిగుడ్డులాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. అధికారంలో ఉన్న 50 ఏళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? తెలంగాణ ఏర్పడితే విద్యుత్ సమస్య తలెత్తుందని, రైతుల పరిస్థితి దీనమవుతుందని, మావోయిస్టులు పెరుగుతారని, భూస్వాములు రాజ్యమేలుతారని.. ఇలా ఎన్నో భయాందోళనలను అప్పటి సీఎం కిరణ్ సృష్టించారు. కానీ మా ప్రభుత్వ పనితీరు వాటన్నింటినీ పటాపంచలు చేసింది..’’అని పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించాం తమది నిరుపేదల ప్రభుత్వమని.. సంక్షేమ పథకాల కోసం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. గతంలో లబ్ధిదారులెవరైనా చనిపోతేనే వారి స్థానంలోనే కొత్తవారికి పింఛన్లు ఇచ్చేవారని, కానీ తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తోందన్నారు. నిరుపేదలకిచ్చే బియ్యంలో రాజీ పడకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నూతనంగా ప్రకటించిన ‘అమ్మఒడి’పథకం కింద బాలింతలకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందజేస్తున్నామని.. 13 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లనూ ఇస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సభలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, షకీల్ అహ్మద్, హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు. అన్న కేటీఆర్‌ను ఆశీర్వదించండి: కవిత వరుస ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు చుక్కలు చూపించామని... నిరుపేదల సంక్షేమం కోసం పనిచేసే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఒక్కటే బలంగా ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకూ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. గతేడాది 51 లక్షల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు నమోదైతే.. ఈసారి ఇప్పటికే 75 లక్షలకు మించిందని, అన్ని వర్గాల వారూ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్ వంటి అన్న ఉన్నందుకు తనకు గర్వంగా ఉందని, తన సోదరుడిని ఆశీర్వదించాలని కోరారు. కేబినెట్లో ఆణిముత్యం కేటీఆర్.. రాష్ట్ర మంత్రివర్గంలో కేటీఆర్ ఒక ఆణిముత్యమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కితాబిచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని విధంగా కేసీఆర్ 34 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దారని ఎంపీ డి.శ్రీనివాస్ కొనియాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎంపీ కవిత.. రాష్ట్రానికి వన్నె తెచ్చేవిధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్: జిల్లాలో శనివారం దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో దంపతులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని వర్ని మండం జాకోరాలో శుక్రవారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచపు నాగయ్య(48), సాయవ్వ(40) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయవ్వ అదే గ్రామానికి చెందిన సాయిలుతో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సాయవ్వ ఇంటికి వచ్చిన సాయిలు ఆమెను కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. 20 రోజుల క్రితమే సాయవ్వ కుమారుడి వివాహం జరిగడంతో.. ఇంట్లో కోడలు ఉంది.. నా ఆరోగ్యం బాలేదని ఆమె అతన్ని అడ్డుకుంది. అయినా, వినకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన ఆమె భర్త నాగయ్య, సాయిలును అడ్డుకొని ఇంట్లో నుంచి గెంటేశాడు. అనంతరం దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన సాయిలు గొడ్డలితో ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో సాయవ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
-
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
హైదరాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు. మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా సురేశ్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రైల్వే లైన్ ను ప్రారంభించిన తర్వాత నిజామాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. మంగళ, గురువారాలు మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. ఆ రెండు రోజులు నిజామాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేస్తారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పదమూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
తిరుమల దేవస్థానంలో స్వామివారి కళ్యాణం
బీర్కూర్(నిజామాబాద్): తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పోచారం దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, షిండేలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆ ఊరికి కేసీఆర్ కూతురు కవిత పేరు
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానం మాదిరిగానే ఆయన కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవితపై కూడా ఆమె నియోజవర్గ ప్రజలకు ప్రేమ పొంగిపోతోంది. ఎంతలా అంటే ఆ నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి ఆమె పేరే పెట్టుకునేంత. ఎంపీ కవిత నిజామాబాద్ నుంచి పార్లమెంటు నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాలోని అర్మూర్ బ్లాక్‌లో ఖానాపూర్ అనే గ్రామపంచాయతీ ఉంది. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పనుల కారణంగాఘా గ్రామంలోని 274 కుటుంబాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కవిత అండగా నిలిచారంట. తమ సొంత గ్రామం నుంచి కొన్ని కిలో మీటర్ల దూరంలోని ఓ కొత్త ప్రాంతానికి తామంతా వెళ్లాల్సి వచ్చిందని, అలాంటి సమయంలో తమకు కొత్త స్థలం ఎంపిక గ్రామ నిర్మాణంలో కవిత కృషి చేశారని, ముందస్తు చర్యలు తీసుకున్నారని అక్కడి గ్రామస్తులు చెప్పారు. ‘మేం ఎంపీ కవితను కొద్ది రోజుల కిందట కలిశాం. మా 274కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు కట్టించాలని కోరాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమెపై గౌరవంతో మా ఖానాపూర్ గ్రామానికి ఇక నుంచి కవితాపురంగా మార్చాలని నిర్ణయించుకొని రెండు రోజుల కిందటే తీర్మానం చేశాం’ అని గ్రామ సర్పంచి పెంబర్తి మమత నరేశ్ తెలిపారు. తమ దృష్టిలో ఇక ఖానాపూర్ కవితాపురం అయినట్లేనని అన్నారు. అయితే, దీనిపై ఆర్మూర్ తహశీల్దారు రాజేందర్ స్పందిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఖానాపూర్ గానే ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, సర్పంచ్ మాత్రం తమది కవితాపురమే అని చెబుతున్నారు. ఇప్పటికే అదే పేరిట వారు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది ముమ్మాటికి కేసీఆర్ కుటుంబాన్ని పొగడ్తల్లో ముంచె చర్యలని, రహస్యంగా ఆ కుటుంబ సభ్యులే కావాలని ఇలాంటి చర్యలు కొంతమందితో చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి అనే గ్రామంలో కేసీఆర్‌కు ఆయన మద్దతుదారులు గుడి కూడా నిర్మించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు భారత రత్న కూడా ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతుందట. -
మహారాష్ట్ర దొంగల ముఠా హల్చల్
నిజామబాద్: నిజామబాద్ పట్టణంలో మహారాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. దుండగులు ఆయుధాలతో ఎన్ఆర్ఐ కాలనీలో ఇళ్లలోకి చొరబడ్డారు. భయాందోళనలతో ఇళ్లలోని మహిళలు కేకలు వేయటంతో స్థానికులు అప్రమత్తమై దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో ఓ దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దొంగల ముఠాలో ఎనిమిది మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అరవై ఏళ్ల వెనుకబాటును ఐదేళ్లలో..
నిజామాబాద్: ఆంధ్ర పాలకులు 60 ఏళ్లుగా తెలంగాణని అభివృద్ధికి దూరంగా ఉంచారనీ, అయిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని బినోల, నాళేశ్వర్ గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయనుందని తెలిపారు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారని తెలిపిన కవిత.. ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నామని చెప్పారు. మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంతో పల్లె జనాలతో మమేకమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. -
ఇసుక భోజనం!
► నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర ► నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం ► నిబంధనలు పట్టకుండా నదిలో అడ్డగోలు తవ్వకాలు ► ప్రతినిత్యం వందల కొద్దీ లారీల్లో ఇసుక తరలింపు ► దళారీ అవతారమెత్తిన తెలంగాణ ఎండీసీ ► బోధన్ రెవెన్యూ డివిజన్లో సాగుతున్న దందా ► మాఫియాతో కుమ్మక్కై కళ్లు మూసుకున్న అధికారులు ► తవ్వాల్సింది 2.1 మీటర్లు.. తోడేస్తోంది.. 6-8 మీటర్లు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఇసుక తవ్వకాల్లో రాష్ర్ట సర్కారు తీసుకువచ్చిన సంస్కరణలను సైతం మాఫియా లెక్కచేయడం లేదు! కాంట్రాక్టర్ల ముసుగులో అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతూ సర్కారు కంట్లో ‘ఇసుక’ చల్లుతోంది. నిబంధనలు గాలికొదిలి ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా.. అధికారులు కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో మంజీర నది నుంచి అక్రమంగా తవ్విన ఇసుక నిత్యం వందల కొద్దీ లారీల్లో హైదరాబాద్ సహా కర్ణాటకకు తరలిపోతోంది. ఈ మొత్తం తతంగంలో రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) దళారీ పాత్ర పోషిస్తుండడం గమనార్హం. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి, బోధన్ మండలాల పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని మాచినూరు, గంజిగామ్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినివ్వగా.. ఇసుక మాఫియా తెలంగాణ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు కిమ్మనడం లేదు! అన్ని రీచ్‌ల్లో మాఫియా రంగ ప్రవేశం ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో టీఎస్ఎండీసీని రంగంలోకి దింపింది. మూడు నెలల కిందట జిల్లా ఖనిజాభివృద్ది సంస్థ, భూగర్బ జలవనరుల శాఖ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వే చేసి 8 ఇసుక రీచ్‌లను గుర్తించాయి. కోటగిరి మండలం కారేగావ్, పొతంగల్లతో పాటు బిచ్కుంద, బీర్కూరు, బోధన్ మండలాల్లో మరో ఆరు రీచ్‌లను ఇందులో ప్రతిపాదించారు. మొత్తం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తీయవచ్చని అధికారుల బృందం భావించింది. ఈ మేరకు ఆ క్వారీల కోసం దరఖాస్తు చేసుకున్న పట్టాదారులకు అనుమతులు ఇచ్చారు. టీఎస్ఎండీసీ అధికారుల పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఇసుక తరలించాలని ఆదేశించారు. కోటగిరి, బోధన్, బిచ్కుంద, బీర్కూరు మండలాల్లో క్వారీలను 45 రోజుల కిందట ప్రారంభించారు. ఇందులో బోధన్ మండలం మందర్న, బిచ్కుంద మండలం బరంగేడ్గిలో కొద్దిరోజులకే నిలిచిపోగా.. కోటగరి మండలం కారేగావ్, పొతంగల్, బీర్కూరు, బిచ్కుంద మండలంలోని పుల్కల్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన ఇసుక మాఫియా కుమ్మక్కై నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కుతున్నారు. మంజీర నుంచి యంత్రాల ద్వారా తీస్తూ ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. కొత్త పాలసీకి తూట్లు.. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదు. కారేగామ్, పొతంగల్, బీర్కూరు, పుల్కల్ క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 300 నుంచి 500 లారీల ఇసుక వెళ్తున్నా నిఘా లేదు. వే బిల్లులు, పర్మిట్లు లేకున్నా కర్ణాటకలోని బీదర్, ఔరాద్‌కు రాత్రి పూట కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే అనుమతులు ఒకచోట ఉంటే తవ్వకాలు మరోచోట చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 2.1 మీటర్ల వరకే ఇసుక తీయాల్సి ఉండగా.. 6 నుంచి 8 మీటర్ల దాకా తోడేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయాలన్న నిబంధనలనూ పాటించడం లేదు. రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపి ఇసుక తరలిస్తున్నారు. రాత్రిపూట జేసీబీ యంత్రాలు క్వారీలో ఉండవద్దన్న ఆదేశాలకూ దిక్కులేదు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కారేగాంలో అక్రమ తవ్వకాల అంశం మంత్రి హరీశ్‌రావు దృష్టికి వెళ్లింది. సీరియస్‌గా తీసుకున్న మంత్రి.. అధికారులను మందలించడంతో పాటు ఇసుక తవ్వకాల నిలిపివేతకు ఆదేశించించారు. అక్రమ తవ్వకాల నేపథ్యంలో బిచ్కుంద, కోటగిరి, బీర్కూర్ మండలాల్లో గత అక్టోబర్‌లో ఏడు క్వారీలను సీజ్ చేసిన ప్రభుత్వం.. అక్రమార్కులపై చర్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. -
ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరికి గాయాలు
మకులూరు: నిజామాబాద్ జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని మకులూరు మండలం మాదాపూర్ వద్ద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు నందిపేట నుంచి నిజామాబాద్ వెళ్తుంది. కాగా, మార్గమధ్యలో మాదాపూర్ గ్రామం వద్ద అదుపుతప్పిన బస్సు రోడ్డుపై వెళ్తున్న రవిందర్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కోస్తున్న వరి పనలు తడిసిపోయూరుు. పలు గ్రామాలలో స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. డిచ్పల్లి, బాన్సువాడ, బోధన్, జుక్కల్, సిరికొండ, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. లింగంపేట మండలం ముస్తాపూర్ వద్ద పిడుగు పడి ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులకు భయపడి 59 గొర్రెలు మృతి చెందారుు. గ్రామానికి చెందిన ఎర్ర గంగయ్య, నడిపి సాయిలుకు చెందిన గొర్రెలను కొట్టంలో ఉంచారు. శుక్రవారం వేకువజామున వె ళ్లి చూసే సరికి గొర్రెలు మృతి చెంది ఉన్నాయి. చనిపోరుున గొర్రెల విలువ రూ.3.86 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. -
చెరువుకు జీవకళ
నిజామాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ‘మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ)’ పథకం ఒక పవిత్ర యజ్ఞమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో ధ్వంసమైన మన చెరువులను పునరుద్ధరించుకొనేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం చెరువులోనే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం.. ‘‘కాకతీయ రాజులు 80 వేల గొలుసుకట్టు చెరువులు తవ్వించిండ్రు. తర్వాత వచ్చిన కులీకుతుబ్‌షా, నిజాముల కాలంలోనూ గొలుసు చెరువులకు ప్రాధాన్యం ఇచ్చి 15-16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లిచ్చిండ్రు. ఇప్పుడా పరిస్థితి లేదు. దురదృష్టమేందంటే, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆ పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో చెరువుల విధ్వంసం జరిగింది’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ 60 ఏళ్ల లో మన చెరువుల్లో ఏడడుగుల మేర పూడిక చేరిందని చెప్పారు. పూడికను పంట పొలాలకు తీసుకెళ్లాల్సిన రైతులూ నిర్లక్ష్యం చేయడంతో చెరువులు నిరాదరణకు గురయ్యాయని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ ఆవశ్యంగా భావించి, వాటి వివరాలను ఆఘమేఘాలపై తెప్పించుకొని ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టామని కేసీఆర్ తెలిపారు. ఒక్క ఏడాది వానలు పడితే.. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల పైచిలుకు చెరువుల్లో పూర్తిస్థాయిలో పూడిక తీసే కార్యక్రమం పూర్తయితే... ఒక ఏడాది వర్షాలు పడితే చాలని, మూడేళ్ల వరకు కరువు రాకుండా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘చెరువుల పనులను అప్పగించడంలో పారదర్శకంగా ఉంటాం. గతంలో ఎవరైనా దొంగబిల్లులు పెట్టిన దొంగ కాంట్రాక్టర్లుంటే వారిని బ్లాక్‌లిస్టులో పెడతాం. ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా టెండర్లుంటాయి. ఎంతో పవిత్రంగా భావించిన ఈ యజ్ఞంలో కాంట్రాక్టర్లు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే జైలుకు పంపుతాం..’’ అని సీఎం స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో పాటు పడాలి.. ఉద్యమించి, తెగించి రాష్ట్రాన్ని సాధించుకున్న విధంగానే అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా పాటుపడితే మేలు జరుగుతుందని చంద్రశేఖర్‌రావు సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చెరువుల పునరుద్ధరణ చేపడతానని హామీ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చేందుకు రూ. 40 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 15 వేల కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ‘లబాన్ లంబాడీ (కాగితి లంబాడీ)’ తెగలకు చెందిన వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చుతామని, ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఇచ్చిన హామీలన్నింటినీ తల తెగిపడినా సరే నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. కామారెడ్డిని జిల్లా చేస్తా.. కామారెడ్డిని తప్పనిసరిగా జిల్లాగా మారుస్తానని, తానే వచ్చి పునాది రాయి వేస్తానని సీఎం చెప్పారు. నియోజకవర్గాల విభజన జరిగితే నిజామాబాద్ జిల్లాలో ఆరేడు, కామారెడ్డిలో ఆరేడు నియోజకవర్గాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొందరు నిరుద్యోగులు డీఎస్సీ గురించి ప్రకటన చేయాలని కోరగా... డీఎస్సీ ఉండదని కేసీఆర్ అన్నారు. షబ్బీర్ అలీ చెల్లని నోటు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెల్లని నోటని కేసీఆర్ విమర్శించారు. ‘‘మీకు తెలుసు పోయిన ఎన్నికల్లో ఆ నోటు కామారెడ్డిలో చెల్లలే, ఎల్లారెడ్డిలో చెల్లలే.. ఢిల్లీలో సోనియాగాంధీ ఇంట్లో మాత్రం చెల్లింది. అందుకే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన కూడ ఇప్పుడు సొల్లు ముచ్చట్లు, పిచ్చి మాటలు మాట్లాడుతుండు. మీ (కాంగ్రెస్ ప్రభుత్వ) హయూంలో పింఛన్లు రూ. 200 ఇస్తే.. మా హయూంలో రూ. 1,000 ఇస్తున్నం. కల్యాణలక్ష్మి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 51 వేలు ఇస్తున్నాం. ఇవన్నీ నీకు కనిపిస్త లేవా షబ్బీర్ అలీ.. అభివృద్ధిని ఆకాంక్షిస్తే తమ వంతుగా సహకరించండి. సూచనలు ఇవ్వండి. అంతేగాని సొల్లు పురాణాలు చెబుతూ పిచ్చిగా మాట్లాడకు’’ అని సీఎం మండిపడ్డారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్, జెడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ప్రజా ప్రతినిధులదే.. ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం రాష్ట్రంలో ఉద్యమంలా, పవిత్రయజ్ఞంలా సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పాలు పంచుకోవాలని.. అవసరమైతే చెరువుల వద్దే టెంట్లు వేసుకొని, అక్కడే భోజనాలు చేసి పడుకోవాలని కేసీఆర్ సూచించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయం గా పూడికతీత పనులను పర్యవేక్షించాలని... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలెవరూ హైదరాబాద్‌లో కనపడవద్దని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా వచ్చే ఏడాదికల్లా పాత చెరువులన్నీ నీళ్లతో కళకళలాడాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుగట్టుపై ఈతచెట్లను నాటితే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ చెట్లు ఎదిగితే మంచి ఈతకల్లు వచ్చి మందు కల్లు బాధ కూడా పోతుందని వ్యాఖ్యానించారు. చరిత్రపుటల్లో నిలుస్తుంది: హరీశ్‌రావు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేపట్టిన మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞంలో నీరడి (చెరువుల నుంచి కాలువలు, పొలాలకు నీటి విడుదల చేసే ఉద్యోగి)లా ఉంటానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల పొలాలకు నీరందించేందుకు నీరడిలు ఎలా పనిచేస్తారో.. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ పంట పొలాలకు తరలించే పవిత్ర కార్యక్రమానికి తాను అలాగే పనిచేస్తానని చెప్పారు. ‘మిషన్ కాకతీయ’ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘చెరువు మన తల్లిలాంటిదని, ఇలాంటి చెరువులను పునరుద్ధరించాలని కాపాడాలని భావించిన కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టారు. ఈ పవిత్ర యజ్ఞం చరిత్ర పుటల్లో నిలిచి పోతుంది. దీనిద్వారా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తున్నారు. నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు చెరువుల వద్ద నీరడిగా కాపలా కాస్తాను.. రాష్ట్రంలో 46,447 చెరువులుంటే మొదటి దశలో 9,573 చెరువుల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నాం. 2,210 చెరువులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు కేసీఆర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
బంద్ కు పిలుపునిచ్చిన న్యాయవాదులు
నిజామాబాద్: తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు బంద్ కు పిలుపునిచ్చారు. గత పదిరోజులుగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా పిబ్రవరి 21 న బంద్‌కు పిలుపునిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతును తెలుపాలని కోరారు. కాగా హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు చేస్తున్న అమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. -
ఇన్సూరెన్స్ ’కిల్లింగ్స్’