
ఇంల్‌వాయి(నిజామాబాద్ రూరల్) : నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారానికి చెందిన బొద్దుల సాగర్(27) శుక్రవారం రాత్రి మస్కట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సాగర్‌కు రెండేళ్ల కింద వివాహం అయింది. భార్య భార్గవితో పాటు ఏడాది వయసున్న పాప ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం 45 రోజుల కింద రూ. లక్ష అప్పు చేసి మస్కట్‌కు వెళ్లిన సాగర్ జీతం తక్కువ ఉందని తరచూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పేవాడు.
క్రమంలో తమకున్న రూ. 5 లక్షల అప్పు గురించి ప్రస్తావించేవాడని, చాలీచాలని జీతంతో అప్పులు ఎలా తీర్చాలో మానసిక ఆందోళతో సాగర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ఇంటికి వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకొవాలని తల్లిదండ్రులు కోరారు. కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment