
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న సమీక్షా సమావేశం వద్ద మంగళవారం కలకలం రేగింది. రాజీవ్ గాందీ ఆడిటోరియంలో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో రాజేశ్వర్ అనే గల్ఫ్ బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
డబ్బులు తీసుకుని ఏజెంట్ మోసం చేశాడని తనకు న్యాయం చేయాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితుడు రాజేశ్వర్ స్వస్థలం ముప్కాల్ మండలం కొత్తపల్లి. బాధితుడికి తప్పకుండా న్యాయం చేస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment