yong man
-
హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్ సెహగల్ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్‌విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్‌లో అశ్లీల ఫొటో
హోసూరు(కర్ణాటక): తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతికి వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆమెఫొటోను అశ్లీలంగా చిత్రించి వాట్సప్‌లో ఉంచిన యువకున్ని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు తాలూకా బి. ముదుగానపల్లి గ్రామానికి చెందిన నరేష్కుమార్(25) హోసూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంటికి వెళ్లి పిల్లను అడిగారు. తల్లిదండ్రులు నిరాకరించి మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ద్వేషం పెంచుకున్న నరేష్కుమార్ ఆ యువతి ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి వాట్సప్ ద్వారా పంపాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నరేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇవీ చదవండి భర్తను చంపి.. బాత్రూంలో పాతిపెట్టి 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
వీడిన మిస్టరీ: శ్యామ్‌ది హత్యే!
అల్లిపురం (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం: యువకుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడిపోయింది. యువకుడిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. మహారాణిపేట పరిధి, తాడివీధికి చెందిన టేకుమూడి శ్యామ్ (21) గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 30వ వార్డు కార్పొరేటర్ అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన మహారాణిపేట సీఐ జి. సోమశేఖర్ యువకుడిది హత్యగా నిర్థారణకు వచ్చారు. యువకుడిని అతని తల్లి సుగుణ, సోదరి లక్ష్మీదుర్గా అలియాస్ ఫాతిమాతో పాటు ఆమె భర్త షేక్ పీర్‌సాహెబ్, సుగుణ మరో చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్ సహకారంతో ఈ హత్య చేసినట్లు గుర్తించారు. గురువారం నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద కుమార్తె లక్ష్మీదుర్గా అలియాస్ ఫాతిమా ఆరోగ్యం బాగాలేదని వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. మూడేళ్లుగా కుమారుడు శ్యామ్‌కుమార్ బైక్ కొనమని వేధించడంతో నాలుగు నెలల క్రితం ఫైనాన్స్‌పై బైక్ కొని ఇచ్చింది. వ్యసనాలకు అలవాటు పడ్డ శ్యామ్ నెల రోజుల క్రితం బైక్‌ను తాకట్టు పెట్టాడు. ఆ బైక్‌ను విడిపించి ఇమ్మని ప్రతిరోజు గొడవ పెడుతున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్యామ్ తల్లి సుగుణను, సోదరి ఫాతిమాను విపరీతంగా వేధించాడు. దీంతో సుగుణ ఆమె ఇద్దరి అల్లుళ్లతో ముందుగానే ప్లాన్ చేసుకోవటంతో పెద్దల్లుడు షేక్ పీర్ సాహెబ్, చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్ ఇంటికి చేరుకున్నారు. శ్యామ్ నిద్రపోయిన తరువాత అల్లుళ్లు ఇద్దరు ఒకరు శ్యామ్ కాళ్లపై నిలుచుండగా, ఒకరు చేతులు గట్టిగా పట్టుకున్నారు. కూతురు ఫాతిమా తలగడ ముఖంపై వేసి నొక్కి పట్టుకుంది. సుగుణ ట్రాక్ నాడా తాడు తీసుకుని మెడచుట్టూ వేసి బిగించడంతో శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు కారు హారన్ మోగించాడని... ఎంత పని చేశారంటే.. -
పెట్రోల్ పోసి ఒంటికి నిప్పు, ప్రేమ వ్యవహారమే కారణమా?
మద్దిపాడు(ప్రకాశం జిల్లా): ఓ యువకుడిపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించారు. మద్దిపాడు మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన యరజాని అంకమ్మరావు(20) అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల వరకు కాలనీ సమీపంలో స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్లాడు. అతడి వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి మేస్త్రీ పిలుస్తున్నాడంటూ కాలనీ బయటకు తీసుకువెళ్లారు. కాలనీ సమీపంలోని చప్టా వద్ద అతనితో మద్యం తాపించి, ఆ తర్వాత ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి అంకమ్మరావు కేకలు వేస్తూ చర్చి సమీపంలో పడిపోగా అతని సోదరుడు వచ్చి తన టీషర్ట్ విప్పి మంటలు ఆర్పివేశాడు. స్థానికులు స్పందించి 108లో రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రిమ్స్‌కు చేర్చారు. తనపై వెల్లంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించాడని, అతనితోపాటు మరో ఇద్దరు ఉన్నారని బాధిత యువకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, మద్దిపాడు ఎస్సై నాగరాజు తెలిపారు. బాలికతో ప్రేమ వ్యవహారమే కారణం? ఓ బాలికతో కలిసి ఉన్న ఫొటోలను అంకమ్మరావు తన స్నేహితులకు ఆదివారం రాత్రి వాట్సప్‌లో పంపినట్లు సమాచారం. ఆ బాలిక తనకు దక్కదనే ఆలోచనతో అంకమ్మరావు ఈ పని చేసి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కాగా అంకమ్మరావు శరీరం 70 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. చదవండి: యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
యువకుడి సెల్ఫీ వీడియో: నా చావుకు కారణమిదే..
సాక్షి, మెదక్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. అన్యాయంగా కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మనస్తాపం చెందిన అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేశాడు. గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై జనవరి 6న అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తూ గత అర్థరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి -
యువకుడి సెల్ఫీ వీడియో: నా చావుకు కారణమిదే..
-
నాయనా నన్నూ నీతో తీసుకుపోరా..
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో శుక్రవారం సరదాగా ఈతకు వెళ్లిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. అగ్ని మాపక సిబ్బంది కథనం మేరకు.. కొండామారిపల్లెకు చెందిన బైలు గంగిరెడ్డి, సుజాతమ్మ దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ (21) అంగళ్లులోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చువుతున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు గణజగదీశ్వర్(21), సుధాకర్ కుమారుడు కిరణ్ సాయి (21)తో కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని బసినికొండ బైపాసు రోడ్డులో ఉన్న స్వామి చెరువుకు ఈతకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో మణికంఠ లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి తిరిగి గట్టుకు రాలేకపోయాడు. స్నేహితులు చూస్తుండగానే మునిగిపోయాడు. వారు గ్రామస్తులకు సమాచారం అందించి చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి కరుణాకర్ తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకుని చీకటి పడేవరకూ గాలించారు. శనివారం ఉదయం మళ్లీ గాలిస్తామని తెలిపారు. సంఘటనా స్థలం వద్దకు రూరల్ ఏఎస్ఐ మహదేవనాయక్ తదితరులు చేరుకుని ఘటనపై మణికంఠ స్నేహితులను ఆరాతీశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నాయనా నన్నూ నీతో పాటే తీసుకుపోరా.. నాయనా..! నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. బిడ్డ బాగా చదువుకుంటున్నాడు. ఇంజినీర్ అయి బాగా చూసుకుంటాడని అనుకుంటే మాకంటే ముందే ఆ దేవుడు నిన్ను తీసుకుపాయనే.. ఇక మేమెట్ల బతకాలి తండ్రీ.. నీ చదువుకోసం మీ నాన్న సౌదీలో ఉంటూ నాలుగేళ్లుగా కష్టాలు భరించాడే.. నాలుగు రోజుల క్రితం సౌదీ నుంచి ఇంటికి వస్తుంటే విమానాశ్రయం నుంచే నేరుగా తిరుపతి క్వారంటైన్‌కు తీసుకుపోయారే.. నీ తండ్రికి చివరి చూపు కూడా లేకుండా చేశావా నాయనా.. నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. అంటూ విద్యార్థి తల్లి సుజాతమ్మ చేస్తున్న రోదనలు చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
అందంగా లేనని అందని లోకాలకు...
కవిటి: ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నాయని మనస్తాపం చెంది, కొద్దికాలంగా ఆత్మన్యూనతతో బాధ పడుతున్న ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. మాణిక్యపురానికి చెందిన సునీల్ నాయక్ (20) ఆదివారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులకు మృతుడి తల్లి పద్మానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చిన్నప్పటి నుంచీ ముఖంపై మచ్చలున్నా పట్టించుకోలేదు గానీ కాలేజీ చదువు ప్రారంభమయ్యాక సునీల్ నాయక్ చిన్నతనంగా భావించేవాడు. అనునిత్యం ముఖంపై గుడ్డ కప్పుకునే తిరిగేవాడు. ఎందరో వైద్యుల వద్దకు వెళ్లి మందులు వాడినా ఫలి తం లేకపోయింది. తననందరూ చులకనగా చూ స్తారని తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యేవాడు. చివరకు ఆదివారం ఇంట్లో ఫ్యానుకు ఉరిపోసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. పున్నామ నర కం నుంచి తప్పిస్తాడనుకున్న కన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో పేద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.కవిటి ఏఎస్ ఐ డీవీ భాస్కరరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారని కవిటి ఎస్ఐ కె.వాసూనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఈ మృతదేహానికి కరోనా వైరస్ పరీక్ష చేయాలని, అంతవరకు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయవద్దని స్థానిక వైద్యసిబ్బందికి సూచించారు. సోమవారం కరోనా పరీక్ష జరిపిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నిర్మల్‌రూరల్ : నిర్మల్‌రూరల్ మండలంలోని చిట్యాల్ బస్టాండ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై రాజు తెలిపారు. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ తండాకు చెందిన జాదవ్ రాజేశ్ (25) గ్రామంలో మేస్త్రీ పని చేస్తుండే వాడు. గురువారం నిర్మల్ నుంచి తన గ్రామానికి సిమెంట్ బస్తా బైక్‌పై తీసుకువెళ్తుండగా చిట్యాల్ వద్ద ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో రాజేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పిట్స్ బాధతో యువకుడి ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ) : కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన యాదరవేణి మల్లేశం(33) కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. రెండేళ్ల నుంచి పిట్స్‌తో బాధ పడుతున్నాడు. దీంతో మంగళవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదుతో ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతకు అండగా కాంగ్రెస్
యాదగిరిగుట్ట : యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏఐసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. యువనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, నిరుద్యోగ భృతిని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి మాధవిరాంరెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యాక్షుడు చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పాలసంఘం చైర్మన్ భాస్కర్‌రెడ్డి, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ కానుగు బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, ప్రభాకర్ తదితరులున్నారు. -
యువతతోనే మెరుగైన సమాజం
నెన్నెల : యువతతోనే మెరుగైన సమాజం, మార్పు సాధ్యమవుతుందని ఏసీపీ బాలుజాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్, నెన్నెల పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, నాటుసారా మహమ్మారి, అసాంఘిక కార్యకలాపాలపై కళా బృందంతో కళ్లకు కట్టినట్లు పాటలు, నృత్యం రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేశం కోసం తనవంతు కృషి చేయాలన్నారు. హైటెక్ యుగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూ ఆరోగ్యంతో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. నాటుసారాతో జీవితాలు బజారున పడుతున్నాయన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి భార్య, పిల్లలకు చిన్న తనంలోనే దూరమవుతున్నా రన్నారు. ఏ సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై చందర్, రామగుండం కమిషనరేట్ కళాబృందం సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
గల్ఫ్‌లో నిజామాబాద్ యువకుడి ఆత్మహత్య
ఇంల్వాయి(నిజామాబాద్ రూరల్) : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారానికి చెందిన బొద్దుల సాగర్(27) శుక్రవారం రాత్రి మస్కట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సాగర్‌కు రెండేళ్ల కింద వివాహం అయింది. భార్య భార్గవితో పాటు ఏడాది వయసున్న పాప ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం 45 రోజుల కింద రూ. లక్ష అప్పు చేసి మస్కట్‌కు వెళ్లిన సాగర్ జీతం తక్కువ ఉందని తరచూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పేవాడు. క్రమంలో తమకున్న రూ. 5 లక్షల అప్పు గురించి ప్రస్తావించేవాడని, చాలీచాలని జీతంతో అప్పులు ఎలా తీర్చాలో మానసిక ఆందోళతో సాగర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ఇంటికి వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకొవాలని తల్లిదండ్రులు కోరారు. కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగినంటూ వృద్ధురాలికి టోపీ
-
పాముకాటుతో యువకుడి మృతి
ఇల్లంతకుంట :మండలంలోని కందికట్కూర్‌కు చెందిన జంగిటి సంపత్(30) పాముకాటుతో మంగళవారం మృతిచెందాడు. వేకువజామున గేదె పాలు పితికి పాలకేంద్రంలో పోసివచ్చాడు. తర్వాత బహిర్భూమికి వెళ్లొచ్చి ఇంట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు తెల్లవారాక చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. నోట్లో నుంచి నురుసులు రావడంతో పాముకాటుతో మృతిచెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. సంపత్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.