
సాక్షి, మెదక్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. అన్యాయంగా కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మనస్తాపం చెందిన అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేశాడు.
గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై జనవరి 6న అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తూ గత అర్థరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి:
తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు
భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి