సాక్షి, విజయవాడ: అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. పురుగుల మందు తాగారు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య
ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment