railway employee
-
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్‌శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్‌కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్‌లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్‌శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్‌చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్‌కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్‌ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్‌ఫర్‌గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
నెలకు లక్ష జీతం.. రమ్మీకి బానిసై, కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో..
సాక్షి, చెన్నై: తిరువాన్మీయూరు రైల్వే స్టేషన్లో సంచలనం రేపిన దోపిడీ కథ ముగిసింది. భార్యతో కలిసి రైల్వే ఉద్యోగి ఆడిన నాటకం గుట్టు రట్టయ్యింది. ఇంటి దొంగను అరెస్టు చేసిన పోలీసుల కటకటాల్లోకి నెట్టారు. చెన్నై తిరువాన్మీయూరు ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తనను కట్టి పడేసి రూ. లక్షా 32 వేలు నగదు అపహరించుకెళ్లినట్టు రైల్వే టికెట్ క్లర్ టిక్కారామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగడం కష్టతరంగా మారింది. అయితే, రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దోపిడీ జరిగిన సమయంలో ఓ మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగమేఘాల మీద వెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆమె టిక్కారామ్ భార్య సరస్వతిగా తేలింది. దీంతో ఇంటి దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు జీతం తీసుకుంటున్న టిక్కారామ్ ఆన్లైన్ రమ్మికి బానిస అయ్యాడు. దీంతో లక్షల చొప్పున అప్పుల పాలయ్యాడు. ఈ నెల కుటుంబ పరిస్థితి భారంగా మారడం, స్టేషన్లో సీసీ కెమెరాలు లేవన్న విషయాన్ని పరిగణించి భార్యతో కలిసి నాటకం రచించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దంపతుల్ని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాలకు సమానమైన బోనస్ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద ₹1,984.73 కోట్లు ఆర్ధిక భారం పడనుంది. సుమారు 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. "అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ(ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పిఎల్‌బి)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు బోనస్ కింద 78 రోజులకు చెల్లించాల్సిన మొత్తం ₹17,951 అని కేంద్రం పేర్కొంది. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పిఎల్‌బి చెల్లించడానికి సూచించిన వేతన లెక్కింపు పరిమితి ₹7,000/నెలకు అని తెలిపింది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) "అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు పిఎల్‌బి చెల్లింపు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా సెలవులకు ముందే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు" కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) Union Cabinet approves Productivity Linked Bonus equivalent to 78 days' wage to eligible non-gazetted Railway employees (excluding RPF/RPSF personnel) for FY20-21. About 11.56 lakh non-gazetted Railway employees are likely to benefit from the decision:Union Minister Anurag Thakur pic.twitter.com/cv7IDkulZb — ANI (@ANI) October 6, 2021 -
సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు
లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్ ఫేస్‌మాస్క్ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డగించాడు. మాస్క్ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్‌ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్‌ఫైర్ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో In #Bareilly a railway employee was allegedly shot by bank guard at Junction road branch of Bank of Baroda. Reports claimed that victim was shot following an argument over not wearing mask. Victim taken to district hospital. pic.twitter.com/SzuHRpGZv5 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2021 -
రైల్వే ఉద్యోగి దారుణహత్య
మల్కాజిగిరి: రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...న్యూ సంతోష్‌రెడ్డినగర్ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్‌కుమార్(30) రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లక్రితం వైజాగ్‌కు చెందిన భవ్యతో వివాహం జరగ్గా, పీవీఎన్‌కాలనీలో నివాసముంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి మహేశ్వరికి కరోనా సోకింది. భార్యను పుట్టింటికి పంపి తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించాడు. రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఉదయం సంతోష్‌రెడ్డినగర్‌లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం ఉదయం వైజాగ్‌లో ఉంటున్న సోదరి ప్రేమలతతో విజయ్‌కుమార్ మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ప్రేమలత పీవీఎన్‌కాలనీలో ఉంటున్న మేనత్త శారదకు ఫోన్ చేసి తమ్ముడు ఏడుస్తున్నాడని, ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్రూమ్లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్‌కుమార్ చేసి కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంలాంటి కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇది తెలిసినవారే చేసిన పనిగా అనుమానిస్తున్నారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
రేపు కూతురు బర్త్‌డే.. మూగ హృదయం ఆగిపోయింది..
సాక్షి, రామగుండం: అతడు పుట్టు మూగ.. నాలుగేళ్ల రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్ ఓవర్‌హాలింగ్‌షెడ్డులో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. మూడేళ్ల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి కూతురు ఉంది. కరోనా నేపథ్యంలో భార్య, కూతురును పుట్టింటికి పంపించి విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తి మూగ అయినా అందరితో కలిసి ఉండే అతడి హృదయం గురువారం విధినిర్వహణలోనే ఆగింది. వరంగల్ రూరల్ జిల్లా మడికొండకు చెందిన బండి రంజిత్‌కుమార్(35) గురువారం విధుల్లో ఉండగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్‌లోని ప్రైవేటుఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రేపు కూతురు తొలి జన్మదిన వేడుకలు.. రంజిత్ కూతురు మొదటి పుట్టిన రోజు శనివారం ఉంది. కరోనా దృష్ట్యా పుట్టింటికి వెళ్లిన భార్య, కూతురును శుక్రవారం రామగుండం రావాలని ఫోన్‌చేసి చెప్పాడు. ఇంతలోనే గుండెపోటుతో మృతిచెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. -
రైల్వే ఉద్యోగి ఘాతుకం.. భార్యకు కరోనా అని తెలిసి తల నరికి
పట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కరోనా అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లాల్ భార్యకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఆగ్రహానికి గురైన లాల్ కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత లాల్ కూడా అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను నడిరోడ్డులో కత్తితో 25 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య -
సూపర్‌హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రాణాలకు తెగించి మరీ పట్టాలపై పడి పోయిన బాలుడిన కాపడిన రైల్వే పాయింట్‌మ్యాన్ మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఆ బాలుడి చదువు, సంక్షేమం నిమిత్తం కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు హ్యాట్యాఫ్ అంటున్నారు. మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్ భయ్యా అంటూ షెల్కేకు ఫిదా అవుతున్నారు. (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్) I'll give half of the amount, given to me as token of appreciation, for that child's welfare & education. I came to know that his family isn't financially strong. So I decided this: Mayur Shelkhe, pointsman who saved a child who fell on tracks at Vangani railway station on 17.04 pic.twitter.com/IWdacY0DFf — ANI (@ANI) April 22, 2021 pic.twitter.com/C62xQVXnCy — thejadooguy (@JadooShah) April 22, 2021 In these dark days for humanity, ray of hope 🙏 — Bharateeya (@AntiCaste_Hindu) April 22, 2021 -
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
-
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది. సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో) కాగా ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్లో మయూర్ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
ముంబై: తన ప్రాణాలను సైతం చేయకుండా చిన్నారిని కాపాడిన రియల్ హీరో మయూర్ షెల్కేను అతని తోటి సిబ్బంది, నెటిజన్లే గాక ప్రముఖుల కూడా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని సెంట్రల్ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో షెల్కేకు ఇరు వైపుల అధికారులు, తోటి సిబ్బంది నిలబడి చప్పట్లతో అతనికి గ్రాండ్ వెల్కం పలికారు. అనంతరం షెల్కే ధైర్య సాహసాన్ని అభినందిస్తూ 50 వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంబై డివిజనల్ మేనేజర్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇదంతా చిత్రీకరించిన వీడియోను రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ లో పంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కోలీవుడ్ నటుడు మాధవన్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఉద్యోగి చేసిన సాహసాన్ని అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. మయూర్ షెల్కే ధైర్యం ఓ ప్రాణాన్ని కాపాడింది వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద తల్లితో కలిసి నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేసింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలాడు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి ఫ్లాట్ ఫారం మీదకు తరలించాడు అంతే వేగంగా తను కూడా పట్టాల పైనుంచి తప్పుకున్నాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. షెల్కే సాహసంతో క్షణాల్లో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ సాహస వీడియోను రైల్వే శాఖ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ( చదవండి: పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో ) Shri Mayur Shelkhe the ‘real life hero’ appreciated by staff & DRM of Mumbai Division of Central Railway. 💐💐 pic.twitter.com/8fCSR6S4Vy — Ministry of Railways (@RailMinIndia) April 19, 2021 -
బాలుడిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
-
పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో
సాక్షి, ముంబై: ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. అయితే శరవేంగా అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో రెప్పపాటు కాలంలో ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన వైనం పలువురి ప్రశంసంలందుకుంటోంది. సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 -
పట్టాలపై చిన్నారి..సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి
-
చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా!
సాక్షి, విశాఖపట్నం: చీటీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజల్ని నమ్మించి సుమారు రెండు కోట్ల రూపాయలు టోకరా వేశాడు. దీంతో 140 కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతులు చంద్రానగర్‌లో నివాసముంటున్నారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికులు, బంధువులు అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. దీంతో రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న అప్పలరాజు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు. ఇటీవల భార్య లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం నిలదీయగా అప్పలరాజు రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయినట్టు తెలిసింది. అతని వద్ద చీటీ వేసినవారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. -
వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
-
సెల్ఫీ వీడియో.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. పురుగుల మందు తాగారు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. -
4 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఒక్కరోజు వ్యవధిలోనే 6,977 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో 154 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,38,845కు, మరణాలు 4,021కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 77,103. కరోనా బారినపడిన వారిలో 57,720 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.57 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో మహారాష్ట్ర వణికిపోతోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల దేశంలో 4,021 మంది మరణించగా, ఇందులో 1,635 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. రైల్ భవన్లో మరో ఉద్యోగికి కరోనా రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం రైల్ భవన్లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా సోకింది. ఇదే భవనంలో కేవలం రెండు వారాల లోపే ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. మే 19వ తేదీ దాకా విధులకు హాజరైన నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. అతడితో కాంటాక్టు అయిన తొమ్మిది మందిని అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఒక అధికారి నుంచి మరో అధికారి వద్దకు ఫైళ్లను తీసుకెళ్లడమే ఈ నాలుగో తరగతి ఉద్యోగి పని. ఈ ఫైళ్లు రైల్వే బోర్డు చైర్మన్‌తోపాటు రైల్వేశాఖ మంత్రిదాకా వెళ్తుంటాయి. దీంతో అతడిద్వారా ఇంకెవరికైనా కరోనా సోకిందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడంతో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయడానికి రైల్ భవన్‌ను మే 14, 15వ తేదీల్లో మూసివేశారు. ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా రావడంతో రైల్ భవన్‌ను మే 26, 27 తేదీల్లో మూసివేయాలని నిర్ణయించారు. -
కరోనా పాజిటివ్ రావడంతో ఆత్మహత్య
లక్నో : కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లోనే ఉన్న ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా నివాసి అయిన రైల్వే ఉగ్యోగి (55) ఎఫ్హెచ్ మెడికల్ కాలేజీలో క్వారంటైన్లో ఉంచారు. ఇదే కాలనీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కాలనీ లోని మిగితా ఉద్యోగులను కూడా క్వారంటైన్లో ఉంచారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో సదరు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మెడికల్ కాలేజీలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అందిస్తామని తుండ్లా ఎస్సై కెపి సింగ్ టోమర్ తెలిపారు. -
రైల్వే ఉద్యోగి రాహుల్ బలవన్మరణం
నేరేడ్మెట్: రైల్వే ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన మేరకు..ఓల్డ్ నేరేడ్మెట్కు చెందిన ఎస్. రాహుల్‌యాదవ్(27) లాలాగూడలోని రైల్వే వర్క్‌షాపులో పని చేస్తున్నాడు. ఈనెల 6న భార్యతో కలిసి రాహుల్ చెంగిచెర్లలోని అత్తారింటికి వెళ్లి, శనివారం వరకు అక్కేడే ఉన్నాడు. ఆదివారం రాత్రి ఓల్డ్‌నేరేడ్‌మెట్‌లోని సొంతింటికి వచ్చాడు. రాత్రి భార్య ఫోన్ చేసినా స్పందించలేదు. ఆమె వెంటనే ఓల్డ్‌నేరేడ్‌మెట్‌లో ఉంటున్న రాహుల్ బాబాయ్ కిషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వచ్చి పిలిచినా స్పందించకపోవడంతో స్థానికులతో కలిసి తలుపులు పగులకొట్టి చూడగా గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్(26) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అయిన త్రినాంకుర్ రైల్వే కార్ షెడ్లో పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు... కోల్‌కతాకు చెందిన త్రినాంకుర్‌కు చిన్న నాటి నుంచే బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి కనబరిచేవాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఇతడు రాష్ట్ర డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగం పొందిన త్రినాంకుర్ ప్రస్తుతం ఈస్ట్రన్ రైల్వేస్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రైల్వే కార్ షెడ్లో విధులు నిర్వర్తిసున్న సమయంలో హై టెన్షన్ కరెంటు తీగ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని బీ ఆర్ సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గొప్ప ఆటగాడిని కోల్పోయాం ‘తన ప్రతిభతో రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన నాగ్ ఇక లేడన్న విషయం చాలా బాధకరంగా ఉంది. అతడి మరణం బెంగాల్ బ్యాడ్మింటన్‌కు, రాష్ట్రానికి తీరని లోటు. గొప్ప క్రీడాకరుడిని కోల్పోయాం’ అని పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారి బిశ్వాస్ సంతాపం వ్యక్తం చేశారు.