పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు! | Thieves robbed from locked house in adilabad district | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!

Published Wed, Apr 20 2016 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!

పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!

ఆదిలాబాద్ క్రైం: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇదే సరైన సమయం అనుకున్నారేమో.. అదనుచూసి ఇంట్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేక్వార్టర్స్‌లో ఉండే రైల్వే ఉద్యోగి రఘునాథ్ కూతురు వివాహం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉంచిన రూ.80వేల నగదుతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివాహ వేడుక అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement