
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్‌సఫర్‌ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్‌కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.
అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు
మహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్‌బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.
అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment