ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. భారత్‌కు రావడమే ఆమెకు శాపమైంది | British Woman Delhi Hotel Vasant Kunj Instagram Friend Full Details | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. భారత్‌కు రావడమే ఆమెకు శాపమైంది

Published Thu, Mar 13 2025 12:03 PM | Last Updated on Thu, Mar 13 2025 12:48 PM

British Woman Delhi Hotel Vasant Kunj Instagram Friend Full Details

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఢిల్లీకి వచ్చిన విదేశీయురాలిపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం..భారత్‌కు చెందిన కైలాష్‌తో  ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో, ఆమెను భారత్‌కు రావాల్సి కైలాష్‌ కోరారు. దీంతో, ఆమె.. మహారాష్ట్ర, గోవాలో పర్యటించేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ పర్యటనలో ఉండగా ఆమె.. కైలాష్‌కు ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని కోరింది. అయితే, తాను అంత దూరం ప్రయాణించలేనని కైలాష్‌.. ఆమెకు చెప్పాడు. ఢిల్లీకి రావాలని ఆమెకు కైలాష్‌ సూచించారు.

ఈ క్రమంలో బాధితురాలు మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. అనంతరం, మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆ తర్వాత ఆమె.. కైలాష్‌కు ఫోన్ చేసి తాను హోటల్‌లో ఉన్నట్టు తెలిపింది. దీంతో, కైలాష్‌ తన స్నేహితుడు వసీంతో కలిసి హోటల్‌కు వెళ్లారు. రాత్రి వారిద్దరూ అక్కడే బస చేశారు. అదే అదునుగా భావించిన వసీం.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయమే బాధితురాలు.. మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కైలాష్‌, వసీంను అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. అలాగే, మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఘటనపై బ్రిటిష్ హైకమిషన్‌కు సమాచారం అందించారు. ఇక, కైలాష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనకు ఇంగ్లీష్ మాట్లాడటం కష్టమని, తనతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఉపయోగించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement