![2 foreign nationals hide cocaine worth Rs 26 crore in stomach](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/coco.jpg.webp?itok=J8OE1JNE)
ఇద్దరు విదేశీయుల అరెస్ట్
డ్రగ్ నెట్‌వర్క్ ప్రమేయంపై దర్యాప్తు
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు.
జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా.
అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment