
గాంధీనగర్: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కచ్ తీరంలో సుమారు రూ. 130 కోట్ల విలువైన 13 ప్యాకెట్ల కొకైన్‌ను గురువారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో 13 ప్యాకెట్ల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ పేర్కొన్నారు. స్మగ్లర్లు కొకైన్ పట్టుబడకుండా సముద్ర తీరంలో ప్యాకెట్లను దాచిపెట్టినట్లు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment