cocaine
-
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం..
న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రేస్‌వెల్‌పై ఒక నెల నిషేధం పడింది. అతను మాదకద్రవ్యాలు తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ (ఎన్ఎస్ఐసీ) వేటు వేసింది. ఈ ఏడాది అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ జింబాబ్వేతో తన తొలి మ్యాచ్‌లో 6/40 బౌలింగ్ గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరి 13న కివీస్ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన పోరులో సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టుకు ఆడిన బ్రేస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.మ్యాచ్ అనంతరం అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో ఎన్ఎస్ఐసీ అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తర్వాత ఒక నెలకు పరిమితం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి నెలరోజులపాటు అతనిపై నిషేధం విధించారు.34 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడి 74 వికెట్లు, 21 వన్డేలు ఆడి 26 వికెట్లు, 20 టి20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ‘తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో బాధ్యతతో ప్రవర్తించాలి. ఇలాంటి నిషేధిత ఉ్రత్పేరకాలతో న్యూజిలాండ్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ప్రతిష్టను మసకబార్చవద్దు’ అని ఎన్‌జడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ తెలిపారు.చదవండి: కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ -
గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కచ్ తీరంలో సుమారు రూ. 130 కోట్ల విలువైన 13 ప్యాకెట్ల కొకైన్‌ను గురువారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 13 ప్యాకెట్ల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ పేర్కొన్నారు. స్మగ్లర్లు కొకైన్ పట్టుబడకుండా సముద్ర తీరంలో ప్యాకెట్లను దాచిపెట్టినట్లు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చెన్నై విమానాశ్రయంలో రూ.20 కోట్ల కొకైన్ స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): దుబాయ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన కొకైన్, రూ.2 కోట్ల విలువ గల మత్తు మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న విమానంలో భారీగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు చెన్నై జోన్ సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ డైరెక్టర్ అరవిందన్‌కు శుక్రవారం సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.బొలీవియాకు చెందిన ఓ యువతి బ్యాగ్‌లో ఉన్ని దుస్తుల లోపల దూది మధ్య డ్రగ్స్‌ను దాచినట్లు గుర్తించారు. ఆమె నుంచి రూ. 20 కోట్ల విలువైన కిలో 800 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బొలీవియా యువతితోపాటు ముంబైలో నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన మహిళ సహా మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అదేవిధంగా నెదర్లాండ్స్ నుంచి బెంగళూరు, పుదుచ్చేరి చిరునామాలతో రెండు పార్సిళ్లు కస్టమ్స్ విభాగానికి చెందిన పోస్టాఫీసుకు వచ్చాయి. ఆ పార్సిళ్లను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన కిలో 400 గ్రాముల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ యువకులను అరెస్టు చేశారు. -
ఉడ్తా షెహర్! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హష్ ఆయిల్ మొదలుకుని, కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు.. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు సైతం వీటి బారిన పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో దాని యజమాని కుమారుడు సహా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా కావాల్సిన డ్రగ్‌ను ఎంచుకోవడం.. సోషల్ మీడియా యాప్ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం.. బిట్ కాయిన్స్ రూపంలో నగదు చెల్లించడం.. డెడ్ డ్రాప్ లేదా కొరియర్ ద్వారా సరుకు తెప్పించుకోవడం..ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదకద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్‌లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్ పార్టీలు జరిగిపోతున్నాయి. దుమ్ము రేపుతున్న రేవ్ పార్టీలు ఒక్క రాడిసన్ హోటలే కాదు.. రాత్రి అయిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. పచ్చబొట్లలో డ్రగ్ గుట్టు కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాన్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలన్నది సప్లై చేసే వారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్‌ల నిర్వాహకులు ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నట్లు సమాచారం. రేవ్ తీరే వేరు అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదకద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డూ అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్‌లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్‌తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత.. ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ పై ‘పైట్రాన్స్’ఇమేజెస్‌గా పిలిచే ఓ రకమైన ఫొటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తుంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తుంటాయి. ఈ రేవ్ పార్టీ తీరుతెన్నులు, అక్కడకు వచ్చే వారి వస్త్రధారణ ఫలితంగా టీనేజ్లోనే పెళ్లి కాకుండా ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’లు పెరిగిపోతుండటం ఆందోళనకర అంశమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్దిమంది స్నేహితులు కలిసి చేసుకునే రేవ్ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్ రూమ్స్ వినియోగిస్తున్నారు. కొత్త ట్రెండ్.. డ్రగ్ టూర్స్ రాజధానిలో ఇటీవల కాలంలో డ్రగ్ టూర్స్ పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. టాస్‌్కఫోర్స్, ఎస్ఓటీ, హెచ్–న్యూ, టీఎస్–నాబ్ వంటి ప్రత్యేక వింగ్స్ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై నిఘా పెంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలకు, మాదకద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ఖరీదు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ వినియోగదారులు ప్రత్యేక టూర్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో సిటీకి చెందిన అనేక మంది హైక్లాస్ యూత్ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల పైనా గంజాయి పంజా నగరంలో లభిస్తున్న మాదకద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసే వాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి, ప్యాక్ చేసి, వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హష్ ఆయిల్ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చరస్‌ను సరఫరా చేస్తున్నారు. లీటర్ ఖరీదు అత్యంత లాభదాయకంగా రూ.లక్షల్లో ఉండటంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్ ఆయిల్‌తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ కేరాఫ్ విదేశాలు సింథటిక్ డ్రగ్స్ సౌతాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డి్రస్టిబ్యూటర్లు వీటిని దేశ వ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు. రేటు ఖరారైన తర్వాత బైనాన్స్ లేదా వజీరెక్స్ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో సరుకు పంపిస్తున్నారు. కొరియర్లో అయితే తమ అసలు చిరునామా రాయకుండా వస్తువులు, వ్రస్తాల మాదిరిగా ప్యాక్ చేసి లేదా కాగితాల మధ్యలో ఉంచి పంపిస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో ఎంపిక చేసిన ఓ ప్రాంతంలో డ్రగ్ పార్సిల్ ఉంచి ఆ వివరాలను మెసెంజర్ ద్వారా అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. -
రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: మెట్రోనగరాల్లో తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ స్టాన్లీ ఉదోకాఇయూలను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ నాబ్) అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.8 కోట్ల విలువైన ఎనిమిది రకాలైన మాదకద్రవ్యాలు స్వాదీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డీసీపీ ఎం.విజయ్‌కుమార్ చెప్పారు. ఎస్పీ కేసీఎస్ రఘువీర్, ఏసీపీఎస్.మోహన్‌కుమార్, ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తో కలిసి పంజగుట్ట ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బిజినెస్ వీసాపై ముంబై వచ్చి... గోవాలో స్థిరపడి నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009 నవంబర్‌లో బిజినెస్ వీసాపై ముంబైకి వచ్చాడు. తొలినాళ్లలో రెడీమేడ్ వ్రస్తాల వ్యాపారం చేశాడు. వ్యాపార విస్తరణలో భాగంగా 2012లో తన మకాం గోవాకు మార్చాడు. అక్కడి కండోలిమ్ ప్రాంతంలో కొందరు స్నేహితులతో కలిసి ఉంటూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేశాడు. పాస్‌పోర్టు పోగొట్టుకొని, వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేశాడు. ఈ విషయం పసిగట్టిన గోవా పోలీసులు అరెస్టు చేయడంతో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కండోలిమ్లోనే ఉండే రాజస్తానీ యువతి ఉషాచండేల్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భర్త నుంచి వేరుపడిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్టాన్లీ గ్రోసరీ పేరుతో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడకు సరుకులు ఖరీదు చేయడానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లతో స్టాన్లీకి పరిచయమైంది. ఓ దశలో ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న స్టాన్లీకి ఈ ఇద్దరూ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సేల్స్ నుంచి సప్లై చైన్ వరకు... తొలినాళ్లలో స్టాన్లీ ఆ ఇద్దరు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తీసుకొని స్థానికంగా విక్రయించేవాడు. వస్త్ర వ్యాపారంలో కంటే ఎక్కువ లాభాలు వస్తుండటంతో దీనినే కొనసాగించాడు. ఇద్దరు మిత్రులు నైజీరియాకు వెళ్లడంతో వారి డ్రగ్స్ వ్యాపారాన్నీ స్టాన్లీ టేకోవర్ చేశాడు. విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించడం, స్థానికంగా ఉన్న పెడ్లర్స్‌కు సప్లై చేయడం... ఇలా ఓ డ్రగ్స్ చైన్ ఏర్పాటు చేశాడు. 2017లో ఇదే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బయటకు వచ్చాక డ్రగ్స్ దందాను మరింత విస్తరించాడు. నైజీరియాతోపాటు నెదర్లాండ్స్‌లో ఉన్న డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆర్డర్లు ఇస్తూ కొరియర్‌తో పాటు విమానాల్లో వివిధ రకాలైన డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఆయా దేశాల నుంచి కొందరు ట్రాన్స్పోర్టర్లు పెద్ద క్యాప్సూల్స్ రూపంలో కడుపులో దాచుకొని, బ్యాగుల్లోని రహస్య అరల్లో సర్దుకుని తీసుకొచ్చేవారు. మాదకద్రవ్యాలు ముంబై టు గోవా మాదకద్రవ్యాలు తొలుత ముంబై వచ్చేవి. అక్కడ ఉన్న సప్లయర్స్ ద్వారా గోవాకు తెప్పించుకునేవాడు. వీటిని కస్టమర్లతో పాటు ఇతర పెడ్లర్స్‌కు సరఫరా చేయడానికి ముగ్గురు దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రయాణ ఖర్చులతో పాటు ఒక్కో గ్రాము డెలివరీ చేసినందుకు రూ.2 వేల కమీషన్ ఇచ్చేవాడు. నైజీరియా వెళ్లిన ఇద్దరు మిత్రులు సైతం తమ పాత కస్టమర్ల ద్వారా వారికి వచ్చే ఆర్డర్స్‌ను వాట్సాప్ ద్వారా ఇతడికి పంపేవారు. ఇలా చేసినందుకు వారికీ గ్రాముకు రూ.2 వేలు కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించిన స్టాన్లీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 511 మంది కస్టమర్లు ఉండగా, వారిలో ఏడుగురు నగరానికి చెందిన వారు. ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ లేదా హవాలా రూపంలో చేస్తుంటాడు. ముంబైలో వస్త్రవ్యాపారం చేస్తుండగా పరిచయమైన నెట్‌వర్క్‌నే వాడుకుంటున్నాడు. స్టాన్లీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోవాలో రూ.కోటి ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఎస్ఆర్ నగర్లో దొరికిన తీగ లాగితే... టీఎస్ నాబ్ అధికారులు గత నెల 18న ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 38 ఎక్స్టసీ పిల్స్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కీలక నిందితుడైన బాబూసోను లోతుగా విచారించగా, డ్రగ్స్ స్టాన్లీ ద్వారా వస్తున్నాయని తేలింది. దీంతో గోవా వెళ్లిన టీఎస్ నాబ్ పోలీసులు నెల రోజులు శ్రమించి స్టాన్లీ ఆచూకీ కనిపెట్టారు. అతడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు మంగళవారం డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి పంజగుట్టకు వచ్చినట్టు తెలుసుకున్నారు. అక్కడ వలపన్ని స్టాన్లీని పట్టుకోవడంతో పాటు అతడి నుంచి 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్టసీ మాత్రలు, 21 గ్రాముల హెరాయిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 105 ఎల్ఎస్డీ బోల్ట్స్, 215 గ్రాముల చరస్, 7 గ్రాముల యాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సిటీలోని ఏడుగురు కస్టమర్ల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ దందా వివరాలు తెలిసిన వారు 8712671111కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు. ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు? -
Cocaine In White House: వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం.. అధికారులు అప్రమత్తం!
అమెరికాలోని వైట్‌హౌస్ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాదకద్రవ్యం)ను గుర్తించారు. ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు. అనంతరం ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. అయితే కొకైన్‌ను గుర్తించిన సమయంలో వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన తన వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్‌ను పలు విధాలుగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది పౌడర్ కొకైన్ అని గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం ఆ తెల్లటి పౌడర్ ప్యాకెట్ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఆ పౌడర్ వైట్‌హౌస్‌లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఓవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్‌లు కూడా అక్కడే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజూ వివిధ ప్రభుత్వ పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా! -
సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్ పట్టివేత
రోమ్: ఇటలీలోని సిసిలీకి సమీపంలోని సముద్ర జలాల్లో తేలియాడుతున్న కొకైన్ ప్యాకెట్లివి. సుమారు రెండు టన్నుల బరువున్న 70 బండిళ్లలో 1,600 ప్యాకెట్లలోని ఈ కొకైన్ విలువ ఏకంగా రూ.3,700 కోట్లు! స్మగ్లర్లు వీటిని బహుశా నౌకలో తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడ తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్లకు ట్రాకింగ్ డివైజ్‌ను కూడా అమర్చారని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా పెట్రోలింగ్ చేస్తుండగా ఇవి కనిపించాయి. -
Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
ముంబై విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఏకంగా 47 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు.. ఈ కేసులోని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ జోనల్ యూనిట్ అధికారులు శుక్రవారం విమనాశ్రయంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 31.29 కోట్ల విలువగల 4.47 కిలోల హెరాయిన్.. అలాగే 15.96 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మొత్తం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కెన్యాలోని నైరోబీ మీదుగా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ వ్యక్తిని చెక్ చేయగా.. 4.47 కిలోగ్రాముల హెరాయిన్‌తో పట్టుబడినట్లు తెలిపారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన హెరాయిన్‌ను 12 డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచనా వేస్తున్నారు మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ స్కాన్ చేయడంతో అనుమానాస్పద బటన్లు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కుర్తా బటన్లు పక్కపక్కనే ఉండి ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. బట్లను తీసి పరిశీలించగా 1.59 కిలోగ్రాముల కొకైన్ లభించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలో ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే! #Mumbai customs department has arrested an Indian passenger at #Mumbaiairport while smuggling #Cocaine worth ₹16crore from Addis Ababa to Mumbai. The drugs were ingeniously concealed in the buttons of ladies kurtas, bags by creating false cavities@mumbaicus3 @htTweets @HTMumbai pic.twitter.com/bCTYqOL2Lm — Vijay Kumar Yadav (@vijaykumar1927) January 6, 2023 -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
ప్రైవేట్ హాస్టల్‌పై ఎక్సైజ్ దాడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఒక పేయింగ్గెస్ట్ హాస్టల్‌పై బుధవారం ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడిచేసి కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని పేయింగ్ గెస్ట్ హాస్టల్‌పై దాడి చేశారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో అమ్మేందుకు కొకైన్, ఎండీఎంఏను నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు హుటాహుటిన దాడి చేశారు. ఈ క్రమంలో 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ1గా హరి సతీశ్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. గ్రాము కొకైన్‌ను రూ.10 వేలు, గ్రాము ఎండీఎంఏను రూ.5వేల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం అందడంతో దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసి అమీర్‌పేట్ ఎస్‌హెచ్‌వో జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత!
న్యూఢిల్లీ: నారింజ పండ్లను తీసుకువెళ్లే ట్రక్‌లో దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను గుర్తించారు అధికారులు. ముంబైలోని నారింజ పండ్లను దిగుమతి చేసే ట్రక్‌లో సుమారు రూ. 1476 కోట్ల విలువైన మెథాంఫేటమిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువెళ్తున్నట్లు కనుగొన్నారు. ఆ ట్రక్కును డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆపీ తనీఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. వాలెన్సియా ఆరెంజ్ డబ్బాల్లో 198 కిలోల హైప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కిలోల కొకైన్ ఉందని అదికారులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్న వ్యక్తులను కూడా విచారించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ) -
ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత
ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్‌కు చెందిన ఈ మహిళ ఆడిస్‌అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్ బయటపడటంతో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ విభాగం అధికారులు చెప్పారు. చదవండి: యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం -
మామూలుగా తెస్తే లక్షన్నర.. కడుపులో దాస్తే 3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో చూపించినట్టు ఒకడు విగ్గులో పట్టుకొస్తాడు, మరొకడు కడుపులో దాచుకొని తెస్తాడు, ఇంకొకడు వాటర్ బాటిల్ లేబుల్‌లో తరలిస్తాడు. ఇలా ఎక్కడో దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి డ్రగ్స్‌ను విదేశాలకు తరలించేందుకు డ్రగ్స్ మాఫియా రకరకాల ఐడియాలేస్తోంది. కొన్నిసార్లు స్మగ్లింగ్ చేసేందుకు శిక్షణ ఇచ్చి మరీ పంపిస్తోంది. ఒక్కో ట్రిప్‌కు రూ.లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ముట్టజెబుతోంది. ఇలా అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ విభాగాలు ఎక్కడికక్కడ పట్టుకుంటున్నాయి. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.200 కోట్ల విలువగల కొకైన్, హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాలను సీజ్ చేశాయి. ట్రిప్‌కు లక్షన్నర నుంచి 3 లక్షలు దక్షిణాఫ్రికా, నైరోబి తదితర ఆఫ్రికా దేశాల్లో పేద కుటుంబాల్లోని మహిళలు, మధ్య వయసు వారిని డ్రగ్స్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సూట్‌కేసు, ఇతర పద్ధతుల్లో తెచ్చే వారికి ప్రతి ట్రిప్‌కు రూ. లక్షన్నర, కడుపులోకి పెట్టుకొని తీసుకొచ్చే వారికి రూ. 3 లక్షల వరకు ఇస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెట్టుకొని డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తంలో దొరక్కుండా స్మగ్లింగ్ చేయొచ్చని, పైగా దీని వల్ల ప్రాణాలకు ప్రమాదమూ ఎక్కువ కాబట్టి ఎక్కువగా డబ్బులిస్తున్నారని వెల్లడైంది. పైగా కడుపులోకి పెట్టుకొని తీసుకువచ్చే వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్టు కూడా డీఆర్ఐ గుర్తించింది. స్మగ్లింగ్ చేసే వాళ్లకు విమాన చార్జీలు, వసతి సౌకర్యాలు కాకుండానే ఈ సొమ్ము ఇస్తారని వెల్లడైంది. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి? దక్షిణాఫ్రికా, నైరోబి తదితర చుట్టుపక్కల ఆఫ్రియా దేశాల నుంచి వయా దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు టాంజానియా, మలావియన్ దేశస్థులు డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు. దక్షిణఫ్రికాలోని ప్రిటోరియా, జోహెన్నస్‌బర్గ్ తదితర ప్రాంతాలకు వ్యక్తులను తీసుకెళ్లి కొకైన్, హెరాయిన్‌ను టాబ్లెట్ల రూపంలో లేదా మరో రూపంలో ఇచ్చి స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ప్రాణం పోయే ప్రమాదముందని తెలిసినా కొందరు డ్రగ్స్‌ను కడుపులో దాచుకొని 3, 4 రోజులు ప్రయాణించి డెలివరీ స్థానానికి చేరవేస్తున్నారు. పట్టుబడ్డ వ్యక్తులకు డ్రగ్స్ ఎక్కడికి చేరుతుందో పూర్తి వివరాలు తెలియట్లేదని డీఆర్ఐ వర్గాలు చెప్తున్నాయి. డ్రగ్స్‌ను తరలిస్తూ పట్టుబడ్డారని తెలిసినా పేదరికం, మరోదారి లేక డ్రగ్స్‌ను చేరవేస్తున్నారని అంటున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుతున్న డ్రగ్స్‌ను తమిళనాడు, విశాఖపట్నం తదతర సముద్రతీర ప్రాంతాల ద్వారా ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ తదితర దేశాలకు తరలిస్తున్నట్టు డీఆర్ఐ అనుమానిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచే ఎక్కువగా.. డ్రగ్స్ కేసుల్లోని నిందితులు దక్షిణాఫ్రికా నుం చి హైదరాబాద్ వచ్చినవారే కావడం ఆందో ళన కలిగిస్తోంది. ఈ నెల 1న దక్షిణాఫ్రికా దేశస్థుల నుంచి రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏప్రిల్‌లో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ టాబ్లెట్లు, రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. గతేడాది జూన్‌లో రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ పట్టుబడగా, ఆ నెలలోనే మరో కేసులో రూ.19.5 కోట్ల విలువైన 3 కేజీల హెరాయిన్ పట్టుబడిం ది. భారీగా పట్టుబడిన కేసుల్లోని డ్రగ్స్ విలు వ దాదాపు 200 కోట్లుంటే, చిన్నిచితకా కేసులన కలిపితే మరో రూ. 50 కోట్ల మేర ఉం టుందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. -
కేరళ పెడ్లర్ అరెస్టు, డ్రగ్స్ సీజ్
బనశంకరి: నగరంలో పెద్దఎత్తున డ్రగ్స్ విక్రయిస్తున్న కేరళ డ్రగ్స్ పెడ్లర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.6.5 లక్షల విలువచేసే 49 గ్రాముల 90 ఎక్స్టసి మాత్రలు, 40 గ్రాముల చరస్, 5 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి నిందితుడు మహమ్మద్ రన్నార్ను మంగళవారం నిర్బంధించారు. ఇతను బిట్కాయిన్లను ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించి కాలేజీ విద్యార్థులకు విక్రయించేవాడు. (చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్..) -
కడుపులో 11.57కోట్ల కొకైన్..
సాక్షి, హైదరాబాద్: కిలోకు పైగా కొకైన్ డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల రూపంలో పొట్టలో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న టాంజానియా వ్యక్తి (44)ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. పొట్టలోంచి 79 ట్యాబ్లెట్లను బయటకు తీశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి ఈ నెల 21న ఎమిరేట్స్ విమానంలో ఆ వ్యక్తి హైదరాబాద్ చేరుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను టాంజానియా నుంచి జోహెన్నెస్‌బర్గ్ వచ్చానని.. జోహెన్స్‌బర్గ్ నుంచి ఇండియాకు వచ్చే ముందు ప్రొటేరియా వెళ్లి అక్కడ కొకైన్ ట్యాబ్లెట్లు మింగానని అధికారుల విచారణలో వెల్లడించాడు. 3 నుంచి 4 రోజులు కడుపులోనే దాచుకొని మరో వ్యక్తికి డెలివరీ చేయాల్సిందిగా ఆదేశాలున్నాయన్నాడు. ఆ వ్యక్తి నుంచి 22 కొకైన్ ట్యాబ్లెట్స్ను అధికారులు బయటకు తీశారు. మిగిలిన ట్యాబ్లెట్లను తీయడం కష్టమవడంతో ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ ద్వారా మంగళవారం మరో 57 ట్యాబ్లెట్లను తీశామని డీఆర్ఐ వెల్లడించింది. ఇవి 1,157 గ్రాముల బరువున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.11.57 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నాడో విచారణ చేయాల్సి ఉందని చెప్పింది. -
రూటు మార్చిన కేటుగాళ్లు... గతంలో గోవా, బెంగుళూరు ఇప్పుడూ ముంబై నుంచి డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాదారులు రూటు మార్చారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు గోవా, బెంగళూరు, ముంబైల నుంచి కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి.. స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సెలబ్రిటీలకు విక్రయించేవాళ్లు. తాజాగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి హెరాయిన్‌ను, పంజాబ్ నుంచి పాపి స్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్స్‌ను నగరానికి తీసుకొస్తూ.. రాచకొండ పోలీసులకు చిక్కడమే ఇందుకు ఉదాహరణ. అక్రమ మార్గాలను ఎంచుకుని.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల వాళ్లు పని చేస్తుంటారు. వలస వచ్చిన వీరిలో కొంతమంది డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విరివిగా దొరికే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నగరంలో డ్రగ్స్ డిమాండ్‌ను గుర్తించి క్యాష్ చేసుకునేందుకు ఇలా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో గ్రాము రూ.300 చొప్పున కొనుగోలు చేసి లారీలు, రైలు, బస్సులలో ప్రయాణించి నగరానికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దానిలో కొంత వారు వినియోగిస్తూనే.. మరికొంత డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నట్లు పలు కేసుల్లో పోలీసుల విచారణలో బయటపడింది. టోల్ ప్లాజాలు, పోలీస్ చెక్‌పోస్ట్‌లు లేని రూట్ల కోసం గూగుల్‌లో వెతికి మరీ రవాణా చేస్తున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. డ్రగ్స్ రవాణా సమయంలో పైలెట్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వెనకాల డ్రగ్స్ వచ్చే వాహనానికి, పైలెట్ వెహికిల్‌కు మధ్య కనీసం 3– 5 కి.మీ. దూరం ఉంటుంది. పోలీసుల తనిఖీలను ఎప్పటికప్పుడు వెనకాల వాహనంలోని నిందితులకు చేరవేస్తుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వాహనాన్ని రూటు మారుస్తుంటారని ఆయన వివరించారు. పట్టుబడిన నిందుతులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న డ్రగ్ హెరాయిన్‌ను వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను మల్లాపూర్ క్రాస్ రోడ్స్‌లో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) మల్కాజిగిరి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్)ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 31న పాపి స్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్‌ను పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరు నిందితులను కీసర– శామీర్‌పేట రోడ్లో ఎస్ఓటీ మల్కాజిగిరి, కీసర పోలీసులు పట్టుకున్నారు. 900 గ్రాముల పాపి స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: సరదాగా మొదలై... వ్యసనంగా మారి!) -
స్వయం కృతాపరాధం: డ్రగ్స్‌తో అలంకరించి ఫోటోలు తీశాడు... అంతే చివరికి!!
Drug Dealer Decorated Christmas Tree With Cash And Cocaine: కొంతమంది అత్యుత్సహం లేదా వింతగా చేయాలనో చేసే పనులు వాళ్లను ఏ స్థితికి తీసుకువెళ్లుతుందో కూడా చెప్పలేం. ఒకచోట ఒక కుటుంబం క్రిస్మస్ చెట్టుని మంచి విద్యుత్ బల్బులతో అలంకరించి పెద్ద అగ్నిప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యక్తి విన్నూతనంగా క్రిస్మస్ చెట్టును అలంకరించి తనను తానే పోలీసులకు పట్టుబడేలా చేసుకున్నాడు. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) అసలు విషయలోకెళ్లితే.... యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మార్విన్ పోర్సెల్లి అనే ఒక డ్రగ్ డీలర్ క్రిస్మస్ చెట్టుని డబ్బులతోనూ, మాదక ద్రవ్యాలతోనూ అందంగా అలంకరించాడు. పోనీ అక్కడితే ఆగకుండా వాటిని తన మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అంతే ఆ ఫోటోలు కాస్త ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ పోలీసులకు చేరడంతో పోర్సెల్లిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ క్రిస్మస్ చెట్టు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా డ్రగ్స్‌కి బానిసైతే వారి అభిరుచి ఇంతటి విచిత్రమైన అలంకరణకు పురిగొలుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తి నుంచి సుమారు రూ 37 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు. అంతేకాదు ఓవర్‌బోర్డ్ అనే పేరుతో ఒక సంవత్సరం పాటు సాగిన ఆపరేషన్‌లో పోర్సెల్లిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో పోర్సెల్లి తోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్టు చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) Can you imagine our surprise when we searched the mobile of Wavertree drug dealer Marvin Porcelli and found this?! 😮 pic.twitter.com/CvLOiFOwyJ — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 We also caught eight other (un)wise men as part of Overboard and found lots of interesting parcels under the tree (as well as in other parts of their houses), namely drugs worth £1.3m pic.twitter.com/PeHOv8n4RO — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 -
సముద్రంపై తేలుతున్న ప్యాక్.. విప్పి చూస్తే 7 కోట్ల విలువైన..!!
$1 million worth of cocaine Found Floating on Florida Ocean: నీటిపై తేలియాడుతున్న దాదాపు 7 కోట్ల విలువైన 30 కేజీల కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. వివరాల్లోకెళ్తే.. ఫ్లోరిడా కీస్ సమీపంలోని సముద్రంపై తేలియాడుతున్నట్లు కనుగొన్న మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన వ్యక్తికి 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రగ్స్‌ను ప్యాక్ చేసి ఉండటం గమనించాడు. వెంటనే ప్యాకేజీ గురించిన సమాచారాన్ని యూఎస్ బోర్డర్ పెట్రోల్‌కు తెలియజేశాడు. డ్రగ్స్‌ని వెలికి తీయడంలో యూఎస్ కోస్ట్ గార్డ్ సహాయం చేసింది. దీనివిలువ దాదాపు 7 కోట్లు (1 మిలియన్ డాలర్లు) ఉంటుందని అధికారులు తెలిపారు. చీఫ్ పెట్రోల్ ఏజెంట్ థామస్ జి మార్టిన్ 24 ఇటుకల రూపంలో ఉన్న కొకైన్కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘వారాంతంలో ఓ సహృదయుడు ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో తేలుతున్న 1 మిలియన్ డాలర్ల కొకైన్‌ను కనుగొన్నాడని రాసుకొచ్చాడు. ఐతే ఫోరిడాలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రగ్స్‌ను భారీ స్థాయిలో రవాణా చేస్తూ దొరికిపోవడం కొత్తేమీ కాదు. ఈ యేడాది ప్రారంభంలో కూడా ఒక స్నార్కెల్లర్ 1.5 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నాడు. మరో సంఘటనలో గత ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ఓ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి 30 బిగుతుగా చుట్టిన బ్యాగులు కనిపించాయి. చదవండి: ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం Over the weekend, a Good Samaritan discovered over 1 million dollars in cocaine floating at sea near the Florida Keys. The package contained nearly 69 lbs. of cocaine. #BorderPatrol agents with support from @USCGSoutheast recovered the drugs. #breakingnews #breaking #monday pic.twitter.com/cC7EKa9lDx — Chief Patrol Agent Thomas G. Martin (@USBPChiefMIP) December 6, 2021 -
‘గర్ల్‌ఫ్రెండ్ వచ్చిన మరుసటి రోజే పట్టుబడ్డాను’
హిమాయత్‌నగర్: ఇటీవల నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్ అమ్ముతూ పట్టుబడ్డ ఘనా దేశస్థుడు జోసఫ్‌కు జూన్ 24న కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం కోసం నారాయణగూడ పోలీసులు సోమవారం జోసఫ్‌ను కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు విషయాలను అతను బయటపెట్టాడు. లిల్లీ నుంచే సరుకు... ముంబాయిలో అక్కడి ఫ్రెండ్స్ ద్వారా పరిచయ మై న లిల్లి అనే వ్యక్తి నుంచి కొకైన్ వంటి మాదక ద్రవ్యా లను ఒక్కో గ్రాము సుమారు రూ.4వేలకు ఇచ్చేవా డని, దానిని తాను రూ.5వేల నుంచి రూ.6వేలకు ఇతరులకు అమ్మేవాడినంటూ చెప్పినట్లు తెలిసింది. ముంబాయి నగరంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో అక్కడి పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ మూతపడడంతో హైదరాబాద్‌లో అమ్మాలనే ఆలోచనతో నెల రోజుల క్రితం ముంబై నుంచి బస్సులో నగరానికి వచ్చి కొద్దిరోజుల పాటు తెలిసిన స్నేహితుల వద్ద నివాసం ఉన్నాడు. రాజమోహల్లా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు ఉందని పేపర్ యాడ్‌లో చూసి ఆ ఇంటి వారికి పాస్‌పోర్ట్ చూపించి ఇద్దరం ఉంటామని అద్దెకు దిగాడు. డూ యూ హ్యావ్ స్టఫ్ అన్న వారికే... నేను ఎవరి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తానని చెప్పన్నక్కర్లేదు. నా ముఖం చూసి వారే ‘డూ యూ హ్యావ్ స్టఫ్’ అంటూ అడుగుతారు. అలా అడిగిన వారికి మరుసటి రోజు సాయంత్రం లేదా ఆ తర్వాతిరోజు(ఎల్లుండి) సాయంత్రం ఏదైనా ల్యాండ్‌మార్క్ చెప్పేవాడిని. అలా అక్కడకు వచ్చిన వారికి నా వద్ద ఉన్న కొకైన్ అమ్మకాలు చేశాను. ఇక నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను చూడటానికి వచ్చిందని అనుకుంటున్నాను. ఆమె వచ్చిన మరుసటి రోజే నేను పోలీసులకు పట్టుబడ్డాను కాబట్టి ఇంకా వేరే కారణాలు తెలియవంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మావు, ముంబై నుంచి ఎంత సరుకు తెచ్చావు, ఇక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే సమాధానాలను మాత్రం పోలీసులు జోసఫ్ నుంచి రాబట్టలేకపోయారు. -
క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే అని తాజాగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ మాల్స్, రిటైల్ అవుట్లెట్లలో, ఈ-కామర్స్ లో క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించడం ఇప్పుడు సాధారణమై పోయింది. మెట్రో నగరాల్లోని ఎక్కువ మంది క్రెడిట్ కార్డులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. క్రెడిట్ కార్డు తీసుకున్నవారు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ఈ మత్తులో పడిపోతే తొందరగా బయటికి రాలేరని నిపుణులు అంటున్నారు. ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్‌ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌కార్డు వాడకం మెదడుకు కొకైన్ మాదిరిగానే కిక్ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు. వివిధ రకాల ఆన్లైన్ షాపింగ్ సమయంలో క్రెడిట్ కార్డు ఉంటే కోరికలు ఎక్కువ కలుగుతాయని అధ్యయనం తెలిపింది. దీనివల్ల అవసరమైన వాటి కంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ పెడుతున్నట్లు సర్వేలో తేలింది. ఉదాహరణకు రెస్టారెంట్లలో, సెలవు దినాలలో ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఇంధనంపై ఉపయోగించే కార్డుల కంటే పెద్ద కోరికలను రేకెత్తిస్తాయి. ఈ విషయంపై ప్రొఫెసర్ డ్రేజెన్ ప్రిలెక్ మాట్లాడుతూ.. కొంత మంది క్రెడిట్‌కార్డు, మరికొంతమంది నగదు లావాదేవీలు చేసే వారి మెదడు ప్రతిస్పందనలను తాము స్కాన్ చేశాము. ఇందులో క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించ బడుతున్నట్లు కనుగొన్నాము. ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అందువల్ల అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని వివరించారు. చదవండి: బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్ తిరుమల సందర్శకులకు తీపికబురు! -
రూ. 1300కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
న్యూఢిల్లీ : రూ.1300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలకు సంబంధించి 9మందితో కూడిన అంతర్జాతీయ ముఠాను నార్కొటిక్ డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు శనివారం న్యూఢిల్లీలో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 20 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు యాంటీ నార్కొటిక్ ఏజెన్సీ తెలిపింది. కాగా, ఈ ముఠా వెనుక పెద్ద హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.. అంతర్జాతీయంగా ఆస్ర్టేలియా, కెనెడా, ఇండోనేషియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా, నైజీరియా దేశాలతో పాటు దేశంలోని ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలతో పాటు గ్రూపులుగా ఏర్పడి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ ఆపరేషన్‌లో అరెస్టైన 9 మందిలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు నైజీరియన్లు, ఒక అమెరికన్, మరోకరు ఇండోనేషిన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత్‌లో పట్టుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ.100 కోట్లు, అలాగే కార్టెల్ విలువ సుమారు రూ. 1300 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో అక్కడి అధికారులు 55 కిలోల కొకైన్, 200 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
246 ప్యాకెట్ల కొకైన్ తిన్నాడు.. అందుకే
మెక్సికో సిటి : అత్యధిక మోతాదులో కొకైన్ తీసుకున్న కారణంగానే మెక్సికో ఎయిర్‌లైన్‌లో ప్రయాణించిన వ్యక్తి మృతి చెందాడని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జపాన్‌కు చెందిన ఉడో ఎన్ అనే వ్యక్తి శుక్రవారం మెక్సికో నుంచి జపాన్ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. ఈ క్రమంలో ఫ్లైట్ హెర్మోసిలో పట్టణం చేరుకోగానే గుండెల్లో నొప్పితో విలవిల్లాడాడు. దీంతో తోటి ప్రయాణికుల ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా విమానాన్ని నిలిపివేశారు. అయితే అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. కాగా ఈ విషయం గురించి విచారణ జరిపిన సోనోరా అటార్నీ జనరల్.. మత్తు పదార్థాలు అత్యధిక మోతాదులో సేవించినందువల్లే సదరు వ్యక్తి మరణించాడని పేర్కొన్నారు. దాదాపు 246 ప్యాకెట్ల కొకైన్ తీసుకున్నందు వల్లే.. ఓవర్డోస్తో గుండె నొప్పి వచ్చిందని అటాప్సీ నివేదికలో ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి
లండన్ : పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎంత కష్టమో వాటిని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చరణ్‌ప్రీత్ సింగ్ లాల్(22). బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సైనికుడిగా రికార్డు సృష్టించిన చరణ్‌ప్రీత్ సింగ్ ఎంతో కాలం గడవకముందే ఆ పేరును పొగొట్టుకోవడమే కాకా ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు. వివరాలు.. చరణ్‌ప్రీత్ సింగ్ బ్రిటన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాణి ఎలిజబేత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు. ఇంత పేరు సాధించిన చరణ్‌ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. చరణ్‌ప్రీత్ సింగ్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆర్మీ అధికారి ఒకరు ‘చరణ్‌ప్రీత్ సింగ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నామో.. ఇప్పుడు అతను చేసిన పని అంత ఇబ్బందికరంగా మారింది. సైనికులందరికి అప్పుడప్పుడు ఇలా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ సారి చరణ్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సైనికులు కూడా మత్తు పదర్ధాలు తీసుకున్నట్లు తెలిసింద’ని తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన చరణ్‌ప్రీత్ సింగ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్‌కి వలస వెళ్లాడు. చదువు పూర్తయిన తరువాత 2016, జనవరిలో సైనికుడిగా బ్రిటీష్ ఆర్మీలో చేరాడు. -
వీడియో గేమ్స్... కొకైన్, జూదం లాంటివే!
పారిస్: కొకైన్, జూదం తరహాలో ప్రజలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేయడం ఇదే తొలిసారన్నారు. వీడియో గేమ్ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే నిర్ణయించినట్లు వెల్లడించారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రస్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లతో పాటు ఓ ముంబై మహిళను అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీలో కొకైన్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు... సైబరాదాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. తమ తనిఖీల్లో ఇద్దరు నైజీరియా వ్యక్తులను, ఓ ముంబై మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొకైన్ విలువ 4 లక్షల రూపాయలు ఉంటుంది. సైజీరియాకు చెందిన ఎమ్మాన్యుల్ ఉముడు (43) ఏ1, ఇదుష్ ప్లస్ (45) ఏ2 లు బిజినెస్ వీసా మీద కొన్నేళ్ల కిందట భారత్‌కు వచ్చి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మాన్యుల్-ఏ1, లీలా శివకుమార్ (37) ఏ3 ని వివాహం చేసుకున్నాడు. వీరు గ్రాముకు రూ.4000 నుంచి రూ.5000 ధరకు కొకైన్‌ను విక్రయించేవారు. గతేడాది డిసెంబర్లో తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కు వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఎమ్మాన్యుల్-లీలా శివకుమార్‌లు నగరానికి మకాం మార్చారు. తమకు అందిన సమాచారంతో పుప్పలగూడలోని ఫ్రెండ్స్ కాలనీ, సాయి బాలాజీ రెసిడెన్సీలో ఆకస్మిక దాడులు చేపట్టిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. టాంజానియ, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియా, నైజీరియాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల కొకైన్ లభించింది. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. టాంజానియా, నైజిరియాకు చెందిన వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
డ్రగ్స్ కావాలని ఫిర్యాదు.. డ్రగ్ డీలర్ అరెస్ట్
ఫ్లోరిడా: డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు ఇతరులకు అలవాటు చేయడం నేరమే. అయితే అమెరికాలో ఓ డ్రగ్ డీలర్ మాత్రం ఈ విషయాలను పట్టించుకోలేదు. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి తన డ్రగ్స్ బ్యాగు చోరీకి గురైందని ఫిర్యాదుచేసి కటకటాల పాలయ్యాడు. ఫ్లోరిడా పోలీసుల కథనం ప్రకారం.. ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ బ్లాక్ మన్ ఓ డ్రగ్ డీలర్. డ్రగ్స్ ప్యాకెట్లను సంచుల్లో నింపి తరచుగా తన కారులో వాటిని సరఫరా చేస్తుండేవాడు. గత ఆదివారం డేవిడ్ డీల్ లో భాగంగా సంచి నిండా కొకైన్, ఇతరత్రా మాదకద్రవ్యాలను నింపాడు. తన కారులో వాటిని తీసుకెళ్లి వాల్టన్ బీచ్ కు వెళ్లాడు. కారు పార్క్ చేసి కొద్దిసేపు పక్కకు వెళ్లగా తన కారు అద్దాలు ధ్వంసం చేసి ఎవరో డ్రగ్స్ చోరీ చేసినట్లు గుర్తించాడు డేవిడ్. తన డ్రగ్స్ బ్యాగును వెతికిపెట్టాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన డేవిడ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న కారణంగా అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడు డేవిడ్ తనకు మంజూరైన 4000 డాలర్ల పూచికత్తు బెయిల్ పై అనంతరం విడుదలయ్యాడు. ప్లోరిడా పోలీసులు జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ నిందితుడి ఫొటోను అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. వీడి తెలివి తెల్లారినట్లే ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
బిస్కెట్లు.. విత్తనాలు.. స్టాంప్స్ కాదేదీ డ్రగ్స్‌కు అనర్హం!
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల సరఫరాదారులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేసి స్తున్నారు. యాసిడ్ డైథైలామెడ్(ఎల్ఎస్డీ) డ్రగ్‌ను బిస్కెట్లుగా.. లైసర్జిక్ యాసిడ్ ఎమైడ్ (ఎల్ఎస్ఏ) డ్రగ్‌ను విత్తనాల రూపంలో సరఫరా చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బిస్కెట్లు, విత్తుల రూపంలో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నల్లజాతీయులతో పాటు మొత్తం ఆరుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. గోకర్ణలో ఏర్పడిన పరిచయాలతో.. కూకట్‌పల్లికి చెందిన ఎన్.రఘువంశీధర్రెడ్డి బీటెక్ పూర్తి చేసిశాడు. 2015లో బెంగళూరు వెళ్లిన ఇతగాడు అక్కడో కాల్ సెంటర్లో విధు లు నిర్వర్తించాడు. అక్కడ గంజాయి, ఎల్ఎస్డీ, కొౖకైన్, ఎండీఎంఏ(ఎక్స్టసీ) అలవాటయ్యా యి. ఏప్రిల్‌లో కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతానికి వెళ్లిన వంశీధర్‌రెడ్డికి.. అక్కడ బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్‌తో పరిచయమైంది. అతడి ద్వారా పరిచయమైన వారి నుంచి ఒక్కో ఎల్ఎస్డీ స్టాంప్‌ను రూ.వెయ్యికి ఖరీదు చేసి రూ.1,500 నుంచి రూ.2 వేలకు విక్రయించే వాడు. ఎల్ఎస్ఏ విత్తనాలు, చెరస్ తదితర డ్రగ్స్‌నూ కొనిఅమ్మేవాడు. డార్క్ నెట్ నుంచి మరికొన్ని.. వంశీధర్‌కు సికింద్రాబాద్, కూకట్‌పల్లికి చెందిన అభినవ్ మహేంద్ర, వి.మల్లికార్జున్‌రావుతో పరి చయం ఏర్పడింది. వీరిద్దరూ డార్క్ నెట్లో ఉండే టోర్ బ్రౌజర్ వినియోగించి యూరోపి యన్ దేశాల నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌డీ డ్రాప్స్‌తో కూడిన బిస్కెట్లతో పాటు ఎల్ఎస్ఏ సీడ్స్, ఎండీఎంఏ, కొకైన్ పోస్టల్లో ఇక్కడకు రప్పిస్తున్నారు. వీటిని గ్రాము రూ.4 వేలకు కొంటూ కొంత వినియోగిస్తూ.. మరికొంత వంశీధర్‌తో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇక గోవాలో పరిచయమైన నల్లజాతీయుడు చికా అలియాస్ జాక్ ద్వారానూ డ్రగ్స్ ఖరీదు చేసి అమ్ముతున్నాడు. హుక్కాతో మొదలై డ్రగ్స్ వరకు.. మరో డ్రగ్స్ గ్యాంగ్‌ను కూడా బుధవారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. న్యూబోయగూడకు చెందిన పి.రేవంత్ బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో హుక్కా సెంటర్లకు వెళ్లే ఇతగాడికి ఆ తర్వాత గంజాయి అలవాటైంది. తరచు గోవా వెళ్లే రేవంత్‌కు అక్కడ కొకైన్, ఎండీఎంఏ, చెరస్, ఎల్ఎస్డీ అలవాటయ్యాయి. అక్కడ తక్కువ ధరకు వీటిని ఖరీదు చేసి.. నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తూ పెడ్లర్‌గా మారాడు. డ్రగ్స్ విక్రయిస్తూ గతేడాది జనవరిలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి జైలుకెళ్లాడు. నెల క్రితం గోవా వెళ్లిన రేవంత్ 20 ఎల్ఎస్డీ స్టాంపులు ఖరీదు చేసి.. సైఫాబాద్‌కు చెందిన నజీబ్ ఖాన్, లక్డీకపూల్ వాసి జైన్ ఖాన్‌కు అమ్మాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం వీరిని పట్టుకుని 11 ఎల్ఎస్డీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మొదటి గ్యాంగ్‌కు చెందిన ఆరుగురిని బంజారాహిల్స్ పోలీసులకు, రెండో గ్యాంగ్‌ను సైఫాబాద్ పోలీసులకు అప్పగిస్తున్నామని డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. ముఠాను పట్టుకుంటే మరొకరు.. డ్రగ్స్‌ను ఎక్కువగా విక్రయించాలని భావించిన వంశీధర్.. చికా, అభినవ్, మల్లికార్జున్‌కు ఒకేసారి ఆర్డర్ ఇచ్చాడు. బుధ వారం వీరంతా బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని ఓ రెస్టారెంట్ సమీపంలో కలుసుకున్నా రు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఐదుగురినీ అదుపు లోకి తీసుకున్నారు. మణికొండలో నివసిస్తున్న మరో నైజీరియన్ లక్కీ ఇదే వ్యాపారం చేస్తున్నట్లు చికా విచారణలో వెల్లడించడంతో అతడినీ పట్టుకున్నారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండీఎంఏ, 5 ఎల్ఎస్డీ స్టాంప్స్, 11 ఎల్ఎస్ఏ విత్తనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. -
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన రఘువంశీధర్ రెడ్డి, మల్లికార్జునరావు, మహేంద్రహిల్స్ నివాసి అభినవ్ మహేందర్, అలాగే బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్‌లతో పాటు అరెస్ట్ అయినవారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వీరందర్ని ఇవాళ బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాములు కొకైన్, 42 గ్రాముల పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు వాడిన నిస్సాన్ సన్నీ కారు (AP10BE9509)ను జప్తు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రగ్స్ వ్యవహారంలో కొత్త మలుపు
-
తెరపైకి కొకైన్ బ్యాచ్
డ్రగ్స్ మత్తులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు - విచారణలో వెల్లడించిన కెల్విన్ - మేం ఎల్ఎస్డీ మాత్రమే విక్రయిస్తాం - వీకెండ్, వినాయక నిమజ్జనం సమయంలో ఎక్కువ డిమాండ్ - జీషన్‌ను విచారిస్తే కొకైన్ గుట్టు రట్టు! సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సినీరంగంతోపాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ‘మత్తు’లో మునుగుతున్నారన్న కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ సిట్ విచారణలో ఈ మేరకు కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలిసింది. ‘‘మీరు (సిట్ అధికారులను ఉద్దేశించి) ఎల్ఎస్డీ బ్యాచ్‌ను మాత్రమే పట్టుకున్నారు. ఇంకా కొకైన్ బ్యాచ్ కూడా ఉంది. అందులో సినిమా, రాజకీయరంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు’’అని అతడు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓ ప్రముఖ దర్శకుడు, ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్లే కాకుండా మరికొందరు సినిమావాళ్లు కూడా తన వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు కెల్విన్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం రెండోరోజు బాలనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ బృందం కెల్విన్‌ను విచారించింది. తనకు తెలిసిన రహస్య సమాచారాన్ని సాధ్యమైనంత మేరకు దాటవేయడానికే అతడు యత్నించినట్లు తెలిసింది. కస్టడీ గడువు ముగియటంతో సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం కెల్విన్, ఖుద్దూస్, వాహిద్‌లను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కొకైన్ జాబితా పెద్దదే.. కొందరు కొకైన్ తీసుకోవటాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారని కెల్విన్ చెప్పినట్టు తెలిసింది. తెలుగు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఇద్దరు నిర్మాతలు, మరో ఇద్దరు నిర్మాతల కొడుకులు, ఓ రాజకీయ ప్రముఖుడి కొడుకు ఇందులో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. జీషన్ అలీఖాన్ గ్యాంగ్‌తోపాటు మరికొన్ని గ్యాంగులు కొకైన్ సరఫరా చేస్తాయని, జీషన్‌ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నట్టు తెలిసింది. వాస్తవానికి వారం కిందటే ఓ స్టార్ హోటల్ సమీపంలో కొకైన్ డ్రగ్స్‌ను విక్రయించేందుకు యత్నిస్తుండగా జీషన్‌ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేసి విచారించారు. అతడిచ్చిన సమాచారంతోనే ఏడుగురు ప్రముఖులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కేవలం సహ నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వలేమని, ఒకవేళ ఇచ్చినా కోర్టులో నిలబడవన్న ఉద్దేశంతో సిట్ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో.. జీషన్‌ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన బ్యాంకు ఖాతాలను, మొబైల్ కాల్‌డేటా విశ్లేషిస్తే కొంత సమాచారం దొరుకుతుందని, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తే పక్కాగా చిక్కుతారని సిట్ భావిస్తోంది. నిమజ్జనం సమయంలో డిమాండ్ బ్రెండెన్, నిఖిల్‌శెట్టి, అమన్ నాయుడు డ్రగ్ ముఠాలతో తనకు సంబంధం ఉందని, తామంతా ఎల్ఎస్డీ డ్రగ్స్‌నే విక్రయిస్తామని కెల్విన్ చెప్పినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 500 ఎల్ఎస్డీ స్ట్రిప్పులు విక్రయిస్తామని, వీకెండ్లో మాత్రం 1500 వరకు విక్రయిస్తామని చెప్పినట్టు సమాచారం. వినాయక నిమజ్జనం చివరి నాలుగైదు రోజుల్లో డ్రగ్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందని వివరించినట్లు తెలిసింది. ఊరేగింపు సమయంలో.. శరీరంలో గంటలకొద్దీ శక్తి ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారని అతడు చెప్పినట్టు çతెలిసింది. డార్క్‌నెట్ ద్వారా జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తెప్పించి నిల్వ చేస్తామని చెప్పాడు. తనకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందని, నెలాఖరులో తాను గోవా వెళ్లి ఎంజాయ్ చేసి వస్తానని సిట్ అధికారులకు కెల్విన్ వివరించినట్టు సమాచారం. -
వాడిపోతున్న స్కూలు పూలు
పుస్తకాల్లోనే కక్కుకుంటున్నారు. అక్షరాలతో సోపానాలు వేసుకునే వయసులో శిక్షలు పడి పాతాళానికి కూరుకుపోతున్నారు. మత్తు.. నిప్పులా చెలరేగుతోంది. బడులలో తెల్లపొడి భగ్గుమంటోంది. డ్రగ్స్... విషనాగులై కాటేస్తున్నాయి. స్కూళ్లలోనే జీవితాలు కూలిపోతున్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈ భూతాన్ని ఎలా బంధించాలి. పిల్లలకు విముక్తి ఎలా కల్పించాలి? ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... హైదరాబాద్‌లోని ఓ ఆఫీసులో ల్యాండ్ ఫోను మోగుతోంది. ఎవరో ఫోను లిఫ్ట్ చేసి ‘శ్రీదేవీ... మీకు ఫోన్’ అన్నారు. శ్రీదేవి ఉలిక్కిపడింది, వెంటనే ఫోను దగ్గరకు చేరుకుని రిసీవర్ అందుకుంది. అవతలి వ్యక్తి ఎవరో? ఏం చెబుతున్నారో? ఎవరికీ తెలీలేదు గానీ... శ్రీదేవి చెంపలను తాకుతున్న కన్నీటి చుక్కలు అందరికీ కనిపిస్తున్నాయ్! ఒక్కసారిగా నిశ్శబ్దం. ఫోన్ పెట్టేసిన వెంటనే మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లిపోయిందామె. ‘శ్రీదేవికి ఏమైంది?’ – ఆఫీసులో డిస్కషన్! మరో రెండు రోజులు ఆమె ఆఫీసుకు రాలేదు. రెండు రోజుల తర్వాత శ్రీదేవి ఆఫీసుకు వచ్చింది. ఆమెలో భయం, ఆందోళన. కాసేపటికి ల్యాండ్ ఫోను మళ్లీ మోగింది. రెండు రింగులయ్యే సరికి శ్రీదేవి లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఏదో చెబుతున్నారు. శ్రీదేవి ‘ఊ’ కొడుతోంది. పది నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి తన సీటులోకి వచ్చింది. ఆమె మనసులో ఆందోళనలు తగ్గలేదు. శ్రీదేవిని అలా చూడలేని ఆమె స్నేహితురాలు పుష్ప మెల్లగా కదిలించింది. మాటలు కలిపింది.‘శ్రీదేవీ... అంతా మంచే జరుగుతుంది. భయాలేం పెట్టుకోకు! అసలేమైంది?’ అనడిగింది పుష్ప. ఇటువంటి ఓదార్పు, ధైర్యం కోసమే ఎదురు చూస్తోన్న శ్రీదేవి, పుష్ప ఒళ్లో తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెనలా చూసి సహోద్యోగుల కళ్లు చెమ్మగిల్లాయి. వెక్కిళ్లు తగ్గిన తర్వాత ఏం జరిగిందనేది విడమర్చి చెప్పడం ప్రారంభించింది. కస్టడీలో కన్న కొడుకు! శ్రీదేవి కొడుకు సుధీర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుధీర్‌తో పాటు మరో ఐదుగుర్ని కూడా అరెస్ట్ చేశారు. అంతా స్కూల్ పిల్లలే.. మూడ్రోజుల క్రితం శ్రీదేవి సహోద్యోగులంతా టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూశారు. ‘ఇప్పుడు సుధీర్ ఎక్కడున్నాడు?’ – పుష్పలోనూ ఆందోళన! ‘టాస్క్‌ఫోర్స్ పోలీసుల కస్టడీలో...’ – క్లుప్తంగా చెప్పింది శ్రీదేవి. ‘ఎప్పుడు విడుదల చేస్తారట?’ – ఆఫీసులో ఇంకొకరు అడిగారు.‘ఐదుగురిలో ముగ్గుర్ని పంపించేశారు! వీణ్ణి (సుధీర్), ఇంకొకణ్ణి ఇంకా కస్టడీలోనే ఉంచారు’ – కళ్లు తుడుచుకుంటూ చెప్పింది శ్రీదేవి. ‘అదేంటి? కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేస్తారు కదా! వీళ్లిదర్నీ కస్టడీలో ఉంచడం ఎందుకు? పదండి... అందరం స్టేషనుకు వెళదాం’ – ఆఫీసులో ఇంకో గొంతు వినిపించింది. ‘డ్రగ్స్ తీసుకునేవాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తారు. డ్రగ్స్ అమ్మేవాళ్లను అరెస్ట్ చేస్తారు’ – ఈసారి శ్రీదేవి సమాధానంతో అందరూ సైలెంట్. ‘సుధీర్ డ్రగ్స్ అమ్మడం ఏంటే? వాడు ఎంత అడిగితే నువ్వు అంత ఇస్తావ్ కదా! డ్రగ్స్ దందాలోకి వెళ్లడం ఏంటి?’ – శ్రీదేవి చెప్పేదేది నమ్మేట్టు లేదన్నట్టు పుష్ప అడిగింది. ‘వన్ ఇయర్ బ్యాక్ వరకు వాడు బాగానే ఉండేవాడు! కానీ, గతేడాది ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్లాడు. అప్పుడు వీడికి డ్రగ్స్ అలవాటయ్యాయి. చదువు మేడ ఎక్కింది. మా మేడ మీదకు డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చి చేరాయి!’ – తండ్రి లేని పిల్లాడని గారాబం చేసి తప్పు చేశాననే భావనలో చెప్పింది శ్రీదేవి. ‘అంటే... సుధీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని నీకు ముందే తెలుసా?’ – సూటిగా ప్రశ్నించింది పుష్ప.తెలుసన్నట్టు తలూపింది శ్రీదేవి. ‘తెలిసిన తర్వాత కూడా చూసీ చూడనట్టు వదిలేశారన్నమాట?’ – తప్పు శ్రీదేవిదే అన్నట్టు నిందలేసే ప్రయత్నం చేశారు. ‘లేదు. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించా. వాడికి డబ్బులు ఇవ్వడం మానేశా. కష్టమైనా కాస్త కఠినంగానే వ్యవహరించా. మొదట్లో గోల చేశాడు. తర్వాత కామ్ అయ్యాడు. కుదురుకున్నాడనుకున్నా. కానీ, ఇంత దూరం వస్తుందనుకోలేదు. నేను ఆఫీసుకు వచ్చేసిన తర్వాత పిల్లాడు ఏం చేస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? ఇంటికి వెళ్లే సరికి బుద్ధిగా ఉన్నట్లు నటిస్తున్నాడు’ – శ్రీదేవి మాటలతో వాళ్లకు విషయం బోధపడింది. అక్కడ శ్రీదేవి చుట్టూ ఉన్నవాళ్లలో చాలామందికి... వాళ్లు ఆఫీసుకు వచ్చేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు. శ్రీదేవి మాటలు చాలామందిలో ఆలోచన రేకెత్తించాయి. అందరూ తేరుకుని ముందు సుధీర్‌ను బయటకు తీసుకొచ్చి, అతనిలో మార్పు తేవాలని నిర్ణయించుకున్నారు. కేస్ 1: నేపాల్‌కు చెందిన సాకేత్ జైస్వాల్ వరంగల్‌లోని ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి. తరచూ గోవా వెళ్ళే ఇతడికి శ్లాష్ అనే వ్యక్తితో పరిచయమైంది. శ్లాష్ ఇతడికి తక్కువ ధరకు ఎల్ఎస్డీ సరఫరా చేసేవాడు. ఆ మాదకద్రవ్యాన్ని తీసుకువచ్చి సిటీకి చెందిన మరో ముగ్గురితో కలిసి సేవించేవాడు. అలా మొదలైన అలవాటు ఆ తర్వాత ఎల్ఎస్డీని నగరంలో అమ్మాలని నలుగురూ నిర్ణయించుకున్నారు. దీంతో గోవా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు కొకైన్, చరస్ కూడా తీసుకువచ్చి అమ్ముతూ గత నెల 29న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. కేస్ 2: కామెరూన్ దేశానికి చెందిన మెక్‌డోనాల్డ్ ఎడ్యుకేషన్ వీసాపై హైదరాబాద్ వచ్చాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుతూ బృందావన్ కాలనీలో ఉండేవాడు. అతడి స్నేహితులైన నైజీరియన్ల నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ వినియోగించడంతో పాటు అమ్మకాలు మొదలెట్టాడు. కొకైన్, హెరాయిన్ అమ్ముతున్న ఇతడిని గత నెల 17న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కేస్ 3: తార్నాక నాగార్జున నగర్‌కు చెందిన ఓ కుర్రాడు పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్ళకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసగా మారాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి నుంచి గంజాయి ఖరీదు చేసేవాడు. తన ఇంటిపై ఉన్న ఓ గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి 2016లో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్టసీ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు ఖరీదు చేయడం ప్రారంభించిన ఆ కుర్రాడు తొలినాళ్ళల్లో తానే వినియోగించేవాడు. కొన్నాళ్ళకు విక్రేతగా మారిన ఇతగాడు లాలాగూడకు చెందిన అల్తాఫ్ హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, బొగ్గులకుంటకు చెందిన ప్రశాంత్ పౌల్‌కు అమ్మడం ప్రారంభించాడు. వీరిని గత నెల 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కేస్ 4: నైజీరియాకు చెందిన ప్యాట్రిక్ విలియమ్స్ ఒజొన్నా గతేడాది సెప్టెంబర్‌లో విజిట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. ఓ పబ్‌కు వెళ్ళిన సందర్భంలో ఇతడికి కెన్యా జాతీయుడైన కొలిన్స్‌తో పరిచయమైంది. ఇతడు మాదకద్రవ్యాలు వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకున్న ప్యాట్రిక్స్ తానూ ఆ దందాలో దిగాడు. కొలిన్స్ నుంచి గ్రాము కొకైన్‌ను రూ.2 వేలకు ఖరీదు చేస్తూ... దీన్ని వినియోగదారులకు గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నాడు. ద్విచక్ర వాహనంపై సంచరిస్తూ మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఇతడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ఏడాది మార్చ్‌లో పట్టుకున్నారు. గుర్తించడం ఇలా! ప్రవర్తనలో మార్పులు, మూడ్ స్వింగ్స్, దిగులు, చిన్న విషయానికే కోపం, ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవడం, ఆకలి, బరువు తగ్గిపోవడం, వాంతులు, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కళ్లు ఎర్రబారడం, మాటకు ఆలోచనలకు పొంతన లేకపోవడం, పనిని త్వరగా ముగించడం లేదా జాగు చేయడం, ప్రశ్నిస్తే సహించలేకపోవడం, చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టడం, అబద్దాలాడడం వంటివి.చదువులో వెనుకబడడం, అటెండెన్స్ తగ్గడం, డబ్బు అవసరం పెరగడం, కొత్త స్నేహాలు, బయటకు వెళ్లిన వెంటనే ఫోన్ స్విచాఫ్ చేయడం, ఎక్కువ సేపు ఏకాంతంగా గడపడం. బయటపడేదెలా? టీనేజ్ పిల్లలున్న పేరెంట్స్ చాలా అలర్ట్‌గా ఉండాలి. ∙గుర్తించగానే సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇప్పించాలి. సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫ్యామిలీ కౌన్సెలర్‌ను సంప్రదించాలి. మొదట పేరెంట్స్ మాత్రమే సైకియాట్రిస్ట్‌ను కలిసి సిచ్యుయేషన్ని ఎలా డీల్ చేయాలో సూచనలు తీసుకోవాలి. మెల్లగా వారిని కూడా కౌన్సెలింగ్ సెంటర్‌కు తీసుకురావాలి ∙డ్రగ్స్‌తో వచ్చే నష్టాలను పిల్లలకు స్నేహపూర్వకంగా వివరించి డీటాక్సిఫికేషన్ మెడిసిన్ ఇస్తారు ∙తీవ్రతను బట్టి సిట్టింగ్స్, కొందరికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు. కొందరికి రీహ్యాబిలిటేషన్ సెంటర్లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ – సత్య పులగం గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది. -
ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత
న్యూయార్క్: భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాయశ్రయంలో కస్టమ్స్ అండ్ బొర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటి బరువు 10 కిలోలకు పైగా ఉందని, కొకైన్ విలువ రూ. 2.6 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు గురువారం వెల్లడించారు. గత నెలలోనూ ఇదే తరహాలో మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. స్మగ్లింగ్ కొంత పుంతలు తొక్కుతుందని, దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా బ్యాగుల్లో, వస్తువుల్లో దాచకుండా శరీరానికి అట్టిపెట్టుకుని ఉండేలా కొకైన్ ను డ్రగ్స్ ముఠా సభ్యులు అమర్చుకున్నారు. డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఈ వ్యక్తులు ఒకే విమానంలో న్యూయార్క్ కు రాగా, వారి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. తొడ నుంచి దాదాపు పాదాలకు పైభాగం వరకూ కవర్లలో నింపి ఉంచిన కొకైన్ ను దాచి తరలిస్తున్నట్లు గుర్తించి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ నార్కోటిక్స్ వీరిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. గత నెలలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 668 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. Not one, but two 'busted' out of their pants...on the same flight by #JFK @CustomsBorder read the story herehttps://t.co/lFtSy9pMFO pic.twitter.com/ss6NUqZdVk — CBP New York City (@CBPNewYorkCity) 26 April 2017 -
కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నైజీరియన్ల నుంచి రూ.2 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఈ నెల ఒకటో తేదీన రాజధాని ఉత్తమ్‌నగర్‌లో కెన్నడీ డొమినిక్(34), అనయో గాడ్స్విల్(35) అనే నైజీరియా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 492 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. గాడ్స్విల్ ఢిల్లీకి చెందిన మహిళను పెళ్లి చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడని వివరించారు. డ్రగ్స్ రవాణాతో ఇతడు కోట్లాది రూపాయలు సంపాదించి విలావ వంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని చెప్పారు. ఇతని ఆస్తులన్నీ భార్యపేరు మీదే ఉన్నాయన్నారు. మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ.9.20 లక్షల విలువైన మెథక్వనోల్ మాత్రలను కువైట్‌కు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. -
పొట్టి డ్రెస్సుల్లో మహిళా ఖైదీల పార్టీ
రియోడిజెనీరో: ఎవరైనా తప్పు చేస్తే జైలుకు పంపిస్తారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు చూసైనా ఇంకోసారి తప్పు చేయకూడదనే భయం వారిలో కలుగడానకి. కానీ, ఉత్తర బ్రెజిల్ లోని క్యూరాడో జైలులో మహిళా ఖైదీలను చూస్తే అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. ఏకంగా కొకైన్వాడకంతో పాటూ పొట్టి పొట్టి డ్రెస్‌లు, పాటలకు స్టెప్పులు, ఫోన్లతో సెల్ఫీలు మొత్తంగా చెప్పాలంటే ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో జైలు అధికారులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్థానిక బ్లాగర్ కార్లోస్ డిసిల్వా తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. 'ఈ వీడియోను చూసి బ్రేజిల్ సిగ్గుపడాలి. కటకటాల్లో మహిళా ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తుండటం దారుణం. పెద్ద మొత్తంలో మదకద్రవ్యాల వినియోగంతో పాటూ జైలులో మద్యం ఏరులై పారుతోంది. తప్పు చేసిన వారికి ఇస్తున్న సకల సౌకర్యాలను చూస్తే కష్టపడి పని చేస్తూ ఇంటిని, పిల్లలను చూసుకుంటున్న మహిళలను అవమానించినట్టే. పన్ను కడుతూ ప్రభుత్వానికి సహకరిస్తే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నవారికి ఇలాంటి సౌకర్యాలా' అని తన ఫేస్ బుక్ పేజీలో కార్లోస్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను జైలులోనే శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ అందించింది. ఆమె ప్రాణాలకు హాని ఉండే అవకాశం ఉండటంతో పేరు ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. ఈ వీడియో బయటకు పొక్కడంతో బ్రెజిల్వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
పొట్టి డ్రెస్సుల్లో మహిళా ఖైదీల పార్టీ
-
ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దొంగలే
న్యూయార్క్: వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లు దోషులయ్యారు. అమెరికాకు మత్తు పదార్థాల రవాణా ఆరోపణల్లో వారు నేరం చేసినట్లుగా కోర్టులు ధృవీకరించాయి. న్యూయార్క్‌లోని ఫెడరల్ జ్యూరీ ఈ కేసును విచారిస్తూ వెనెజులా ప్రథమ మహిళ మేనళ్లులు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)ని దోషులుగా పేర్కొంది. వీరి శిక్షా కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 7న ప్రకటించనున్నారు. వీరిద్దరు వెనిజులా నుంచి దాదాపు 800 కేజీల కొకైన్‌ను హోండురాస్ నుంచి అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించింది. అక్కడే నవంబర్ 7న విచారణ ప్రారంభించింది. -
వామ్మో! పాము విషానికి అంత రేటా?
కోల్‌కతా: ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురిలో పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్న పాము విషం పొడిని స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 245 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. అయితే దాని విలువ 175 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పత్రికలు వెల్లడించిన కథనాలనే నమ్మినట్లయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వెయ్యి గ్రాములకు లెక్కకడితే ఒక్క గ్రాము విలువ 1,75,000 రూపాయలు ఉంటుందని తేలుతోంది. ఇదే విషయాన్ని పోలీసులను అడిగితే ఆ మాత్రం విలువ ఉంటుందని వారూ తెలిపారు. అందుకే వాటిని బుల్లెట్ ప్రూఫ్ గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని కూడా చెప్పారు. పాము విషయం విలువ అంత ఉంటుందా? ఎవరు అంత విలువు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారు? అంతర్జాతీయ మార్కెట్లో సాధారణ నాగుపాము విలువ గ్రాముకు పది వేల రూపాయలు మాత్రమే ఉంది. ఎక్కువ విషాన్ని ఇచ్చే కింగ్ కోబ్రా నుంచి తీసే విషం గ్రాము విలువ తొమ్మిదివేల రూపాయలు మాత్రమే ఉంది. తాము స్వాధీనం చేసుకున్న పాము విషం గాజు పాత్రలపై వైద్య అవసరాల కోసం తయారు చేసినట్లు ఫ్రెంచ్ కంపెనీ గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. వారు చెబుతున్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల్లో ఈ విషాన్ని వాడతారనే విషయం మనందరికి తెల్సిందే. ముఖ్యంగా పాముకాటుకు విరుగుడు మందును తయారు చేయడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాము కాటకు విరుగుడుగా ఇచ్చే యాంటీ వీనమ్ ఇంజెక్షన్ సీసా రేటు భారత్ మార్కెట్లో వెయ్యి రూపాయలకే లభిస్తోంది. అందులో విషం పాళ్లు తక్కువగానే ఉంటుంది. భారత ఔషధ కంపెనీలు పోలీసులు చెబుతున్నట్లుగా 1,75,000 రూపాయలకు గ్రాము విషాన్ని కొన్నట్లయితే వారు యాంటీ వీనమ్ వాయిల్‌ను వెయ్యి రూపాయలకు ఎలా సరఫరా చేస్తారు? అంతర్జాతీయ మార్కెట్లో చైనా గ్రాము విషాన్ని 4,500 రూపాయలకు విక్రయిస్తోంది. పైగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు వెయ్యి గ్రాముల పాము విషం అవసరం లేదు. బుల్లెట్ ప్రూఫ్ గాజుల్లో ఆ పాము విషం పొడిని సరఫరా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైగా అన్ని రకాల పాముల విషాలను కలిపినట్లయితే అవి మందుల తయారీ కంపెనీలకు ఎందుకూ పనికిరావు. ఎందుకంటే ఒక్కో జాతి పాము విషయం వారికి వేర్వేరుగా కావాలి. తాచు పాము విషాన్నే భారత ఔషధ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ‘ఇరులా స్నేక్ క్యాచర్స్ కోపరేటివ్’ అనే సంస్థ ఎంతో కాలంగా అధికారికంగా భారత ఔషధ కంపెనీలకు అవసరమైన విషాన్ని సరఫరా చేస్తోంది. పది కిలోల తాచుపాము విషాన్ని సేకరించాలంటే 35వేల పాముల నుంచి 35 ఏళ్లు సేకరిస్తే వస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. పాము విషం ఆరుదైనప్పటికీ గ్రాము విలువ లక్షల్లో ఉంటుందని అనుకోవడం అతిశయోక్తేనని ఆ సంస్థ తెలిపింది. పైగా ఫ్రెంచ్ కంపెనీ పేరు స్మగ్లింగ్ సీసాలపై ముద్రించి ఉన్నట్లు పోలీసులే చెబుతున్నారు. అలాంటప్పుడు భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలు నేరుగానే వాటిని దిగుమతి చేసుకోవచ్చు. వాటిని స్మగ్లింగ్ చేయాల్సిన అవసరమేలేదు. పాము విషం అన్నది వన్య జంతువుల సంరక్షణ చట్టం కిందకు వస్తోంది. మన దేశం దాటితే ఈ చట్టం ఎవరికి వర్తించదు. అలాంటప్పుడు ఫ్రెంచ్ పాముల విషాన్ని పట్టుకునే హక్కే మన పోలీసులకు లేదు. ఆ....రేవు పార్టీల్లో, మత్తు ఎక్కడానికి కుర్రకారు ఈ విషాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారని, అందుకనే దీనికి ఇంతరేటు పలుకుతున్నట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు కొంతమంది కుర్రవాళ్లు బానిలవుతున్న విషయం కూడా తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడా గ్రాము కొకైన్ తొమ్మిదివేల రూపాయలకన్నా ఎక్కువ ధరలేదు. అలాంటప్పుడు లక్షల రూపాయలు పెట్టి పాము విషాన్ని ఎందుకు కొంటారు? అంతేకాకుండా పాము విషాన్ని తాగినట్లయితే కడుపులోని ఆమ్లాలు ఆ విషాన్ని వెంటనే నిర్వీర్యం చేస్తాయి. ఎలాంటి ప్రభావం ఉండదు. అల్సర్లు ఉంటే ప్రమాదం. ఎందుకంటే పాము విషం చాలా వేగంగా నరాల వ్యవస్థ, జన్యు వ్యవస్థను దెబ్బతీస్తాయి. రక్త ప్రసారాన్ని కూడా అడ్డుకుంటాయి. అందువల్ల మనుషులకు ప్రాణం పోవడం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. భారత దేశంలో ఏటా 45వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. వారిలో ఒక్కరు కూడా తాము ఒకవిధమైన మత్తులో తేలిపుతున్న భావాన్ని వ్యక్తీకరించలేదు. భరించలేని బాధ తప్ప. ఇలాంటప్పుడు పాము విషం పేరుతో కొకైన్నే సరఫరా చేస్తున్నారా? ఎందుకంటే చూడడానికి పాము విషం పొడి, కొకైన్ పొడి ఒకేలా ఉంటాయి. కొకైన్‌తో దొరికిపోతే శిక్షలు పెద్దగా ఉంటాయి కనుక, పాము విషమని స్మగ్లర్లు నమ్మిస్తున్నారా? లేదా పోలీసులే చౌక ప్రచారం కోసం ఇన్ని కోట్ల విలువైన పాము విషాన్ని పట్టుకున్నామని చెబుతున్నారా? ఏదీమైనా తాము పట్టుకున్న పదార్థాన్ని ల్యాబ్ పరీక్షకు పంపించి అదేమిటో తేలాక పోలీసులు వాస్తవాలను పత్రికలకు వెల్లడిస్తే బాగుంటుంది. snake venom, smuggling, Cobra, anti venom injection, పాము విషం, స్మగ్లింగ్, కొకైన్, యాంటీ వీనమ్ ఇంజెక్షన్ -
కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్!
లండన్: కోకా కోలా ప్లాంట్‌లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్‌లో కలకలం రేపింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్‌లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్‌ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్‌ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- సిటీకి గోవా నుంచి కొకైన్ డ్రగ్ సరఫరా - రెండు ప్రాంతాల్లోని నైజీరియన్ల దందా - అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు - కొకైన్‌తో పాటు బ్రౌన్‌షుగర్ స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్‌షుగర్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్లు ఎల్.రాజా వెంకటరెడ్డి, పి.బల్వంతయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. వస్త్రవ్యాపారం ముసుగులో... నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 మధ్య బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చారు. కోయంబత్తూర్‌లో వస్త్రాలు ఖరీదు చేసి నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు. సొలోమెన్, చుకు, ప్రామిస్‌లు హైదరాబాద్‌లోని బండ్లగూడ, సైనిక్‌పురి, టోలిచౌకి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మిగిలిన నలుగురూ గోవాలో ఉంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొకైన్‌ను సమీకరిస్తున్న రఫెల్ దీన్ని విక్రయించడం కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికైనా డ్రగ్ సరఫరా చేయడానికి అనోరా, పీటర్లను వినియోగించుకునే వాడు. వీరిద్దరూ బస్సులు, రైళ్ళల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ ఇచ్చి వచ్చేవారు. రూ.2.5 వేలకు ఖరీదు, రూ.5 వేలకు విక్రయం... రఫెల్ ఈ మాదకద్రవ్యాన్ని గ్రాము రూ.2,500 నుంచి రూ.3 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీన్ని తన ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముతున్నాడు. ఈ ఏజెంట్లు ఆయా నగరాల్లో తమకు కస్టమర్లుగా ఉన్న విద్యార్థులు, యువతకు భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ప్రామిస్ అనే నైజీరియన్ జాన్ అనే మరో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొకైన్, బ్రౌన్‌షుగర్ ఖరీదు చేసి విక్రయిస్తున్నాడు. రఫెల్ అందరు నిందితులూ హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం అందుకున్న వెస్ట్, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్ళు ముర్తుజా, మధు, సందీప్ అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో సీసీఎస్‌లోని నార్కొటిక్ సెల్ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్నారు. బుధవారం ఏడుగురినీ అరెస్టు చేసి ‘సరుకు’, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వస్త్రాల రూపంలో స్వదేశానికి... ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల దందాలో సంపాదించింది మొత్తం తన స్వదేశానికి వస్త్రాల రూపంలో పంపేస్తున్నారు. ప్రతి డీల్‌లోనూ వచ్చిన లాభాలతో కోయంబత్తూర్‌లో రెడీమేడ్, ఇతర వస్త్రాలు ఖరీదు చేస్తున్నారు. వీటిని నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేస్తూ, తమ అనుచరులు ద్వారా అమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడుగరిలో అనేక మందిపై హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై తదితర నగరాల్లో కేసులున్నాయి. ఈ వివరాలన్నీ సేకరిస్తున్న పోలీసులు నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం యాంటీ నార్కొటిక్స్ సెల్‌కు అప్పగించారు. -
మహిళ వద్ద రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లయిట్లో దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 2 కిలోల కొకైన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సదరు విమానంలోని ప్రయాణికులు కొకైన్ తీసుకువస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. అందులోభాగంగా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే సదరు మహిళపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ... అదుపులోకి తీసుకుని... దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ మహిళ వద్ద ఉన్న ఐదు పుస్తకాలకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ కవర్లు ఉండడంతో విప్పి చూశారు. దీంతో పుస్తకాల పేపర్లలో కొకైన్ తీసుకువస్తున్నట్లు ఆమె అంగీకరించింది. 2 కేజీల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. -
ఆరెండూ కలిస్తే... ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయ్!
చెడు వ్యసనాలతో అనర్థాలు జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇతర దుర్వ్యసనాలకంటే ముఖ్యంగా మద్యం, కొకైన్ వ్యసనంగా కలిగిన వారు భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు అమెరికా అధ్యయనకారులు. ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఈ కొత్త విషయాలను తెలుసుకున్నారు. మోతాదులో మద్యం సేవించడం పెద్దగా ప్రమాదం కాదంటారు కొందరు. అయితే వ్యసనంగా మారినప్పుడు మద్యం కూడ ప్రాణాలమీదకు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యంతో పాటు కొకైన్ కూడ గణనీయంగా వినియోగించేవారు భవిష్యత్తులో ఆత్మహత్యాయత్నం చేసుకునే అవకాశం ఉంటుందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం అల్పెర్ట్ మెడికల్ స్కూల్ ప్రధాన అధ్యయన రచయిత సారా అరియాస్ చెప్తున్నారు. ముఖ్యంగా కొకైన్, మద్యాలను కలిపి తీసుకునేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నట్లు క్రైసిస్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో అరియాస్ వివరించారు. 2010-2012 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది సూసైడల్ ఎమర్జెన్సీ విభాగాల్లో చేరిన 874 మంది రోగుల వివరాలను అధ్యయనకారులు పరిశీలించారు. అంతేకాక ఇటీవల ఆత్మహత్యా ప్రయత్నం చేసిన, పదేపదే ఆత్మహత్యా ఆలోచనలు వస్తున్నాయంటూ చికిత్స పొందుతున్న ఇతరుల వివరాలను కూడ అధ్యయనకారులు ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లోని స్టాండర్డ్ కేర్ నుంచి సేకరించి విశ్లేషించారు. వీరిలో మొత్తం 298 మంది మద్యం దుర్వినియోగానికి పాల్పడిన వారు, 72 మంది కొకైన్ ఉపయోగించిన వారితోపాటు 41 మంది రెండూ కలపి వాడిన వారు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే గంజాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు, మత్తుమందులు, ఉత్ప్రేరకాలు సేవించే వారికన్నా... ముఖ్యంగా మద్యం కొకైన్ లు కలిపి సేవించిన వారే అత్యధికంగా ఆత్మహత్యా ప్రయత్నంతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకుల బృందం పేర్కొంది. విడిగా మద్యం సేవించేవారిని, విడిగా కొకైన్ సేవించేవారిని పరిశీలించినప్పుడు మాత్రం మద్యం సేవించేవారిలో అటువంటి ఆలోచన ఏమాత్రం లేదని, కొకైన్ సేవించేవారు అటువంటి ఆలోచనకు సరిహద్దుల్లో ఉన్నారని తెలుసుకున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. -
అవి వాడారో.. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది
న్యూయార్క్: కొకైన్, మత్తుపానీయాలువంటి మత్తుపదార్థాలు వాడే వారికి ఆత్మహత్య గండం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ రెండు అలవాట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన సామాన్య వ్యక్తులతో పోలిస్తే 2.4రెట్లు అధికమని చెప్తోంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన అల్పర్ట్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ సారా అరియాస్ 'మత్తుపానీయాలు, కొకైన్ వంటి మత్తుపదార్ధాలకు ఆత్మహత్యలకు సంబంధం ఉంది' అని అన్నారు. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన 874 మంది జాబితాను తీసుకొని వాటిని విశ్లేషించి ఈ వివరాలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. -
ఎయిర్ లైన్స్ స్టీవార్డెస్ బ్యాగ్ లో 30 కిలోల కొకైన్
లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళ తీసుకు వెడుతున్న క్యారీ బ్యాగ్ లో కొకైన్ ఉన్నట్లు గుర్తించామని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెల్లడించారు. విమాన సిబ్బందిగా భావిస్తున్న ఆమె... శుక్రవారం టర్మినల్ కు వచ్చి... అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని చూసి, తనతో తెచ్చిన బ్యాగ్ లు వదిలి తప్పించుకొని పారిపోయిందని స్పెషల్ ఏజెంట్ తిమోతి మాసినో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఈఏ తెలిపింది. అయితే నిందితురాలి ఆచూకీకోసం దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సోమవారం సాయంత్రానికి ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె ఏ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తోంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఖంగారుగా ఓ ఫోన్ కాల్ చేసిన తర్వాత అక్కడినుంచీ పారిపోయిన ఆమె ఏ భాషలో మాట్లాడిందన్నది సరిగా గుర్తించలేకపోయామని, అయితే ఆమె ఎస్కలేటర్ నుంచి పారిపోయేప్పుడు ఓ జత డిజైనర్ షూ వదిలి వెళ్ళిపోయిందని ఓ వార్తా సంస్థ తమ వెబ్ సైట్ లో వెల్లడించినట్లు లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు పోలీసులు, ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ అధికారులు తెలిపారు. -
కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !!
బెంగళూరు: అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. సినిమాల్లో చేసే స్మగ్లింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నిజ జీవితంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కొకైన్ నింపిన కండోమ్స్‌ను మింగి స్మగ్లింగ్ చేయటానికి యత్నించిన వ్యక్తిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇరోన్శ్యామురన్ పర్యాటక ముసుగులో కండోమ్స్‌లో కొకైన్ నింపుకుని వాటిని మింగేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో అతడు దిగిన వెంటనే అరెస్ట్ చేసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విరోచన మందులు ఇచ్చి కొకైన్ క్యాప్సుల్‌ను బయటకు తీశారు. కొకైన్ విలువ రూ. 3.71 లక్షలు ఉంటుంటుందని తెలుస్తుంది. -
మత్తెక్కువయితే మెదడు గోవింద!
న్యూయార్క్: కొకైన్ వంటి మత్తుపదార్థాలను శృతిమించి ఉపయోగించడంవల్ల మెదడుకు తీరని హాని కలుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అత్యధిక కొకైన్ వాడకంవల్ల బ్రెయిన్ తనను తానే తినేస్తుందని, మెదడులోని కణాలు వాటిని అవే తినేస్తాయని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు అధ్యయనకారులు తెలియజేస్తూ 'పెద్దమొత్తంలో కొకైన్ తీసుకోవడం మూలంగా మెదడులో నియంత్రణ అదుపుతప్పి, అందులోని కణజాలం పూర్తిగా హరించుకోవడం ప్రారంభమవుతుంది. అందులోని కణాలు వాటిని అవే తినేస్తాయి. దీనినే ఆటోపగి అంటారు' అని వారు చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. గర్భిణీగా ఉన్నవారు కొకైన్ తీసుకున్నా కూడా వారి గర్భంలోని శిశువు మెదడులో కూడా మృతకణాలు కనిపించినట్లు తెలిపారు. -
విదేశీయులపై నిఘా
ఎఫ్ఆర్ఆర్ఓతో పూర్తి సమన్వయం ఇతర విభాగాల నుంచీ సమాచారం వారి డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ సన్నాహాలు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ సిటీబ్యూరో: నైజీరియాకు చెందిన సోలా, శ్యాంసన్ ఎబూపా, అటోబ్ బోషా కెల్విన్, ఉజోమ్ ప్రామిస్ 90 గ్రాముల కొకైన్‌తో ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుబడ్డారు. సోలా గతంలోనూ అనేకసార్లు అరెస్టు కాగా.. ప్రామిస్ వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేశాడు. నైజీరియాకే చెందిన జాన్ ఉకో ఓకొన్ గంజాయితో సెప్టెంబర్‌లో గచ్చిబౌలి పోలీసులకు చిక్కాడు. గుర్తింపుపత్రాలను తనిఖీ చేయగా... ఇతడి వీసా గడువు ఏడాది క్రితమే పూర్తయినట్టు తేలింది. బహదూర్‌పుర, ఎస్బీ విభాగం పోలీసులు ఇటీవల పాతబస్తీలోకి కిషన్‌బాగ్, ఎంఎం పహాడ్, కిస్మత్పూర్ల్లో తనిఖీలు చేపట్టారు. అవసరమైన అనుమతులు లేకుండా శరణార్థులుగా నివసిస్తున్న పలువురు బర్మా దేశీయుల్ని గుర్తించారు. ఇలాంటి ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర నిఘా విభాగం (ఎస్బీ) అధికారులు సిటీలో నివసిస్తున్న విదేశీయులపై పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అదనపు పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి సన్నాహాలు ప్రారంభించారు. విద్య, ఉపాధి పేరుతో వచ్చి తిష్ట... శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో కుప్పతెప్పలుగా విద్య, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నిత్యం అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా వస్తున్న వారిలో సౌతాఫ్రికన్లు ఎక్కువగా ఉంటున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న సౌతాఫ్రికన్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్స్‌లో కీలకపాత్ర పోషిస్తూ పెడ్లర్స్‌గా మారుతున్నారు. వీరిని గుర్తించి పట్టుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది నగర పోలీసులకు ప్రస్తుతం అందుబాటులో లేవు. వెరిఫికేషన్ మెకానిజం కరువు... ఈ నల్లజాతీయులే కాదు... వివిధ దేశాల నుంచి సిటీకి ఎంత మంది వస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ప్రకారమే నివసిస్తున్నారా? అసలు ఎంతమంది ఉన్నారు? గడువు ముగిశాక తిరిగి వెళ్తున్నారా? అనేవి తనిఖీ చేయడానికి పోలీసు విభాగంలో పక్కా మెకానిజం అంటూ లేదు. నగరానికి వచ్చే ముందు ఓ చిరునామాను ఇచ్చిన విదేశీయుడు ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడా? అసలు అది నిజమైన అడ్రస్సేనా? అనేవి పరిశీలించడం సాధ్యం కావట్లేదు. ఎస్బీ విభాగం ప్రస్తుతం మాన్యువల్‌గా పని చేస్తుండటంతో పూర్తిస్థాయి నిఘా సాధ్యం కావట్లేదు. ఎఫ్ఆర్ఆర్ఓ రాకతో మరో ఇబ్బంది... ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ అనేది కొన్నాళ్ల క్రితం వరకు స్పెషల్ బ్రాంచ్ పరిధిలోనే ఉండేది. ఆపై ఈ బాధ్యతలు కేంద్రం ఆధీనంలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరోలోని ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) చేతికి వెళ్లింది. కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే వారి రిజిస్ట్రేషన్లు మాత్రమే స్పెషల్‌బ్రాంచ్ చేస్తోంది. దీని వల్లా సమస్య ఉత్పన్నం అవుతోంది. మరోపక్క ఐక్యరాజ్య సమితి శరణార్థి గుర్తింపు కార్డులు ఎంత మందికి జారీ చేసిందనేదీ ఎస్బీకి స్పష్టంగా తెలియట్లేదు. ఇదీ విదేశీయులపై నిఘాకు నగర పోలీసులకు అడ్డంకిగా మారుతున్న పరిణామమే. సాంకేతికతతో సమస్యల పరిష్కారం... ఈ తరహా సమస్యలన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించాలని స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిర్ణయించారు. సిటీ పోలీసు వద్ద అందుబాటులో ఉన్న విదేశీయుల డేటాతో పాటు ఎఫ్ఆర్ఆర్ఓ, ఇతర ఇమ్మిగ్రేషన్ విభాగాల నుంచీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించనున్నారు. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా సిటీకి ఎందరు, ఏ దేశాలకు చెందిన వారు ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వీసా గడువు ఏంటి? అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఫలితంగా స్థానిక పోలీసుల సహకారంతో వారిపై నిఘా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది. -
అధ్యక్షుడి భార్య మేనల్లుళ్ల అరెస్టు
న్యూయార్క్: వెనిజులా అధ్యక్షుడి భార్య సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల వద్ద కొకైన్ ఉన్నట్లు గుర్తించి తాము అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 కేజీల కొకైన్ అనే మత్తుపదార్థం అక్రమ రవాణాకు వారు కుట్రచేశారని ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ అరెస్టులతో మరోసారి వెనిజులా, అమెరికాల మధ్య విభేదాలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య పొరపొచ్చాలు ఏర్పడి ఇరు దేశాల్లో కూడా తమ తమ విదేశాంగ ప్రతినిధులను వెనక్కి పిలుచుకున్నారు. మళ్లీ ఇప్పటివరకు నియామకం చేయలేదు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈఫ్రెయిన్ ఆంటోనియో కాంపో ఫ్లోర్స్, ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ప్రెయితాస్ అనే వెనిజులా అధ్యక్షుడు మధురో సతీమణి మేనళ్లులను న్యూయార్క్ పోలీసులు హైతీ వద్ద అరెస్టు చేశారు. వీరిద్దరికి మత్తుతపదార్థాల అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. వారిద్దరిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. గత అక్టోబర్ నెలలో వీరిద్దరు కూడా అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్ చేసి 800 కిలోల కొకైన్ తరలించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై అమెరికాలోని అధికార యంత్రాంగం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం ఆధారాలు రికార్డు చేసినట్లు సమాచారం. -
40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుండి భారత్‌కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్‌ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
ఇది ‘డ్రగ్స్’ రాజధాని
-
ఇది ‘డ్రగ్స్’ రాజధాని
⇒మాదకద్రవ్యాలకు అడ్డాగా హైదరాబాద్ ⇒ ఏటా రూ. 150 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ స్మగ్లింగ్ ⇒ దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి రవాణా ⇒ ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలింపు ⇒ సినీనటుల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లల దాకా వీటికి బానిసలే ⇒ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించిన స్మగ్లర్లు ⇒ ఉన్నతస్థాయి ఒత్తిడులతో దర్యాప్తు చేయలేని స్థితిలో ఖాకీలు ⇒ అక్రమ రవాణాకు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న డ్రగ్స్ డీలర్లు ⇒ పేదరికంలో మగ్గుతున్న యువతకు గాలం వేసి స్మగ్లింగ్ ⇒ఇటీవలే పొట్టలో కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడిన మూసా యువత ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. యువత ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి కూడా. ఇటీవలే దక్షిణ అమెరికా నుంచి హైదరాబాద్‌కు పొట్టలో కొకైన్ ప్యాకెట్లను పెట్టుకుని స్మగుల్ చేస్తూ మూసా అనే మహిళ పట్టుబడిన విషయం తెలిసిందే. మూసా దొరికింది కాబట్టి ఈ విషయం అందరికీ వెల్లడైంది. బయటకు తెలియకుండానే హైదరాబాద్ మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఏటా దాదాపు 50 మంది స్మగ్లర్లు (మాదకద్రవ్యాల రవాణాలో ఆరితేరిన వారు) దక్షిణ అమెరికా దేశాల నుంచి వివిధ పద్ధతుల్లో కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. కానీ అతి తక్కువ సందర్భాల్లో ఒకరిద్దరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ‘కొకైన్‌తో వచ్చి చిక్కిన మూసా ఇలాంటి స్మగ్లింగ్‌కు కొత్త. అందువల్లే అనుమానాస్పద రీతిలో ఆమె పోలీసులకు సులువుగా పట్టుబడింది’ అని ఓ అధికారి చెప్పారు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ నలుగురు విదేశీయులు పట్టుబడ్డారు. అసలు ‘ఒకసారి వచ్చిన స్మగ్లర్ ఐదేళ్లదాకా మళ్లీ అదే మార్గంలో ప్రయాణించడు. తరచూ ప్రయాణం చేస్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో కొకైన్, హెరాయిన్ డీలర్లు కొత్తవారికి శిక్షణ ఇచ్చి పంపుతుంటారు. ఒక్కో స్మగ్లర్ తనకు కేటాయించిన అసైన్మెంట్ పూర్తిచేస్తే రవాణా చేసిన మాదకద్రవ్యం విలువలో 15 శాతం ఇస్తారు. అంటే కోటి రూపాయల విలువైన కొకైన్‌ను తెస్తే స్మగ్లర్‌కు 15 లక్షలు ఇస్తారు. కారణం ఏమిటో తెలియదు గానీ మాదకద్రవ్యాల డీలర్లు హైదరాబాద్‌ను హబ్‌గా ఎంపిక చేసుకుంటున్నారు..’’ అని ఈ నేరాలపై దర్యాప్తు చేసే ఓ సీనియర్ అధికారి వివరించారు. - సాక్షి ప్రత్యేక ప్రతినిధి వందల కోట్లలో.. ఏటా రూ.150 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు నగరానికి రవాణా అవుతున్నాయని నార్కోటిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. దక్షిణ అమెరికా లేదా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉంటుండడంతో... స్మగ్లర్లు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల నుంచి ప్రయాణిస్తున్నట్లుగా మాదకద్రవ్యాల డీలర్లు డాక్యుమెంట్లు చూపుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశస్తులు కూడా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పాస్‌పోర్టులు సంపాదించి వీటిని రవాణా చేస్తున్నట్లు ముంబై కేంద్రంగా సుదీర్ఘకాలం పనిచేసిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వస్తున్నట్లు అంచనా వేస్తున్న మాదక ద్రవ్యాల్లో మూడోవంతు సముద్ర మార్గం ద్వారా వస్తోందన్నారు. అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన అంశాలను నార్కోటిక్ విభాగం రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని.. పోలీసులు లోతుగా విచారణ జరపకపోవడం డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడానికి తోడ్పడుతోందని చెప్పారు. చివరకు సినిమా చిత్రీకరణలోనూ వినియోగించేదాకా వెళ్లిందని ఆయన వెల్లడించారు. ‘‘నాలుగేళ్ల క్రితం ముంబైలోని బాంద్రాలో ఓ సినిమా చిత్రీకరణ జరిగే ప్రదేశంలో రూ.10 లక్షల విలువైన కొకైన్ లభించింది. సినిమా చిత్రీకరణ సమయంలో నటీనటులకు మరింత ఉత్తేజాన్ని నింపేందుకు దీనిని వాడినట్లు ఆ తరువాత ఆరు మాసాలకు తెలిసింది..’’ అని ఆ అధికారి వెల్లడించారు. హైదరాబాద్‌కే ఎందుకు? కొకైన్ వాడుతూ, కొకైన్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయిన కేసులు నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందిన సంపన్న కుటుంబాల వారు హైదరాబాద్ శివార్లలో ‘రేవ్’పార్టీలు నిర్వహించుకుంటున్నారంటేనే ఇక్కడ డ్రగ్స్ ఎంత సులభంగా దొరుకుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు వస్తున్న మాదకద్రవ్యాలను వరంగల్, విశాఖపట్నం తో పాటు తమిళనాడు, గోవాలకు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఔరంగాబాద్, షోలాపూర్‌కు రవాణా చేస్తున్నారు. ఇందుకోసం 75% నైజీరియన్లు, 25% స్థానికులను వినియోగించుకుంటున్నారు. ముంబై నుంచి గోవాకు తరలింపులో ఇబ్బందుల కారణంగా స్మగ్లర్లు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. డబ్బు ఆశ చూపి.. ‘‘నువ్వు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని వారంలో సంపాదించే మార్గం చెపుతా. నేను అప్పగించిన అసైన్మెంట్ వారంలో పూర్తిచేస్తే నీకు పాతికవేల డాలర్లు (సుమారు రూ.16లక్షలు) ఇస్తా. నీకు ఇంగ్లిషు తెలుసు కాబట్టి విమానాశ్రయాల్లో అధికారులకు తెలివిగా సమాధానం చెప్పగలవు. దానికి నువ్వు సిద్ధమేనా...’’ ఓ డ్రగ్స్ డీలర్ చెప్పిన ఈ మాటలకు దక్షిణ అమెరికాకు చెందిన మూసా లొంగిపోయింది. ప్రాణాలకు తెగించి తన పొట్ట కింది భాగంలో కోటి రూపాయల విలువైన 56 కొకైన్ ప్యాకెట్లతో పయనమై.. హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడింది. ఆమె చెప్పిన సమాచారం ఆధారంగా కొలంబియాలో ఓ మాదకద్రవ్యాల డీలర్‌గా నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే తరహాలో మాదకద్రవ్యాల డీలర్లు పేదలకు వల వేసి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయిస్తున్నారు. సినీ పరిశ్రమలో.. మూడేళ్ల కింద ఓ సినీహీరో సోదరులకు, మరో సినీనటుడికి కొకైన్ అందజేస్తుండగా ఇద్దరు నైజీరియన్లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరెవరికి కొకైన్, హెరాయిన్ సరఫరా చేస్తున్నదీ చెప్పారు. అంతేగాకుండా వారి డైరీ ఆధారంగా డ్రగ్స్ వినియోగదారులను గుర్తిం చారు. అందులో సినీరంగానికి చెందిన అనేక మందితో పాటు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల కుటంంబ సభ్యులు ఉన్నారు. ఉన్నతస్థాయిలో ఒత్తిడులు రావడంతో వారెవరినీ పోలీసులు విచారించలేదు, కనీసం కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు చాలా ఉన్నా అడపాదడపా మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. కానీ రాజకీయ ఒత్తిడుల కారణంగా పోలీసులు ఆ కేసులను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. తెలుగు సినిమాకూ అంటిన ‘కొకైన్’.. పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అద్భుతమైన సీన్లు పండించేందుకు డ్రగ్స్ వినియోగించినట్లు తెలిసింది. చిత్రీకరణ పూర్తయిన తరువాత ఆ క్యారెక్టర్ పోషించిన వారికి కూడా తాము ఆ విధంగా నటించి ఉంటామని అనుకోరు. నాలుగేళ్ల క్రితం ముంబైలోని బాంద్రాలో ఓ హిందీ సినిమా చిత్రీకరణ సమయంలో అక్కడి పోలీసులు కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ దాదాపు ఏడాది కింద హైదరాబాద్ నగర శివార్లలో ఓ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు వెల్లడైంది. విదేశాల నుంచి భారత్‌కు మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ప్రధానపాత్ర పోషించిన ఓ నైజీరియన్‌ను ముంబై పోలీసులు విచారించినప్పుడు ఈ సంగతి బయటపడింది. సినిమా నిర్మాణం, చిత్రీకరణ జరిగిన ప్రదేశం వంటి వివరాలను కూడా వారు తెలుసుకోగలిగారు. కానీ ఆ సినిమా చిత్రీకరణ జరిగిన స్థలయజమానికి ఉన్నతస్థాయిలో ఉన్న పలుకుబడి దృష్ట్యా పోలీసులు విచారణ జరిపే సాహసం చేయలేదు. అంతా పెద్ద పెద్ద వాళ్లే.. ఏడాది కింద హైదరాబాద్‌లో కొకైన్‌తో ఓ నైజీరియన్ పట్టుబడ్డాడు. ఓ అజ్ఞాత వ్యక్తికి కొకైన్ అందజేయడం ఏజెంట్ అతనికి నిర్దేశించిన పని. పని పూర్తయ్యాక రూ.50 వేలు ఇస్తామనేది ఒప్పందం. అయితే ఏజెంట్ ఇచ్చిన కవర్లో ఏముందో తనకు తెలియదని ఆ నైజీరియన్ చెప్పాడు. కవర్ అందజేసిన వ్యక్తి వివరాలు గానీ, ఆ కొకైన్‌ను ఎవరికి అప్పగించాలోగానీ అతనికి తెలియదు. అసలు నిందితులను గుర్తించడానికి నైజీరియన్ కాల్‌డేటా తెప్పించిన పోలీసులు... అందులో ఉన్న నంబర్లు చూసి ఆశ్యర్యపోయారు. ఓ ప్రముఖ సినీ నిర్మాత కుటుంబానికి చెందిన వ్యక్తి... సినిమా రంగానికే చెందిన మరో వ్యక్తికి కొకైన్ అందజేయాల్సిందిగా ఈ నైజీరియన్‌ను పురమాయించారు. అయితే కాల్‌డేటాతో పరువు కలిగిన కుటుంబాల జోలికి వెళ్లవద్దంటూ ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిడుల కారణంగా పోలీసులు అటువైపు దృష్టి సారించలేదు. -
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
-
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మూసియా మూసా శరీర భాగం నుంచి కొకైన్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. దుబాయి నుంచి కొకైన్ అక్రమ రవాణా చేస్తూ దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళ నిన్న దొరికిపోయిన విషయం తెలిసిందే. ఉస్మానియ ఆస్పత్రి నుంచి మూసా శరీరం నుంచి ఇప్పటి వరకూ 24 కొకైన్ ప్యాకెట్లను వైద్యులు వెలికి తీశారు. కాగా అదుపులోకి తీసుకున్న మూసాను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు తొలుత ఆమెకు సీటీ స్కాన్, ఆ తర్వాతా ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించారు. వీటిని జననేంద్రియం, మలద్వారం నుంచి పొత్తి కడుపులోకి ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యులే పొత్తి కడుపులో ఉన్న ఒక ప్యాకెట్‌ను బయటికి తీశారు. మిగిలిన ప్యాకెట్లు తీయడం సాధ్యం కాకపోవడంతో సర్జికల్ వార్డుకు తరలించారు. రాత్రి ఏడు గంటలకు 'ఎనిమా' ఇచ్చారు. దాంతో మలద్వారం నుంచి 16-20 (క్యాప్సూల్స్ రూపంలో ఉన్నవి) డ్రగ్స్ బయట పడ్డాయి. ఒక్కో క్యాప్సూల్ ఒక అంగుళం మందం నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లు సహజంగా బయటకు రాకుంటే పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స చేసి వెలికి తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. -
కిలో కొకైన్కు... రూ.2.40 లక్షలు
‘సేవకు సేవ...సొమ్ముకు సొమ్ము’ అనేలా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. బంగారం, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇలా అందించి అలా బహుమతి సొమ్ము పట్టుకు పోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై : విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2012లో చెన్నై విమానాశ్రయంలో రూ.23 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. 2013లో ఈ అక్రమ రవాణా రూ.36 కోట్లకు పెరిగింది. 2014లో రూ.102 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జూలై మాసాంతానికే అంటే ఏడు నెలల్లోనే రూ.53 కోట్ల బంగారం పట్టుబడింది. ఇలా ఏడాదికి ఏడాది అక్రమ రవాణా పెరిగిపోవడంపై ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. విమానం ద్వారా విదేశాల నుంచి బంగారం, పలురకాల మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులు రహస్యంగా తమిళనాడుకు చేరుకుంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు కొందరు ఇదేపనిలో నిమగ్నమై ఉన్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు ప్రజల సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. సెంట్రల్ కస్టమ్స్, ఎక్సైజ్, కేంద్ర మత్తుపదార్థాల నిరోధక శాఖ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖలకు అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే బహుమానం ఇచ్చే విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. అయితే ఈ బహుమానం స్వల్పం కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం తెలుసుకుంది. ఈ కారణంగా బహుమతి మొత్తాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. గత నెల 31వ తేదీన ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఈ కొత్త బహుమతుల విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఒక కిలో బంగారం అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారికి గతంలో రూ.50 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని మూడింతలు అంటే రూ.1.50 లక్షలుగా పెంచారు. అలాగే వెండి రవాణా సమాచారం ఇచ్చిన వారికి కిలోకు రూ.1000 మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు. కొకైన్ అనే మత్తుపదార్థంపై గతంలో కిలోకు రూ.40 వేలు కాగా ప్రస్తుతం ఆరింతలు పెంచారు. అంటే రూ.2.40లక్షలు బహుమతిని అందజేయనున్నారు. హెరాయిన్, బ్రౌన్ షుగర్ తదితర మత్తుపదార్థాలపై కిలోకు గతంలో ఇస్తున్న రూ.20 వేలను రూ.1.20 లక్షలకు పెంచారు. గంజాయికి కిలోకు రూ.100 మొత్తాన్ని రూ.600 చేశారు. అలాగే కెట్టమైన్, ఎపిడ్రిన్, అంబిట్టమిన్ వంటి మత్తుపదార్థాల సమాచారం ఇచ్చినవారికి గతంలో ఎటువంటి ప్రతిఫలం ముట్టేది కాదు. అయితే ఇందులో కూడా మార్పులు తెచ్చారు. కెట్టమైన్కు రూ.700, ఎపిడ్రిన్‌కు కిలోకు రూ.180, అంబిట్టమిన్కు రూ.20 వేలు బహుకరించేలా నిర్ణయించారు. విదేశాల నుంచి రహస్యంగా విలువైన వస్తువులను తెచ్చుకుంటున్నవారి సమాచారం ఇస్తే, సదరు ప్రయాణికుడి నుంచి వసూలు చేసే కస్టమ్స్ సుంకంలో 20 శాతం బహూకరిస్తామని చెబుతున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమాచారం ఇచ్చినవారికి సైతం భారీ బహుమానాలను చెల్లించనున్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటూ అవసరమైతే రక్షణ కూడా ఇస్తామని చెబుతున్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని నేరుగా, ఫోన్ ద్వారా, ఉత్తరాలు, ఈ మెయిల్ ద్వారా చేరవేయవచ్చు. సమాచారం ఇచ్చినవారు తమ పేరు, చిరునామా తెలపాల్సిన అవసరం లేదు. అయితే రెండు పుట్టుమచ్చలు, ఎడమ అరచేతి రేఖలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇందు కోసం సదరు వ్యక్తులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, తామున్న చోటు సమాచారం ఇస్తే అధికారులే వారి వద్దకు వచ్చి పుట్టుమచ్చలు, చేతిరేఖలను నమోదు చేసుకుని వెళతారు. వీరి వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. గతంలో సమాచారం ఇచ్చినవారు బహుమతి మొత్తం కోసం నాలుగైదేళ్లు వేచి ఉండాల్సివచ్చేది, అయితే ఇకపై వెంటనే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకేం అక్రమ రవాణా అరికట్టడం ద్వారా దేశసేవ, భారీగా సొమ్ము ఇక మీ సొంతం. బహుమతుల జాబితా : ఒక కిలో కొకైన్కు రూ.2.40 లక్షలు, ఒక కిలో బంగారుకు రూ.1.50 లక్షలు, ఒక కిలో బ్రౌన్ షుగర్ రూ.1.20 లక్షలు, ఒక కిలో హెరాయిన్‌కు రూ.1.20 లక్షలు, ఒక కిలో కేట్టమైన్కు రూ.700 , ఒక కిలో గంజాయికి రూ.600 , ఒక కిలో ఎపిడ్రిన్‌కు రూ.180 . -
'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు'
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు డ్రగ్స్ ముఠా వివరాలను వెల్లడించారు. నలుగురు నైజీరియన్లతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్‌తో పాటు, 40 ప్యాకెట్ల గంజాయిని, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా పట్టుబడ్డవారిలో నల్గొండ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి ఓ సినిమాకు దర్శకత్వం వహించారని అలాగే అదే జిల్లాకు చెందిన పనాస రవి కూడా సినీ రంగానికి సంబంధించి వ్యక్తి అని తెలిపారు. వీరిద్దరు తప్ప... సినిమా రంగానికి చెందినవారితో డ్రగ్స్ ముఠాకు ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఆధారాలు లేకుండా తాము మాట్లాడలేమని ఆయన తెలిపారు. నిందితుల్లో నలుగురు నైజీరియన్లు ఇక్కడే ఉంటూ నిజాం కళాశాలలో చదివారని, వారిలో ఒకరికి వీసా గడువు పూర్తయినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారని డీసీపీ పేర్కొన్నారు. పట్టుబడ్డ నైజీరియన్స్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ...టాలీవుడ్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. కాగా ఈ కేసులో యువ నటుడు నందు పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్ని అవాస్తవాలేనని నందు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను జూబ్లిహిల్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 1లో యువ నిర్మాత సుశాంక్ రెడ్డి, మరో సినీ ప్రముఖుడికి శనివారం రాత్రి ఇద్దరు నైజీరియన్లు డ్రగ్స్ అందచేయడానికి వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు యువ నిర్మాతతో పాటు మరో ప్రముఖుడిని, ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని త్వరలో మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ల వద్ద లభించిన లాప్ ట్యాప్, సెల్‌ఫోన్ డాటా ఆధారంగా మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. -
కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ
కొచ్చి: కొకైన్ కలిగి ఉన్నకేసులో అరెస్టయిన మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసు కస్టడీకి అప్పగించారు. ఈ నెల 10 వరకు వారికి పోలీస్ రిమాండ్ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. మహిళలల్లో ముగ్గురు మోడల్స్, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. కొచ్చిలోని ఓ ప్లాట్‌లో ఇటీవల షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు. -
కొకైన్‌తో పట్టుబడ్డ హీరో
కొచ్చి: కొకైన్‌ని కలిగి ఉన్న మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మహ్మద్ నిషమ్ అనే వ్యాపారికి చెందిన ఫ్లాట్‌లో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు. చివరగా 'ఇతీహాస' చిత్రంలో ముఖ్యపాత్రలో నటించాడు. నిందితులని పోలీసులు విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. -
కొకైన్ అమ్ముతున్న భావి ఇంజనీర్లు!
ఈజీ మనీకి అలవాటు పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏకంగా కొకైన్ అమ్మకాలకు తెగబడ్డారు. తమిళనాడులో కొకైన్ కొని.. దాన్ని బెంగళూరులో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలను అనంతపురం ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు మరికొంతమంది కూడా ఈ ముఠాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడులో 13 లక్షల రూపాయలకు కొకైన్ కొని, దాన్ని రూ. 60 లక్షలకు అమ్మాలని అనుకున్నారని, బెంగళూరులో దీన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. కేవలం ఈజీ మనీకి అలవాటు పడటం వల్లే వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారని అన్నారు. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. -
టన్నుల కొద్దీ కొకైన్ స్వాధీనం!
మత్తు పదార్థాలు గ్రాముల్లో పట్టుబడితేనే పెద్ద వార్త అనుకుంటాం. అలాంటిది కిలోలు కాదు, క్వింటాళ్లు కాదు, టన్నుల కొద్దీ పట్టుబడితే డ్రగ్స్ ఏ స్థాయిలో సరఫరా అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్ అమెరికాలోని పెరూలో ఏకంగా 3.3 టన్నుల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌లోని బెల్జియం, స్పెయిన్లకు సరఫరా చేయడానికి సిద్ధం చేసిన షిప్‌మెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాను పట్టుకోవడానికి పెరూ పోలీసులు అమెరికా సహకారం తీసుకున్నారు. ఇద్దరు మెక్సికన్లను, ఐదుగురు పెరూవియన్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ సరఫరా వెనుక మెక్సికన్ డ్రగ్ ముఠాలు ఉండవచ్చుని పెరూ పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఒకేసారి టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడితే..!
-
‘మహా’ మత్తు
2013లో డ్రగ్స్మాఫియా వ్యాపారం - రూ.400 కోట్లు గ్రేటర్లో మత్తుకు బానిసలైన వారి సంఖ్య - 50 వేలు నగరంలో గ్రాము కొకైన్ ధర - రూ.4,000 నగరంలో ప్రతినెలా గంజాయి అమ్మకం - 1,500 కిలోలు హైదరాబాద్‌లో డ్రగ్ ముఠాలు - 40 డ్రగ్స్ మాయలో నగర యువత నిఘా నేత్రం నిద్రపోతోంది.. డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది... యువత కిక్కెక్కి తిరుగు తోంది... పెద్దోళ్ల ముద్దుబిడ్డల నుంచి అడ్డా కూలీల వరకు అందరినీ డ్రగ్స్ ముఠా విష వలయంలో బంధిస్తోంది.. రూ. 400 కోట్లు... భాగ్యనగరంలో ఒక్క ఏడాదిలో డ్రగ్స్ ముఠాలు దండుకుంటున్న మొత్తం ఇదీ అంటే ఆశ్చర్యం కలుగక మానదు... కనీసం 50 వేల మంది నగరవాసులు డ్రగ్సకు బానిసలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీరిలో 80 శాతం మంది యువతే. యువతుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈ జాడ్యం నుంచి బయటపడేందుకు 5 వేల మంది ఇప్పటికే డ్రగ్స్ డీఎడిక్షన్ సెంటర్స్‌ను ఆశ్రయించారు. ‘మతు’్తలో చిత్తవుతున్న మహానగరం పూర్తి వివరాలు ఇవీ.. గిరాకీ ఎంత...? నగరంలో ప్రస్తుతం ఒక గ్రాము కొకైన్ ధర రూ.నాలుగు వేలు. గత మూడేళ్లలోనే గంజాయి అమ్మకాలు నెలకు 500 కిలోల నుంచి 1500 కిలోలకు పెరిగాయి. విశాఖ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. స్వదేశానికి ఇలా... దక్షిణాఫ్రికా, కెన్యా, నైజీరి యాల్లో విరివిగా లభించే కొకైన్, బ్రౌన్షుగర్లను ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మీదుగా నగరానికి తీసుకు వస్తున్నారు. నేపాల్ సరిహద్దుల్లో దొరికే హెరా యిన్‌ను, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి గంజాయిని సేకరించి అక్కడే వీటిని మ్యాండ్రాక్స్, హెరాయిన్, కొకైన్, కెటామైన్ల రూపంలోకి మార్చి నగరానికి తీసుకొస్తున్నట్లు డీఐఆర్ పరిశీలనలో తేలింది. కొకైన్ తయారీకి ఉపయోగించే గసగసాల మొక్కలను కర్నాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపూర్ జిల్లాల్లో, తమిళనాడులోని నీలగిరిలో పండించి నగరానికి తీసుకు వస్తున్నారు. అసలు దొంగలు వీరే? రాజధానిలో డ్రగ్స్ ముఠాల వెనుక ఇతర దేశస్తుల పాత్ర ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేసుకుని విదేశాల నుంచి వచ్చే సరుకును గమ్యస్థానాలకు చేర్చే కార్యక్రమం పూర్తిగా వీరే నిర్వహిస్తున్నారు. నగరా నికి చెందిన ఉన్నత కుటుంబాలతోనూ వీరికి సంబంధాలున్నాయి. వీళ్ల ఫోన్ నంబర్ల నుంచి ప్రముఖులకూ కాల్స్ వెళుతుండటం గమనార్హం. డ్రగ్స్ తరలింపులో పట్టుబడిన ప్రతి వ్యక్తి సెల్ఫోన్లలో సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నంబర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, వారి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. తారలూ పాత్రధారులే..? ఇటీవల ఆరుగురు ప్రముఖ నటులు, ఎనిమిదిమంది తెలుగు నిర్మాతలకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు తేలింది. మాఫియాతో సంబంధాలున్న వారిలో 16 మంది సినీ ప్రముఖులు న్నారని సమాచారం. హీరో రవితేజ సోదరుడు (రఘు)కి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు గతంలో కేసులు నమోద య్యాయి. ఆయనను విచారించిన పోలీసులు ముగ్గురు హీరోయిన్లు, ఐదుగురు హీరోలతో ఉన్న లింకులను పసిగట్టారు. కానీ వాళ్లను అరెస్టు చేయలేదు. దానిమ్మలో హెరాయిన్.. పుస్తకాల్లో కొకైన్.. డ్రగ్స్ తరలింపునకు మాఫియా కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. స్థానిక యువతకు కొరియర్ కంపెనీల్లో ఉద్యోగాలిచ్చి మత్తు పదార్థాలను హైదరాబాద్‌కు తరలిస్తుంది. హెరాయిన్‌ను దానిమ్మ కాయ లోపల, బీర్ టిన్‌లో, షూస్ అడుగు భాగంలో, వాహనాల బ్యాటరీ మధ్యలో, ఎల్పీజీ సిలిండర్లలో పెట్టి రవాణా చేస్తున్నారు. కొకైన్‌ను పుస్తకాలు, పెన్నుల మధ్యలో పెట్టి సరఫరా చేస్తున్నారు. అడ్డుకోవడంలో అడ్డంకులు నగరంలోకి మాదకద్రవ్యాల సరఫరా ఎంత కట్టడి చేసినా అడ్డుకో వడం కష్టమని నిఘా వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. పబ్బులు, డ్రగ్ కల్చర్ నానాటికి నగరంలో విస్తరిస్తోంది. యువతలో ఎక్కువ మంది బడాబాబుల బిడ్డలు కావడంతో అడ్డంకులు తప్పడంలేదు. మత విశ్వాసాల వినియోగం.. కొన్ని విగ్రహాలు ఇక్కడి నుంచి మలేసియా, సింగపూర్‌కు ఎగుమతి అవుతాయి. ఇవి మత విశ్వాసాలకు ప్రతీక. ఈ కారణంగా వీటిని తనిఖీ చేయాలంటే పోలీసులకు ఇబ్బంది. దీన్ని ఆసరాగా తీసుకొని విదేశాల్లో భారీ గిరాకీ ఉన్న ఎఫిడ్రిన్‌ను విగ్రహాల మధ్యలో పెట్టి తరలిస్తున్నారు. సింగపూర్‌లో ఎఫిడ్రిన్ ధర కిలో రూ.50 లక్షల వరకు పలుకుతోంది. అలాగే, కెనడా నుంచి దిగుమతి అయిన టవల్స్ నుంచి ఇటీవల కిలోల కొద్దీ ఎఫిడ్రిన్‌ను నగరంలో స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఒక్క శ్రుతి బల్క్ డ్రగ్స్ కంపెనీయే మూడేళ్లలో 3,300 కిలోల కేటామిన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్లను అక్రమంగా దిగుమతి చేసిందని ఔషధ నియంత్రణ పరి పాలన మండలి డీజీ తెలిపారు. అనుమతి లేని ఈ సంస్థపై దాడులు కూడా చేశారు. ఇలాంటి పలు కంపెనీల్లో పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు ఉండే అవకాశం ఉంది. -
కర్నూలులో కొకైన్ పట్టివేత
కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో కర్నూలు కొత్త బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు ప్యాకెట్లలో భద్రపరిచిన కొకైన్(మత్తు పదార్థం)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సులో కొకైన్‌ను తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో సీఐలు కృష్ణకుమార్, రాజశేఖర్ గౌడ్, పద్మావతి, ఎస్ఐలు ప్రసాదరావు, నాగమణి, రమణ తదితరులను అప్రమత్తం చేశానని తెలిపారు. వీరు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద కాపు కాసి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన బొల్ల శివశంకర్, జి.కొండూరు గ్రామానికి చెందిన కొర్లపాటి సుబ్బారావు, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అనూషలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే 300 గ్రాముల కొకైన్‌ను స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అనూష, శివశంకర్, సుబ్బారావు ముఠాగా ఏర్పడి ఆరు నెలలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఈ కొకైన్‌ను విజయవాడలో కొని, బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. -
ఢిల్లీలో రూ. వంద కోట్ల హెరాయిన్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ 47 కిలోలు, కొకైన్ 2 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ 100 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్ నుంచి డ్రగ్స్ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు బటాలా జిల్లా నుంచి వీటిని అక్రమ రవాణా చేసుకున్నట్టు భావిస్తున్నారు. శ్రీలంకతో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ.40 కోట్ల విలువైన ఎనిమిది కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఈ మాదకద్రవ్యాన్ని శుక్రవారం స్థానిక ఐదు నక్షత్రాల హోటల్లో స్వాధీనం చేసుకొని అమోబీ చిజిఓకే ఒబినికా అనే నైజీరియన్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో ఓ ఖరీదైన లాడ్జికి అమోబీ దీనిని తీసుకెళ్తుండగా అరెస్టు చేశామని ఎన్సీబీ తెలిపింది. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది ఇంత భారీగా కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో మత్తుమందుల వ్యవసపరులు దీనిని తీసుకోవడానికి చాలా ఇష్టపడుతారని ఎన్సీబీ డెరైక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ తెలిపారు. అయితే ఈ నెల 26న ఢిల్లీకి వచ్చిన నిందితుడు కొకైన్‌ను తన వెంట తీసుకురాకుండా వేరే విమానంలో పార్సిల్ బుక్ చేశాడు. మరునాడు అది ఇతని హోటల్ గదికి కొరియర్లో రావాల్సి రావాల్సి ఉంది. ఇతని కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు నిఘా వేశారు. హోటల్ లాబీలో ఇతడు కొరియర్ కోసం ఎదురుచూస్తుండగానే అరెస్టు చేశారు. అమోబీపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని, అయితే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగ్ చెప్పారు. విద్యార్థులకు భారీగా డ్రగ్స అందుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. అన్మోల్ సర్నా అనే ఎన్ఐఆర్ విద్యార్థి ఇటీవల మాదకద్రవ్యాలు వికటించడంతో హింసాత్మకంగా మారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే. ూజీజ్ఛటజ్చీ -
ఫ్రాన్సులో 1.3 టన్నుల కొకైన్ స్వాధీనం
ఎక్కడైనా కిలో, పది కిలోల కొకైన్ పట్టుబడటం చూశాం. కానీ ఫ్రాన్సులో కస్టమ్స్ ఏజెంట్లు ఏకంగా 1.3 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. వెనిజులా నుంచి ప్యారిస్ వచ్చిన ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఇది ఉన్నట్లు ఫ్రెంచి అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. చార్లెస్ డి గాలీ విమానాశ్రయానికి వచ్చిన కార్గో విమానంలో పలు సూట్‌కేసులలో ఈ కొకైన్ ఉంది. దీని విలువ దాదాపు 433 కోట్ల రూపాయలు!! కారకాస్ నుంచి ఈ విమానం ప్యారిస్ వచ్చింది. ఫ్రాన్సుకు తమ దేశంనుంచి కొకైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరో తెలుసుకోడానికి తాము దర్యాప్తు చేయనున్నట్లు వెనిజులా అటార్నీజనరల్ కార్యాలయం తెలిపింది. డ్రగ్స్ రవాణాను అడ్డుకోడానికి అంతర్జాతీయ ఒప్పందాలపై వెనిజులా తగినవిధంగా స్పందించడంలేదని అమెరికా ఇటీవలే ఆరోపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కొకైన్‌ను ఉత్పత్తి చేసే కొలంబియాతో వెనిజులాకు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది!!