మత్తెక్కువయితే మెదడు గోవింద!
న్యూయార్క్: కొకైన్ వంటి మత్తుపదార్థాలను శృతిమించి ఉపయోగించడంవల్ల మెదడుకు తీరని హాని కలుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అత్యధిక కొకైన్ వాడకంవల్ల బ్రెయిన్ తనను తానే తినేస్తుందని, మెదడులోని కణాలు వాటిని అవే తినేస్తాయని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపింది.
దీనికి సంబంధించిన వివరాలు అధ్యయనకారులు తెలియజేస్తూ 'పెద్దమొత్తంలో కొకైన్ తీసుకోవడం మూలంగా మెదడులో నియంత్రణ అదుపుతప్పి, అందులోని కణజాలం పూర్తిగా హరించుకోవడం ప్రారంభమవుతుంది. అందులోని కణాలు వాటిని అవే తినేస్తాయి. దీనినే ఆటోపగి అంటారు' అని వారు చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. గర్భిణీగా ఉన్నవారు కొకైన్ తీసుకున్నా కూడా వారి గర్భంలోని శిశువు మెదడులో కూడా మృతకణాలు కనిపించినట్లు తెలిపారు.