Brain
-
మనిషి మెదడులో రహస్య గదులు..
-
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్‌వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్‌వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్‌వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్‌వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్‌గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్‌లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్
ఇది మామూలు హెల్మెట్ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్. ఈ హెల్మెట్ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ఈ హెల్మెట్‌ను ‘ఐ సింక్వేవ్’ పేరుతో రూపొందించింది.మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్ ప్యాచ్‌లు, జెల్ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.ఇది రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్లు (రూ. 41.04 లక్షలు). -
Health: డొక్క శుద్ధి.. బుర్రకు బుద్ధి!
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..కడుపు–మెదడు కనక్షన్ ఇలా..– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది – కడుపు నిండగానే ‘జీఎల్పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందంటే..మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.గట్ హెల్త్ దెబ్బతింటే..పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్‌లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌లో కివి, ఆఫ్రికాట్లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్‌ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్‌ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి.. -
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
అంధమైన వెలుగు
చికాగో వేదికగా అంధులకు చూపు తెప్పించేందుకు ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న తొలి ప్రయోగాలు బ్రియాన్ బసార్డ్ అనే వ్యక్తిపై జరుగుతున్నాయి. పదహారో ఏట అతడి ఎడమకన్ను పోయింది. ఎలాగోలా నెట్టుకొస్తుండగా 48వ ఏట అతడి రెండో కన్నూ దృష్టిజ్ఞానాన్ని కోల్పోయింది. వైర్డ్ మ్యాగజైన్ కథనం ప్రకారం... ఇలాంటి అంధుల మెదడులో అమర్చే కొన్ని చిప్స్, బయట ఉండే వైర్లెస్ ఉపకరణం సహాయంతో చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం చికాగో ట్రయల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు స్పెయిన్‌లోని మిగ్యుయెల్ హెర్నాండెజ్ యూనివర్సిటీ పరిశోధకులూ ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కార్టిజెంట్ అనే సంస్థ ‘ఓరియాన్’ అనే ఉపకరణాన్ని రూపోందించి, ఆరుగురు వలంటీర్లకు ప్రయోగాత్మకంగా అమర్చింది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘న్యూరాలింక్’ సంస్థ కూడా అంధులకు దృష్టిజ్ఞానం తెప్పించే దిశగా పనిచేస్తోంది. ఇందుకోసం బ్రెయిన్ ఇం΄్లాంట్స్ రూపోందించి ప్రయోగాలు చేస్తోంది. వాళ్ల దగ్గర తయారవుతున్న ఇంపాంట్కు ‘బ్లైండ్‌సైట్’ అని పేరు పెట్టారు. కోతులకు అమర్చిన ఈ ‘బ్లైండ్‌సైట్’తో మంచి ఫలితాలే వచ్చాయనీ, ఇకపైన దాన్ని మానవులపై ప్రయోగించి చూడాల్సిందే మిగిలి ఉందని ‘న్యూరాలింక్స్’ పేర్కొంది. అయితే చూడటం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాలపట్ల చాలామంది నిపుణుల నుంచి సందేహాత్మకమైన అభి్రపాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో దృష్టిజ్ఞానం ఉండి తర్వాత చూపు కోల్పోయిన వారికే ఈ ఇం΄్లాంట్స్ అమర్చుతున్నారు. అయితే ఈ బ్లైండ్‌సైట్ ఉపకరణం కేవలం గతంలో చూపున్న వారికి మాత్రమే కాకుండా పుట్టు అంధులకూ దృష్టిజ్ఞానం కలిగించగలదన్నది ఎలాన్ మస్క్ చెబుతున్న మాట. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తయారవుతున్న ఉపకరణాలన్నీ రెటీనా, ఆప్టిక్ నర్వ్ ప్రమేయం లేకుండానే నేరుగా మెదడుకు దృష్టిజ్ఞానం కలిగించేలా రూపోందుతున్నాయి. మెదడులో అమరుస్తున్న చిప్స్... కొన్ని విద్యుత్తరంగాలతో అక్కడి న్యూరాన్లను ఉత్తేజితం (స్టిమ్యులేట్) చేయడం... ఫలితంగా మెదడులోని విజువల్ కార్టెక్స్లో చూస్తున్న దృశ్యం ఒక చుక్కల ఇమేజ్‌లా కనిపిస్తుంది. (విజువల్ కార్టెక్స్ అంటే... రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా కాంతి మెదడుకు చేరాక దృష్టిజ్ఞానం కలిగించేందుకు మెదడులోప్రాంసెసింగ్ జరిగే మెదడులోని ప్రాంతం.అయితే ఇప్పుడిది ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో జరుగుతున్న ప్రక్రియ కావడంతో ఇందులో వాస్తవ కాంతి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగి΄ోతుంది. వీటి సాయంతో కనిపిస్తుందనే ఆ ఇమేజ్ కూడా అస్పష్టమైనది. ఆ డివైజ్ కారణంగా కనిపించే అస్పష్ట దృశ్యాలూ, దృష్టిజ్ఞానపు పరిమితులూ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం జరుగుతున్నవారికి ప్రతిరోజూ కొన్ని సూచనలివ్వడం జరుగుతోంది. ఉదాహరణకు వారు గుర్తిస్తున్నదేమిటీ, ఒకవైపు వెళ్లమన్న తర్వాత వారు ఆ దిశగా వెళ్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలేమిటన్న అంశాలను బట్టి... డివైస్‌లను మరింత మెరుగుపరిచేందుకు రోజూ ప్రయోగాలు జరుగుతున్నాయి. దృష్టిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరిచే దిశగా వారికి ఎదురవుతున్న సవాళ్లలో మరో అంశం ఏమిటంటే... ఒక పక్క దృష్టిజ్ఞానం కల్పిస్తూనే, ఈ స్టిమ్యులేషన్స్ వల్ల వారికి వేరే అనర్థాలు రాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉదాహరణకు... ఈ ఎలక్ట్రిక్ స్పందనలు మెదడులోని ప్రదేశాలకు తాకినప్పుడు అవి సీజర్స్, మూర్ఛ వంటివి వచ్చేలా మెదడును ప్రేరేపించకూడదు. కంటిన్యూవస్‌గా ఎలక్ట్రిక్ తరంగాలకు గురవుతున్నందు వల్ల మెదడులో స్కార్ ఏర్పడే అవకాశముందా, అప్పుడు మెదడుకు హానిచేయని విధంగా ఈ ఉపకరణాల రూపకల్పన ఎలా అన్న సవాలు కూడా మరో ప్రతిబంధకం. ప్రస్తుతానికి ఇలాంటి పరిమితులు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో చూపులేనివారికి దృష్టిజ్ఞానం కల్పించగలమనే నమ్మకం పెరుగుతోందన్నది పరిశోధకుల మాట.ఎలాన్ మస్క్ ట్వీట్ మా ‘బ్లైండ్‌సైట్’ ఇంప్లాట్స్ ఇప్పటికే కోతుల్లో బాగా పనిచేస్తోంది. మొదట్లో స్పష్టత (రెజెల్యూషన్) కాస్త తక్కువే. అంటే తొలినాళ్లలో వచ్చిన ‘నింటెండో గ్రాఫిక్స్’ మాదిరిగా. కానీ క్రమంగా మానవుల నార్మల్ దృష్టిజ్ఞానంలాగే ఉంటుంది. (ఇంకా ఏమిటంటే... ఈ న్యూరాలింక్ వల్ల ఏ కోతీ చనిపోలేదూ, ఇంకేకోతికీ హాని జరగలేదు).పైది ‘ఎక్స్’ (ట్వీటర్)లో 2024 మార్చి 21న ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్. -
డ్యాన్స్ చేస్తే ఆ వ్యాధులు రావు! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జిమ్‌కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్‌ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్నెస్ కోసం నృత్యానికి మించిన వర్కౌట్ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్‌కి, కొన్ని స్టెప్లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్‌గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్ చేస్తారు. ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి చెక్ పెడుతుంది..డ్యాన్స్ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్ మూవ్మెంట్లు డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్ డ్యాన్స్. రెగ్యూలర్ డ్యాన్స్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ ఉండేందుకు ఉపకరిస్తుంది. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(చదవండి: రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
భారత్‌లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
Soaked Walnuts : వాల్ నట్స్ నానబెట్టి తినాలా? మామూలుగా తినాలా?
వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెదడు ఆకారంలో ఉండే దీనివలన జ్ఞాపకశక్తికి మంచి ఉపయోగం ఉటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రధానంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటి వాల్నట్ను నానబెట్టి తింటే దాని లాభాలు రెట్టింపవుతాయి. వాల్నట్లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినడం ఉత్తమమైన మార్గం. 2-4 వాల్నట్ ముక్కలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.నానబెట్టిన వాల్నట్-ఆరోగ్య ప్రయోజనాలుమెదడుకు మంచిది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి. బరువు : తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన వాల్నట్స్ బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కారణంగా పెద్దగా ఆకలి వేయదు. వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఖనిజాలు ఫైబర్ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగు ఎముకలకు బలమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో లభిస్తాయి.చర్మ ఆరోగ్యం: ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. మెలటోనిన్, పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఎండనుంచి చర్మాన్ని రక్షించడంలో సాయపడతాయి.మధుమేహులకు వాల్నట్ గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తికి మంచిది వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.నిద్రకు: వాల్‌నట్స్‌లో సహజసిద్ధమైన మెలటోనిన్ రసాయనం కారణంగా మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ చాలా సంవత్సరాలుగా మనకు మంచి నిద్రను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాదరణ పొందింది. నానబెట్టిన వాల్నట్లను ఉదయం , పడుకునే ముందు తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యం: నానబెట్టిన వాల్నట్న్ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ వాల్‌నట్‌లతో పోలిస్తే, నానబెట్టిన తరువాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆ పోషకాలను బాడీ కూడా సులభంగా గ్రహిస్తుంది. ఇందులోని ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచుతాయి. -
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్‌కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్ -
మీ బ్రెయిన్ ఆక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! -
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ చాలా బిజీ అనే చెప్పొచ్చు. పక్కోడితో మాట్లాడే టైం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు మనుషులు. ఇలా బిజీగా ఉన్నాం అని చెప్పడాన్ని కొందరూ స్టేటస్ ఆఫ్ సింబల్‌గా ఫీలవ్వుతారు. ఎంత బిజీ అంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తిమీద వేసుకోండి. ఇలా క్షణం తీరిక లేకుండా ఉండటం చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే అత్యంత డేంజరని చెబుతున్నారు. ఎందువల్ల అంటే..? చాలామంది వర్క్ లైఫ్‌లో బిజీగా ఉన్నామని కనీసం స్నేహితులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదని వాపోతుంటారు. చాలామంది తమ భాగస్వామికి, కడుపున పుట్టిన పిల్లలకు కాస్త కూడా టైం ఇవ్వరు. దీన్ని క్షణం తీరిక లేనితనం అంటారు. ఇది క్రమేణ వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపి, నాణ్యతలేని పనితీరుకి దారితీసి మీ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే పనిచేయడం అన్నది ముఖ్యమే. కానీ సమయాన్ని సమృద్ధిగా వినియోగించుకునేలా చేసుకుని సకాలంలో అన్నింటిని చేయగలిగేలా కేటాయించుకోవాటలి. అందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. మానసిక శ్రేయస్సుని పెంపొందించేలా క్షణం తీరిక లేని బిజీని అధిగమించేలా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్లు, ఫోన్కాల్లు, మీటింగ్‌లు వంటి వాటిన్నింటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. కనీసం వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని నిమిషాలు మిగిలేలా చేసుకుండి. ఆ కొద్ది సమయంలో చేయాలనుకుంటున్న ఎంజాయ్‌మెంట్‌ని ఫుల్ జోష్‌గా చేయండి. అంటే వాకింగ్, లేదా కాసేపు మీతో మీరు గడపటం లేదా మీకు నచ్చిన వాళ్లతో తుళ్లుతూ హాయిగా గడటం వంటివి చేయండి. ఇది మీకు మానసికంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది. పైగా పనితీరు నాణ్యత మెరుగుపడుతుంది. ఎంతటి బిజీలో అయిని కొన్ని నిమిషాల ఫ్రీడమ్‌ని జరుపుకోవాలి. అది మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా ఏదైన షెడ్యూల్ పూర్తి అయిని వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగిపొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్‌గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్. ఒక్కోసారి ఆలస్యంగా పనులు అయ్యాయని..అనుకున్నట్లుగా త్వరతిగతిన పనులు కాలేదని బెంత్తిపోనవసరం లేదు. మిగతా వ్యక్తిగత పనులను తొందరగా చేసుకునేలా ట్రై చేయండి చాలు. లేదా ఈ రోజు కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ టైం విరామం తీసుకున్నామని అనుకోండి తప్ప విరామం తీసుకోవడం మాత్రం స్కిప్ చెయ్యొద్దని చెబుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ తొందరగా ఆఫీస్ పనులు పూర్తి చేయాలనకుంటారు. ఒక్కొసారి పలు కారణాల వల్ల ఆసల్యం అవుతాయి. దీంతో ఆగ్రహం తెచ్చుకోవద్దు. మరో అవకాశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఆ దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి టైం మిగిల్చుకోలేకపోయిన మరోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుని ఎంజాయ్ చేయొచ్చన్న ఫీలింగ్ మనలో తెలియకుండానే ఒత్తిడిని జయించేలా చేస్తుంది. ఫలితంగా మెదుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. (చదవండి: వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె..?) -
పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..!
పిల్లలు పొద్దస్తమానం చదివితేనే అనేక విషయాలు తెలుస్తాయని, వారి పరిజ్ఞానం పెరుగుతుందని, వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలన్నా వారికి తగినంత శారీరక శ్రమ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఆలోచనా శక్తికి, బుర్రకు పదును పెట్టే కొన్ని ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెన్నిస్పిల్లలు గానీ, పెద్దలు గానీ టెన్నిస్ ఆడితే అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. టెన్నిస్ ఆడినప్పుడు శరీరంలోని కండరాలన్నీ కదులుతాయి. శారీరక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం ఏర్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అంచనావేయడం, సమయస్ఫూర్తి వంటివి పెంపొందుతాయి. బంతాటబంతాట అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. అయితే వారికి ఊరికే ఏదో బాల్ ఇచ్చి ఆడుకోమని వదిలేయకుండా, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో బాస్కెట్‌బాల్ రింగ్ తయారు చేసి, కొన్ని బంతులను వారికి ఇచ్చి, ఆడుకోమని చెప్పాలి. ఒక్కో బంతిని తీసి, ఆ రింగ్‌లో వేయమని వారికి సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య సమన్వయం మరింత మెరుగవుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సైక్లింగ్సైక్లింగ్ చేసేప్పుడు పిల్లలు కింద పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాలెన్సింగ్ నైపుణ్యాలను చక్కగా నేర్చుకుంటారు. పోటీతత్వం, ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడం వంటివి సైక్లింగ్ సాయంతో మరింతగా తెలుసుకుంటారు. సైక్లింగ్ శరీరానికీ మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతుంటారు. ఈతచిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే వారికి స్విమ్మింగ్ నేర్పించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్ మెదడును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వాన్ని నేర్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. కరాటే, కుంగ్ ఫూకరాటే, కుంగ్ ఫూ మొదలైనవి శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడేలా చేస్తాయి. ఏకాగ్రత, అవతలివారిని గౌరవించడం, అవసరమైనప్పుడు తమని తాము కాపాడుకోవడం, పట్టుదల, మానసిక పరిపక్వత మొదలైన లక్షణాలెన్నో కరాటే, కుంగ్ ఫూ వలన అలవడుతాయి. -
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
మెదడులో చిప్.. చెస్ ఆడించారు
ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ గర్వంగా ప్రకటించుకున్నారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి మైండ్ కంట్రోల్ చిప్ సాయంతో అతనితో చెస్ ఆడాడు. తద్వారా చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్‌కు చెందిన కంపెనీ న్యూరాలింక్ కార్పొరేషన్ అరుదైన ఫీట్ సాధించింది. ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చి.. అతని మైండ్ సాయంతో(Telepathically) ఆన్లైన్లో చెస్ ఆడిస్తూ అదంతా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. క్వాడ్రిప్లెజియా(కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన) పేషెంట్ అయిన నోలన్ అర్బాగ్ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్‌ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు అర్బాగ్. https://t.co/OMIeGGjYtG — Neuralink (@neuralink) March 20, 2024 Today, we might see the first human Neuralink patient controlling a phone and a computer with his brain. Neuralink to go live on 𝕏 at 2:30pm PST pic.twitter.com/vQxMem3ih7 — DogeDesigner (@cb_doge) March 20, 2024 ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. కంప్యూటర్ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్‌లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విజయం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లతో న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు. Neuralink's first ever patient demonstrating telekinetic abilities - controlling laptop, playing chess by thinking - using their implanted brain chip "Telepathy".#Neuralink #Telepathy #Telekinesis #Brainchip https://t.co/Qd7ZBdCPDK pic.twitter.com/uejICSs8R0 — Orders of Magnitude (@ordrsofmgnitude) March 21, 2024 2016లో బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ను ఎలన్ మస్క్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. వైకల్యాలున్న వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్. ఈ క్రమంలో న్యూరాలింక్ తయారు చేసిన ఈ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్‌ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చినట్లు.. అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తే ఈ నోలన్ అర్బాగ్. ఎలా పనిచేస్తుందంటే.. న్యూరాలింక్ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. న్యూరాలింక్ కంటే ముందే.. ఈ తరహా ప్రయోగాలు న్యూరాలింక్‌తో పాటు మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. న్యూరాలింక్ కంటే ముందే.. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. -
మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా?
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే. అపోహ ఎలా మొదలైంది? 1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు. ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు. తేడా గమనించండి.. మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. అపోహల నుంచి బయటపడండి.. మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు? తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది.. ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు.. ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక.. తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం.. తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం.. మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి. జ్ఞానమెలా వస్తుందంటే.. మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్మెంట్లు, జిమ్‌లో కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్‌గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్ అమర్చాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే మంచి వ్యాయాయంతో తిరిగి ఫిట్ నెస్‌ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది. తాను చాలా హ్యాపీ గోయింగ్ మనిషిని అని తెలిపింది. అలాగే తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్‌కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. -
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్‌ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్‌ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. ఏడాదిలో 11 మంది మృతి!
పాకిస్తాన్ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలిచే ఈ ఏక కణ జీవి ఇప్పటి వరకు 11 మందిని బలిగొంది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం. మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్‌లోని కరాచీ బఫర్ జోన్లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు. పాకిస్తాన్లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్ఫెక్షన్ (ఎన్ఎఫ్ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని ఖలీద్ నియాజ్ కోరారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా సోకుతుంది? బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు? -
తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..
కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది. రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్‌కి సీటీ స్కాన్ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్‌ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయత్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు. పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్ ప్రాంతంలో సఖాలిన్లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు. విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్‌కి ఎడమ ప్యారిటల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు. (చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!) -
ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..
మెదడులో సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేయడం గురించి విన్నారా?. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఏదో ఎలక్ట్రిక్ స్విచ్ని ఆఫ్ చేసినట్లుగా ఓ ఆరేళ్ల చిన్నారి మెదడుల సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేశారు. ఎందుకిలా? ఏం జరిగింది ఆ చిన్నారికి తదితరాల గురించే ఈ కథనం.! వివరాల్లోకెళ్తే.. యూఎస్‌లోని ఆరేళ్ల చిన్నారి బ్రియానా బోడ్లీ అరుదైన మెదడువాపు వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి పేరు రాస్ముస్సేన్కి సంబంధించిన మెదడువాపు వ్యాధి. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని రాస్ముస్సేన్స్ ఎన్సెఫాలిటిస్ అనే మెదడు వాపు వ్యాధి. దీని కారణంగా ఆమె పక్షవాతానికి గురయ్యి నడవలేనంత దయనీయ స్థితిలో ఉంది. కనీసం మాటలు కూడా పలకలేదు. ఈ వ్యాధి కారణంగా ఆమె మెదడులోని ఒక వైపు భాగం కుచించుకుపోవడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి ఆమెపై ఓ రేంజ్లో విజృంభించడం ప్రారంభించింది. దీంతో వైద్యలు ఆమె పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో యాంటీ సీజర్, స్టెరాయిడ్లు ఇచ్చారు. అంతేగాదు ఆ వ్యాధిని నయం చేసేందుకు మెదడులో ఒకవైపు భాగాన్ని పనిచేయకుండా డిస్కనెక్ట్ చేశారు. అంటే ఒకరకంగా ఒకవైపు మెదడుని స్విచ్ఆఫ్ చేశారు. ఆ చిన్నారి ఎదుర్కొంటున్న వ్యాధిని నయం చేసేందుకు ఇలా ఒకవైపు మెదడుని పూర్తిగా డిస్కనెక్ట్ చేసినట్లు లోమాలిండా యూనివర్సిటీ డాక్టర్ ఆరోన్ రాబిసన్ చెప్పారు. ఈ మేరకు వైద్యులు రాబిసన్ మాట్లాడుతూ..మెదడులో పనిచేయని భాగాన్ని సిల్వియన్ షిషర్ అనే పిలిచే బ్రెయిన్ ఓపెన్ సర్జరీ ద్వారా బ్రెయిన్‌ని ఆఫ్ చేయొచ్చని చెప్పారు. ఈ చికిత్సలో తాము మెదడులోని థాలమస్ ప్రాంతం నుంచి తెల్లటి పదార్థాన్ని రీమూవ్ చేస్తామని చెప్పారు. సగం మెదడుతో రోజూవారి సాధారణ జీవితాన్ని గడపగలమని చెప్పారు వైద్యులు. దీని గురించి ఆ చిన్నారి బ్రియానాకి దాదాపు 10 గంటలకు పైగా శస్త్ర చికిత్స చేసి మరీ మెదడులోని సగ భాగాన్ని డిస్కనెక్డ్ చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ఆమె ఎడమ చేతిని కదపలేకపోవడం, కొంత మేర దృష్టిని సైతం కోల్పోయినప్పటికీ వివిధ ఫిజికల్ థెరఫీలతో మళ్లీ ఆమెను యథాస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొత్తగా నడవడం, బ్యాలెన్సింగ్ చేసుకోవడం వంటి నెపుణ్యాలను మళ్లీ అభ్యసిస్తోందని చెప్పారు రాబిసన్. ఇంతకీ రాస్ముస్సేన్ మెదడు వాపు వ్యాధి అంటే.. మెదడులో సగభాగంలో మంటతో కూడిన దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరితే సగభాగం పూర్తిగా పనితీరుని కోల్పోతుంది. దీంతో ఒక వైపు శరీరం చచ్చుబడి క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని 1958లో తొలిసారిగా వైద్యుడు థియోడర్ రాస్ముస్సేన్ వివరించారు. అందువల్ల ఆ వైద్యుడి పేరు మీదనే ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రతి పదిమిలియన్ల మందిలో ఇద్దర్ని ప్రభావితం చేస్తుందని, సాధారణంగా సుమారు 2 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, ఆఖరికి పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు: రాస్ముస్సేన్ ఎన్సెఫాలిటిస్ అత్యంత సాధారణ మూర్చలాంటి లక్షణాలనే చూపిస్తుంది. ఇది శరీరంలోని బలమైన కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఒక చేయి, కాలు మెలితిప్పినట్లుగా వంకరగా మారతాయి. మెదడులో ఒకవైపు నుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమవుతుంది (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?) -
షాకింగ్ ఘటన: మహిళ మెదడులో.. కొండచిలువ..
ఓ మహిళ గత కొన్ని రోజులుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ సాధారణమైనవే కదా అన్నట్లు మందులు వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా మతిమరుపు వంటి జ్వరం వంటివి మరీ ఎక్కువైపోయాయి. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్‌గానే వచ్చాయి. ఇక చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా..ఆమె మెదడులో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు వైద్యులు. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..64 ఏళ్ల మహిళ విరేచనాలు, వాంతులు దీర్ఘకాలిక జ్వరం తదితర వాటితో గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో వైద్యలు ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమె మెదడులో ఉన్న పరాన్నజీవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది కొండచిలువ శరీరంలో ఉండే ఒక విధమైన పురుగులాంటిది. అలా అని ఆమె పాములు పట్టే ఆమె కూడా కాదు. ఆమె కసలు పాములతో ఎలాంటి సంబంధ కూడా లేదు. అయితే ఆమె కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె వంట చేయడం కోసం అని గడ్డి వంటివి కోసుకువచ్చేది. అలాగే ఆకుకూరలు వంటి పదార్థాలను తీసుకొచ్చేది. ఈ కొండచిలువ వాటిపై పాకడం లేదా దాని మలం ద్వారా ఈ జీవి ఉండొ అవకాశం ఉందని. ఆమె ఆకుకూరలు తిన్నప్పుడో లేదా మరేవిధంగానో ఆమె శరీరంలోకి వెళ్లి మెదడులో కూర్చొందన్నారు. అది ఏకంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగనట్లు ఉందన్నారు. దీని కారణంగా ఆమె విపరీతమైన వాంతులు, కడుపునొప్పితో కూడిని విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొందన్నారు. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పరాన్నజీవిని తీసేసినట్లు తెలిపారు. సదరు పేషెంట్ కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందని అన్నారు. ఈ కేసు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ వ్యాధులేనని చెప్పారు. జూనోటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు. ఇలానే కనోనా వైరస్లు కూడా మానవాళిని భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. అందువల్ల మానవులు జంతువులను పెంచుకునేటప్పుడూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. టేప్‌వార్మ్ లాంటి బద్దె పురుగులు కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేసి మూర్చ వంటి రుగ్మతలను కలుగ చేస్తాయన్నారు. ఇవి జంతువుల శరీరంలో పరాన్నజీవిగా ఆశ్రయించి ఉండటం కారణంగా..మనం వాటిని ఆహారంగా తీసుకోవడంతో మన శరీరంలో చేరి నెమ్మదిగా అభివృద్ధి చెంది కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేస్తుందని అన్నారు. అందువల్ల బాగా ఉడకబెట్టి తగు జాగ్రత్తల పాటించి ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. (చదవండి: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్‌కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
ముక్కులోంచి వెళ్లి మెదడు తినేసింది.. 15 ఏళ్ల కుర్రాడు మృతి!
కేరళలోని అలప్పుజా జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరిలో కలవరాన్ని పెంచింది. కలుషిత నీటిలో ఉండే అమీబా ఒక యువకుని ప్రాణాలను బలిగొంది. ఈ అమీబా ఆ కుర్రాడి మెదడులో నిన్ఫెక్షన్ను వ్యాపింపజేసింది. అది మెదడును తిసేసింది. కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ తెలిపిన వివరాల ప్రకారం అలప్పుజా జిల్లాకు సమీపంలోని పనావల్లికి చెందిన కుర్రాడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. గతంలోనూ ఇటువంటి కేసులు.. గతంలోనూ ఇటువంటి ఐదు కేసులు వెలుగు చూశాయి. దీనిలో మొదటి కేసు 2016లో తిరమాల వార్డులో వెలుగు చూడగా, 2019, 2020లలో మలప్పురంలో రెండేసే కేసులు చొప్పున వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. 2020, 2022లలో కోజికోడ్, త్రిశూర్లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకినవారంతా మృత్యువాత పడ్డారు. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా వ్యాధి తీవ్రతను గమనించిన అలప్పుజా జిల్లా వైద్యశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. కలుషిత నీటితో స్నానం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడు జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడని వారు తెలిపారు. సూక్ష్మదర్శినితో మాత్రమే.. ఈ అమీబా ఎంత ప్రమాదకరమంటే ఇది మెదడులోని కణాలను తినేస్తుంది. ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తుంది. ఇది బాధితుడికి ప్రాణహాని కలిగిస్తుంది. Naegleria Fowleri అనే ఈ అమీబా చాలా చిన్నగా ఉంటుంది. దీనిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతారు. ఇది కూడా చదవండి: అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే.. -
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రత్యేకం
జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్.. అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా. బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు: ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు. లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు. -
పక్షవాత బాధితునికి ఏఐ సాయం... అతనిలో వచ్చిన వినూత్న మార్పు ఇదే..
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇంతకాలం అసాధ్యాలనుకున్నవన్నీ ఏఐ సాయంతో సుసాధ్యాలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అటువంటి మరో ఉదంతం ఇప్పుడు అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.స్విట్టర్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పక్షవాతానికిగురైన ఒక వ్యక్తికి అత్యుత్తమ చికిత్సనందించారు. బాధితుని శరీరంలోని కిందిభాగం పక్షవాతానికి గురికాగా, శాస్త్రవేత్తలు ఆ భాగం బాధితుని నియంత్రణలోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే 2011లో పక్షవాతానికి గురైన గర్ట్-జైన్ ఓస్కమ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏఐ సాయంతో తిరిగి నడవగలుగుతున్నాడు. తనకు చికిత్స అందించిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. 40 ఏళ్ల ఓస్కమ్ తన ఆలోచనల ద్వారా ఇప్పుడు తన శరీరభాగాలను నియత్రించగలుగుతున్నాడు. రెండు ఇంప్లాట్స్ కారణంగా ఇది సంభవమయ్యింది. బాధితుని మెదడు- వెన్నెముకకు మధ్య తిరిగి కనెక్షన్ ఏర్పరచడం ద్వారా బాధితుని శరీర భాగాలు అతని అదుపులోకి వచ్చాయి. ఓస్కమ్ మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి నడుస్తానని ఎప్పుడూ అనుకోలేదని,శాస్త్రవేత్తలు తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకుల బృందం ఓస్కామ్ మెదడుకు, వెన్నెముకకు మధ్య ఒక డిజిటల్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది.ఈ బ్రిడ్జి బాధితుడు అన్ని ఆటంకాలు అధిగమించి నడించేందుకు సహకరిస్తుంది. 2011లో జరిగిన ఒక ప్రమాదం అనంతరం ఓస్కమ్ పక్షవాతానికి గురయ్యాడు. ఆ తరువాత నుంచి వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏఐ సాయం, శాస్త్రవేత్తల కృషితో బాధితుడు తిరిగి నడవగలుగుతున్నాడు. -
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్‌లోని లైడెన్‌లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్‌ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్‌లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్‌లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్‌తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్‌లు గుర్తించారు. ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన లౌసాన్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
బీజేపీ నేతలకు బుర్ర లేదు..ఏది పడితే అది మాట్లాడుతారు:నితీశ్ కుమార్
పట్నా: బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఈ తరం కమలం పార్టీ నాయకులకు అసలు బుర్ర లేదని, ఏం మాట్లాడుతారో కూడా తెలియదని ధ్వజమెత్తారు. తాను వాళ్లలా కాదని, నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడనని పేర్కొన్నారు. నితీశ్, ఆయన పార్టీని మట్టిలో కలిపేస్తామని బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలా ఫైర్ అయ్యారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నితీశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సామ్రాట్. వచ్చే ఎన్నికల్లో నితీశ్‌ను, ఆయన పార్టీని మట్టిలో కలపాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నితీశ్‌ను ప్రధాని మోదీ సీఎం చేసినా.. ఆయన మోసం చేసి ఆర్జేడీతో చేతులు కలిపారని విమర్శించారు. ఇందుకు ప్రతీకారంగా 2024 సార్వత్రిక ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ పార్టీని మట్టిలో కలిపి తగిన బుద్ది చెప్పాలన్నారు. కొద్ది రోజుల క్రితం యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ మాఫియాను మట్టిలో కలిపేస్తాం అని హెచ్చరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ తర్వాత రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు వరుస ఎన్‌కౌంటర్లరో హతమైన విషయం తెలిసిందే. యోగి వ్యాఖ్యలనే స్ఫూర్తిగా తీసుకుని బిహార్ బీజేపీ చీఫ్.. నితీశ్ పార్టీని మట్టిలో కలిపేస్తాం అని వ్యాఖ్యానించారు. చదవండి: అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్! ఉమేశ్‌పాల్ ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు -
మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే...
గుంటూరు మెడికల్: మనిషి దైనందిన జీవితంలో చేసే పనులన్నీ కూడా బ్రెయిన్ ద్వారానే జరుగుతాయి. జ్ఞానేంద్రియాలకు ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే. శరీరంలోని కీలకమైన అవయవాలన్ని కూడా మెదడు ఇచ్చే ఆదేశాల ద్వారానే పనిచేస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధుల వల్ల, ప్రమాదాల్లో గాయపడటం వల్ల మెదడు దెబ్బతిని, మెదడు పనిచేయక మనిషి చనిపోవటం జరుగుతుంది. మెదడును పరిరక్షించుకోకపోతే ఎలాంటి అనర్ధాలు వస్తాయి, మెదడు గురించి అవగాహన కల్పించేందుకు 1996 నుంచి 120 దేశాల్లో ప్రతి ఏడాది మార్చి 13 నుంచి 19వ తేదీ వరకు బ్రెయిన్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ సమస్యల బాధితుల వివరాలు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రతిరోజూ 150 మంది, న్యూరో సర్జరీ విభాగంలో వంద మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 50 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. చిన్న వయస్సు మొదలుకొని పెద్ద వారి వరకు అందరికి బ్రెయిన్ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయి. మెదడుకు ఇబ్బందికర పరిస్థితులు... ప్రమాదాల్లో తలకు గాయాలవ్వటం. పక్షవాతం. మెదడులో ట్యూమర్లు ఏర్పడడం. పార్కిన్సన్స్ వ్యాధి. యాంగ్జటీ, డెమెన్షియా, డిప్రెషన్ కారణాల వలన మెదడు దెబ్బతింటుంది. తలనొప్పి, వాంతులు అవడం, చూపులో తేడాలు, నడకలో తడబాటు, జ్ఞాపకశక్తి లోపించడం, ఏదైనా విషయాలపై ఏకాగ్రత చూపించలేకపోవడం, చెవిలో శబ్దాలు వినిపించడం, మనిషి అసాధారణంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు కనిపిస్తే మెదడుకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయనే విషయం గుర్తించాలి. బ్రెయిన్ ట్యూమర్స్‌పై అప్రమత్తత.. మెదడులో ఏర్పడే కొన్ని గడ్డలు క్యాన్సర్‌గా మారి ప్రాణాలు తీస్తాయి. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో ఫిట్స్ వస్తాయి. వైద్యుల సలహా మేరకు ఫిట్స్ రాకుండా మందులు వాడుతూ ఉండాలి. చేతులు, కాళ్లు పనిచేయకపోతే పక్షవాతం అని భావిస్తారు. బ్రెయిన్లో గడ్డ ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చు. అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్లను నిర్ధారిస్తారు. మెదడు గురించి.. ♦ మనిషి శరీరంలో బ్రెయిన్ మొత్తం బరువు రెండు శాతం. ♦ 18 ఏళ్ల వయసు వరకు బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది. ♦ పగలు కంటే రాత్రి వేళల్లోనే మెదడు ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది. ♦ మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. ♦ మెదడు 1300 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. ♦ అప్పుడే పుట్టిన పిల్లల్లో 350 నుంచి 450 గ్రాముల బరువు ఉంటుంది. ♦ శరీరం మొత్తం వినియోగించుకునే శక్తిలో 20 శాతం వినియోగించుకుంటుంది. -
ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్' ఇటీవలే ప్రచురించింది. అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్‌లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు. చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్ -
మీకు తెలుసా?
మెదడు తనను తాను రిపేర్ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు ♦ నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ♦ దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది. ♦ నిద్రలేమి కారణంగా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ♦ ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. ♦ నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం. ♦ కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. ♦ కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. -
రెడీ...సెట్...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు
జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది... బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్‌లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్‌తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్’ అనే గేమ్ యాప్‌ను సాధనంగా ఎంచుకుంది. కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్’ను ఉపయోగిస్తోంది. ‘సూపర్‌బెటర్’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్ హ్యాజ్ హీరోయిక్ పొటెన్షియల్’ అనేది ఈ ఆట నినాదం. ‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్‌బెటర్’ను రూపొందించిన జేన్మెక్ గోనిగల్. జేమ్మెక్ ఒకప్పుడు డిప్రెషన్ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్‌లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్‌లో నుంచి ‘సూపర్‌బెటర్’ రూపంలో డిజిటల్ ఆటగా మారింది. న్యూరోసైంటిస్ట్ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్... లుమినోసిటీ. ఈ గేమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్ గేమ్ మాన్యుమెంట్ వ్యాలీ. ఈ గేమ్ యాప్ యాపిల్ డిజైన్, పాకెట్ గేమర్ ‘గోల్డ్’ అవార్డ్‌లను గెలుచుకుంది. ‘మాన్యుమెంట్ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్ సౌండ్ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్. సుడోకు ప్రేమికులను ‘గుడ్ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ. ఇక ఫన్మెథడ్ వీడియో గేమ్ ‘బ్లాక్‌బాక్స్’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్ ఉంటాయి. ‘ఎలివేట్’లో ప్రత్యేకమైన వర్కవుట్ క్యాలెండర్ ఉంటుంది. ‘ఫన్ అండ్ క్లిక్’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘బస్సు కోసం ఎదురుచూసే క్రమంలో టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్ జిమ్ గేమ్స్ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాకేత్. ‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్‌ను సాల్వ్ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్ సాల్వ్ చేసే ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి. ‘మన జీవితమే పెద్ద పజిల్. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్‌ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌ను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం. -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్‌ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..
సాక్షి, విజయవాడ: శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. ►పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. ►45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ►వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ►ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. జీవన విధానం ముఖ్యం.. ప్రతి ఒక్కరూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కదలిక లేని జీవన విధానం కారణంగా చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, మధ్య వయస్సు వచ్చేసరికి స్ట్రోక్‌కు దారి తీస్తున్నాయి. వంశపారంపర్యంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్న వారు మందులు సక్రమంగా వాడటం ద్వారా ముప్పు ను తప్పించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఈ వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులు వస్తున్నాయి.. ఇటీవల 45 ఏళ్లలోపు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న(స్ట్రోకింగ్ యంగ్) వారిని తరచూ చూస్తున్నాం. మా వద్ద వస్తున్న స్ట్రోక్ కేసుల్లో 25 శాతం అలాంటి వారే ఉంటున్నారు. తక్కువ వయస్సు వారిలో స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు వాడటం, మద్యపానం, ధూమపానంతో పాటు, హోమోసిస్టీన్, సిక్కుసెల్, రక్తంలో లోపాలు కూడా కారణం కావచ్చు. బ్రెయిన్‌స్ట్రోక్ లక్షణాలను గుర్తించి నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ డి. అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
ప్రమాదాల్లో మెదడుకు గాయమైతే!
ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలితే... మెలకువగా ఉండటం లేదా దెబ్బ బలంగా తగిలితే స్పృహ తప్పిపడిపోవడం... ఈ రెండే అందరికీ తెలిసిన పరిస్థితులు. అయితే ఇలా జరిగినప్పుడు బాధితులు ఏ మేరకు స్పృహలో ఉన్నారనే అంశం ఆధారంగా ఐదు రకాల కండిషన్లలోకి వెళ్లవచ్చు. అవి... స్టూపర్ అనే కండిషన్లోనా, కోమాలోనా, జీవించే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనలూ లేని జీవచ్ఛవ (వెజిటేటవ్ స్టేట్ అనే) స్థితిలోనా, లాక్డ్–ఇన్ సిండ్రోమ్ అనే దశలోనా... ఇలాంటి పరిస్థితుల్లో చివరిదైన బ్రెయిన్‌డెడ్ కండిషన్లలో దేనిలో ఉన్నాడని చూస్తారు. తలకు దెబ్బతగిలిన బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారు, ఏ మేరకు బాగవుతారు వంటి అంశాలు... అతడు ఏ స్థితిలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటాయి. ఆ స్థితులపై అవగాహనతో పాటు, తలకు దెబ్బతగిలి మెదడుకు గాయమైందని భావించినప్పుడు చేయాల్సిన పనుల గురించి తెలిపే కథనం. తలకు దెబ్బ తగిలి, దాని ప్రభావం ఎంతోకొంతైనా మెదడు మీద పడితే ఆ ప్రమాదాన్ని ‘ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ)’ అంటారు. అప్పుడు తలకు తగిలిన దెబ్బ తీవ్రత ఆధారంగా బాధితులు వెళ్లే ఐదు రకాల తీవ్ర పరిస్థితులివి... స్టూపర్ దశ: ఈ స్థితిలో కొద్దిగా మాత్రమే కదులుతూ... ఒకవేళ నొప్పికలిగినా, లేదా గిల్లడం వంటివి చేసినా కాస్త స్పందిస్తారు. వెజిటేటివ్ స్టేట్ : జీవచ్ఛవంగా ఉంటే దశనే వెజిటేటివ్ స్టేట్‌గా చెబుతారు. వీరికీ కోమాలో ఉన్న బాధితులకు తేడా ఏమిటంటే... కోమా ఉన్న రోగులకు నిద్ర, మెలకువ దశలు ఉండవు. వెజిటేటివ్ స్థితిలో ఉన్నవారిలో కొందరు అకస్మాత్తుగా సాధారణంగా స్పందించవచ్చు. కోమాలో ఉన్న రోగులు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కాగా జీవచ్ఛవంలా ఉన్న రోగులు కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండవచ్చు. శబ్దాలు చేయవచ్చు. చేతులు–కాళ్లు కూడా కదపగలరు. బాధితులు కంటిన్యువస్‌గా నెల (30 రోజుల) పాటు జీవచ్ఛవంలా ఉంటే దాన్ని ‘శాశ్వత జీవచ్ఛవ స్థితి’ (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్–పీవీఎస్) అంటారు. ఇలాంటి వారిలో రోగి మెరుగుపడే పరిస్థితి అన్నది వారి మెదడుకు అయిన గాయం తీవ్రతను బట్టి, బాధితుల వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసు వారైతే కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గుండెపోటు వచ్చిన కొందరిలో మెదడుకు రక్తం (ఆక్సిజనేటెడ్ బ్లడ్) అందక వారు జీవచ్ఛవ (వెజిటేటివ్) స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. కోమా : ఇది పూర్తిగా స్పృహ లేని స్థితి. అయితే బాధితులు కొన్నిసార్లు కొద్దిసేపు మాత్రమే కోమాలో ఉండి, మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలూ ఉంటాయి. వారు కోమాలో ఉండే వ్యవధి కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాలూ లేదా నెలల వరకూ ఉండవచ్చు. కోమాలో ఉన్నవారు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కోమాలో ఉన్నవారికి నిద్ర, మెలకువ వంటి స్థితులు కలగవు. కోమా నుంచి బయటపడ్డా... కొందరిలో ఎలాంటి స్పందనలూ లేకుండా జీవచ్ఛవం (వెజిటేటివ్ స్టేట్)లోనూ ఉండవచ్చు లేదా ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం వల్ల చాలామంది మునపటి చైతన్యాన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. లాక్డ్–ఇన్ దశ : ఈ కండిషన్లో బాధితుడు మెలకువగానే ఉంటాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా తన శరీరాన్ని కదిలించలేడు. అంటే శరీరం పూర్తిగా పారలైజ్ అవుతుంది. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (పీవీఎస్)లో బాధితుడికి మెదడు పైభాగం పూర్తిగా దెబ్బతిని, కింది భాగం మామూలుగానే ఉంటుంది. కానీ లాక్డ్–ఇన్ దశలో పై భాగం మామూలుగానే ఉండి, కింది భాగం (అంటే బ్రెయిన్ స్టెమ్) దెబ్బతింటుంది. లాక్డ్ ఇన్ సిండ్రోమ్‌లో ఉన్న చాలామంది రోగులు తమ కనురెప్పల కదలికల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. వీళ్లలోని కొందరిలో ముఖంలోని కొన్ని కండరాల్లోనూ కదలికలు ఉండవచ్చు. చాలామందిలో కాళ్లూ–చేతులపై నియంత్రణ (మోటార్ కంట్రోల్) ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఇలాంటి వారితో సంభాషించడానికీ / సమాచారాన్ని పంచుకోవడాని (కమ్యూనికేషన్)కి అనేక రకాల ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ డెడ్ : ఈ స్థితిలో బాధితులకు మెదడులోని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్తో పాటు బ్రెయిన్ స్టెమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా మెదడు మరణిస్తుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ఇక ఏమాత్రం చక్కదిద్దలేరు. శరీరం బతికి ఉండి... మెదడు పూర్తిగా మరణించిన స్థితి ఇది. ఇలాంటి స్థితిలో కృత్రిమశ్వాసపై శ్వాసప్రక్రియ కొనసాగుతుంటే... అది తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. బతికే అవకాశం ఏమాత్రమూ ఉండదు. అందుకే బ్రెయిన్‌డెడ్ పరిస్థితిలో ఉన్నవారి నుంచి డాక్టర్లు అవయవమార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) కోసం అవసరమైన అవయవాలను సేకరిస్తారు. ∙ తలకు గాయం కాగానే పొరుగువారు చేయాల్సిన పనులు ♦తలకు గాయమైన వారిని సమతలంగా ఉండే పడకపై మెడ కదలకుండా పడుకోబెట్టాలి. ♦తరలించే సమయంలో తలకు, వెన్నుకు అయిన గాయం మరింత రేగకుండా, తీవ్రం కాకుండా చూడాలి. చికిత్స విషయానికి వస్తే... ఏదైనా ప్రమాదంలో తలకు గాయం అయినప్పుడు మెదడుకు నష్టం జరిగిందా లేదా అన్న విషయం తక్షణం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రమాదం జరిగిన గంటలోనే బాధితులను హాస్పిటల్‌కు తరలించగలిగితే... చాలావరకు ప్రాణాల కాపాడవచ్చు. దాంతో పాటు దుష్ప్రభావాలను (కాంప్లికేషన్స్‌ను) చాలావరకు అరికట్టవచ్చు. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అదే అరగంటలోపే తరలించగలిగితే... ఇంకా సమర్థమైన చికిత్స అందించవచ్చు. అందుకే ఆ సమయాన్ని ‘ప్లాటినమ్’ సమయంగా చెబుతారు. బాధితులకు ముందుగా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి తక్షణ వైద్య సహాయం అందాలి. ఇది ప్రమాద సంఘటన స్థలం నుంచే లేదా కనీసం ఆసుపత్రికి తరలించగానే క్యాజువాలిటీలోనైనా ప్రారంభం కావాలి. ఎందుకంటే గాయం కారణంగా మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం చాలా సందర్భాల్లో పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం చేయగలిగేది మెదడుకు మరింత నష్టం జరగకుండా చూసుకోవడం. ఒకవేళ గుండె స్పందనలు ఆగినట్లయితే వెంటనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీఆర్పీ) చేయాలి. దాంతో గుండె స్పందనలు మళ్లీ మొదలై... మెదడుకు రక్తం అందేలా చూడాలి. ఫలితంగా మెదడుకు జరిగే నష్టమూ తగ్గుతుంది, ప్రాణమూ నిలబడుతుంది. ఇక ఆ తర్వాత చేయాల్సిన వివిధ చికిత్సలను డాక్టర్లు హాస్పిటల్లో కొనసాగిస్తారు. చదవండి: Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు! -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ కాఫీగింజల్లో ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించగలరా?
సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రతి చిన్న విషయం ప్రజలకు తొందరగా చేరుతుంది. సోషల్ మీడియాలో వినోదభరిత వీడియోలే కాదు మెదడుకు మేతపెట్టే విషయాలు కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో నిజాలను, విశేషాలను నేర్చుకోవచ్చు. ఈ రకమైన దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. గందరగోళ రూపంలో ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్‌లో నుంచి సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతను పెంచి మెదడు చురుకుగా పనిచేయించడమే దీని వెనకున్న ఉద్ధేశ్యం. తాజాగా అలాంటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక ఫోటోలో పెద్ద సంఖ్యలో కాఫీ గింజలు ఉన్నాయి. అయితే అందులో ఓ మనిషి బొమ్మ కూడా దాగి ఉంది. దాన్ని కనుగొనాలాంటూ సవాల్ విసిరారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనిషి ముఖాన్ని గుర్తించొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. కనిపెట్టడం కష్టంగా ఉంటే ఇక ఈ కింది చిత్రాన్ని చూడండి. అయితే మీరు ఫోటో, పెయింటింగ్ చూసే విధానం ద్వారా మీ మెదడు ,వ్యక్తిత్వం ముఖ్య లక్షణాలు తెలుస్తాయి. మూడు సెకన్లలోపు మనిషి ముఖాన్ని గుర్తించగలిగితే, మీ కుడి మెదడు మీ తోటివారి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం పడితే, మీ మెదడు కుడి సగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. లేదా ఒకటి నుంచి మూడు నిమిషాల సమయం పట్టినట్లయితే, మీ మెదడు కుడి వైపు సమాచారాన్ని నెమ్మదిగా విశ్లేషిస్తుంది. ఒకవేళ మీకు మూడు నిమిషాలు సరిపోకపోతే, అలాంటి బ్రెయిన్ టీజర్ మీ మెదడుకు సవాలు విసురుతూనే ఉంటుందని ది మైండ్స్ జర్నల్ చెబుతోంది. చదవండి: విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష! -
చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి
Cerebral or intracranial aneurysm: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మెదడుకి సంబంధించిన "సెరిబ్రల్ అనూరిజం"తో బాధపడుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గతేడాది 2021 చివరిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. జిన్‌పింగ్ ఎదుర్కొంటున్న సెరెబ్రల్ అనూరిజం అనే వ్యాధి ప్రమాదకరమైనదని వెల్లడించింది. అందువల్లే కరోనా విజృంభించినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు కూడా జిన్‌పింగ్ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదు. దీంతో జిన్‌పింగ్ ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. ఏంటీ సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం క్లాట్ అవుతుంటుంది. అంతేకాదు ఈ రక్తనాళాలు ఎప్పుడూ పగిలిపోతాయో చెప్పలేం. దీంతో మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్‌అరాక్నోయిడ్ హెమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం లేదా మరణించడం జరుగుతుంది. ఎప్పుడూ ఈ వ్యాధి బయటపడిందంటే? మార్చి 2019 లో జిన్‌పింగ్ తన ఇటలీ పర్యటనలో ఆయన సరిగా నడవలేకపోయారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడే ఈ వ్యాధి బయటపడింది. అంతేకాదు 2020లో షెన్జెన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటి నుంచి జిన్‌పింగ్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: అల్ జజీర్ మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్ దళాలు) -
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!
Last Recall Of Memories That we Have Experienced In Life: ఇంతవరకు శాస్త్రవేత్త పలు ఆవిష్కరణలతో వైజ్ఞానిక శాస్త్రాన్ని కొత్తపుంతలు తొక్కించారు. వైద్యా శాస్త్రానికి సాంకేతికతను జోడించి సాధ్యం కావు అనుకునే వాటన్నింటిని సాధ్యం చేయడమే కాక. సామాన్య మానవుడికి సైతం గొప్ప ఆధునికతతో కూడాని వైద్యం అందేలా చేశారు. ఇన్ని పరిశోధనలు చేసినప్పటికీ శాస్త్రవేత్తల బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క విషయం మరణం. మరణించే ముందు మనలో ఏం జరుగుతుంది ఆ తర్వాత ఎక్కడి వెళ్తారు అనే అంతుబట్టని చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికాయంటున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే...చనిపోవడానికి ముందు మన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను చివరిగా గుర్తుచేసుకుంటుందని డాక్టర్ జెమ్మార్ చెబుతున్నారు. ఈ మేరకు చనిపోతున్నప్పుడు మెదడు ఆలోచనలను రికార్డు చేయడంతో శాస్తవేత్తలకు మానవ మెదడును మరింత అర్థం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగామని చెప్పారు. ఈ రికార్డింగ్ ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. ఈ మేరకు న్యూరో సైంటిస్టులు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల రోగి మెదడు తరంగాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఆ రోగి గుండె పోటుకు గురై చనిపోతుతన్నప్పుడు అతని మెదడు ఊహించని విధమైన సంకేతాలను అందించింది. మనిషి చివరి సమయంలో రికార్డింగ్ మెమరీ రిట్రీవల్ ఊహించని మెదడు కార్యకలాపాలను వెల్లడించిందన్నారు. అవి తన జీవితపు తాలుకా జ్ఞాపకాలైన అయి ఉండవచ్చని చెప్పారు. రోగి మెదడు ఆలోచనలు గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత 30 సెకన్ల పాటు కొనసాగిందని తెలిపారు. అంతేకాదు గుండె పనిచేయడం ఆగిపోయే ముందు నాడీ డోలనాల్లో మార్పులను చూశామన్నారు. జ్ఞాపకశక్తి పునరుద్ధరణలో ప్రమేయం ఉన్న డోలనాలను ఉత్పత్తి చేయడం ద్వారా, మెదడు మనం చనిపోయే ముందు ముఖ్యమైన జీవిత సంఘటనల చివరి రీకాల్‌ను ప్లే చేస్తుందని ఇది మరణానికి సమీపంలో నివేదించబడిన అనుభవాల మాదిరిగానే ఉంటుందని డాక్టర్ జెమ్మార్ వెల్లడించారు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది, అవయవ దానం చేసే సమయానికి ఏం జరుగుతుంది తదుపరి ప్రశ్నలకు సంబంధించిన అవగాహనను సవాలు చేస్తాయంటున్నారు వైద్యులు. (చదవండి: న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి) -
మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే!
How does coronavirus reach brain?: ప్రాణాంతక కరోనా వైరస్ మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి గల కారణాలను యూఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తాజాగా విడుదల చేశారు. సాధారణంగా కరోనా వాయుమార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే ఇది అనతికాలంలోనే శరవేగంగా ఊపిరితిత్తుల్లో మత్రమేకాకుండా మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్ మనుగడకు కారణమిదేనని వీరి అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడ్డవారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైరస్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రయాణిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలంపాటు బాధపడే కోవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. అందుకు గల కారణాలను అధ్యయనం చేయడం కోసం అమెరికాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన 44 మంది రోగులపై శవపరీక్షల సమయంలో తీసిన కణజాలాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ బారినపడి 230 రోజులు దాటిన తర్వాత కూడా వైరస్ తాలూకు ఆనవాలు మెదడుతో సహా శరీరంలో వివిధ భాగాల్లో కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడేవారి అవయవ వ్యవస్థ ఎందుకు ప్రభావితం అవుతుందో కనుగొనేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాల్నిచ్చాయని మిస్సోరీకి చెందిన క్లినికల్ ఎపిడెమియాలజీ సెంటర్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ ప్రయాణించగల అవయవాలు కేవల ఊపిరితిత్తులు మాత్రమేకాదు. ఇది మెదడుతో సహా మొత్తం శరీరం అంతటా సోకుతుంది. అధిక శాతం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో ఉంటుంది. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
World Stroke Day 2021: ఆ.. 60 నిమిషాలు విలువైనవి
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిని తొలి గంట సమయంలోపు ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాపాయం తప్పినట్లే. కనీసం నాలుగున్నర గంటల్లోపు వస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు మూడు పదుల వయసు వారిలోనూ కనిపిస్తోంది. పోస్ట్ కోవిడ్ రోగులు ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో అవగాహన కలిగించనున్నారు. శుక్రవారం ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. విజయవాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేన్నాడు. అతను కోవిడ్ నుంచి కోలుకున్న ఇరవై రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వెంటనే అతనికి రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్ ఇవ్వడంతో స్ట్రోక్ ముప్పు నుంచి బయట పడ్డాడు. కోవిడ్ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఓ 25 ఏళ్ల యువకుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఆ ఫంగస్ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడటంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. వీళ్లిద్దరే కాదు ఈ ఏడాది ఎంతో మంది పోస్టు కోవిడ్ రోగులు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. చదవండి: (Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..) స్ట్రోక్ లక్షణాలు ఇవీ.. మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, నియంత్రణ తప్పడం, మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోలేక పోవడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఒకటి రెండుగా కనిపించడం, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 80 శాతం మందికి క్లాట్స్ కారణం సాధారణంగా మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తంలో గడ్డ (క్లాట్)లు కట్టే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండె సంబంధిత వ్యాధులు వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టు కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులు కూడా స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటమే, మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్‌కు గురయ్యే వారు సకాలంలో ఆస్పత్రికి చేరితే మంచి ఫలితం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా స్ట్రోక్ ద్వారా వచ్చే వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంది. ప్రతి నిమిషమూ విలువైనదే.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషమూ విలువైనదే. స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడ వచ్చు. 80 శాతం మందికి రక్తనాళాల్లో గడ్డలు కారణంగా బ్రెయిన్‌స్ట్రోక్ వస్తుంది. అలాంటి వారికి థ్రోంబలైసిస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రక్తనాళాల్లో గడ్డలు కరిగించి, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – డాక్టర్ డి.వి.మాధవీకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వాస్పత్రి, విజయవాడ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగాయి పోస్టు కోవిడ్ రోగులు కొందరు లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నారు. కోవిడ్ వైరస్ కారణంగా రక్తనాళాలు దెబ్బతిని, వాటిలో గడ్డలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురవుతున్న వారిని చూస్తున్నాం. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారికి మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి వారు మధుమేహం, రక్తపోటు, కోలస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ డి.అనీల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?
దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? - సాక్షి సెంట్రల్ డెస్క్ మానసిక సమస్యలను ముందే గుర్తించినా.. కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ 45 వేల మందిపై పరిశోధన కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు. స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా.. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు. ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు. -
లాంగ్ కోవిడ్‌తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్ కోవిడ్ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ సీరియస్‌గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్ ఫాగింగ్ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్, మెంటల్ హెల్త్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ట్రేవర్ కిల్పాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్ పెట్రో పరిశోధన చేశారు. ఇన్‌ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్‌లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్ డిక్లైన్, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్ఓ సైంటిస్ట్) ముక్కు నుంచి మెదడుకు.. కోవిడ్ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ను ముక్కులోని సెన్సరీ సెల్స్ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్ సిస్టమ్ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్‌లను పరిశీలిస్తే.. లింబిక్ సిస్టమ్‌లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి లాంగ్ కోవిడ్ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్ ఫాగింగ్’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్ కోవిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్ వ్యాక్సిన్‌తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్ కోవిడ్ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్ బి చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్ ఏపీ కొవిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ లాంగ్ కొవిడ్ సమస్య పెరిగింది కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్ కోవిడ్ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్‌లో లాంగ్ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆస్పత్రి -
ఐదేళ్ల శ్రమతో హెల్మెట్ తయారీ, ధర రూ.3700.. ఎన్నెన్నో ప్రత్యేకతలు
వాషింగ్టన్: మన మెదడులోని ఆలోచనలను కనిపెట్టడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అది సులువేనని అమెరికాలోని ఓ సంస్థ చెప్తోంది. కెర్నెల్ అనే సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది. దీనిపై చేసిన పరీక్షల ఫలితాలన్నీ ఆశాజనకంగానే వచ్చాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక వీటిని వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపునుంది. దీని ధరను 50 డాలర్లు (సుమారు రూ. 3,700)గా నిర్ణయించారు. ఈ హెల్మెట్లలో మెదడును అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. వీటితో రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్న తీరును అంచనా వేయవచ్చని అంటున్నారు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదివరకే ఉన్నప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాటిని అధిగమిస్తూ ఈ పరికరాన్ని కనిపెట్టారు. ఉదాహరణకు ఇలాంటి పరికరానికి ఇదివరకు అయ్యే ఖర్చు మిలియన్ డాలర్లుగా ఉండేది. పైగా సైజు పరంగా ఒక గది స్థలాన్ని ఆక్రమించేది. ప్రస్తుతం ఈ పరికరం తక్కువ ఖర్చు, పైగా బరువు చూస్తే 2 పౌండ్లు మాత్రమే ఉంటుంది. ‘సమాజంలో అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి, మా హెల్మెట్ ఉపయోగపడనుందని’ బ్రయాన్ జాన్సన్ చెప్పారు, అతను గత ఐదేళ్ళకు పైగా ఆయన ఈ హెల్మెట్ రూపొందించడానికి పని చేస్తున్నాడు. అదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ కోసం 110 మిలియన్ డాలర్లు డబ్బును కూడా ఖర్చు పెట్టాడు. చదవండి: స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తున్న కరోనా
కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడంతో రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతూ పోతుంది. కోవిడ్ -19 రోగుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఇతర అవయవ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. కోవిడ్ -19 వెంటనే శ్వాసకోశ వ్యవస్థ చూపినప్పటికి, తర్వాత కాలంలో ఇది లాంగ్-కోవిడ్ అని పిలువబడే మరొక స్థితికి మారుతుంది. ఇప్పుడు ఈ లాంగ్-కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులను, శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. కోవిడ్ -19 వచ్చిన రోగులలో కొందరు తర్వాత గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులతో తిరిగి ఆసుపత్రులకు వస్తున్నట్లు కనుగొన్నారు. కోలుకున్న రొగులు గుండెకు సంబందించిన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. లాంగ్-కోవిడ్ వ్యాది 2020లోనే మొదట నివేదించారు. కోవిడ్ -19 శరీరంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కోవిడ్ -19 వల్ల గుండె ప్రతికూల ప్రభావానికి గురైతున్నట్లు వివిధ అధ్యయనాలలో కనుగొనబడింది. లాన్సెట్ నివేదిక, జామా నివేదికలో ఇవి గమనించవచ్చు. కోవిడ్ -19 శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడిని పెంచి గుండె కండరాలను బలహీనపరుస్తుంది. 8 నుంచి 12 శాతం గుండె పోటు కూడా వస్తుంది. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇలా రక్త నాళాలపై పడే విపరీతమైన ఒత్తిడి కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న రొగులు గుండెకు సంబందించి ఏమైన ఇబ్బంది కలిగితే వెంటనే గుండెకు సంబందించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. క్రింద చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఛాతిలో అసౌకర్యంగా ఉండటం చేతుల్లో నొప్పి లేదా ఒత్తిడి కలగడం వివరించలేని విదంగా విపరీతమైన చెమట పట్టడం హృదయ స్పందన సక్రమంగా పనిచేయక పోవడం శారీరక శ్రమ లేకున్న అధిక అలసట లేదా అలసట కలగటం చదవండి: కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా -
కరోనా: మెదడుపై దాని ప్రభావం
కరోనా వైరస్ ప్రభావం అనగానే మొదట ఊపిరితిత్తులూ, గుండె వంటి అవయవాలపై దాని ప్రభావం గుర్తొస్తుంది. అయితే మనకు నేరుగా మెదడుపై ప్రభావమని అనిపించకపోయినా... పరోక్షంగా కరోనా మెదడుపై కలిగించే ప్రభావం కారణం గా కనిపించే లక్షణాలూ మనకు తెలుసు. అవే... వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం... ఈ రెండు లక్షణాలూ మెదడుపై కలిగే దుష్ప్రభావాల కారణంగానే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని చాలా దుష్ప్రభావాలే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని దుష్ప్రభావాలు చాలా ఎక్కువే ఉన్నాయంటున్నారు న్యూరోవైద్యనిపుణులు. కరోనా వైరస్ కారణంగా మెదడుపైనా, నాడీ మండలం పైనా... తద్వారా ఏర్పడే అనేక అనర్థాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. కరోనా ప్రభావం నాడీమండలంపై ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది కరోనా వచ్చినప్పుడు అంటే మొదటివేవ్లో చికిత్సకుల దృష్టి అంతా ప్రధానంగా ఊపిరితిత్తులూ, గుండె మీద ఉండింది. ఆ సమయంలో వారు ఊపిరితిత్తులు, గుండె ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఆక్సిజన్, హై కాన్సంట్రేషన్ ఆక్సిజన్ అందించి చాలామంది రోగులను బతికించారు. అయితే అలా కోలుకున్న రోగుల్లో కొందరికి కాలూ, చేయీ పనిచేకపోవడం, మూతి వంకర పోవడం, చుట్టుపక్కల వారిని గుర్తుపట్టకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దాంతో చికిత్సకులు తమ చికిత్సల్లో తాము ఏమైనా అంశాలను విస్మరించారా అంటూ అధ్యయనాలు మొదలు పెట్టారు. పైగా మనకు సీటీ స్కాన్, ఎమ్మారై వంటి అడ్వాన్స్డ్ మెడికల్ పరీక్షల సౌకర్యాలు ఉండటంతో చాలా అంశాలు బయటపడ్డాయి. ఉదాహరణకు మెదడులోని కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆయా భాగాలు ప్రభావితమై ఆ సెంటర్లు నియంత్రించే అవయవాలు సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించారు. అసలు వ్యాధి తగ్గి... ఇంటికి వెళ్లిపోయాక... ఓ మూడు, నాలుగు నెలల తర్వాత ఇలాంటి దుష్ప్రభావాలు రావడాన్ని వైద్యులు, నిపుణులు గుర్తించారు. ఇలా ఎవరికి జరుగుతోందని పరిశీలించినప్పడు మళ్లీ కో–మార్బిడ్ ఫ్యాక్టర్స్ వల్లనే ఇలా జరుగుతోందని తేలింది. అంటే డయాబెటిస్, హైబీపీ, ఊబకాయం ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు... ఇలాంటి జబ్బులు ఉండి, వ్యాధినిరోధకత తగ్గినవారిలో ఇలా జరుగుతోందని నిపుణుల పరిశీలనల్లో తేలింది. కాంప్లికేషన్స్ మూడు రకాలుగా... ముక్కు నుంచి ఆల్ఫాక్టరీ ట్రాక్ట్ (వాసన కోల్పోవడం తార్కాణం) ఇమ్యునలాజికల్ పద్ధతి తన రోగ నిరోధక వ్యవస్థే తన మీద ప్రభావం చూపడం (సైటోకైన్ స్టార్మ్) హైపాక్సిక్ ఈవెంట్ డ్యామేజ్ (మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల / నాలుగు నిమిషాల కంటే తగ్గితే శాశ్వతంగా దెబ్బతినే అవకాశం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (మెదడు, వెన్నుపాము, రెటీనా) పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ (నరాలు, గాంగ్లియా, కండరాలు) నాడీ మండలానికి చెందిన ప్రతిదీ దెబ్బతింటుందని ఇప్పటి అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అంటే వచ్చే అనర్థాలన్నీ ఈ ఆరు రకాల అవయవాల్లో వచ్చే ప్రమాదం ఉందన్నమాట. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం కారణంగా కనిపించే లక్షణాలివి... వాసన తెలికపోవడం అనే లక్షణం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. మనలో చాలామందికి తెలిసిన దుష్ప్రభావం ఇది. రుచి తెలియకపోవడం అన్నది కూడా అందరికీ తెలిసిన మరో లక్షణం. జీబీ సిండ్రోమ్: వాస్తవానికి ప్రతి నాడికీ, నరానికీ పైన మైలైన్ షీత్ అనే ఓ పొర ఉంటుంది. ఆ పొరకు ఇన్ఫెక్షన్ రావడమే మైలైటిస్. మైలీన్ షీత్ అనే ఈ పొర వల్లనే మెదడు నుంచి వెళ్లే ఆదేశాలు ఆయా అవయవాలకు వెళ్తుంటాయి. దాంతో మెదడు ఆదేశాల మేరకు ఆయా అవయవాలు స్పందిస్తుంటాయి. మైలైన్ షీత్ అనే ఈ పొర దెబ్బ తినే కండిషన్‌ను ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ లేదా ‘జీబీ సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా ఎవరైనా రోగులు ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన సందర్భంలో దాని అనంతర అనర్థంగా (పోస్ట్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్‌గా) ఈ జీబీ సిండ్రోమ్ చోటు చేసుకుంటుంది. అలాంటప్పుడు మెదడు నుంచి ఏ అవయవానికి కనక్ట్ అయ్యే మైలీన్ షీత్ దెబ్బతింటే ఆ అవయవం చచ్చుపడిపోతుంది. సాధారణంగా ఈ మైలీన్ షీత్ మెల్లగా మళ్లీ నార్మల్కు వస్తుంది. అలా రాగానే ఆ అవయవం కదలికలు కూడా మామూలుగా మారిపోతాయి. ఇలా జరగడానికి సాధారణంగా దాదాపు రెండు నెలలు పట్టవచ్చు. కాళ్లూ, చేతులకు ఇలాంటి పరిస్థితి వస్తే పర్లేదు. కానీ ఏ ఊపిరితిత్తులకు అందాల్సిన ఆదేశాలు అందకుండా పోయే పరిస్థితి వస్తే అది తప్పక మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావం. మిల్లర్ఫిషర్ సిండ్రోమ్ : ఇది కూడా గులియన్ బ్యారీ సిండ్రోమ్ లాంటిదే. ఇందులో కూడా రోగి కండరాలపై నియంత్రణ కోల్పోతారు. ముఖ్యంగా కంటి కండరాలపైనా అలాగే కొన్ని టెండన్స్పైన. పాదం పైకెత్తలేకపోవడం (ఫుట్ డ్రాప్) కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం (క్రాంప్స్) ఫెటీగ్ (అలసట), పనుల్లోగానీ, ఏ వ్యాపకాల్లోగానీ ఆసక్తి లేకపోవడం దేహంలోని చర్మంపైనా లేదా చేతుల్లోని చర్మంపైనా తిమ్మిర్లు, గుచ్చినట్లుగా అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్న భావనతో స్పర్శ తెలియకపోవడం, మండటం, మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు (దీన్ని పారాస్థీషియా అంటారు). ముఖం కండరాలపై నియంత్రణ కోల్పోవడం, ముఖం పక్షవాతానికి గురికావడం (ఫేషియల్పాల్సీ) చూపు మందగించడం, కన్ను, కంటి గుడ్డు కదిలించలేకపోవడం నరాల కారణంగా కనిపించే మానసిక సమస్యలు అయోమయం తీవ్రమైన కుంగుబాటుకు / వ్యాకులత (డిప్రెషన్)కు గురికావడం యాంగై్జటీ (తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం) శారీరక కదలికలు సంబంధించి... వణుకు, దేహాన్ని కదలించేందుకు చేసే ప్రయత్నంలో పాక్షికంగా మాత్రమే అదుపు సాధించే అటాక్సియా వంటి లక్షణాలు ఉంటాయి. మింగడంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. ఈ కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. మరికొన్ని దుష్ప్రభావాలు అలాగే... రాబ్డోమయోలైసిస్ (కండరాలు తీవ్రంగా దెబ్బతినడం, కండరాలు చచ్చుబడిపోవడం వంటి అనర్థాలు ఏర్పడవచ్చు. దాంతోపాటు మూత్రం చాలా చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం, బలహీనత, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలూ అరుదుగా కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు కోవిడ్ కారణంగా గానీ లేదా మరేదైనా కారణంగా గానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు... ఆ అనర్థాలను గుర్తించడానికి సీటీ బ్రెయిన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై స్పైనల్ కార్డ్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. అయితే సీటీ బ్రెయిన్‌తో పోలిస్తే ఎమ్మారై బ్రెయిన్లో చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చికిత్స మెదడుపై ప్రభావం కారణంగా కనిపించిన లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేసే చికిత్సలో శస్త్రచికిత్స చాలా చాలా అరుదుగానే అవసరం పడుతుంది.అయితే కరోనా కారణంగా నరాల ఇబ్బందులు ఏవైనా వచ్చినవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారిలో సమయం గడిచిన కొద్దీ క్రమంగా తెరుకునే అవకాశమే ఎక్కువ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మెదడుకు సంబంధించిన తొలి లక్షణాలు జ్ఞాపకశక్తి తగ్గడం (బ్రెయిన్ ఫాగ్), మాట తడబడటం, మాటల్లో తేడా రావడం ఈ లక్షణాలన్నీ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్లో కనిపించే ప్రధాన లక్షణాలైన తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, ఇటీవల కొత్తగా కనిపిస్తున్న లక్షణాలైన నడుమునొప్పి, కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు (డయేరియా) వంటి వాటికంటే ముందే కనిపిస్తున్నాయి. అంటే ఈ లక్షణాలన్నీ పైలట్ లా ముందే వస్తున్నాయిని నిపుణులు గుర్తించారు. అందుకే అమెరికాలాంటి పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలు లక్షణాలు కనిపించే వరకు ఆగకూడదని, ముందే ఆసుపత్రులకు రావాలని అక్కడి నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కరోనా సోకిన వారిలో 30 % మందికీ ఆక్సిజన్ పెట్టాల్సిన వారిలో 45% రోగులకు వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిన వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని కొన్ని పరిశీలనల్లో తేలింది. మెదడు (సెంట్రల్ నర్వస్ సిస్టమ్)పై దుష్ప్రభావాలివి : తలనొప్పి, పగలు నిద్ర వస్తుండటం, రాత్రి అస్సలు నిద్ర పట్టకపోవడం, స్ట్రోక్ లాగా రావడం, కాలూ చేయీ పని చేయకపోవడం ఇలా జరగడానికి రెండు రకాల కారణాలు... మొదటిది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (ఇస్కిమిక్) వల్ల ఆయా మెదడు భాగాలకు రక్తం అందకపోవడం, దాంతో మెదడులోని ఆ భాగం ఏ అవయవాన్ని నియంత్రిస్తుందో ఆ అవయవంపై దుష్ప్రభావం పడటం, ఇక రెండోది మెదడులో రక్తస్రావం (హేమరేజ్) అయితే ఆలా రక్తస్రావమైన భాగం ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ అవయవభాగంపై దుష్ప్రభావం పడటం. మూర్చ రావడం, మెదడువాపు రావడం వంటి అనర్థాలు కనిపిస్తున్నాయి. అలాగే కొందరిలో పక్షవాతం (స్ట్రోక్), మూర్చ (ఎపిలెప్సీ), మెనింజైటిస్ (మెదడులోని కొన్ని పొరల్లో వాపు కనిపించడం / మెదడువాపు) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇలాంటి మరో దుష్ప్రభావమే మైలైటిస్. అటాక్సియా అనే మరో రకం కండిషన్ కూడా ఏర్పడవచ్చు. సాధారణంగా మన అవయవాలపై మనకు పూర్తిగా నియంత్రణ ఉండటం మనకు అనుభవంలో ఉన్న విషయమే. అయితే కొన్ని అవయవాలు మన నియంత్రణలో ఉండకుండా పోవడం, వాటిపై పాక్షిక నియంత్రణ మాత్రమే కలిగి ఉండే కండిషన్‌ను ‘అటాక్సియా’ అంటారు. ఇది కూడా మెదడుపై కరోనా తాలూకు దుష్ప్రభావం వల్ల కనిపించే మరో అనర్థంగా చెప్పవచ్చు. అలాగే నిద్రకు సంబంధించిన అంతరాయాలు, డిప్రెషన్, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అయోమయం, అంతా గందరగోళంగా అనిపిస్తుండటం వంటివన్నీ ‘కేంద్రనాడీవ్యవస్థ’ పై కనిపించే దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు. -డాక్టర్ పి. రంగనాథం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ చదవండి: మేడమ్ నా వయసు 45 ఏళ్లు.. ఆ ట్యాబ్లెట్లు వాడొచ్చా? -
కోమా నుంచీ బయటపడవచ్చు!
సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్ అన్కాన్షియస్’ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు. 1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్‌గా తీసుకోవడం వల్లగానీ, కార్బన్డయాక్సైడ్, సయనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్ ఆర్గాన్స్) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు. కార్డియాక్ అరెస్ట్ – సాధారణంగా కార్డియాక్ అరెస్ట్‌తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్తో – సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి. అంటే సాధారణంగా 100–140 వరకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్ ఆస్మోలార్ కోమా అంటారు. 2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్ కోమా’ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత. ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను నివారించవచ్చు. హైపర్ న్యాట్రీమిక్ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య. ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. లివర్ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్‌బీసీ, హెచ్‌బీబీ వంటి వైరస్ల వల్ల లివర్ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను ‘గ్లాస్గో కోమా స్కేల్’గా చెబుతారు. ఇందులో స్కేల్ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్ ఆదేశాలకు రోగినుంచి స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. అంటే గ్లోస్గో స్కేల్ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. ►ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. ►బి – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. ►సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. -
మంచి నిద్రతో మెదడుకు మేత!
సాక్షి, హైదరాబాద్: రోజూ ప్రశాంత వాతావరణంలో అంతరాయం లేని మంచి నిద్ర పోవడం చాలా మంచిదని బామ్మలు, పెద్దవాళ్లు చెబుతూ వస్తున్నదే. అయితే మంచి నిద్రలో మెరుగైన ఆరోగ్యంతో పాటు మన ‘మెదడు ఆరోగ్యానికి’కూడా ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలిందని చెబుతున్నారు. మంచి నిద్రతో మెదడులోని మలినాలు, విషపూరితంగా మారే ప్రోటీన్లు దూరం అవుతాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఆరోగ్యవంతమైన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల (న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్) బారిన పడే అవకాశాలున్నాని చెబుతున్నారు. (చదవండి: రాదేమి కునుకు!) ‘మలినాల ను తొలగించడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు నరాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇలా మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంతస్థాయిలో జరుగుతున్నా మంచి, దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతోంది’ అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డా. రవి అల్లాడా వెల్లడించారు. మానవులు మొదలుకుని జంతువులు, పక్షులు, ఫలాలపై వాలే దోమల్లో నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. మంచి నిద్రకు సూత్రాలు.. పొద్దునే నడక, చిన్నపాటి వ్యాయామం. మంచంపై ల్యాప్‌టాప్‌లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించాలి. రాత్రిళ్లు మితంగా తినాలి. నిద్రకు రెండు, 3 గంటల ముందు ఎక్కువగా తినొద్దు. మద్యం, కాఫీ, టీ, చాక్లెట్లు రాత్రి తీసుకోరాదు. æ రాత్రి సమయాల్లో నీలం కాంతి లైట్లకు దూరంగా ఉండాలి. -
షాకింగ్: మహిళల మెదడులో సూదులు
బీజింగ్: ఓ మహిళ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టర్లు ఆమె తలకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టులో ఆమె మెదడులోకి రెండు పొడవైన సూదులు చొచ్చుకెళ్లినట్లు గుర్తించారు. చిత్రం ఏమిటంటే.. అవి తలలోకి ఎలా చొచ్చుకెళ్లాయో ఆమెకి కూడా తెలీదు. దానికి తోడు పుర్రెపై కూడా ఎలాంటి గాయాలు లేవు. దీంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. విచిత్రం ఏంటంటే దీని గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, ఎందుకైనా మంచిదని.. ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్ సమయంలో ఆమె తలలోకి వెళ్లినవి కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయని వైద్యులు గుర్తించారు. (చదవండి: లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!) దీని గురించి వైద్యులు ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. ‘గతంలో ఎప్పుడైనా నీకు సర్జరీ జరిగిందా’ అని అడిగారు. ఇందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చింది. పోనీ.. తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పింది. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. తనకు ఏ రోజు తలకు సంబంధించిన సమస్యలు రాలేదని జుహు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. జుహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని, చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (వైరల్: వందేళ్ల కిందటి శవం నవ్వుతోందా?) అయితే, తాము యాత్రలకు వెళ్లినప్పుడు జుహును పిన్ని ఇంట్లో ఉంచామని, అప్పుడు ఆమె తమ బిడ్డ తలపై రెండు నల్లని గుర్తులు చూశానని తమతో చెప్పిందన్నారు. అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు. -
పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..
పన్ను నొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. పంటిలో ఏర్పడిన చిన్న ఇన్ఫెక్షన్ను నియంత్రించక పోవడంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో 5 నెలల పాటు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. రెండుసార్లు గుండె ఆగిపోయి ప్రాణం పోయినంత పనైంది. దాదాపు 30 కిలోల బరువును కోల్పోయింది. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. తూర్పు యార్క్‌షైర్‌లోని స్నైత్కు చెందిన రెబెక్కా డాల్టన్ (30)కు గత ఏడాది డిసెంబరులో జ్ఞాన దంతంలో చీముగడ్డ ఏర్పడింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన డాక్టరు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీ కావడంతో పట్టించుకోలేదు. దీంతో మార్చి నెలలో మళ్లీ తిరగబెట్టింది. సమస్య తీవ్రమై ఇన్ఫెక్షన్ మెదడు దాకా పాకిపోయింది. ఫలితంగా మతిమరుపు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఆమె తిరిగి వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెదడు, గుండె, కాలేయంలో బాక్టీరియా గడ్డలను గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆమెకు హల్ రాయల్ వైద్యశాలలోని న్యూరోలాజికల్ విభాగానికి తరలించారు. ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత, రెబెక్కా కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందనీ, 30 ఏళ్ల వయసులో కనీసం టాబ్లెట్ కూడా తీసుకోలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడటం తనను షాక్‌కు గురిచేసిందని రెబెక్కా తన బాధలను గుర్తు చేసుకున్నారు. 30 కిలోల కంటే ఎక్కువ బరువు కోల్పోయాననీ, ఇప్పటికీ తన పని తాను చేసుకోలేకపోతున్నానని వాపోయారు. ఈ ఉదంతం జీవితంపై తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. సో... బీకేర్‌ఫుల్. యాంటిబయోటిక్స్ వాడాం కదా..నొప్పి పోయిందిలే అనే నిర్లక్ష్యం అసలు వద్దు..ఎందుకంటే చాలాసార్లు పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మరోవైపు ఆమెకు కచ్చితంగా కరోనా వస్తుందని భయపడిపోయానని రెబెక్కా తల్లి తెలిపారు. అదృష్టవశాత్తూ కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడం సంతోషం కలిగించిందన్నారు. కాగా గతంలో యుకెకు చెందిన ఆడమ్ మార్టిన్ కూడా దాదాపు ఇదే సమస్యతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డారు. పళ్లలో పాప్ కార్న్ ఇరుక్కోవడంతో అది గమ్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది కాస్తా దంతాల నుంచి గుండె వరకు వ్యాపించడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెల్లో ఒక కవాటాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
బీరు, వైన్లతో ఆ రిస్క్..
లండన్ : మద్యం అతిగా సేవించే వారి మాటతడబడటం, చూపు మసకబారడం చూస్తుంటాం. అయితే ఆల్కహాల్ మెదడు వయసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిర్ధిష్టంగా వెల్లడికాని క్రమంలో తాజా అథ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చింది. మద్యం తీసుకునే మోతాదును బట్టి మెదడు వయసు పెరుగుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నిత్యం మద్యం సేవించే 45 నుంచి 81 సంవత్సరాల మధ్య వయసున్న 11,600 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. రోజూ ఒక బీరు లేదా గ్లాస్ వైన్‌ను మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాముతో వారి మెదడు క్రమంగా కుచించుకుపోతున్నట్టు ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది. రోజులో అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ఆల్కహాల్‌తో వారి మెదడు రోజున్నరతో సమానమైన 0.02 సంవత్సరాల వయసు మీరుతుందని పరిశోధకులు గుర్తించారు. మద్యపానం, పొగతాగడం మెదడు వయసుమీరడానికి దారితీస్తుందనేది తొలిసారిగా కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ సదరన్ కాలిపోర్నియా పరిశోధకులు నిర్ధారించారు. రోజూ మద్యం సేవించే వారి మెదడు మద్యం తక్కువగా లేదా అసలు ముట్టని వారి మెదడు వయసుల మధ్య వ్యత్యాసాన్ని ఎంఆర్ఐ ద్వారా పరిశోధకులు పరిశీలించారు. ఒక గ్లాస్ వైన్, పింట్ బీరుకు మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ద్వారా మద్యపాన ప్రియుల మెదడు 0.02 సంవత్సరాలు వయసు మీరుతున్నట్టు వారు లెక్కగట్టారు. పొగతాగేవారిలోనూ ఇదే ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి : చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు... -
రేడియో సర్జరీ అంటే ఏమిటి?
మావారి వయసు 36 ఏళ్లు. ఇటీవల తరచుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దాంతో న్యూరాలజిస్ట్‌ను కలిశాం. ఆయన అన్ని పరీక్షలూ చేసి, మెదడు లోపల కాస్తంత లోతుగా 2.5 సెంటీమీటర్ల సైజ్‌లో కణితి (ట్యూమర్) ఉందని చెప్పారు. ఇలాంటి ట్యూమర్లకు రేడియో సర్జరీ మంచిదని సలహా ఇచ్చారు. మేం చాలా ఆందోళనగా ఉన్నాం. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్లు. ఎంతో భయంగా ఉంది. ఈ సర్జరీ గురించి వివరంగా చెప్పండి. మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే మీరుగానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ట్యూమర్ విషయంలో ఎలాంటి ఆందోళనలూ, భయాలు పెట్టుకోనవసరం లేదు. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్ఆర్ఎస్ (స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ) లేదా రేడియో సర్జరీ అని పిలిచే అత్యాధునిక ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ... కేవలం అనారోగ్యకరమైన కణజాలాన్ని మాత్రమే తొలగించే లక్ష్యంతో డాక్టర్లు సర్జరీ నిర్వహిస్తారు. ఈ లక్ష్యాన్ని రేడియో సర్జరీ మరింత ప్రభావవంతంగా నెరవేరుస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్స్‌రేల నుంచి ఫోటాన్ శక్తిని ట్యూమర్పైకి పంపిస్తారు. మెదడుకు కేవలం 2 గ్రేల రేడియేషన్‌ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ట్యూమర్‌ను సమూలంగా నిర్వీర్యం చేయడానికి అంతకన్నా ఎక్కువ రేడియేషన్ అవసరం. అందుకే స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీలోఒక ప్రత్యేకమైన ఫిల్టర్ గుండా రేడియేషన్‌ను ట్యూమర్పైన మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేస్తారు. ఇందుకోసం 13 నుంచి 22 గ్రే ల రేడియేషన్‌ను వాడతారు. ఇది చాలా ఎక్కువ మోతాదు (హై డోస్) రేడియేషన్. అయినప్పటికీ ఈ రేడియేషన్ అంతా ప్రతి కిరణంలోనూ వందో వంతుకు విభజితమవుతుంది. అయితే మొత్తం రేడియేషనంతా ట్యూమర్‌ను టార్టెట్‌గా చేసుకొని పూర్తిగా దానిమీదే కేంద్రీకృతమవుతుంది. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. ఈ రేడియో సర్జరీలో ఫ్రేమ్ వాడరు. అందుకే దీన్ని ఫ్రేమ్‌లెస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని కూడా అంటారు. అయితే ఈ సర్జరీ చేయాలంటే ట్యూమర్ పరిమాణం 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. కానీ అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే సర్జరీ చేసి, దాని పరిణామాన్ని తగ్గించి, ఆ తర్వాత రేడియో సర్జరీ ద్వారా మొత్తం ట్యూమర్‌ను తొలగించవచ్చు. రేడియేషన్ పంపించిన తర్వాత రెండేళ్లకు కణితి పూర్తిగా కుంచించుకుపోతుంది. 3 నుంచి 5 ఏళ్లలో 60 నుంచి 70 శాతం తగ్గుతుంది. చివరికి మచ్చలాగా మిగులుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్‌లో రేడియోసర్జరీ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఒకేసారి ఐదు ట్యూమర్లనూ తొలగించవచ్చు. ఈ స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ కోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. ఔట్‌పేషెంట్‌గానే ఈ చికిత్సను పూర్తిచేయవచ్చు. ఇది పూర్తిగా నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే దీని కోసం శరీరం మీద ఎలాంటి కోత/గాటు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్ అంటే సాధారణంగా ఎంతోకొంత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఈ రేడియో సర్జరీలో కోత ఉండదు కాబట్టి దీనిలో ఎలాంటి రక్తస్రావమూ ఉండదు. కోత ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. చికిత్స జరిగే సమయంలో ట్యూమర్ కణాలు తప్ప, దాని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన మెదడు కణాలకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. శరీరానికి కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీలో కణితిలోని కణాలు పక్కకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ రిస్కు ఉండదు. సంప్రదాయక శస్త్రచికిత్సలో పొరబాటున మిగిలిపోయిన ట్యూమర్ కణాలను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. చికిత్స చాలా కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణ సర్జరీతో చికిత్స అందించలేని ట్యూమర్లను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. వృద్ధులకు, సర్జరీ చేయడం కుదరని పేషెంట్లకు కూడా ఈ రేడియో సర్జరీని చేయవచ్చు. కాబట్టి మీ డాక్టర్ సూచించిన విధంగా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ వారికి ఈ సర్జరీ చేయించండి. ట్యూమర్ అంటే అది క్యాన్సరేనా? మా ఫ్రెండ్ వాళ్ల నాన్న చాలాకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్నారు. అసలు ట్యూమర్ అంటే ఏమిటి? అంటే అది క్యాన్సరేనా? దీనికి చికిత్స లేదా? శాశ్వత పరిష్కారం ఏమిటి? ట్యూమర్లను ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేమిటి? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి. కణాలు తమ నియతి (కంట్రోల్) తప్పి, విపరీతంగా విభజన చెంది పెరిగితే కణితి (ట్యూమర్) ఏర్పడుతుంది. కణుతులు అన్నీ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కాని కణుతులును బినైన్ ట్యూమర్లు అంటారు. క్యాన్సర్ కణాలైతే కణితి ఏర్పడిన చోటి నుంచి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కానీ బినైన్ కణాలు అలా వ్యాపించవు. కానీ కణితి పక్కనున్న నరంపైన ఒత్తిడి పడేలా చేస్తాయి. దాంతో ఇతర సమస్యలు రావచ్చు. ట్యూమర్ పెద్ద సైజులో ఉన్నా, కీలకమైన నరాల దగ్గర ఏర్పడినా ఫిట్స్ రావచ్చు. మెదడులో ట్యూమర్ వల్ల కొన్నిసార్లు కాళ్లూచేతులు పడిపోవడం లాంటి ప్రమాదం కూడా ఉండవచ్చు. అందుకే బినైన్ కణుతులకు కూడా చికిత్స అందించాలి. బినైన్ ట్యూమర్లను ఒకసారి తొలగిస్తే ఇక జీవితాంతం సమస్య ఉండదు. సాధారణంగా ఈ ట్యూమర్లు జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడతాయి. వీటికి పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) కారణాలూ తోడవుతాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారం లాంటి అంశాలు కణితి ఏర్పడే జన్యుతత్వాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడకుండా నివారించలేము. మంచి ఆహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే కొంతవరకు మేలు. మెదడులో ట్యూమర్ ఉన్నప్పుడు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇవి చాలా వరకు పరీక్షల్లో మాత్రమే బయటపడుతుంటాయి. కణితి పెరిగి మరీ పెద్దగా అయినప్పుడు మాత్రమే ఇబ్బందులు తలెత్తవచ్చు. పదేపదే తలనొప్పి వస్తున్నదంటే మెదడులో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించవచ్చు. తలనొప్పితో పాటు వికారంగా ఉండటం, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ రవిసుమన్ రెడ్డి, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద çహాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బాబుకు ఆటిజమ్... తగ్గుతుందా?
మా బాబుకు నాలుగేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ కనిపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా? ఆటిజమ్ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటేనే నాకు వణుకు వచేస్తోంది. హోమియోలో ఆపరేషన్ లేకుండా చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలపాళ్లు తగ్గడంవల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ రాత్రంతా గురక... మర్నాడంతా మగత పల్మునాలజి కౌన్సెలింగ్స్ నా వయసు 52 ఏళ్లు. ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి రాత్రిళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయి ఉంటోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టమవుతోంది. నిద్రలో పెద్ద శబ్దంలో గురక పెడుతున్నట్లు ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఇక మర్నాడు పగలంతా బాగా అలసటగా ఉంటోంది. నా సమస్య ఏమిటి? ఇదేమైనా ప్రమాదమా? గురక రాకుండా చేయలేమా? స్లీప్ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారిలో నిద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి... అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్పియాలో సంభవించే చాలా ప్రమాదకరమైన పరిణామం అన్నమాట. కారణాలు, పరిణామాలు : టాన్సిల్స్, సైనసైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గండెజబ్బులు ఉన్నవారికి స్లీప్ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం / చికిత్స : ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగానే తీసుకునేలా జాగ్రత్త పడాలి.ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చికిత్స విషయానికి వస్తే స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ డాక్టరుకు చూపించుకోండి. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చురుకైన మెదడు కోసం...
మెదడు చురుగ్గా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. అది పది కాలాల పాటు హాయిగా పనిచేయాలన్నా, చాలాకాలం పాటు మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి. తీసుకోండి. మీ మెదడును చురుగ్గా ఉంచుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ : మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదా: దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) : కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచిది కాదుగానీ... మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు మాంసాహారం (ప్రధానంగా కోడి మాంసం), గుడ్లు, చేపలు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. అయితే ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన మంచి కొవ్వులను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమంగా తయారు చేసే డాల్డా వంటి పదార్థాలో ఉంటాయి. వీటి ద్వారా తయారు చేసే కేక్‌లు, బిస్కెట్లు మెదడును చురుగ్గా ఉంచవు. అమైనో ఆసిడ్స్ : మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు దోహదపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఈ అమైనో ఆసిడ్స్ అన్నవి ప్రోటీన్స్నుంచి లభ్యమవుతాయి. ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువే. విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు) : మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో ఆసిడ్స్‌ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌లో మార్చడంలోనూ బాగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమైవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 70 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. అయితే మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుంటాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం రెండు లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది. ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు రెండు లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకోవాలి. టీ, కాఫీ అనే ద్రవాహారం చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే పరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, దాంతో వేగంగా అలసిపోయేలా చేస్తుంది. కూల్‌డ్రింక్స్‌తో కూడా అదే అనర్థం చేకూరుతుంది. -
అకస్మాత్తుగా కాలూ– చేయి బలహీనం...కారణమేమిటి?
నా వయసు 30 ఏళ్లు. ఒకరోజు నాకు ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టంగా అనిపించింది. అనుమానం వచ్చి డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. దాంతో నేను, మా కుటుంబసభ్యులం చాలా ఆందోళనకు గురవుతున్నాం. నాకు ఎందుకిలా జరిగింది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కారం ఏమిటి? పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ సమస్యకు కారణం దొరకడం మీ అదృష్టం. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల ఈ విధంగా జరుగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరియో వీనస్ మాల్ఫార్మేషన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా కష్టంగా తోచిందని మీరు చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటాం. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలు నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్స్ ఏర్పడి ఉంటాయి. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ ఉన్నట్లు అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. ఒకవేళ మందులతో క్లాట్ కరగకపోతే బ్రెయిన్ సర్జరీ ద్వారా క్లాట్‌ను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం ఏర్పరచవచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట హైదరాబాద్ -
బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!
బుర్ర తక్కువ మనిషి అని మీరెవరినైనా తిట్టారనుకోండి. అవతలి వాళ్లు.. వెంటనే ఇంతెత్తున ఎగురుతారు. నన్ను అంతమాట అంటావా? అని కయ్యానికి దిగుతారు! కానీ.. రష్యాలోని ఓ 60 ఏళ్ల వ్యక్తిని ఈ మాట అంటే మాత్రం పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు! ఎందుకంటారా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇతనికి మెదడులో సగం లేదు కాబట్టి! ఆశ్చర్యంగా ఉందా? అసలు ఎలా బతికాడన్న అనుమానం వస్తోందా? చదివేయండి. మరి.. మాస్కోలోని బుర్నాసియాన్ ఫెడరల్ మెడికల్, బయో ఫిజికల్ సెంటర్లో కొన్ని రోజుల క్రితం 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. ఒక కాలు, చేయి కదపలేకపోతున్నా అని అంటే.. డాక్టర్లు స్కాన్ చేయించారు. తీరా ఆ మెదడు స్కాన్‌ను చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎడమ వైపు భాగం అసలు లేనే లేదు. నల్లటి ఖాళీ మాత్రమే కనిపిస్తోంది. ఇలా సగం మెదడు మాత్రమే ఉంటే.. ఏదో ఒక సమస్య ఉండి తీరాలనుకున్న డాక్టర్లు.. అతడి గురించి వాకబు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చదవడమే కాకుండా.. రెడ్ ఆర్మీలో కూడా పనిచేశాడు. ఏరకమైన ఇబ్బందులూ లేకుండా ఎంచక్కా కుటుంబాన్ని కూడా నడుపుకొచ్చారు. పిండంలో ఉన్న సమయంలోనే అతడి మెదడు సగమే పెరిగి ఉంటుందని.. స్కాన్ల వంటి టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో లేని కారణంగా అతడు భూమ్మీదకు రాగలిగాడని న్యూరాలజిస్ట్ మరీనా అనికినా చెప్పారు. చెడిపోయిన మెదడు భాగాలను అతి అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశమున్నా దుష్పరిణామాలకు దారితీయొచ్చని.. ఈ వ్యక్తి విషయంలో సగం మెదడు లేకపోయినా ఏరకమైన ఇబ్బంది లేకపోవడం అద్భుతమనే చెప్పాలని అంటున్నారు అనికినా. సాధారణంగా మెదడు కుడివైపు భాగం సృజనాత్మకమైన అంశాలకు ఉపయోగపడితే.. ఎడమవైపు భాగం సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్స్ వంటి అంశాలకు పనికొస్తుంది. కానీ ఈ వ్యక్తిలో ఎడమ భాగం లేకున్నా సమస్యలు లేకపోవడం గమనార్హం. -
ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?
జరిగిన కథ: చైనా శాస్త్రవేత్తలు కోతికి మనిషి మెదడును సెట్ చేయడంతో ‘కోతిలోకం’లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కొద్దికాలంలోనే కోతికి మనిషి బుద్ధులు వచ్చాయి. తలకొన అడవిలో రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార కోతి గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్‌లూ ఆయుధాలు తీశాయి. కాని అవి నకిలీ ఆయుధాలు కావడంతో ఇరువర్గాల్లో ఒక్క కోతి కూడా గాయపడలేదు. తరువాయి భాగం:‘‘ఇలా అయితే లాభం లేదు. బాహాబాహీకి దిగి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం’’ బస్తీమే సవాల్ అని అరుస్తూ బాహాబాహీకి దిగాయి రియల్ ఎస్టేట్ కోతి గ్యాంగులు.సరిగ్గా పది నిమిషాల తరువాత...‘‘ఆగండి’’ అనే అరుపు వినబడింది. రెండు గ్యాంగులూ కొట్లాట ఆపి ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాయి.‘‘ఎవరు మీరు? శాంతిదూతా?’’ అడిగింది గ్యాంగ్‌లో ఒక కోతి.‘‘కాదు. ఎల్ఐసీ ఏజెంట్‌ని. నా పేరు పొదుపేష్ కుమార్. ఏటూరునాగారం అడవి నుంచి వస్తున్నాను’’ అన్నది కొత్తగా వచ్చిన ఆ కోతి.‘‘మాతో నీకేం పని?’’ అడిగింది గ్యాంగ్‌లో కోతి.‘‘బాహాబాహీ రక్ష అని కొత్త పాలసీ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ టాక్ ఎబౌట్..’’ అన్నది ఎల్ఐసీ కోతి.‘చెప్పి చావు’ అన్నట్లుగా చూశాయి రెండుగ్యాంగుల కోతులు.ఎల్ఐసీ కోతి చెప్పటం మొదలు పెట్టింది:‘‘బాహబాహీ రక్షలో... డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొట్లాటలో మీ పళ్లు విరిగాయనుకోండి మీరు ఒక్కపైసా జేబులో నుంచి తీయాల్సిన పనిలేదు. డెంటల్ ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు వస్తాయి. మీ తలకు గాయాలుఅయ్యాయనుకోండి...హెడ్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయి. టైమ్ బాగోలేక మీరు పోయారనుకోండి....‘అమర జ్యోతి’ ఇన్సూరెన్స్ స్కీం కింద మీ కుటుంబ సభ్యులకు అక్షరాలా.....ఇంత డబ్బు వస్తుంది....’’ఎల్ఐసీ కోతి నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతుంది. పొదుపేష్ కుమార్ స్పీచ్ ధాటికి రెండు కొతి గ్యాంగులూ మూర్ఛపోయాయి.‘‘అయ్యో పాపం!’’ అనుకుంటూ తలకొన కోతి ఒకటి తాడి చెట్టు ఎక్కి...తాటికల్లు తెచ్చి వాటి ముఖం మీద చల్లింది. అప్పటికిగాని వాటికి మెలకువ రాలేదు.రెండు కోతిగ్యాంగులూ కాస్త తెరుకున్నాయో లేదో...‘‘నమస్కారం. నా పేరు వివాహిత్ విందా. వికారబాద్ అడవిలో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. కోతి మ్యారేజ్ బ్యూరోలలో రెండు తెలుగు స్టేట్స్లో మనదే టాప్. మీకు తెలుసు...పెళ్లి అనేది నూరేళ్ల పంట... ఆ పంట ఫలాలు చేతికందాలంటే మాలాంటి మ్యారేజ్ బ్యూరోలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి. మునుపటి రోజులు కాదు...ఒక కోతికి పెళ్లి జరగాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు. ఎప్పుడైతే మనిషి మెదడు జన్యువులను మన మెదడులో ప్రవేశ పెట్టారో...మనిషి ఆచారవ్యవహారాలు కూడా మనకు వచ్చాయి. అందులో కట్నకానుకలు కూడా ఒకటి. ఈ సిస్టమ్ మనలోకి వచ్చాక మన జాతిలో ‘మ్యారేజ్’ అనే మాటే వినబడం లేదు. కోట్లకు కోట్లు పోసి ఎక్కడ పెళ్లిళ్లు చేస్తామండీ!ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మాలాంటి మ్యారేజ్ బ్యూరోల అవసరం వస్తుంది. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి చాలు...వారం తిరక్కుండానే...ఒక మంచి ఆడకోతిని చూసి మ్యారేజ్ చేసే బాధ్యతను మా మ్యారేజ్ బ్యూరో తీసుకుంటుంది... ఇందుకు మీరు పెద్దగా ఇవ్వాల్సిందేమీ లేదు...మీరు పుచ్చుకున్న కట్నకానుకల్లోనే కొంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుంది...’’ ఇలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూనే....‘‘హాbŒ ...హాచ్...హాచ్’’ అని మూడుసార్లు గట్టిగా తుమ్మింది మ్యారేజ్ బ్యూరో కోతి.అయిదు నిమిషాలు తిరిగేలోపే...అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో నుంచి మూడుకోతులు దిగాయి. తుమ్మిన కోతిని అమాంతం ఎత్తి అంబులెన్స్‌లో పడేశాయి. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఆకోతి అరిచేలోపే చేతికి సెలైన్ పెట్టేశాయి.కొద్దిసేపటి తరువాత...అంబులెన్స్ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టుకు దగ్గర్లో ఏడంతస్తుల ఖరీదైన భవంతి ఉంది.చాలా ఎత్తులో అమర్చిన బోర్డ్‌లో...‘చచ్చినా చావనివ్వం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్’ అనే అక్షరాలు కనిపించాయి.అంబులెన్స్ నుంచి దిగిన మ్యారేజ్‌బ్యూరో కోతికి మాత్రం చుక్కలు కనిపించాయి.‘‘ఏం జరుగుతోంది?!’’ అని అరిచేలోపే....తీసుకెళ్లి ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’లో చేర్చి ఫేస్‌కు మాస్కులు పెట్టారు! ‘‘వామ్మో...వాయ్యో...’’ అంటూ ఆ హాస్పిటల్ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది మిసెస్ వివాహిత్ విందా.డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక కోతి అక్కడికి వచ్చి...‘‘మీ ఆయన పేరు వామ్మో నా? వాయ్యో నా? రెండిట్లో ఏది?’’ అని అడిగింది.‘‘రెండూ కాదండీ...మా ఆయన పేరు వివాహిత్ విందా...’’ అంటూ మళ్లీ ఏడుపు అందుకొంది ఆ కోతి ఇల్లాలు.‘‘ఒహో...సిక్స్ బై టు...సెవెన్ ఇంటూ ఫోర్ పేషెంటా!’’‘‘ఆయన పేరు పేషెంట్ కాదండీ...వివాహిత్ విందా’’‘‘నా బొంద...మాకంటూ ఒక భాష ఏడ్చింది కదా... ఆ భాషలోనే మాట్లాడుకుంటాం! నువ్వు అట్టే కన్ఫ్యూజ్ కాకు. మీ ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించడం జరిగింది. పది నిమిషాలు ఆలస్యమైతే మీకు దక్కేవాడు కాదు. సమయానికి మా అంబులెన్స్ రాబట్టి ప్రాణాలతో మిగిలాడు’’ అని చెప్పింది ఆ డాక్టర్ కోతి.రెండు రోజులు తరువాత వివాహిత్ విందాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.‘‘అయ్యా! మూడు తుమ్ములు తుమ్మిన పాపానికి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్లా!’’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ ముందు వీలైనంత దీనంగా నిలబడ్డాడు వివాహిత్ విందా.‘‘మీ వేలి గోరు స్కాన్ చేయడానికి ఇంతైంది...మీ కాలి గోరు స్కాన్ చేయడానికి, అందులో మట్టిని స్కాన్ చేయడానికి ఇంతైంది...మీరు తుమ్మినప్పుడు బయటికి వచ్చిన సూక్ష్మజీవులు మామూలు సూక్ష్మజీవులేనా...ఈ మధ్య ప్రాణాంతకంగా తయారైన సకోనతుమ్తుమ్ రకం సూక్ష్మజీవులా? అనేది తేల్చడానికి ఇంతైంది...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు సూపరింటెండెంట్ కోతి.ఆయన చెప్పింది వింటూ ‘హాచ్’ అని తుమ్మాడు వివాహిత్ విందా....అంబులెన్స్ వస్తున్న చప్పుడు వినిపించి ‘నన్ను రక్షించండి బాబోయ్’ అని వెనక్కి చూడకుండా పరుగెత్తాడు. – యాకుబ్ పాషా -
మెదడు పనితీరును మెరుగుపరిచే నిద్ర
ఎంతటి మేధావులయినా తమ మేధోతత్వాన్ని ఇనుమడింప చేసుకోవాలంటే కంటినిండా నిద్రపోవాలని, లేదంటే క్రమంగా వారి తెలివితేటలు మసకబారడమే కాకుండా, ఆయుష్షు కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్దాయానికి, మనిషి సగటున రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నాడనే దానికి సంబంధం ఉందని, కంటినిండా నిద్రపోయేవారు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని ప్రొఫెసర్ జేమ్స్ రోలండ్ చెబుతున్నారు. మనిషి ఎంత పట్టుదలతో ఉన్నా, మహా అయితే 48 గంటలు మాత్రమే నిద్ర పోకుండా ఉండగలడని, ఆ తర్వాత కూడా నిద్ర ఆపుకోవాలని చూసినా, అది ఫలించదని, నిద్ర ముంచుకు రావడమే కాకుండా అప్పటికే శరీరంలో మితిమీరిన రీతిలో అవలక్షణాలు తొంగి చూస్తాయంటున్నారు పరిశోధకులు. అసలు అలా కావాలని నిద్రను నిలుపుకొంటే పూర్తిగా చావును కొనితెచ్చుకున్నట్టే అవుతుందనీ, ప్రఖ్యాత ప్రజావైద్యుడు ద్వారకానాథ్ కొట్నిస్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనా– జపాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులకు ఏకబిగిన నిద్రను లెక్క చేయకుండా దాదాపు మూడురోజులపాటు శస్త్ర చికిత్స చేయడం వల్ల అతని శరీరంలో ఎన్నో విపత్కర పరిణామాలు తలెత్తాయనీ, దాంతో 32 సంవత్సరాల వయస్సులోనే మూర్ఛవ్యాధి సోకడం వల్ల మరణించాడని గుర్తు చేస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన ప్రఖ్యాత ప్రజావైద్యుడు, ప్రపంచంలోనే వైద్యవృత్తిలో ధర్మాత్ముడిగా, ఆ వృత్తికి అత్యంత హుందాతనాన్ని, యశస్సును తీసుకొచ్చిన నార్మన్ బెతూన్. 49 ఏళ్లకే చనిపోయాడనీ, అందుకు కారణం కేవలం నిద్ర సరిగాపోకుండా విపరీతమైన సేవా కార్యక్రమాల్లోను, కొత్త శస్త్ర చికిత్స పరికరాల రూపకల్పనలోను తలమునకలు కావడమేననీ, ఈ విషయాలు ఎంత పాతవైనప్పటికీ, నిద్రపోకుండా ప్రయోగాలు, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసి తీరాలంటున్నారాయన.దీనిని బట్టి చూస్తుంటే పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో రేయింబవళ్లు విద్యార్థుల్ని బట్టీలు పట్టించి చదివిస్తే ర్యాంకులు వస్తాయి గానీ మేధో పరిణితి, విచక్షణ, సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నూతనత్వం, ఉత్తేజం, ఉత్సాహం, తాజాదనం నేటి విద్యార్థుల్లో రాకపోవడానికి, లేకపోవడానికి గల కారణాలలో నిద్ర సరిగా లేకపోవడం కూడా ఒకటని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నిద్ర పోవాలి. ఏదో ఒక గమ్యం మీద కలలు కనాలన్నా, ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నా నిద్ర తప్పనిసరి అన్నమాట. -
‘ఐఓఎన్ఎమ్’ అంటే ఏమిటి?
మా మనవడి వయసు 9 ఏళ్లు. చిన్నతనం నుంచి తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో పెద్దహాస్పిటల్లో చూపించాం. ‘బ్రెయిన్ ట్యూమర్’ అని చెప్పారు. చూపు, వినికిడి ఎఫెక్ట్ అయ్యేలా ట్యూమర్ ఉందన్నారు. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్తగా ‘ఐఓఎన్ఎమ్’ పద్ధతిలో ట్యూమర్ తొలగించారని పేపర్లలో చదివాం. మా బాబు చాలా చిన్నవాడు. ట్యూమర్ కారణంగా వాడి చూపుకు, వినికిడికి లేదా ఏదైనా ముఖ్య అవయవానికి లోపం జరిగితే వాడికి జీవితాంతం శాశ్వతమైన ఇబ్బంది ఏర్పడుతుందనే ఆందోళన ఉంది. దయచేసి మాకు ఐఓఎన్ఎమ్ పద్ధతి అంటే ఏమిటో విపులంగా వివరించి, మా మనవడి గురించి సలహా ఇవ్వండి. మీ మనవడి ట్యూమర్ మెదడులో ‘చూపు, వినికిడి’ నియంత్రించే భాగానికి ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. మీరు ఆందోళన చెందకండి. ఇలాంటి సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి న్యూరో సర్జరీలు, స్పైన్ సర్జరీలు ఇప్పుడు ఐఓఎన్ఎమ్ సర్జరీ ప్రక్రియతో విజయవంతమవుతున్నాయి.ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఐఓఎన్ఎమ్. మెదడు ఆపరేషన్లలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులోని మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలూ, అవయవాలకు సంబంధించిన ప్రాంతాల్లోని గడ్డలను/ట్యూమర్లను తొలగించడం చాలా రిస్క్‌తో కూడికున్న పని. ఎందుకంటే గడ్డలను తొలగించే ప్రయత్నంలో ఆయా ప్రాంతాలకు దెబ్బ తగిలితే, సంబంధిత అవయవం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యాధునికమైన ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3టీ ఎమ్మారైతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) విధానం... సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా మెదడు కణజాలం దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ వరకు మాత్రమే తొలగించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్లు మొత్తం నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ, మిగతా భాగాలకు ఎలాంటి హానీ జరగకుండా పర్యవేక్షిస్తుంటారు. ఐఓఎన్ఎమ్ పద్ధతిలో సర్జరీ నిర్వహించే సమయంలో ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్‌ను పూర్తిగా తొలగించామా, లేదా అనే విషయాన్ని ఆపరేషన్ థియేటర్లోనే నిర్ధారణ చేసుకొని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. అందువల్ల మన జీవితంలో ఎంతో కీలకమైన... మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ప్రధాన కార్యకలాపాలు దెబ్బతినకుండా, కోల్పోకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఫలితంగా చాలా సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీల్లో రీ–డూ (మళ్లీ మళ్లీ చేయాల్సిన ఆపరేషన్లు) చేయాల్సి అవసరం రాకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. మొత్తం గడ్డను/ ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి మీ మనవడి విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... ఆ సౌకర్యాలు ఉన్న పెద్ద హాస్పిటల్స్‌లో ఒకసారి సంప్రదించండి. నడుముకు శస్త్రచికిత్స అంటున్నారు... ఆందోళనగా ఉంది నా వయసు 40 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 60 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్ను ఎమ్మారై తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూసలోని నరాలపై ఎక్కడ ఒత్తిడి పడుతోందో గుర్తించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ–హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడే రోగిని ఇంటికి పంపించేస్తారు. మొదట మీరు మీ ఎమ్మారై, ఇతర రిపోర్టులతో న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిజ్ఞానంతో మిగతా భాగాలకు ఎలాంటి లోపం/వైకల్యం రాకుండా శస్త్రచికిత్స చేయగలరు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంటి పాపాయిలను ఘనాహారం వైపు మళ్లించడం ఎలా? తల్లి పాలు తాగుతూ ఉండే చిన్నారులకు నాలుగో నెల రాగానే అన్నప్రాశన చేసి, వారు మెల్లగా ఘనాహారం తీసుకునేలా అలవాటు చేస్తుంటారు. ఇలా పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని ‘వీనింగ్’ అంటారు. ఇలా వీనింగ్ తర్వాత పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, టిష్యూల అభివృద్ధి కోసం మెుదటి ఏడాదిలో ఇవ్వాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. వీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి వీనింగ్ ప్రక్రియలో కొన్ని ఆహారాపు అలవాట్లను అవాయిడ్ చేయాలి. ►గిన్నెలో ఉన్నది పూర్తికావడం కోసం వాళ్లు వద్దంటున్నా బలవంతంగా పెట్టకండి. ►వాళ్ల దినచర్యకూ, వాళ్లు తీసుకుంటున్న ఆహారానికి వుధ్య సవుతౌల్యం (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోండి. ►వాళ్లకు ఏదైనా బహువూనంగా ఇవ్వదలచుకుంటే అది ఆహారపదార్థాలై ఉండకుండా జాగ్రత్తపడండి. (కొందరు అదేపనిగా ఫలానాది చేస్తే చాక్లెట్లను బహువూనంగా ఆశపెడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు). పిల్లలను వురీ ఎక్కువ తియ్యగా ఉండే మిఠాయిలకూ, ఉప్పగా ఉండే చిప్స్ వంటి పదార్థాలకు అలవాటు చేయకండి. మంచి స్వాభావికమైన ఆహారపదార్థాలైన కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను పిల్లలకు అలవాటయ్యేలా చూడండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్ర... పరీక్షకు రక్ష!
నిద్రపోవడం అంటే... మెదడుకు శక్తినివ్వడమే.పరీక్షల సమయంలో అయితే... జ్ఞాపకశక్తినివ్వడమే.చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికిరాత్రి నిద్రే కాదు... మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.ఆ వివరాలను మెలకువతో మెళకువగాతెలుసుకోండి. ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు. రాత్రిళ్లు చాలా ఆలస్యంగా పడుకోవడం, మళ్లీ పొద్దున్నే త్వరగా లేవడం లాంటి చర్యలతో తమ నిద్ర సమయాన్ని కుదించుకుంటారు. దాంతో మామూలుగా నిద్ర పోయే వ్యవధి కంటే చాలా తక్కువగా నిద్రపోతుంటారు. పరీక్షల సమయంలో ఇలా చేయడం ఎంత వరకు సబబు? పరీక్షల్లో చదవడానికి నిద్ర ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ సమయంలో నిద్ర తగ్గడం మంచిదేనా? నిద్రనూ, చదువునూ సమన్వయపరుచుకుంటూ పరీక్షల సమయంలో ఎలా చదవాలి? ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పిల్లల్లో నిద్ర చాలా ప్రధానం. అందునా చిన్నపిల్లలతో పాటు, ఇప్పుడు పరీక్షలకు చదువుతున్న టీనేజ్‌లో ఉండే పిల్లలకూ తగినంత సేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కరూ సరిగ్గా నిర్ణీతంగా ఇంత సమయం నిద్రపోవాలని చెప్పలేకపోయినప్పటికీ, మర్నాడు నిద్ర లేచాక తమకు అలసటగా ఉండటం, నిస్సత్తువగా లేదా నీరసంగా ఉండటం, మాటిమాటికీ చికాకు కలగకుండా ఉండటానికి ఎంత నిద్ర అవసరమో అంతసేపు నిద్రపోవాల్సిందే. పరీక్షలప్పుడు కూడా అంతే నిద్ర అవసరం. కాకపోతే పరీక్షల పేరిట పిల్లలు తాము అంతకు ముందు చదువుతున్న అంశాలను బ్రష్ అప్ చేసుకోడానికి ఒక గంట, గంటన్నర కేటాయించి, ఆ మేరకు మాత్రమే మెలకువతో ఉండటం మంచిది. ఏదో ఒక రోజు నిద్ర తగ్గితే పర్లేదుగానీ... అలా కాకుండా... రోజులో తాము నిద్రపోయే మొత్తం వ్యవధిలో రెండు గంటలకు మించి నిద్ర తగ్గడం అంత మంచిది కాదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే... పిల్లల్లో నిద్ర సమయంలో ఎన్నో కీలకమైన జీవక్రియలు జరుగుతుంటాయి. దాంతో నిద్ర వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. టీనేజ్‌లో ఉండే పిల్లల్లో అప్పుడప్పుడే యుక్తవయసులోకి వస్తుండటంతో వారిలో ఎన్నో రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. ఈ హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడం జరుగుతుంది. అందుకే పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తే, అవి పెద్దయ్యాక కూడా వారి సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రిపేర్ల ప్రక్రియ అంతా నిద్రలోనే : మనం నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అంటే మనం తగినంత నిద్రపోకుండా ఉంటే మనలోని రోజువారీ పనులు లేదా జీయక్రియల్లో దెబ్బతిన్న అంశాల రిపేర్లు అంత సమర్థంగా జరగవన్నమాట. నిద్రపోతేనే ఎత్తు పెరిగేది: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే స్రవిస్తుంది. కాబట్టి పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా ఎత్తు పెరగగలరు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలనూ బలపడేలా చేస్తుంది. అవి బలిష్టంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. ఇక పరీక్షలు రాసే మన పిల్లలంతా ఎదిగే వయసులో ఉండేవారే. ఏదో ఒకరోజో, రెండు రోజులో కాసేపు నిద్ర పోకపోతే దాని వల్ల జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పరీక్షలు సాధారణంగా రెండు లేదా మూడు వారాల పాటు జరుగుతుంటాయి. అంతకాలం నిద్రకు దూరం కావడం అంటే మన ఎదుగుదలనూ మనమే చేజేతులారా దెబ్బతీసుకున్నట్టే. చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి : పరీక్షల సమయంలో మనం చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి నిద్ర ఎంతగా దోహదం చేస్తుందో చూద్దాం. మనలో జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిదాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. మనం ఏదైనా చదవగానే మనకు అర్థమైనదంతా తిరిగి చెప్పాలంటే చెప్పగలం. కానీ కొంతకాలం తర్వాత దాన్ని మరచిపోవచ్చు. మళ్లీ చదివితే తప్ప అది గుర్తు రాదు. ఏదైనా చదివింది చాలాకాలం గుర్తుండాలంటే అది జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియలో రెండోదైన శాశ్వత జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ)లోకి వెళ్లాలి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్న అంశం... షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్లే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పరీక్షల కారణంగా రాత్రిపూట ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ వ్యవధి రాత్రి ఒక గంట ఆలస్యంగా పడుకోవడమో, ఉదయం ఒక గంట ముందుగా నిద్రలేచి ఆ సమయాన్ని చదువుకు వాడకోవడమో మంచిది. అంతకు మించి నిద్రను దూరం చేసుకోవడం పిల్లలకు మంచిది కాదు. నిద్రపోకుండా చదివితే కీడే ఎక్కువ : నిద్రపోకుండా చదువుకోవడం ఎందుకు మంచిది కాదో చెప్పడానికి ఎన్నో అధ్యయనాలున్నాయి. పరీక్షల పేరుతో నిద్రపోకుండా ఉండటం వల్ల జరిగే అనర్థాల్లో కొన్ని ఇవి... నేర్చుకునే శక్తి తగ్గుతుంది : íపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారిలో నేర్చుకునే శక్తి మందగిస్తుంది. అంతేకాదు... వారి ఏకాగ్రత సైతం తగ్గుతుంది. చురుకుదనం లోపిస్తుంది. ఏదైనా అంశం మీద దృష్టి కేంద్రీకరించే శక్తి, రీజనింగ్ పవర్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బాగా తగ్గుతాయి. పిల్లలు మందకొడిగా అయిపోతారు. పరీక్షల సమయంలో పైన పేర్కొన్న అంశాలు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకే చదువుకునే సమయం కాస్త తగ్గినా పర్లేదుగానీ... చిన్నారుల నిద్ర సమయం మాత్రం తగ్గనివ్వకూడదు. పిల్లల మూడ్స్‌కు అంతరాయం : నిద్రలేమితో బాధపడేవారి పిల్లల మూడ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి అంశాలకే తీవ్రంగా స్పందించడం, చిన్న చిన్న అంశాలకే చికాకు పడటం వంటి ఎక్స్ట్రీమ్ మూడ్స్ ప్రదర్శిస్తుంటారు. అదే బాగా నిద్రపోయిన వారు కాస్త స్థిమితంగా ఉంటారని అధ్యయనవేత్తలు తెలుసుకున్నారు. పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి వాళ్ల మూడ్స్ కూడా బాగుండటం చాలా అవసరమన్నది తెలిసిందే కదా. పదాల కోసం తడుముకోవడం : ఇక నిద్ర కోసం జరిగిన మరో పరిశోధనలో వెల్లడైన వివరాలివి... క్రితం రాత్రి నిద్రలేమితో బాధపడ్డవారూ, కంటినిండా నిద్రపోయిన వారు... ఇలా రెండు విభాగాలను తీసుకొని ఒక అధ్యయనం నిర్వహించారు. నిద్రలేమితో బాధపడ్డవారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయినట్లు, ఏదైనా రంగులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించడంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు, మాట్లాడే సమయంలో పదాల కోసం తడుముకున్నట్లు తెలుస్తోంది. అదే బాగా నిద్రపోయిన వారిలో ఈ సమస్య ఎదురుకాలేదు. పైగా నిద్రలేమితో ఉన్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు కూడా అధ్యయనవేత్తలు గుర్తించారు. పరీక్షల కోసం తయారయ్యే పిల్లలకు పదసంపద (వకాబ్యులరీ) ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. చదివిన అంశాలను పరీక్షల్లో రాసే సమయంలో వారికి పదాలు (వకాబ్యులరీ) వెంట వెంటనే తడుతూ ఉండాలి. అలా తట్టాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. ఒకటీ రెండూ కాకుండా... ఈ విషయాలన్నీ నిద్ర గురించి వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు జరిపిన దాదాపు 70 అధ్యయనాల్లోనూ ఇదే తేలింది. పరీక్షల సమయంలో నిద్ర మానేసి చదవడం అంత శ్రేయస్కరం కాదని ఇటు పిల్లలూ, అటు పెద్దలూ గుర్తించాలి. పరీక్షల సమయంలో నిద్రను సమన్వయించుకోవడానికి ఈ కథనంలో పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. మిగతా పదహారు గంటలు చదువుకోసం కేటాయించవచ్చు. అలా కుదరకపోతే మీ రాత్రి నిద్రను ఆరుగంటల కంటే ఎట్టిపరిస్థితుల్లో తగ్గనివ్వవద్దు. అది మీ చదువుకు మేలు చేకూర్చకపోగా... మీకు (పిల్లలకు) కలిగే నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోండి. పరీక్షల సమయంలో మీ పడక, నిద్ర ఎలా ఉండాలంటే... చదివే ప్రదేశం ప్రకాశవంతంగా ఉండాలి: కొంతమంది పిల్లలు చదివేదానిపై బాగా దృష్టి కేంద్రీకరించడం కోసం టేబుల్ లైట్ మాత్రమే వేసి, గదంతా చీకటిగా ఉంచుతారు. చదువు ఒంటబట్టడానికి ఈ తరహా వాతావరణం సరికాదు. మీరు చదివే గదంతా వెలుతురు పరచుకుని ఉన్నప్పుడే చదువు బాగా మనసుకెక్కుతుందని గుర్తుంచుకోండి. పడక దీనికి భిన్నంగా ఉండాలి. మీరు పడుకునే చోట మసక వెలుతురుండాలి. మీరు చదివే గది దేదీప్యమానంగా ఉండాలి. మీ పడక పడుకోవడం కోసమే: కొంతమంది పిల్లలు పడకపై పడుకొని చదువుతుంటారు. నిజానికి కూర్చొని చదవడమే మంచిది. బెడ్‌పై చదవడం, ల్యాప్‌టాప్ బ్రౌజింగ్ చేయడం, సెల్‌ఫోన్ చూసుకోవడం.. ఇలాంటి పనులేవీ చేయకండి. చదవడం అన్నది డెస్క్ దగ్గర. పడుకోవడం మాత్రమే బెడ్ మీద. పడకగది చీకటిగా ఉంటేనే మెదడులో మెలటోనిన్ అనే రసాయనం స్రవిస్తుంది. నిద్రపట్టడానికి ఈ రసాయనమే దోహదపడుతుంది. నిద్రకు రెండు గంటల ముందే భోజనం : మీరు పరీక్షలకు చదువుతున్నా లేదా మామూలు సమయంలోనైనా... మీరు పడకకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు. ఇలా కుదరకపోతే కనీసం గంట ముందన్నా భోజనం పూర్తి చేయండి. హెవీ మీల్ తినేసి, అప్పుడు మీరు చదువుకోడానికి కూర్చున్నా అది కునికిపాట్లకు దారితీస్తుంది తప్ప ఏకాగ్రత కుదరదు. రోజూ అదే వేళకు... ‘అర్లీ టు బెడ్.. అర్లీ టు రైజ్’ అని వాడుక. అంటే పెందలాడే పడుకొని, పెందలాడే నిద్రలేవడం మంచి అలవాటని అర్థం. పరీక్షలున్నా లేకపోయినా... వేరే పనులున్నా... సెలవుల సమయమైనా, హాలిడే ఉన్నా ఈ అలవాటు తప్పనివారిలో ఏకాగ్రత, చదివింది అర్థం చేసుకునే శక్తి ఎక్కువ అని అనేక అధ్యయనాల్లో తేలింది. నీళ్లు ఎక్కువగా తాగండి : సాధారణంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచి అలవాటన్నది తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో, బాగా చదివే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు పిల్లల్ని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలోని మిగతా అవయవాలతో పాటు మెదడుకూ మంచి హైడ్రేషన్ ఉండటం వల్ల చదివింది గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. మరిన్ని సార్లు మూత్రవిసర్జనకు లేవాల్సిరావడం కూడా వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. మధ్యాహ్నం పూట ఓ పవర్ న్యాప్ : పరీక్షలకు చదివే సమయంలో రాత్రి నిద్రపోని పిల్లలు మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు నిద్రపోవడం మంచిది.ఈ పవర్‌న్యాప్ వారిలో మరింత శక్తిని పెంచుతుంది. అయితే ఈ పగటి నిద్ర కేవలం అరగంటకు మాత్రమే పరిమితం కావాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోతే అది రాత్రి మళ్లీ నిద్రలేమికి దారితీయవచ్చు. దాంతో మర్నాడు పగటిపూట మందకొడిగా, చికాకుగా, నిస్సత్తువగా ఉండవచ్చు. అందుకే పవర్‌న్యాప్ అన్నది కేవలం చదివే పవర్‌ను పెంచేలా ఉండాలి. అది అరగంటకు మించకూడదు. రాత్రి కష్టమైన టాపిక్స్ చదవవద్దు : మీకు కష్టం అనిపించినవీ, కఠినమైనవీ రాత్రిపూట చదవకండి. కేవలం మననం చేసుకునేవీ, మనసులో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు చదివేవి మాత్రమే రాత్రిపూట చదవండి. ఒక్కోసారి అలా చదివే సమయంలో అది రాత్రి నిద్రలేమికి దారితీయవచ్చు. కాబట్టి కఠినమైనవీ, టఫ్ సబ్జెక్టులను పగటివేళే చదవండి. లెక్కలూ... రీజనింగ్ కోసం నిద్ర అవసరం ఎంతంటే... విక్టోరియా (ఆస్ట్రేలియా)లోని ప్రవుుఖ పిల్లల పరిశోధన సంస్థ ‘వుర్డోక్ చిల్డ్రెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన ఓ అధ్యయన బృందం 4500 వుంది పిల్లలపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో నిద్రసమస్యలు ఉన్న పిల్లల కంటే... రాత్రి బాగా నిద్రపోయిన పిల్లలు క్లాస్‌రూమ్‌లో మిగతా పిల్లలు తవు టీచర్లతో వ్యవహరించేటప్పుడూ, లెక్కలు చేసేటప్పుడూ మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంటే రీజనింగ్‌తో వ్యవహారాలను సమర్థంగా నెరపడానికీ, మ్యాథ్స్ బాగా చేయడానికి కూడా కంటినిండా నిద్రపోవడం అన్నది బాగా ఉపకరిస్తుంది. ‘‘నిద్ర సవుస్యలు ఉన్న పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సవుస్య వస్తే– అది తగ్గే తీరు, కోలుకునే వ్యవధి వంటివి మిగతా పిల్లల కంటే కాస్తంత తక్కువే. అదేగానీ పిల్లలకు సరిపోయినంత నిద్ర ఉంటే వాళ్లలో దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సస్ట్రేషన్) కూడా ఎక్కువ. అంతేకాదు– సవుస్యలను పరిష్కరించే (ప్రాబ్లమ్ సాల్వింగ్) శక్తి కూడా అధికం. పైగా వర్క్‌లోడ్ తీసుకునే సావుర్థ్యం కూడా పెరుగుతుంది’’ అన్నది ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన జాన్ క్వాష్ చెబుతున్న మాట. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బ్రెయిన్ డైట్
మెదడుకు మనం చెబుతామా? మనకు మెదడు చెబుతుందా? ఇది పెద్ద పజిల్! మనం ఏమి తినాలో, ఏవి రుచిగా ఉంటాయో, ఏది హానికరమో, ఏది శ్రేష్ఠమో మనకు చెప్పేది బ్రెయినే! అయితే పరీక్షల టైమ్‌లో పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి వారు ఏమి తినాలో మెదడుకు ఎక్కించేదే ఈ కథనం. పిల్లల పరీక్షల సీజన్ ఇది. చదివిందంతా గుర్తుపెట్టుకోవాలని అటు పిల్లలకూ ఉంటుంది. ఇటు తల్లిదండ్రులదీ అదే కోరిక. ఎగ్జామ్స్‌లో వాళ్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలని కూడా అటు పిల్లలూ, ఇటు పేరెంట్స్ కోరుకుంటారు. చదివిందీ, విన్నదీ, చూసింది గుర్తుపెట్టుకోవలసిన విజ్ఞానానికి భాండాగారమే మెదడు. కేవలం అలా చదివేసి మెదడులో నిక్షిప్తం చేసుకుంటే చాలదు... అలా దాచుకున్నది కాస్తా అవసరమైనప్పుడు టక్కున స్ఫురించాలి. స్ఫురించింది పూర్తిగా వరుసగా గుర్తుకురావాలి. అప్పుడే గుర్తుకొచ్చిన ఆ విషయాలను పిల్లలు పరీక్ష పేపర్ మీద రాయగలుగుతారు. చురుగ్గా ఉన్న మెదడే ఇలా విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడం... అలా చేసుకున్నదాన్ని అవసరమైనప్పుడు బయటకు తీయడం చేస్తుంది. మరి మన పిల్లల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండటానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి వారు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో మరో మాటగా చెప్పాలంటే పేరెంట్స్ వారికి పెట్టాల్సిన ఫుడ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందుగా మెదడు గురించి సంక్షిప్తంగా... మన శరీరం బరువులో మెదడు బరువు కేవలం 2 శాతం. కానీ ఒంటికి అందే ఆక్సిజన్‌లో దానికి 20 శాతం కావాలి. శరీరం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే కావాలి. దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. పిల్లలు మొదలుకొని మన వరకూ అందరమూ విజ్ఞానాన్నంతా మెదడు కణాల్లోనే నిక్షిప్తం చేసుకుంటాం. మనం చదివిందంతా బాగా గుర్తుండిపోవాలంటే మాటిమాటికీ మననం చేసుకుంటాం. అప్పుడది తాత్కాలిక జ్ఞాపకం నుంచి శాశ్వత జ్ఞాపకంలోకి మారిపోతుంది. మనం అప్పటికే ఏర్పరచుకున్న జ్ఞాపకాలతో మెదడులో ఒక లైబ్రరీ ఏర్పడుతుంది. ఏదైనా కొత్త విషయం వస్తే అది మదిలో పదిలంగా ఉందా లేదా అన్నది మెదడు చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఆ లైబ్రరీలోని కొత్త పుస్తకంలా నిల్వ చేసుకుంటుంది. ఉన్నదే అయితే అది మరోసారి అప్డేట్ అవుతుంది. గుర్తుంచుకోవడం అంటే ఏమిటి? అదెలా జరుగుతుంది? ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని... మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. గుర్తుంచుకోవడం అన్నది మామూలుగానే జరుగుతుందని అనిపిస్తుంటుంది. కానీ చాలాకాలం గుర్తుంచుకోవాలంటే కొంత ధారణ అవసరం. ఒక సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఈపనిని మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం చాలా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ) అంటాం. ఇలా లాంగ్ టర్మ్ మెమరీ అంటా మెదడులోని నియోకార్టెక్స్ అనే భాగంలో నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు అక్కడినుంచి మనం గుర్తుతెచ్చుకుంటాం. ఇలా జ్ఞాపకం పెట్టుకోవడంతో పాటు అవసరమైనప్పుడు గుర్తుతెచ్చుకోవడానికి మెదడు చురుగ్గా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన మంచి ఆహారాలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. మంచి ఆహారాలు అంటే సమతౌల్యంగా ఉండే అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మైక్రోన్యూట్రియెంట్ల వంటివి. చెడు ఆహారాలు మెదడును మందకొడిగా చేస్తాయి. జంక్‌ఫుడ్, కోలాడ్రింక్స్, పరిమితి దాటినప్పుడు కాఫీ, టీల వంటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారాలు... కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్: మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే ముందుగా శరీరం నుంచి కనీసం 15 శాతం తీసుకునే దానికి శక్తినిచ్చే గ్లూకోజ్ సరిగా అందాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచివి కాదన్న విషయం తెలిసిందే. కానీ మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’ పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వాటితోపాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. ఏ కొవ్వులు మెదడుకు మంచిది కాదు? మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజినేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారుచేసే కేక్‌లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అలాగే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంచడం కోసం వాడే మార్జరిన్ వంటి కృత్రిమ నూనెలు మంచివి కాదు. తినుబండారాలు కొనే సమయంలో జాగ్రత్త: మనం మార్కెట్లో కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా పరిశీలించి, అందులో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. మెదడుకు అవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు ఎక్కువగా తినాలి. శాకాహారులు ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆలివ్ ఆయిల్ వంటి నూనెలపై ఆధారపడవచ్చు. అమైనో యాసిడ్స్: మెదడులోని అనేకకణాల్లో ఒకదానినుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే మెదడులోని అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనో యాసిడ్స్’. మనకు ప్రోటీన్స్నుంచి ఈ అమైనో యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇక ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే మనందరి మూడ్స్ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టోఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. పిల్లలు చదివిందంతా షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి నిక్షిప్తం కావడమనే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పిల్లల్లో మంచి జ్ఞాపకశక్తి ఉండాలంటే, వారికి నిద్ర కూడా అవసరమైనంతగా ఉండాలి. అందుకు ట్రిఫ్టొఫాన్ బాగా దోహదం చేస్తుంది. అందుకే వారికి రాత్రి పడుకోబోయే ముందర గోరువెచ్చని పాలు ఇవ్వడం చాలా మంచిది. విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి తాజాకూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. అయితే ఇటీవల స్ట్రిక్ట్ వెజిటేరియన్ పదార్థాలు మాత్రమే తీసుకునే ఇండ్లలోని పిల్లలకు, ఎండకు సోకని చిన్నారుల్లో విటమిన్ ‘డి’ లోపించే అవకాశాలు ఎక్కువ. ఆధునిక జీవనశైలి వల్ల ఇప్పుడీ కండిషన్ చాలామందిలో చోటుచేసుకుంటోంది. ఇలాంటివారు విధిగా విటమిన్ డితో పాటు విటమిన్ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా పిల్లల్లో నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది. నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మనమూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటినుంచి భర్తీ అవుతుంది. రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం తగ్గుతుంది. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మన అందరి మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతోపాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు (ఈ పండ్లరసాల్లో చక్కెర వేయడం సరికాదు. చక్కెర ఎక్కువైనా అది మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది), రాగిజావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి... పిల్లలు తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకునేలా చూడండి. ఇది పిల్లలతోపాటు అందరికీ అవసరం. పరీక్షలకు వెళ్తున్న పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్.... మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. దాంతోపాటు విటమిన్–బి6, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, యాపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు. మెదడుకు మేలు చేసే ఆహారాలు: నేరుగా చెప్పాలంటే మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి వారు తినే ఆహారంలో ఈ కింది అంశాలు/పదార్థాలు ఉండేలా చేసుకోండి. పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు: కూరగాయల్లో పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితోపాటు డార్క్/బిట్టర్ చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. చేపల్లో: పండుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్)... వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. మెదడుకు హాని చేసే ఆహారాలు : టీ, కాఫీలు డీహైడ్రేషన్... అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే అవి చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే అది మెదడును ముందుగా చురుగ్గా చేస్తుంది. అయితే ఈ చర్యవల్ల మెదడు వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్స్‌వల్ల కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. ►ఉప్పు ఒంట్లోని నీటిని తొలగించి డిహైడ్రేషన్కు దారితీస్తుంది. కాబట్టి నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్ మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగానే తీసుకోవాలి. ►మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతోపాటు మెదడుకూ అది చేటు చేస్తుంది. అది జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది. కాబట్టి తక్కువ ఉప్పు తీసుకునేలా పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది. ►కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలనే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా తీసుకునేలా చూడాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బజారాహిల్స్,హైదరాబాద్ -
ఆకలి పొలం
ఒకరోజు.. రాత్రి.. పార్టీ జరుగుతోంది... ‘‘తమ్ముడూ.. నిజంగానే దయ్యాలు లేవంటావా?’’ అన్నాడు ఆ ఊరి సర్పంచ్ మనసులో కాస్త బెరుకుతోనే. ‘‘దయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్ సర్పంచ్ సాబ్..’’ అని అంటూ‘‘ఏమ్రా అజయ్..ఉన్నయా?’’ అడిగాడు పక్కనే ఉన్న తన కజిన్‌ను. వాడు అదోరకంగా నవ్వాడు. ‘‘మరి అంతకుముందు గీ పొలం కొంటామని వచ్చిన ఆ ఇద్దరు ఎట్లా చనిపోయినట్టు?’’ డౌట్ సర్పంచ్‌కి. ‘‘ఏముందీ.. బ్రెయిన్ హ్యామరేజ్‌తో చనిపోయిన పర్సన్‌కు అంతకుముందే క్లాట్స్ ఏవో ఉండి ఉంటాయి. యాక్సిడెంట్లో పోయిన అతని గురించి చెప్పేదేముంది? తాగి బండి నడుపుతున్నాడు..ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకున్నాడు. ఇక్కడ దయ్యమెక్కడినుంచి వచ్చింది సర్పంచ్ సాబ్?’’ వెటకారంగా రాహుల్. గ్లాస్‌ను పెదవుల దగ్గర పెట్టుకున్న అజయ్.. రాహుల్‌నే చూస్తున్నాడు తదేకంగా. ‘‘ఏమైతేంది.. పొలం కొనుక్కున్నరు. మీరు మంచిగా పండిస్తే మా ఊరోళ్లకు కూడా మస్తు ధైర్యమొస్తది అన్నిరకాలుగా’’ అన్నాడు సర్పంచ్ చికెన్ ముక్కను నములుతూ! మళ్లీ తన కజిన్ భుజమ్మీద చేయివేసి అతనిని చూపిస్తూ ‘‘ఇగో సర్పంచ్ సాబ్.. వీడు నా చిన్నమ్మ కొడుకు. రెండురోజుల కిందట అమెరికా నుంచి వచ్చిండు. నాకు హెల్ప్ చేయడానికే. నాతోనే ఉంటడు.ఇద్దరం కలిసి పొలం దున్ని చూపిస్తం. చాలెంజ్’’ అని సర్పంచ్‌తో సవాల్ చేసి.. మళ్లీ కజిన్ వైపు తిరిగి ‘‘ఏమంటావ్రా..అజయ్? ’’ అన్నాడు అతని భుజాన్ని గట్టిగా నొక్కుతూ.‘‘అంతే అన్నా.. చాలెంజ్. దున్ని చూపించుడే’’ అని అన్నకు జవాబిచ్చి సర్పంచ్ వైపు తిరిగి ‘‘ సర్.. వంచిన నడుము ఎత్తనీయకుండా పొలంల పనిచేయిస్తా మా అన్నతో. చాలెంజ్ ఏందో చెప్పుండ్రీ’’ అన్నాడు అజయ్నవ్వుతూ!ఆ చాలెంజ్‌లో ధీమా కన్నా అతని మాటలతో భయమే కలిగింది సర్పంచ్‌కి. మందు ఎక్కువైనట్టుంది అంటూ సమాధానపడ్డాడు. ఆ రాత్రి గడిచింది. రాహుల్... బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. పేరున్న ఎమ్ఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఓ స్టార్టప్ కంపెనీకి కూడా ప్లాన్వేస్తూండగా రైతుల ఆత్మహత్యలకు చలించిపోయి అగ్రికల్చర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మెదక్ జిల్లాలోని ఒక ఊళ్లో పొలం కూడా కొనేశాడు. తన బిజినెస్ మైండ్‌తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు ప్రేరణనివ్వాలని ఆశపడ్తున్నాడు. అమ్మా, నాన్నా, చివరకు జీవితమంతా సేద్యంతోనే గడిపిన తాత చెప్పినా మనసు మార్చుకోలేదు అతను. గతం..రాహుల్ కొనుక్కున్న పొలం మల్లయ్యది. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒమన్‌లో, చిన్న కొడుకు భివండిలో ఉంటారు. భార్యతో ఊళ్లో ఉండేవాడు మల్లయ్య. ఉన్న అయిదు ఎకరాల్లో మూడుఎకరాలు కౌలుకి ఇచ్చి, మిగిలిన రెండు ఎకరాల్లోనే పాక లాంటిది వేసుకొని ఆలుమగలిద్దరూ సాగు చేసుకునేవారు. వరసగా వానలు లేక.. పొలంలో వేసిన బోరులో నీళ్లు పడక.. పంట పండక.. అప్పులపాలయ్యాడు. ఆ బెంగతోనే ఓ రోజు రాత్రి గుండె ఆగి చనిపోయాడు. పెద్ద కొడుకు రానేలేదు. చిన్నకొడుకే వచ్చి కర్మకాండ తంతు నిర్వహించి వెళ్లిపోయాడు. మల్లయ్య భార్య ఒక్కతే ఉండడం మొదలుపెట్టింది. ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి జాలిపడేవారు. భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకోక.. భర్త ఉన్నాడనే భ్రమలోనే ఆమె బతుకుతోందని! రోజూ ఇద్దరికి సరిపోయే భోజనం వండేది. గుడిసెలో తనతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్లే ప్రవర్తించేది. కొన్నాళ్లకు ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చింది..మల్లయ్య దయ్యమయ్యాడా ఏంటీ అని! మల్లయ్య పొలంవైపుగా వెళ్లిన కొంతమంది.. గుడిసెలో మగ గొంతుతో మాటలు వినిపిస్తున్నాయంటూ ఆ అనుమానాన్ని రూఢీ చేసేసుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ మల్లయ్య పెద్ద కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఒమన్ నుంచి వచ్చాడు పెద్దోడు. భివండి నుంచి తమ్ముడినీ పిలిపించాడు. తల్లిని ఆ ఊళ్లోనే ఉన్న ఆశ్రమంలో చేర్పించి ఉన్న పొలం అమ్మేసుకొని చెరిసగం పంచుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తల్లిని ఆశ్రమంలో చేర్పించారు కూడా. ఆ పొలం కొందామని బేరం కుదుర్చుకున్నాడు అదే ఊళ్లోని ఓ మోతుబరి. డబ్బులిచ్చే సమయానికి హఠాత్తుగా చనిపోయాడు. ఖంగుతిన్నారు అన్నదమ్ములిద్దరూ. మరో పదిరోజులకు ఇంకో వ్యక్తి ముందుకొచ్చాడు కొనడానికి. తెల్లవారి డబ్బులు తెస్తూ అతనూ చనిపోయాడు యాక్సిడెంట్లో.దీంతో ఊళ్లో వాళ్లకు మల్లయ్య నిజంగానే దయ్యమయ్యాడనే రుజువు దొరికినట్టయింది. కాని అన్నదమ్ములిద్దరూ నమ్మలేదు. పొలం అమ్మే బాధ్యతను తమ చిన్నాన్నకు అప్పగించి పెద్దోడు ఒమన్‌కు, చిన్నోడు భివండికి బయలుదేరారు. తర్వాత చాలా రోజులు ఆ పొలం అలాగే ఉంది. మల్లయ్య ఉన్నప్పుడు మూడు ఎకరాలు తీసుకున్న కౌలు రైతు కూడా భయపడి కౌలు చేయడం మానేశాడు. ఈ వ్యవహారమంతా వ్యవసాయం చేస్తున్న స్నేహితుల ద్వారా తెలుసుకున్న రాహుల్ చాలా చవకకు ఆ పొలాన్ని కొనేశాడు. ఆ సందర్భంగానే సర్పంచ్‌కి ఇచ్చిన పార్టీ అది. ప్రెజెండ్ డే... ఉదయం... తాత్కాలికంగా సర్పంచ్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాహుల్ నిద్ర లేచాడు. సెల్ ఫోన్లో టైమ్ చూశాడు. ఎనిమిది అయింది. ‘‘అమ్మో’’ అంటూ దిగ్గున లేచాడు. పక్కనున్న మంచం మీద అజయ్ కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్లాడేమో అనుకొని ఓనరకి, టెనెంట్‌కు కామన్‌గా ఉన్న వసారాలోకి వచ్చాడు. పేపర్ చదువుతూ కనిపించాడు సర్పంచ్. ‘‘గుడ్ మార్నింగ్ సర్పంచ్ సాబ్!’’‘‘గుడ్ మార్నింగ్ సార్.. గిప్పుడు లేచిండ్రా..? మీ తమ్ముడు ఎప్పుడో పొలంకి పాయే’’ అన్నాడు నవ్వుతూ సర్పంచ్. ‘‘అవునా?’’ ఆశ్చర్యపోయాడు రాహుల్. ‘‘మాటలే గాదు.. షేతల్లో చూపిస్తుండు మీ తమ్ముడు’’ మెచ్చుకోలుగా సర్పంచ్ పేపర్లోంచి తల తిప్పకుండానే. ఆదరాబాదరాగా దినచర్యకు దిగాడు రాహుల్. అరగంటలో అన్నీ పూర్తి చేసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ..ఎవరో స్త్రీ మూర్తితో మాట్లాడుతూ కనిపించాడు అజయ్ అల్లంత దూరం నుంచి. దగ్గరకు వచ్చాక చూస్తే.. మల్లయ్య భార్య. చాలా నవ్వుతూ మాట్లాడుతోంది అజయ్‌తో. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?ఆ సందేహాన్నే ప్రశ్నలుగా సంధించాడు ఆమె వెళ్లిపోయాక. ‘‘మనం ఈ పొలం కొన్నమని ఎవరో చెప్పిన్రట అన్నా. మంచిగ పండించుకోండ్రి అని చెప్పడానికొచ్చింది’’ అన్నాడు అజయ్ అదేదో అంతగా పట్టించుకునే విషయం కాదన్నట్టు. ‘‘ఊ’’ అంటూ చెట్టు కిందకు వెళ్తున్న రాహుల్ ఫోన్ మోగింది. విస్మయం.. ఆ భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాహుల్. ‘‘హలో అన్నగా.. ఏంరా.. నేను రాకుండా.. లేకుండానే కల్టివేషన్ చేస్తవా? నేను వచ్చేదాకా ఆగు. ఈ వారంలో వస్తున్నా. జాబ్గీబ్ అన్నిటికీ గుడ్‌బై చెప్పేశ్న. కలిసి వ్యవసాయం చేసుకుందాం..మన దేశం.. మన మట్టి..’’ అంటూ ఇంకేదో చెప్తూనే ఉన్నాడు అవతల నుంచి. రాహుల్ మొహం నిండా చెమటలు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. చెవి దగ్గరున్న ఫోన్‌ని పట్టుకున్న చేయి వణుకుతోంది. కాళ్లూ కంపిస్తున్నాయి. - సరస్వతి రమ -
తాగుపోటు
తాగగానే కంట్రోల్ తప్పుద్ది. అప్పటికైతే కొంచెం మగాడు అన్న ఫీలింగ్ వస్తుందిగానీ పెళ్లాం, పిల్లలు, కుటుంబం, మంచి–చెడు చూసుకునేంత మగాడైతే కాలేడు. చుక్క దిగినప్పటి నుంచి కక్కేవరకు అన్నీ పోట్లే! గుండెపోటు, రక్తపోటు, మెదడుపోటు, నైతికతకు పోటు మానవత్వానికి పోటు, గౌరవానికి పోటు, చివరకు జీవితానికే పోటు! లోపల కుళ్లిపోతారు. బయటకు కుళ్లు వాసన వస్తుంది. పిల్లలు ముక్కు పట్టుకుంటారు. పెద్దలు తల పట్టుకుంటారు. బయటివారు కాలర్ పట్టుకుంటారు. థూ... ఏంటీ దౌర్భాగ్య జీవితం. అంత మంచి పుట్టుక ఇచ్చిన తల్లిదండ్రులు, సంస్కారం ఇచ్చిన గురువులు, గౌరవం ఇచ్చిన సమాజం అంతా వికారమైపోతుంది. మీకు దండం పెడతాం. మందు మానండి... మీ ఫ్యామిలీ ప్రేమ పొందండి. కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటిలాగే ఆనవాయితీ. తమ నిర్ణయంపై ఒకటి రెండు రోజులు గట్టిగానే ఉంటారు. ఆ తర్వాత కాస్తంత మెత్తబడటం మామూలే. ఇప్పటికి ఎలాగూ ఓ నాలుగు రోజులు దూరంగా ఉండే ఉంటారు. ఇక మద్యంపై ధ్యాస మళ్లే ఈ దశలో దాని దుష్ప్రభావాలను మరో మారు గుర్తుచేసుకుంటే మీ నిర్ణయం, మీ నిబద్ధత మరింత నిశ్చలంగా ఉంటాయి. అలా ఉండటం కోసమే ఈ కథనం. మద్యంతో దేహంపై చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. అవి మన శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపైనా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. మెదడు (నాడీవ్యవస్థ), జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, సెక్స్ సామర్థ్యంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు... ఇలా అన్నీ దెబ్బతింటాయి. ఆ అన్నింటికంటే అన్ని వ్యవస్థలనూ నియంత్రించగల అత్యంత ప్రధానమైన మెదడూ, నరాలూ, నాడీవ్యవస్థ చాలా ఎక్కువగా దుష్ప్రభావానికి లోనవుతుంది. నోట్లోకి వచ్చీ రావడంతోనే అనర్థాలు ప్రారంభం... ఆల్కహాల్‌ను అలా నోట్లోకి తీసుకున్నప్పట్నుంచి దాని దుష్ప్రభావాలు మొదలవుతాయి. మొదట నోట్లో ఉండే మ్యూకస్ పొరల మీద ఆల్కహాల్ ప్రభావం కనిపిస్తుంది. ఆహారమైనా జీర్ణం కావడానికి చిన్న పేగుల వరకు రావాలిగానీ... మద్యం మాత్రం నోట్లోంచే ఒంట్లోకి ఇంకిపోతుంటుంది. అలా ఆ ఇంకడం అన్నది చిన్నపేగుల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. మెదడుపై మద్యం చేసే మాయ... మద్యం తొలి మోతాదుల్లో ఒకటి రెండు డ్రింక్స్ వరకు చాలా హాయిగా, రిలాక్సింగ్‌గా ఉంటాయి. తాము చాలా తేలికై పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇన్హిబిషన్స్ తగ్గుతాయి. పూర్తి స్పృహలో ఉన్నప్పుడు విచక్షణతో తొక్కిపట్టి ఉంచిన ఎన్నో భావనలు ఆ సమయంలో పురివిప్పుతాయి. ఆ సమయంలో ధైర్యం పుంజుకున్నట్లు అనిపిస్తుంది. విచక్షణరహితంగా ఏదైనా మాట్లాడగలుగుతారు. ఒత్తిడి తగ్గినట్లుగా భ్రాంతి కలుగుతుంది. బాగున్నాయని అనిపించే ఈ ఫీలింగ్స్ అన్నీ తాత్కాలికాలే. ఏ సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోగలమనే ధీమా ఆ సమయంలో తాత్కాలికంగా కాసేపు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికీ కారణం... మన మెదడులోని ఓపియాయిడ్ అనే కణాల నుంచి డోపమైన్ అనే సంతోష రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరచడమే. దాంతో ఒక ఆనందం, ఆహ్లాదం, తనువంతా హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఆ ఆనందాహ్లాద భావనలను కోల్పోకూడదనే ఉద్దేశంతోనే తాగడాన్ని కొనసాగిస్తుంటారు. అవెప్పుడూ సొంతం కావాలన్న తపనతో అదేపనిగా తాగుతుంటారు.అప్పట్నుంచి అనర్థాలు మొదలవుతాయి. అత్యంత ఎక్కువ మోతాదుల్లో తీసుకున్న ఈ మద్యం మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలవుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి తోడ్పడే ఈ భాగం క్రమంగా పనిచేయకపోవడంతో క్రమంగా మన భావోద్వేగాలపై అదుపులేకపోవడం, రిస్క్ తీసుకునే పనులకు పాల్పడటం, ముప్పును తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడం వంటివి జరుగుతాయి. కానీ దానికి తగ్గట్టుగా శరీరపు కదలికలు ఉండవు. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ తర్వాత టెంపోరల్ లోబ్ ప్రభావితమవుతుంది.ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. మద్యం... దాంతో కలిగే అనర్థాలు... నిద్రకు అంతరాయం: మనం రాత్రి హాయిగా పడుకుంటే ఉదయం మంచి రిలాక్సేషన్ ఫీలింగ్‌తో నిద్రలేస్తాం. ఇందుకు కారణం మన నిద్రలోని ఆర్ఈఎమ్ అనే దశ. ఇందులో కనుపాపలు స్పందిస్తూ ఉంటాయి.నిద్రలేవగానే హాయినిచ్చేందుకు ఈ ఆర్ఈఎమ్ దశ దోహదం చేస్తుంది. విపరీతంగా మద్యం తాగినప్పుడు మనలో ఆర్ఈఎమ్ దశ లోపిస్తుంది. దాంతో నిద్రలేచాక చికాకుగా ఉండి, హాౖయెన ఫీలింగ్ ఉండదు.అంతా చికాగ్గా ఉంటుంది. అసలు రుచి తెలియకుండా ‘కంజీనర్ల’ మాయ! ఆల్కహాల్లో ఉండే కొన్ని పదార్థాలను ‘కంజీనర్స్’ అంటారు. ఆల్కహాల్ తాగగానే మనకు పదార్థం తాలూకు అసలు రుచి తెలియదు. వాసన పసిగట్టలేం. రంగును గుర్తించలేం. అలా రంగు, రుచి, వాసనలను తెలియకుండా చేసేవే ఈ కంజీనర్స్. మద్యపానం తర్వాత వచ్చే మైగ్రేన్ తలనొప్పులు, మర్నాడు ఉదయం వచ్చే హ్యాంగోవర్‌కు ఈ కంజీనర్సే ప్రధాన కారణం. స్లీప్ ఆప్నియాతో ప్రాణాలకే ప్రమాదం: మద్యం తాగిన వారిలో గురక వస్తుంది. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా గురక వచ్చి శ్వాసకుఅంతరాయం కలిగే కండిషన్‌ను ‘స్లీప్ ఆప్నియా అంటారు. మంచి నిద్రలో మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేక సార్లు వస్తుంది. ఆప్నియా కండిషన్లో మనం తీసుకునే ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ప్రభావం చూపవచ్చు. కొందరిలో స్లీప్ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. నిద్రలో ప్రమాదకరమైన గురక (స్లీప్ ఆప్నియా)తో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మైగ్రేన్: ముదురు రంగులో ఉండే వైన్ లేదా రమ్ వంటి ఆల్కహాల్ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు. మూర్ఛ: సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో మూర్ఛ (సీజర్స్/ఫిట్స్) వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అందుకే ఆల్కహాల్‌ను మొదలే పెట్టకూడదు. ఏదైనా కారణాల వల్ల ఒకసారి తాగినా దాని దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు గుర్తించి మానేయాలి. తమ నియంత్రణలో తాము ఉండలేకపోవడం : దీర్ఘకాలం మద్యం తాగేవారిలో మెదడులోని బ్యాలెన్సింగ్‌కు తోడ్పడే సెరిబెల్లమ్ భాగం దెబ్బతింటుంది. దాంతో వారు సరిగా నడవలేరు. తూలుతున్నట్లుగా నడుస్తారు. మాట కూడా ముద్దముద్దగా, అర్థం కానట్టుగా (స్లర్ర్డ్ స్పీచ్) వస్తుంది. ఆల్కహాల్‌తో వచ్చే పెరిఫెరల్ న్యూరోపతి:ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు మన ఒంట్లో మండుతున్న భావనలు (బర్నింగ్ సెన్సేషన్) ఉండవచ్చు. అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపించడం జరగవచ్చు. క్రమంగా నరాల దొంతరలు (నర్వ్ ఫైబర్స్) దెబ్బతిని... ఆ తర్వాత్తర్వాత చేతులు–కాళ్లు దెబ్బతిని నడవలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటి స్థితి రావచ్చు. అయితే మద్యం మానేయడం ద్వారా దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మెల్లగా చక్కబడి మునుపటిలా అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక మద్యంతో తలతిరగడం, అంగస్తంభన సమస్యలు, నియంత్రించలేనంత ఒత్తిడితో మూత్రంవస్తుండటం, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంపై నియంత్రణ లేకపోవడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఇవేగాక... నాడీ వ్యవస్థలో లోపాలు అనేక లోపాలు అంటే... ఉదాహరణకు జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు వంటి సమస్యలూ రావచ్చు. అనేక ఇతర శారీరక వ్యవస్థలూ... మద్యంతో వాటిపై ప్రభావం ∙జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. ∙గుండె: ఆల్కహాల్ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు, గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్ సమస్యలు. ∙సెక్స్ సమస్యలు : సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు. ∙గర్భిణులు ఆల్కహాల్ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు. ∙చూపు దెబ్బతినడం : అన్ని కండరాలు దెబ్బతిన్నట్లే చాలా అరుదుగా కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గడం జరగవచ్చు. ఇక ఆల్కహాల్లో మిథనాల్ కలిసినప్పుడు ఆ కల్తీసారా తాగి ఒకేసారి చాలామంది కంటిచూపు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరిగిన దుష్పరిణామమే. ∙మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక వైటమిన్ లోపాలకు కారణం అవుతుంది. ∙బింజ్ డ్రింకింగ్తోనూ ప్రమాదమే: ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం కదా అనే వంకతో కొంతమంది ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. దీన్నే బింజ్ డ్రింకింగ్ అంటారు. అలా తాగినప్పుడు 6 నుంచి 36 గంటల పాటు మనలో చక్కెర పాళ్లు తీవ్రంగా తగ్గిపోతాయి. అందుకు కారణం మన చక్కెరపాళ్లను సరిదిద్దుతూ/నియంత్రిస్తూ ఉండాల్సిన కాలేయం తన అసలు పనిని వదిలేసి ఆల్కహాల్ విషాలను విరిచేస్తూ ఉండటం. దాంతో మన ఒంట్లోని నీళ్ల (ద్రవాల) పాళ్లు తగ్గుతాయి. డీ–హైడ్రేషన్ జరిగి దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్థితి 6 – 36 గంటల పాటు కొనసాగుతుంటుంది. దాహంతో పాటు వికారం (వాంతి వస్తున్న) ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చు. ఫలితంగా తలనొప్పి మొదలుకొని... వాంతులు, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా రావచ్చు. ఇలా బాగా తాగేసినప్పుడు మన అంచనా వేసే శక్తి లోపించడం (జడ్జిమెంట్ దెబ్బతినడం), అవయవాలను సమన్వయం చేసుకోలేకపోవడం (కోఆర్డినేషన్ లేకపోవడం), దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి పరిణామాలకు దారితీసి రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రక్తంలో మితిమీరి ఆల్కహాల్ ఉండటం అంటే ప్రతి 100 ఎమ్ఎల్ రక్తంలో 300 ఎంజీ ఆల్కహాల్ ఉంటే అది ఒళ్లు చల్లబడిపోవడం (హైపోథెర్మియా) మొదలుకొని రక్తపోటు తగ్గిపోవడం (హైపోటెన్షన్)తో పాటు శ్వాసమందగించి మరణానికి దారితీయవచ్చు. అలవాటును తప్పించడం / చికిత్స ఇలా... మద్యం అలవాటును అధిగమించడానికి, దాని దుష్ప్రభావాలకు చేసే చికిత్సలో భాగంగా మొదట అది మానే సమయంలో కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు. తర్వాత తాగుడు మాన్పించడం కోసం మందులు ఇస్తూ అదే సమయంలో సైకోథెరపీ, కౌన్సెలింగ్ చేస్తారు. సమాజంలో మనుగడ సాధించడం కోసం అవసరమయ్యే సామాజిక నైపుణ్యాల శిక్షణ (సోషల్ స్కిల్స్ ట్రైనింగ్) కూడా ఇస్తారు. ఇందుకోసం మానసిక వైద్యుల పర్యవేక్షణ అవసరం. అందుకే మద్యం మానాలన్న తీవ్రమైన సంకల్పబలంతో మానసిక వైద్యులను కలుసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదాలు (యాక్సిడెంట్స్) మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ. కాలేయానికి ఎంతో ముప్పు! ఒంట్లోకి వచ్చే ప్రతి విషపదార్థానికీ ఒక చెక్‌పాయింట్ లాంటిది కాలేయం. దేహంలోకి వచ్చిన ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్) విరిచేయడం కాలేయం పనుల్లో ఒకటి. అంతేకాదు... ఆ విషాలు ఒంట్లోంచి బయటకు వెళ్లేలా కూడా చూస్తుంది. మెదడు కూడా ఈ పనికి దోహదపడుతుంది. మెదడు మన జీవక్రియలు వేగంగా జరిగేలా చూసి చెమటపట్టించేలా చేస్తుంది. అలాగే శ్వాసవేగం పెరిగేలా చూస్తుంది.మద్యం ఎక్కువగా తాగిన వారి చెమటలో కూడా దుర్గంధం వస్తుండటం గమనించవచ్చు. మనలో ఎక్కువైన మద్యాన్ని మెదడు, కాలేయం కలిసి బయటకు విసర్జించే ప్రక్రియలో భాగంగా చెమట ద్వారా కూడా మద్యం బయటకు వెళ్లేలా చేస్తాయి. అందువల్లనే ఆ దుర్వాసన. మరికాసేపటి తర్వాత మూత్రం ద్వారా కూడా మద్యం వల్ల చేరిన విషాలను బయటకు పంపేలా మెదడూ, కాలేయం శ్రమిస్తాయి. అలా మద్యం నుంచి రక్షించే కార్యక్రమం అది ఒంట్లోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి జరుగుతుంటుంది. అయితే అవి బయటకు పంపే మోతాదు కంటే మనం తాగేది ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు, కాలేయాలు ఆ పని చేయలేక చేతులెత్తేస్తాయి. దాంతో అనర్థాలు, దుష్ప్రభావాలు కనిపించే దశలు మొదలవుతాయి. శనివారం రాత్రికీ మద్యానికీ సంబంధం ఏమిటి? ఇక్కడో ఇట్రరెస్టింగ్ సినిమా టైటిల్లాంటి పేరుతో ఒక వ్యాధి ఉంది. దాని పేరే ‘సాటర్డే నైట్స్ పాల్సీ’. ఆసక్తికరమైన ఆ వ్యాధి ఏమిటో కాస్త చూద్దాం. నరాలు చచ్చుబడేలా చేసే వ్యాధులకు ‘పాల్సీ’ అనే మాట వాడతారు. ఉదాహరణకు సెరిబ్రల్ పాల్సీ అనే పిల్లల వ్యాధిలో వారిలోని నరాలు సక్రమంగా స్పందించకపోవడం వల్ల వాళ్ల కదలికలూ మామూలుగా ఉండవు. అవి చూరుగ్గానూ ఉండవు. అలాగే ‘సాటర్డే నైట్స్ పాల్సీ’ అనే పాల్సీ కూడా మరొకటి ఉంది. ఇది పూర్తిగా పెద్దలది. మద్యం తాగే పెద్దలది. ఈ కండిషన్‌లోనూ నరాలు తాత్కాలికంగా చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఆదివారం సెలవు కాబట్టి శనివారం నాడు చాలామంది మద్యం ప్రియులు అదేపనిగా తాగేస్తుంటారు. ఎంతగా తాగుతారంటే... వాళ్లు అలాగే కుర్చీ మీద కూర్చుని నిద్రభుజం మీద తలపెట్టుకుని నిద్రపోతారు. దాంతో చేతికి వచ్చే ప్రధాన నరం అయిన ‘రేడియల్ నర్వ్’ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా అది తాత్కాలికంగా చచ్చుబడవచ్చు. ఇలా మద్యం తాగడం అనే ప్రక్రియ వీకెండ్ రాత్రే ఎక్కువ కాబట్టి ఆ కండిషన్‌కు ‘సాటర్డే నైట్స్ పాల్సీ’ అని పేరు పెట్టారు. జబ్బు పేరులో సాటర్డే అనే ఉన్నా ఇది మద్యం తాగిన ఏరోజైనా రావచ్చు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రక్త కణాలతోనే నాడీ మూలకణాలు
మెదడుకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మానవ రక్తకణాలనే నాడీ మూలకణాలుగా మార్చేయడం.. తద్వారా సరికొత్త మెదడు కణాలను వద్ధి చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. గుండెపోటుతోపాటు నాడీ సంబంధిత సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స కల్పించేందుకు ఈ కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని అంచనా. గతంలోనూ ఇలా సాధారణ కణాలను మూలకణాలుగా మార్చినప్పటికీ పరిశోధనశాలలో మూలకణాలు ఎక్కువ కాలం పాటు ఇతర కణాలుగా ఎదగడం మాత్రం ఇదే తొలిసారి. నాడీ మూలకణాలుగా మార్చగలగడం వల్ల నాడీ వ్యవస్థకు కీలకమైన న్యూరాన్లు, లేదా గ్లియల్ కణాలను తయారు చేయడం వీలవుతుందని గుండెపోటు తరువాత కోలుకుంటున్న వారికి వీటిని అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మూలకణ పరిశోధనల్లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే వీటిని నేరుగా రోగుల్లో వాడేందుకు అవకాశముందని అంచనా. -
మధుమేహాంతో మెదడు సమస్యలు?
మధుమేహంతో అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలుసుకుగానీ.. ఈ జబ్బు వల్ల మెదడుకూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు తాము జరిపిన అధ్యయనంలో టైప్–2 మధుమేహం వల్ల ఆలోచన తీరు, జ్ఞాపకశక్తుల విషయాల్లో సమస్యలు రావచ్చునని తేలినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిషేల్ కల్లిసాయ తెలిపారు. మధుమేహం ఉన్న కొంతమంది వయోవృద్ధులపై పరిశోధనలు చేశామని.. మొదట్లో వారి ఎమ్మారై స్కాన్లను పరిశీలించినప్పుడు మెదడులోని కొన్ని భాగాల సైజు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఐదేళ్ల కాలంలో వారి మెదడు పనితీరు తగ్గుదల కనిపించిందని, ఇందుకు అనుగుణంగానే మెదడు సైజు కూడా తగ్గిపోవడాన్ని తాము గుర్తించామని వివరించారు. మధుమేహులు తమ మెదడుపట్ల కూడా కొంత శ్రద్ధ వహించాలనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని.. ఇందుకు రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. ఏదో ఒక రూపంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం.. పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గుండెకు మంచి చేసే ఆహారం మెదడుకూ మేలు చేస్తుందని చెప్పారు. వీటితోపాటు నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండేందుకు అవకాశముందని అన్నారు. -
బాబుకు తరచూ తీవ్రమైన తలనొప్పి...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదకొండేళ్లు. తరచూ తలనొప్పి తో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కానీ ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రామస్వామి, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. నివారణ / చికిత్స: ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. వర్షం,వాతావరణంఉంటే చాలు... ముక్కులుబిగదీసుకు పోతున్నాయి! మా పాప వయసు ఏడేళ్లు. కాస్తంత మబ్బు పట్టి వాన వచ్చేలాంటి వాతావరణం ఉంటే చాలు పాపకు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఏడుస్తోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – జి. రమణి, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్లో కనిపిస్తాయి. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్)గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా ఇది వస్తుంది. మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. పాపకు నోట్లో పొక్కులు... తగ్గేదెలా? మా పాప వయసు ఆరున్నర ఏళ్లు. కొద్ది రోజుల కిందట పాప గొంతు నొప్పి అంటే డాక్టర్‌కు చూపిం చాం. అప్పుడు తగ్గాయి కానీ మళ్లీ పాప నోటిలో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. గొంతు అంతా ఎర్రబారింది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – ఈశ్వరీబాయి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగపరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, అబ్రేసివ్ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి.దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఇది వస్తున్నట్లు భావించవచ్చు.ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి. అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కాఫీ వాసన గుప్పుమంటే.. మెదడుకు చురుకు!
ఉదయాన్నే కాఫీ తాగితే రోజంతా చురుకుగా ఉంటామని కొందరు అంటూ ఉంటారు. దీని మాటేమిటోగానీ కాఫీ వాసన తగిలినా చాలు.. మీరు వేగంగా లెక్కలు వేసేస్తారు అంటోంది స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆశ్చర్యంగా అనిపిస్తోందా? వివరాలు తెలుసుకుందాం. జీమ్యాట్ పరీక్ష గురించి మీకు తెలిసే ఉంటుంది. బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి నిర్వహిస్తూంటారు దీన్ని. స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వంద మందికి పది ప్రశ్నలతో ఈ పరీక్ష పెట్టారు. విడదీసిన రెండు గుంపుల్లో ఒకదానికి మంచి కాఫీ వాసన వచ్చేలా చేశారు. ఇంకో గుంపులోని వ్యక్తులకు మామూలుగా పరీక్ష పెట్టారు. ఫలితాలను బేరీజు వేసినప్పుడు కాఫీ వాసన ఉన్న గదిలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇదంతా కాఫీ వల్లనే జరిగిందా? అన్నది తెలుసుకునేందుకు ఇంకో 200 మందిపై నాలుగు దఫాలుగా సర్వే జరిపారు. చివరకు తేలింది ఏమిటి అంటే.. కాఫీ వాసన వచ్చినప్పుడు తాము మరింత అలర్ట్‌గా, చురుకుగా ఉండగలుగుతున్నామూ అని! మిగిలిన సువాసనలతో పోలిస్తే కాఫీ వాసన మెదడుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవకాశమిస్తున్నాయని తెలిసింది. -
బ్రెయిన్ యోగా
యోగా అంటేనే దేహం, మనసు, ఆత్మల సమన్వయం. నిజానికి ప్రతి యోగాసనంతో మైండ్, బాడీ, స్పిరిట్ (సోల్) ఈ మూడూ పునరుత్తేజితమవుతాయి. అయితే ఇక్కడ పేర్కొన్న ఈ ఆసనాలు నేరుగా మెదడును ఉత్తేజితం చేస్తాయి. అందుకే ప్రత్యేకంగా వీటి ప్రస్తావన. చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (ఇక్కడ చూపిన పొజిషన్లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి. సూర్యనమస్కారాల్లో ఒకటైన ఆసనాన్ని విడిగా చేయాలి అనుకున్నప్పుడు... సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్లాలి. పైన చేతులు ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద పైకి లేస్తూ మడమల్ని పైకి ఎత్తి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మడమలను నేల మీద ఆన్చి తల చేతులు కలిపి ముందుకు ఫార్వార్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్లను ఫ్రీగా ఉంచి పొట్టను లోపలకు లాగుతూ నడుము నుంచి పై భాగాన్ని ఎడమవైపు నుంచి కుడివైపునకు కుడి నుంచి ఎడమవైపునకు చేతులను వేలాడేస్తూ రొటేట్ చేయాలి. తలను మధ్యలోకి తీసుకు వచ్చి చేతులు ముందు నేల మీద ఒకదానికి ఒకటి ఒక అడుగు దూరంలో ఉంచి ఆల్టర్నేట్ పాదాలు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ రెండు పాదాలు వెనుకకు తీసుకువెళ్లి, పాదాల మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగు దూరం ఉంచి నడుమును బాగా పైకి లేపి భూమికి శరీరం త్రిభుజాకారంలో ఉండేటట్టుగా ప్రయత్నించాలి. శ్వాస వదులుతూ పొట్టను బాగా లోపలకి లాగిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తూండాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత తిరిగి అలాగే వెనుకకు పాద హస్తాసనము లోనికి, శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ చేతులు పక్క నుంచి కిందకు తీసుకువచ్చి తిరిగి సమస్థితిలోనికి రావాలి. ఉపయోగాలు: శరీరంలో ఉన్న 640 కండరాలలో కనీసం 500 కండరాలకు వ్యాయామం జరుగుతుంది. వెన్నుపూస భాగానికి తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. చంద్రభేది ప్రాణాయామం అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ నిటారుగా ఉంచి ఎడమచెయ్యిని ధ్యానముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటవేలు చివరభాగానికి తాకించి) లేదా చిన్ముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటనవేలు మధ్యభాగానికి తాకించి)లో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్ర లేదా నాసాగ్రముద్రలో లేదా మధ్యలో మూడు వేళ్లు మడిచి బొటన వేలు చిటికెన వేలితో నాసిక రంధ్రాలను మూస్తూ చేయాలి. చేసే విధానం: కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకున్న తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు వదలాలి. మళ్లీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు రిపీట్ చేయాలి. గమనిక: రైట్ హ్యాండర్స్ కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎడమచేత్తో చేయవచ్చు. కుడిచేత్తో చేసేటట్లయితే కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి తెరవడానికి బొటనవేలును ఉపయోగిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళు చిటికెన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని తెరవడం, మూయడం చేస్తారు. ఉపయోగాలు: ఎడమ ముక్కు నుంyì శ్వాస తీసుకుంటాం కనుక మెదడులోని కుడి గోళార్ధానికి ఆక్సిజన్ ఎక్కువగా పంపబడి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. స్ట్రెస్, టెన్షన్స్, హై బీపి, ఎమోషనల్ ఇన్‌బ్యాలెన్స్ వంటి సమస్యలకు చాలా మంచిది. క్రియేటివ్ థింకింగ్, ప్యారల్లెట్ ప్రాసెసింగ్‌కి ఉపయోగించే కుడి మెదడు పనితీరు మెరుగవడానికి ఉపయోగపడుతుంది. సర్వాంగాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీ కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును సీటు భాగాన్ని ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజములు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్డ్గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు. కపాలాసన లేదా శీర్షాసన ఇది చేయడం కష్టతరమే అని అన్పిస్తున్నా నిరంతర అభ్యాసంతో తేలికగా చేయవచ్చు. ముందుగా కొన్నాళ్లు గోడను ఆధారంగా చేసుకొని ప్రాక్టీసు చేయాలి. తలకింద మెత్తటి బ్లాంకెట్‌ను గాని యోగా మ్యాట్‌ను గాని చక్కగా మడత వేసి, తల మాడు భాగాన్ని కాకుండా ప్రీ ఫ్రోంటల్ ఏరియాను అంటే మాడు నుదురుకి మధ్యలో ఉన్న భాగం నేల మీద ఉంచాలి. రెండు అరి చేతులు తలకి ఇరువైపులా వేళ్లు ఇంటర్‌లాక్ చేసి సపోర్టుగా రెండు మోచేతులు భూమి మీద తలపక్కగా స్టాండ్లాగా ఉంచాలి. శరీరాన్ని బ్యాలెన్సు చేస్తూ రెండు పాదాలు, కాళ్లు కలిపి ఉంచి వాటిని భూమి మీద నుండి నెమ్మదిగా పైకి లేపుతూ భూమికి సమాంతరంగా వచ్చిన తరువాత, రెండు మూడు శ్వాసల కాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్కడ నుండి పైకి భూమికి లంబంగా వచ్చేటట్లుగా తీసుకువెళ్లాలి. ఈ స్థితిలో మూడు లేదా అయిదు నిమిషాల సేపు ఉండగలిగితే మెదడులోని కణాలన్నింటికీ ఆక్సిజన్‌తో కూడిన రక్తం సరఫరా బాగా పెరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. పిట్యుటరీ గ్రంధి యాక్టివేట్ అవ్వడం వలన శరీరంలో హార్మోన్ల విడుదలలో సమతౌల్యత చేకూరుతుంది. ముఖ్య గమనిక: నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని సాధన చేయాలి. బ్రెయిన్ ట్రెయిన్ యోగా అనేది మనల్ని మనం వర్తమానంలో ఉంచుకోవడానికి ఉద్దేశించింది. మొత్తం యోగా కాన్సెప్ట్... అనేది దీని చుట్టూనే డిజైన్ చేయడం జరిగింది. ఈ మైండ్‌నే యోగాలో అంతఃకరణాలు అంటాం. ఇంద్రియాలు, మనస్సు కలిపి కాన్షియస్ మైండ్ అంటాం, అహం, చిత్తంని అన్కాన్షియస్ లేదా సబ్కాన్షియస్ మైండ్ అంటాం. మన స్వభావం మారితేనే అన్నీ మారతాయి. కోపం, ఈర్ష్య, కామం వంటివాటిపై అదుపు ఉన్న మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వీటికి అవసరమైన శిక్షణ, సాధన యోగాలో లభిస్తుంది. బ్రెయిన్‌కు స్ట్రెయిన్... బ్రెయిన్‌కి ముందు భాగంలో ఉండేవాటిని ఫ్రాంటల్ ఏరియాస్ అంటాం. ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసేది బ్రెయిన్లోని ఆ ప్రాంతమే. అయితే ప్రస్తుత తరం పిల్లల్లో ఆ ఏరియా చాలా బలహీనపడింది. దీంతో భావోద్వేగాల మీద, ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉండటం లేదు. ర్యాంక్ రాకపోయినా సూసైడ్, మొబైల్ కొనకపోయినా సూసైడ్ చేసుకోవడం... వంటివి అందుకనే జరుగుతున్నాయి. జీవితంలో చిన్ననాటి నుంచి కష్టాలను ఎదుర్కుంటే ఫ్రాంటల్ ఏరియాస్ శక్తిమంతంగా మారతాయి. ఇప్పుడు పిల్లలకి అంతా స్పూన్ ఫీడింగ్ కదా. బస్సెక్కి శారీరక అవయవాలను ఉపయోగించి చేయాల్సిన పనులు వాళ్లు చేయడం లేదు. మైండ్ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. శరీరం ఒక కష్టాన్ని తట్టుకుంటూ నేర్చుకోవడాన్ని ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు పిల్లల్లో ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్, లోకోమోటార్ లెర్నింగ్ తక్కువైపోయింది. పరిశోధనలు తేల్చింది ఏమిటంటే... బ్రెయిన్‌పై యోగా–ధ్యానం ప్రభావం అనే అంశంపై ప్రస్తుతం 500కి మించి పరిశోధనలు జరుగుతున్నాయి. మైండ్ ఫుల్ నెస్ అనే అంశం మీద జాన్ కబాత్ అనే ఆయన అమెరికాలో మెడిటేçషన్ కోర్సు పెట్టాడు. మెడిటేషన్ తర్వాత బ్రెయిన్లో వచ్చే ఎన్నో సానుకూల మార్పులు ఆయన కనిపెట్టారు. నవతరం చాలా షార్ప్. ఒకేసారి 10వేల రకాల డైరెక్షన్లో వీరి మైండ్ తిరుగుతుంటుంది. మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో మైండ్ మరింత యాక్టివ్‌గా ఉంటోంది. దీని వల్లే వీరికి ఒక పనిమీద ఏకాగ్రత అంత సులభంగా కుదరదు. విపరీతమైన డైవర్షన్స్ ఉంటాయి. దీనికి కారణం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే గ్రేసెల్ ఏరియాస్, వైట్ సెల్ ఏరియాస్ వీక్ అవుతుండటం. ఇదే రీసెర్చ్‌లో తేలింది. ప్రస్తుత తరంలో అత్యధికులు మైండ్ సంబంధిత పని మాత్రమే చేస్తున్నారు. శారీరకమైన పని దాదాపు సున్నా అయింది. అది సరైంది కాదు. అలాగే లెఫ్ట్ బ్రెయిన్, రైట్బ్రెయిన్స్లో లెఫ్ట్ యాక్టివ్‌గా ఉంటోంది. రైట్ బ్రెయిన్ వీక్ అవుతోంది. స్ట్రెస్, యాంగ్జయిటీ అంతా లెఫ్ట్‌లోనే ఉంటుంది. రైట్ బ్రెయిన్ మనకి పీస్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అందిస్తుంది. భారతీయుల్లో సహజంగానే లెఫ్ట్ బ్రెయిన్ చాలా యాక్టివ్. పుస్తకాల పురుగుల్లా చేయడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. రైట్ బ్రెయిన్ చాలా పూర్‌గా పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది. ఇదే క్రియేటివిటీకి ఉపయోగిస్తుంది.అలా రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయడానికి ధ్యానం ఉపకరిస్తుంది. రైట్ బ్రెయిన్‌కి ప్రోగ్రామింగ్ చేయడం అనేది మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. మైండ్ ట్రెయిన్... మైంyŠ కి ఇచ్చే శిక్షణ 2 రకాలు. ఒకటేమో ఏకాగ్రత పెంచేది. రెండోది వర్తమానంలో ఉంచడానికి ఇచ్చేది. మన స్వభావాన్ని, నేచర్‌ని మార్చడానికి, వర్తమానంలో ఉండేందుకు చేసేదే మెడిటేషన్. –ధ్యానాలు... కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు. అన్కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు అని రెండుంటాయి. మైండ్ అటూ ఇటూ వెళ్లకుండా ఉపయోగపడే ధ్యానాలను గ్రాహ్య తరగతికి చెందినవి. మంత్ర మెడిటేషన్, చక్రాల మీద ధ్యానం చేయడం ఇవన్నీ కాన్షియస్ మైండ్ మీద పనిచేసేవి. అన్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపే ధ్యానాలను గ్రహీత్న తరగతికి చెందుతాయి. అసలైతే ధ్యానాల్లో మొత్తం 40 రకాలు ఉంటాయి. వీటిలో దాదాపు అన్నీ అంటే 38 రకాల వరకూ కాన్షియస్ మైండ్ మీదనే పనిచేస్తాయి. ఆసనం ఉద్దేశం అదే... యోగాసనాల ఉద్దేశం చాలా మంది అనుకుంటున్నట్టు ఫిట్నెస్, ఆరోగ్యం ఇవి మాత్రమే కావు... బ్రెయిన్‌ని సరైన విధంగా శిక్షణ ఇవ్వడమే. మనసుకి అటూ ఇటూ తిరగడం అలవాటు. దాన్ని మార్చడానికి, శరీరంతో ఉంచడానికే ఆసనం. కాబట్టి దాదాపు అన్ని ఆసనాలూ బ్రెయిన్‌ని యాక్టివేట్ చేయడానికి ఉపకరిస్తాయి. అన్కాన్షియస్ మైండ్ అనేది శరీరంలో అణువణువునా ఉంటుంది. అయితే ప్రతి కదలికలో మనసు ఉండాలి. అలాంటి శిక్షణ ఇచ్చేదే ఆసనం. అందుకే ఆసన కాన్సెప్ట్ మొత్తం కూడా బ్రెయిన్ ప్రోగ్రామ్‌నకు చెందిందే. అథోముఖ శ్వానాసనం, కపాలాసనం లేదా శీర్షాసనం... ప్రాణాయామాల్లో చంద్రభేదీ ప్రాణాయామం, క్రియా ప్రాణాయామం ... ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద శక్తిమంతంగా పనిచేసి అల్జీమర్స్, పార్కిన్సన్స్, డౌన్ సిండ్రోమ్, ఆటిజం వంటి సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. ఆసనం ద్వారా ఆక్సిజన్ సరఫరా పెరిగి 15 నుంచి 20% బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుందని రుజువైంది. -
బ్రెయిన్‌ను జిల్లు మనిపించండి
బోర్ కొడుతుంటే కొత్త డోర్ ఓపెన్ చేయాలి... బ్రైన్‌కి కొత్త రోడ్ వేయాలి.మొదడులో కొత్త స్విచ్‌ను ఒత్తి కొత్త బల్బులు వెలిగించాలి. అదీ సంగతి... స్విచ్ చేయండి... కొత్త అలవాట్లకి.... కొత్త ప్రక్రియలకి... కొత్త జిల్లులకి. మార్పు చేస్తుంది బ్రైన్‌ను షార్ప్. ఇవాళ కొంచెం రొటీన్‌ని బ్రేక్ చేద్దామా?... అంటే?ఏం లేదు... రోజూ కుడి చేత్తో ఎత్తే కాఫీ గ్లాసును ఎడమచేత్తో ఎత్తడం.కుడి చేత్తో చేసే పళ్లు తోముకోవడాన్ని ఎడమ చేత్తో చేయడం.కుడి చేత్తో దువ్వుకునే తలను ఎడమ చేత్తో దువ్వడం.సైకిల్నో స్కూటర్‌నో ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఎక్కడం.రోజూ ఈ వైపు నుంచి దిగే మంచాన్ని ఆ వైపు నుంచి దిగడం.రోజూ అలవాటైన దారిలో కాకుండా ఇంకొక దారిలో ఆఫీసుకు వెళ్లడం.ఇవన్నీ చేస్తే?... చేస్తే మంచిది.ఎవరికి మంచిది? మీకు మంచిది... మీ మెదడుకు మంచిది... అలవాటైన పద్ధతుల్లో అలవాటైన విధానాల ద్వారా మీ జీవితం సాగుతున్నప్పుడు సుప్తావస్థలోకి వెళ్లి ఆ రొటీన్‌కు అలవాటు పడిన మీ మెదడులోని కణాలు చైతన్యవంతం కావడానికి మంచిది. దీనివల్ల మెదడులోని కొత్త పాత్‌వేస్ అకస్మాత్తుగా చురుగ్గా మారతాయి. నిద్రాణంగా ఉన్నవి మళ్లీ చురుగ్గా మారతాయి. అంటే... టోటల్‌గా మెదడులోని చాలాభాగం చురుగ్గా మారుతుందన్న మాట. మెదడును తట్టి లేపి చైతన్యవంతం చేసే ఇలాంటి వ్యాయామన్నే ‘న్యూరోబిక్స్’ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొన్ని పనులు భిన్నంగా, కొన్ని పనులు ఎరుకతో చేయడమే న్యూరోబిక్స్. ఉదాహరణకు: మీ జేబులో ఉన్న నాణేలను ముట్టుకొని, వాటి అంచులను పరిశీలించి, ఆ స్పర్శతో ఆ నాణెం విలువ ఎంతో ఊహించండి. బయటికి తీసి మీరు రైటో కాదో చెక్ చేసుకోండి. కళ్లు మూసుకొని, మీ ఇంట్లోని ఏ ఫర్నిచర్ ఎక్కడుందో కనిపెడుతూ వెళ్లండి. కళ్లు తెరచి మీ అంచనా ఎంత కరెక్టో చూడండి. టీవీని కాసేపు మ్యూట్‌లో పెట్టండి. తెర మీది క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించండి. మళ్లీ మ్యూట్ తొలగించి మీరెంత కరెక్ట్‌గా ఊహించారో పరీక్షించుకోండి. నాలుగైదు రకాల సుగంధద్రవ్యాలను ఒకేలా ఉన్న సీసాలలో పెట్టించండి. కళ్లకు గంతలు కట్టుకొని వాటిని వాసన ద్వారా కాకుండా స్పర్శ ద్వారా అవేమిటో తెలుసుకోండి. ఇలా చేసి చూస్తే ఏమవుతుందని మీరు అడగవచ్చు. ఇలా చేయడం మెదడుకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఒంటికి చేసే వ్యాయామాలు ఏరోబిక్స్. మరి మైండ్‌కు? అవి న్యూరోబిక్స్. ఇవి బ్రెయిన్‌ను షార్ప్‌గా పనిచేయడంతో పాటు ... దీర్ఘకాలంలో మతిమరపు (డిమెన్షియా), అలై్జమర్స్ లాంటివాటిని నివారిస్తాయని కొందరు అంటారు. సైనాప్స్ కోసం మన మెదడు కార్యలాపాలన్నీ వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే వస్తుంటాయి... పోతుంటాయి. మైండ్ యాక్టివిటీ చాలావరకు ఆటోమేటిక్. మెదడు కణాలైన న్యూరాన్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే కనెక్షన్లను సైనాప్స్ అంటారు. సైనాప్స్ ఎంతబాగా ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటే ఆలోచనలు అంత విస్తృతంగా, వైవిధ్యంగా ఉంటాయి. మన చర్యలు రొటీన్‌గా మారినప్పుడు సైనాప్స్ నిద్రాణస్థితిలోకి వెళతాయి. అవి తుళ్లి పడేలా చేయడానికి చైనత్యవంతం కావడానికి రొటీన్ పనిని భిన్నంగా చేయడం అవసరం. ఇది ఇంకా బాగా తెలియాలంటే దీనికి కార్యక్షేత్రమైన మెదడు గురించి తెలియాలి న్యూరోబిక్స్ చేయడం ఎలా? మీరు నిద్రలేవడానికి ఎప్పుడూ ఒకేరకం అలారం పెట్టుకొని లేస్తుంటారా? ఈసారి డిఫరెంట్ టోన్‌లో అలారం పెట్టుకోండి. మెదడు దానిని గుర్తించి మేల్కొనడానికి కొత్త పాత్వే సృష్టించుకుంటుంది. ఫోన్లో రింగ్‌టోన్ మార్చండి. అది మోగినప్పుడు మీ మెదడు వెంటనే స్పందించదు. అది ఒకే రకమైన రింగ్‌టోన్‌కు ఫిక్సయి ఉంది. కానీ కొత్త రింగ్‌టోన్ మోగుతున్నప్పుడు మీకైమీరు పెట్టుకున్న రింగ్‌టోన్ అని గుర్తొచ్చి బ్రెయిన్లో కొత్త పాత్వే ఏర్పడుతుంది. ఇలా మీరు వదిలేస్తున్న అంశాలనూ మళ్లీ ఉపయోగంలోకి తెస్తుండటంతో అప్పటివరకూ మీరు లూజ్ చేసుకునేవి కూడా మీరు యూజ్ చేసుకునేవే అవుతున్నాయి. కింద మీరు చేయదగిన ఇలాంటివే మరికొన్ని మీ కోసం... బాత్రూమ్లో: మీ సబ్బును మారుస్తూ కొత్త వాసనలు పీలుస్తుండాలి. కొత్తవి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడూ వాడే నోటు కాకుండా సరికొత్త కరెన్సీ నోట్ మీ పర్స్‌లోకి వచ్చిందనుకోండి. విలువ సేమ్ అయినా కాసేపైనా దాన్ని అపురూపంగా చూస్తారు కదా. అలాగే ఈ కొత్త అనుభవాలూ మీకు కొత్త థ్రిల్‌నూ, జీవితేచ్ఛనూ ఇస్తాయి. ఆఫీసుకు వెళ్లే దారిలో : మీ వాహనాన్ని అలవాటైన ఒకే రూట్లో కాకుండా, వేర్వేరు రూట్స్‌లో నడుపుతుండండి. దాంతో మీకు కొత్తదారులు తెలుస్తాయి. ఎప్పుడైనా ఒక రూట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు... దాన్ని అధిగమించడానికి అప్పటికే తెలిసిన ‘కొత్త దారులు’ మీకు స్ఫురిస్తాయి. పనిలో: మనం పనిచేసే చోట మీ వస్తువుల్నీ, ఉపకరణాలన్నీ ఎప్పుడూ ఒకే లా ఉండకుండా చూడ ండి. కొత్త రంగు పెన్సిల్ నూ, కొత్త రంగు పెన్నూ, కొత్త ఇంక్నూ వాడండి. రొటీన్ భిన్నంగా ఉండే కొత్తది ఎప్పుడైనా మనకు ఉత్తేజాన్నే ఇస్తుంటుంది. మెదడును ఉపయోగించండి: మీరు రోజూ చేసే పనిని రొటీన్‌గా చేయకండి. కాస్తంత వేరుగా ఎలా చేయగలమో ఆలోచించండి. వైవిధ్యమైనవీ, విభిన్నమైనవీ ఆలోచనలు చేసి, అవి మీ పనికి ఎలా ఉపకరించగలవో చూడండి. అమలు చేయండి. తేడా గమనించండి. బ్రెయిన్ స్టార్మింగ్: ఆలోచనలు అలల్లాగా వస్తాయంటారు. ఒకరి ఆలోచనలు కొన్ని అలలైతే... ఎంతోమంది ఆలోచనలలు కలిస్తే... అదొక అలల వెల్లువ. ఆ వెల్లువ తీవ్రత మరింత పెరిగితే! అది అల స్థాయి నుంచి ఉప్పెనగా మారుతుంది. అయితే మీ స్నేహితులు, వాళ్లు మీకు ఇచ్చే కంపెనీ, వారందరి ఆలోచనల వెల్లువ ఉప్పెనగా మారితే... అదే బ్రెయిన్ స్టార్మింగ్. మామూలు స్టార్మ్ వినాశకమైతే... ఈ తుఫాను మంచిది. మేలు చేసేది. కాకపోతే మీ మిత్రులంతా మంచివాళ్లయి ఉండాలంతే. భోజనాల దగ్గర: భోజనాల సమయంలో ఎప్పు డూ మీకు అలవాటైన ఫుడ్ మాత్రమే కాకుండా మెనూ మార్చండి. మార్కెట్లో: ప్రతిసారీ ఒకే షాప్‌కు వెళ్లకండి. కొత్త చోట్లకు వెళ్లి అక్కడి ఉత్పాదనల్లోని ఇన్‌గ్రేడియెంట్స్ చూడండి. ఎప్పుడూ కొత్త చాక్లెట్లూ, కొత్త బిస్కెట్లూ్ల ట్రై చేయండి. పాలవాడు ఇంటికి వచ్చి పాలపాకెట్ వేయడం మామూలే. అప్పుడప్పుడూ మీరే వెళ్లి పాలపాకెట్ తెండి. ట్రావెల్: మీరు ప్రయాణాలు చేయడం అన్నది అత్యద్భుతమైన ‘న్యూరోబిక్’ వ్యాయామం. కొత్త ప్రాంతాలూ, కొత్త ముఖాలు, కొత్త ఆహారాలూ ఇవన్నీ మీ ప్రమేయం లేకుండానే సమకూరుతాయి. దాంతో మెదడులో ఆలోచనల కొత్త పాత్‌వేస్ ఏర్పడతాయి. మీరెంతగా ఎక్సయిట్ అవుతున్నారంటే... అంతగా ‘న్యూరోబిక్’ యాక్టివిటీ జరుగుతుందని అర్థం. అన్నట్టు... ఎప్పుడూ ఒకే వాహనంలో వెళ్లకండి. అప్పుడప్పుడూ మీ వాహనాన్ని మీ ఫ్రెండ్‌కు ఇచ్చి... అతడిది మీరు వాడండి. మాట్లాడండి: భావాలను వ్యక్తపరచండి. మీరు బాగా సిగ్గరా? అయితే కనీసం బాత్రూమ్లోనైనా మీ భావాలను బయటకు చెప్పండి. ఎప్పుడూ పాడే పాటలు కాకుండా కొత్త పాటలు పాడుతుండండి. విశ్రాంతిగా ఉన్నప్పుడు: ఏదైనా కొత్త హాబీని ప్రయత్నించండి. కొత్త ఫొటో తీయండి. కొత్త సంగీతవాద్యాన్ని ప్లేచేయండి. చెస్ ఆడండి. లేదా కొత్త గాడ్జెట్, కొత్త యాప్ వాడుతుండండి. మీరు చూడండి. కొందరు కొత్త కొత్త గాడ్జెట్స్ వాడుతూ, దాని అంతు చూడాలనుకుంటారు. కొత్తవాటిని ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే... మీలో అంతగా జీవనోత్సాహం ఉందన్నమాట. ఇలా చేస్తుంటే ఏమవుతుంది... మెదడుకు ఏరోబిక్స్ అయిన ఈ న్యూరోబిక్స్తో మెదడులోని పాత కణాలే... సరికొత్త కణాలుగా మళ్లీ తమను తాము ఆవిర్భవించుకుంటాయి. తమ పనిని కొత్తగా ఆవిష్కరించుకుంటాయి. మైండ్‌కు కొత్త పవర్ సమకూరుతుంది. మీ విజయరహస్యం మీ మైండ్ పవరే కదా. ఆ పవర్ మీకుంటే మీరెప్పుడూ ఫిట్. మీరెప్పుడూ యంగ్. మెదడు గురించి కొంచెం... మెదడు బరువు మహా అయితే 1.4 కిలోలు. ఈ కొద్ది బరువే తనకంటే దాదాపు 50 రెట్ల బరువున్న దేహాన్ని చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. నిత్యం దాన్ని నడిపిస్తుంటుంది. మెదడులో 85 శాతం నీళ్లే. మెదడు కణాలన్నీ కొవ్వు కణాలే. శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌లో 25 శాతం మెదడులోనే ఉంటుంది. ఒంటికి అందే ఆక్సిజన్‌లో 20 శాతం ఆక్సిజన్ తీసుకుంటుంది. మెదడులో దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. మెదడులోని ఇసుక రేణువంత భాగంలో లక్ష న్యూరాన్లు పొరుగు కణాలతో అనుసంధానితమై 100 కోట్ల కనెక్షన్లు (సైనాప్స్) ఏర్పరుస్తాయి. ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం మెదడులో ఉన్నప్పుడు దానికి వ్యాయామాలు కావాలి కదా. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనిషికి పదేళ్ల వయసు నుంచి సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అతడి ఎదుగుదలలో ఎదురవుతున్న అనుభవాలతో మెదడులో కొత్త కొత్త సైనాప్స్‌లు ఏర్పడుతుంటాయి. చూస్తున్నవీ, వాసన పీలుస్తున్నవీ, వింటున్నవీ, నేర్చుకుంటున్నవీ... ఒక కోడ్ రూపంలో న్యూరాన్లలో నిక్షిప్తమవుతాయి. ఒకసారి ఏర్పడిన జ్ఞాపకం వేరే సందర్భంలో బయటకు వచ్చి సమస్య పరిష్కారానికి తోడ్పడటం న్యూరాన్ల కనెక్షన్లతో ఏర్పడే ‘సైనాప్స్’లనే జరుగుతుంటుంది. ఇలా తెలివితేటలు (ఇంటెలిజెన్స్) వృద్ధి పొందుతుంది. అయితే ఈ ప్రక్రియలో మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరుగుతాయి. దృష్టి పెట్టని అంశాలు తగ్గుతాయి. దీన్నే ‘యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా చెప్పవచ్చు. అంటే ఉపయోగించేవి పెరుగుతూ, ఉపయోగించనివి తగ్గిపోతుంటాయి. ఉపయోగించని వాటిని ఉపయోగంలోకి తెస్తేనే మరిన్ని సైనాప్స్‌లు ఏర్పడి మెదడు చురుగ్గా మారుతుంది. న్యూరోబిక్స్ అవసరమయ్యేది అందుకే. – డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఫిజిక్స్‌తో మెదడులో కొత్త చైతన్యం!
వినేందుకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఫిజిక్స్ నేర్చుకుంటే... మెదడులో కొన్ని ప్రాంతాలు మరింత చైతన్యవంతమవుతాయి అంటున్నారు ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మెదడు పనిచేసే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడే ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్మారై) వాడి తాము ఈ అంచనాకు వచ్చామని ఎరిక్ బ్రూవీ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాదాపు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రయోగంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తూ తాము ఒక భౌతికశాస్త్ర కోర్సు మొదలుపెట్టామని, ఎఫ్ఎమ్మారై ద్వారా వారి మెదడును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు చైతన్యవంతం కావడాన్ని గుర్తించామని వివరించారు. కోర్సు ప్రారంభానికి ముందు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్య పూరణం వంటి అంశాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు చురుకుగా మారితే.. కోర్సు పూర్తయిన తరువాత ఫ్రంటల్ పోల్స్ ప్రాంతంతోపాటు పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం కూడా చైతన్యవంతమైంది. మొదటి భాగం నేర్చుకోవడానికి సంబంధించిందైతే.. రెండోది ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను క్రమపద్ధతిలో నెమరేసుకోవడం, సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్ అంశాలకు సంబంధించినవని బ్రూవీ తెలిపారు. -
కష్టం.. మెదడుకి ఇష్టం
లండన్: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్ బ్రెయిన్ హైపోథిసిస్ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది. -
మెదడును దాచేసుకోండి!
మెమరీ కార్డు కానీ.. పెన్‌డ్రైవ్ కానీ కొన్నప్పుడు అది మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని సినిమాలు కానీ.. పాటలతో కానీ నింపేస్తే.. అందులో మన సమాచారం భద్రంగా ఉంటుంది. దీన్ని జీవితాంతం ఎలాగోలా దాచేసుకోవచ్చు. మరి చిన్నప్పటి నుంచి మన మెదడులో ఎంత సమాచారం చేరి ఉంటుంది. మరి ఈ సమాచారం జీవితాంతం దాచుకోవచ్చా.. అదెలా సాధ్యం మనం చనిపోయినప్పుడే ఆ మెదడు కూడా చనిపోతుంది. మరి ఆ సమాచారం.. ఇంకెక్కడి సమాచారం మనతోపాటే గాల్లో కలిసిపోతుంది. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ మాత్రం మీ మెదడును చాలా జాగ్రత్తగా దాచేస్తామని చెబుతోంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఆ మెదడులోని సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తామంటోంది. మన మెదడులోని నాడులను, నెట్‌వర్క్‌ను అధ్యయనం చేసి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తామని నెట్కాం అనే ఈ కంపెనీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టింది ఆ కంపెనీ. ఏంటంటే మన మెదడును వారు తీసుకుని భద్రపరచాలంటే మనం చనిపోకముందే తీసుకుంటుందట. అమ్మో అదేంటి చనిపోయాక తీసుకోవచ్చు కదా అంటే సమాచారం‘బతికి’ఉండాలట. బతికి ఉండగానే మెదడులోకి ఎంబామింగ్ రసాయనాలు పంపి తాజాగా ఉంచుతారట. ఇప్పటికే ఓ పంది మెదడును ఈ ప్రక్రియతో భద్రపరిచారట. మరి ఎవరు మొదట తమ మెదడును భద్రపరుచుకుంటారో చూడాలి. -
వాటర్ ట్యాప్ తాకగానే.. 240 వోల్ట్స్ షాక్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్‌ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్‌తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్లో చోటుచేసుకుంది. డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్‌ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. 50 ఓల్ట్‌ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్‌ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు. -
కాలుష్యం కాటు..ఎందెందు వెతికినా..అందందే..
వాయు కాలుష్యం.. కంటికి కనపడదు.. కానీ.. ఒంట్లో మాత్రం కనిపిస్తుంది.. అదెలా అంటారా.. వివిధ రకాల రుగ్మతల రూపంలో.. ఓ సారి కింద ఉన్న గ్రాఫిక్‌పై ఓ లుక్కేయండి.. కాలుష్యం కాటు ప్రభావం.. మన శరీరంలో ఎందెందు వెతికినా.. అందందే అన్నట్లు కనిపిస్తుంది.. అతి సూక్ష్మమైన ధూళి కణాల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే.. ఊపిరితిత్తులు.. - ఊపిరితిత్తుల వ్యాధి మరింత ముదురుతుంది - ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది రక్తం - రక్త నాళాల గోడల ద్వారా ఈ ధూళి కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి - రక్త ప్రసరణ సమస్యలు - రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం/థ్రాంబోసిస్ రక్త నాళ వ్యవస్థ - అథెరోస్క్లెరోసిస్(ధమని గోడల్లో కణితి ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ తగ్గడం) - రక్త నాళాలు కుచించుకుపోవడం, అధిక రక్తపోటు మెదడు - మెదడుకు రక్తప్రసరణ సరిగా లేక స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం - కాగ్నిటివ్ డిజార్డర్స్ (మానసిక రుగ్మతలు) - న్యూరో డిజెనరేషన్ సమస్యలు(పార్కిన్సన్, అల్జీమర్స్ మొదలైనవి) గుండె - గుండె పనితీరులో మార్పులు - గుండె కొట్టుకునే వేగానికి సంబంధించిన సమస్యలు పునరుత్పత్తి వ్యవస్థ - సంతానోత్పత్తి సమస్యలు - గర్భస్రావం - పిండం ఎదుగుదల సమస్యలు, నెలలు నిండకుండానే జననం - తక్కువ బరువుతో పుట్టడం సాక్షి, తెలంగాణ డెస్క్ ఆధారం: ఫ్రెంచ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ