ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ చాలా బిజీ అనే చెప్పొచ్చు. పక్కోడితో మాట్లాడే టైం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు మనుషులు. ఇలా బిజీగా ఉన్నాం అని చెప్పడాన్ని కొందరూ స్టేటస్ ఆఫ్ సింబల్‌గా ఫీలవ్వుతారు. ఎంత బిజీ అంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తిమీద వేసుకోండి. ఇలా క్షణం తీరిక లేకుండా ఉండటం చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే అత్యంత డేంజరని చెబుతున్నారు.
ఎందువల్ల అంటే..? చాలామంది వర్క్ లైఫ్‌లో బిజీగా ఉన్నామని కనీసం స్నేహితులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదని వాపోతుంటారు. చాలామంది తమ భాగస్వామికి, కడుపున పుట్టిన పిల్లలకు కాస్త కూడా టైం ఇవ్వరు. దీన్ని క్షణం తీరిక లేనితనం అంటారు. ఇది క్రమేణ వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపి, నాణ్యతలేని పనితీరుకి దారితీసి మీ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే పనిచేయడం అన్నది ముఖ్యమే. కానీ సమయాన్ని సమృద్ధిగా వినియోగించుకునేలా చేసుకుని సకాలంలో అన్నింటిని చేయగలిగేలా కేటాయించుకోవాటలి.
అందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. మానసిక శ్రేయస్సుని పెంపొందించేలా క్షణం తీరిక లేని బిజీని అధిగమించేలా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్‌లు, ఫోన్‌కాల్‌లు, మీటింగ్‌లు వంటి వాటిన్నింటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. కనీసం వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని నిమిషాలు మిగిలేలా చేసుకుండి. ఆ కొద్ది సమయంలో చేయాలనుకుంటున్న ఎంజాయ్‌మెంట్‌ని ఫుల్ జోష్‌గా చేయండి. అంటే వాకింగ్, లేదా కాసేపు మీతో మీరు గడపటం లేదా మీకు నచ్చిన వాళ్లతో తుళ్లుతూ హాయిగా గడటం వంటివి చేయండి. ఇది మీకు మానసికంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది.
పైగా పనితీరు నాణ్యత మెరుగుపడుతుంది. ఎంతటి బిజీలో అయిని కొన్ని నిమిషాల ఫ్రీడమ్‌ని జరుపుకోవాలి. అది మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా ఏదైన షెడ్యూల్ పూర్తి అయిని వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగిపొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్‌గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్.
ఒక్కోసారి ఆలస్యంగా పనులు అయ్యాయని..అనుకున్నట్లుగా త్వరతిగతిన పనులు కాలేదని బెంత్తిపోనవసరం లేదు. మిగతా వ్యక్తిగత పనులను తొందరగా చేసుకునేలా ట్రై చేయండి చాలు. లేదా ఈ రోజు కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ టైం విరామం తీసుకున్నామని అనుకోండి తప్ప విరామం తీసుకోవడం మాత్రం స్కిప్ చెయ్యొద్దని చెబుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ తొందరగా ఆఫీస్ పనులు పూర్తి చేయాలనకుంటారు.
ఒక్కొసారి పలు కారణాల వల్ల ఆసల్యం అవుతాయి. దీంతో ఆగ్రహం తెచ్చుకోవద్దు. మరో అవకాశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఆ దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి టైం మిగిల్చుకోలేకపోయిన మరోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుని ఎంజాయ్ చేయొచ్చన్న ఫీలింగ్ మనలో తెలియకుండానే ఒత్తిడిని జయించేలా చేస్తుంది. ఫలితంగా మెదుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు.
(చదవండి: వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె..?)
Comments
Please login to add a commentAdd a comment