psychology
-
ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?
పీడకలలు (Nightmares) ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఏదో ఒక సమయంలో రావడం మామూలే. తీవ్రమైన మానసిక ఒత్తిడికీ, ఆవేదనకు గురైన / గురవుతున్న వారితో పాటు ఆర్థిక, సామాజిక కారణాలతో బాధపడుతూ ఉండేవారికి ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక మరికొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత జెట్లాగ్ టైమ్‌లో లేదా ఆ తర్వాత కూడా పీడకలలు రావచ్చు. ఇవి అదేపనిగా వస్తుంటే అందుకు కారణాలేమిటి, వాటికి చికిత్స ఏమిటన్న విషయాలను తెలుసుకుందాం.అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో పీడకలలు రావడం అన్నది సాధారణమే అయినా... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం వల్లా... అలాగే వాటి దుష్ప్రభావం వారి దైనందిన జీవితంపై పడటంతో సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బతినడం జరగవచ్చు. దాంతో తమకు సంబంధించిన ఇతరత్రా పనులేవీ చేసుకోలేని విధంగా తీవ్రమైన మానసిక ఆందోళనకూ, తీవ్రమైన ఒత్తిడికీ, ఆందోళనకూ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్మేర్ డిజార్డర్’(Nightmare disorder)గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్’(Dream anxiety disorder) అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్మేర్ డిజార్డర్’ లేదా ‘రిపీటెడ్ నైటమేర్స్’ (Repeated nightmares) అంటున్నారు. (కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!)సాధారణంగా ‘నైట్మేర్ డిజార్డర్’ సమస్యకు మందుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ధైర్య వచనాలు చెప్పి సాంత్వన కలిగించడం అవసరం. అలాగే వాళ్లకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో పదే పదే ఇలాంటి కలలు రావడానికి మరో అంతర్గత కారణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి అండర్లైయింగ్ మెడికల్ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు. మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్ రెడ్యూసింగ్ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. అయితే భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, కుటుంబ పెద్ద మరణం... ఇలాంటి ఏవైనా కారణాలతో కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాంతమైనట్లుగా బాధితుల మనసులో నాటుకుపోయేలా చేస్తారు. ఫలితంగా పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ చాలా బిజీ అనే చెప్పొచ్చు. పక్కోడితో మాట్లాడే టైం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు మనుషులు. ఇలా బిజీగా ఉన్నాం అని చెప్పడాన్ని కొందరూ స్టేటస్ ఆఫ్ సింబల్‌గా ఫీలవ్వుతారు. ఎంత బిజీ అంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తిమీద వేసుకోండి. ఇలా క్షణం తీరిక లేకుండా ఉండటం చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే అత్యంత డేంజరని చెబుతున్నారు. ఎందువల్ల అంటే..? చాలామంది వర్క్ లైఫ్‌లో బిజీగా ఉన్నామని కనీసం స్నేహితులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదని వాపోతుంటారు. చాలామంది తమ భాగస్వామికి, కడుపున పుట్టిన పిల్లలకు కాస్త కూడా టైం ఇవ్వరు. దీన్ని క్షణం తీరిక లేనితనం అంటారు. ఇది క్రమేణ వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపి, నాణ్యతలేని పనితీరుకి దారితీసి మీ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే పనిచేయడం అన్నది ముఖ్యమే. కానీ సమయాన్ని సమృద్ధిగా వినియోగించుకునేలా చేసుకుని సకాలంలో అన్నింటిని చేయగలిగేలా కేటాయించుకోవాటలి. అందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. మానసిక శ్రేయస్సుని పెంపొందించేలా క్షణం తీరిక లేని బిజీని అధిగమించేలా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్లు, ఫోన్కాల్లు, మీటింగ్‌లు వంటి వాటిన్నింటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. కనీసం వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని నిమిషాలు మిగిలేలా చేసుకుండి. ఆ కొద్ది సమయంలో చేయాలనుకుంటున్న ఎంజాయ్‌మెంట్‌ని ఫుల్ జోష్‌గా చేయండి. అంటే వాకింగ్, లేదా కాసేపు మీతో మీరు గడపటం లేదా మీకు నచ్చిన వాళ్లతో తుళ్లుతూ హాయిగా గడటం వంటివి చేయండి. ఇది మీకు మానసికంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది. పైగా పనితీరు నాణ్యత మెరుగుపడుతుంది. ఎంతటి బిజీలో అయిని కొన్ని నిమిషాల ఫ్రీడమ్‌ని జరుపుకోవాలి. అది మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా ఏదైన షెడ్యూల్ పూర్తి అయిని వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగిపొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్‌గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్. ఒక్కోసారి ఆలస్యంగా పనులు అయ్యాయని..అనుకున్నట్లుగా త్వరతిగతిన పనులు కాలేదని బెంత్తిపోనవసరం లేదు. మిగతా వ్యక్తిగత పనులను తొందరగా చేసుకునేలా ట్రై చేయండి చాలు. లేదా ఈ రోజు కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ టైం విరామం తీసుకున్నామని అనుకోండి తప్ప విరామం తీసుకోవడం మాత్రం స్కిప్ చెయ్యొద్దని చెబుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ తొందరగా ఆఫీస్ పనులు పూర్తి చేయాలనకుంటారు. ఒక్కొసారి పలు కారణాల వల్ల ఆసల్యం అవుతాయి. దీంతో ఆగ్రహం తెచ్చుకోవద్దు. మరో అవకాశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఆ దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి టైం మిగిల్చుకోలేకపోయిన మరోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుని ఎంజాయ్ చేయొచ్చన్న ఫీలింగ్ మనలో తెలియకుండానే ఒత్తిడిని జయించేలా చేస్తుంది. ఫలితంగా మెదుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. (చదవండి: వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె..?) -
Lok sabha elections 2024: కాంగ్రెస్‌లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్‌బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్‌తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్‌తో పాటు ఢిల్లీలోని డే స్కూల్‌కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్‌తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
Funday: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?
సాగర్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్ టార్గెట్స్ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రమోషన్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్‌లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న సాగర్ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది. నిరంతరం నెగటివ్ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్ పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం. అనేక కారణాలు... మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లానే వివిధ కారణాలుంటాయి. ♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను నియంత్రించే సెరటోనిన్ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి. ♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. నివారణ లేదు, నియంత్రణే మార్గం... పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు... ♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి ♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి ♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి ♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ♦ తమను తాము ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి ♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి ♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్‌ను కలసి చికిత్స పొందాలి ♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. నిరాశ, నిస్సహాయత... పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే... ♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత ♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం. ♦ అలసట, శక్తి లేకపోవడం. ♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం ♦ ఫోకస్ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు. ♦ చిరాకు, అసహనం లేదా కోపం. ♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం. ♦ గతం గురించి చింత, అపరాధ భావాలు ♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం. ♦ నిద్ర సమస్యలు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
వర్చువల్ రియాల్టీలో దాడి.. తప్పని బాధ!
కాలం మారింది. టెక్నాలజీ మారుతోంది. దాంతో నేరాల తీరు కూడా మారుతోంది. ఈరోజు మనం ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని ఒక నేరం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో 16 సంవత్సరాల వయసున్న ఒక బాలిక అవతార్ పై మెటావర్స్ లో గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడీ జరగలేదు, వర్చువల్ రియాలిటీలో జరిగింది. కానీ ఆమె నిజ జీవితంలో అత్యాచార బాధితులు అనుభవించే మానసిక, భావోద్వేగ వేదననే అనుభవిస్తోంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ గురించి, దాని లాభనష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? వర్చువల్ రియాలిటీ (VR) అంటే... నిజజీవితంలో లభించే అనుభవాన్ని కంప్యూటర్ వాతావరణంలో అందించే సాంకేతికత. ఫేస్బుక్ సంస్థ మెటా ఇప్పుడు మెటావర్స్ పేరుతో అలాంటి టెక్నాలజీని అందరికీ అందించే ప్రయత్నంలో ఉంది. దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అందువల్ల దీన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ముఖ్యం. నిజంగా దాడి జరగకపోయినా మానసిక క్షోభ ఎందుకు? అది సరే.. ఆ అమ్మాయిపై ఎలాంటి దాడి జరగకపోయినా మానసిక వేదన కలగడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా. మీరో చిన్న పనిచేయండి. కళ్లు మూసుకుని, చేతిలో నిమ్మకాయ ఉన్నట్లు ఊహించండి. దాని వాసన చూస్తున్నట్లుగా, టేస్ట్ చేస్తున్నట్లుగా ఊహించండి. మీ నోటిలో లాలాజలం ఊరిందా? మీరు నిమ్మకాయ తినకుండానే లాలాజలం ఎలా ఊరింది? వర్చువల్ రియాలిటీ అనుభవం కూడా అలాంటిదే. ► నిజానుభవం లాంటి అనుభవాన్ని కంప్యూటర్ ప్రపంచంలో అందించడమే వర్చువల్ రియాలిటీ లక్ష్యం. వినియోగదారులు తాము నిజమైన వాతావరణంలో ఉన్నట్లు భావించేలా చేయడం. అందువల్ల మెదడు వర్చువల్ అనుభవాలను వాస్తవంగా భావిస్తుంది. ► భౌతిక ప్రపంచంలో లేదా వర్చువల్ రియాలిటీలో మనం సంఘటనలను అనుభవించినప్పుడు, మన మెదడు వివిధ నాడీ మార్గాల ద్వారా సమాచారాన్ని ఒకేలా ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల నిజమైన లేదా వర్చువల్ అనుభవాలకు సమానంగా ప్రతిస్పందిస్తుంది. ► ఒక సంఘటన వల్ల జరిగే నష్టాన్నికేవలం శారీరక హాని ద్వారా మాత్రమే నిర్ణయించరు. దానికి మించిన ఎమోషనల్ పెయిన్ ఉండవచ్చు, ముఖ్యంగా అత్యాచారం లాంటి దుర్ఘటనల్లో. వర్చువల్ రియాలిటీలో జరిగిన అత్యాచారాన్ని వాస్తవమైనట్లుగా మెదడు ప్రాసెస్ చేసిందా కాబట్టే ఆ అమ్మాయి నిజమైన మానసిక క్షోభకు గురయ్యింది. అత్యాచారం జరగకపోయినా, ఎమోషనల్ పెయిన్ మాత్రం నిజం. ► అలాగని అందరూ అలాగే స్పందించాలని లేదు. వ్యక్తిత్వం, గత అనుభవాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు వ్యక్తి వర్చువల్ పరిస్థితులను ఎలా గ్రహించి ప్రతిస్పందిస్తారో ప్రభావితం చేయవచ్చు. కాపాడుకోవడం ఎలా? ► మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇకపై నిజ జీవితంలోనే కాదు వర్చువల్ రియాలిటీలో కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ► హానికరమైన సాఫ్ట్వేర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారిక స్టోర్లు నుండి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేయండి. ► సాఫ్ట్వేర్ హార్డ్‌వేర్‌ను, అప్డేట్ చేస్తూ ఉండండం వల్ల బగ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ► వర్చువల్ రియాలిటీలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి. మీ అసలు పేరు, చిరునామా లేదా ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను షేర్ చేసుకోవద్దు. ► మీ VR ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. ► వాస్తవ ప్రపంచంలో లానే VRలో కూడా అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► వర్చువల్ ప్రపంచంలో ఎదురైన వ్యక్తులను నిజ జీవితంలో కలవకుండా ఉండండి. ► మీ పిల్లలు VRని ఉపయోగిస్తుంటే, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించండి. వయస్సుకి తగిన కంటెంట్ పరిమితులను సెట్ చేయండి. ► VR ప్లాట్‌ఫారమ్ అందించిన పేరంటల్ కంట్రోల్స్ ను ఉపయోగించండి. ► VR ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా అనుమానాస్పదంగా, అనుచితంగా కనిపిస్తే వెంటనే బ్లాక్ చేయండి, ప్లాట్ ఫారమ్ కు రిపోర్ట్ చేయండి. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
పుట్టగానే పిల్లలు ఏడవడం లేదా? ఈ సమస్య రావొచ్చు..కారణాలివే!
సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం. టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ∙సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం. తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ► ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ∙తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ► ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే.. ♦మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ∙పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ♦ వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ∙మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ∙ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో ADHD అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ♦ పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి ∙సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ∙మందులు మెదడులోని న్యూరోట్రాన్మ్సిటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
మీ బిడ్డ స్కూల్లో నోరు విప్పడంలేదా? సైలెంట్ అనుకోవద్దు.. చాలా ప్రమాదం
సునీత, సుందర్‌లకు నందిని ఒక్కతే కూతురు. హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముచ్చటైన పిల్ల. తన పనులన్నీ తానే చేసుకుంటుంది. బొమ్మలు అద్భుతంగా వేస్తుంది. కానీ మాట్లాడటం తక్కువ. మేనత్త పోలికలు వచ్చాయని సరిపెట్టుకున్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్‌కాల్ వచ్చేసరికి, పాపకు ఏమైనా అయ్యుంటుందేమోనని సునీత భయపడింది. హడావుడిగా స్కూల్‌కు వెళ్లి చూసేసరికి, క్లాస్ టీచర్ సుమిత్ర దగ్గర నిల్చుని ఉంది నందిని. ఎందుకింత హడావుడిగా పిలిచారని అడిగింది. ‘ఏం చెప్పమంటారు మేడం? నందిని రెండు నెలలుగా క్లాసులో నోరు మెదపడం లేదు. ఏం అడిగినా మౌనంగానే ఉంటోంది. క్లాస్ టెస్ట్‌లలో బాగానే రాస్తోంది. కానీ క్లాసులో మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత బుజ్జగించి అడిగినా నో యూజ్.’ ‘తను ఇంట్లో కూడా తక్కువే మాట్లుతుంది మేడం. వాళ్ల మేనత్త పోలిక.’‘అలా సరిపెట్టుకుంటే సరిపోదు మేడం. పాప ఏదో సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఎవరైనా సైకాలజిస్ట్‌కు చూపించండి.’ ‘సైకాలజిస్ట్ దగ్గరకా? ఎందుకు మేడం? మా పాపకేమైనా పిచ్చి అనుకుంటున్నారా?’ అని కోపంగా అడిగింది సునీత. ‘సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లేవాళ్లందరూ పిచ్చివాళ్లే అనేది మీ అపోహ మేడం. మానసిక సమస్యలు పిల్లల్లో కూడా రావచ్చు. దయచేసి అర్థంచేసుకుని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి’ అని చెప్పింది టీచర్. తప్పదన్నట్లుగా నందినిని మా క్లినిక్‌కు తీసుకువచ్చారు. సునీత చెప్పింది విన్నాక నందిని ‘సెలెక్టివ్ మ్యూటిజం’తో బాధపడుతోందని అర్థమైంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఒకశాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటుందని అంచనా. కొన్నిచోట్ల నోరు విప్పరు.. మీ బిడ్డ సెలెక్టివ్ మ్యూటిజంతో పోరాడుతున్నట్లనిపిస్తే ఈ కింది లక్షణాల కోసం చూడండి. అయితే రెండు మూడు లక్షణాలు కనపడగానే సెలక్టివ్ మ్యూటిజం అని నిర్ధారణకు రాకండి. సైకోడయాగ్నసిస్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. ఆత్రుత, భయం లేదా ఇబ్బంది కారణంగా మాట్లాడాలనే కోరికను అణచుకోవడం ∙భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కదలిక లేకపోవడం, మాట్లాడకపోవడం, కళ్లల్లోకి చూడలేకపోవడం ∙ స్కూల్ లేదా ఇతర నిర్దిష్ట సామాజిక పరిస్థితులలో మాట్లాడలేకపోవడం ∙అవసరాలను వ్యక్తీకరించడానికి మాటలు కాకుండా సంజ్ఞలు ఉపయోగించడం ∙ 2–4 సంవత్సరాల వయసులో సిగ్గు, ఇతరులంటే భయం, మాట్లాడటానికి అయిష్టత ∙ ఇంట్లో లేదా తెలిసిన వ్యక్తులతో సులభంగా మాట్లాడటం, స్కూల్లో, టీచర్లతో నోరువిప్పకపోవడం.మాట్లాడమని బలవంతం చేయొద్దు..సెలెక్టివ్ మ్యూటిజంను ఎంత ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే బిడ్డ మౌనానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. మీ బిడ్డ నెల అంతకంటే ఎక్కువ కాలం మౌనంగా ఉంటే, వెంటనే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. చికిత్స కోసం సైకాలజిస్టును సంప్రదించడంతో పాటు మీరు చేయగలిగేవి కూడా ఉన్నాయి.∙మాట్లాడని పిల్లల పట్ల టీచర్లు విసుగ్గా లేదా కోపంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన ఉద్దేశపూర్వకం కాదని టీచర్లకు తెలియజేయండి. సానుకూల ప్రవర్తనలకు ప్రశంసలు, బహుమతులు అందించాలి ∙మాట్లాడినప్పుడు మెచ్చుకోండి. అంతేతప్ప మాట్లాడాల్సిందేనని పిల్లలను బలవంతం చేయవద్దు. బదులుగా చదవడం, డ్రాయింగ్ లేదా పజిల్స్ చేయడం వంటివి ఎంచుకోండి ∙మీ బిడ్డ మాట్లాడటానికి భయపడితే, ఒత్తిడి లేదా పనిష్మెంట్ ద్వారా వారు ఈ భయాన్ని అధిగమించలేరు. కాబట్టి మౌనానికి శిక్షించవద్దు ∙మాట్లాడమని ఒత్తిడి చేయవద్దు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది ∙సెలెక్టివ్ మ్యూటిజం కోసం దీర్ఘకాలం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అవసరమవుతుంది ∙ఇందులో డీసెన్సిటైజేషన్, రీఇన్ఫోర్స్మెంట్, షేపింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లోని ఆందోళన తగ్గి ధైర్యంగా మాట్లాడేందుకు సహాయపడతారు ∙ఎక్స్పోజర్ థెరపీ ద్వారా సురక్షితమైన స్థలాన్ని సృష్టించి పిల్లల్లోని భయాన్ని తగ్గించవచ్చు. సమస్య తీవ్రంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, థెరపీ వల్ల మెరుగుపడనప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఆందోళనే ప్రధాన కారణం.. అన్ని మానసిక రుగ్మతల్లాగే సెలెక్టివ్ మ్యూటిజానికి కూడా ఒకే కారణం ఉండటం అసంభవం. చైల్డ్ అబ్యూజ్, ట్రామా కారణమని గతంలో నమ్మేవారు. అయితే ఇది సోషల్ యాంగ్జయిటీకి సంబంధించినదని, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. బాగా సిగ్గుపడే లేదా భయపడే లేదా స్వీయ నియంత్రణ సమస్యలున్న పిల్లల్లో కూడా ఇది రావచ్చు. సోషల్ యాంగ్జయిటీ ఉన్న పేరెంట్స్ ఉంటే వారి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఓసీడీ, పానిక్ డిజార్డర్, ఆటిజం లాంటి మానసిక సమస్యలున్న పిల్లల్లో కూడా సెలెక్టివ్ మ్యూటిజం కనిపించే అవకాశం ఉంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
ముఖమంతా మొటిమలు, బయటకు వెళ్లలేకపోతున్నా.. ఏం చేయాలి?
‘బేబీ... పొద్దున లేచిందగ్గర్నుంచీ అద్దం ముందేనా? త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లు’ అని అరిచింది అరవింద. ‘వెళ్తాలేమ్మా’ అని సమాధానమిచ్చింది మానవి. కానీ అద్దం ముందు నుంచి కదల్లేదు. తన మొహంపై మొటిమలు అసహ్యంగా ఉన్నాయని బాధపడుతూ కూర్చుంది. ‘బేబీ... కాలేజీ బస్ వచ్చిందమ్మా’ అని కేకేశాడు ఆనంద్. ‘వస్తున్నా డాడీ... కాస్త ఆగమని చెప్పు’ అని హడావుడిగా తయారై బస్సెక్కింది. ∙∙ ‘హాయ్... బేబీ’ అని పలకరించింది అర్పిత. ‘హాయ్.. అర్పీ’ ‘హేయ్... కరోనా పొయ్యి ఏడాదైందే. ఇంకా ఆ మాస్క్ ఏంటే బాబూ?’ ‘ఏం చెప్పమంటావే... మొహమంతా పింపుల్స్. ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా తగ్గడంలేదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్ కూడా వాడా. అయినా నో రిలీఫ్.’ ‘హ్మ్... వాటి గురించి అంత ఆలోచనెందుకే బాబూ! ఆ పింపుల్స్‌తో నువ్వు సాయిపల్లవిలా కనిపిస్తున్నావ్ తెలుసా?’ ‘నా మొహంలే’ అని బలవంతంగా నవ్వింది మానవి. క్లాసులో కూర్చుందన్న మాటే కాని మనసంతా పింపుల్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటివల్లనే తాను అందంగా కనిపించడంలేదని, వాటివల్లనే తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటోంది. ఎలాగోలా క్లాసులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది. ‘బేబీ.. త్వరగా స్నాక్స్ తిని రెడీ అవ్వు. మావయ్య వాళ్లింట్లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం’ అని చెప్పింది అరవింద. ‘నువ్వెళ్లు మమ్మీ... నేను రాను.’‘అదేంటే.. అన్నిటికీ, నేను రాను, నేను రాను అంటావ్. నువ్వు రాకపోతే మావయ్య ఫీలవుతాడు. మీ అత్త నిష్టూరమాడుతుంది.’ ‘వాళ్లతో నేను ఫోన్లో మాట్లాడతాలే, నువ్వెళ్లు.’‘ఏవిటో ఇది.. ఎక్కడికీ రానంటుంది’ అనుకుంటూ వెళ్లింది అరవింద. ∙∙ పింపుల్స్ సమస్య చిన్నదే. టీనేజ్‌లో చాలామంది అనుభవించేదే. కానీ మానవికి మాత్రం అదో పే...ద్ద సమస్యగా మారింది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయాయి. నిత్యం ఆందోళనగా ఉంటోంది. దాన్ని అధిగమేంచేందుకు విపరీతంగా తింటోంది. దానివల్ల బరువు పెరుగుతోంది. దానివల్ల మళ్లీ ఆందోళన. ఇదో అందులేని నెగెటివ్ సైకిల్‌గా మారిపోయింది. పలకరిస్తే ఏడుస్తోంది. దీనికేదో అయ్యిందని అరవింద.. మానవిని కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు. లేని సమస్య గురించే ఆలోచనలు మానవితో అరగంట మాట్లాడేసరికి... ఆమె మనసంతా మొటిమలపైనే ఉందని అర్థమైంది. మానవికి ఉన్న సమస్యను బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ) అంటారు. అంటే శరీరంలో ఇతరులకు కనిపించని లోపం ఉందని భావిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉండటం. ఇదో రకమైన మానసిక రుగ్మత. ఓసీడీలో ఇదో రకం. మానవి మొటిమల గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ముక్కు గురించి లేదా రంగు గురించి లేదా బరువు గురించి లేదా ముడతల గురించి లేదా వక్షస్థలం కొలత గురించి ఆలోచించవచ్చు. టీనేజ్ కుర్రాళ్లు జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం లేదా కండలు లేకపోవడం గురించి బాధపడుతూ ఉండవచ్చు. ఈ ఆలోచనలను నియంత్రించడం కష్టం. కారణాలు అనేకం... బీడీడీ ఎలా, ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. జెనెటిక్స్ నుంచి కల్చర్, మీడియా వరకూ రకరకాల కారకాలు ఉంటాయి. బీడీడీ ఉన్న కుటుంబ సభ్యులుంటే ఇది వచ్చే అవకాశం మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కల్చర్, మీడియా, మూవీస్ కలిసి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. బాల్యంలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదా బెదిరించడం లేదా ఆటపట్టించడం లాంటివి కూడా కారణం కావచ్చు. బీడీడీ సంకేతాలు, లక్షణాలు ►ఇతరులకు కనిపించని లేదా మైనర్‌గా అనిపించే లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం .మీ రూపాన్ని అగ్లీగా మార్చే లోపం ఉందని బలమైన నమ్మకం ►మీ రూపాన్ని ఇతరులు ఎగతాళి చేస్తారనే నమ్మకం. ►తరచూ అద్దంలో చూసుకోవడం ∙స్టైలింగ్, మేకప్ లేదా దుస్తులతో లేని లోపాలను దాచడానికి ప్రయత్నించడం ►మీ రూపాన్ని నిరంతరం ఇతరులతో పోల్చడం ∙లోపాన్ని సరిదిద్దుకునేందుకు విస్తృతంగా కాస్మెటిక్స్ వాడటం ∙మీలో లోపం ఉందని, ఫంక్షన్స్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం. సైకోథెరపీతో చెక్ పెట్టొచ్చు మొదటి సెషన్లో సైకో డయాగ్నసిస్ ద్వారా మానవి సమస్యను నిర్ధారణయ్యాక, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స ప్రారంభించాను. ప్రతికూల ఆలోచనలు, ఎమోషనల్ రియాక్షన్స్, ప్రవర్తనలు సమస్యకు ఎలా కారణమవుతాయో తెలుసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పింపుల్స్ గురించి ఉన్న ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సరైన ఆలోచనా విధానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. తరచూ అద్దం చూసుకోవడం, కాస్మెటిక్స్ తగ్గించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. అలా పది సెషన్లలో మానవి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాను మొటిమల సమస్యను పక్కకు నెట్టేసి, కాన్ఫిడెంట్‌గా అన్ని ఫంక్షన్స్‌కు హాజరవుతోంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్ క్యాన్సిల్
చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్ టెర్రర్ లేదా స్లీప్ టెర్రర్ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం. మాధురి, మాధవ్ అందమైన జంట. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్ స్టేజ్‌కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్ స్టాఫ్ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్ కేన్సిల్ చేసుకుని వచ్చేశారు. ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్ చేసి అదో స్లీప్ డిజార్డర్ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్ కు తీసుకువచ్చాడు. స్లీప్ టెర్రర్స్... మాధురి సమస్యను స్లీప్ టెర్రర్స్ లేదా నైట్ టెర్రర్స్ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్ టెర్రర్స్ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. స్లీప్ టెర్రర్ లక్షణాలు యుక్త వయసు తర్వాత కూడా స్లీప్ టెర్రర్స్ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్ ప్లేస్‌లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి ... · నిద్రలో భయపెట్టే అరుపులు · కళ్లు పెద్దవి చేసి చూడటం · మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం · గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం · మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం · మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ... స్లీప్ టెర్రర్స్ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్ టెర్రర్స్ లేదా స్లీప్ వాకింగ్ చరిత్ర ఉంటే స్లీప్ టెర్రర్స్ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. · నిద్ర లేమి, విపరీతమైన అలసట · మానసిక ఒత్తిడి · నిద్ర షెడ్యూల్‌కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు · తరచూ ప్రయాణాలు · జ్వరం · నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు · రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు, · మద్యం వినియోగం ప్రశాంతత ముఖ్యం... మీకు లేదా మీ పిల్లలకు స్లీప్ టెర్రర్స్ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. · మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. · అలసట, ఆందోళన స్లీప్ టెర్రర్స్కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి. · స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్ రూమ్‌ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. · నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా సహాయపడవచ్చు. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. · ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్‌లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్‌బ్యాక్ లేదా రిలాక్సేషన్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
''ఐఏఎస్ కొడుకు టైలర్ అవుతాడా? కనీసం ఇంజనీర్ అవ్వాల్సిందే''
యువతలోని ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న నినాదం... జాయిన్ ది జోమో క్లబ్! ఒకప్పుడు ఫోమో(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) క్లబ్లో ఉన్నవారు కూడా జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) లోకి వచ్చేస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్ ధోరణికి భిన్నంగా కలలు కనే ‘జోమో’ ట్రెండ్ యువతరం ‘సక్సెస్‌తో సంతోషం వస్తుందో లేదో గాని సంతోషంతో మాత్రం తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది’ అంటోంది... రాజస్థాన్‌లోని కోట నగరం ‘కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచింది. తియ్యటి భవిష్యత్ కలలతో పాటు పీడకలలలాంటి ఒత్తిడి, భయం, ఆందోళన ఆ గాలిలోనే తేలియాడుతుంటాయి.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజిత్ కిశోర్ ఐఐటీ కోంగ్ కోసం ఇక్కడికి వచ్చాడు. తండ్రికి చెరుకుకు సంబంధింన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఐఐటీ–కాన్పూర్‌లో చదివిన అజిత్ సోదరుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మరో ‘ఐఐటీ పుత్రుడు’ కావాలనుకున్నాడు తండ్రి. ఫలితంగా అజిత్ కిశోర్ కోట నగరానికి అనివార్యంగా రావాల్సి వచ్చింది.అజిత్ కిశోర్‌కు ఐఐటీ అంటే బొత్తిగా ఇష్టం లేదు.‘ఆసక్తి లేకపోవడం కాదు, అందుకు తగిన ప్రతిభాసామర్థ్యాలు నాలో లేవు. నాకు సంబంధం లేని విషయానికి నేనేందుకు బాధ పడాలి?’ అంటాడు అజిత్. తరచు కోచింగ్ క్లాసులు ఎగ్గొట్టే బిహార్‌లోని పట్నాకు చెందిన రక్షిత్ కుమార్ ‘నాకు ఐఐటీ సీటు కచ్చితంగా రాదు. అయినా సరే, నటించక తప్పదు’ అని నవ్వుతూ అంటాడు. ‘దీనివల్ల టైమ్, డబ్బు వృథా కదా?’ అని అడిగితే రక్షిత్ ఇలా జవాబు ఇస్తాడు...‘నేను చదువులో యావరేజ్ స్టూడెంట్‌ని. మా నాన్నకేమో నేను ఇంజినీర్ కావాలని పట్టుదల. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా కల. ఈ విషయాన్ని నాన్నకు చెబితే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు టైలర్ కావాలనుకుంటాడా? అని వెటకారంగా మాట్లాడారు. నిన్ను ఇంజినీర్‌గా చూడాలనేది నా కల. ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు అని ఆర్టర్ జారీ చేశారు. కాబట్టి ఆయన మనసు నొప్పించకుండా ఇక్కడకు రావాల్సి వచ్చింది’ మధ్యప్రదేశ్ నుంచి కోట నగరానికి వచ్చిన అదితిశర్మ తండ్రి డెంటిస్ట్. తల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ‘నా తల్లిదండ్రుల కలల బాధితురాలిని’ నవ్వుతూ అంటుంది అదితి. ‘ఎందుకలా?’ అని అడిగితే... ‘నా తల్లిదండ్రులు చదువులో బ్రైట్. నేను మాత్రం బ్రైట్ స్టూడెంట్ కాలేకపోయాను. అందుకు నేనేమీ బాధ పడడం లేదు. చెఫ్ కావాలనేది నా కల’ అంటుంది అదితి.అదితి శర్మలాగే ‘కోట మాత్రమే ప్రపంచం కాదు. దీనికి అవతల పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనకు తగిన అద్భుత అవకాశాలు ఉంటాయి’ అనుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కోట లాంటి కోంగ్ సెంటర్లకు ప్రసిద్ధిగాంచిన నగరాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అదితిశర్మలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అదితి శర్మలాంటి వాళ్లను ఆకట్టుకుంటున్న ట్రెండ్... జోమో. ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోతుందేమో అనే భయం) పాత విషయం అయిపోయింది. జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోయినందుకు ఆనందం) అనేది కొత్త ట్రెండ్‌గా మారింది. యూత్‌లో కొంతమంది నుంచి వినిపిస్తున్న ‘జాయిన్ ది జోమో క్లబ్’ నినాదాన్ని ఎలా చూడాలి?పలాయనవాదమా? కాలహరణమా? ‘చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఆదేశించగానే ఓకే చెబుతారు. తాము సాధించగలం అనుకుంటారు. ఒకసారి వృత్తంలోకి వచ్చిన తరువాత పేరెంట్స్, ఉపాధ్యాయులు, ఇతరుల నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చే ఒత్తిడితో సతమతమవుతారు. ఆ తరువాత పరిణామాలు ఎటో వెళతాయి. మొదటికే మోసం వస్తుంది. తల్లిదండ్రుల కలను నెరవేర్చలేకపోతున్నాను అనే బాధతో ఆత్మహత్యకు పాల్పడే వాళ్లు కూడా ఉన్నారు. దీని కంటే జోమో నయం కదా! జోమో బాయ్స్ అండ్ గర్ల్స్ తమ బలాలు, బలహీనతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇఫ్ ఐయామ్ హ్యాపీ ఐయామ్ సక్సెస్ఫుల్. సక్సెస్ అంటే అకాడమిక్, ప్రొఫెషన్ సక్సెస్ మాత్రమే కాదు’ అంటూ జోమోవాదులను సమర్థించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.‘జోమో’ కెరీర్‌కే పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్‌మీడియాలోని అనేక అంశాలు ఈ ట్రెండ్ బలపడడానికి కారణం.‘సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేవె అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ భావనా బర్మీ. రెండు సంవత్సరాల క్రితం ట్రావెల్ ఇండస్ట్రీలో ‘జోమో’ ట్రెండ్ గట్టిగా వినిపించింది, ఈ ట్రెండ్‌లో భాగంగా ఆఫ్ సీజన్, జనసమూహాలు ఎక్కువగా కనిపించని, పెద్దగా జనాదరణ లేని ప్రదేశాలను ఎంచుకునేవారు. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒకే రంగానికి, ఒకే అంశానికి పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేమో అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది. – భావనా బర్మీ, క్లినికల్ సైకాలజిస్ట్ -
''నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు''
లాలస పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లాలసకు చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ చాలా ఆందోళన చెందేవారు. స్కూళ్లు మాన్పించినా, ట్యూషన్లు పెట్టించినా లాలస మార్కుల్లో ఎలాంటి మార్పూ లేదు. దాంతో ‘నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు’ అని విమర్శిస్తుండేవారు. ఇప్పుడు పదో తరగతిలో కూడా అవే మార్కులు వస్తే కష్టమని, స్నేహితుల సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. లాలస పేరెంట్స్‌తో మాట్లాడిన తర్వాత.. వారు ఫిక్స్డ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని, లాలసపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు, సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరని నమ్మడమే ఫిక్స్డ్ మైండ్‌సెట్. ఈ మైండ్‌సెట్ ఉన్నవారు ఒకట్రెండు సార్లు ఫెయిలయితే జీవితమంతా ఫెయిల్యూరేనని భావిస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతారు. పేరెంట్స్, టీచర్స్ ప్రభావమే ఎక్కువ పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రాథమిక రోల్ మోడల్స్. వాళ్లు నిరంతరం పేరెంట్స్‌ని గమనిస్తుంటారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్‌సెట్‌తో, జీనియస్‌లు కాగల సామర్థ్యంతోనే పుడతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉంటారు. దాన్నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తారు.. విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుబడతారు, విమర్శిస్తారు, దండిస్తారు. దాంతో పిల్లలు కూడా అదే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు పుట్టుకతో తెలివితేటలు లేవని, వాటిని ఇప్పుడు పెంచుకోలేమని నమ్ముతారు, ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు ఆపేస్తారు. లాలాస విషయంలో జరిగింది అదే. ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అలవరచుకున్న లాలస తన వైఫల్యాలకు పేరెంట్స్‌ని, టీచర్స్ని, స్కూల్‌ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్‌కట్స్ అన్వేషిస్తోంది. మైండ్‌సెట్ మార్చుకోవచ్చు మన జీవితం మొత్తం మైండ్సెట్పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోరతారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ, దాంతోనే తృప్తిపడతారు. లాలస కూడా అదే చేస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని మార్చవచ్చని, మార్చుకోవచ్చని.. జీనియస్ మైండ్‌సెట్ లేదా గ్రోత్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవచ్చని ఆమె పేరెంట్స్‌కి వివరించాను. అయితే వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టమన్నారు. అది ఒకటి రెండు సెషన్ల కౌన్సెలింగ్‌తో జరిగే పనికాదని, కనీసం ఆరు నెలల పాటు కోచింగ్ అవసరం ఉంటుందని, అందులో పేరెంట్స్ కూడా పనిచేయాలని చెప్పాను. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు. జీనియస్ మైండ్‌సెట్ సాధ్యమే జీనియస్ మైండ్‌సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపిగ్గా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాంటి మైండ్‌సెట్‌నే అలవరచుకుంటారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్‌సెట్ మార్చుకోవడం ద్వారా పిల్లల మైండ్‌సెట్‌ని మార్చవచ్చు. అలాంటి మైండ్‌సెట్ పేరెంట్స్‌కి కూడా సక్సెస్‌ని, సంతోషాన్ని అందిస్తుంది. జీనియస్ మైండ్‌సెట్ కావాలంటే.. పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థంచేసుకోవాలి, వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు వస్తాయి. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపండి.. వారి నుంచి నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ పనిచేయకపోతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగండి. --సైకాలజిస్ట్ విశేష్ -
రాంబాబు.. ముగ్గురితో పెళ్లిళ్లు, విడాకులు.. విషయం ఏంటంటే..
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు తమ సమస్యలను పంచుకున్నా ఇదేమంత సమస్య కాదులే అని కొట్టిపారేస్తాం. మరికొన్ని సార్లు దాన్ని అసలు సమస్యగా కూడా గుర్తించం. అలాంటి వాటిలో బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఒకటి. రాంబాబు ప్రవర్తన చిన్నప్పటినుంచి భిన్నంగా ఉండేది. దాంతో ‘మావాడు కొంచెం తేడాలే, వాడికి తిక్క ఎక్కువ’ అని కుటుంబ సభ్యులే అంటుండేవారు. సరిగా చదవడం లేదని.. మందలించారని ఇంటర్మీడియట్లో ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో చూసి కాపాడారు. కొన్నాళ్లు హుషారుగా ఉంటే, మరికొన్నాళ్లు దిగులుగా గదికే పరిమితమయ్యేవాడు. పాతికేళ్ల వయసులో నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వద్దంటే ఏం చేసుకుంటాడోనని ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అతని మూడ్ స్వింగ్స్‌ని, కోపాన్ని భరించలేక ఏడాదికే నీరజ పుట్టింటికి చేరింది. ఆమెకు విడాకులిచ్చాక రేణుకను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చి అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెనూ వదిలేశాడు. బాగా నడుస్తున్న వ్యాపారాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగి భారీగా నష్టపోయాడు. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఇంట్లో అరుస్తుండేవాడు. రాంబాబు బాధ చూడలేక, పడలేక అతని పేరెంట్స్ ఫోన్ చేసి సమస్యను వివరించారు. అతని సహకారం లేకుండా ఏమీ చేయలేమని చెప్పాక, నచ్చజెప్పి కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. మొదటి సెషన్లో అతనితో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. బాధాకరమైన బాల్యం బీపీడీ సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది. పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న వ్యక్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి బీపీడీకి దారితీసే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యల బారిన పడినవారు ఉంటే వంశపారంపర్యంగా రావచ్చు. బాల్యంలో చూసిన, అనుభవించిన బాధాకరమైన సంఘటనలు ఈ రుగ్మతను మరింత ఎక్కువ చేస్తాయి. బీపీడీ ఉన్న వ్యక్తుల్లో 70శాతం మంది బాల్యంలో లైంగిక, భావోద్వేగ, శారీరక వేధింపులను అనుభవించి ఉంటారు. తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేకపోవడం, కఠినమైన నిబంధనలు, కుటుంబంలో ఆల్కహాల్ వినియోగం కూడా కారణాలై ఉంటాయి. బీపీడీ ఉన్నవారి మెదడులో భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించే భాగాలు సరిగా కమ్యూనికేట్ చేయవు. అది మెదడు పని విధానాన్ని ప్రభావితం చేస్తుంది. నాటకీయ ప్రవర్తన, అస్థిర బంధాలు బీపీడీ వ్యక్తిత్వసంబంధమైన ఒక మానసిక రుగ్మత. విపరీతమైన మూడ్ స్వింగ్స్, మానవ సంబంధాల్లో అస్థిరత, ఇంపల్సివిటీ దీని ప్రధాన లక్షణాలు. మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, విడిచిపెడతారని భావిస్తుంటారు. అలాంటప్పుడు వారిని ట్రాక్ చేస్తారు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేందుకు అందరినీ దూరంగా ఉంచుతారు. తిరస్కరణ, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు స్వీయ హాని, బెదిరింపులు, ఆత్మహత్య ఆలోచనలు ఉండవచ్చు. ఇతరులపై తమ అభిప్రాయాలను ఆకస్మికంగా, నాటకీయంగా మార్చుకుంటారు. దీనివల్ల స్నేహాలు, వివాహాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉంటాయి. వారి గురించి వారికే సరైన ఇమేజ్ ఉండదు. దానివల్ల తరచూ గిల్టీగా ఫీలవుతుంటారు. తనను తానే చెడుగా చూస్తారు. వృత్తిని, లక్ష్యాలను, స్నేహితులను అకస్మాత్తుగా మార్చడం ద్వారా తమ సెల్ఫ్ ఇమేజ్‌ని మార్చి చూపించాలని ప్రయత్నిస్తారు. అదుపు చేసుకోలేని కోపం, భయం, ఆందోళన, ద్వేషం, విచారం, ప్రేమ తరచుగా, వేగంగా మారతాయి. కోపాన్ని నియంత్రించుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ మూడ్ స్వింగ్స్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫైటింగ్, జూదం, డ్రగ్స్ వినియోగం, అతిగా తినడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు సాధారణం. విచారంగా, విసుగుగా, శూన్యతగా భావిస్తారు. విపరీతమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మతిస్థిమితం లేని ఆలోచనలు, కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి. ఒంటరిగా వదిలేయొదు. బీపీడీలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను ఎవరికి వారు గుర్తించలేరు. స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో గుర్తించాలి. మీకు తెలిసిన వారిలో బీపీడీ లక్షణాలు కనిపించినప్పుడు ఒంటరిగా వదిలేయకుండా సైకాలజిస్టును సంప్రదించండి. సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. చికిత్సకు ఏడాదికి పైగా సమయం పట్టవచ్చు. అందువల్ల సహకారం, సహనం, నిబద్ధత అవసరం. · కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా చికిత్స ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. మీ భద్రత ప్రమాదంలో ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ, స్కీమా ఫోకస్డ్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ లాంటివి బీపీడీ చికిత్సలో ఉపయోగపడతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, బాధలను తట్టుకోవడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలాగో నేర్పుతాయి. ప్రతికూల జీవన విధానాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, సానుకూల జీవన విధానాలను ప్రోత్సహిస్తాయి. -
అనిత ఈ కాలం పిల్ల కాదని మెచ్చుకునేవారు.. కానీ భర్తకు అసలు విషయం తెలిసి..
షాపింగ్‌కి ఆడవాళ్లు ముందుంటారని అందరూ అంటుంటారు. కానీ అనితకు షాపింగ్ అంటే చిరాకు. తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా వెళ్లేది కాదు. ఇల్లు, కాలేజీ తప్ప మరోచోటికి కదలదు. ఎక్కడికైనా వెళ్లినా అక్కడేమీ తినదు. ఎంత అవసరం వచ్చినా పబ్లిక్ రెస్ట్ రూమ్‌లకు వెళ్లదు. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏంటంటే కనీసం సెల్‌ఫోన్ కూడా వాడదు. దాంతో అందరూ ‘అనిత ఈ కాలం పిల్ల కాదమ్మా’ అని మెచ్చుకునేవారు. ఇంజినీరింగ్ ఫైనలియర్లో ఉండగానే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వేడుకల్లో కూడా బిడియంగానే ఉంది. పెళ్లి కూతురుకు సిగ్గు ఎక్కువ అనుకున్నారు అందరూ. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెట్టారు. వీకెండ్స్‌లో హరి బయటకు వెళ్దామన్నా వద్దనేది. కొత్తదనం వల్ల అనుకున్నాడు. కానీ కూరగాయలకు కూడా బయటకు వెళ్లకపోవడం, దగ్గర్లోని షాపింగ్ మాల్కి వెళ్లాలన్నా వణికిపోవడం గమనించి.. సమస్య ఏమిటని అడిగాడు. కొత్త వ్యక్తులను కలవాలన్నా, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలన్నా తనకు భయమని, అలాంటి సందర్భాల్లో గుండె వేగం పెరుగుతుందని, ఆందోళనగా ఉంటుందని చెప్పింది. అది సిగ్గు కాదని, ఏదో మానసిక సమస్య అని హరి అర్థం చేసుకుని ఆన్లైన్ కౌన్సెలింగ్ కోసం సంప్రదించాడు. అనితతో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె సోషల్ ఫోబియా లేదా సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా అఈతో బాధపడుతోందని అర్థమైంది. అది సిగ్గు, బిడియం కాదు.. సిగ్గు కంటే అఈ భిన్నంగా ఉంటుంది. సిగ్గు పదిమందిలో కలవడానికి మాత్రమే అడ్డుపడితే, అఈ షాపింగ్, జాబ్ లాంటి రోజువారీ కార్యకలాపాలనూ కష్టతరం చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారికి తమ భయాలు అహేతుకమని తెలిసినా, వాటిని అధిగమించ లేరు. తమను ఇతరులు గమనిస్తుంటారని, తమ గురించే మాట్లాడుకుంటారని ఆందోళన చెందుతుంటారు. టీనేజ్‌లో ప్రారంభమయ్యే ఈ సమస్య దాదాపు 8 నుంచి 10 శాతం మందిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అఈకి కచ్చితమైన కారణం తెలియదు. అయితే భౌతిక, జీవ, జన్యుపరమైన కారకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే సెరటోనిన్, డోపమైన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. అలాగే బాల్యంలో శారీరక, మానసిక హింస, తల్లిదండ్రుల అతి నియంత్రణ, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులూ కారణం కావచ్చు. జనాల్లోకి వెళ్లాలంటే వణుకు ► అఈని నిర్ధారించడానికి ఎలాంటి వైద్య పరీక్ష లేదు. కుటుంబ చరిత్ర, వ్యక్తి లక్షణాలను బట్టి నిర్ధారిస్తారు. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఆందోళనకు గురవుతారు. అఈ ఉన్న వ్యక్తులు ఇతరులు తమను ఏమైనా అనుకుంటారేమో, అవమానిస్తారేమో నిరంతరం భయపడుతుంటారు. ► మొహం ఎర్రబడటం, వికారం, చెమటలు పట్టడం, వణుకు, కండరాలు పట్టేయడం, తల తిరగడం, గుండెవేగం పెరగడం, మైండ్ బ్లాంక్ అయినట్లు అనిపించడం, మాట్లాడటం కష్టమవ్వడం లాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ► తన భయాందోళనలను ఇతరులు గమనిస్తారనే ఆందోళన, దీన్నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ తీసుకోవాలని భావించడం, ఆందోళన కారణంగా స్కూల్ లేదా కాలేజీ లేదా వర్క్ ఎగ్గొట్టడం వంటి మానసిక లక్షణాలు ఉంటాయి. మనిషిని బట్టి థెరపీ అఈతో బాధపడుతున్న వ్యక్తుల్లో మూడింట ఒక వంతు మంది కనీసం పదేళ్లపాటు దీన్ని సమస్యగా చూడరు. చూసినా సహాయం కోరరు. దీన్ని అధిగమించేందుకు రకరకాల థెరపీలు సహాయపడతాయి. అయితే ఏ థెరపీ ఎంత బాగా పనిచేస్తుందో వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఒక రకమైన చికిత్స మాత్రమే అవసరమైతే కొందరికి వివిధ థెరపీల కలయిక అవసరం కావచ్చు. కౌన్సెలింగ్, సైకోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులు, మందులతో దీన్ని ఎదుర్కోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, మెడిటేషన్, యోగా లాంటివి ఒత్తిడిని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం, నిద్ర వంటివి ఆందోళనను కొంతవరకు తగ్గిస్తాయి. మనసైన వారితో మనసు విప్పి మాట్లాడటం కూడా ఆందోళన, ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను సానుకూలమైన వాటితో భర్తీ చేయడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయం చేస్తుంది. ప్రతికూల భావాలు ఉన్నప్పటికీ విలువలతో ఎలా జీవించాలో acceptance and commitment థెరపీ ద్వారా తెలుసుకుంటారు. సామాజిక సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి గ్రూప్ థెరపీ సహాయ పడుతుంది. గ్రూప్‌లో పనిచేయడం వల్ల మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. సామాజిక పరిస్థితులను నివారించే బదులు క్రమంగా ఎదుర్కొనేందుకు ఎక్స్పోజర్ థెరపీ సహాయపడుతుంది. ఇవన్నీ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో జరగాలి. కౌన్సెలింగ్, థెరపీలతో రుగ్మత తగ్గకపోతే సైకియాట్రిస్ట్‌ని కలసి మందులు వాడాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
లివ్ఇన్ రిలేషన్స్ పేరుతో అడ్డదారులు..వెస్ట్రన్ కల్చర్ మనకవసరమా?
రెండు కాళ్లపై నడిచే, ఏకైక జీవి మనిషే. తల్లిపై, ఎక్కువ కాలం పాటు .. అదీ ఎక్కువ స్థాయిలో ఆధారపడే జీవి మనిషి ఒక్కడే. రెండింటికీ సంభందం ఉందా?ఎన్నో లక్షల ఏళ్ళ క్రితం మానవ పూర్వీకులు దట్టమయిన అడవుల నుంచి సవన్నా (పచ్చ గడ్డి మైదానాలు)లకు వలసపోయారు. ఇలాంటి స్థితిలో నాలుగు కాళ్లపై నడవడం కన్నా ముందు కాళ్ళు ఎత్తి, రెండు కాళ్లపై కాసేపు నిలబడి చూడగలిగితే ? ఆ జీవి ఎత్తు దాదాపుగా రెండు రెట్లయినట్టే కదా..శత్రువుల / క్రూర జంతువుల జాడను దూరం నుంచే పసిగట్టవచ్చు. ఇలాంటి స్థితిలో ప్రకృతి వరణం వల్ల నాలుగు కాళ్ళ పూర్వీకుల నుంచి క్రమంగా రెండు కాళ్ళ జీవి ఆవిర్భవించింది. రామాపితేకాస్,ఆస్ట్రలో పితికాస్.. హోమో ఎరెక్ట్స్ .. హోమో హాబిలిస్ .. హోమో సేపియన్స్ .. ఇలా సాగింది మానవ పరిణామం. శిశువుకు జననం ఇచ్చేటప్పుడు నాలుగుకాళ్ల జీవి అయితే వెనుక కాళ్ళు రెండు బాగా సాచేందుకు వీలుంటుంది. రెండు కాళ్ళ మానవ పూర్వీకుల్లో ద్విపాద గమనాన్ని (రెండు కాళ్ళ పై నడవడం) సాధ్యం చేసేందుకు , కాళ్ళు రెండు బాగా దగ్గరగా అమరిక పొందాయి . దీనితో జనన రంద్రం చిన్నదయ్యింది . దీనితో పుట్టుక సమయం లో శిశువు కపాలం, దానిలోపల ఉన్న మెదడు చిన్నదయింది. అంటే మానవ శిశువు పుట్టేటప్పటికి మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉంటుంది . చేప పిల్లకు తల్లి సంరక్షణ అనేదే ఉండదు. పాలిచ్చే జంతువుల్లో తల్లిపై ఆధారపడడం కాస్త ఎక్కువ. ఆవుదూడ పుట్టిన అరగంటలో లేచి చెంగున పరుగెడుతుంది. కానీ మానవ శిశువు ? తల్లి పై పూర్తి స్తాయిలో ఆధార పడక తప్పద. దీనికి కారణం రెండు కాళ్ళు. పుట్టినప్పుడు మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉండడ. పుట్టిన రెండేళ్లలో మెదడు- కపాలం బాగా పెరుగుతాయి. చిన్న పిల్లల డాక్టర్లు బిడ్డ కపాలం కొలతలు తీసి నోట్ చేస్తారు . తల పెరుగుదల ఎలా ఉందొ గమనిస్తారు. ఇలా తల్లిపై ఎక్కువ కాలం ఆధారపడడం, మానవ జాతికి ఒక చక్కటి అవకాశం అయ్యింది. తల్లి ఒడిలోనే బిడ్డ భాషను నేర్చుకుంటుంది. అందుకే మాతృభాష అన్నారు. కేవలం భాషేనా ? ఆ సమాజపు అలవాట్లు , మంచి చెడు- విలువలు , నమ్మకాలు, కట్టుబాట్లు , ఆచారాలు - వ్యవహారాలు .. ఇలా సమస్తం తల్లి ఒడిలోనే బిడ్డ నేరిస్తుంది . ఈ ప్రక్రియనే సామాజీకరణ అంటారు.. అంటే ఆ సమాజంలో ఎలా నడవాలి? ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో... ఈ బడిలోనే బిడ్డ నేరుస్తుంది. సమాజం దేహం అయితే దాని సంస్కృతి ప్రాణం.అలాగే సంస్కృతి లేకుండా ఏ సమాజమూ మనలేదు. ఈ సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందించే అవకాశం తల్లి బిడ్డ బంధం వల్లే సాధ్యం అయ్యింది. బిడ్డను కన్న తల్లికి డోపామైన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ బిడ్డను పాలిచ్చి లాలించేటప్పుడు ఇదే డోపామైన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే బిడ్డను పెంచడాన్ని అందరు తల్లులూ ప్రేమిస్తారు. అదో అనిర్వచనీయమయిన అనుభూతి . ఒకప్పుడు మానవ పూర్వీకులు కూడా.. జంతువుల్లా వావీ వరుసలు లేకుండా సంభోగించేవారు.జంతువులకైతే లైంగిక వాంఛ సంవత్సరంలో ఏదో ఒక సీజన్లో మాత్రమే. చిత్త కార్తె కుక్కలు అనే మాట విన్నారు కదా ? కానీ మనిషికి సంవత్సరం పొడవునా ఆ అవసరం ఉంటుంది. అందుకే వివాహం .. కుటుంబం అనే వ్యవస్థలు వచ్చాయి . భార్య - భర్త - పిల్లలు .. కుటుంబం .. క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక ఆర్థిక , సామాజిక, భావద్వేగ బంధం. కుటుంబం లేకపోతే మన సమాజమే లేదు. టెక్నాలజీ మారితే హార్మోన్లు, శరీర నిర్మాణం మారుతుందా ? వేషము మార్చినా మనిషి మారలేడు. ఆతని జైవిక నిర్మితి మారబోదు. మిడిమిడి జ్ఞానం అంటే ప్రకృతికి అడ్డంగా నడవడం. లివ్ ఇన్ అట.. దానికి చట్టబద్ధత కావాలట ! సోషల్ మీడియా లో చర్చలు, డిమాండ్లు. అజ్ఞానికి అంతు ఉండొద్దూ !! చట్టబద్దత ఇస్తే... అదే వివాహం కదా ? మనిషికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగం 25 ఏళ్లకు గానీ డెవలప్ కాదు . అంటే కనీసం ఇరవై వయసు వస్తేనే తానేంటో, తన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది .తానేంటో తెలియని వయసులో తనకు ఎలాంటి బాయ్ / గర్ల్ ఫ్రెండ్ కావాలో ఎలా నిర్ణయించుకొంటారు? టీనేజ్లోలో పుట్టేది ప్రేమ కాదు.వ్యామోహం. హార్మోన్ డ్రైవ్ . కొన్నాళ్లు కలిసుంటారు, తర్వాత.. బ్రేక్ అప్ అయ్యాక ? ఇంకో బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్ .అదిగో అప్పుడు పోలిక మొదలవుతుంది . అరే నా ముందు వాడు / ఆమె బెటర్ . సరిగ్గా పెంచకపోవడం వల్లే అమెరికాలో, సందుకో సైకో. వాడి చేతిలో గన్. ఎప్పుడు ఎవరిని ఏసేస్తారో తెలియదు . ఇప్పటి దాకా మానవీకరణ జరిగింది . మెల్లగా అమెరికా లాంటి చోట్ల దానవీకరణ జరుగుతోంది.అమెరికా కార్లు,రోడ్లు చాక్లెట్లు బాగుంటాయి. సరే, దానివీకరణలో కూడా భారత నగర జీవులు అమెరికాను ఆదర్శంగా తీసుకొంటే ఇక్కడ దానవీకరణ జరిగితే .. జరిగితే ఏంటి ? పదో క్లాసులోనే హత్యలు. ఆత్మ హత్యలు. కొత్తొక వింతా కాదు . పాతొక రోతా కాదు.మనిషి ఒక జీవి.పరిణామ క్రమంలో వచ్చాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోకుండా అడ్డదారిలో నడిస్తే మన జాతి విలుప్తం తప్పదు. వాసిరెడ్డి అమర్ నాథ్ - మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త -
తనిష్క తనను ప్రేమిస్తోందనే భ్రమలో సుశాంత్ అలా.. తన కోసమే పెళ్లి చేసుకోలేదని..
సుశాంత్‌కు 35 ఏళ్లు, పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. ఒక ఎమ్మెన్సీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. మంచి భర్త, తండ్రి, ఉద్యోగి, తెలివైనవాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. సాధారణంగా మర్యాదస్తుడయి నప్పటికీ తరచుగా చికాకుగా కనిపిస్తాడు. కౌన్సెలింగ్ రావడం తనకు ఇష్టంలేదనీ, భార్య ఒత్తిడితో వచ్చాననీ చెప్పాడు. periences.. తాను లాప్‌టాప్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నాననీ, పిలిస్తే చిరాకు పడుతున్నానని తన భార్య రోజూ నస పెడుతోందనీ చెప్పాడు. తనకు భార్యా పిల్లలంటే చాలా ఇష్టమన్నాడు. ‘లాప్టాప్లో అంత టైమ్ ఏం చేస్తారు?’ అని అడిగినప్పుడు చెప్పడానికి సంశయించాడు. ‘సమస్య ఏదైనా సరే.. మీరు చెప్తేనే సహాయం చేయగలను’ అని నచ్చజెప్పాక నోరు విప్పాడు. నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ ప్రముఖ నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ, తనకోసమే ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఉందనీ చెప్పాడు. ఆమె గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికే లాప్‌టాప్‌పై ఎక్కువ సమయం గడుపుతానన్నాడు. తమ ప్రేమ గురించి భార్యకు చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి రహస్యంగా ఉంచానని అన్నాడు. త్వరలోనే తాను, తనిష్క పెళ్లి చేసుకుంటామన్నాడు. అయితే తాను ఎక్కువ సేపు తనిష్క గురించే సెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఆఫీసు పని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నానని చెప్పాడు. అదే తనకు ఆందోళన కలిగిస్తుందన్నాడు. కోడ్ లాంగ్వేజ్‌లో ‘తనిష్క మీకెలా పరిచయం? ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకెలా తెలుసు? ఆమె మీతో చెప్పిందా?’ అని అడిగినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడించాడు. మొదట్లో తాను తనిష్కకు చాలా లెటర్స్ రాశాననీ, ఆ తర్వాత ఆమె నంబర్ సంపాదించి మెసేజెస్ పెట్టానని చెప్పాడు. ఒకసారి ఆమె నుంచి రిప్లయ్ మెసేజ్ కూడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఆమె తన ఇంటర్వ్యూల్లోనూ, సినిమాల్లోనూ కోడ్ లాంగ్వేజ్‌లో తనకు సందేశాలు పంపిస్తుందన్నాడు. ∙∙ పచ్చి అబద్ధాలని తెలిసినా సుశాంత్ చెప్పిన కథల్లాంటివి మనకు అప్పుడప్పుడూ పత్రికల్లో కనిపించేవి. సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్ల హవా మొదలయ్యాక ఇలాంటి కథలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ప్రముఖ నటి తనను పెళ్లి చేసుకుందంటూ యూట్యూబ్ చానళ్లలో హల్చల్ చేయడం మీరూ చూసే ఉంటారు. అతను చెప్తున్నవి పచ్చి అబద్ధాలని తెలిసినా యూట్యూబ్ చానళ్లు పదే పదే అతన్ని ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నిజానికి అది ‘ఎరటోమానియా’ అనే అరుదుగా కనిపించే డెల్యూషనల్ డిజార్డర్. అయితే మామూలు భ్రమలకు, ఎరటోమేనియాలోని భ్రమలకు తేడా ఉంటుంది. మా పెరట్లోని చెట్లు ప్రతిరోజూ నాతో మాట్లాడతాయని నమ్మడం ఒక డెల్యూషన్. అది జరిగే అవకాశమే లేదు. కానీ ఒక సెలబ్రిటీ మామూలు వ్యక్తిని ప్రేమించే అవకాశం 0.0001 శాతమైనా ఉంటుంది. ఆ వ్యక్తి తానేనని ఎరటోమేనియా ఉన్న వ్యక్తి నమ్ముతాడు. ఇలాంటి భ్రమలు ఏర్పడటంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. గేలి చేయకుండా.. చికిత్స అందించాలి ►సుశాంత్ లాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు సాధారణంగా వారి మాటలు విని నవ్వుకుంటారు, గేలి చేస్తారు. కానీ అది ఒక మానసిక రుగ్మత అని గుర్తించి వెంటనే చికిత్స అందించాలి. ►ఇలాంటి రుగ్మతలున్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు కాబట్టి కుటుంబ సభ్యుల సహాయం అవసరం ►వారి భ్రమలను సవాలు చేయడం కంటే, వాటిని తొలగించి వాస్తవం అర్థమయ్యేలా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వారి ఆలోచనను, ప్రవర్తనను దారి మళ్లించడానికి ఉపయోగపడు తుంది ►వీలైనంత స్వతంత్రంగా జీవించడంలో వారికి సహాయపడటం కీలకం. ►సమస్య తీవ్రతను బట్టి సైకియాట్రిస్టును సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలు.. ►ఎరోటోమానియా ప్రధాన లక్షణం ఒక సెలబ్రిటీ తనను ప్రేమిస్తున్నారని లేదా పెళ్లి చేసుకున్నారనే భ్రమను నమ్మడం. ►ఆ సెలబ్రిటీ ఏం చేసినా అది తనకు పంపే రహస్య సందేశమనే భ్రమలోనే జీవించడం. ►ఆ సెలబ్రిటీ పట్ల విపరీతమైన అబ్సెషన్. సోషల్ మీడియాలో వారిని నిరంతరం ఫాలో అవ్వడం. ►వారి పరిచయం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడకపోవడం. కారణాలు... ►జీవితంలో తిరస్కరణ, స్థానభ్రంశం, స్వలింగ సంపర్క ప్రేరణలను నివారించడానికి ఎరోటోమేనియా ఒక రక్షణ విధానంగా ఉంటుందని ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించాడు. ►తీవ్రమైన ఒంటరితనం లేదా పెద్ద నష్టం తర్వాత ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడానికి దీన్ని ఒక మార్గంగా తీసుకోవచ్చు. ►బైపోలార్ డిజార్డర్ లేదా స్కిజోఫ్రేనియా ఉన్నవారిలో రావచ్చు. ►మాదక ద్రవ్యాలు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వాడకం వల్ల కూడా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. ►మెదడులో అసాధారణతలు లేదా వారసత్వం కూడా కారణం కావచ్చు. -సైకాలజిస్ట్ విశేష్ -
విజయపథం: క్రియేటివ్ క్వీన్
ఏమీ తెలియని రంగంలోకి ప్రవేశించి, ఉన్నత శిఖరాలకు చేరడానికి అద్భుత దీపాలతో పనిలేదు. ఆసక్తి ఉంటే, అనుభవపాఠాలు తోడుంటే చాలు! అంతంతమాత్రం అవగాహనతో అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టిన కైనజ్ కర్మాకర్ ఆ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఆదర్శ ఉద్యోగిగా నిలిచింది. సైకాలజీలో పట్టా పుచ్చుకున్న కైనజ్ కర్మాకర్ (ముంబై) అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగు పెట్టే నాటికి ఆ రంగం గురించి పెద్దగా తెలియదు. విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనే కోరిక సాకారం కాక΄ోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది కైనజ్. అడ్వర్టైజింగ్ రంగంలో కనిపిస్తున్న ఆర్ట్ డైరెక్షన్, కాపీ రైటింగ్ అనే రెండు దారుల్లో రెండో దారిని ఎంచుకుంది. దీనికి కారణం తనకు రచనలు చేయడం అంటే ఇష్టం. అయితే అడ్వర్టైజింగ్ కాపీ రైటింగ్ గురించి మాత్రం ఏమీ తెలియదు. ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో చేరినప్పుడు, ఉద్యోగంలో చేరినట్లు కాకుండా మొదటిసారిగా బడికి వచ్చిన విద్యార్థిలా అనిపించింది. ‘అదృష్టాన్ని నమ్ముకున్నవారు దాని కోసమే నిరీక్షిస్తూ తమకు తెలియకుండానే దురదృష్టంలోకి జారుకుంటారు’ అనే మాట ఉంది.అయితే కైనజ్ అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముకుంది. 2000 సంవత్సరంలో ‘లియో బర్నెట్ ఇండియా’లో చేరినప్పుడు అక్కడ అగ్నెలో డయాస్ పరిచయం అయ్యాడు. తాను ఒక గురువై అడ్వర్టైజింగ్కు సంబంధించిన సూక్ష్మనైపుణ్యాలను బోధించాడు. విలువైనపాఠాలు అవి. ‘ఓగిల్వీ ఇండియా’ కంపెనీలో అడుగు పెట్టడానికి ముందు రకరకాల కామెంట్స్ వినిపించాయి... ‘కొత్తవాళ్లు అక్కడ పనిచేయడం కష్టం’ ‘అక్కడ ఎప్పటికప్పుడు నిలదొక్కుకోవడం తప్ప ఉన్నత స్థాయికి చేరడం అనేది కలలో మాట’ అయితే ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోకుండా తన పనిపైనే పూర్తిగా దృష్టి పెట్టింది కైనజ్. కంపెనీ నేర్పినపాఠాలు, కాలం నేర్పినపాఠాలతో తనలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంది. ‘ఒగిల్వీ ఇండియా’ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ‘చెప్పే విధానం ఎంత ఆకర్షణీయంగా ఉంటే, మార్పు అనేది అంత త్వరగా మొదలవుతుంది’ అంటున్న 46 ఏళ్ల కైనజ్ తన సృజనాత్మక కృషికి దేశ, విదేశాల్లో 40కి పైగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ‘క్లయింట్ సమస్యను తన వ్యక్తిగత సమస్యగా భావించి వెంటనే రంగంలోకి దిగుతుంది. అది పరిష్కారం అయ్యే వరకు కష్టపడుతుంది. తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ ΄ోతుంది తప్ప హడావిడి, ఆర్భాటం కనిపించవు. కైనజ్ ్రపాధాన్యతలలో పని మొదటిస్థానంలో ఉంటుంది. ఔత్సాహికులకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి’ అంటున్నాడు కైనజ్తో ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేసిన హర్షద్ రాజాధ్యక్ష. ‘ఒగిల్వీలో ఎందరో దిగ్గజాల దగ్గర ఎన్నో విలువైనపాఠాలు నేర్చుకున్నాను. అడ్వర్టైజింగ్కు సంబంధించి నా ఆలోచనలు మార్చుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి అవి ఉపకరించాయి’ అంటున్న కైనజ్ ఐటీసి, బ్రూక్ బాండ్, ఫియట్, బజాజ్... మొదలైన ప్రసిద్ధ బ్రాండ్లకు పనిచేసింది. కెరీర్ కొత్తలో చేదు అనుభవాలు ఎదురైనా, వాటిని ఎప్పటికప్పుడూ డిలీట్ చేస్తూ వస్తోంది కైనజ్. ‘చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం కంటే కొత్త ఐడియాల గురించి ఆలోచించడానికి ఇష్టపడతాను. కొత్తగా ఆలోచించడం అనేది నా వృత్తిలో భాగం. నేను ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలనే ఆలోచన తప్ప వేరే రంగాన్ని ఎంచుకొని ఉంటే బాగుండేది అని ఎప్పుడూ ఆలోచించలేదు. వృత్తిజీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగే రంగమే నా దృష్టింలో గొప్ప రంగం’ అంటుంది కైనజ్ కర్మాకర్. -
గుండెపోటుతో చనిపోతాననే భయం.. ఎందుకిలా? సమస్య ఏమిటంటే..
Panic Attacks: సంతోష్ పేరుకు తగ్గట్టే నిత్యం సంతోషంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉంటూ బాగా సంపాదించాడు. తనకంటూ సొంతకారు కొనుక్కున్నాక, సొంత ఇల్లు కట్టుకున్నాకే నిత్యను పెళ్లి చేసుకున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఒకరోజు కారులో సైట్‌కు వెళ్తున్న సమయంలో గుండె పట్టేసినట్లనిపించింది. లైట్‌గా తీసుకున్నాడు. మరో నెల తర్వాత నిద్రపోతుండగా అదే రిపీట్ అయ్యింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలిశాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాక ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించాడు. కానీ మరో నెల తర్వాత బిజినెస్ మీటింగ్‌లో ఉండగా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. గుండెపోటు వచ్చిందేమోనని తీవ్రంగా భయపడ్డాడు, వణికిపోయాడు. మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లి అన్ని పరీక్షలూ చేయించుకున్నాడు. ఎలాంటి సమస్యా లేదన్నారు. కానీ గుండెపోటుతో చనిపోతాననే భయం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఏమవుతుందోనని వణికిపోతున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇలా అకస్మాత్తుగా భయాందోళనలతో మనసు, శరీరం అతలాకుతలం కావడాన్ని పానిక్ అటాక్స్ అంటారు. కారణాలు తెలియవు.. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం పోరాడతాం లేదా పారిపోతాం. అది శరీరపు సహజ స్పందన. అలాంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది. పానిక్ అటాక్స్‌లో కూడా అలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. స్పష్టమైన ప్రమాదం లేకున్నా అలా ఎటాక్స్ ఎందుకు వస్తాయో కారణాలు తెలియవు. కానీ జీన్స్, ఒత్తిడి, ఒత్తిడి వల్ల తీవ్ర ప్రతికూల భావోద్వేగాలకు గురయ్యే స్వభావం, మెదడులోని భాగాల పనితీరులో మార్పులు కారకాలుగా గుర్తించారు. పానిక్ అటాక్స్ లక్షణాలు.. ►పానిక్ అటాక్స్కు గుండె వేగంగా కొట్టుకోవడం ఒక్కటే కాదు ఇంకా అనేక లక్షణాలున్నాయి. ►ఒళ్లంతా వణుకుతుంది, చెమటలు పడతాయి. ►శ్వాస వేగవంతమవుతుంది లేదా ఆగిపోయినట్లనిపిస్తుంది. ►ఒళ్లంతా వేడి సెగలు, వేడి ఆవిరులు వస్తాయి. ►తలనొప్పి, తల తిరగడం, మైకం లేదా మూర్ఛపోవచ్చు. ►మరణభయం వెంటాడుతుంది. ►ఈ అటాక్స్ జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తాయి. ►డ్రైవింగ్ చేయాలన్నా, ఇల్లు వదిలి వెళ్లాలన్నా భయం వెంటాడుతుంది. ►తరచూ హాస్పిటళ్ల చుట్టూ తిరగడం పెరుగుతుంది. ►పదిమందిలో కలవడాన్ని నిలిపేస్తారు. దీనివల్ల పనిలో సమస్యలు ఎదురవుతాయి. ►డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలూ రావచ్చు. ►ఆత్మహత్య ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంది. ►భయాన్ని అధిగమించేందుకు మద్యం వినియోగం పెరుగుతుంది. ►మొత్తంమీద జీవితం దుర్భరంగా మారుతుంది. తరచూ వస్తుంటే డిజార్డర్ ►పానిక్ అటాక్స్ తరచుగా వస్తుంటే దాన్ని పానిక్ డిజార్డర్ అంటారు. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఒకసారి అటాక్ రాగానే, మరొక అటాక్ వస్తుందేమోననే ఆందోళన నెల లేదా అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతుంది. ►గుండెపోటు వస్తుందేమోననే భయాందోళనలు తీవ్రంగా ఉంటాయి. అందువల్ల అటాక్స్కు కారణమని భావించే పరిస్థితులను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. ప్రవర్తనలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా టీనేజ్ చివరిలో లేదా యుక్తవయస్సులో ప్రారంభమవుతాయి.ఇవి పురుషుల కంటే స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎవరికి వస్తుందంటే.. ►కుటుంబంలో ఎవరికైనా పానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ►తీవ్ర అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, శారీరక, లైంగిక వేధింపులు, సీరియస్ యాక్సిడెంట్ లాంటి తీవ్ర ఒత్తిడి కలిగించే సంఘటనలు ►విడాకులు లేదా బిడ్డను కనడం వంటి మేజర్ మార్పులు ►ధూమపానం లేదా అధిక కెఫీన్ తీసుకోవడం ఏం చేయాలి? ►రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండండి ►పగటిపూట మగతగా అనిపించకుండా తగినంత నిద్రపోండి ►మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, డీప్ బ్రీతింగ్, జాకబ్సన్ రిలాక్సేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి ►కాఫీ, మద్యం, ధూమపానం, డ్రగ్స్ మీ పానిక్ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి ►యాంగ్జయిటీ, పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తులతో ఏర్పడిన సపోర్ట్ గ్రూపులో చేరండి ►అప్పటికీ మీ భయాందోళనలు తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవండి ►మీకు వచ్చే అటాక్స్ ప్రాణాంతకం కాదని తెలుసుకోవడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సహాయపడుతుంది ►థెరపీ వల్ల మీకు కొన్ని వారాల్లోనే రిలీఫ్ రావచ్చు. ►రిలీఫ్ వచ్చేసిందని థెరపీ ఆపేయకుండా సైకాలజిస్ట్ చెప్పిన ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండండి. ►మీ డిజార్డర్ నుంచి పూర్తిగా బయటపడేందుకు కొన్ని నెలలు పట్టవచ్చు ►మీ డిజార్డర్ తీవ్రంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి, ఆయన ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? -
ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి! ఎందుకిలా చేసింది?
ఆనంది అందమైన అమ్మాయి. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ తెచ్చిన సంబంధాలన్నీ వద్దంటోంది. క్రమేపీ ఇంట్లో వాళ్లతో మాట్లాడటం తగ్గించింది. ఆస్పత్రినుంచి రాగానే తన గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటోంది. మెల్లగా ఆస్పత్రికి వెళ్లడం కూడా తగ్గించింది. కారణమేంటని అడిగితే ఏడుస్తోంది. తను ఆలా ఎందుకు ఏడుస్తోందో పేరెంట్స్‌కు అర్థం కావడం లేదు. అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఒకరోజు హఠాత్తుగా చెయ్యి కోసుకుంది. పేరెంట్స్ సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెను కాపాడుకున్నారు. తనకు అంత పని చేయాల్సినంత కష్టం ఏమొచ్చిందో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. డిప్రెషన్ ఆనందిలా నిద్రాహారాలకు దూరమై, బంధాలన్నింటికీ స్వస్తిచెప్పి, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి, ఒంటరిగా కూర్చుని కుమిలిపోవడాన్నే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌కు లోనైన వ్యక్తుల్లో కొందరికి బలవన్మరణ ఆలోచనలూ రావచ్చు. కొందరు ఆనందిలా ప్రయత్నాలు కూడా చేస్తారు. జనాభాలో దాదాపు ఐదుశాతం డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. ఈ డిప్రెషన్ మహిళల్లో ఎక్కువ. తల్లిదండ్రుల్లో డిప్రెషన్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పడం కష్టమే. సకల సౌకర్యాలతో జీవిస్తున్న వ్యక్తులూ హఠాత్తుగా డిప్రెషన్లో పడిపోవచ్చు. తామెప్పుడో చేసిన చిన్న తప్పును భూతద్దంలో చూడటం, తన జీవితమే తప్పు దారిలో వెళ్తోందని అతిగా ఆలోచించడం, తప్పు చేసిన తాను ఎందుకూ పనికిరాననే ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివన్నీ.. డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఆనంది విషయంలో జరిగిందదే. తన టీనేజ్ అఫైర్‌ను ఇప్పుడు గుర్తు చేసుకుని, అతిగా ఆలోచించి, తాను తప్పు చేశా కాబట్టి పెళ్లికి అర్హురాలిని కాదని, తనను తాను తక్కువ చేసుకుని, ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేక డిప్రెషన్లోకి జారిపోయింది. మరికొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు డిప్రెషన్‌కు వెళ్లిపోతారు. ఆ కోల్పోవడం ఆర్థికంగా లేదా మానసికంగా లేదా సామాజికంగా కావచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా, వస్తురూపంగా ఎలాంటి నష్టం లేకపోయినా అహం దెబ్బతినడం, అవమానం పాలవ్వడం కూడా డిప్రెషన్‌కు కారణం కావచ్చు. ఒక్కోసారి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండానే డిప్రెషన్‌కు లోనుకావచ్చు. మెదడులోని సెరటోనిన్ అనే రసాయనంలో హెచ్చుతగ్గుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. గుర్తించడం ఎలా? డిప్రెషన్‌ను గుర్తించడం కొంచెం సులభం, మరికొంచెం కష్టం కూడా. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఆనందిలా సరిగా నిద్రపోలేరు. తిండిపై ఆసక్తి ఉండదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారో కూడా ఆలోచించరు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. హఠాత్తుగా బరువు తగ్గుతారు. మద్యం తాగడం పెంచుతారు. కొందరిలో తరచూ తలనొప్పి, ఒళ్లునొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్యా లేదని చెప్తారు. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. మందులు వాడినా శారీరక బాధలు తగ్గనప్పుడు, దీర్ఘకాలం దిగులుగా ఉన్నప్పుడు అది డిప్రెషన్ అని గుర్తించాలి. ఏం చేయాలి? ►డిప్రెషన్‌కు లోనయ్యామని తెలుసుకున్నప్పుడు మొదట దానికి దారితీసిన కారణాలను వెదకాలి. ఆ కారణాలకు దిగులుపడాల్సిన అవసరం ఉందా, లేదా అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి. ►పని ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినందువల్ల కూడా డిప్రెషన్‌కు లోనయ్యే చాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పని ఒత్తిడి తగ్గించుకోవాలి. ►హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ అంటారు. అలాగే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్. శరీరం చురుగ్గా ఉంటేనే మనసూ ఉత్సాహంగా ఉంటుంది. అందుకే శరీరానికి పనిపెట్టండి. వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్ సైజ్లు, యోగ వంటివి ప్రాక్టీస్ చేయాలి. ►ఒంటరిగా కూర్చుంటే దిగులు మరింత పెరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కూర్చోకుండా బయటకు కదలాలి. స్నేహితులను కలవాలి. వాళ్లతో నవ్వుతూ కబుర్లు చెప్పుకోవాలి. హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి. ►మీ స్నేహితుడో, సన్నిహితురాలో డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్‌గా నిలవండి. వారిని సంతోషపెట్టే మార్గాలు అన్వేషించండి. ►మీ కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు.. ఏమీ చేయకుండా కూర్చున్నారని తిట్టకండి. వారి మనసులోని బాధేమిటో తెలుసుకుని అనునయించండి. ►అవసరమైతే వారితో సన్నిహితంగా ఉండేవారి సహాయం తీసుకోండి. ►మీ ప్రయత్నాలేవీ ఫలించనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవండి. ఆయన పరీక్షించి మైల్డ్, మోడరేట్ లెవెల్లో ఉంటే కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? -
అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం?
జీవన శైలి మారింది.. పర్యవసానంగా వచ్చిన.. వస్తున్న శారీరక సమస్యల మీదే మన దృష్టి అంతా! అదే తీవ్రత మానసిక ఆరోగ్యం మీదా ఉంది.. కానీ అది అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది! ఫలితంగా సమాజమే డిప్రెషన్లోకి వెళ్లొచ్చు! వెళ్లకూడదు అనుకుంటే మానసిక సమస్యలు, రుగ్మతల మీద సాధ్యమైనంత వరకు చర్చ జరగాలి.. కౌన్సెలింగ్, వైద్యం దిశగా ప్రయాణం సాగాలి! ఆ ప్రయత్నమే ఈ కాలమ్!! ఆనంద్ 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఉద్యోగం. తన ఫ్రెండ్ కుమార్‌తో కలసి మాదాపూర్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్‌లో ఉంటున్నాడు. రోజూ ఉదయాన్నే జాగింగ్‌కు, అట్నుంచటే జిమ్‌కు వెళ్లేవాడు. ఇరుగుపొరుగు కనిపిస్తే నవ్వుతూ పలకరించే వాడు. నీట్‌గా రెడీ అయ్యి, తన కొత్త బైక్‌పై ఆఫీస్‌కి వెళ్లేవాడు. అక్కడ కొలీగ్స్ అందరితో సరదాగా ఉండేవాడు. వారానికి ఐదురోజులు పనిచేయడం, వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలసి ఔటింగ్‌కి వెళ్లడం అలవాటు. అయితే గత రెండు నెలలుగా ఆనంద్ ప్రవర్తన మారిపోయింది. రూమ్మేట్ కుమార్‌తో మాట్లాడటం తగ్గించేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. స్నానం చేయడం లేదు, సరిగా డ్రెస్ చేసుకోవడం లేదు. అత్యవసరమైతే తప్ప రూమ్ దాటి బయటకు వెళ్లట్లేదు. అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాడు. కుమార్‌కు ఇదంతా కొత్తగా అనిపించింది. అడిగితే ‘‘నేను బాగానే ఉన్నాను’’ అని చెప్తున్నాడు. ..కానీ బాగాలేడు.. క్రమేపీ ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలూ మొదలయ్యాయి. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పులంటూ బాధపడుతున్నాడు. అస్సలు నిద్రపోవడంలేదు. అల్సర్ వచ్చింది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. గుండె దడగా ఉంటోందంటున్నాడు. వర్క్ విషయంలోనూ ఆఫీసు నుంచి కంప్లయింట్స్ వస్తున్నాయి. అలాగే వదిలేస్తే ఏమై పోతాడోననే భయంతో కుమార్ బలవంతంగా ఆనంద్‌ను కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఆనంద్ కుటుంబం, గతం గురించి తెలుసుకున్నాను. అతనికి ముగ్గురు అక్కలు. లేకలేక పుట్టిన మగబిడ్డ కావడంతో పేరెంట్స్ చాలా గారాబం చేసేవారు. ఆనంద్ 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబం అతలాకుతలమైంది. తల్లి, అక్కలు ఏదో ఒక జాబ్ చేస్తే తప్ప గడవని పరిస్థితి. ఆనంద్‌కు ఉద్యోగం వచ్చాకే కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కలకు ఇంకా పెళ్లి కాకపోవడం ఆనంద్‌పై తెలియని ఒత్తిడిని పెంచింది. అక్కలకు పెళ్లి కాదేమో, వాళ్లకు పెళ్లి చేయకుండా తాను పెళ్లి చేసుకోలేడు కాబట్టి, తనకు జీవితంలో పెళ్లి కాదేమోననే ఆందోళన మొదలైంది. అది అతని ఆలోచనలన్నింటినీ ఆక్రమించేసింది. దీన్నే జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా GAD అంటారు. ఆనంద్ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులన్నీ ఈ డిజార్డర్ వల్ల వచ్చినవే. ఆరుగురిలో ఒకరు.. ఇది ఆనువంశికంగా వచ్చి ఉండవచ్చు. లేదా జీవితంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాల వల్లా కావచ్చు. ఆనంద్ తల్లి కూడా ఇలాగే ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతుంటుందని అతని మాటల్లో తెలిసింది. దానికితోడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం, కుటుంబ కష్టాలు, అక్కల పెళ్లిళ్లు.. అవన్నీ అతన్ని ఆందోళనలోకి నెట్టేశాయి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లేకపోవటం, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో అది డిజార్డర్‌గా మారింది. వందమంది భారతీయుల్లో ఆరుగురు ఈ డిజార్డర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ తీసుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయం వల్లే చాలామంది చికిత్సకు వెనుకడుగు వేస్తుంటారు. ఫలితంగా అది మరిన్ని మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. అందుకే మానసికంగా ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం. జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలున్నవారు దాన్నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనులు.. ►ఆందోళన కలిగించే ఆలోచనలను ఒక జర్నల్‌లో రాసుకోవాలి. వాటిని గమనిస్తే.. మీకు వస్తున్న చాలా ఆలోచనలు నిజం కావడంలేదని అర్థమవుతుంది. అది మీకు ధైర్యాన్నిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దానివల్ల మెదడులో విడుదలయ్యే సెరటోనిన్ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. కనీసం వారానికి ఐదురోజులు, రోజుకు అరగంట వ్యాయామం చేయాలి. ►ఆందోళనకూ శ్వాసకూ సంబంధం ఉంది. ఆందోళనలో ఉన్నప్పుడు శ్వాస వేగమవ్వడం గమనించవచ్చు. అందువల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను రోజూ ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ కూడా ఉపయోగ పడుతుంది. ఇవన్నీ చేసినా ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం బెరుకులేకుండా సైకాలజిస్టును సంప్రదించండి. ►మనదేశంలో వందలో ఏడుగురు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారిలో 80శాతం మంది ఎలాంటి చికిత్స తీసుకోవడంలేదు. మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవడం, సమస్యను బయటకు చెప్పుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయమే ఇందుకు కారణం. ఎలాంటి భయం లేకుండా మీ సమస్యను కింద ఇచ్చిన ఐడీకి మెయిల్ చేయవచ్చు. పరిష్కారమార్గం చూపిస్తాం. -సైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com) చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. Health Tips: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో.. -
హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వేదాంత్ ఆనంద్‌వాడే (18) బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంనుంచి భారీ స్కాలర్షిప్ సాధించాడు. వేదాంత్ బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు దాదాపు కోటిన్నర స్కాలర్షిప్ అందించనుంది. 17 మంది నోబెల్ గ్రహీతలను అందించిన కేస్ వెస్ట్రన్ నుండి స్కాలర్షిప్ అందుకున్న ఈ హైదరాబాదీ సర్జన్ కావాలనుకుంటున్నాడట. వేదాంత్ ఆనంద్‌వాడే న్యూరోసైన్స్ సైకాలజీలో ప్రీ-మెడ్ గ్రాడ్యుయేషన్ కోసం కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి రూ.1.3 కోట్ల స్కాలర్షిప్ అందుకున్నాడు.ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్షిప్ లేఖను పంపింది. అంతేకాదు క్లైమేట్ కాంపిటీషన్ ఛాలెంజ్‌లో విజయం సాధించిన వేదాంత్, ఈ ఏడాది నవంబర్‌లో పారిస్‌కు కూడా వెళ్లబోతున్నాడు. యునెస్కోలోని జ్యూరీకి సలహాలివ్వబోతున్నాడు. 8వ తరగతి చదువుతున్నప్పటినుంచే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేది తన లక్ష్యం, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, కోవిడ్ కాలంలో అమ్మ ప్రపంచవ్యాప్త నైపుణ్యానికి పరిచయం చేసిందని వెల్లడించాడు. ఈ క్రమంలో కోరుకున్న కాలేజీలు, కోర్సుల నిమిత్తం ఇంటర్నెట్ను వెదికాను. 16 సంవత్సరాల వయస్సులో మూడు నెలల క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణే, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కాలర్షిప్ దాకా తీసుకెళ్లిందంటూ తన జర్నీని వెల్లడించాడు వేదాంత్. కాగా వేదాంత్ తండ్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంటిస్టుగా ఉన్నారు. అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నారు. -
నాన్నకు ప్రేమతో...కూతురు
కరోనాతో కన్నుమూసిన తండ్రి కల నెరవేర్చడానికి 13 ఏళ్ల తనిష్క బిఎ ఎల్‌ఎల్‌బిలో చేరాలనుకుంది. అయితే, అందుకు పర్మిషన్ లభించకపోవడంతో బిఎ సైకాలజీలో చేరింది. 12 ఏళ్ల వయసులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 11 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఎనిమిదేళ్ల వరకు స్కూల్‌కు వెళ్లిన తనిష్క ఆ తర్వాత ఇంటి నుంచే చదువు కొనసాగించింది. చిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ తండ్రి కలను నెరవేర్చాలనుకుంటోంది తనిష్క. స్కూల్ ఏజ్‌లో డిగ్రీ స్థాయి చదువులతో బిజీగా ఉన్న తనిష్క మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తోంది. 13 ఏళ్ల వయసు. స్కూల్ చదువు కూడా పూర్తి కాని ఈ అమ్మాయి ఇప్పుడు బి.ఎ సైకాలజీ చేస్తోంది. తండ్రి కల నెరవేర్చాలనే లక్ష్యంగా బిఎ ఎల్ఎల్బి కోసం అనుమతి కోరింది. కానీ, చిన్న వయసు అనే కారణంగా ఇంకా అనుమతి లభించలేదు. దీంతో బిఎ సైకాలజీలో చేరింది. ఈ డిగ్రీ పూర్తి చేశాక, ఎల్ఎల్బి చేస్తానంటోంది తనిష్క.