సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వేదాంత్ ఆనంద్‌వాడే (18) బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంనుంచి భారీ స్కాలర్‌షిప్ సాధించాడు. వేదాంత్ బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు దాదాపు కోటిన్నర స్కాలర్‌షిప్ అందించనుంది. 17 మంది నోబెల్ గ్రహీతలను అందించిన కేస్ వెస్ట్రన్ నుండి స్కాలర్‌షిప్ అందుకున్న ఈ హైదరాబాదీ సర్జన్ కావాలనుకుంటున్నాడట.
వేదాంత్ ఆనంద్‌వాడే న్యూరోసైన్స్ సైకాలజీలో ప్రీ-మెడ్ గ్రాడ్యుయేషన్ కోసం కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి రూ.1.3 కోట్ల స్కాలర్‌షిప్ అందుకున్నాడు.ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్ లేఖను పంపింది. అంతేకాదు క్లైమేట్ కాంపిటీషన్ ఛాలెంజ్‌లో విజయం సాధించిన వేదాంత్, ఈ ఏడాది నవంబర్‌లో పారిస్‌కు కూడా వెళ్లబోతున్నాడు. యునెస్కోలోని జ్యూరీకి సలహాలివ్వబోతున్నాడు.
8వ తరగతి చదువుతున్నప్పటినుంచే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేది తన లక్ష్యం, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, కోవిడ్ కాలంలో అమ్మ ప్రపంచవ్యాప్త నైపుణ్యానికి పరిచయం చేసిందని వెల్లడించాడు. ఈ క్రమంలో కోరుకున్న కాలేజీలు, కోర్సుల నిమిత్తం ఇంటర్నెట్‌ను వెదికాను. 16 సంవత్సరాల వయస్సులో మూడు నెలల క్యారియర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ శిక్షణే, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కాలర్‌షిప్ దాకా తీసుకెళ్లిందంటూ తన జర్నీని వెల్లడించాడు వేదాంత్. కాగా వేదాంత్ తండ్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంటిస్టుగా ఉన్నారు. అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment