నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్‌లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్‌కు వచ్చింది.
23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్‌కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment