
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్‌ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్‌నగర్‌లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది.
ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment