సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో మిస్సయిన 12 ఏళ్ల బాలుడు హైదరాబాద్‌లో ప్రత‍్యక్షమయ్యాడు. బుధవారం నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఏడుస్తూ కనిపించిన బాలుడిని మెట్రో సిబ్బంది గమనించి పోలీసులకు అప్పగించారు..
కాగా హైదరాబాద్, బెంగళూరు మధ్య దూరం 570 కి. మీ. బెంగళూరు నుంచి రైలులో మైసూర్ మీదుగా బాలుడు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాబు ఆచూకీ తెలియడంతో అతడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్
అసలేం జరిగిందంటే.. బెంగుళూరుకు చెందిన బాలుడు ప్రణవ్(12) డీన్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన పిల్లవాడు తిరిగి ఇంటికి చేరుకోకఅతడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. వారికి చిక్కుకుండా విద్యార్ధి తప్పించుకుంటూ వచ్చాడు. బాలుడిని గుర్తించిన ప్రదేశాలకు పోలీసులు చేరుకునే సమయానికి, అతను అప్పటికే మరొకచోటుకి పారిపోయాడు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఉదయం 11 గంటలకు వైట్‌ఫీల్డ్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు యెమ్లూర్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద కనిపించాడు. అదే రోజు సాయంత్రం బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టెర్మినస్‌లో బస్ దిగుతుండగా చివరిగా కనిపించాడు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కుమారుడి ఆచూకి తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు. బాలుడు రోడ్డు మీద నడుస్తున్న సీసీటీవీ ఫుటేజీని షేర్ చేశారు. అంతేగాక కొడుకును ఇంటికి రావాంటూ అతడి తల్లి ఓ వీడియో కూడా పోస్టు చేశారు. దీంతో బాలుడి ఫోటోన ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తూ ప్రచారం చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు హైదరాబాద్‌లో గుర్తించడంతో ప్రణవ్ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు హైదరాబాద్ బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment