సాక్షి, హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్ చేసిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు.
సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!
తొలుత పోలీసులు కొండపూర్‌లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు.
తెలుగుతో పాటు కోలీవుడ్, హిందీలోనూ పలు స్టార్ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
Comments
Please login to add a commentAdd a comment