సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తాజాగా స్పందించారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ.. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష పడాలి. మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు. వేధింపుల కేసులో జానీని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దారుణం. జానీని వెంటనే అరెస్ట్ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తుపై వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే, ఆమెకు వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరించేందుకు పోలీసులు.. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!
Comments
Please login to add a commentAdd a comment