Harrasment girl
-
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్ మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్ చేసి మెసేజ్‌ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నాకు పొలిటికల్ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం. -
టీడీపీ నేత అఘాయిత్యం.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, తెనాలి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రతీరోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ రౌడీ షీటర్ చేతిలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.వివరాల ప్రకారం.. అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె బాడీపై కమిలిన గాయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధితురాలిని హింసించి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్ నవీన్.. మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఇక, ఘటనలో నిందితుడు నవీన్‌కు తాజాగా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అయితే, కూటమి నేతలు నవీన్‌ను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.కాగా, షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తాజాగా స్పందించారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ.. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష పడాలి. మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు. వేధింపుల కేసులో జానీని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దారుణం. జానీని వెంటనే అరెస్ట్ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తుపై వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే, ఆమెకు వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరించేందుకు పోలీసులు.. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..`
వరంగల్/మహబూబాబాద్: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీ చైతన్య కళాశాల అధ్యక్షుడు బూర సురేందర్ గౌడ్ కీచకుడని తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈమేరకు నిందితుడు సురేందర్గౌడ్తో పాటు అతడికి సహకరించిన మెస్ ఇన్చార్జ్ శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన బూర సురేందర్‌గౌడ్ స్థానికంగా శ్రీ చైతన్య ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నాడు. నాలుగు అంతస్తుల భవనం.. గ్రౌండ్ ఫ్లోర్లో కళాశాల కార్యాలయం, మొదటి ఫ్లోర్లో తరగతులు, రెండు, మూడు ఫ్లోర్లలో హాస్టల్, నాలుగో ఫ్లోర్లో ఇద్దరు భార్యలు రేణుక, సంధ్య, ఇద్దరు పిల్లలతో సురేందర్‌గౌడ్ నివాసముంటున్నాడు. ప్రస్తుతం బాలికల క్యాంపస్‌లో 160 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సురేందర్‌గౌడ్ సస్పెన్షన్ హసన్‌పర్తి: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భీమారానికి చెందిన శ్రీ చైతన్య జూని యర్ కళాశాల చైర్మన్ బూర సురేందర్గౌడ్ను బీజేపీ 55వ డివిజన్ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వంనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బి.ఉమాశంకర్ సోమవారం ప్రకటించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తిస్తూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు వేటు వేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని సూచించారు. అర్ధరాత్రి ఫోన్ చేసి.. ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో హాస్టల్లో ఉన్న ఆ విద్యార్థినికి శ్రవణ్ ఫోన్ చేసి కిందికి రమ్మన్నాడు. భయపడిన ఆ విద్యార్థిని స్నేహితులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చింది. వారిని చూసిన సురేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఆ విద్యార్థినిని దూషించడమే కాకుండా బెదిరింపులకు గురిచేశాడు. అడ్డుగా వచ్చిన మరో విద్యార్థినిపై చేయి చేసుకుని అక్కడి నుంచి సురేందర్, శ్రవణ్ పరారయ్యారు. కళాశాలలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు.. సురేందర్ గౌడ్ వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించే వాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఏసీపీ కిరణ్‌కుమార్ వివరించారు. విద్యార్థినిపై కన్ను.. హాస్టల్లో ఉంటూ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్ను వేసిన సురేందర్‌గౌడ్ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించాడు. ఇందుకు ఫీజు మాఫీ చేస్తానని.. డబ్బులు కూడా ఇస్తానని మభ్యపెట్టాడు. ఇందుకు హాస్టల్లో మెస్చార్జ్గా పని చేస్తున్న చెన్నారావుపేటకు చెందిన శ్రవణ్ సహకారం తీసుకున్నాడు. పలుమార్లు మాటలతో వేధించడమే కాకుండా అసభ్యకరంగా వ్యవహరించినా ఆ విద్యార్థిని లొంగలేదు. విద్యార్థి సంఘాల ఆందోళన.. కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈమేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం వడ్డేపల్లి చర్చి వద్ద సురేందర్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వాస్తవాలు అంగీకరించారని ఏసీపీ చెప్పారు. సమావేశంలో సీఐ అబ్బయ్య, ఎస్సై సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ? -
లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు
పుణె: సౌత్ కొరియాకు చెందిన లేడీ యూట్యూబర్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. సౌత్ కొరియాకు చెందిన యూ ట్యూబర్ కెల్లీ పుణె పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో వ్లాగ్ చేసుకుంటూ అక్కడి స్థానికులతో ముచ్చటిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆకతాయి కెల్లీని దగ్గరకు లాక్కొని ఆమె మెడపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఇదంతా వీడియోలో రికార్డైంది. ఈ ఘటన జరుగుతుండగానే వెంటనే మరోవ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడిని కూడా దగ్గరకు రమ్మని మొదటి వ్యక్తి సూచించాడు. దీంతో కెల్లీ వారిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ‘నేనిక్కడి నుంచి పారిపోవాలి. వాళ్లు నన్ను హగ్ చేసుకునేందెకు ప్రయత్నిస్తున్నారు’ అనికెల్లీ అనడం క్లిప్‌లో రికార్డైంది. గతంలో ముంబైలోనూ ఓ ఆకతాయి సౌత్‌కొరియాకు చెందిన లేడీ యూ ట్యూబర్‌ను వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఇదీచదవండి..అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్ పోటీపై కోర్టు సంచలన తీర్పు -
'తాత అని పిలిపించుకుని.. డబ్బు ఆశ చూపి..' ముగ్గురు బాలికలపై.. వృద్ధుడు
కరీంనగర్: ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. తాత అని పిలిచిన వారికి డబ్బు ఆశ చూపి.. మాయమాటలు చెప్పి ఈ ఆకృత్యానికి ఒడిగడుతున్నాడు. పిల్లల ఆరోగ్యం బాగలేకపోవడంతో వారి తల్లులు మందలించగా.. అసలు విషయం బయటపడింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు రంగధామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకరు ఐదు, మరొకరు నాలుగు, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. ముగ్గురి తండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. తల్లులు కూలి పనిచేస్తూ వీరిని పోషించుకుంటున్నారు. వీరి సామాజికవర్గానికే చెందిన శివరాత్రి ముత్తయ్య (65) వీరి ఇంటి సమీపంలో ఉంటాడు. పిల్లలకు సెలవు రోజు ఇంటికి పిలిచి డబ్బులు ఇవ్వడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇలా మూడునెలలుగా తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు నాలుగురోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. తల్లులు ఆరా తీయగా జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. సదరు కామాంధుడిని కుల సంఘంలోకి పిలిస్తే రాకపోగా.. బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుల తల్లులు అంటున్నారు. దీంతో చేసేది లేక వారు గొల్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడిగితే బెదిరింపులు.. తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. కుల పెద్దలు పిలిచినా ముత్తయ్య రాలేదని, పైగా ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్ తమనే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఉరి తీయాలి.. తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన ముత్తయ్యను ఉరితీయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి నిందితుడితోపాటు ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సదరు నిందితుడిని ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. https://Follow the Sakshi TV channel on WhatsApp -
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
లైంగిక దాడికి యత్నం.. వేదనతో బాలిక మృతి
తిరుమలగిరి (తుంగతుర్తి): ఓ కామాంధుడి లైంగికదాడి ప్రయత్నంతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురైన బాధిత బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం నాడే బాలిక మరణించడం స్థానికంగా మరింత విషాదం నింపింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన ఓ వితంతువు తన 14 ఏళ్ల కూతురితో కలిసి తిరుమలగిరిలోని పుట్టింట్లో నివసిస్తోంది. ఆ మహిళ ఫణిగిరిలోని ఓ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ కూతురిని స్థానికంగా మరో పాఠశాలలో 9వ తరగతి చదివిస్తోంది. దసరా రోజున ఎదురింట్లో ఉండే చాకలి యాదమ్మకు భోజనం పెట్టిరమ్మంటూ ఆ మహిళ తన కూతురిని పంపించింది. అయితే ఆ సమయంలో ఇంట్లో మద్యం సేవించి ఒంటరిగా ఉన్న ఆమనగంటి రాజు... బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఎంతసేపటికీ కూతురు తిరిగి రాకపోవడంతో ఆ మహిళ.. యాదమ్మ ఇంటికి వెళ్లగా రాజు బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు. కోమాలోకి వెళ్లి.. లైంగికదాడి ప్రయత్నంతో షాక్‌కు గురైన బాలిక అనారోగ్యం పాలైంది. కొన్ని రోజులపాటు జ్వరంతో బాధపడిన బాలికను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పట్నుంచి చిన్నారి ముభావంగా ఉండేది. రాత్రి సమయాల్లో ఆందోళనకు గురయ్యేది. మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఎడమ చేయి, ఎడమకాలు వంకర్లు తిరగడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే 10 రోజుల క్రితం బాలిక కోమాలోకి వెళ్లి సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. కామాంధుడిని ఉరి తీయాలి.. ఇంటి ఎదురుగా ఉన్న రాజును మా బిడ్డఎప్పుడూ బాబాయ్ అంటూ పిలిచేది. దసరా రోజున అన్నం పెట్టడానికి వాళ్లింటికి వెళ్లింది. ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు. అతనికి ఉరి శిక్ష విధించాలి. – కుటుంబ సభ్యులు -
మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..
భోపాల్: ఇద్దరు యువకులు తమ కుటుంబంలోని మహిళ ఓ యువకుడితో పారిపోవడానికి సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలోకి యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె చూపు కోల్పోయే పరిస్ధితి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఆమె చిత్రకూట్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. బాధితురాలు పన్నా జిల్లాలోని బార్హో గ్రామంలో నివసిస్తుంది. ఆ ఊర్లోని ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడాలని పిలివడంతో ఆమె తన సోదరుడితో కలిసి వారి ఫాంహౌస్‌కు వెళ్లింది. నిందితులు ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి, బాలికను వేధించి ఆమె కళ్లలోకి యాసిడ్ పోశారు. ఆ తర్వాత ఆమె బాధతో కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బాలిక నొప్పితో వణుకుతూ పొలంలో పడిపోయింది. బాలిక పరిస్థితి చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఈ ఘటన సిగ్గుచేటని నిందితులపై కఠినచర్యలు చేపట్టాలని, బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. బాలికకు ఆమె తోబుట్టువులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: అత్యాచారం కేసు: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం -
చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య
సిల్వస్సా: నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఓ రాక్షసుడు ఆమెను గొంతుకోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి విషం తాగి మృతి చెందాడు. ఈ ఘటన దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సంతోష్ రజత్(30) సిల్వస్సాలో చిన్నఉద్యోగాలు చేస్తున్నాడు. శుక్రవారం తన ఫ్లాట్ వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి యత్నించగా చిన్నారి కేకలు వేసింది. దీంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపి గోనెసంచిలో కట్టి ఫ్లాట్ పక్క సందులో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిసరాల్లో గాలించారు. ఆ సమయంలో రజత్ ఇంట్లో బాత్రూంలో రక్తపుమరకలు కనిపించడంతో చుట్టుపక్కల శోధించగా బాలిక మృతదేహం ఉన్న సంచి కనిపించింది. విచారణలో రజత్ నేరాన్ని అంగీకరించాడు. కూతురు విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేని ఆమె తండ్రి శనివారం పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. నిందితుడిపై పోక్సోతోపాటు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. -
బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సభ్య సమాజానికే ఇది తలవంపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు. ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్‌కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు. -
వేధింపుల పర్వం
జైపూర్: ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన ఓ ట్రక్కు డ్రైవర్‌ను రాజస్తాన్‌లోని టొంక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి, స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లిన నిందితుడు మహేంద్ర అలియాస్ ఢోలు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి కావడంతో.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న భయంతో పాపను అక్కడే చంపేశాడని ఎస్పీ ఆదర్శ్ తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత రాజస్తాన్ విడిచి పారిపోవాలని భావించాడని, అయితే అలీగఢ్‌లో పట్టుపడ్డాడని వివరించారు. నిందితుడి వయసు 41 ఏళ్లు ఉంటుందని, ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత చిన్నారి కన్పించడం లేదని మొత్తం వెతికారు. మరుసటి రోజు ఉదయం స్కూల్ సమీపంలో పాప శవమై కన్పించింది. స్కూల్ బెల్టుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడని పోలీసులు తెలిపారు. కన్న తండ్రే కూతురిపై.. జైపూర్: సొంత తండ్రే కన్న కూతురిని గొలుసులతో కట్టేసి, హింసించి, పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డ హేయమైన ఘటన రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగింది. తన తండ్రి వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో తాను చూశాననే కోపంతో గొలుసులతో తన కాళ్లు, చేతులు కట్టేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇంటి నుంచి బాధితురాలు శుక్రవారం తప్పించుకుని తన మేనమామ పొలం దగ్గరికి వచ్చింది. అప్పటికీ తన చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. జరిగిన విషయాన్ని తన మేనమామతో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఇంట్లో జరిగే హింసను తట్టుకోలేక బాధితురాలి తల్లి ఏడేళ్ల కిందటే నిందితుడిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో కానిస్టేబుల్ పూరి: ఒడిశాలోని పూరీలో సోమవారం ఓ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగింది. కాకట్‌పర గ్రామానికి చెందిన బాధితురాలు నిమపరలోని బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ఓ వ్యక్తి..కాకట్‌పర తీసుకెళ్తానంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో కారులో మరో ముగ్గురు వ్యక్తులున్నారు. బాధితురాలిని ఝడేశ్వరి క్లబ్ పక్కనున్న పోలీస్ క్వార్టర్ల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు రేప్ చేశారు. అక్కడ తనకు దొరికిన పర్స్‌ను బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదుచేసింది. అందులోని ఐడీకార్డుల ద్వారా నిందితుడైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్‌చేశారు. -
దూకుతా.. దూకుతా..
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుంటానంటూ 10 అంతస్తుల భవనంపైకి ఎక్కిన ఓ వ్యక్తి పోలీసులు, అధికారులను 17 గంటలపాటు హైరానా పెట్టించాడు. చివరికి అతడిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. అయితే, బాలికపై వేధింపుల కేసులో నిందితుడంటూ అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన సందీప్ అలియాస్ అర్మాన్ మాలిక్(31) భార్య క్రితికా బసేరాతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హరినగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఆ దంపతుల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో చచ్చిపోతానంటూ భార్యను బెదిరించి సాయంత్రం 4 గంటల సమయంలో పదో అంతస్తుపైకి ఎక్కాడు. భార్య సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో సహా అక్కడికి చేరుకుని అతడిని ఒప్పించి కిందికి దించేందుకు రాత్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతడి కోరిక మేరకు పండ్లు, బిస్కెట్లతోపాటు తన డిమాండ్లను పెద్దగా వినిపించేందుకు లౌడ్‌స్పీకర్‌నుపంపారు. చివరికి సోమవారం ఉదయం కిందికి దిగి రావడంతో ఉత్కంఠకు తెరపడింది. -
రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
గంగవరం: ఓ ప్రేమోన్మాది మళ్లీ రెచ్చిపోయాడు. ఈ పర్యాయం యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్యపై తన అనుచరులతో దాడి చేశాడు. కర్రలతో కొట్టి, చితకబాదడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా తిరగబడ్డాడు. తనను ప్రేమించకపోతే అంతుచూస్తానంటూ యువతిని తీవ్రంగా హెచ్చరించాడు. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని మార్జేపల్లెలో చోటుచేసుకుంది. బాధితులు కథనం..డిగ్రీ సెకండియర్ చదువుతున్న గ్రామానికి చెందిన ఓ యువతిని జులాయిగా తిరిగే చరణ్‌రాజ్ (25) ఏడాది కాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ సమయంలో అతనిపై చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టు నుంచి చరణ్‌రాజ్ యాంటిసిపేటరీ బెయిల్ పొంది దర్జాగా తిరగసాగాడు. అంతేకాకుండా ఆ యువతిని మరింత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ యువతికి తోడుకు బస్ స్టాప్ వరకు ఆమె సోదరుడు చంద్రశేఖర్ వచ్చాడు. ఇది చూసిన చరణ్‌రాజ్ ..తోడుగా వస్తే భయపడతాననుకున్నావా? అంటూ అతడిని దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. దీంతో చంద్రశేఖర్ తన తల్లిదండ్రులు, మామయ్యకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని చరణ్‌రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో ఆగ్రహించి చరణ్‌రాజ్ ఫోన్లో తన అనుచరులు సుబ్బరామయ్య, విశ్వేశ్వరయ్య, జగదీష్, అశోక్, యువరాజు, వెంకటరమణ, అక్కడికి రప్పించి కర్రలతో యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్య మంజుపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు కొందరు వారిని అడ్డుకుని చరణ్‌రాజ్ అతని అనుచరులను మందలించారు. వారిపై కూడా చిందులేసిన చరణ్‌రాజ్ అంతు చూస్తానంటూ యువతి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వెళ్లిపోయాడు. దాడి ఘటనలో గాయపడిన యువతి తల్లిదండ్రులు, అన్న, మామయ్యను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం యువతి తల్లిదండ్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై సెక్షన్ 354, సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్
మిరుదొడ్డి(దుబ్బాక) : మైనర్ బాలికను పెళ్లిపేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు మిరుదొడ్డి ఎస్ఐ విజయ్ భాస్కర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..మండల కేంద్రం మిరుదొడ్డిలో మన్నె శేఖర్(28) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శేఖర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. -
బుష్ చేతులు నన్ను ఎక్కడెక్కడో తడిమాయి!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ తనను అసభ్యంగా తాకి వేధించారని రోస్లిన్ కార్రిగన్ అనే 30 ఏళ్ల మహిళ ఆరోపించారు. తాను టీనేజ్‌లో ఉండగా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిసేందుకు చాన్స్ రాగా ఆయనను కలిసిన సందర్భంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ' అది 2003 సంవత్సరం. అప్పుడు నాకు 16 ఏళ్లు. టెక్సాస్ లో ఓ ఈవెంట్‌కు బుష్ రాగా, రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న నేను అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లాను. అమ్మతో కలిసి అమెరికా 41వ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిశాను. రాజకీయాల్లోకి రావాలని ఉందని మాజీ అధ్యక్షుడికి చెప్పి ఎంతో సంతోషించాను. అయితే ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైంది. ఆయనతో కలిసి ఫొటోలు దిగుతుండగా.. నన్ను వెనుకవైపు నుంచి అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు బుష్. ఏం జరుగుతుందో అర్థంకాక ఎంతో భయపడ్డాను. అమ్మ సారీ యంగ్ పక్కన ఉండగానే బుష్ చేతులు ఎక్కడెక్కడో నన్ను తడిమాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కేవలం సామాన్య మైనర్ బాలికనైన నేను మాజీ అధ్యక్షుడికి 'అలాంటి పనులు చేయకూడదు. అమ్మాయిలు, మహిళలతో అలా అసభ్యంగా ప్రవర్తించకూడదని' ఎలా చెప్పగలను. ఇటీవల ఫొటోతో పాటు ఆ చేదు అనుభవాన్ని బహిర్గతం చేశానని' బాధితురాలు రోస్లిన్ కార్రిగన్ వివరించారు. సీనియర్ బుష్ అధికారిక ప్రతినిథి జిమ్ మెక్ గ్రాత్ ఈ ఆరోపణలపై స్పందించారు. బుష్ చాలా మంచి వ్యక్తి. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించే మనిషి కాదు. వీల్ చైర్లో ఉన్న వ్యక్తి కనుక.. కొన్నిసార్లు ఆసరా కోసం పక్కనున్న వారిని పట్టుకుని ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోకూడదంటూ మెక్‌గ్రాత్ వివరణ ఇచ్చారు. అయితే 2003లో ఫొటో దిగిన సమయంలో సీనియర్ బుష్ వీల్ చైర్లో కూర్చునే పరిస్థితి లేదని, గతంలో ఐదుగురు మహిళలు సీనియర్ బుష్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే. -
విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు
విశాఖపట్నం: చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా విశాఖ జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లెక్కల మాస్టారు వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఊర్వశి జంక్షన్‌లోని న్యూటన్ స్కూల్లో చోటుచేసుకుంది. విద్యార్థిని కీచక మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి మాస్టర్ గారి తిక్కవేశాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికుల సహాయంతో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్ధులపై వేధింపులకు గురిచేసిన టీచర్‌పై చర్య ఎందుకు తీసుకోలేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవటం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.