
photo credit:HINDUSTAN TIMES
పుణె: సౌత్ కొరియాకు చెందిన లేడీ యూట్యూబర్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
సౌత్ కొరియాకు చెందిన యూ ట్యూబర్ కెల్లీ పుణె పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో వ్లాగ్ చేసుకుంటూ అక్కడి స్థానికులతో ముచ్చటిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆకతాయి కెల్లీని దగ్గరకు లాక్కొని ఆమె మెడపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఇదంతా వీడియోలో రికార్డైంది.
ఈ ఘటన జరుగుతుండగానే వెంటనే మరోవ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడిని కూడా దగ్గరకు రమ్మని మొదటి వ్యక్తి సూచించాడు. దీంతో కెల్లీ వారిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ‘నేనిక్కడి నుంచి పారిపోవాలి. వాళ్లు నన్ను హగ్ చేసుకునేందెకు ప్రయత్నిస్తున్నారు’ అనికెల్లీ అనడం క్లిప్‌లో రికార్డైంది. గతంలో ముంబైలోనూ ఓ ఆకతాయి సౌత్‌కొరియాకు చెందిన లేడీ యూ ట్యూబర్‌ను వేధించిన కేసులో అరెస్టయ్యాడు.
ఇదీచదవండి..అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్ పోటీపై కోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment