ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఐదోదైన 123 ఫ్లోర్ల బిల్డింగ్‌ను తాళ్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియా సియోల్‌లోని లొట్టే వరల్డ్ టవర్.. 123 ఫ్లోర్లతో ప్రపంచంలోనే ఐదో ఎత్తైన బిల్డింగ్. దీన్ని ఎక్కడానికి 24 ఏళ్ల బ్రిటీష్ యువకుడు ప్రయత్నించాడు. చిన్న షార్ట్ ధరించి ఎలాంటి తాళ్లు లేకుండా గంటలోనే సగానికి పైగా 73 అంతస్తులు ఎక్కేశాడు.
యువకున్ని గమనించిన పోలీసులు..అక్కడికి చేరుకుని బిల్డింగ్ ఎక్కడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్ని మాపక సిబ్బంది పైకి చేరుకుని యువకున్ని భవనంలోకి లాగారు. అనంతరం అతన్ని పోలీసులు నిర్బంధించారు.
ఆ యువకున్ని బ్రిటన్‌కు చెందిన జార్జ్ కింగ్-థాంప్సన్‌గా గుర్తించారు. అయితే..ఆ యువకునికి 2019లోనే షార్డ్ బిల్డింగ్‌ను ఎక్కినందుకు జైలు శిక్ష కూడా పడింది. 2018లో లొట్టే వరల్డ్ టవర్‌ను ఎక్కే ప్రయత్నం చేసినందుకు ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్‌ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం
Comments
Please login to add a commentAdd a comment