skyscraper
-
కోకాపేటలో 55 అంతస్తుల అబ్బురం!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి ధరల పెరుగుదలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన కోకాపేటలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి గ్రూప్ విలాసవంతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోల్డెన్ మైల్ లేఔట్లో, ఔటర్ రింగ్ రోడ్ ఎదురుగా 55 అంతస్తుల్లో పలాజో స్కై స్క్రాపర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.ప్రస్తుతం ఐదవ అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీపావళి సందర్భంగా ఆరో ఫ్లోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. పలాజో ప్రాజెక్ట్‌కు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ నుంచి దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్ అవార్డును సొంతం చేసుకుందని పేర్కొన్నారు. 2.3 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 141 అపార్ట్మెంట్లు ఉంటాయని, 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ. మధ్య ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నివాసితులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ పలాజో ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థల సీఎక్స్ఓలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఎంటర్ప్రెన్యూర్లు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు.52వ ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్.. 70 అడుగుల ఎత్తు గల గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, డబుల్ హైట్ బాల్కనీ, 52వ అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. ఇవీ పలాజో ప్రాజెక్ట్ వసతుల్లో ప్రత్యేకమైనవి. దీంతో నివాసితులకు సెవెన్ స్టార్ హోటల్ అనుభూతి కలుగుతుంది. ఆకాశమంత ఎత్తులో పూల్ ఉండటంతో కనుచూపు మేర వరకూ సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేయడం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. 75 వేల చ.అ.ల్లోని క్లబ్‌హౌస్‌లో స్పా, ప్రైవేట్ డైనింగ్ రూమ్, ఫిట్నెస్ సెంటర్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం బాంక్వెట్ హాల్, బాస్కెట్‌బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఐదోదైన 123 ఫ్లోర్ల బిల్డింగ్‌ను తాళ్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియా సియోల్‌లోని లొట్టే వరల్డ్ టవర్.. 123 ఫ్లోర్లతో ప్రపంచంలోనే ఐదో ఎత్తైన బిల్డింగ్. దీన్ని ఎక్కడానికి 24 ఏళ్ల బ్రిటీష్ యువకుడు ప్రయత్నించాడు. చిన్న షార్ట్ ధరించి ఎలాంటి తాళ్లు లేకుండా గంటలోనే సగానికి పైగా 73 అంతస్తులు ఎక్కేశాడు. యువకున్ని గమనించిన పోలీసులు..అక్కడికి చేరుకుని బిల్డింగ్ ఎక్కడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్ని మాపక సిబ్బంది పైకి చేరుకుని యువకున్ని భవనంలోకి లాగారు. అనంతరం అతన్ని పోలీసులు నిర్బంధించారు. ఆ యువకున్ని బ్రిటన్‌కు చెందిన జార్జ్ కింగ్-థాంప్సన్‌గా గుర్తించారు. అయితే..ఆ యువకునికి 2019లోనే షార్డ్ బిల్డింగ్‌ను ఎక్కినందుకు జైలు శిక్ష కూడా పడింది. 2018లో లొట్టే వరల్డ్ టవర్‌ను ఎక్కే ప్రయత్నం చేసినందుకు ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్‌ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..
ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్‌లోని సిమ్ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి. ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్ గవర్నర్ డేవిడ్ ట్రెంచ్ చేత ప్రారంభించబడిన మెరైనర్స్ అనే ఓ క్లబ్ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్ హోటల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా. Huge fire tears through #HongKong #skyscraper: Fire hits skyscraper being built on site of old Mariner's Club in Hong Kong's #TsimShaTsui https://t.co/zmG6QrCLhQ pic.twitter.com/3DcPsuIykq — 🛰️ War in Ukraine 🍉 (@EUFreeCitizen) March 2, 2023 (చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..) -
ఇతడు మొనగాడురా బుజ్జీ!
సాహసం సాహసం కోసమే చేసేవాళ్లు ఉన్నారు. పదిమందికి సహాయం కోసం సాహసం చేసేవాళ్లు ఉన్నారు. హాంకాంగ్‌కు చెందిన 35 సంవత్సరాల లై చి రెండో కోవకు చెందిన సాహసి. పదిసంవత్సరాల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల లై చి వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన వీల్‌చైర్‌నే విల్పవర్గా మార్చుకున్నాడు. ధైర్యసాహసాలకు ప్రతీక గా చెప్పుకునే 495 మీటర్ల లైన్రాక్ పర్వతాన్ని అయిదుసంవత్సరాల క్రితం వీల్‌చైర్‌తోనే అధిరోహించాడు.‘ఈ సాహస ప్రయాణంలో నేను దివ్యాంగుడిననే ఆలోచన ఎప్పుడూ రాదు’ అంటాడు లై చి. రాక్ క్లైంబింగ్లో నాలుసార్లు ఏషియన్ ఛాంపియన్‌గా నిలిచిన లైచి తాజాగా మరో సాహస ఘట్టానికి తెర తీశాడు. 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను వీల్‌చైర్‌తోనే అధిరోహించి ‘భళా!’ అనిపించుకున్నాడు. పర్వతాన్ని అధిరోహించడం కంటే అద్దాల ఆకాశహర్మ్యాన్ని అధిరోహించడమే చాలా కష్టమని చెబుతున్నాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ల కోసం నిధుల సమీకరణలో భాగంగా ఈ సాహసం చేశాడు లై చి. -
పట్టు జారిందా అంతే సంగతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని న్యూయార్క్ సిటీ పేరు వినగానే ఆ సిటీ గొప్పతనాన్ని తెలియజేసే నిద్రపోని నగరం అని, ఆధునిక కాస్మోపాలిటన్ నగరం అని, భిన్న సంస్కృతులు ఉట్టిపడే ఓ ప్రత్యేక నగరం అనే మాటలు మనకు గుర్తుకు వస్తాయి. అంతకన్నా ప్రపంచంలోనే ఎత్తైన భవనాలు కలిగిన మొట్టమొదటి నగరం అని విషయం గుర్తుకు రాదు. భవనాల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఎత్తైన భవనాలను నిర్మించడంలో పోటీపడి ముందుకు దూసుకుపోతున్నాయి. న్యూయార్క్ సిటీలో తొలుత ఎత్తైన భవనాలను నిర్మించినప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అయినప్పటికీ నాటి కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రమాదం అంచుల్లో నిలబడి ఇలాంటి భవనాలను నిర్మించారు. ఆకాశమంత ఎత్తుకు భారీ స్తంభాలను తాళ్లుకట్టి తమదైన పద్ధతిలో తీసుకెళ్లి వాటిని జోడించేవారు. పట్టుతప్పిందా ప్రాణాలకు పత్తా ఉండేది కాదు. ఇలా భవన నిర్మాణాల సందర్భంగా ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు బలయ్యారు. నాటి వారి కష్టాన్ని చూపే వీడియో ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. -
పెద్ద గీత.. చిన్న గీత కాబోతోంది!
ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఏది? దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా! కానీ ఈ ముచ్చట ఇంకో మూడేళ్లే! బుర్జ్ ఖలీఫాకు కొంచెం దూరంలోనే ఇంకో ఎత్తైన భవనాన్ని కట్టేసి దుబాయి తన రికార్డును తానే బద్ధలు కొడుతోంది. మల్లెపూవు ఆకారాన్ని పోలినట్టు ఉండే ఆ భవనం ఎలా ఉండబోతోందో ఫొటోలో చూడవచ్చు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈ ఎత్తైన భవంతిని కడుతోంది. డిజైన్ చేసింది శాంటియాగో కలట్రావాస్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ. దాదాపు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టే ఈ భవనం ఎత్తు దాదాపు 3,045 అడుగులు. బుర్జ్ ఖలీఫా కంటే 300 అడుగులు ఎక్కువ. దుబాయ్ అంటేనే ఏడారి దేశం కాబట్టి.. ఇసుక నేలలపై భవనాలు కట్టడం అంత ఆషామాషీ ఏం కాదు. అందుకే ఈ కొత్త భవనానికి పునాది ఎంత గట్టిగా వేశారంటే.. అది కాస్తా 236 అడుగుల లోతుకు చేరేంత. పైగా ఒక్క పునాదుల్లోనే దాదాపు 16 లక్షల ఘనపుటడుగుల కాంక్రీట్‌ను దిమ్మరించారు. ఇక ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత... దీనికి ఊతమిచ్చేందుకు దాదాపు 110 కిలోమీటర్ల పొడవైన ఇనుపతీగలను వాడటం. బలమైన గాలులకు భవనం ఊగిపోకుండా అన్నమాట! అన్నీ బాగానే ఉన్నాయిగానీ దీంట్లో ఏముంటాయి? దుబాయ్ మొత్తాన్ని పై నుంచి చూసేందుకు పది వరకూ అబ్జర్వేషన్ డెక్స్ ఉంటాయి. అంతేకాకుండా బాబిలోనియాలోని వేలాడే ఉద్యానవనాల మాదిరిగా దీంట్లోనూ బోలెడన్ని మొక్కలు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్ లోపల చల్లగా ఉంచేందుకు అత్యంత çసమర్థవంతమైన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా సేకరించే నీటితో బిల్డింగ్ ముందుభాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంట్లో ఉన్న కొన్ని బాల్కనీలు అవసరమైనప్పుడు బిల్డింగ్ బయటభాగానికి వచ్చేస్తాయి. ఆ తరువాత లోనికి తిరిగేస్తాయి. గత ఏడాది ఈ భవన నిర్మాణం మొదలుకాగా.. ఇంకో మూడేళ్లలో అంటే 2020లో జరిగే దుబాయ్ ఎక్స్పో సమయానికి నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆఫ్రికాలో అద్భుత నిర్మాణం
- ఖండంలోనే అతిపెద్ద ఆకాశహార్మ్యం ‘ది పినాకిల్’ నైరోబీ: ఒకప్పటి ‘చీకటి ఖండం’ ఇప్పుడు సరికొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఆకాశహార్మ్యాల నిర్మాణంతో అదరగొడుతోంది. పశ్చిమ, తూర్పు ఆసియాలోని యుఏఈ, చైనా లాంటి దేశాల్లోని అతిపెద్ద నిర్మాణాలకు ధీటుగా కాకపోయినా, సమీప భవిష్యత్తులో ఆ స్థాయిని అందుకోగలనన్న సంకేతాలిస్తోంది. అందుకు నిదర్శనమే.. కెన్యా రాజధాని నైరోబీలో రూపుదిద్దుకుంటోన్న ‘ది పినాకిల్’! 980 అడుగుల ఎత్తుండే ‘ది పినాకిల్’ హార్మ్యం.. ఆఫ్రికా ఖండంలోనే అతిపొడవైన నిర్మాణంగా రికార్డులకెక్కనుంది. 72 అంతస్తుల భారీ భవంతిని, దానిని ఆనుకునే 45 అంతస్తులుండే మరో భారీ భవంతిని కలిపి ‘ది పినాకిల్’ హార్మ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద భవంతి పొడవు.. 980 అడుగులు (300 మీటర్లు). అంటే, ఇంచుమించు పారిస్‌లోని ఈఫిల్ టవర్(304 మీటర్లు) ఎత్తన్నమాట! కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఇటీవలే నిర్మాణ పనులను ప్రారంభించారు. 2019 నాటికి ‘ది పినాకిల్’ నిర్మాణం పూర్తికానుంది. ‘ది పినాకిల్’ ప్రత్యేకతలు కొన్ని.. 70 అంతస్తుత పెద్ద భవంతిలో ప్రధానంగా కార్యాలయాలకు చోటు కల్పించనున్నారు. ఇక 45 అంతస్తుల రెండో భవంతిలో ప్రఖ్యాత హిల్టన్ హోటల్‌ను నడపనున్నారు. మొత్తం నిర్మాణాలకుగానూ 20 బిలియన్ కెన్యన్ షిల్లింగ్స్‌ను వెచ్చిస్తున్నారు. ప్రస్తుతానికి జోహన్నస్బర్గ్(దక్షిణాఫ్రికా)లోని కార్ల్టన్ సెంటర్(732 అడుగులు) భవంతే ఆఫ్రికాలో అతిపెద్ద ఆకాశహార్మ్యం. 2019లో నిర్మాణం పూర్తికాగానే ఆ అతిపెద్ద ఘనత ‘ది పినాకిల్’ కు దక్కుతుంది. హెలికాప్లర్లలో ప్రయాణిస్తూ నేరుగా పినాకిల్పైనే దిగేలా 800 అడుగుల ఎత్తులో హెలీప్యాడ్‌ను నిర్మించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ‘హస్ పెట్రోలియం అండ్ వైట్ లోటస్ ప్రాజెక్ట్స్’ సంస్థ పినాకిల్ నిర్మాణాన్ని చేపట్టింది. -
ఆకాశగంగ కాదు..
ఇదేంటీ..ఆకాశగంగ ఇలా జాలువారుతోందే అని అనుకుంటున్నారా?! అదేమీ కాదండోయ్! శ్రీరామరెడ్డి పథకం పైపులైన్‌కు గేట్‌వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నీరిలా ఎగజిమ్ముతోంది. ఆకాశాన్ని తాకినట్లుగా అన్పిస్తోంది. కళ్యాణదుర్గం మండలంలోని గరుడాపురం, పాపంపల్లి మధ్య సోమవారం ఈ లీకేజీ ఏర్పడింది. -
ఫ్రెంచ్‌లో సాలీడు సాహసపుత్రుడు
-
అస్తవ్యస్త ఆకాశహర్మ్యం.. యుగ్యోంగ్ హోటల్
చరిత్రలోని కొన్ని నిర్ణయాలు ఘోర తప్పిదాలుగా లిఖితమవుతాయి. అవి ఆనాటి పాలకుల అసమర్థతని ఎత్తిచూపుతూ ఉంటాయి. నిరంకుశ ప్రభుత్వంగా పేరున్న ఉత్తర కొరియాను కూడా ఇలాంటి ఓ నిర్ణయమే నవ్వులపాలు చేసింది. ప్రపంచ దేశాల సరసన తలెత్తుకుని గర్వంగా నిలబడాలన్న ఆ దేశ స్వప్నంపై నీళ్లు చల్లింది. ఉత్తర కొరియా అధినాయకత్వాన్ని నేటికీ ఊరిస్తూ, వెక్కిరిస్తోన్న ఆ స్వప్నం మరేదో కాదు. ఓ హోటల్! 'ప్రపంచపు అత్యంత చెత్త భవంతి' అన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న 'యుగ్యోంగ్ హోటల్'!! ఉత్తర కొరియాలోని అత్యంత ఎత్తై భవంతి యుగ్యోంగ్ హోటల్ని చూసిన ప్రతిసారీ స్థానికుల గుండెలు మండుతాయి. అంతనీ, ఇంతనీ.. తమను ఎన్నో ఆశలకు గురిచేసి చివరకు ఉసూరుమనిపించిన ఆ కాంక్రీటు గూడును విరగ్గొట్టేయాలనేంత కోపం తన్నుకొస్తుంది వారికి. ఒకటా రెండా.. కోట్లు.. వేల కోట్లు.. ఆహారానికి, విద్యకు, కరెంటుకు, ఆరోగ్యానికి కొట్టుమిట్టాడే దేశంలో 28 ఏళ్ల కిందటే దాదాపు 5 వేల కోట్లు! ఈ భవంతి కోసమే ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేశారు నిరంకుశ ఉత్తర కొరియా పాలకులు. ఇది ఆ దేశ జీడీపీలో 2 శాతానికి సమానం. నిర్మాణం.. 1987లో యుగ్యోంగ్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. 105 అంతస్తులతో ఎత్తై హోటల్‌గా ప్రపంచ రికార్డు స్థాపన దిశగా అడుగులు వేసింది. తొలుత దీన్ని రెండేళ్లకు అంటే.. 1989 నాటికి పూర్తి చేయాలనుకున్నారు. 330 మీటర్ల ఎత్తై ప్రతిపాదిత భవంతిని ఆ ఏడాది జరిగే 13వ ప్రపంచ యువజన, విద్యార్థి వేడుక సందర్భంగా ప్రారంభించాలని ప్రణాళికలు రచించారు. అయితే నిర్మాణపరమైన కారణాల వల్ల గడువు పెరుగుతూ వచ్చింది. చివరకు 1992లో నిర్ణీత ఎత్తులో నిర్మాణం పూర్తిచేశారు. అయితే, పూర్తిస్థాయి రూపాన్ని తీసుకురాలేకపోయారు. ఇదే సమయంలో సోవియెట్ యూనియన్ కుప్పకూలడంతో ఉత్తర కొరియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేంత సొమ్ము దేశంలో లేకపోవడంతో యుగ్యోంగ్ హోటల్ మొండిగా నిలబడిపోయింది. చెత్త భవనం.. ఉత్తర కొరియాలోని ఎత్తై భవనం అనే ప్రచారంతో ప్రపంచ మీడియా దృష్టి ఈ హోటల్‌పై పడింది. పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయి. ఉత్తర కొరియా కలల భవంతిగా పేర్కొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ సంస్థలు దీని గురించి తెలుసుకోసాగాయి. ముఖ్యంగా 1990ల్లో ‘యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రతినిధులు ఆర్థిక సాయం విషయమై ఈ భవంతిని చూసివచ్చారు. అయితే, వీరు చేసిన ప్రచారం ఎక్కడలేని చేటు తెచ్చింది. బాహ్య ఆకారం తప్ప లోపలేమీ లేదని.., కిటికీలు, వైర్లు, పైపులు, ఫర్నిషింగ్, ఫిట్టింగ్.. ఇలా ఏదీ నిర్మించలేదని వారు చెప్పారు. మరమ్మత్తులు చేసేందుకు కూడా వీలులేని భవనం అంటూ తేల్చేశారు. దీంతో ఈ ఆకాశహర్మ్య ఆర్కిటెక్చరల్ ప్లాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని అతి చెత్త బిల్డింగ్ అంటూ బ్రిటిష్ పత్రికలు ప్రచురించాయి. ఇంతటి భారీ నిర్మాణానికి పూనుకున్న ఉత్తర కొరియాలో దానికి సరిపడా ముడిసరకు ఉందా.. అంటూ జపాన్ మీడియా ప్రశ్నించింది. పునర్నిర్మాణం.. తర్వాత 16 ఏళ్ల వరకూ ఈ ఆకాశహర్మ్యం జోలికి ఎవరూ వెళ్లలేదు. 2008, ఏప్రిల్‌లో ఈజిప్టు కంపెనీ ఒరాస్కామ్ గ్రూపు తమ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి ‘యుగ్యోంగ్ హోటల్’ను అనువైనదిగా భావించింది. దీని నిర్మాణం పూర్తి చేసి, తమ 3జీ సేవలను ప్రారంభిస్తామంటూ ఉత్తర కొరియా ప్రభుత్వంతో 400 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కొత్త ఆశలు తెచ్చుకొన్న ఉత్తర కొరియా అధికారులు 2012 నాటికి తమ దేశ శాశ్వత అధ్యక్షుడు 'కిమ్ సంగ్'వందో జయంతి సందర్భంగా హోటల్‌ను ప్రారంభిస్తామంటూ ప్రకటించారు. 2012 నాటికి ఈ భవన బాహ్య నిర్మాణం పూర్తయింది. ఆపాదమస్తకమూ అద్దాలను బిగించిన ఒరాస్కామ్ కంపెనీ దీన్ని జిగేల్‌మనిపించింది. పనిలో పనిగా తమ టెలికమ్యూనికేషన్ యాంటెన్నాలనూ అమర్చింది. మేడిపండు.. ఈ భవంతి పూర్తయిందంటూ చెప్పుకొంటున్నప్పటికీ లోపలి నిర్మాణం జరగలేదని 2012లో బయటకు వచ్చిన ఫొటోలు తేల్చాయి. చైనాకు చెందిన కోర్యో టూర్స్ కంపెనీ ఈ చిత్రాలను బయటపెట్టింది. వీటిని చూసి డైలీ మెయిల్ లాంటి మీడియా సంస్థలు 'కార్ పార్కింగ్ షెడ్'గా విమర్శించాయి. ప్రతిష్ట కోసం గొప్పలకు పోయిన ఉత్తర కొరియా ప్రభుత్వం చేతులు కాల్చుకుందంటూ ఎద్దేవా చేశాయి. బాహ్య చిత్రాలు చూసి 2012లో వ్యాపారానికి ముందుకొచ్చిన అంతర్జాతీయ హోటల్ దిగ్గజం 'కెంపిన్స్కీ' కొద్ది రోజులకే ఆ ఆలోచనను విరమించుకుంది. పోటీ కోసమా..? ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రత్యర్థి దేశాలతో పోటీ కోసమే ఈ భవన నిర్మాణానికి ఉత్తర కొరియా పూనుకుందనే ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్‌లోని 'వెస్టిన్ స్టామ్ఫోర్డ్' ప్రపంచంలోని అత్యంత ఎత్తై హోటల్‌గా ఖ్యాతి గడించడంతో దాన్ని అధిగమించే స్థాయిలో ఈ ఆకాశహర్మ్యానికి రూపకల్పన జరిగిందని చెబుతారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తే ఈ ఘనతతో పాటు ప్రపంచ ఏడో ఎత్తై నిర్మాణంగానూ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కేదీ హోటల్!! -
19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి
-
19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి
యమాస్పీడుగా బిల్డింగ్‌ను కట్టినా ప్రతీరోజూ ఎన్ని అంతస్తులు కట్టగలం? మామూలుగా అయితే ఒకటి. కానీ ఈ ఫోటోలోని బిల్డింగ్‌ను రోజుకు మూడంతస్తుల చొప్పున పూర్తి చేశారు. కేవలం 19 పనిదినాల్లో స్టీలు, గాజు పలకలతో 57 అంతస్తుల అందాల భవంతిని కట్టేసింది 'ది బ్రాడ్ సస్టేనబుల్ బిల్డింగ్ కో' అనే సంస్థ. మధ్య చైనాల చాంగ్నా నగరంలో దీన్ని ఇటీవలే నిర్మించారు. -
దుబాయ్ టార్చ్ టవర్‌లో అగ్నిప్రమాదం
-
దుబాయ్ 'టార్చ్' టవర్‌లో అగ్నిప్రమాదం
దుబాయ్ : దుబాయ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన సముదాయంలో ఒకటైన 'టార్చ్' టవర్‌లో ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోని 59వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వేలాదిమంది ఉండగా, అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తరలించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ మధ్య భాగంలో అగ్నిప్రమాదం జరగటంతో భవన సముదాయంలో చిక్కుకున్నవారు కొంతమంది మెట్ల ద్వారా కిందకు రాగా, మరికొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరోవైపు బయటకు వచ్చేందుకు అందరూ ఒక్కసారిగా మెట్లమార్గాన్ని ఆశ్రయించటంతో తొక్కిసలాట జరగటంతో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. 60వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.