French Daredevil 30, Known For Skyscraper Climbs Dies Falling From 68th Floor - Sakshi
Sakshi News home page

Skyscraper Climber Daredevil Death: ఎత్తైన భవనంపై సాహసం.. 68వ అంతస్తు నుంచి పడి.. 

Published Mon, Jul 31 2023 11:23 AM | Last Updated on Mon, Jul 31 2023 12:25 PM

Daredevil Known For Skyscraper Climbs Dies Falling From 68th Floor - Sakshi

హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది.

రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు.

తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది.

అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్‌లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. 

గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు.  చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు.

ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement