
ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా భాషల సినిమాల్ని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. అందుకు తగ్గట్లే ఆయా చిత్ర దర్శక నిర్మాతలు కూడా మిగతా భాషలతో పాటే తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆస్కార్ రేసులో నిలిచిన ఓ హై వోల్టేజీ యాక్షన్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
గతేడాది మే 1న రిలీజైన యాక్షన్ మూవీ 'వాల్డ్ ఇన్'. హాంకాంగ్ తరఫున ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ పోటీల్లోకి వెళ్లింది. కానీ విజయం సాధించలేకపోయింది. దాదాపు 2 గంటల పాటు ఫుల్ ఆన్ యాక్షన్ సీన్లతో ఉండే ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ మూవీ మార్చి 27 నుంచి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ యాక్షన్ సినిమాలంటే ఇష్టముండి, తెలుగు డబ్బింగ్ తో చూడగలరనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఓ పాడుబడ్డ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment