hongkong
-
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుండి 3 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. 2024 హాంకాంగ్ సిక్సెస్ ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. తాజాగా ఈ టోర్నీ కోసం ఏడుగురు సభ్యులతో కూడా భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడితో పాటు మాజీలు కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, షాబాజ్ నదీమ్, శ్రీవత్సవ గోస్వామి, స్టువర్ట్ బిన్నీ, భరత్ చిప్లీలకు చోటు దక్కింది.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్‌గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్‌లో ప్రతీ జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. ఒక్కో వైడ్, నోబాల్‌కు రెండు పరుగులు వస్తాయి. ఒక వేళ ఐదు వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను ముగిసినట్లు కాదు. వన్ సైడ్ బ్యాటర్ కూడా బ్యాటింగ్ చేయవచ్చు. అదేవిధంగా 31 పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఆఖరిలో బ్యాటింగ్ వచ్చే అవకాశముంటుంది.చదవండి: LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో) -
టీ20ల్లో సంచలనం.. ఒక్క రన్ ఇవ్వకుండా 4 ఓవర్లు
టీ20ల్లో మరో సంచలనం నమోదైంది. హాంకాంగ్ బౌలర్ ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తన 4 ఓవర్లు కోటాను మెయిడిన్లగా ముగించాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్‌లో భాగంగా మంగోలియాపై ఆయుష్ ఈ ఫీట్ సాధించాడు.తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడో బౌలర్‌గా శుక్లా చరిత్రకెక్కాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్ శుక్లానే కావడం గమనార్హం. మంగోలియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న శుక్లా.. తొలి బంతికే వికెట్ తీసాడు.ఆ తర్వాత వరుసగా తన బౌలింగ్ కోటాను అతడు పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్, కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఉన్నారు. ఈ ఫీట్ణు లాకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్‌కప్‌లో పపువా న్యూగినియాపై సాధించగా.. సాద్ బిన్ జఫర్ పనామాపై సాధించాడు. -
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
రోడ్‌షోలు నిర్వహించున్న ఎల్ఐసీ.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ నెలలో అంతర్జాతీయంగా రోడ్‌షోలు నిర్వహించనుంది. హాంకాంగ్, బ్రిటన్ దేశాల్లో జూన్ 25 నుంచి 29 మధ్యలో వీటిని చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు వీటిని ఉద్దేశించినట్లు వివరించాయి. ఈ సందర్భంగా ఎల్ఐసీ టాప్ మేనేజ్మెంట్.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. (ఇదీ చదవండి: 2025లో జాగ్వార్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్) సంస్థ వృద్ధి అవకాశాలను వివరించి, షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు వివరించాయి. ఎల్ఐసీ షేర్లు లిస్ట్ అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఐపీవో కింద ఎల్ఐసీలో 3.5 శాతం వాటాల విక్రయం ద్వా రా కేంద్రం గతేడాది రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి రూ. 949 కాగా మే 17న సుమారు 9 శాతం డిస్కౌంటుకు రూ. 867 వద్ద కంపెనీ షేర్లు లిస్టయ్యా యి. ఐపీవో ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం తక్కువగా రూ. 602 వద్ద ట్రేడవుతున్నాయి. -
షాకింగ్ వీడియో.. మెట్రో రైలులో మహిళపై పిడిగుద్దులు!
హాంకాంగ్: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఓ వ్యక్తి మహిళపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హాంకాంగ్‌లోని ఎంటీఆర్ ట్రైన్లో జరిగింది. 13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న మహిళపై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో వ్యక్తి వారిని విడిపించేందుకు కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తిరిగి దాడి చేసేందుకు యత్నించింది. రద్దీగా ఉన్న ట్రైన్లో ఒక్కసారిగా గొడవ జరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు హోరాహోరీగా గొడవపడడం వల్ల పలువురు ప్రయాణికులు కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోను ‘టుడే రీవ్యూ67’ అనే ఫేస్బుక్ పేజీలో డిసెంబర్ 18న పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
గాలి శుభ్రం... తీరేను దాహం
ఫొటోలో వాటర్ డిస్పెన్సర్లా కనిపిస్తున్నది ఉత్త వాటర్ డిస్పెన్సర్ మాత్రమే కాదు, అంతకు మించిన అధునాతన యంత్రపరికరం. వాటర్ డిస్పెన్సర్ నుంచి నీరు రావాలంటే, అందులో నీరు నింపాల్సిందే! దీనికి ఆ అవసరమే లేదు. ఇది గాలిలోని తేమనే నీరుగా మార్చి సరఫరా చేస్తుంది. అంతే కాదు, గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా! ఇది టూ ఇన్ వన్ పరికరం. ఎయిర్ ప్యూరిఫయర్ కమ్ వాటర్ డిస్పెన్సర్. గదిలోని గాలిలో నిండి ఉండే దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవకణాలను పీల్చేసుకుని, గదిలోని గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంది. గాలిలోని తేమను ఒడిసిపట్టుకుని, నీటిగా మారుస్తుంది. ఇలా ఇది రోజుకు ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వేణ్ణీళ్లు కావాలంటే వేణ్ణీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లు క్షణాల్లో సరఫరా చేస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుంది. ‘టాప్ఫ్రెష్’ పేరిట ఒక హాంకాంగ్ కంపెనీ రూపొందించిన దీని ధర 399 డాలర్లు (సుమారు రూ.32 వేలు) మాత్రమే! -
హాంగ్ కాంగ్లో దీపావళి ధమాల్!
హాంగ్ కాంగ్లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదర్శిస్తూ, పిల్లలు - పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక షీలా సమతాని, మిస్ కోని వాంగ్, NAAC (The Neighbourhood Advice Action Council)-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు. ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యవర్గ సభ్యులు రమాదేవి సారంగా, రాధిక విశ్వనాథ్, కొండ మాధురి, హర్షిణి పచ్చoటి, రాజశేఖర్ మన్నే, వేమూరి విశ్వనాథ్, హరీన్ తుమ్మల, గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు. -
రికార్డ్ ధర పలికిన అరుదైన ‘పింక్’ వజ్రం.. ఎంతంటే?
హాంకాంగ్: అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర 21 మిలియన్ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్‌ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదీ చదవండి: 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్ -
భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది. Photo Courtesy: Mv Werften జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. Photo Courtesy: Mv Werften తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. Photo Courtesy: Mv Werften దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది. చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..! -
భారత్ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే రెండో జట్టుగా!
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ రికార్డులకెక్కింది. ఆసియాకప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 155 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. తద్వారా రికార్డును పాకిస్తాన్ తన ఖాతాలో వేసుకుంది. కాగా అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో స్ధానంలో ఉండేది. తాజా మ్యాచ్‌తో భారత్ రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఇక ఈ ఘనత సాధించిన జాబితా(ఐసీసీ ఫుల్ మెంబర్స్)లో శ్రీలంక మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2007లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సూపర్-4లో అడుగుపెట్టిన పాకిస్తాన్ ఇక హాంగ్ కాంగ్‌పై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో అడుగుపెట్టిన రెండో జట్టుగా నిలిచింది. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(78 పరుగులు నాటౌట్), ఫఖర్ జమాన్(53), కుష్దిల్ షా(35) పరుగులతో రాణించారు. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 4న) భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది. చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
6 బంతుల్లో 26 పరుగులు.. విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్! వీడియో వైరల్
ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి సూర్య విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా కేఎల్ రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా భారత్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన హరూన్ అర్షద్‌ను సూర్య రఫ్పాడించాడు. అతడి ఓవర్లో సూర్యకుమార్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. దాంట్లో నాలుగు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. తొలి మూడు బంతులను సిక్సర్లగా మలిచిన సూర్య.. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సూర్యకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Suryakumar Yadav 4 sixes back to back #INDvsHK #Surya pic.twitter.com/AOVt6T1wPc — DD Sports (@Mahesh13657481) August 31, 2022 చదవండి: Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ -
టాస్ ఓడిన భారత్, స్టార్ ప్లేయర్‌కు రెస్ట్.. పంత్‌కు ఛాన్స్
ఆసియా కప్ 2022లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 31) హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో.. టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ అనూహ్య మార్పు చేసింది. ఎవరూ ఊహించని విధంగా కీలక ప్లేయర్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తదుపరి కీలక మ్యాచ్‌లు ఉన్న దృష్ట్యా హార్ధిక్‌కు విశ్రాంతినిస్తున్నట్లు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. హార్ధిక్ స్థానంలో ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి పాక్‌పై గెలుపొందిన జట్టుతోనే టీమిండియా యధాతథంగా బరిలోకి దిగుతుంది. భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, అర్షదీప్ సింగ్ చదవండి: రోహిత్, బాబర్ సేనలకు భారీ షాక్ -
హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా
దుబాయ్: హోరాహోరీగా సాగిన పోరులో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు పసికూనతో తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నేడు హాంకాంగ్‌తో భారత్ తలపడుతుంది. ఏ రకంగా చూసినా టీమిండియాతో పోలిస్తే కనీస పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ప్రత్యర్థి జట్టు లేదు. సరిగ్గా చెప్పాలంటే నెట్స్‌లో కాకుండా మైదానంలో భారత్‌కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్‌లాగా భావించవచ్చు. టాప్–3 రోహిత్, రాహుల్, కోహ్లి దూకుడుగా ఆడి లయ అందుకునేందుకు ఈ మ్యాచ్ అవకాశం కల్పిస్తోంది. గత మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన రాహుల్ కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచేందుకు ఇది సరైన వేదిక. తొలి మ్యాచ్ ఫలితాన్ని బట్టి చూస్తే తుది జట్టులో మార్పులు ఉండరాదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తరచూ ప్రయోగాలు కొనసాగిస్తామని చెబుతున్నాడు కాబట్టి స్వల్ప మార్పులతో ఇతరులకు అవకాశం కల్పిస్తారా చూడాలి. పాక్‌తో మ్యాచ్‌లో కీపర్‌గా పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అదే కొనసాగిస్తారా లేక ఈ సారి పంత్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో అవేశ్‌కు బదులుగా స్పిన్నర్లు అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఓవరాల్‌గా భారత జట్టు ఫలితంపైనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలపైన కూడా దృష్టి పెట్టింది. మరోవైపు ఎక్కువగా భారత్, పాకిస్తాన్ల నుంచి వలస వచ్చిన వారితోనే హాంకాంగ్ జట్టు నిండి ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు టి20ల్లో తలపడలేదు. రెండుసార్లు వన్డేల్లో ఆడగా రెండూ భారత్ గెలిచింది. అయితే 2018లో ఇదే ఆసియా కప్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ విధించిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చి 26 పరుగులతో ఓడింది. కొంత కాలంగా వరుసగా నమీబియా, ఉగాండా, జెర్సీలాంటి జట్లతోనే తలపడుతూ వచ్చిన హాంకాంగ్‌కు ప్రస్తుతం భారత్‌ను ఎదుర్కోవడమే వారికి లభించిన పెద్ద అవకాశం. హాంకాంగ్ విజయావకాశాలు కెప్టెన్ నిజాకత్ ఖాన్, బాబర్ హయత్, కించిత్ షా, ఆయుష్ శుక్లాలపై ఆధారపడి ఉన్నాయి. చదవండి: IND Vs Hongkong: నాలుగేళ్ల క్రితం చెమటలు పట్టించారు.. లైట్ తీసుకుంటే అంతే! -
హాంకాంగ్‌తో మ్యాచ్.. జిమ్‌లో కష్టపడుతున్న కోహ్లి
పాకిస్తాన్‌పై విజయంతో టీమిండియా ఆసియాకప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చివరి వరకు నిలబడి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా ఇదే మ్యాచ్ కోహ్లికి వందో టి20 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోహ్లి తన వందో మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిప్టీ చేయడంలో విఫలమైనప్పటికి విజయంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇక బుధవారం హాంకాంగ్‌తో మ్యాచ్ నేపథ్యంలో కోహ్లి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌లో గంటపాటు కసరత్తులు చేసిన కోహ్లి.. దానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ''హాంకాంగ్‌తో మ్యాచ్‌కు సిద్ధం''.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక అంతకముందు పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌కు తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ చర్యతో కోహ్లి అభిమానుల మనసులు కూడా గెలుచుకున్నాడు. 🏋️♂️🫶 pic.twitter.com/g7u7GvDIae — Virat Kohli (@imVkohli) August 30, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు Asia Cup 2022: కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్ బదానికి తీవ్ర గాయం! -
నాలుగేళ్ల క్రితం చెమటలు పట్టించారు.. లైట్ తీసుకుంటే అంతే!
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై విజయం సాధించిన జోష్‌లో ఉన్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఆసియాకప్‌లో ఇరుజట్లు రెండుసార్లు తలపడ్డాయి. 2008లో ఒకసారి.. 2018లో రెండోసారి ఆడగా.. రెండింటిలోనూ టీమిండియాదే గెలుపు. అయితే హాంకాంగ్‌పై వచ్చిన రెండో విజయం మాత్రం అంత సులువుగా ఏం రాలేదు. 2018లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆ మ్యాచ్‌లో హాంకాంగ్.. టీమిండియాకు ముచ్చెమటలు పట్టించింది. దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లిన టీమిండియా.. చివరి నిమిషంలో విజయం సాధించి పరువు కాపాడుకుంది. అందుకే బుధవారం జరగనున్న మ్యాచ్‌లో హాంకాంగ్‌ను పసికూనే కదా అని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. అప్పటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 60, దినేశ్ కార్తీక్ 33, కేదార్ జాదవ్ 28 పరుగులు చేయగా ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు. అయితే 286 పరుగుల లక్ష్యఛేదనలో హంగ్ కాంగ్ ఓపెనర్లు అద్భుతంగా పోరాడారు. నిజకత్ ఖాన్ 92, అన్సీ రత్ 73 పరుగులు చేసి తొలి వికెట్‌కి 174 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఎంత మంది బౌలర్లను మార్చినా టీమిండియాకు 35వ ఓవర్ వరకూ వికెట్ దక్కలేదు. దీంతో హంగ్ కాంగ్ భారీ విజయం సాధించడం ఖామమనుకున్నారు. అయితే 34.1 ఓవర్లకు 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హంగ్‌కాంగ్.. 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులకి పరిమితమైంది. ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహాల్ మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు... ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ ఓడినప్పటికి వారు చూపించిన పోరాటం అద్భుతం. ఆఖర్లో అనుభవం ఉన్న ఒక్క హిట్టర్ ఉన్నా టీమిండియా పని ఖేల్‌ఖతం అయ్యేదే. అందుకే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Asia Cup 2022: కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్ బదానికి తీవ్ర గాయం! AFG Vs BAN: అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్ -
అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌హిట్ సాంగ్ ''కాలా చష్మా'' సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట వినిపిస్తుంది. తాజాగా ఆసియాకప్‌లో అర్హత సాధించామన్న ఆనందంలో హాంకాంగ్ జట్టు ''కాలా చష్మా'' పాటకు ఆ జట్టు ఆటగాళ్లు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇంతకముందు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంతోషంలో ధావన్, గిల్, ఇషాన్ కిషన్ సహా టీమిండియా ఆటగాళ్లు చేసిన కాలా చష్మా డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఊపేశాయి. కాగా హాంకాంగ్ జట్టు ఆసియాకప్ క్వాలిఫికేషన్ రౌండ్లో టేబుల్ టాపర్స్‌గా నిలిచి తుది టోర్నీకి అర్హత సాధించింది. కువైట్, యూఏఈ, సింగపూర్‌లతో క్వాలిఫై మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్ అన్నింటిలోనూ విజయాలు సాధించింది. తద్వారా టీమిండియా, పాకిస్తాన్లున్న గ్రూఫ్-ఏలో హాంకాంగ్ ఆడనుంది. గ్రూఫ్-బిగా ఉన్న మరొక దాంట్లో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు ఉన్నాయి. ఇక ఇవాళ(ఆగస్టు 27న) శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఆసియాకప్ 15వ ఎడిషన్‌కు తెరలేవనుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న(ఆదివారం) జరగనుంది. ఇక ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్ జరగ్గా.. భారత్ ఏడుసార్లు, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు నెగ్గాయి. View this post on Instagram A post shared by ESPNcricinfo (@espncricinfo) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. IND Vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా కోహ్లి! -
ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్.. భారత్, పాక్‌తో ఢీ!
ఆసియా కప్-2022 కు హాంకాంగ్ ఆరో జట్టుగా అర్హత సాధించింది. బుధవారం ఒమన్ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన అఖరి మ్యాచ్‌లో విజయం సాధించిన హాంకాంగ్ ఆసియా కప్‌లో అడుగు పెట్టింది. హాంకాంగ్ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్.. అన్నింటిలోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్ జట్లతో హాంకాంగ్ చేరింది. హాంకాంగ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. కాగా ఆసియాకప్-టీ20 ఫార్మాట్లో పాల్గొనడం ఇదే తొలి సారి. ఇక ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు మూడు సార్లు భాగమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 147 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో సీపీ రిజ్వాన్(49), ఫరీద్ (41) పరుగులతో రాణించారు. హాంకాంగ్ బౌలర్లలో ఇషాన్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..శుక్ల మూడు, ఆజీజ్ ఖాన్ రెండు వికెట్లు తీశారు. ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హాంకాంగ్ బ్యాటర్లో యాసిమ్ ముర్తాజా 58 పరుగులతో టాప్ స్కో్రర్గా నిలవగా.. నిజాకత్ ఖాన్ (39),బాబర్ హయత్(38) పరుగులతో రాణించారు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికాగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, బ్యాంక్ యాప్‌లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
రెండు నెలల్లో.. 40వేల కోట్లు పొగొట్టుకుందామె!
సొంత దేశం కోసం తప్ప.. వ్యక్తిగతంగా బాగుపడకూడదంటూ బిలియనీర్లపై పగబట్టింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా అపర కుబేరులపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రియలిటీ కింగ్‌గా ఉన్న ‘ఎవర్‌గ్రాండ్’ సైతం దివాళా దిశగా వెళ్లడం, అలీబాబా జాక్ మా లాంటి వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం లాంటివి గమనిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో.. చైనా దెబ్బకి హాంకాంగ్‌కు చెందిన ఓ బిలియనీర్.. తన సంపదలో దాదాపు 40 వేల కోట్లకు పైగా కోల్పోయింది. హువాబావో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో షేర్ల ధరలు ఏకంగా 67 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ చైర్ఉమెన్ చూ లమ్ వైయియూ(52) ను క్రమశిక్షణ ఉల్లంఘనల కింద చైనా ప్రభుత్వం విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు దారుణాతిదారుణంగా పతనం అవుతున్నాయి. చైనా దర్యాప్తు మొదలైందన్న విషయం తెలిశాక.. ఇన్వెస్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ ఎఫెక్ట్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లెయియాంగ్ సిటీకి చెందిన సూపర్వైజరీ కమిటీ ఒకటి.. చూ ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చూ లమ్ వైయియూ.. హువాబావో కంపెనీ చైర్ఉమెన్ మాత్రమే కాదు.. 71 శాతం వాటాతో సీఈవోగా కూడా కొనసాగుతున్నారు. నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇవాళ్టి(ఫిబ్రవరి 3)నాటికి 2.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే స్టాక్ ధరలు మరింత దిగజారుతాయనే భయంతో దర్యాప్తు దేని మీద సాగుతుందన్న వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది కంపెనీ. tobacco fragrance queenగా చూ కి మరో పేరుంది. అయితే హువాబావో కంపెనీ తరపున ఈ-సిగరెట్లను మైనర్లకు విక్రయించడం మీద అభ్యంతరాల నడుమే చైనా ప్రభుత్వం ఆమెపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. కానీ, చైనా పౌరసత్వం వదులుకుని మరీ ఆమె బిలియనీర్‌గా ఎదగడం ఓర్వ లేకే చైనా.. ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందన్నది హాంకాంగ్ వర్గాల కథనం. చూ కెరీర్ చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పుట్టిన చూ.. ఆపై హాంకాంగ్ పౌరసత్వం తీసుకుంది. కాలేజీ రోజుల్లోనే హువాబావో పేరిట చూ లాం వైయియూ.. అత్తరు వ్యాపారాన్ని కొనసాగించింది. 1966లో కంపెనీని మొదలుపెట్టిన ఆమె.. పదేళ్ల తర్వాత కంపెనీని ఐపీవోకి తీసుకెళ్లింది. ఐదవ సీపీపీ సీసీసీ (Chinese People's Political Consultative Conference Committee)లో ఆమె సభ్యురాలిగా కూడా పని చేసింది. వారసుడిని వ్యాపారంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉండగానే.. ఆమెకు ఈ ఎదురు దెబ్బ తగడం విశేషం. -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం..!
పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కాగా కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందనే అపోహాలతో తిరిగి సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారికోసం హాంకాంగ్‌కు చెందిన బ్యాటరీ కంపెనీ డెస్టెన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! డెస్టెన్ తయారుచేసిన బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని పేర్కొంది. 900 kW అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో బ్యాటరీలు మెరుపువేగంతో ఛార్జ్ చేయబడతాయని డెస్టెన్ వెల్లడించింది. డెస్టెన్ అభివృద్ధి చేస్తోన్న బ్యాటరీ టెక్నాలజీ పిచ్జిటి ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో వాడే 75kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతోందని డెస్టెన్ పేర్కొంది. డెస్టెన్ బ్యాటరీలు మార్కెట్లలోకి వస్తే ఛార్జింగ్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చును. పిచ్జిటి సింగిల్ ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణించనుంది. డెస్టెన్ తన కంపెనీ బ్యాటరీలపై 3 వేల ఛార్జింగ్ సైకిల్స్, 15 లక్షల కిలోమీటర్ల రేంజ్ వ్యారంటీని కూడ అందిస్తోంది. అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సమయంలో బ్యాటరీలు వెడేక్కకుండా కూలింగ్ టెక్నాలజీను రానున్నాయి. చదవండి: ఫేస్బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్రయ్ అంటూ రాకెట్లా..! -
కరోనా సెకండ్ వేవ్: హాంకాంగ్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. రోజు రోజుకు కరోనా ఉధృతి రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-హాంకాంగ్‌మధ్య విమాన రాకపోకలను నిలిపివేయాలని హాంకాంగ్ విమానాయాన శాఖ నిర్ణయించింది. ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ ఏప్రిల్ 20నుంచి మే2 వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు) భారత్‌నుంచి హాంకాంగ్ చేరుకున్న ప్రయాణికుల్లోనూ ముగ్గురికి వైరస్ఉందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. అలాగే పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చే విమానాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్. ఈ నెలలోనే రెండు విస్టారా విమానాల 50 మంది ప్రయాణికులు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ఆర్టీపీసీఆర్ ఫలితంలో 72గంటల ముందు నెగెటివ్ వస్తేనే ప్రయాణించాల్సి ఉంది. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాల్లోని ప్రయాణికులకు 47మంది వరకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 19వరకూ ఆ మార్గంలోని విమానాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. (కరోనా సెగ : రుపీ ఢమాల్) -
షియోమీ కీలక నిర్ణయం
ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటైన షియోమీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా కంపెనీ షియోమీ అడుగుపెట్టింది. వచ్చే దశాబ్దంలో ఈ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 10 బిలియన్ యువాన్(1.52 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో ప్రారంభ దశలో స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది. 2035 నాటికి చైనాలో కొత్త వాహనాల అమ్మకాలలో సగం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతాయని గత ఏడాది విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భవిష్యత్ లో భారీగా పెరుగుతాయనే నమ్మకంతో దానిని క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కస్టమర్ బేస్, తయారీ కేంద్రంగా ఇప్పటికే చైనా ముందంజలో ఉంది. షియోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీ జున్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారానికి అధిపతిగా పనిచేయనున్నారు. స్మార్ట్ మొబిలిటీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఆటో తయారీదారు జెజియాంగ్ గీలీ హోల్డింగ్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే చైనా బ్రాండ్లు ఎక్స్‌పెంగ్, లి ఆటో రెండూ ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. చదవండి: శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు -
లాక్డౌన్.. 48 గంటల్లోగా టెస్టింగ్
హాంకాంగ్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్డౌన్ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, అప్పటివరకు వారంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం (ఐసీసీ)కి దగ్గరగా ఉన్న ఈ నిషేధిత ప్రాంతంలో గత కొన్నిరోజులుగా జోర్దాన్ నుంచి అనేకమంది వచ్చారు. దీంతో వీరి వల్లే వైరస్ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో 70కి పైగా నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 48 గంటల్లోగా టెస్టింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. (మోడల్ క్రేజ్.. ఫాలో అవుతోన్న బైడెన్) ఈ ప్రాంతంలో వృద్దాప్య జనాభా ఎక్కువగా ఉన్నందున కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా టెస్టింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 50 టెస్టింగ్ పాయింట్లను ఏర్పటు చేశారు. ఇప్పటికే ఈనెలలో 162కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిమ్, క్రీడా ప్రాంగణాలు, సెలూన్లు, సినిమా హాళ్లపై విధించిన నిషేధాన్ని జనవరి 27వరకు ప్రభుత్వం పొడిగించింది. గత 24 గంటల్లోనే హాంకాంగ్‌లో 81 కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,010కి చేరగా, ఇప్పటివరకు 160మంది కోవిడ్‌కు బలయ్యారు. (భారత్‌ను హనుమాన్తో పోల్చిన బ్రెజిల్ అధ్యక్షుడు) -
వివో నుండి మరో బడ్జెట్ ఫోన్
మొబైల్ ప్రపంచంలో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివో తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో మరో మొబైల్ ని తీసుకువచ్చింది. "వివో వై12ఎస్" పేరుతో హాంకాంగ్ మరియు వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించింది. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వి 10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఫాంటం బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభించనున్నాయి. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు 270 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా, అలాగే ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భారతదేశంలో వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ .11,999గా ఉండనుంది. -
ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆగస్టు18న హాంకాంగ్ ఎయిరిండియా విమానాలను ఆగస్టు 31వరకు సస్పెండ్ చేసింది. ఇది రెండో నిషేధం. (ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ) ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్తో ప్రయాణం చేసినప్పటికీ వారికి వ్యాధి నిర్ధారణ జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. కాగా ఇదే ఆరోపణలతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. (ఎయిరిండియా విమానాలపై నిషేధం) -
కరోనా: భయపెడుతున్న హాంకాంగ్ కేసు
హాంకాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్ రూపాన్ని మార్చుకుంటూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికి మలేషియాలో వెలుగు చూసిన కేసుల్లో కరోనా వైరస్ రూపాన్ని మార్చుకోవడమే కాక 10 రెట్లు ప్రమాదకరంగా మారినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాంకాంగ్‌లో వెలుగు చూసిన ఓ కేసు మరింత ఆందోళన కలిగిస్తుంది. మూడు నెలల క్రితం మహమ్మారి బారిన పడిన వ్యక్తికి మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు హాంకాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆగస్టు మధ్యలో స్పెయిన్ పర్యటన నుంచి హాంకాంగ్‌కు తిరిగి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ భిన్నమైన జాతి లక్షణాలు ఉన్నట్లు జన్యు పరీక్షలలో వెల్లడయ్యింది. సదరు వ్యక్తి మార్చిలో కరోనా బారిన పడి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కెల్విన్ కై మాట్లాడుతూ.. ‘ఈ వ్యక్తికి మొదటిసారి కరోనా వచ్చినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపించాయి. కానీ రెండవసారి అసలు ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. అతనికి రెండో సారి కరోనా వచ్చినట్లు హాంకాంగ్ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ ద్వారా తెలిసింది. దీన్ని బట్టి కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి జీవితం కాలం ఉండటం లేదని తెలియడమే కాక కొందరు రెండో సారి వైరస్ బారిన పడుతున్నట్లు అర్థమయ్యింది. అయితే ఎంత మందిలో ఇలా జరుగుతుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేం’ అన్నారు. (ప్లాస్మా థెరపీ: అమెరికా ఆమోదం!) ప్రస్తుతం వెలుగు చూసిన కేసు వల్ల పలు కీలకాంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అనేక చిక్కులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ‘ముఖ్యంగా వ్యాక్సిన్ అభివృద్ధి, పాఠశాలలు తెరవడం, పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక కార్యకలాపాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాక రెండో సారి వైరస్ బారిన పడివారిలో తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా వారి రోగ నిరోధక శక్తి కాపాడుతుంది, లేనిది ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఎదుర్కొన్న వైరస్ల విషయంలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీలను ఎలా తయారుచేయాలో గుర్తుంచుకుంటుంది’ అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే రెండో సారి వైరస్ బారిన పడిన వారిలో ఎంత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలియదు. కనుక ఇప్పటికే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వాటిని తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక వీరి ద్వారా వైరస్ మరికొందరికి వ్యాపిస్తుంది లేనిది అనే దాని గురించి ఇంకా స్పష్టం తెలియదు అంటున్నారున నిపుణులు. -
హాంగ్‌కాంగ్ ఆందోళనలపై స్పందించిన భారత్
-
అమెరికా పౌరులకు చైనా వార్నింగ్!
బీజింగ్: వివాదాస్పద నేషనల్ సెక్యూరిటి బిల్లుకు బీజింగ్ నుంచి అనుమతి లభిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లలో అమెరికా పౌరులు పాల్గొన్నా లేదా ఇలాంటి వాటికి మద్దతు తెలిపిన వారి వీసాల మీద నిబంధనలు విధిస్తామని చైనా సోమవారం హెచ్చరించింది. (హాంకాంగ్ ఆందోళనలు తీవ్రతరం) ఈ విషయం పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జాహు లిజ్జాన్ మాట్లాడుతూ, హాంకాంగ్ నేషనల్ సెక్యూరిటీ బిల్లును అడ్డుకునే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చిరించారు. అమెరికా పౌరులు చేసే పనులకు వ్యతిరేకంగా చైనా వీసా మీద ఆంక్షలు విధించాలనుకుంటుందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక విషయాలలో కలుగజేసుకుంటున్నారనే అభియోగంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత మంది చైనా అధికారులపై శుక్రవారం వీసా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (హాంగ్కాగుతోంది..) -
హాంకాంగ్‌లో అగ్గి
-
ఇప్పటికి ఒకటయ్యాయి
మనుషుల సంచారం లేకపోవడంతో ‘జూ’లో జంతువులు కూడా ఉల్లాసంగా ఉంటున్నాయి. హాంకాంగ్‌లోని ‘ఓషన్ పార్క్’ జూ లో.. పదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కనాడూ కలవని ఇంగ్ ఇంగ్, లె లె అనే పాండాల ఆడామగ జంట ఈ లాక్డౌన్ లో తమంతట తామే కలవడం జూ సంరక్షణ అధికారులకు గొప్ప సంతోషకరమైన విషయం అయింది. పద్నాలుగేళ్ల వయసున్న పాండాలవి. ఈడూజోడుగా ఉన్నా ఏనాడూ ఒకదానిలో ఒకటి తోడు వెతుక్కోడానికి అవి ఆసక్తి చూపలేదట. ఇన్నాళ్లకు వాళ్ల కల ఫలించింది. పాండాల జీవిత కాలం ఇరవై ఏళ్ల వరకు ఉంటుంది. ఇంగ్ ఇంగ్, లె లె.. జీవితం మొత్తం ఇలాగే నిస్సారంగా, నిర్లిప్తంగా ఉండిపోతాయేమోనని అనుకున్న అధికారులకు వాటి కలయిక ఊహించని వరమే. -
కరోనా ఎఫెక్ట్ : రూ 8000 కోట్ల నష్టం
అహ్మదాబాద్ : చైనాలో కరోనా వైరస్ కలకలంతో సూరత్ డైమండ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సూరత్ నుంచి వజ్రాలు ఎగుమతయ్యే హాంకాంగ్‌లో కరోనా వైరస్ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో రానున్న రెండు నెలల్లో ఇక్కడి డైమండ్ పరిశ్రమకు దాదాపు రూ 8000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తితో హాంకాంగ్‌లో మార్చి తొలివారం వరకూ స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. మరోవైపు వైరస్ భయంతో వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. సూరత్ నుంచి హాంకాంగ్‌కు ఏటా రూ 50,000 కోట్ల విలువైన పాలిష్డ్ వజ్రాలు ఎగుమతవుతాయని, ఇక్కడి నుంచి డైమండ్ ఎగుమతుల్లో ఇవి 37 శాతమని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ చైర్మన్ దినేష్ నవదియా పేర్కొన్నారు. హాంకాంగ్‌లో నెలరోజుల పాటు సెలవులు ప్రకటించడంతో అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తున్న గుజరాతీ వ్యాపారులు భారత్‌కు తిరిగి వస్తున్నారని చెప్పారు. హాంకాంగ్‌లో పరిస్థితి మెరుగుపడకుంటే సూరత్ డైమండ్ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరోనా వైరస్ కలకలంతో వచ్చే నెలలో హాంకాంగ్‌లో జరగనున్న అంతర్జాతీయ జ్యూవెలరీ ఎగ్జిబిషన్ రద్దయ్యే అవకాశం ఉందని, ఇదే జరిగితే సూరత్‌లో జ్యూవెలరీ వ్యాపారానికి భారీ షాక్ తప్పదని డైమండ్ వ్యాపారి ప్రవీణ్ నానావతి చెప్పుకొచ్చారు. చైనాకు ముఖద్వారంగా భావించే హాంకాంగ్‌లో ఇప్పటికే 18 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించగా ఓ వ్యక్తి మరణించారని అధికారులు తెలిపారు. చదవండి : తిరగడానికి దెయ్యాలు కూడా భయపడతాయి.. -
హాంగ్కాగుతోంది..
ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి. హాంకాంగ్ ఉద్యమం ఈ ఏడాది చైనా అహంకారపూరిత ధోరణికి ఒక హెచ్చరికలాంటిది. -
హాంకాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి
హాంకాంగ్ : హాంకాంగ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి చెట్టును బలంగా డీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, 12 మంది మృత్యువాత పడ్డారు. బస్సు చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ఒంగిపోవడంతో పాటు అద్దాలు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు కూర్చున్న సీట్ల పక్కకు కుంచించికపోవడంతో చిందర వందరగా తయారైంది.దీంతో ప్రయాణికులను బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బస్సు పైభాగం ద్వారా లోపలికి ప్రవేశించి మృతదేహాలను బయటికి తీశారు.ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారని, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో చనిపోయిన ఐదుగురుని బ్లాక్బాక్స్ల్లో పెట్టి చైనాకు దగ్గర్లోని క్వాతుంగ్ ఆసుపత్రి మార్చురికీ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రవాణామార్గం కలిగిన హాంకాంగ్‌లో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. ఇంతకుముందు ఇదే తరహాలో ఫిబ్రవరి 2018లో అతివేగంతో వెళుతున్న డబుల్‌డెక్కర్ బస్సు ప్రమాదానికి గురవడంతో 19మంది మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు. -
హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
-
మాల్లో రెచ్చిపోయిన నిరసనకారులు
హాంకాంగ్ : హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్లో నిరసనకారుల ప్రదర్శన విధ్వంసకాండకు దారితీసింది. కత్తితో ఓ వ్యక్తి విరుచుకుపడటంతో పలువురు గాయపడ్డారు. ఘర్షణల్లో రాజకీయ నేత చెవికి తీవ్ర గాయమైంది. టైకూషింగ్ నగరంలోని సిటీప్లాజా ఆందోళనకారులు పోలీసులు బాహాబాహీకి దిగడంతో రక్తసిక్తమైంది. ఘర్షణలతో మాల్లోని ఎస్కలేటర్లపై నిరసనకారులు, మహిళలు, చిన్నారులు పరుగులు పెట్టారు.1997 లో చైనా గుప్పిట్లోకి వచ్చిన మాజీ బ్రిటిష్ కాలనీలో చైనా జోక్యం చేసుకోవడాన్ని ఆగ్రహించిన హాంకాంగ్ ప్రజలు వారాంతాల్లో భారీ నిరసనలకు దిగుతున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా సిటీప్లాజా మాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు మాల్లోని రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. వైట్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి కత్తితో దాడి చేశాడన్న అనుమానంతో పలువురు అతడిని చితకబాదారు. మాల్ వెలుపల పేవ్‌మెంట్‌పై మరో వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో డెముక్రటిక్ జిల్లా కౌన్సిలర్ అండ్రూ చూ ఉన్నారని, ఆయన చెవి నుంచి రక్తం కారుతోందని తెలిపారు. భాష్పవాయు గోళాలతో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. -
హాంకాంగ్ ఆందోళనలు తీవ్రతరం
హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్‌ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు నేడు సమ్మెకు పిలుపునివ్వగా ప్రజలంతా నల్ల రంగు దుస్తులు ధరించాలని వివిధ సంఘాలు కోరాయి. కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మంగళవారం నుంచి 70వ అవతరణ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో అలజడులు కొనసాగుతుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జాతీయ దినోత్సవాల్లో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లనున్నట్లు హాంకాంగ్ పాలకురాలు లామ్ ప్రకటించారు. నేర చరితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు నాలుగు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటన్ నుంచి చైనా ప్రధాన భూభాగంలో కలిసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2047 వరకు హాంకాంగ్‌లో వారికి స్వతంత్ర న్యాయవ్యవస్థ, వాక్ స్వాతంత్య్రం హక్కు కల్పించారు. అయితే, చైనా ప్రభుత్వం ఇప్పటికే వాటిని దూరం చేసిందని హాంకాంగ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఐస్ క్రీమ్ కోసం గొడవ.. ప్రియుడ్ని కత్తెరతో..
హాంకాంగ్ : ఐస్ క్రీమ్ తిననివ్వలేదనే మండిపాటు.. లావుగా ఉన్నావంటూ ఎగతాళి చేశాడనే కోపంతో ప్రియుడిపై కత్తెరతో దాడి చేసి చంపిందో యువతి. ఈ సంఘటన చైనాలోని ఝుమాడియాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సెంట్రల్ చైనాలోని ఝుమాడియాన్‌కు చెందిన ఝాంగ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన వాంగ్ అనే యువతితో 20 రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి తిరగటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 14వ తేదీన ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ వాంగ్ తనకు ఐస్ క్రీమ్ కావాలని అడగటంతో ఝాంగ్ ఆమెను ‘‘ అసలే లావుగా ఉన్నావు! నీకు ఐస్ క్రీమ్ అవసరమా?’ అంటూ ఎగతాళి చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన వాంగ్ దగ్గరలోని షాపులో కత్తెర కొనుగోలు చేసుకుని వచ్చి, దానితో ప్రియుడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఝాంగ్‌ను గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ఝాంగ్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
హాంకాంగ్ విమానాశ్రయంలో నిరసనలు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు. నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది. -
హాంగ్‌కాంగ్ ఎయిర్పోర్ట్ నిర్భందం
హాంగ్‌కాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు ఇంకా తీవ్రమవుతున్నాయి. తాజాగా నిరసనకారులు ఎయిర్‌పోర్ట్‌ని స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నల్ల దుస్తులు ధరించి వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి నాలుగురోజుల పాటు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు విమాన ప్రయాణాలను రద్దుచేసి తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ చర్యతో హాంగ్‌కాంగ్‌లోని భారీ విమానయాన సంస్థ కథాయ్ ఫసిఫిక్ ఎయిర్వేస్ షేర్లు ఒక్కరోజులోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాగా, ఈ ఆందోళనలపై చైనా సీరియస్ అయింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చేష్టల్లా ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడింది. భవిష్యత్ మంచిగా ఉండాలని కోరుకునేవారు హింసను కోరుకోరని వ్యాఖ్యానించింది. హాంగ్‌కాంగ్ వివాదం నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని ప్రతిపాదిస్తూ హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, హాంగ్‌కాంగ్ చీఫ్ కారీ లామ్ ఈ బిల్లు అంశాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, లామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చైనా ప్రభుత్వం లామ్‌కు మద్దతుగా నిలిచింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించింది. దీంతో, హాంగ్‌కాంగ్ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్ట్ చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య హాంగ్‌కాంగ్ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు సాధారణమయ్యాయి. హాంగ్‌కాంగ్‌లో అశాంతియుత వాతావరణం సృష్టించేందుకు పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, హాంగ్‌కాంగ్‌ను చైనా నుంచి విడదీయడానికే ఈ నిరసనలని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. చైనా ఏకపక్ష విధానాలు రుద్దుతోందంటూ మెజార్టీ హాంగ్‌కాంగ్ ప్రజలు నిరసిస్తున్నారు. -
అత్యంత ఖరీదైన నగరం అదే!
న్యూయార్క్ : విదేశీయులకు ఆశ్రయం కల్పించే దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది.వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 లో రెడ్-హాట్ హౌసింగ్ మార్కెట్, కరెన్సీలో హెచ్చుతగ్గుల కారణంగా యుఎస్ డాలర్‌తో పోటీని తట్టుకొని మొదటి స్థానంలో నిలిచింది. మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక ప్రమాణాలు పాటించినందు వల్లే ప్రపంచం హాంకాంగ్ వైపు చూస్తుందని మెర్సెర్ ఆసియా, మిడిల్ ఈస్ట్, గ్లోబల్ మొబిలిటీ ప్రాక్టీస్ లీడర్ మారియో ఫెరారో అన్నారు. ఈ మేరకు కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ తన వార్షిక నివేదికను వెల్లడించింది. ఇక.. ఈ ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ లో టాప్ 10 నగరాల్లో ఎనిమిది ఆసియాలోనే ఉండటం విశేషం. ఈ జాబితాలో టోక్యో రెండో స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో సింగపూర్, సియోల్, జూరిచ్ షాంఘైలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ చివరి స్థానంలో నిలిచింది. దిగుమతి విపరీతంగా పెరగడం, కరెన్సీ కొరత ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు.. డాలర్ క్రమేపీ బలపడడం వల్ల యుఎస్ఏలోని అనేక నగరాలు ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్నాయి. ‘బిగ్ ఆపిల్’ సిటీ న్యూయార్క్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి 10 స్థానాల్లోకి ప్రవేశించగా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వరుసగా 16 ,18 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో డాలర్‌తో పోటీపడలేక అనేక యూరోపియన్ నగరాలు వెనుకంజలో ఉన్నాయి. ఇందుకు వివిధ దేశాలతో ముదిరిన వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ అంశాలను ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. ఇక ఈ తాజా నివేదికలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ 47 వ స్థానంలో, జర్మన్ నగరాలు బెర్లిన్, డ్యూసెల్డార్ఫ్ స్టుట్గార్ట్ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. కాగా ప్రపంచంలోని 209 నగరాల ఆధారంగా మెర్సెర్ ప్రతీ ఏటా ఈ ర్యాంకింగ్ ఇస్తోంది. ప్రతి ప్రదేశంలో 200 కి పైగా వస్తువుల వ్యయాన్ని అంచనా వేసి ఈ మేరకు ఖరీదైన నగరాల నివేదిక వెల్లడిస్తుంది. ఇందుకు గృహ, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర అంశాలను కొలమానాలుగా తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన వసతి సేవలు,సౌకర్యాల వల్ల విదేశీయుల అక్కడ నివసించేందుకు నిర్వాసితులు మొగ్గు చూపిస్తున్నారని ఫెరారో తెలిపారు. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెనకబడడానికి డాలర్‌తో పోటీ పడలేకపోవడమే కారణంగా చెప్పవచ్చు.ఆస్ట్రేలియా ప్రధాన నగరం సిడ్ని 50వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే మొంబై 67వ స్థానంలో నిలవగా న్యూఢిల్లీ 118 వ స్థానంలో నిలిచింది. తక్కువ ఖరీదైన నగరాల జాబితాల్లో ట్యునీషియా ప్రాంతానికి చెందిన ట్యునీస్ నిలవగా ,ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్, పాకిస్తాన్‌కి చెందిన కరాచీ తరువాత స్థానాల్లో నిలిచాయి. -
బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్.. 94 కోట్లు లూటీ!
సాక్షి, పుణె: దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు మరో అరాచకానికి పాల్పడ్డారు. తాజాగా ఏకంగా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి కోట్లు లూటీ చేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గరగా ఉండే పుణెలో జరిగింది. దేశంలోనే పేరుమోసిన కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్‌ను మాల్వేర్ సహాయంతో హ్యాక్‌చేసి దాదపు రూ. 94 కోట్లు దోచుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్ అధికారులు చత్రుశింగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు, సైబర్ క్రైం అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. అసలు విషయమేమిటంటే ఈ నెల ఆగస్టు 11న హ్యాకర్లు మాల్వేర్ సాయంతో బ్యాంక్ కస్టమర్ల రూపే, వీసా కార్డుల వివరాలను సేకరించి క్లోన్ చేసి దాదాపు 78 కోట్ల రూపాయలను గుర్తు తెలియని పన్నెండు వేల విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. అదే రోజు రెండున్నర కోట్లు స్వదేశీ అకౌంట్లకు బదీలీ చేశారు. ఆగస్టు 13న హాంగ్‌కాంగ్‌కు చెందిన బ్యాంక్ ఆకౌంట్లకు 13.92కోట్లు స్విఫ్ట్ పద్దతిన ట్రాన్స్ఫర్ చేశారని అధికారులు వివరించారు. హాంగ్‌కాంగ్, స్విస్, భారత్ వేదికగా ఈ హ్యాక్ జరిగి ఉంటుందని సైబర్ క్రైం అధికారులు అనుమానం. మీ డబ్బులు ఎటూ పోలేదు కాస్మోస్ కోపరేటివ్ బ్యాంక్ హ్యాక్‌కు గురైందని తెలిసిన వెంటనే ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ గోఖలే స్పందించారు. హ్యాక్ కు గురైంది బ్యాంక్ అకౌంట్లు మాత్రమేనని, ఖాతాదారుల వ్యక్తిగత అకౌంట్లు కాదని పేర్కొన్నారు. ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ డబ్బులు ఎటూ పోలేదని భరోసా ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల మరోసారి బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్చేయడానికి ప్రయత్నం చేశారని కానీ బ్యాంక్ ఫైర్‌వాల్ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందని వివరించారు. ఓవరాల్‌గా మొత్తం ఎంత డబ్యు లూటీకి గురైందో బ్యాంక్ ఆడిట్లో స్పష్టంగా తెలస్తుందని గోఖలే తెలిపారు. -
నీళ్ల పైపులో నివాసం.. విలాసవంతమైన ఇళ్లు!
నీళ్ల పైపులో ఎక్కడైనా నివాసముంటారా? అందులో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉంటాయ? అని విస్తుపోతున్నారా? ఔను.. నిజమే నీళ్లపైపులోనూ హాయిగా నివాసముండవచ్చునని ఓ హాంగ్‌కాంగ్ ఆర్కిటెక్చర్ నిరూపించారు. ఆయన తాజాగా ట్యూబ్ హోమ్స్ సృష్టించారు. ఇవి మాములు ఇళ్లు కావు.. విలాసవంతమైన హంగులతో, కేవలం 8.2 అడుగుల వెడల్పుతో ఉండే ఈ ఇళ్లు. ఇందులోని సోఫానే మంచంగా కూడా వాడుకోవచ్చు, షవర్‌తో కూడిన బాత్రూం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. అయినా శుభ్రంగా ఇల్లు కట్టుకోక.. ఎందుకు ఈ ఇరుకు పైపుల్లో అంటారా? హంగ్ కాంగ్లో పెరిగిపోతున్న జనాభాకు సరిపడా ఇళ్లు లేవు. ఈ సమస్యను అధిగమించాడానికే జేమ్స్ లా అనే వ్యకి వీటిని రూపొందించారు. ఈయనో పెద్ద ఆర్కిటెక్.. సౌకర్యాలు... ఈ పైపు ఇంట్లో విలాసవంతమైన సౌకర్యాలకు ఏం కొదవ లేదు. ఈ చిన్ని ఇంట్లో కూర్చోడానికి సోఫా ఉంటుంది. మడత తీస్తే అదే మంచంగా ఒదిగిపోతుంది. దాంతోపాటు మిని ఫ్రీజ్ కుడా ఉంది. ఇంకా స్నానం చేయడానికి షవర్‌తో కూడిన బాత్రూం అందుబాటులో ఉంది. ప్రశాంతంగా సోఫాలో కుర్చోని టీవీ కూడా చూసేయొచ్చు. ఉపయోగాలు.. ఈ ట్యూబ్ హోమ్స్‌తో చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు జేమ్స్ లా. హంగ్ కాంగ్లో జనాభా పెరిగిపోయింది. ఉండాటానికి ఇళ్లు సరిపడా లేవు. ఉన్నా వాటిని కొనుగోలు చేయాలంటే.. చాలా ఖరీదుతో కూడిన వ్యవహరం. చాలా మంది ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అక్కడ అద్దె కుడా చాలా ఎక్కువ. చాలా మంది ప్రజలు ఇరుకైన ఇళ్లలో అధిక అద్దెను చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి కోసం, దేశంలోని నివాసాల కొరతను తగ్గించడానికే తను ఈ ట్యూబ్ ఇళ్లను కనిపెట్టినట్టు చెబుతున్నారు జేమ్స్ లా. మరీ ధర సంగతి.. ఈ చిన్న చిన్న ఇళ్లు మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, వీటి ధర కుడా చాలా చౌకేనని అంటున్నారు వీటి రూపకర్త జేమ్స్ లా. వీటి ధర 15000 డాలర్లు మాత్రమే. సాధారణంగా హంగ్ కాంగ్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 1.8 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. దాంతో పోల్చి చూస్తే ఇది చాలా చౌక. వీటిని ఎక్కడా కట్టుకోవచ్చు? ఈ ట్యూబ్ హోమ్స్ నిర్మించే ఒక్కో పైపు బరువు 22 టన్నులు ఉంటుంది. వీటిని ఒక దానిపై ఒకటి పెట్టుకోవచ్చు. అలా పెట్టేటప్పుడు వాటికి బోల్ట్ కూడా బిగించాల్సిన అవసరం లేదు. పనికిరాని ప్రదేశాలలో, భవనాల మధ్య ఖాళీ స్థలంలో, హైవే ఫ్లైఓవర్ల కింద, బ్రిడ్జిల కింద కుడా వీటిని అమర్చవచ్చు. అధికారుల నుంచి అనుమతులు రాగానే వీటిని తయారుచేసి విక్రయిస్తాం అన్నారు. ఇప్పటికైతే ఈ పైపు ఇల్లు నమునాగానే ఉన్న భవిష్యత్తులో నిజం కాబోతుంది. ట్యూబ్ హోమ్స్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.. -
హాంకాంగ్‌లో జిల్లా వాసి మృతి
రాజపురం (పోలాకి) : మండలంలోని రాజపురం గ్రామానికి చెందిన బచ్చు క్రిష్ణారెడ్డి (34) అనే యువకుడు ప్రమాదవశాత్తు హాంకాంగ్‌లో ఇటీవల మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వృత్తిరీత్యా సీమెన్‌గా పని చేస్తున్న క్రిష్ణారెడ్డి ఆగస్టు 17వ తేదీన మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరేళ్లుగా సీమెన్‌గా పని చేస్తున్న మృతుడు ఇంజిన్ ఫిట్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. షిప్లో ఇంజిన్ ఎడ్జెస్ట్‌వాల్ సరిచేస్తుండగా ఇనుప హుక్ తలకు తగిలి ప్రమాదం జరిగిందని ముంబయిలోని సీజ్‌పాన్ షిప్పింగ్ కంపెనీ నుండి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అక్కడే పోస్టుమార్టం నివేదికలు పూర్తయ్యాయి. మృతదేహం రాజపురానికి గురువారం వచ్చే అవకాశం ఉంది. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
తెలంగాణలో అపార అవకాశాలు
⇒ హాంకాంగ్‌లో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ ⇒ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ ⇒ భారీగా పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం ⇒ హాంకాంగ్‌లో తెలంగాణ రోడ్‌షో సాక్షి, హైదరాబాద్: హాంకాంగ్, తైవాన్ పర్యటనకు వెళ్లిన ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు ఆర్థిక సేవలను అందించే కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రోడ్‌షో-ఇంటరాక్టివ్ సెషన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలను, పెట్టుబడులకు లభించే విలువను రోడ్‌షోకు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చౌకగా లభించే మౌలికవసతులపై వారికి అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానం, స్థానికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభినందించారని కేటీఆర్ చెప్పారు. ఈ సెషన్లో పాల్గొన్న ప్రముఖ కంపెనీల్లో ఎక్కువ శాతం ఆర్థిక సేవలందించేవే కనుక, తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆశాభవం వ్యక్తంచేశారు. అనంతరం స్టార్టప్ కంపెనీలకు సేవలందించే సైబర్ పోర్టు కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీ-హబ్‌కు సైబర్ పోర్ట్ సహకారం కావాలని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి మార్క్వో క్లిఫ్ట్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ , సీఐఐ హైదరాబాద్ చైర్మన్ వనితా దాట్ల, హాంకాంగ్ కాన్సుల్ ఆఫ్ ఇండియా ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ హాంకాంగ్ చైర్మన్ ఎం.అరుణాచలం పాల్గొన్నారు. -
భారత జట్ల శుభారంభం
ఆసియా స్క్వాష్ హాంకాంగ్: ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన దీపికా పల్లికల్ సారథ్యంలోని భారత మహిళల జట్టు బుధవారం ఇరాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లో 3-0 తేడాతో గెలుపొందింది. సౌరవ్ ఘోషల్ నేతృత్వంలోని పురుషుల జట్టు కూడా 3-0 తేడాతోనే ఇరాన్‌పై విజయం సాధించింది. మహిళల జట్టులో దీపిక 11-5, 11-0, 11-5తో డోలాటిజడెహ్పై గెలుపొందగా, జోష్నా చినప్ప 11-6, 11-4, 11-7తో మౌసావిజడెహ్పై, అనకా అలంకమొని 11-5, 11-1, 11-3తో హైదరీ ఫతేమేపై గెలిచి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్నందించారు. ఇక పురుషుల జట్టులో సౌరవ్ 11-4, 11-5, 11-3తో మొహమ్మద్ రెజాను ఓడించగా, మహేశ్ మంగోంకర్ 11-3, 11-5, 11-4తో మలెస్కమెట్ నవీద్‌పై, హరిందర్‌పాల్ సింగ్ 11-6, 11-8, 12-10తో మహమ్మద్ హొస్సేన్‌పై గెలుపొందారు. -
ఓడినా...బంగ్లా క్వాలిఫై
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడినా.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ 2 వికెట్ల తేడాతో బంగ్లాపై నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తర్వాత హాంకాంగ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఇర్ఫాన్ (34), మునీర్ దార్ (36) రాణించారు. మరో మ్యాచ్‌లో నేపాల్ 9 పరుగుల తేడాతో అప్ఘానిస్థాన్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. సుభాష్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత అఫ్ఘాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకు పరిమితమైంది. గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా నేడు జింబాబ్వే-యూఏఈ; నెదర్లాండ్స్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.