ఓడినా...బంగ్లా క్వాలిఫై | Bangladesh qualified for the Super 10 phase at the World Twenty20 despite a surprise loss to Hong Kong. | Sakshi
Sakshi News home page

ఓడినా...బంగ్లా క్వాలిఫై

Published Fri, Mar 21 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

Bangladesh qualified for the Super 10 phase at the World Twenty20 despite a surprise loss to Hong Kong.

 చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడినా.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ 2 వికెట్ల తేడాతో బంగ్లాపై నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తర్వాత హాంకాంగ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఇర్ఫాన్ (34), మునీర్ దార్ (36) రాణించారు.
 
  మరో మ్యాచ్‌లో  నేపాల్ 9 పరుగుల తేడాతో అప్ఘానిస్థాన్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. సుభాష్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత అఫ్ఘాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకు పరిమితమైంది.
 
 గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా నేడు  జింబాబ్వే-యూఏఈ; నెదర్లాండ్స్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement