Chittagong
-
కృష్ణ దాస్ అరెస్ట్ వేళ దారుణం.. నిరసనకారులపై విరిగిన లాఠీ!
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానం బయట భయానక ఘటన చోటుచేసుకుంది. కోర్టు బయట ఉన్న వారిపై పోలీసులు లాఠీలు ఝలిపించారు.బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్‌కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది.మరోవైపు.. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తుపై కోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు బయట వందల సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమ్మిగూడారు. కృష్ణ దాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను జైలుకు తరలిస్తుండగా.. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కృష్ణ దాస్‌ను తీసుకెళ్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు సమాచారం.🚨 SHAMEFUL! Fascist Yunus govt police 'BRUTALLY' beat Bangladeshi Hindus who were protesting against the 'ARREST' of Bangladesh ISKCON prominent saint Chinmoy Krishna Das Prabhu. pic.twitter.com/Nw1kw4dFl1— Megh Updates 🚨™ (@MeghUpdates) November 26, 2024ఇదిలా ఉండగా.. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా
డిసెంబర్లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌లో భాగంగా షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్‌లు బంగ్లా రాజధాని ఢాకాలోనే జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డే వేదికను మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్‌కు మార్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) బుధవారం పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) డిసెంబర్ 10న వేలాది మందితో ఢాకా వీదుల్లో ర్యాలీతో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే అదే రోజు డాకాలో మూడో వన్డే జరగాల్సి ఉంది. దీంతో అల్లర్లకు ఆస్కారం ఉండడంతో వన్డే వేదికను మార్చాలని బీసీబీ నిర్ణయించుకుంది. అందుకే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డేను డాకాలో కాకుండా చిట్టగాంగ్ వేదికగా జరుగుతుందని తెలిపింది. ఇక గత నెలలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్పీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీఎన్పీ కోరుతుంది. ఇక మొదటగా అనుకున్న ప్రకారం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు డాకా, చిట్టగాంగ్‌లు వేదికలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని బీసీబీ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యునస్ తెలిపారు. డిసెంబర్ 4,7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. డిసెంబర్ 14-18 వరకు చిట్టగాంగ్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 22-26 వరకు డాకా వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా! బంగ్లాతో టెస్టు సిరీస్.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య? -
నేను మహిళను నేను విప్లవాన్ని... ప్రీతిలతా వడ్డేదార్
పహార్తలి యూరోపియన్ క్లబ్ ముందు బ్రిటిషర్లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్ బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. ‘‘సోదరీమణులకు ఒక విన్నపం! ఇకపై తెరచాటున ఉండకూడదని మహిళలు బలమైన నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మగవారితో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. నన్ను నేను ధైర్యంగా విప్లవకారిణిగా ప్రకటించుకుంటున్నాను. అలాగే మిగతావారు కూడా..’’ ఒక మహిళా విప్లవకారిణి మృతదేహానికున్న దుస్తుల్లో ఈ మాటలున్న పాంపెట్లను చూసి బ్రిటిష్ బలగాలు బెంబేలెత్తాయి. బెంగాల్ తొలి మహిళా అమరురాలుగా చరిత్రకెక్కిన ప్రీతీలాల్ వడ్డేదార్ స్వయంగా రాసిన పాంపెట్లవి! తూటాల్లాంటి మాటలతో పాటు, స్వయంగా తూటాలు కురిపిస్తూ బ్రిటిషర్లతో యుద్ధం చేస్తూ దేశం కోసం ప్రీతి అశువులు బాసారు. చిన్న వయసులోనే..! చిట్టగాంగ్‌లో 1911 మే 5న ప్రీతీలాల్ వడ్డేదార్ జన్మించారు. తండ్రి జగబంధు చిట్టగాంగ్ మున్సిపాలిటీలో క్లర్కుగా పనిచేసేవారు. చిన్నప్పుడు ప్రీతిని ముద్దుగా రాణి అనేవారు. కస్తాగిర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రీతి చదివే రోజుల్లో ఉషా దీ అనే టీచరు పిల్లలకు జాతీయ భావాలను బోధించేవారు. ఉషా బోధనలతో ప్రీతి చిన్నవయసు నుంచే వలసపాలనపై వ్యతిరేకత పెంచుకున్నారు. చదువుకునే రోజుల్లో విప్లవ సాహిత్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రీతి ఆదర్శంగా భావించేవారు. మహిళలు పెద్ద సంఖ్యలో కష్టాలను ఓర్చుకుంటూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ప్రీతిని కదిలించింది. 1929లో ప్రీతి ఢాకాలోని ఈడెన్ కాలేజీలో చేరారు. కాలేజీలో ఆమె దీపాలి సంఘ అనే విప్లవ బృందంలో సభ్యురాలయ్యారు. ఈ బృందంలో మహిళలకు యుద్ధ పోరాటరీతులను, రాజకీయ అంశాలను బోధించేవారు. అనంతరం కలకత్తాలోని బెథూన్ కాలేజీలో ప్రీతి ఉన్నత విద్యనభ్యసించారు. ఫిలాసఫీలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఆ కాలంలో ఆమె విప్లవ భావాలను వ్యతిరేకించిన బ్రిటిష్ అధికారులు ఆమె డిగ్రీ పట్టాను నిలిపివేశారు. ఉన్నతవిద్య అనంతరం చిట్టగాంగ్‌లోని నందకన్నన్ అపర్ణాచరణ్ స్కూల్లో ఆమె టీచర్‌గా చేరారు. ఈ సమయంలోనే ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో చేరాలని నిర్ణయించుకున్నారు. సూర్యసేన్ పరిచయం ప్రీతి విప్లవభావాల గురించి విన్న ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు సూర్యసేన్ ఆమెను తన బృందంలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆమె సూర్యసేన్ ను ధాల్‌ఘాట్ క్యాంపులో కలిశారు. మహిళలను విప్లవ బృందంలో చేర్చడాన్ని తోటి విప్లవకారుడు బినోద్ బిహారీ వ్యతిరేకించారు. అయితే మహిళలు సులభంగా విప్లవ బృందాలకు కావాల్సిన ఆయుధాలను రవాణా చేయగలరన్న కారణంతో కఠిన శిక్షణ అనంతరం చివరకు ప్రీతిని బృందంలో చేర్చుకున్నారు. చిట్టగాంగ్ ఐజీ క్రెగ్‌ను హతమార్చేందుకు సూర్యసేన్ నిర్ణయించుకొని ఆ పనిని రామకృష్ణ బిశ్వాస్, కలిపాద చక్రవర్తికి అప్పగించారు. అయితే వీరిద్దరు క్రెగ్ బదులు వేరే అధికారులను హత్యచేసి 1931లో పట్టుబడ్డారు. బిశ్వాస్‌ను జైల్లో కలిసిన ప్రీతి ఆయన బోధనలతో స్ఫూర్తి పొందారు. అనంతరం సేన్ తో కలిసి ఆయన బృందంలో భాగంగా ప్రీతి పలు సాయుధ దాడుల్లో పాల్గొన్నారు. 1930 చిట్టగాంగ్ దాడి అనంతరం బృందంలో మగవారిపై నిఘా ఎక్కువ కావడంతో మహిళానేతలు చురుగ్గా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పహార్తలి క్లబ్ ఘటన జలియన్ వాలాబాగ్ దురంతం అనంతరం దేశవ్యాప్తంగా సమర వీరుల రక్తం మరిగిపోయింది. ఇదే సమయంలో స్థానిక పహార్తలి యూరోపియన క్లబ్ ముందు బ్రిటిషర్లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్ బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. 1932 సెప్టెంబర్‌లో ఆమె పంజాబీ మగమనిషిలా దుస్తులు ధరించి, విప్లవకారులతో కలిసి క్లబ్‌లోకి వెళ్లి క్లబ్బును పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ సమయంలో క్లబ్బులో ఉన్న పోలీసులు కాల్పులు జరపడంతో ప్రీతి కాలికి బుల్లెట్ తగిలి పారిపోయే వీలు చిక్కలేదు. దీంతో పోలీసుల చేతికి చిక్కకూడదన్న దృఢ నిశ్చయంతో ఆమె సైనేడ్ గుళిక మింగి అమరురాలయ్యారు. ఈ ఘటన జరిగే నాటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలే! ప్రీతి ఆత్మత్యాగం దేశీయ మహిళా లోకంలో కలకలం సృష్టించింది. ఆమె స్ఫూర్తితో అనేకమంది స్త్రీలు కులమతాలకు అతీతంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ప్రీతి మహిళలకు ఆదర్శప్రాయమని బంగ్లా రచయిత్రి సెలినా హుస్సేన్ ప్రస్తుతించారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: స్వతంత్ర భారతి:1993/2022 స్టాక్ మార్కెట్లోకి ఇన్ఫోటెక్ ) -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్‌కి సమీపంలోని సీతాకుంద్‌లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. -
చిట్టగాంగ్ చిరుత
చిట్టగాంగ్, సెప్టెంబర్ 23, 1932...రాత్రి 10. 45.‘భారతీయులకీ, కుక్కలకీ ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న పహార్తలీ యూరోపియన్ క్లబ్‌కు నిప్పు పెట్టారు కొందరు. లోపల ఉన్న బ్రిటిష్ అధికారులు ఎదురు కాల్పులు ఆరంభించారు. అందులో ఒక సిక్కు యువకుడు గాయపడ్డాడు. కానీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న పోటాషియం సైనేడ్ మింగి చనిపోయాడు. అలాంటి మాటలతో వేరే జాతీయులని అవమానించామని శ్వేతజాతి జాత్యహంకారం ఆనాడు చంకలు గుద్దుకునేది. కానీ అవే అణగారిన జాతిలో ఆత్మ గౌరవ స్పృహ కోసం పాంచజన్యం పూరించాయి. చిట్టగాంగ్‌లోని పహార్తలీ యూరోపియన్ క్లబ్ ఉదంతం ఇదే చెబుతుంది. అలాంటి మాటలు రాసిన పలకలు చాలా బ్రిటిష్ కార్యాలయాల మీద ఆనాడు వేలాడుతూ కనిపించేవి. మరీ ముఖ్యంగా వాళ్ల క్లబ్‌ల ముందు కనిపించేవి. ఘనత వహించిన బ్రిటిష్ పాలనలో పాలితులకి దక్కిన గౌరవాలలో ఇదొకటి. దక్షిణాఫ్రికాలో కూడా ప్రిటోరియా పాలనలో ఇలాంటి మర్యాదే భారతీయులకీ, బ్రిటిష్ జాతీయులు కాని వారికి ఇదే గౌరవం ఉండేది. ఈ గౌరవంలో నీచత్వం ఎలాంటిదో గాంధీజీ రుచి చూసినది అక్కడే. అయినా ఈ గౌరవాన్ని కూడా ఆనందంగా భరించాలనుకున్నవారే భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు. కానీ కుక్కలనీ, భారతీయులనీ ఒకే విధంగా చూసే దురహంకారాన్ని భరించడానికి సిద్ధంగా లేమనీ ఇలాంటి కుసంస్కారానికి ఆయుధంతోనే సమాధానం ఇస్తామని నెత్తుటి ప్రతిజ్ఞలు చేసినవారు ఉన్నారు. కానీ వారి ధర్మాగ్రహాన్ని చరిత్ర పుటలు నిషేధించాయి. అలా నెత్తురు మీద ప్రమాణం చేసినవారు దేశమంతటా ఉన్నారు. వారంతా రకరకాల రహస్య సంస్థల వారు. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య భారతం, తెలుగు ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయవాదం కనిపిస్తుంది. బెంగాల్లో చిట్టగాంగ్ ఉద్యమకారుల త్యాగాలు కూడా అలాంటివే. కానీ బెంగాల్లో తప్ప చిట్టగాంగ్ వీరుల గురించి మిగిలిన భారతదేశంలో తక్కువ తెలుసు. సూర్యసేన్ (మాస్టర్ దా) నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్ సాయుధదాడికి బ్రిటిష్ ప్రభుత్వం గంగవెర్రులెత్తిపోయింది. ఇందుకు కారణం, చిట్టగాంగ్ అనే ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఉన్న ప్రాముఖ్యం. బ్రిటిష్ వలసగా ఉన్న భారత్ మీద శత్రుదేశాలు దాడి చేస్తే అది అక్కడ నుంచే ఆరంభమవుతుంది. అలాంటి చోట ఆయుధాగారం మీద విప్లవకారులు దాడి చేస్తే అది ఎలాంటి సంకేతాలను పంపుతుందోనని హడలెత్తిపోయింది నాటి ప్రభుత్వం. అందుకే వారి పట్ల మరీ అమానవీయంగా వ్యవహరించింది. పహార్తలీ క్లబ్‌ను దగ్ధం చేసిన చిట్టగాంగ్ వీరులకు నాయకత్వం వహించిన ఆ పంజాబీ యువకుని గురించి....ఆ రాత్రి ఆ క్లబ్ మీద దాడి చేసిన బృందానికి నాయకత్వం వహించినవారు నిజానికి పంజాబీ కాదు. యువకుడు అంతకంటే కాదు. ఒక యువతి ఆ వేషం ధరించింది. ఆమె పేరు ప్రీతిలతా వాడ్డేదార్. ఆ దాడిలో ఆమెకు సహకరించిన కాళీశంకర్ డె, బీరేశ్వర్ రాయ్, ప్రఫుల్ల దాస్, శాంతి చక్రవర్తి, మహేంద్ర చౌధురి, పన్నా సేన్ .. అంతా రకరకాల వేషాలు ధరించారు. ప్రేమలతా వాడ్డేదార్ (మే 5, 1911–సెప్టెంబర్ 23, 1932) అవిభక్త బెంగాల్లో చిట్టగాంగ్‌కు చెందినది. పాటియా ఉప జిల్లా ధాల్‌ఘాట్‌లో జన్మించారు. వారి పూర్వీకుల ఇంటిపేరు దాస్‌గుప్తా. తరువాత ఆ కుటుంబానికి వాడ్డేదార్ అనేది బిరుదుగా స్థిరపడింది. ప్రీతిలత తల్లి ప్రతిభా మాయాదేవి, గృహిణి. తండ్రి జగబంధు వాడ్డేదార్. చిట్టగాంగ్ నగరపాలక సంస్థలో గుమాస్తా. వారి ఆరుగురు బిడ్డలలో ప్రీతిలత రెండో సంతానం. ఆమెకు రాణి అన్న ముద్దు పేరు కూడా ఉంది. తండ్రి పిల్లలందరికీ మంచి చదువు చెప్పించారు. చిట్టగాంగ్‌లోనే ఆనాడు ఎంతో పేరున్న డాక్టర్ ఖస్తగీర్ బాలికోన్నత పాఠశాలలో ప్రీతిలత చదివింది. జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది అక్కడే. అక్కడ ఉష అనే ఉపా«ధ్యాయురాలు ఉండేవారు. ఆమెను పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉషాదా అని పిలుచుకునేవారు. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత గాథలను పిల్లలకు చేప్పేవారు. చిట్టగాంగ్ సాయుధ దాడిలో మరొక సభ్యురాలు కల్పనా దత్తా (1913–1995) కూడా ఇదే పాఠశాలలో అదే తరగతిలో ఉండేవారు. ‘ఆ పాఠశాలలో చదువుకుంటున్న రోజులలో మా భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో మేం ఏనాడూ ఉహించలేదు. కానీ ఝాన్సీ రాణీ జీవిత ఘట్టాలు మాకు ఒక భావనను ఏర్పరిచాయి. అవి వింటూ ఉంటే కొన్ని సందర్భాలలో అసలు మాకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఉండేది’ అని కల్పన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ప్రీతికి కళలు, సాహిత్యం అంటే ఆసక్తి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇచ్చే వేతనంతో ఆమె చదువు సాగింది. చిట్టగాంగ్‌లో చదువు పూర్తయిన తరువాత ఢాకాలోని ఈడెన్ కళాశాలలో ప్రీతి చేరారు. ఆమె జాతీయ భావాలు ఇంకొంచెం విస్తరించే అవకాశం అక్కడ వచ్చింది. అదే పాఠశాలలో చదువుతున్న లీలా నాగ్ (రాయ్) (1900–1970) దీపాలీ సంఘ్ అనే రహస్య సంస్థ నడిచేది. అందులో ప్రీతి చేరారు. ఆపై బిఎ చదవడానికి కలకత్తాలోని బెథూన్ కళాశాలకు వెళ్లారు. అదే ఆమె జీవితంలో పెద్ద మలుపు. 1931లో చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేసిన వారు చిట్టగాంగ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ క్రేగ్‌ను తుదముట్టించాలని పథకం వేశారు. ఇందుకు రామకృష్ణ బిస్వాస్, కాళీపాద చక్రవర్తి అనే ఇద్దరిని నియమించారు. కానీ ఆ ఇద్దరు పొరపాటున చాంద్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ తరిణి ముఖర్జీని కాల్చి చంపారు. పైగా పోలీసులకు తరువాత పట్టుబడ్డారు. కాళీపాదకు ద్వీపాంతర శిక్ష వేసి అండమాన్ తరలించారు. బిస్వాస్‌కు ఉరిశిక్ష వేసి ఆలీపూర్ జైలుకు పంపారు. ఇది కలకత్తాలో ఉంది. తరువాత అతడిని చూసి రావడానికి ఉద్యమకారుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలోనే ఉద్యమకారులు కలకత్తాలో చదువుకుంటున్న ప్రీతిలతను ఆశ్రయించారు. ఆమె ఆలీపూర్ జైలుకు వెళ్లి సోదరినంటూ చెప్పి బిస్వాస్‌ను కలుసుకునేవారు. ఒకటి రెండుసార్లు కాదు నలభయ్ సార్లు. ఆయనతో జరిపిన సంభాషణలతో ప్రీతిలో ఒక ఉద్యమకారిణి నిర్మితమైంది. ఆమె బిఏ మూడేళ్లు చదువు పూర్తయింది. కానీ కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పట్టా ఇవ్వకుండా నిలిపివేసింది. దీనితో ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం అసలు రూపం ఏదో ఇంకాస్త స్పష్టమైంది. తిరిగి చిట్టగాంగ్ వచ్చి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా చేరారు. కానీ ఆమె మనసంతా భారత స్వాతంత్య్రోద్యమంలో చేరాలని ఆరాటపడేది. ఆ సమయంలోనే సూర్యసేన్ ఆమెకు కబురు చేశారు. ప్రీతి జన్మించిన ధాల్‌ఘాట్ శిబిరంలోనే ఆమె జూన్ 13, 1932న మాస్టర్దాను కలుసుకుంది. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉండగా ఆయన కార్యకలాపాలకు ప్రభావితమైంది. ఇప్పుడు స్వయంగా ఆయనను కలుసుకుంది. వెంటనే ఉద్యమంలో ప్రవేశించింది. ఇందుకు మొదట కొందరు చిట్టగాంగ్ ఉద్యమకారులు వ్యతిరేకించారు. కానీ సూర్యసేన్ దృష్టి వేరు.మహిళలతో ఆయుధ సేకరణ సులభంగా చేయవచ్చు. అదే గ్రామంలో సావిత్రీదేవి అనే ఉద్యమ సానుభూతిపరురాలి ఇంటిలో ఉండగా పోలీసు దాడి జరిగింది. అది సావిత్రీదేవి భర్త చేయించిన పని.ఆయన ఒకప్పుడు ఉద్యమకారుడే. తరువాత మారిపోయాడు. సూర్యసేన్, ప్రీతిలత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చిట్టగాంగ్‌లోని రెండు ఆయుధాగారాలను, పహార్తలీ క్లబ్‌ను, ఇతర బ్రిటిష్ కార్యాలయాల మీద దాడి చేయాలని సూర్యసేన్ పెద్ద పథకం వేశారు. ఇదే చరిత్రలో చిట్టగాంగ్ దాడిగా నమోదైంది. నలభయ్ మంది సభ్యులను మూడు బృందాలుగా విభజించి, క్లబ్ మీద దాడి చేసే బృందానికి ప్రీతిని నాయకురాలిని చేశారు సేన్. నిజానికి ఈ పని కల్పనా దత్తాకు అప్పగించాలి. కానీ ఆమె అప్పటికి వారం ముందే అరెస్టయ్యారు. దీనితో ప్రీతికి అప్పగించారు. ఇందుకోసం ఆమెకు కోటోవాలీ సీసైడ్ అనేచోట ఆయుధ శిక్షణ ఇచ్చారు. అనుకున్న ప్రకారం క్లబ్ మీద దాడి జరిగింది. సలీవాన్ ఇంటి పేరున్న ఒక బ్రిటిష్ మహిళ ఈ దాడిలో చనిపోయింది. నలుగురు పురుషులు, ఏడుగురు స్త్రీలు కూడా గాయపడ్డారు. లోపల పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ ప్రీతికి తగిలింది. ఆమె పారిపోతూ ఉండగా ఒక పోలీసు పట్టుకున్నాడు. అరెస్టును నివారించేందుకు నాయకులు ముందే ఆదేశించినట్టు పొటాషియం సైనేడ్ మింగి చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. శవపరీక్ష సమయంలో ఆమె చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేస్తున్నదని చెప్పడానికి అన్ని ఆధారాలు దొరికాయి. కొన్ని కరపత్రాలు దొరికాయి. దాడికి సంబంధించిన మ్యాప్ దొరికింది. వాటì తో పాటు ఒక ఫొటో కూడా. అది ఆలీపూర్ కారాగారంలో, సోదరిగా పరిచయం చేసుకుని తాను నలభయ్ పర్యాయాలు సమావేశమైన రామకృష్ణ బిస్వాస్ ఫొటో. తనలోని ఉద్యమకారిణికి ఆకృతి ఇచ్చిన బిస్వాస్ ఫొటో. ఆయనంటే ఆమెకు అంత ఆరాధన. బ్రిటిష్ జాతి నీచత్వం అక్కడ బయటపడింది. పైగా ప్రీతి కాల్పులలో తనకు తగిలిన తూటాకు ప్రాణాలు విడవలేదు. పొటాషియం సైనేడ్‌తోనే చనిపోయిందన్న సంగతి తెలిసింది. అందుకే కాబోలు రామకృష్ణ బిస్వాస్‌కు ప్రీతి ఉంపుడు గత్తె అని రాశారు. ప్రీతిలత పేరు మన చరిత్రలో మరొక కోణం నుంచి కూడా నమోదు కావలసి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆయుధం ఎత్తిన తొలి బెంగాలీ యువతి ప్రీతిలత. -
చిట్టగాంగ్ పిచ్ అతి సాధారణం: ఐసీసీ
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ ఛౌదురి స్టేడియం పిచ్‌ను ఐసీసీ ‘అతి సాధారణమైనది’ (బిలో యావరేజ్)గా పేర్కొంటూ ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చింది. ఐదు శతకాలు, ఆరు అర్థ శతకాలు నమోదైన ఈ టెస్టులో రెండు జట్లు కలిపి 1,533 పరుగులు చేశాయి. ‘కొత్త బంతి కూడా వేగంగా కదల్లేదు. అసలు బౌన్సే కనిపించలేదు. స్పిన్‌కు కొద్దిసేపే సహకరించింది. పూర్తిగా బ్యాట్స్‌మెన్ హవా సాగింది’ అంటూ పిచ్‌పై రిఫరీ డేవిడ్ బూన్ ఇచ్చిన నివేదికతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. -
చిట్టగాంగ్ చేరుకున్న ఐఎన్ఎస్ ఘరియాల్
విశాఖ సిటీ: రోహింగ్యా శరణార్థుల కోసం వివిధ పదార్థాలను తీసుకెళ్లిన ఐఎన్ఎస్ ఘరియాల్ చిట్టగాంగ్ చేరుకుంది. ఈ నెల 24న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఐఎన్ఎస్ ఘరియాల్ నౌక ద్వారా సుమారు 900 టన్నుల మెటీరియల్‌ను కేంద్ర ప్రభుత్వం తరలించింది. సుమారు 70 వేల మందికి సరిపడా రేషన్ సరుకులు, వస్త్రాలు, దోమ తెరల్ని ఐఎన్ఎస్ ఘరియాల్‌లో లోడ్ చేశారు. ఈ నౌక గురువారం చిట్టగాంగ్ చేరుకుంది. అక్కడ హార్బర్లో ఘరియాల్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నౌక ద్వారా తీసుకొచ్చిన సామగ్రిని చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎండీ జిల్లూర్ రహ్మాన్ చౌధురికి భారత హైకమిషనర్ హర్షవర్ధన్ శ్రింగ్లా అందజేశారు. -
‘మోరా’ దాటికి ఆరుగురు మృతి
-
‘మోరా’ దాటికి ఆరుగురు మృతి
డాఖా: మోరా తుపాన్ బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. తీరప్రాంతంలో పెను బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంగళవారం ఈ తుపాన్ దాటికి దాదాపు ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు తుపాన్ ఉధృతిని చూసి గుండెపోటుతో మరణించగా, మిగతా వారు ఇళ్లు, చెట్లు కూలిన ఘటనలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో బంగ్లా తీర ప్రాంతం అతలాకుతలం అవుతున్నారు. పెద్దమొత్తంలో ఇళ్లు ధ్వంసంకావడంతో తీర ప్రాంతం నుంచి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొందరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ కల్పించారు. తదుపరి సమాచారం వెలువరించే వరకు జాలర్లు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరదిశగా మోరా ప్రయాణిస్తోందని, బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిట్టగాంగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిట్టగాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అణు శక్తిపై జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు వియన్నా వెళ్లిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. -
నా ప్రస్థానానికి నాంది ఆ ప్రశ్న...
మొక్కకూ మహిళకూ ఒకటే సామ్యం. ఎదగడానికి మొక్కవోని పోరాటం తప్పదు. మొక్కయితే ఫలితం... చిగురు రెమ్మ, చిటారు కొమ్మ. మరి అది చైతన్యభరితమైన మహిళైతే?... ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ అనే పుస్తకం. ఆ చిటారుకొమ్మకు మిఠాయిపొట్లంలాగే... కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం. అవును... చైతన్య పింగళికీ, చిగిర్చే మొక్కకూ సామ్యం ఉంది. నాకు ఊహ తెలిసే వరకు మా అమ్మ మీద కంప్లయింట్స్ ఉండేవి. మమ్మల్ని సరిగ్గా చూడట్లేదని.. పట్టించుకోవట్లేదని. కాని ఊహ తెలిశాక అమ్మ కష్టం అర్థమైంది. స్త్రీ చాలా ప్రత్యేకం అని తెలిసింది. మా అమ్మ కష్టం నా పర్సెప్షన్ని మార్చినట్టే నేనూ మా అమ్మ అభిప్రాయాన్ని మార్చానట. నాన్న చనిపోయినప్పుడు నేను రెండున్నరేళ్ల పిల్లని. ఒక తమ్ముడు, అప్పటికి అమ్మ ప్రెగ్నెంట్ కూడా! మూడో కాన్పులో అమ్మాయి పుట్టొద్దు.. అబ్బాయే పుట్టాలని కోరుకుందట అమ్మ. కాని ఇప్పుడంటుంది.. ‘అప్పుడు కూతురొద్దు.. కొడుకే కావాలనుకున్నాను.. కాని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది కూతురే పుట్టుంటే బాగుండేది’ అని! అలా మా ఇబ్బందులు మా ఇద్దరి దృక్పథాల్ని మార్చాయి! ⇒ నడిరోడ్డుపై నాన్న హత్య... నడి వీధిలో అమ్మతో మేము నాన్న (దశరథరామయ్య) ‘ఎన్కౌంటర్’ పత్రిక ఎడిటర్. అమ్మ (సుశీల) నాన్న చనిపోయేప్పటి వరకు గృహిణే. అమ్మా నాన్నలది కులాంతర వివాహం. అమ్మ ఇంటర్లో ఉన్నప్పుడే పెళ్లయింది. ఆ పెళ్లి కూడా హిందూ సంప్రదాయం ప్రకారం కాదు. తాళి వంటివి ఏమీ లేకుండా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్లను ఇద్దరివైపు పెద్దలు వాళ్లను యాక్సెప్ట్ చేయలేదు. నాన్నను నడి రోడ్డు మీద హత్య చేసినప్పుడు అమ్మమ్మ వాళ్లు, నానమ్మ వాళ్లు ఎవరూ చేరదీయలేదు. విజయవాడలోని అయోధ్యనగర్లోఉన్న డంప్‌యార్డ్ పక్కన గుడిసె వేసుకొని అందులో ఉన్నాం. మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా ఇబ్బందులు పడ్డది. మెడికల్ కవర్స్ చేసేది, ట్యూషన్లు చెప్పేది. ఓ వైపు మమ్మల్ని చదివిస్తూనే ఆగిపోయిన తన చదువునూ కంటిన్యూ చేసింది. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది. అలా గట్టెక్కాం. అయినా తను చదువు ఆపేయలేదు. డిగ్రీ, పీజీ చేసింది. ⇒ తెలంగాణ చరిత్ర... మమ్మల్ని చిట్టగాంగ్ పంపింది! మమ్మల్ని పెంచడం కోసం అమ్మ పడ్డ కష్టం నుంచి ఈ వనితల పోరాటాల వరకు నన్ను ఆ స్ఫూర్తిదాయకమైన జీవితాలు వెంటాడాయి. అమ్మాయిలు ఇలా ఎలా ఫైట్ చేయగలరు? వాళ్ల పోరాటాలు ఎంత మందికి ఇన్స్పిరేషన్ అవుతాయి! ఎక్కడా రికార్డ్ కాలేదు. పీసీ జోషి భార్య కాబట్టి కల్పనాదత్ గురించి కొంత సమాచారం ఉంది. బెంగాల్లో అలాంటి వాళ్లెందరో ఉన్నారు. ఎవరికీ తెలియకుండా! ఆ చరిత్ర తప్పకుండా రాయాలి అని నిశ్చయానికి వచ్చేశాను. అంతకుముందే చదివిన తెలంగాణ ఉద్యమ స్త్రీల పుస్తకం ‘మనకు తెలియని మన చరిత్ర’ చిట్టగాంగ్ మహిళల గురించి రాసేలా ఉసి గొల్పింది. నిజానికి అదే స్ఫూర్తి అని చెప్పొచ్చు. వీటన్నిటి ప్రోద్బలంతో ప్రయత్నం మొదలుపెట్టా. అలా నా సహచరుడి (తిలక్) సహాయంతో చిట్టగాంగ్ ప్రయాణం మొదలైంది. అప్పటికి నేను ప్రెగ్నెంట్‌ని. కామెంట్స్ భరించలేక... తమ్ముళ్లకు అమ్మే జుట్టు కట్ చేసేది సింగిల్ పేరెంట్ ఎన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమైంది. నాన్న చనిపోయేటప్పటికి ఆయనకే 29 ఏళ్లు. అంటే అమ్మదీ చిన్న వయసే కదా! తమ్ముళ్లకు క్రాఫ్ చేయించడానికి కటింగ్ సెలూన్‌కి తీసుకెళ్లి తను బయట నిలబడేది. అక్కడున్న మగవాళ్లు కామెంట్స్ చేసేవారు. చివరకు అవి భరించలేక తనే ఇంట్లోనే తమ్ముళ్లకు జుట్టు కట్ చేసేది. ఇలాంటివింకెన్నిటినో భరించింది. నిలబడింది. మమ్మల్ని నిలబెట్టింది. ఆమె ఈ స్ట్రగుల్‌ని దగ్గర్నుంచి చూశాక కానీ అర్థంకాలేదు విమెన్ ఎంత స్పెషలో అని! ⇒ నన్ను వెంటాడిన ప్రశ్న... ‘ఒకవేళ మీ నాన్న బతికే ఉంటే?’ మొదటినుంచీ నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఆ చదవడం వల్ల ఏదో ఒకటి రాయడమూ అలవాటైంది. అయితే అవంత సీరియస్‌గా ఉండేవి కావు. డిగ్రీకి వచ్చాకే కంపల్సరీగా రాయాల్సిన విషయాలున్నాయి అని అనిపించి రాయడం మీద దృష్టిపెట్టాను. నాన్న నాస్తికుడు. తను చనిపోతే మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయొద్దని చెప్తుండేవారు. అందుకే తన డెడ్‌బాడీని విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజ్‌కి ఇచ్చేశాం. నేను ఎయిత్క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు నాతో..‘మీ నాన్న చనిపోయాడని ఆయన బాడీని మెడికల్ కాలేజ్‌కి ఇచ్చేశారు. ఒకవేళ బతికుంటే..’ అన్నాడు. ఆ అనుమానం, ఆ ప్రశ్న నన్ను వెంటాడుతుండేదెప్పుడూ. ఆ క్రమంలోనే ఎప్పుడో చిట్టగాంగ్ పోరాటానికి సంబంధించిన కల్పనాదత్ కథ చదివా! ఆమె తన భర్త కోసం ఎదురుచూడడం.. చిన్నప్పుడు నా ఫ్రెండ్ నాన్న గురించి అన్న మాటలను మళ్లీ గుర్తు చేశాయి. మనసును తట్టాయి. కల్పనాదత్తో పాటు ప్రీతిలత కథ.. ఇలా ప్రతి ఒక్క స్త్రీ తపన నన్ను కదిలించింది. ⇒ నాన్న వాచీ తమ్ముడికి... ‘మహాప్రస్థానం’ నాకు! నాన్న దగ్గర శ్రీశ్రీ సొంత దస్తూరీతో ఉన్న ‘మహాప్రస్థానం’ పుస్తకం ఉండేది. నాన్నకు ఓ వాచీ ఉండేది. ఈ రెండూ ఆయన దగ్గర ఎప్పటికీ ఉండే వి. నేను టెన్త్ పాసయ్యాక అమ్మ నాకు నాన్న చదివే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని, తమ్ముడికి వాచీని ఇచ్చింది. నాకు పుస్తకం ఎందుకు ఇచ్చావ్ వాచీ ఇవ్వకుండా అని చాలా పోట్లాడాను.‘నీకు పుస్తకాలంటే ఇష్టం కదా అని ఇచ్చాను’ అని అమ్మ చెప్పినా చాలా రోజులు సమాధాన పడలేదు. కాని ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ చాయిస్ కరెక్ట్ అని. తమ్ముడితో అన్నాను కూడా ‘నీ వాచీ ఎప్పుడో పాడైంది.. నా దగ్గరున్న మహాప్రస్థానం ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది’అని. నాన్నతో ఊరికే అనేదట అమ్మ.. మనకో అమ్మాయి ఉంది.. డబ్బులు కాస్త జాగ్రత్త చేయండి అని. ‘దాయాల్సిన అవసరం లేదు. దానికి కాళ్లు, చేతులు ఉన్నాయి.. పని చేసుకొని బతుకుంది’ అనేవారట నాన్న. నిజమే అనిపించింది. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వరు. ఆశలు, ఆశయాలు ఇస్తారు. నేనూ నా పిల్లాడి విషయంలో ఆ విలువనే పాటిస్తున్నాను. ⇒ రెండు వాక్యాలను పట్టుకుని.. వివరాలు సేకరించా! చిట్టగాంగ్ పోరాటం చేసిన మహిళలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. మా ప్రయాణంలో దొరికిన ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా ఆ ఊతంతోనే సమాచారాన్ని సేకరిస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ ముందుకెళ్లా. సుహాసిని గంగూలి గురించి అయితే ఎక్కడో రెండు వాక్యాలు రాసి ఉంది కవితగా! ఆ రెండు వాక్యాలను పట్టుకొనే ఆమె గురించి వివరాలు సేకరించా. అయితే చిట్టగాంగ్ వనితలకు సంబంధించి పుస్తకంగా వేద్దామనే ఆలోచన ముందు లేదు. సాక్షికే ఆర్టికల్స్‌గా ఇద్దామనుకున్నా. కాని అప్పుడే నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. ‘ఆ పోరాట గాథలు పుస్తకంగా తప్పకుండా రావాల్సిన సమయం, సందర్భం ఇదే! ఆలస్యం చేయొద్దు’ అని నా స్నేహితులు, నా పార్టనర్ (తిలక్) అందరూ అన్నారు. అప్పటికే డెరైక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. తను మాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా చిట్టగాంగ్ వనితల గురించి బుక్‌గా వస్తే బాగుంటుందని చాలా ఎంకరేజ్ చేశారు. నిజానికి వాళ్ల గురించి రాసేటప్పుడు చాలా సవాళ్లే ఎదుర్కొన్నా. ఆ చాలెంజెస్ అన్నీ నాలో పట్టుదలను పెంచాయి. ఒకానొక దశలో ఇది రాయకుండా ఆగిపోతే.. ఏమన్నా అయిపోతానేమోనని భయమేసింది. ఓ దీక్ష పట్టినదానిలాగే ఈ వర్క్ పూర్తిచేశాను. రాయడానికి రెండేళ్లు పట్టింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మొదలుపెడితే బాబు పుట్టి వాడికి యేడాదిన్నర వచ్చాక పూర్తయింది. చిట్టగాంగ్ మహిళలకు కుదిరాంబోస్ స్ఫూర్తి. నా కొడుక్కీ ఆయన పేరే పెట్టాను ‘ఖుదిరాంబోస్’ అని! అలా వచ్చింది ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకం! ⇒ ఒక రకంగా హ్యాపీ... ఇంకో రకంగా బాధ నేను రచయిత కన్నా ముందు జర్నలిస్ట్‌ని. యాక్టివిస్ట్‌ని. సంవత్సరాలు సంవత్సరాలు ధర్నాచౌక్‌లో ఉన్నా. రోడ్ల మీద కూర్చున్నా. ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి చిట్టగాంగ్ కథలు రాసినప్పుడూ పట్టించుకోలేదు. ‘మనసులో వెన్నెల’కథల పుస్తకాలతో గుర్తించారు. రచయిత్రిగానే ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇది ఒక రకంగా హ్యాపీ.. ఇంకోరకంగా బాధ! జర్నలిజం నుంచి సినిమా రంగంలోకి 2006లోనే వెళ్లా. శేఖర్‌కమ్ముల సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నా. విమెన్‌కు ప్రెషర్స్ ఉంటాయి. అయినా వెనకడుగు వేయకూడదు. ఒక అమ్మాయి విజయం పది మంది అమ్మాయిలకు స్ఫూర్తి. అది వ్యక్తిగత విజయమే అయినా పది మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఎక్స్పరిమెంట్ చేసే ధైర్యం ఉండాలి. ఏ విషయంలోనైనా సరే! సొసైటీ చెప్పేదాన్ని గుడ్డిగా ఫాలోకాకుండా రీజనింగ్ వెదుక్కోవాలి. క్వశ్చన్ చేసుకోవాలి. తలవంచుకొని వెళ్లిపోతే తమకు తాము న్యాయం చేసుకోలేరు. ఇతరులకు న్యాయం చేయలేరు. ధైర్యంగా తలెత్తి ఎదురీదితేనే నిలబడగలరు.. స్ఫూర్తినివ్వగలరు. - సంభాషణ : సరస్వతి రమ -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
6 పరుగులతో నెదర్లాండ్స్‌పై విజయం తాహిర్‌కు 4 వికెట్లు చిట్టగాంగ్: వరుసగా రెండో విజయంతో టి20 ప్రపం చకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. గురువారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఆమ్లా (22 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఓ మోస్తరుగా ఆడారు. జమీల్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మైబర్గ్ (28 బంతుల్లో 51; 8 ఫోర్లు, 2 సిక్స్) ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే విజయానికి 72 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన దశలో డచ్ బ్యాట్స్‌మెన్‌ను తాహిర్ పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను హాలండ్ చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ (4/21)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. -
శ్రీలంక శుభారంభం
ఐదు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు టి20 ప్రపంచ కప్ చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణి చేసింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. కుశాల్ పెరీరా (40 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పెరీరా, మాథ్యూస్ విజృంభణ ఓపెనర్ కుశాల్ పెరీరా తొలి ఓవర్ నుంచే దూకుడు కొనసాగించాడు. స్టెయిన్ వేసిన మొదటి ఓవర్లో పెరీరా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది ప్రొటీస్ బౌలర్లకు హెచ్చరిక పంపాడు. అదేజోరులో పెరీరా 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. పెరీరా అవుటయ్యాక మాథ్యూస్ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) కదంతొక్కి లంకకు భారీ స్కోరు అందించాడు. సఫారీ రనౌట్ దక్షిణాఫ్రికా 166 పరుగుల లక్ష్యాన్ని చేధించేలా కనిపించినా.. ఒత్తిడి ముందు మరోసారి చేతులెత్తేసింది. ఓపెనర్లు డి కాక్ (25), ఆమ్లా (23)తో పాటు డుమినీ (39), డివిలియర్స్ (24) రాణించారు. అయితే డివిలియర్స్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక చివరి రెండు ఓవర్లలో 19 పరుగులు చేయాల్సి ఉండగా సఫారీ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు కులశేఖర, మలింగ కట్టడి చేశారు. 19వ ఓవర్లో కులశేఖర బౌలింగ్‌లో బెహర్దీన్ అవుట్ కాగా... మలింగ వేసిన చివరి ఓవర్లో స్టెయిన్, మిల్లర్ రనౌటవడంతో సఫారీ విజయంపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) డివిలియర్స్ (బి) తాహిర్ 61; దిల్షాన్ (బి) స్టెయిన్ 0; జయవర్ధనే (సి) స్టెయిన్ (బి) మోర్నీ మోర్కెల్ 9; సంగక్కర (సి) సోట్సోబ్ (బి) తాహిర్ 14; మాథ్యూస్ (బి) స్టెయిన్ 43; చండిమాల్ (స్టంప్డ్) డి కాక్ (బి) తాహిర్ 12; తిషార పెరీరా (బి) మోర్నీ మోర్కెల్ 8; కులశేఖర నాటౌట్ 7; సేనానాయకే నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165 వికెట్ల పతనం: 1-17; 2-42; 3-83; 4-106; 5-137; 6-152; 7-160. బౌలింగ్: స్టెయిన్ 4-0-37-2; సోట్సోబ్ 4-0-31-0; మోర్నీ మోర్కెల్ 4-0-31-2; డుమినీ 2-0-13-0; అల్బీ మోర్కెల్ 2-0-24-0; తాహిర్ 4-0-26-3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (బి) మలింగ 25; ఆమ్లా (సి) దిల్షాన్ (బి) సేనానాయకే 23; డుమినీ (సి) దిల్షాన్ (బి) సేనానాయకే 39; డివిలియర్స్ (సి) సంగక్కర (బి) మాథ్యూస్ 24; మిల్లర్ (రనౌట్) 19; అల్బీ మోర్కెల్ (సి) చండిమాల్ (బి) మెండిస్ 12; బెహర్దీన్ (సి) జయవర్ధనే (బి) కులశేఖర 5; స్టెయిన్ (రనౌట్) 0; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 0; తాహిర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160 వికెట్ల పతనం: 1-32; 2-82; 3-110; 4-119; 5-133; 6-148; 7-151; 8-152. బౌలింగ్: కులశేఖర 3-0-23-1; మాథ్యూస్ 3-0-21-1; సేనానాయకే 4-0-22-2; మలింగ 4-0-29-1; తిషార పెరీరా 2-0-18-0; మెండిస్ 4-0-44-1. -
ఓడినా...బంగ్లా క్వాలిఫై
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడినా.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ 2 వికెట్ల తేడాతో బంగ్లాపై నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తర్వాత హాంకాంగ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఇర్ఫాన్ (34), మునీర్ దార్ (36) రాణించారు. మరో మ్యాచ్‌లో నేపాల్ 9 పరుగుల తేడాతో అప్ఘానిస్థాన్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. సుభాష్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత అఫ్ఘాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకు పరిమితమైంది. గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా నేడు జింబాబ్వే-యూఏఈ; నెదర్లాండ్స్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. -
దుమ్మురేపిన షఫీఖుల్లా
అఫ్ఘానిస్థాన్ విజయం హాంకాంగ్ ఆశలు గల్లంతు టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ చిట్టగాంగ్: షహజాద్ (53 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫీఖుల్లా (24 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తొలుత హాంకాంగ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. చాప్మన్ (43 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్), వకాస్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. నజీబ్ (7), అస్గర్ (13) విఫలమైనా... షహజాద్, షఫీఖుల్లా చెలరేగిపోయారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రెండో ఓటమితో హాంకాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత పొందే అవకాశాలు ఆవిరయ్యాయి.