ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానం బయట భయానక ఘటన చోటుచేసుకుంది. కోర్టు బయట ఉన్న వారిపై పోలీసులు లాఠీలు ఝలిపించారు.
బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్‌కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది.
మరోవైపు.. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తుపై కోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు బయట వందల సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమ్మిగూడారు. కృష్ణ దాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను జైలుకు తరలిస్తుండగా.. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కృష్ణ దాస్‌ను తీసుకెళ్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు సమాచారం.
🚨 SHAMEFUL! Fascist Yunus govt police 'BRUTALLY' beat Bangladeshi Hindus who were protesting against the 'ARREST' of Bangladesh ISKCON prominent saint Chinmoy Krishna Das Prabhu. pic.twitter.com/Nw1kw4dFl1
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 26, 2024
ఇదిలా ఉండగా.. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment