చిట్టగాంగ్‌ పిచ్‌ అతి సాధారణం: ఐసీసీ  | Chittagong pitch rated below average | Sakshi
Sakshi News home page

చిట్టగాంగ్‌ పిచ్‌ అతి సాధారణం: ఐసీసీ 

Published Wed, Feb 7 2018 1:42 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

Chittagong pitch rated below average - Sakshi

జహూర్‌ అహ్మద్‌ ఛౌదురి స్టేడియం పిచ్‌

చిట్టగాంగ్‌: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన చిట్టగాంగ్‌లోని జహూర్‌ అహ్మద్‌ ఛౌదురి స్టేడియం పిచ్‌ను ఐసీసీ ‘అతి సాధారణమైనది’ (బిలో యావరేజ్‌)గా పేర్కొంటూ ఒక డీ మెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది. ఐదు శతకాలు, ఆరు అర్థ శతకాలు నమోదైన ఈ టెస్టులో రెండు జట్లు కలిపి 1,533 పరుగులు చేశాయి.

‘కొత్త బంతి కూడా వేగంగా కదల్లేదు. అసలు బౌన్సే కనిపించలేదు. స్పిన్‌కు కొద్దిసేపే సహకరించింది. పూర్తిగా బ్యాట్స్‌మెన్‌ హవా సాగింది’ అంటూ పిచ్‌పై రిఫరీ డేవిడ్‌ బూన్‌ ఇచ్చిన నివేదికతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement