న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment