minorities
-
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్‌లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్‌లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్‌బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్‌పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్‌తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్‌సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్‌ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్‌ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్‌పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్‌ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Fact Check: బూటకాల బాబుకు రామోజీ బాకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు మేజర్ మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రామోజీ మరోసారి విషం చిమ్మారు. వైఎస్సార్సీపీకి ముస్లిం మైనారీటీలు అండగా ఉన్నారని గుర్తించిన దినకంత్రీ పత్రిక ఈనాడులో తప్పుడు కథనం వండివార్చారు. వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబుకు బాకా ఊదారు. మైనారిటీలను మోసం చేసిన జగన్ అంటూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు అందించిన సాయం, సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందించిన ఆర్థిక లబ్ది అధికారిక లెక్కలను గమనిస్తే నిజానికి మైనారిటీలకు ధోకా ఇచ్చింది ఎవరో ఇట్టే అర్థమవుతోంది. బాబు చేసిన అరకొర సాయాన్ని భూతద్దంలో చూపే యత్నం చేస్తున్న రామోజీ పచ్చకళ్లకు సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో మైనారిటీలకు కల్పించిన ఆర్థిక భరోసా కన్పించలేదు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్ల మేర మైనారిటీలకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోంది. మైనారిటీలకు ధోకా ఇచ్చింది బాబే.. ముస్లిం మైనారిటీ ర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదు. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్ హౌస్‌ల నిర్మాణం హామీ కార్యరూపం దాల్చలేదు. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానన్న హామీనీ బాబు అటకెక్కించారు. వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి వాటిని పరిరక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీలేని రుణాలు ఇస్తామని అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీనీ అమలు చేయలేదు. అయినా అప్పుడు బాబు ఘనకార్యాలు రామోజీ పచ్చకళ్లకు కనిపించలేదు. ఆరోపణ: ఇదీ వైకాపా ఘనకార్యం వాస్తవం: స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించి అమలు చేయలేదని ఈనాడు అడ్డగోలుగా రాసింది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు అందించింది. ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించి వారికి అండగా నిలిచింది. ఆరోపణ: రాయితీ రుణాలకూ పాతర వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉండటంతో వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర సాయం చేసి చేతులు దులుపుకోకుండా వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఆర్థిక, సామాజిక, రాజకీయ చేయూతను అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి అనేక పథకాలతో మైనారిటీలకు పెద్ద మేలు చేశారు. ఆరోపణ: ఇమామ్‌లు.. మౌజమ్‌లకు వెన్నుపోటే వాస్తవం: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం అందించే విషయంలో ఈనాడు చంద్రబాబు గొప్పులు ఘనంగా చెప్పే యత్నం చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆర్థిక సాయం అందిస్తే దాన్ని పెంచి మరీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతోంది. గత ప్రభుత్వం మౌజమ్‌లకు రూ.3 వేలు, ఇమామ్‌లకు రూ.5 వేలు మాత్రమే అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మౌజమ్‌లకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు ఆర్థిక సాయం పెంచి జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దీనికితోడు వారికి భరోసా ఇచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వన్‌టైమ్ ఫైనాన్సియల్ అసిస్టెన్సీ ఇచ్చింది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనార్టీలకు సుమారు రూ.100 కోట్లు అందించింది. షాదీతోఫా ద్వారానూ ఆర్థిక సాయాన్ని పెంచి అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఆరోపణ: తేదేపా హయాంలో రూ.248 కోట్ల రుణాలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో గొప్పగా రుణాలు ఇచ్చినట్టు రామోజీరావు బాకాలు ఊదారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధి, శిక్షణ, విద్యాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టు గొప్పలు పోయారు. వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలకు టీడీపీ ప్రభుత్వం రూ.343.52 కోట్లు కేటాయించి రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం శోచనీయం. ఐదేళ్లలో కేటాయించిన నిధులూ లబ్దిదారులకు ఖర్చు చేయలేని దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వానిది. మరోవైపు మైనారిటీల శిక్షణ–ఉపాధి పథకంలో 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.62 కేటాయించి అందులోనూ రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అదీ తొలి ఏడాది కేవలం రూ.4.30 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు మాత్రం గొప్పలు చెప్పుకొనేందుకు రూ.16.80 కోట్లు కేటాయించారు. బాబుకు రామోజీ చేస్తున్న భజనను జనం నమ్మరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం రామోజీ ఎంత బాజా వాయించినా జనం నమ్మే స్థితిలో లేరు. నవరత్నాల ద్వారా ఆర్థిక లబ్ధిని చేకూర్చే అనేక పథకాలను అందించడంతోపాటు మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలను సీఎం వైఎస్ జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ముస్లిం యువత వేలాది మంది బాగా చదువుకుని నేడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పలు రంగాలలో స్థిరపడి సామాజికంగా అభివృద్ధి చెందారు. అందుకే ఆ మహానేత వైఎస్సార్‌ని ముస్లిం సమాజం గుండెల్లో పెట్టుకుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి ముస్లింలకు మేలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డెప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించడమే కాకుండా నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి మరింత ఆదరణ చూపిన సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం అండగా ఉంటుంది. – డాక్టర్ మీర్చా షంషీర్ ఆలీబేగ్, చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
బాబు పొత్తులను చిత్తుచేయండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవకాశవాద పొత్తులపై రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కత్తులు నూరుతున్నారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీలతో కలిసి పోటిచేసి అధికారం చేపట్టిన ఆయన అప్పట్లో ఇచ్చిన ఏ హామీని అమలుచేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటినీ అటకెక్కించేరన్నారు. ఉదా.. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్‌హౌస్‌లు నిర్మిస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్‌లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్లు కేటాయిస్తానని, మైనారిటీలకు చెందిన వక్ఫ్ ఆస్తులు, చర్చిల ఆస్తుల రికార్డులను పక్కాగా తయారుచేసి వాటిని పరిరక్షిస్తామంటూ ఆయన ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోలేదని మైనారిటీలు గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పిన మాట కూడా అమలుకు నోచుకోలేదంటున్నారు. ఇక క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. కబ్జాదారుల నుంచి పేద క్రిస్టియన్లు, బలహీనవర్గాల భూములు కాపాడతామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని, క్రిస్టియన్ శ్మాశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్న హామీలను అధికారం చేపట్టిన అనంతరం పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని ఇదే చంద్రబాబు.. మళ్లీ అదే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుతో మరోసారి దగా చేసేందుకు వస్తున్నాడని, పొత్తులతో కట్టకట్టుకుని వస్తున్న ఆయనకు బుద్ధిచెప్పాలని క్రిస్టియన్, ముస్లిం నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీజేపీతో కలిసి బాబు పెద్ద తప్పుచేశారు మతతత్వ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకుని చంద్రాబాబు పెద్ద తప్పుచేశారు. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అనేక విష ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో ఆయన బీజేపీతో పెట్టుకుని 2019లో ఆ పార్టీని వీడి ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చి మళ్లీ ఇప్పుడు ఆయన కాళ్లబేరానికి వచ్చాడు. బీజేపీ, జనసేనలతో కలిసి వస్తున్న చంద్రబాబును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా తనదైన ముద్ర వేసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారు. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత క్రిస్టియన్ రైట్స్ చైర్మన్ ముస్లింలను అణగదొక్కిన బాబుకు బుద్ధిచెబుతాం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత అణగదొక్కారు. మైనారిటీ శాఖను మైనారిటీలకు కాకుండా చేశారు. ఐదేళ్లపాటు ముస్లింలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని బాబు ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా ఇచ్చామనిపించారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న బాబు అదే పోకడలతో ముస్లింలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెప్పడం ఖాయం. – షేక్ మునీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కర్వీనర్ -
బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిశారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే కేటాయించడం పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటనలు గుప్పించారు. యువతకు 40 శాతం సీట్లు ఎక్కడంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
ఆ 23 మంది బలైనారా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మకద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు.. అత్యంత హేయమైంది కూడా. 2014లో... అన్నీ తానై.. తనవారిని గెలిపించుకున్న ఎంఎల్ఏల్లో 23 మంది, ఎంపీల్లో ముగ్గురు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు. పదవులకు ఆశపడ్డారు. భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారంతా రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకూ ఆ ఎన్నికల్లో 23 సంఖ్య శాపమై నిలిచి,, చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?.. వివరించే కథనమే ఇది. 23 మందిలో అద్దంకి నుంచి పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన (పామర్రు), పాలపర్తి డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), టి. జయరాములు (బద్వేలు), మణిగాంధీ (కోడుమూరు), మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ ఛాంద్బాషా (కదిరి), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు) వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు)కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భూమా బ్రహ్మానంద రెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎం.డి.ఫరూక్‌కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకులదీ అదే దుస్థితి. గత ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన నాలుగు రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ముగ్గురు ఎంపీల దుస్థితి అంతా ఇంతా కాదు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో ముగ్గురు ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితీ అంతే. ఆమెకు టికెటు దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. కందుకూరు: పోతుల రామారావు తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు, గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది. యర్రగొండపాలెం (ఎస్సీ): పాలపర్తి డేవిడ్‌రాజు టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్దమొత్తంలో ముట్టజెపుతానని, వెలిగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలిచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన బాబు మాట తప్పారని డేవిడ్‌రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తుచేస్తుంటారు. 2019 ఎన్నికల్లో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్‌రాజు ప్రకటించుకున్నారు. బాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం. గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాడేరు (ఎస్టీ): గిడ్డి ఈశ్వరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. పాతపట్నం– కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. అరకు (ఎస్టీ): శ్రావణ్‌కుమార్ 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన రెండేళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి పోటీచేసిన శ్రావణ్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. రెండేళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్చార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సివేరి దొన్ను దొరను అరకు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చంటున్నారు. రంపచోడవరం (ఎస్టీ): వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లె సునీత , కారం పోచమ్మ , మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గూడూరు (ఎస్సీ): పాశం సునీల్ కుమార్ టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019లో పోటీచేసి వి.వరప్రసాద్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా కొనసాగుతున్న సునీల్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. జగ్గంపేట– జ్యోతుల నెహ్రూ సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుపడుతోంది. ఆ పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు టీడీపీ కండువా కప్పుకున్న వరుపులకు చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్ కాదుకదా కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. సుబ్బారావును కాదని వరుపుల రాజా(గతేడాది చనిపోయారు)కు ఇచ్చారు. తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పలమనేరు– ఎన్.అమర్నాథ్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో 33 వేల ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బొబ్బిలి– ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్‌కృష్ణ రంగారావు) టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబినాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. పామర్రు (ఎస్సీ): ఉప్పులేటి కల్పన పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయవాడ వెస్ట్– జలీల్‌ఖాన్ టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్‌ఖాన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది. జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్లు తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపా«ధ్యక్షుడి హోదాలో ఉన్నారు. బద్వేలు (ఎస్సీ) టి.జయరాములు బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములుకు 2019లో టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబులాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తర్వాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు. కదిరి– అత్తర్ చాంద్ బాషా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు. శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ– భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిల ప్రియ టీడీపీలోచేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌ను ఇన్చార్జిగా నియమించారు. కర్నూలు– ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. కోడుమూరు– మణిగాంధీ మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఇన్చార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు. -
తప్పుడు రాతలను నిరసిస్తూ గుంటూరు ఈనాడు ఆఫీసు ముందు ధర్నా
-
40 నియోజకవర్గాల్లో కీలకం.. ముస్లింలు ఎటువైపు?
అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు జై కొట్టెదేవరికి..? వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ వెంట నడిచినన ముస్లిం ఓటర్లు ఈసారి ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ముస్లిం ఓట్ల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ముస్లిం ఓట్లు కీలకం. మెజారిటీ స్థానాల్లో గెలుపోటములపై ప్రభావితం కనబర్చే మైనారిటీ ఓటర్లపై ప్రధాన రాజకీయపక్షాలు దృష్టి సారించాయి. అధికార బీఆర్ఎస్ ‘అభివృద్ధి, సంక్షేమ’ మంత్రంతో మరోసారి అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ పాలనపై ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఈసారి అధికారం హస్తగతం ఖాయమన్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. భారతీయ జనతాపార్టీ మాత్రం మైనారిటీ ఓట్లపై పెద్దగా ఆశలేనప్పటికీ కేంద్రంలోని సుస్థిర ప్రభుత్వం చూపి కొన్ని ఓట్లయినా రాబట్టుకోవాలని యత్నిస్తోంది. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కీలకం హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు మరో 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా సుమారు 43 శాతం వరకు,æ ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో 34 నుంచి 38 శాతం, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌లో 20 నుంచి 28 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం10 నుంచి 18 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం అధికార బీఆర్ఎస్ ముస్లిం ఓట్లపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. గత రెండు పర్యాయాలు కలిసివచ్చినట్టుగానే ఈసారి కూడా ముస్లిం ఓటర్లు తమవెంటే నని భావిస్తోంది. తొమిదిన్నర ఏళ్లలో మైనారిటీ అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 9,166 కోట్ల ఖర్చుచేసినట్లు పేర్కొంటోంది. 204 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి అందులో 1.31 లక్షల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పన చేపట్టడం తమకు కలిసి వచ్చే అంశంగా అంచనా వేస్తోంది. షాదీ ముబారక్ పథకం కింద 2.68 లక్షల మందికి ఆర్థిక చేయూత, విదేశీ విద్య తదితర పథకాలు కలిసి వస్తాయని భావిస్తోంది. వాస్తవానికి దశాబ్ద కాలంగా ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వెంట నడుస్తున్నారనే చెప్పాలి. 2014లో తెలంగాణ సెంటిమెంట్, 12శాతం రిజర్వేష¯న్ హామీలతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ముస్లిం వర్గాలు 2018లో మైనారిటీ గురుకులాలు, షాదీ ముబారక్, శాంతి భద్రత తదితర అంశాల ప్రభావంతో బీఆర్ఎస్ వెంటే నడిచాయి. ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం బీఆర్ఎస్ గెలుచుకోవడమే ఇందుకు బలం చేకూర్చుతోంది. సబ్‌ప్లాన్ డిక్లరేషన్‌తో సహా కాంగ్రెస్ హామీల వెల్లువ ఈసారి ఎలాగైనా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెంచుకుంది. ముస్లిం ఓటర్లు కలిసివస్తే అధికారం హస్తగతం కావడం సులువవుతుందన్న ఆకాంక్షతో వారి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్స్ డిక్లరేషన్ ప్రకటించింది. మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచుతామని హామీ ఇస్తోంది. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందిస్తామని, కులగణనతో న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్యావంతులకు ఆర్థిక చేయూతను అందిస్తామని, మైనారిటీ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానాలు గుప్పిస్తోంది. ఈ హామీలతో మైనారిటీ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్ భావిస్తోంది. మజ్లిస్ మామ పల్లవి మజ్లిస్ పార్టీ తన మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్కు ముస్లిం ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రాంతాల్లో హలత్–ఏ–హజిరా పేరిట బహిరంగ సభలతో నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌వైపు ముస్లిం ఓటర్లు మొగ్గుచూపకుండా కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీతో సమానంగా కాంగ్రెస్‌ను పోల్చుతూ విమర్శనా్రస్తాలు సంధిస్తోంది.. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని...సీఎం కేసీఆర్‌ను మామగా సంబోధిస్తూ కొత్త పల్లవి అందుకుంది. స్వయంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభల్లో విరివిగా పాల్గొని ప్రసంగిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒవైసీ ప్రసంగాలు కొంత వరకు మైనారిటీ ఓటర్లపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. -మహమ్మద్ హమీద్ ఖాన్ -
మనది మనసున్న ప్రభుత్వం. మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మైనారిటీల గురించి సీఎం జగన్..!
-
మూడో వంతు స్థానాల్లో..ముస్లింలే కీలకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మూడింట ఒక వంతు స్థానాల్లో ముస్లింల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే.. వారి గెలుపు కాస్త సులభతరం అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 14% వరకు ముస్లింల జనాభా ఉండగా 40 వరకు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే వీరి మద్దతు పొందిన పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ కారణంగానే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని తమ వైపు ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ముస్లింలు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మెజారిటీ వర్గం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)కే మద్దతు ఇస్తూ వచ్చింది. అంతకుముందు వీరు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో డాక్టర్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడమేకాక.. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2014 ఎన్నికల నుంచి బీఆర్ఎస్కు ముస్లింలు మద్దతుగా నిలిచారు. ఎంఐఎం) పూర్తిస్థాయి సహకారం ఈ పార్టీకి లభిస్తూ వస్తోంది. ఈసారి కూడా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో మినహా మిగతా చోట్ల పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ ముస్లింలు బీఆర్ఎస్కు మద్దతివ్వాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటనలో బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. కానీ ఈసారి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం లేదంటూ.. కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ముస్లింలు జేడీఎస్‌ను కాంగ్రెస్‌కు బాసటగా నిలవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విధమైన వాతావరణం ఏర్పడే చాన్స్‌ను తోసిపుచ్చలేమని అంటున్నారు. రాజధాని నియోజకవర్గాలతో పాటు..: హైదరాబాద్ నగర పరిధిలోని యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్‌పేట, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నారు. అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ముధోల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, ఉమ్మడి రంగారెడ్డిలోని తాండూరు, మల్కాజిగిరి, మహేశ్వరం, వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా వీరి మద్దతుతో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీయేతర నియోజకవర్గాల్లో పాగా వేయాలని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఆ మూడూ ఒక్కటే అంటూ కాంగ్రెస్...: కర్ణాటకలో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా వ్యవహరిస్తోందని, బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనంటూ గుర్తు చేస్తోంది. ముందు నుంచి మైనారిటీలపై కాంగ్రెస్‌ది సానుకూల దృక్పథమేనని చెబుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేనని, అంతర్గత అవగాహనతో పనిచేస్తున్నాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఇతర రాష్ట్రాలలోని సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తూ బీజేపీకి సహకరిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల సంక్షేమానికి భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటామని గట్టిగా హామీ ఇస్తోంది. సంక్షేమ పథకాలే ఆలంబనగా బీఆర్ఎస్..: మైనారిటీలను ఆకట్టుకోవడానికి బీఆర్ఎస్ గడచిన తొమ్మిదిన్నరేళ్లుగా ఆ వర్గానికి అందించిన సంక్షేమ పథకాలపైనే భరోసా పెట్టుకుంది. ఈసారి కూడా ముస్లింలు తమకే మద్దతు పలుకుతారనే ధీమాతో ఉంది. అదే సమయంలో వారు తమ చేజారే అవకాశం లేకుండా.. తాము బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే అవకాశం లేదంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పరస్పరం సహకరించుకుంటున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తోంది. మరోవైపు మైనారిటీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడమేకాకుండా..మంత్రివర్గంలో కీలకమైన పదవిని ఆ వర్గానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతుండటాన్ని, కర్ఫ్యూల్లాంటివి లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుండటాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్..వినాయక నిమజ్జన సమయంలో ముస్లింలు పెద్ద మనస్సు చేసుకుని మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారంటూ పదే పదే గుర్తు చేయడం ద్వారా ఆ వర్గానికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం కూడా గమనార్హం. -
మైనార్టీలు భయంతో బతుకుతున్నారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. 2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్ఎస్తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్‌లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో మైనార్టీలు భద్రంగా లేరా?
భారతదేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతోందని అమెరికా ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్’ (యూఎస్సీ ఐఆర్ఎఫ్) భారత దేశ సార్వభౌమాధికా రానికి వ్యతిరేకంగా రిపోర్టులను తయారు చేసిన విషయం ఈ దేశ ప్రజలలో చాలా మందికి తెలియదు. అమెరికా మత, రాజ కీయ ప్రయోజనాలను కాపాడడం కోసం 1998లో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక సలహా సంస్థే ఈ యూఎస్సీఐఆర్ఎఫ్. అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఆగమేఘాలపై రిపోర్టులను తయారు చేసి, ఐక్యరాజ్యసమితి ముందు ప్రవేశపెట్టి, ప్రపంచంలోని సార్వభౌమాధికార దేశాలను ఇబ్బంది పెట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితర మైనార్టీ మతాలవారు అనేక ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారనీ, వారి కనీస హక్కులకు భంగం కలిగించేలా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అమెరికా ఆయిల్, ఫార్మా, డిఫెన్స్ లాబీయింగ్ యధేచ్ఛగా నిర్వహించి, తన దేశ ప్రయో జనాలను నెరవేర్చుకునేది. మోదీ ప్రభుత్వంలో ఇవి సాగడం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని భారతదేశం తనకు అనుకూలంగా మలుచుకుని, తక్కువ ధరలకు రష్యా నుండి ఆయిల్‌ను సమ కూర్చుకోవడం, తక్కువ ధరలకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను తూర్పు ఆసియా దేశాలకు అమ్మడం, కరోనా టీకాను ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు ప్రవేశపెట్టడం ఇత్యాది విషయాలన్నీ అమెరికాకు కోపం తెప్పించేవే. నిజంగా భారతదేశంలో మైనార్టీలు భద్రంగా లేరా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదట ముస్లింల సంగతి చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని భద్రత భారతదేశంలోని ముస్లింలకు ఉంది. వారి ఓటు బ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలూ సాగిలపడడం మనం చూస్తూనే ఉన్నాం! ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు భద్రత కరువైందని చెప్పడం ఒక దుష్ప్రచారం. వక్రబుద్ధితో కూడిన విష ప్రచారం. ఈ దేశంలో భద్రత లేకపోతే బర్మా, బంగ్లాదేశ్‌ల నుండి లక్షల సంఖ్యలో ముస్లింల అక్రమ వలసలు ఎందుకు జరుగుతున్నట్టు? 1947లో మతం ప్రాతి పదికగా ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పాట య్యింది అనేది వాస్తవం కాదా? అటువంటి పాకిస్తాన్లో మైనారిటీలైన హిందు వుల పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలియని విషయమేమీ కాదు. ఇక క్రైస్తవుల విషయానికొస్తే – ఈశాన్య రాష్ట్రా లైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు క్రైస్తవ మెజార్టీ రాష్ట్రాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయి? ఇక మోదీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో మతపరమైన వివక్షతలను ఎక్కడా చూపడం లేదనే విషయం స్పష్టం. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమి వేయడం, అనేక మందిని హత్య చేయడం వంటి విషయాలను ఏనాడు ప్రశ్నించని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ నిప్పు లేకుండానే పొగ ఎందుకు పెట్టింది అనే మర్మాన్ని ఈ దేశ ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు. కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరే. సీఎం వైఎస్ జగన్ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది. – డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు, పాస్టర్లకు ఎలాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరితోపాటు మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది. – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే విద్యా సంస్కరణల్లో మనమే మేటి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది. మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం. వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. – మంత్రి బొత్స సత్యనారాయణ ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్‌లో హెల్త్ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్ వలంటీర్లను నియమించాలి. – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే విద్యలో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్‌కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్‌ను మెర్జింగ్ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్‌ను డీమెర్జింగ్ చేయాలి. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ ఎం.జగన్మోహన్రావు, నందిగామ ఎమ్మెల్యే పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్ ఏర్పాటు చేయండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ఏపీలో బెస్ట్ విద్యా వ్యవస్థ ఉంది రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్‌లో ప్లస్ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్‌లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి. – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచండి స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆరు, ఏడు తరగతులకు రీడింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్మెన్లను నియమించాలి. – కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే -
మైనారిటీ స్కాలర్షిప్ పేరిట రూ.144 కోట్ల కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. మైనారిటీలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్‌గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు. గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్షిప్లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేవారు. Central Bureau of Investigation (CBI) registers case against unknown officials in connection with alleged minority scholarship scam of Rs 144 crores — ANI (@ANI) August 29, 2023 ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ.. -
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్‌మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
మైనార్టీ లకూ ‘లక్ష’ణమైన పథకం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ‘లక్ష’ణమైన పథకాన్ని ప్రకటించింది. స్వయం ఉపాధి పొందుతున్న, ఉపాధికి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ఒకింత ఊతమివ్వనుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నిబంధనలకు అనుగుణంగా అర్హతలను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ నిబంధనలే అమలు: ప్రభుత్వం గత నెలలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్దిదారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కొన్ని నిబంధనలు విధించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్ధారించి లబ్దిదారులకు రూ.లక్ష చెక్కులు ఇస్తోంది. మైనార్టి లకు ఆర్థిక సాయం పథకానికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 2022–23 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ పథకం కింద పరిశీలిస్తారు. వీటినే 2023–24 ఆర్థిక సాయం కింద మార్పు చేసి అర్హతల మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టి స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయమందిస్తారు. క్రిస్టియన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హతలను నిర్ధారిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 2023 జూన్ 2 నాటికి 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీస్థాయిలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో కలెక్టర్ జాబితాను ఖరారు చేస్తారు. అర్హుల జాబితాను టీఎస్ఎంఎఫ్సీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. (బాక్స్) మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మైనార్టి ల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తూ మైనార్టి ల్లోని వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తోందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్షను ప్రభుత్వం అందిస్తోందని సీఎం చెప్పారు. -
మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జలవిహార్ లో జరిగిన మైనార్టీనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘ మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ సన్మానించారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ... మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్. హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు. మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. కాంగ్రేస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. (చదవండి: బర్త్, స్టడీ సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు) దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే. ఈ బడ్జెట్ లో మీ సంక్షేమం కోసం 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినం. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నాం. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మయి నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది. ముస్లింల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. (చంద్రబాబు వారసుడు రేవంత్) -
ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు. అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అపార్థాలకు తావివ్వరాదు భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్‌తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్‌లో తగదు. ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు. -
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అద్దంకి నేతృత్వంలో ఐదు రోజులుగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సహా ఇతర కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తెలంగాణ సామాజిక కాంగ్రెస్ బృందం బీసీ, ఎస్సీ, ఎస్టీల అంశాలు, సమస్యలపై చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయా లని చేసిన విజ్ఞప్తిపై పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేగాక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని అద్దంకి వివరించారు. వీటితో పాటు ఎనిమిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ధరణి కారణంగా దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. (చదవండి: మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!) -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్‌లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్‌గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్‌గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం.