
సాక్షి, న్యూఢిల్లీ: మైనార్టీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించారు. ‘‘భారత్‌పై పాకిస్తాన్ ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలి. పాక్‌తో పోలిస్తే మైనార్టీలు భారత్‌లోనే క్షేమంగా ఉన్నారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్‌లో మైనార్టీల జనాభా శాతం 20శాతం ఉంటే ఇప్పడు 2 శాతానికి పడిపోయింది’ అంటూ ట్విటర్ వేదికగా కైఫ్ కౌంటర్ ఇచ్చారు.
‘భారత్‌లో మైనార్టీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇటీవల ఇమ్రాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్‌లోని అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖండించారు. కాగా ఇమ్రాన్, కైఫ్ ఇద్దరూ కూడా మాజీ క్రికెటర్లు కావడం గమన్హారం.
There were around 20% minorities at the time of Partition in Pakistan,less than 2% remain now. On the other hand minority population has grown significantly in India since Independence. Pakistan is the last country that should be lecturing any country on how to treat minorities. https://t.co/6GTr3gwyEa
— Mohammad Kaif (@MohammadKaif) December 25, 2018
Comments
Please login to add a commentAdd a comment