సాక్షి, హైదరాబాద్: గతంలో మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌పార్టీ ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోయిందని, ఓట్లు వేయించుకుని మైనార్టీలను కాంగ్రెస్‌పార్టీ నాయకులు మోసగించారని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మైనార్టీలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
మైనార్టీలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఏ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాన మంత్రి మోదీని బడే భాయ్ అని సంబోధించారని, అసలు కాంగ్రెస్‌పార్టీ సెక్యులర్ పార్టీయా.. కాదా..? అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment