mohammad kaif
-
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు
టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఘాటు విమర్శలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరులు అనిపించుకుంటే సరిపోదని.. టెస్టుల్లో కూడా సత్తా చాటితేనే విలువ ఉంటుందని పేర్కొన్నాడు. తదుపరి పాకిస్తాన్ మీద వన్డే మ్యాచ్ గెలిచేసి.. ఆహా ఓహో అని పొగిడించుకునేందుకు భారత క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని.. అయితే, అంతకంటే ముందు టెస్టుల్లో ఎలా మెరుగుపడాలో ఆలోచించాలంటూ కైఫ్ చురకలు అంటించాడు.అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ ట్రోఫీకాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2019-21 సీజన్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అనంతరం.. 2021-23 సీజన్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలో తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ముచ్చటగా మూడోసారీ ఫైనల్ చేరి.. ఈసారి కచ్చితంగా డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధిస్తుందని అభిమానులు భావించగా.. రోహిత్ సేన తీవ్రంగా నిరాశపరిచింది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై.. అనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లోనూ 3-1తో ఓడిపోయింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.చాంపియన్లమని అంతా పొగుడుతారుఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ఫిబ్రవరి 23న.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా టీమిండియా ప్రశంసలు అందుకుంటుంది.అపుడు.. మనం వైట్‌బాల్ క్రికెట్లో చాంపియన్లమని అంతా పొగుడుతారు. అయితే, భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవాలంటే మాత్రం మనకొక పటిష్టమైన టెస్టు జట్టు అవసరం ఉంది. సీమింగ్ ట్రాకులపై ఎలా ఆడాలో మనవాళ్లు నేర్చుకోవాలి.చేదుగా ఉన్నా ఇదే నిజంమనం కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే వీరులం అనిపించుకుంటున్నాం. చేదుగా ఉన్నా ఇదే నిజం. కానీ.. మనం టెస్టుల్లో బాగా వెనుకబడి ఉన్నాం. ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ గెలవాలనుకుంటే మాత్రం ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలి.టర్నింగ్ ట్రాకుల(స్పిన్ పిచ్)పై సత్తా చాటడంతో పాటు.. సీమింగ్ ట్రాకులపై కూడా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే.. డబ్ల్యూటీసీ టైటిల్ గురించి మర్చిపోవాల్సిందే’’ అని కైఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గంభీర్ తప్పేమీ లేదుఅదే విధంగా.. కివీస్, కంగారూ జట్ల చేతిలో ఘోర పరాభవాలకు కేవలం హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని కైఫ్ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి... మనకొక మేలుకొలుపు లాంటిది. ఇప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి. ఈ ఓటములకు గౌతం గంభీర్ ఒక్కడే బాధ్యుడు కాడు. ఆటగాళ్లంతా రంజీల్లో ఆడాలి. కానీ అలా చేయకుండా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండా.. నేరుగా బరిలోకి దిగుతామంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’’ అంటూ కైఫ్ ఆటగాళ్లపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. అనంతరం .. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్!Khari khari baat.. Kadwa sach#TestCricket #BGT #AUSvIND#CricketWithKaif11 pic.twitter.com/WXFJY9aLSq— Mohammad Kaif (@MohammadKaif) January 5, 2025 -
వీఐపీ ట్రీట్మెంట్ గురించి మర్చిపోండి.. ఇకనైనా.. కైఫ్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ల వైఫల్యం వల్లే భారత్‌కు స్వదేశంలో ఘోర పరాభవం ఎదురైందని అభిమానులు సైతం మండిపడుతున్నారు. కనీసం ఆస్ట్రేలియా సిరీస్‌లోనైనా సత్తా చాటి జట్టును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు.. భారత మాజీ క్రికెటర్లు మాత్రం.. రోహిత్- కోహ్లి ఇప్పటికైనా దేశవాళీ క్రికెట్ ప్రాముఖ్యతను గుర్తించి.. రంజీ బరిలో దిగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టిఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ కీలకం కానున్నాడన్న కైఫ్.. సీనియర్లు తమ విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టి చెమటోడ్చాలని సూచించాడు. పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో తిరగడం కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని పేర్కొన్నాడు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చారంటే రోహిత్, కోహ్లిలాంటి వాళ్లకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘పరుగులు రాబట్టేందుకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో.. ఎవరికైతే సరైనంత ప్రాక్టీస్ టైమ్ దొరకడం లేదో.. వారు వందకు వంద శాతం దేశవాళీ క్రికెట్ ఆడాలి.అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ దొరకకపోవచ్చుమేము పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో ప్రయాణిస్తామనే విషయాన్ని మర్చిపోవాలి. మీకు అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ దొరకకపోవచ్చు.. కానీ ఫామ్‌లోకి రావాలంటే ఇదొక్కటే మార్గం’’ అని కైఫ్ కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. అదే విధంగా.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో రిషభ్ పంత్ మరోసారి కీలకంగా మారనున్నాడని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలంకాగా న్యూజిలాండ్‌తో తాజాగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్, కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఆరు ఇన్నింగ్స్‌లో రోహిత్ వరుసగా 2, 52, 0, 8, 18, 11 పరుగులు మాత్రమే చేయగా.. కోహ్లి 0, 70, 1, 17, 4, 1 రన్స్ రాబట్టాడు. ఇద్దరూ కలిసి కేవలం 184 పరుగులు మాత్రమే చేశారు. ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. కాగా దేశవాళీ క్రికెట్లో రోహిత్ ముంబై, కోహ్లి ఢిల్లీకి ఆడిన విషయం తెలిసిందే.చదవండి: BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం -
'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.ఫలితంగా తొలిసారి సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ గురైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం అసన్నమైంది అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.అయితే రోహిత్ శర్మ భవితవ్యం త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించికపోతే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ తర్వాత ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తదుపరి భారత టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపడతాడని కైఫ్ జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్‌గా పోటీలో ఉన్నాడు. భారత టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని రకాల ఆర్హతలు పంత్‌కు ఉన్నాయి. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా పంత్‌కు ఉంది.ఇప్పటికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్‌లు ఆడాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా వంటి విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అది స్పిన్ ట్రాక్, పేస్ ట్రాక్ అయినా పంత్ ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు" అని తన ఇనాస్టా లైవ్‌లో పేర్కొన్నాడు.కాగా ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఓసారి రోహిత్ గైర్హజరీలో జట్టును కూడా బుమ్రా నడిపించాడు. ఈ క్రమంలో బుమ్రాను కాదని పంత్‌ను రోహిత్ వారసుడిగా కైఫ్ ఎంచుకోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.చదవండి: Paris Olympics 2024: ఆమె మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్ -
ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్ కైఫ్
ఐపీఎల్-2025 సీజన్లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకురావడంతో.. ధోని రిటెన్షన్‌కు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది సీజన్లో ధోని అన్క్యాప్డ్ కోటాలో సీఎస్కే తరపున బరిలోకి దిగనున్నాడు. అతడిని రూ. 4 కోట్ల కనీస ధరకు సీఎస్కే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిలో ఆడాలనే కోరిక ఉన్నంతవరకు ఐపీఎల్ నియమాలు మారుతూనే ఉంటాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు."వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని ఆటను మనం చూడబోతున్నాం. అతడు ఫిట్‌గా ఉన్నాడు. అంతేకాకుండా తన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనక కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఎంఎస్ ఆడాలనుకున్నంత కాలం, నియమాలు మారుతూనే ఉంటాయి. ధోని కోసం రూల్స్ మార్చిన తప్పులేదు. అతడొక లెజెండ్, సీఎస్కేకు మ్యాచ్ విన్నర్. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను ధోని కోసమే తిరిగి తీసుకు వచ్చారని నేను భావిస్తున్నాను. ధోనికి మనీతో పనిలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చాలా సార్లు చెప్పాడు.టీమ్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటే అది చేస్తానని తలా గతంలో స్పష్టం చేశాడు. రూ. 4 కోట్లు అనేది అతడికి చిన్నమొత్తం అయినప్పటకి, సీఎస్కే రిటైన్ చేసుకునేందుకు సిద్దంగా ఉంది. సీఎస్కేతో అతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ?ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ రూల్ ద్వారా రిటైన్ అవ్వడానికి ధోనితో పాటు మోహిత్ శర్మ(గుజరాత్ టైటాన్స్), సందీప్ శర్మ(రాజస్తాన్), పియూష్ చావ్లా(ముంబై ఇండియన్స్) మాత్రమే అర్హులు. వీరిందరూ గత ఐదేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
కెప్టెన్‌గా హార్దిక్ సరైనోడు.. అతడు ఏం తప్పు చేశాడు?
టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు కాకుండా వేరొకరికి పగ్గాలు అప్పజెప్పడం సరికాదని పేర్కొన్నాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడు ఎవరా అన్న అంశంపై చర్చలు జరిగాయి. భారత టీ20 కెప్టెన్‌గా.. ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నియామకం లాంఛనమే అని అభిమానులు భావించారు.ఆటగాడిగా మాత్రమే హార్దిక్ పాండ్యాఅయితే, అనూహ్యంగా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంకతో సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అతడిని కెప్టెన్‌గా ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. హార్దిక్ పాండ్యాకు జట్టులో ఆటగాడిగా మాత్రమే చోటిచ్చింది.ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ నియామకం విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తారని భావించాను.ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలపడంతో పాటు.. మరోసారి కూడా ఫైనల్ చేర్చాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.అంతేకాదు టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ కూడా అతడే! అయితే, ఇప్పుడు కొత్త కోచ్ వచ్చాడు. కాబట్టి తన ప్రణాళికలకు అనుగుణంగా అంతా ఉండాలని అనుకుంటున్నాడేమో!అతడి విషయం నాకు తెలియదు కానీ.. హార్దిక్‌ను పక్కనపెట్టడం సరికాదు. ఐపీఎల్లో టైటాన్స్‌ను జీరో నుంచి హీరోను చేసిన ఘనత హార్దిక్‌దే.నిజానికి సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్‌గానూ రాణించాలని కోరుకుంటున్నాను. అయితే, హార్దిక్ పాండ్యా సారథిగా ఉంటే బాగుండేది.తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడు? కోచ్‌గా గంభీర్ తన నిర్ణయాలు అమలు చేయాలనుకోవచ్చు. కానీ హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ కాకుండా తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడో అర్థం కావడం లేదు’’ అని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టును విజయపథంలో నిలపలేకపోయాడున. అదే విధంగా తరచూ గాయాల బారిన పడే హార్దిక్ లాంటి ఆటగాళ్లు తనకు కెప్టెన్లుగా వద్దని కొత్త కోచ్ గౌతం గంభీర్ చెప్పినట్లు సమాచారం.అదే విధంగా.. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సూర్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్‌కు బదులు సూర్యను కెప్టెన్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. టీ20 సిరీస్‌తో ఈ టూర్ మొదలుకానుంది.చదవండి: నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన -
SRH: ధోని రావొద్దనే కమిన్స్ ‘కన్నింగ్’ ప్లాన్?!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ శుక్రవారం ఉప్పల్ వేదికగా సీఎస్కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్ మీద రన్స్ రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్ పరిస్థితులను రైజర్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు. శివం దూబే ఒక్కడు ధనాధన్ ఇన్నింగ్స్(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్ తన బౌలింగ్‌లోనే అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక పందొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జడ్డూ రనౌట్ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. దీంతో రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్ వచ్చింది. ఇక డారిల్ మిచెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్ కమిన్స్‌కు రెండు ప్రశ్నలు.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? ఒకవేళ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్‌ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్ పరోక్షంగా కమిన్స్‌ను తప్పుబట్టాడు. అదే సమయంలో.. వరల్డ్‌కప్ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్‌కప్‌నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. Two questions to Pat Cummins on withdrawing the obstructing the field appeal against Jadeja. Was it a tactical call to let a struggling Jadeja be the crease and keep Dhoni indoors? Would he have done the same if it was Virat Kohli at World T20? — Mohammad Kaif (@MohammadKaif) April 5, 2024 మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ మార్ష్. కమిన్స్ కాదు. మీరు కావాలనే విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నైపై సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్‌లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్‌ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్‌గా డిఫెన్సివ్‌గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
అతడి ఖేల్ ఖతం?!.. టీమిండియా సెలక్టర్లు ఏమైనా అనుకోని...
Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం. ఇక తన కెరీర్లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్‌లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్‌ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు. పరుగుల వరద పారించడమే పని ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు. Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5 — Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024 కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
తమ్ముడి అరంగేట్రం.. మహ్మద్ షమీ భావోద్వేగం!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌తో మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహ్మద్ షమీ భావోద్వేగ పోస్ట్ చేశాడు. "ఎట్టకేలకు నీవు అనుకున్నది సాధించావు. బెంగాల్ వంటి అద్బుత జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతీ మ్యాచ్‌లోను 100 శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ కైఫ్ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా మహ్మద్ కైఫ్ కూడా షమీ మాదిరే రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్‌కు ఈ ఏడాది రంజీ సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన బెంగాల్ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గతేడాది ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన
ICC CWC 2023 Winner Australia: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. మీరంటే నాకిష్టం అంటూనే.. అసలైన రోజున ఆడినవాళ్లకు మాత్రమే విజేతలుగా నిలిచే అర్హత దక్కుతుందని ఉద్ఘాటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తద్వారా టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరింది భారత జట్టు. మరోవైపు.. ఆరంభంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి.. తుదిమెట్టుకు చేరుకుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఫైనల్లో జయభేరి మోగించి.. ఏకంగా ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టు వరల్డ్‌కప్ గెలిచిందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది’’ అని కైఫ్ అన్న క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గ్లెన్ మిచెల్ అనే యూజర్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. వార్నర్ స్పందించాడు. ‘‘నాకు ఎంకే(మహ్మద్ కైఫ్) అంటే ఇష్టమే.. అయితే.. పేపర్ మీద ఏం కనబడుతుందన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నిటికంటే కీలకం. అదే ఆటకు అర్థం. 2027లో చూద్దాం’’ అంటూ వార్నర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించాడు. చదవండి: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం? I like MK, issue is it does not matter what’s on paper. At the end of the day you need to perform when it matters. That’s why they call it a final. That’s the day that counts and it can go either way, that’s sports. 2027 here we come 👍 https://t.co/DBDOCagG2r — David Warner (@davidwarner31) November 22, 2023 -
కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు
"Stay on Instagram but be here as well": టీమిండియా క్రికెటర్ల ఆట తీరుపై మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. కండలు పెంచి ఫొటోలు షేర్ చేస్తే సరిపోదని.. మైదానంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యమంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఆసియా కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో భారత జట్టు సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే. మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్ శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లను దింపినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తేల్(38), ఆసిఫ్ షేక్(58) మెరుగైన స్కోర్లు సాధించారు. PC: Star Sports ఆరంభంలో వీళ్లిద్దరు ఇచ్చిన మూడు గోల్డెన్ మ్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిస్ చేయడం వల్ల ఈ మేరకు భారత బౌలర్లకు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్.. క్యాచ్ డ్రాప్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెద్ద పెద్ద కండలు ఉంటే సరిపోదు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..‘‘మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారన్న విషయంతో సంబంధం లేదు. మీకు పెద్ద పెద్ద కండలు ఉండొచ్చు. జిమ్‌లో వర్కౌట్లతో మీరు నిరంతరం శ్రమిస్తూ ఉండవచ్చు. అంతేనా... అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయనూ వచ్చు. అయితే, మైదానంలో మీరు చురుగ్గా కదలలేకపోతే.. ఏం లాభం? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లు ఇక్కడా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలి కదా!’’ అని అయ్యర్, కోహ్లి, ఇషాన్‌లను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. శ్రేయస్ అయ్యర్ కోహ్లికి ఇదేం మొదటిసారి కాదు అదే విధంగా స్టార్ బ్యాటర్, ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేపాల్‌తో మ్యాచ్‌లో కోహ్లి నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. అయినా విరాట్ కోహ్లి క్యాచ్‌లు డ్రాప్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్‌లోనూ ఇలాగే చేశాడు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లలోనూ ఇలాంటి తప్పులే చేశాడు. ఈ విషయంలో నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. వాస్తవం మాట్లాడుతున్నా’’ అంటూ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. సూపర్-4లో టీమిండియా ఎంట్రీ కోహ్లి ఫిట్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలుసని, అయితే మైదానంలో కూడా ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ చురకలు అంటించాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో మెరుగైన ఆట తీరు కనబరిచిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... వర్షం అంతరాయం కలిగిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో విధించిన లక్ష్యాన్ని టీమిండియా 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. తద్వారా పది వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో ఎంట్రీ ఇచ్చింది. చదవండి: WC 2023: శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు.. ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
అతడు మళ్లీ వస్తాడన్న గ్యారంటీ లేదు.. కిషన్ వచ్చినా గానీ?
ఆసియాకప్-2023కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనమైంది. అయితే జట్టుతో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ శ్రీలంకకు వెళ్లలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ అయితే ఇంకా సాధించలేదు. దీంతో టోర్నీలో మొదటి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నట్లు భారత హెడ్‌కోచ్ ద్రవిడ్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో మిగితా మ్యాచ్‌లకు కూడా రాహుల్ అందుబాటులో ఉంటాడనే నమ్మకం లేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. "ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని మెనెజ్‌మెంట్ చెప్పుకొచ్చింది. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ ఫిట్‌గా ఉన్న రాహుల్ మరో రెండు గేమ్ ల తర్వాత కోలుకుంటాడన్న గ్యారెంటీ లేదు. వన్డేల్లొ ఐదో స్ధానంలో రాహుల్ అద్భుత ఆటగాడు. అటువంటి ప్లేయర్ దూరం కావడం భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ. రాహుల్‌కు పెద్ద షాట్లు ఆడడమూ తెలుసు.. క్లిష్టపరిస్ధితుల్లో జట్టును అదుకోవడం తెలుసు. రాహుల్ స్ధానంలో కిషన్ వచ్చినప్పటికీ అతడి లోటును మాత్రం పూడ్చలేడు. రాహుల్ వికెట్ కీపింగ్‌తో పాటు ఫినిషింగ్ టచ్ కూడా అందించగలడని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: Asia Cup 2023: ‘ఆసియా’ సింహాల సమరానికి సై.. చరిత్ర టీమిండియాదే -
WC: సిరాజ్ కూడా ఉండకపోవచ్చు! వాళ్లకు జట్టులో చోటు దక్కినా కూడా..
ICC ODI World Cup 2023- Team India: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో కొత్త వాళ్లకు స్థానం ఉండే అవకాశమే లేదని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే యువ బ్యాటర్లు ఆశలు వదులుకోవాల్సిందేనని పేర్కొన్నాడు. అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌లోకి వస్తే మహ్మద్ సిరాజ్‌కు కూడా ఒక్కోసారి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత ఇండియాలో ఈ మెగా ఈవెంట్ జరుగనున్న తరుణంలో ఆతిథ్య జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరేబియన్ దీవిలో టీమిండియా ప్రయోగాలు ఈ క్రమంలో అన్ని రకాలుగా సన్నద్ధమయ్యే క్రమంలో మేనేజ్మెంట్ ఇప్పటికే వెస్టిండీస్ పర్యటనలో అనేక ప్రయోగాలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి యువకులను ఆడించింది. అయితే, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ సిరీస్‌ను 2-1తో గెలవడంతో జట్టుకు కాస్త ఊరట లభించింది. బుమ్రా రీఎంట్రీ ఇస్తుండగా.. ఇదిలా ఉంటే.. ప్రధాన పేసర్ బుమ్రా సహా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ స్టార్ రిషభ్ పంత్ తదితరులు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బుమ్రా కోలుకుని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే వాళ్లిద్దరు వస్తారు! మరోవైపు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న రాహుల్, అయ్యర్ సైతం ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా కప్ టోర్నీ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ జట్టు కూర్పు గురించి మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే వాళ్లిద్దరు జట్టులోకి తిరిగివస్తారని అనుకుంటున్నా. కాబట్టి మెగా ఈవెంట్ నేపథ్యంలో... జట్టులోకి కొత్తగా వస్తున్న ఆటగాళ్ల గురించి చర్చ అనవసరం. వాళ్ల పేర్లు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండొచ్చు. కానీ తుదిజట్టులో మాత్రం వారికి చోటు దక్కడం కష్టం. ఒకవేళ అయ్యర్ తిరిగొస్తే కచ్చితంగా నాలుగో స్థానంలో ఆడతాడు. ఇక ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఉండనే ఉన్నారు. అంతటి సిరాజ్‌కు కూడా కష్టమే! మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/శార్దూల్ ఠాకూర్(పిచ్ స్వభావాన్ని బట్టి ఎనిమిదో నంబర్ ఆటగాడి ఎంట్రీ), కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా ఉంటారు. ఒక్కోసారి సిరాజ్‌కు కూడా తుదిజట్టులో ఛాన్స్ ఉండకపోవచ్చు. సిరాజ్ లాంటి సీనియర్నే అడ్జస్ట్ చేయలేని స్థితిలో ఇక కొత్తవాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలా చోటు దక్కుతుంది?’’ అని కైఫ్ పీటీతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు భారత జట్టులో చోటు దక్కినా వరల్డ్‌కప్ టోర్నీ ఆడే అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. చదవండి: పాకిస్తాన్‌కు బై బై.. యూఎస్ఏకు వలస వెళ్లిన స్టార్ క్రికెటర్ -
టీమిండియా వరల్డ్‌కప్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టు సారధిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ముందు బుమ్రా తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో బుమ్రా పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్నెస్గా ఉండడం చాలా ముఖ్యమని, వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో అతడి సేవలు భారత జట్టుకు చాలా అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవకపోయనప్పటికీ.. బుమ్రా మాత్రం తన ప్రదర్శనతో అందరినీ అకట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా బుమ్రా సత్తాచాటాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. వరల్డ్‌కప్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే.. "బుమ్రా తన ఫిట్నెస్ను తిరిగి పొందడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతడు ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ముందు జట్టులోకి రావడం చాలా ముఖ్యం. బుమ్రా ఆసియాకప్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నది ఐరీష్ గడ్డపై తేలిపోతుంది. బుమ్రా అక్కడ ఫిట్నెస్తో బౌలింగ్ చేసి వికెట్లు పడగొడితే, అతడిని అపడం ఎవరితరం కాదు. ముఖ్యంగా స్వదేశంలో అయితే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడని" కైప్ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. :"ప్రస్తుతం భారత జట్టు అంత బలంగా కన్పించడం లేదు. ఎందుకంటే చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో పోరాడతున్నారు. ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ సేవలను భారత్ కోల్పోయే ఛాన్స్ ఉంంది. అయితే బుమ్రా తిరిగి రావడం మాత్రం భారత్‌కు భారీ ఊరటను కలిగిస్తోంది. ఒక వేళ అతడు తిరిగి తన ఫిట్నెస్ను కోల్పోయి ప్రపంచకప్‌కు దూరమైతే.. మెగా టోర్నీలో పరాభవం తప్పదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో తొలి టీ20.. విండీస్ సిక్సర్ల కింగ్ వచ్చేశాడు! బౌలర్లూ జాగ్రత్త -
అతడు ప్రపంచకప్‌కు రెడీ.. సిక్సర్ల వర్షం కురిపిస్తాడు! వారిద్దరూ వద్దు..
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లికి జట్టు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వారి స్దానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. కొంతమెరకు టీమిండియా చేసిన ప్రయోగాలు ఫలించాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి ఆటగాడికి వరల్డ్‌కప్ ముందు తన సత్తా నిరూపించుకోవడానికి సువర్ణవకాశం దక్కింది. రెండో వన్డేలో విఫలమైన సంజూ.. నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 41 బంతుల్లో 51 పరుగులతో భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. సంజూ రెడీ.. "విండీస్‌తో ఆఖరి మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆట తీరు నన్ను ఎంతో గానే అకట్టుకుంది. సంజూకు నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అతడు గతంలో కూడా ఇదే బ్యాటింగ్ పొజిషేన్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ మిడిలార్డర్లో కిషన్ లేదా అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. మిడిలార్డర్లో లెగ్ స్పిన్, లెఫ్ట్ఆర్మ్ స్పిన్‌కు బాగా ఆడే ఆటగాడు కావాలి. ఆ పని సంజూ చేయగలడు. సంజూ స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించగలడు. కాబట్టి అతడిని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి. సంజూ కూడా సిద్దంగా ఉన్నాడని అమృత్ మాథుర్ పుస్తకం 'పిచ్‌సైడ్' ఆవిష్కరణ కార్యక్రమంలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక గురువారం నుంచి విండీస్‌తో మొదలు కానున్న టీ20 సిరీస్‌లో కూడా సత్తా చాటేందుకు సంజూ సిద్దమయ్యాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్ వద్దు! ఆ స్థానంలో అతడే బెటర్: కైఫ్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7న ఈ ఫైనల్ పోరు జరగనుంది. కాగా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా.. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్ కంటే కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని కైఫ్ అబిప్రాయపడ్డాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ వచ్చి పంత్‌లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్ తెలిపాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రావాలి. ఆ తర్వాతి స్థానంలో అనుభవం ఉన్న పుజారాను పంపాలి. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి, ఆ తర్వాత రహానే ఉండాలి. ఇక ఆరో స్థానంలో హిట్టింగ్ చేసే ఆటగాడు కావాలి. కాబట్టి నా వరకు అయితే భరత్ కంటే కిషన్‌ను అవకాశం ఇస్తే మంచిది. అతడు రిషబ్ పంత్ రోల్‌ను పోషిస్తాడు. అదే విధంగా ఏడో స్థానంలో నేను జడేజా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎనిమిదో స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి అశ్విన్ లేదా శార్దూల్ ఠకూర్ని పంపాలి. ఇక పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. అశ్విన్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఖవాజా వంటి లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్లను ఈజీగా పెవిలియన్‌కు పంపుతాడు. ఫాస్ట్‌బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌కు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులో శార్దూల్ ఠకూర్ అవకాశం ఇవ్వాలని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
అతడి బౌలింగ్ చూస్తుంటే నాకు షమీ గుర్తుకు వచ్చాడు: భారత మాజీ బ్యాటర్
IPL 2023- Akash Madhwal: ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్ స్టైల్ భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీని గుర్తుకు తెచ్చిందన్నాడు. కీలక మ్యాచ్‌లో ఎంతో పరిణతి కలిగిన పేసర్లా అద్భుతంగా రాణించి ముంబైని గెలిపించాడని కొనియాడాడు. ఆకాశమే హద్దుగా ఆకాశ్ విజృంభణ ఐపీఎల్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ బుధవారం తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అద్భుత: ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఆరంభంలోనే చుక్కలు చూపించాడు ఆకాశ్ మధ్వాల్. ఓపెనర్ ప్రేరక్ మన్కడ్‌ను పెవిలియన్‌కు పంపి ముంబైకి శుభారంభం అందించాడు. అదే జోరులో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 3.3 ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి సంచలన ప్రదర్శనతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లక్నో మీద గెలుపుతో ఐపీఎల్-2023లో రోహిత్ సేన మరో ముందడుగు వేసింది. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. షమీ గుర్తుకొచ్చాడు ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ మధ్వాల్ సరైన లైన్‌అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ శైలి నాకు మహ్మద్ షమీని గుర్తు చేసింది. అద్భుతమైన పేసర్. ముంబైకి కాస్త ఆలస్యంగానైనా దొరికిన ఆణిముత్యం. ప్రతి మ్యాచ్‌లోనూ మెచ్యూర్‌గా బౌలింగ్ చేశాడు’’ అని ముంబై పేస్ సంచలనం ఆకాశ్‌ను కొనియాడాడు. ముంబై క్వాలిఫయర్ చేరడారికి కారణం అతడే: పఠాన్ ఇక మరో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం.. ‘‘ఇలాంటి కీలక మ్యాచ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఇంత అద్భుతంగా ఆడటం మునుపెన్నడూ చూడలేదు. గత రెండు మ్యాచ్‌లలోనే 9 వికెట్లు తీశాడు. ముంబైని క్వాలిఫయర్‌కు చేర్చిన ఘనత ఆకాశ్‌కే దక్కుతుంది’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ మధ్వాల్ ఐపీఎల్-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మే 26 నాటి క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. చదవండి: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం? Ind vs Aus: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 -
IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు!
IPL 2023- Suryakumar Yadav: ‘‘సూర్యకుమార్ ఇంకో పన్నెండుసార్లు డకౌట్ అయినా.. అతడిని క్షమించేయొచ్చు. అలాంటి అద్భుతమైన ఆటగాడికి ఎన్ని అవకాశాలు అయినా ఇవ్వొచ్చు. అతడు డకౌట్ కావడం అన్నది పెద్ద విషయమేమీ కాదు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిలిచాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో సూర్య విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఈ మిస్టర్ 360.. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లోనూ వైఫల్యం కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి చేసింది 16 పరుగులే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో చేసిన మొత్తం పరుగులు 16. అత్యధిక స్కోరు 15. మూడు మ్యాచ్‌లలో వరుసగా అతడు నమోదు చేసిన స్కోర్లు 15, 1, 0. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్య.. ఐపీఎల్-2023లో ఆఖరిగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో అటు అంతర్జాతీయ స్థాయిలో.. ఇటు తనకు అచ్చొచ్చిన ఐపీఎల్‌లోనూ సూర్య విఫలం కావడం విమర్శలకు దారితీసింది. డకౌట్ అయితే.. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ సూర్యకుమార్ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంగ్లండ్, న్యూజిలాండ్ గడ్డపై ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం నాలుగుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తనకేమీ ఫరక్ పడదు. సూర్యకుమార్ గొప్ప ఆటగాడన్న విషయం అందరికీ తెలుసు. ఎవరైనా ఓ బ్యాటర్ ఫామ్‌లో లేడంటే విమర్శలు సహజం. అయితే, సూర్య విషయంలో ఫామ్ అనేది తాత్కాలికం.. క్లాస్ అనేది శాశ్వతం. వన్డేల్లో తను తడబాటుకు లోనవుతున్నాడన్నది వాస్తవమే. కానీ.. ప్రతి బ్యాటర్ జీవితంలో ఒకానొక దశలో ఇలాంటి గడ్డు పరిస్థితులు సహజం. అయితే, జట్టు యాజమాన్యం మద్దతుగా నిలబడితే ఈ మ్యాచ్ విన్నర్ కచ్చితంగా అద్భుతాలు చేయగలడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడికి మద్దతుగా నిలవడం అత్యవసరం’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్! కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్ -
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ ఫోటోలు చూశారా
-
వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..
మహ్మద్ కైఫ్.. టీమిండియా క్రికెట్లో మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ కంటే తన ఫీల్డింగ్ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్ ఫీల్డ్‌లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని వెళ్లడం అసాధ్యం. ఎన్నోసార్లు తన మెరుపు ఫీల్డింగ్‌తో అలరించిన కైఫ్ అద్భుతమైన క్యాచ్‌లు కూడా చాలానే తీసుకున్నాడు. 2002-06 మధ్యలో టీమిండియా తరపున కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా వింటేజ్ కైఫ్‌ను తలపించాడు. శనివారం ఆసియా లయన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కైఫ్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇందులో రెండు క్యాచ్‌లు అయితే డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం విశేషం. స్టన్నింగ్ క్యాచ్‌లతో వయసు పెరిగినా వన్నె తగ్గలేదని నిరూపించాడు. తొలుత ఆసియా లయన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రజ్ఞాన్ ఓజా వేసిన 8వ ఓవర్లో ఉపుల్ తరంగను స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఓజా వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడాడు. బంతి వేగం చూస్తే కచ్చితంగా బౌండరీ వెళ్లేలా కనిపించింది. కానీ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న కైఫ్ ఒక్క ఉదుటన డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కైఫ్ మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపెట్టాడు. ప్రవీణ్ తాంబే వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాఫ్ దిశగా ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న కైఫ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ ఓటమి చవిచూసింది. 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆసియా లయన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 16.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. Vintage Kaif! 🔥@MohammadKaif #LegendsLeagueCricket #YahanSabBossHain pic.twitter.com/9Gc4qO5Cyl — FanCode (@FanCode) March 18, 2023 చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు LLC 2023: గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి -
BGT- 2023: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే..
India vs Australia, 1st Test- Nagpur: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇప్పటికైనా పర్యాటక జట్టుకు అశ్విన్ డూప్లికేట్‌కు.. అసలైన అశ్విన్‌కు ఉన్న తేడా ఏమిటో అర్థమై ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స్పిన్నర్ల దెబ్బకు విలవిల కాగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్ల దెబ్బకు పర్యాటక జట్టుబ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో.. ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించిన రోహిత్ సేన.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అశూ, జడ్డూ అద్భుతం ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపం చూపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అశూ.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకుంది. మహేశ్ పితియాతో ప్రాక్టీస్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా నాగ్‌పూర్ టెస్టుకు వారం రోజుల ముందే ప్రాక్టీసు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక అశ్విన్ మాదిరి బౌలింగ్ చేస్తాడని పేరొందిన గుజరాత్ బౌలర్ మహేశ్ పితియాతో ప్రాక్టీసు చేసింది. అయినప్పటికీ అసలైన పోరులో అశ్విన్ స్పిన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు ఆసీస్ బ్యాటర్లు. అశ్విన్‌తో మహేశ్ పితియా ఈసారి జడ్డూ డూప్లికేట్ కోసం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్ జట్టుకు చురకలు అంటించాడు. ‘‘ఇప్పటికైనా డూప్లికేట్ అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి.. నిజమైన అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న తేడా ఆస్ట్రేలియా తెలుసుకుని ఉంటుంది. ఆల్టైట్ గ్రేటెస్ట్ను ఎదుర్కొనేందుకు.. ఫస్ట్‌క్లాస్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన యువ బౌలర్‌తో ప్రాక్టీసు చేస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేరన్న వాస్తవం గ్రహించాలి. విషయం అర్థమైంది కదా! ఇక ఢిల్లీ మ్యాచ్ కోసం వాళ్లు జడేజా డూప్లికేట్‌ను వెదుకుతారని మాత్రం నేను అనుకోవడం లేదు’’ అని కైఫ్ ట్విటర్ వేదికగా ట్రోల్ చేశాడు. Australia now know the difference between facing duplicate Ashwin and real Ashwin. You can't prepare to face one of all-time great by facing a young first-class player. Hope they not searching for a Jadeja duplicate in Delhi. — Mohammad Kaif (@MohammadKaif) February 12, 2023 కాగా తొలి టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్ BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
Ind Vs SL: రాహుల్ ఇన్నింగ్స్ అంత గొప్పగా ఏమీలేదు.. కానీ!
India vs Sri Lanka, 2nd ODI: ‘‘గత కొంతకాలంగా అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. అంతేకాదు.. వైస్ కెప్టెన్‌గా తనకిప్పుడు హోదా లేదు. గత మూడు, నాలుగు నెలల కాలంగా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అయితే, ఇప్పుడు మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన సత్తా చాటాడు. సరైన సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. కేఎల్ రాహుల్‌ను ప్రశంసించాడు. శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కీలక సమయంలో సత్తా చాటి.. కోల్‌కతాలో జరిగిన గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంకను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు తీయడంతో.. 215 పరుగులకే పర్యాటక జట్టు కథ ముగిసింది. అయితే, లక్ష్యం చిన్నదే అయినా.. టీమిండియా టాపార్డర్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 103 బంతులు ఎదుర్కొని 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కాగా గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్ కీలక సమయంలో రాణించి తన విలువేమిటో చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ కర్ణాటక ప్లేయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గొప్పగా ఏమీ లేకపోవచ్చు! ‘‘జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆచితూచి ఆడాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో తన స్ట్రైక్ రేటు(134.48) బాగానే ఉంది. అప్పటికి ఇంకా వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ రెండో వన్డేలో పరిస్థితి వేరు. ఇక్కడ తన బ్యాటింగ్ తన అనుభవానికి అద్దం పట్టింది. తన ఇన్నింగ్స్ గొప్పగా ఏమీ లేకపోవచ్చు. అయితే, కేఎల్ రాహుల్ ఇప్పుడు పరిణతి చెందిన బ్యాటర్ అంటే ఎలా ఉండాలో చూపించాడు’’ అని కైఫ్ కొనియాడాడు. చేజారిన వైస్ కెప్టెన్సీ మొదటి వన్డేలో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించిన వేళ.. రాహుల్ 29 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక బంగ్లా పర్యటన తర్వాత స్వదేశంలో లంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా తప్పించి ఆల్‌రౌండర్ పాండ్యాకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో కైఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో విజయంతో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: Ind Vs NZ 2023: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్.. తొలిసారి ఆ ఇద్దరికి చోటు.. దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం -
చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి
India tour of Bangladesh, 2022- Bangladesh vs India: టీమిండియా బ్యాటర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. బౌలర్లను తప్పుబట్టడం సరికాదని.. చెత్త బ్యాటింగ్ వల్లే బంగ్లాదేశ్ చేతిలో రోహిత్ సేన ఓడిపోయిందని పేర్కొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న కైఫ్,.. ఇకనైనా ‘హిట్‌మ్యాన్’ బ్యాట్ ఝులిపించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం నాటి తొలి వన్డేలోనే భారత్‌కు పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(27) సహా సీనియర్లు శిఖర్ ధావన్(7), విరాట్ కోహ్లి(9) విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే అర్ధ శతకం(73 పరుగులు)తో రాణించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గౌరవప్రదమైన(186) స్కోరు చేయగలిగింది. అయితే, భారత బౌలర్లు ఫర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్య ఛేదనలో బంగ్లాను మెహదీ, ముస్తాఫిజుర్ ఆదుకోవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు.. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్తగా ఆడారు.. ఇక బుధవారం ఇరు జట్లు రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మనం ఎక్కువగా భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతున్నాం. నిజానికి మొదటి వన్డేలో బ్యాటర్లు చెత్తగా ఆడారు. కేవలం బ్యాటింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లి పరుగులు సాధించాలి. ముఖ్యంగా కెప్టెన్.. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావాలి. గత కొంతకాలంగా తన వైఫల్యం కొనసాగుతోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు’’ అని కైఫ్.. రోహిత్ తీరును విమర్శించాడు. కుల్దీప్ను అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి.. ఇక రెండో వన్డే నేపథ్యంలో.. యువ బౌలర్ కుల్దీప్ సేన్‌కు కైఫ్ మద్దతుగా నిలిచాడు. అతడిని సిరీస్ మొత్తం ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘ఒకవేళ వాళ్లు రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. గందరగోళం ఏర్పడుతుంది. యువ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కుల్దీప్ సేన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వాలి. తను మొదటి వన్డేతో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. అయితే, పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. తన బౌలింగ్‌లో పేస్ ఉంది. కానీ ఒత్తిడిలో కూరుకుపోవడం వల్ల సరిగ్గా ఆడలేకపోయాడు. అయినా, తనకిది మొదటి మ్యాచ్. కాబట్టి మరో అవకాశం ఇవ్వాలి. నిజానికి ఒక్క మ్యాచ్ ఓడితే జట్టులో మార్పులు చేయడం సరికాదు. అలా చేస్తే ఆ జట్టు కెప్టెన్ లేదంటే సరైన వాళ్లు అనిపించుకోరు’’ అంటూ యువ పేసర్ కుల్దీప్ సేన్‌కు మాజీ బ్యాటర్ కైఫ్ అండగా నిలబడ్డాడు. కాగా మొదటి వన్డేలో 5 ఓవర్లు బౌల్ చేసిన కుల్దీప్ సేన్ 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! Hasan Ali: హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్ -
WC 2023: టీమిండియా ‘వైఫల్యం’! అసలు సమస్య అదే: మహ్మద్ కైఫ్
‘In search of diamond we lost gold’: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా సన్నద్ధతపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో అనుభవజ్ఞులైన సీనియర్లను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నాడు. ప్రయోగాలు చేసేందుకు సమయం లేదని, ఐసీసీ టోర్నీకి ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందని పేర్కొన్నాడు. సెమీస్‌లో నిరాశ టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన టీమిండియా... ఈసారి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన రోహిత్ సేన కనీసం ఫైనల్ చేరకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వచ్చే ప్రపంచకప్‌లోనైనా ఇదిలా ఉంటే... స్వదేశంలో వచ్చే ఏడాది భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఎఫ్టీపీ క్యాలెండర్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ కంటే ముందు టీమిండియా సుమారు 25 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డేల్లో తలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రసారకర్త అమెజాన్ ప్రైమ్ వీడియోతో ముచ్చటించిన మహ్మద్ కైఫ్ జట్టు కూర్పు, వన్డే వరల్డ్‌కప్ సన్నద్ధతపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘వరల్డ్‌కప్ చాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్ల సగటు వయసు 31 ఏళ్లు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఒకవేళ టీమిండియా ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలనుకుంటే న్యూజిలాండ్ సిరీస్‌తోనే మొదలుపెట్టాల్సింది. టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అసలు సమస్య అదే ‘‘టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. ప్రస్తుత సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్ విషయాన్నే చూడండి. మొదటి వన్డేలో ఆడించి రెండో మ్యాచ్‌కే పక్కన పెట్టారు. ఇక సిరాజ్‌ను ఇంటికి పంపేశారు. తనను వన్డేల్లో కూడా ఆడించాల్సింది. అసలు ఈ సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కాలేదు. తను మంచి బౌలర్. అయినా జట్టులో అతడికి చోటు లేదు. అదేదో సామెత ఉంటుంది కదా! వజ్రాల వేటలో పడి బంగారం పోగొట్టుకున్నారు అని! ప్రస్తుతం జట్టు పరిస్థితి అలాగే ఉంది. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. అయితే, అనుభవం ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. జట్టు సమతుల్యంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచకప్ ఈవెంట్‌కు సమయం తక్కువగా ఉన్నందున ఇప్పుడు ప్రయోగాలు పనికిరావు. కాబట్టి జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని పక్కనపెట్టాలో నిర్ణయించుకోండి. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్‌కుమార్, మహ్మద్ షమీలతో పాటు ఉమ్రాన్ మాలిక్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్ట్రా బౌలర్‌గా తనని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని మహ్మద్ కైఫ్ బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్ PT Usha: చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్‌ను రాహుల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కొనసాగవలసిందిగా కోరారు. ధవన్‌ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్ అయిన ధవన్‌ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. రాహుల్ ఫిట్‌గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్ నాయకత్వంలో రాహుల్ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్ సిరీస్‌లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్‌తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్ కూల్ కాండిడేట్ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు. చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో -
'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'
టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన పుజారా ఆ తర్వాత రంజీ ట్రోపీ, కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. కౌంటీలో ససెక్స్ తరపున నాలుగు సెంచరీలతో హోరెత్తించిన పుజారా ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. పూర్తి స్థాయి ఫామ్ అందుకున్న పుజారా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా జూలై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే మహ్మద్ కైఫ్ యువ ఆటగాళ్లనుద్దేశించి పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' పుజారా నుంచి యువ క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కసారి జట్టులో స్థానం కోల్పోతే ఒక బ్యాటర్‌గా మనం చేయాల్సిన పని ఏంటనేది పుజారాను చూసి నేర్చుకోవచ్చు. ఫామ్ కోల్పోయిన మాత్రానా ఆందోళన చెందొద్దు. స్వదేశానికి తిరిగి వెళ్లండి. రంజీల్లో ఆడండి.. లేదంటే కౌంటీల్లో ఆడి పరుగులు సాధించి తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోండి. పుజారా విషయంలో అదే జరిగింది. ఫామ్ కోల్పోయి విమర్శలు మూటగట్టుకున్న అతను కొన్ని నెలల పాటు ఏం చేశాడన్నది ఆసక్తిగా గమనించండి. పుజారా యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం.. అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పుజారా గొప్ప ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వాషింగ్టన్ సుందర్‌కు లక్కీ ఛాన్స్.. ప్రతిష్టాత్మక టోర్నీలో.. థాంక్యూ అంటూ భావోద్వేగం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
IPL 2022: గొప్ప నాయకుడు.. కెప్టెన్‌గా అతడికి వందకు వంద మార్కులు!
IPL 2022- Hardik Pandya- Gujarat Titans: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు. సారథిగా హార్దిక్‌కు వందకు వంద మార్కులు వేస్తానని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో వైఫల్యం.. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందుకు తోడు ఎన్నో ఏళ్లుగా అనుబంధం పెనవేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్‌లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును అగ్రపథాన నిలిపాడు. బ్యాటర్‌గానూ రాణించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ పద్నాలుగింట ఏకంగా పది మ్యాచ్‌లు గెలిచి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: IPL) ఇక ఆడిన 13 ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 413 పరుగులు(అత్యధిక స్కోరు 87 నాటౌట్) సాధించి బ్యాటర్‌గానూ నిరూపించుకుని లీగ్ దశ ముగిసే సరికి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదకొండో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా వందకు వంద మార్కులు ఇస్తాను. అతడు గొప్ప నాయకుడు. బౌలర్లతో సమన్వయం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తాడు. సాధారణంగా బౌలర్లు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కెప్టెన్ వారి పక్కనే నిలబడి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటే ఎంతో ఊరటగా ఉంటుంది. కెప్టెన్‌గా హార్దిక్ తన బౌలర్లకు అలాంటి సౌలభ్యాన్ని ఇచ్చాడు’’ అని కొనియాడాడు. హార్దిక్ నాయకత్వం వల్లే జట్టు ఉన్నత శిఖరాన నిలిచిందని కితాబిచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం.. వేలంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగిందని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఆక్షన్ సమయంలో వాళ్ల ప్లాన్ తికమకపెట్టినప్పటికీ... పక్కా ప్రణాళికలతో దృఢమైన జట్టుగా నిరూపించుకున్నారని తెలిపాడు. కాగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫైయర్‌లో భాగంగా మంగళవారం(మే 24) రాజస్తాన్ రాయల్స్‌తో ఢీకొట్టనుంది. చదవండి👉🏾IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! చదవండి👉🏾IPL 2022- SRH: టీమిండియా లీడింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు.. ఎస్ఆర్హెచ్ స్టార్‌పై రవిశాస్త్రి ప్రశంసలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Back at a venue that's seen so many iconic moments over decades 🔥 Catch our Titans talking about this amazing vibe called Eden 😍💙#AavaDe #SeasonOfFirsts #TATAIPL #GTvRR pic.twitter.com/Y1P0jHrJ2B — Gujarat Titans (@gujarat_titans) May 24, 2022 -
'ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది'
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ థీమా వక్య్తం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా శనివారం కీలక పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందితే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి చెందితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. "ఢిల్లీ క్యాపిటల్స్ సరైన ఫామ్‌లో కొనసాగుతోంది. వారు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపులో ఉన్నారు. వారి నెట్ రన్ రేట్ చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ముంబైని ఓడించాలి. ఢిల్లీ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మిచెల్ మార్ష్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక బౌలర్లు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు. రిషబ్ పంత్ కూడా కీలకమైన ఇన్నింగ్స్‌లను ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా చివరి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో అధ్బుతంగా ఆడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ముంబైని ఢిల్లీ ఓడించడం ఖాయమని" స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..! -
ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 ప్రకటించిన కైఫ్.. రైనాకు చోటు..!
టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఐపీఎల్లో తన ఆల్ టైమ్ ప్లెయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా కైఫ్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు, ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంచుకున్న కైఫ్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగు, ఐదు స్థానాల కోసం సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్‌లను ఎంపిక చేశాడు. ఆ తరువాత ఆరో స్థానం కోసం ధోనిని (వికెట్‌కీపర్) ఎంపిక చేసిన కైఫ్.. ఆల్‌రౌండర్ల కోటాలో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌కు చోటు కల్పించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. రషీద్ ఖాన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. మహ్మద్ కైఫ్ ఐపీఎల్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా చదవండి: Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ -
'నా టైం వృథా చేస్తున్నావు.. దయచేసి పిజ్జా, బర్గర్ తిననివ్వు'
వెస్టిండీస్ క్రికెటర్లు సాధారణంగానే ఫన్నీ మూడ్‌లో ఉంటారు. వారు ఏం చేసినా మనకు కామెడీగానే అనిపిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రసెల్, కీరన్ పొలార్డ్ లాంటి ఆటగాళ్లను చూస్తున్నాం. ఐపీఎల్ పుణ్యమా అని వాళ్లు మరింత దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో షిమ్రోన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్ సహా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌కు సుపరిచితులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో హార్డ్‌హిట్టర్ హెట్‌మైర్ గురించి టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్లో హెట్‌మైర్ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. 2020, 2021 సీజన్లలో హెట్‌మైర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అదే సమయంలో కైఫ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఒక సందర్భంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను కైఫ్ తాజాగా పంచుకున్నాడు. ''హెట్‌మైర్ రేపటి గురించి ఏ మాత్రం ఆలోచించడు. ఎప్పుడు రిలాక్స్ మోడ్‌లో ఉంటాడు. జాలీగా ఉంటూ ఎక్కువ సమయం గడిపేస్తాడు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనేదానిపై బ్యాట్స్‌మన్ కసరత్తులు చేయడం చూస్తుంటాం. కానీ హెట్‌మైర్ ఆ కోవకు చెందినవాడు కాదు. అలాంటి విషయాలు అసలు పట్టించుకోడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎలా ఎదుర్కొంటావు అని అడిగాను. దానికి హెట్‌మైర్.. ''అసలు వరుణ్ ఎవరు? నా సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నావు.. నన్ను పిజ్జా, బర్గర్లు తిననివ్వు'' అని సమాధానమిచ్చాడు. అయితే మ్యాచ్‌లో హెట్‌మైర్ వరుణ్ చక్రవర్తిని సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. తనపై తనకు మంచి కాన్ఫిడెన్స్ ఉన్న ఆటగాడు హెట్‌మైర్. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో హెట్‌మైర్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరపున ఫినిషర్‌గా వస్తున్న హెట్‌మైర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు కలిపి 168 పరుగులు సాధించాడు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే 59 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: FIFA WC Vs IPL 2022: షాకింగ్.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్ -
IPL 2022: శ్రేయస్ కెప్టెన్సీ భేష్.. అతడిని జట్టులోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం
IPL 2022- CSK Vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమేశ్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్న తన నిర్ణయం సరైందని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో సీఎస్కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా, కేకేఆర్ సారథిగా శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం చేశారు. ఇక గత సీజన్లో ఫైనల్లో చెన్నైతో తలపడి భంగపాటుకు గురైన కేకేఆర్ ఈసారి శుభారంభం చేసింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించి జయభేరి మోగించింది. ఇక ఈ విజయంలో టీమిండియా సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెన్నై స్టార్ ఓపెనర్, ఐపీఎల్-2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసిన ఉమేశ్, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే వికెట్ తీశాడు. తద్వారా ఆరంభంలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఎంఎస్ ధోని మినహా మిగతా బ్యాటర్లు కూడా విఫలం కావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. దీంతో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజాకు నిరాశ ఎదురుకాగా, శ్రేయస్‌కు మంచి ఆరంభం లభించింది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా బాగుంది. తుదిజట్టులోకి ఉమేశ్‌ను తీసుకోవడం తెలివైన నిర్ణయం. గతంలో అతడు కేకేఆర్‌కు ఆడినా సరైన అవకాశాలు రాలేదు. అయితే, శ్రేయస్ అతడిపై నమ్మకం ఉంచాడు. ఉమేశ్‌తో పాటు శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ సేవలను వినియోగించుకున్న తీరు బాగుంది’’ అని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని కొనియాడాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం అమోఘమని ప్రశంసించాడు. WHAT. A. WIN. 😍#KKR #KKRHaiTaiyaar #CSKvKKR #IPL2022 #GalaxyOfKnights #কেকেআর pic.twitter.com/Y07tLfeoxY — KolkataKnightRiders (@KKRiders) March 26, 2022 -
మహేశ్ బాబు పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన మాజీ క్రికెటర్.. వైరల్
ఇటీవల క్రికెటర్లు తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ తారల డైలాగులు, డాన్సులతో నెట్టింట రచ్చ మామూలుగా చేయలేదు వార్నర్. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ కూడా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పగా అవి వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఇటీవల కైఫ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పాపులర్ డైలాగ్ చెప్పి వావ్ అనిపించాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటనుకుంటున్నారా? మహేశ్ బ్లాక్ బస్టర్ సినిమా దూకుడులోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పాడు. ‘మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అని అప్పట్లో మన ప్రిన్స్ తన మేనరిజంతో చెప్పి ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేశాడు కదా ! దాన్నే ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ తన స్టైల్లో ఆ డైలాగ్‌ను చెప్పాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ప్రిన్స్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో నచ్చడంతో తెగ షేర్లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది రచ్చ చేస్తోంది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟 "MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb — ꓷ A Я K 🦇💊 (@GothamHero_) September 8, 2021 చదవండి: T20 World Cup: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్ -
నీరజ్ చోప్రా విన్యాసాలు అదుర్స్; వీడియో వైరల్
నీరజ్ చోప్రా.. ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో తన అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం అందించిన తొలి వ్యక్తిగా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. అయితే నీరజ్ చోప్రా ఈరోజు బంగారు పతకం సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ దాగుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ట్విటర్లో నీరజ్ చోప్రా విన్యాసాలను షేర్ చేశాడు. ఆ వీడియోలో నీరజ్ తన చేతిలో బరువైన వస్తువును పెట్టుకొని శరీరాన్ని పూర్తిగా విల్లులాగా వంచడం.. ఆ తర్వాత అలాగే పైకి లేవడం కనిపిస్తుంది. నీరజ్ చోప్రా శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందనేది చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని స్టంట్స్‌కు ఫిదా అవుతున్నారు. ''ఇదెలా సాధ్యం.. నీరజ్ చేస్తున్న విన్యాసాలు ఒక్కరోజులో వచ్చినవి కాదు.. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందంటూ'' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక గతవారం టోక్యోలో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హర్యానాలోని పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా భారతదేశానికి అథ్లెటిక్స్‌లో మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచాడు. Meet our new hero! #NeerajChopra pic.twitter.com/8iihthXYuO — Mohammad Kaif (@MohammadKaif) August 8, 2021 -
కోహ్లి.. గంగూలీలా కాదు.. సెలక్షన్లో అసలు క్లారిటీ ఉండదు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి కెప్టెన్సీపై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి సారథ్యంలోని జట్టు కూర్పు అంశంలో స్పష్టత ఉండదని, ఎప్పుడు ఎవరికి ఎందుకు ఉద్వాసన పలుకుతారో తెలియనిస్థితిలో ఆటగాళ్లు ఉంటారని పేర్కొన్నాడు. జట్టు ఎంపిక విషయంలో కోహ్లి ప్రస్తుతం ఫాంలో ఉన్న క్రికెటర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తాడని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కైఫ్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ... ‘‘ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనను గతంలో పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ప్రస్తుత కెప్టెన్, మేనేజ్మెంట్ అలా కాదు. ఇప్పుడు ఎవరు ఫాంలో ఉంటే వారినే తుదిజట్టులోకి తీసుకుంటారు. అందుకే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి వారికి అవకాశాలు వచ్చాయి. అదే విధంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లు మిస్ కావాల్సి వచ్చింది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కెప్టెన్సీతో, కోహ్లి కెప్టెన్సీని పోలుస్తూ.. ‘‘గంగూలీ తన జట్టుకు ఎంతో మద్దతునిచ్చేవాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమైనా మరో అవకాశం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టేవాడు. మీ వెనుక నేనున్నానంటూ తనదైన క్లాసిక్ స్టైల్‌తో తుదిజట్టును ఎంపిక చేసుకునేవాడు. నాయకుడి లక్షణం అది. కానీ, కోహ్లి అలాకాదు. జట్టులో ఎవరికీ సుస్థిరస్థానం అంటూ ఉండదు. ఈ విషయాన్ని మనందరం ఆమోదించాలి. గత ప్రదర్శననను పరిగణనలోకి తీసుకోకుండా.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ఫాం ప్రదర్శిస్తే వారిని ఎంపిక చేసుకుంటాడు. అయితే, దీర్ఘకాలంలో ఇలాంటి నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. బహుశా ఇలాంటి వాటి వల్లే తను ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. ఏదేమైనా... ఒక కెప్టెన్‌గా ఎన్ని ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచారన్న దానినే ఎక్కువగా హైలెట్ చేస్తారు కదా’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. కాగా ధావన్ నేతృత్వంలోని టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకకు వెళ్లగా.. కోహ్లి సారథ్యంలోని భారత జట్టు టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. -
'కెప్టెన్సీ.. పంత్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం'
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో ఆ జట్టు యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జట్టులో అశ్విన్, రహానే, స్మిత్ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నా మేనేజ్మెంట్ మాత్రం జట్టు కెప్టెన్‌గా పంత్‌వైపే మొగ్గుచూపింది. అసలే దూకుడుగా మారుపేరుగా నిలిచిన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎంపికవడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. పంత్‌కు కెప్టెన్సీ అప్పగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ కూడా పంత్ కెప్టెన్సీపై స్పందించాడు. ''గతేడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయాస్ అయ్యర్ గాయపడడం మా దురదృష్టం. అతను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నా. ఇక మా దిల్ కా కడక్ లాండా.. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు ముందుగా అతనికి అభినందనలు. పంత్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడు. అతని దూకుడే అతనికి బలంగా మారనుంది. ఆసీస్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో పంత్ ఆడిన దూకుడైన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న పంత్‌కు ఆ బాధ్యతలు అతన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఇక ఢిల్లీతో నా అనుబంధం ప్రత్యేకమైనది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌తో కూడుకున్న పని. ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. నాపై నమ్మకంతో మేనేజ్మెంట్ నాకు అప్పగించిన అసిస్టెంట్ కోచ్ పదవిని సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తా. ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా సీఎస్కేతో ఆడనుంది. చదవండి: పంత్ మంచి కెప్టెన్ అవుతాడు: మాజీ క్రికెటర్ అతను దూరమవడానికి పుజారా కారణమా! -
‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’
చెన్నై: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా సంప్రదాయ క్రికెట్ ఆడాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన నాలుగో టెస్టులో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న కుల్దీప్, బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బీసీసీఐ ప్రకటించిన 13 టెస్టు మ్యాచ్ ప్రాబబుల్స్‌లో అతడికి చోటు దక్కినప్పటికీ ఆడే అవకాశం మాత్రం రాలేదు. మొన్నటికి మొన్న ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్(బోర్డర్- గావస్కర్ ట్రోఫీ)లో సైతం కుల్దీప్‌నకు నిరాశే ఎదురైంది. (చదవండి: India Vs England 2021: ఇంగ్లండ్‌కు షాక్! ) అయితే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కుల్దీప్ పేరు ఉండటం, పైగా ఇండియన్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం అన్న విశ్లేషణల నేపథ్యంలో అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపించింది. కానీ మరోసారి కుల్దీప్ను దురదృష్టం వెంటాడింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన టీమిండియా సీనియర్ అశ్విన్‌తో పాటు ఆసీస్ టూర్లో రాణించిన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపింది. అంతేగాక అక్షర్ పటేల్ మోకాలి నొప్పితో చివరి నిమిషంలో జట్టుకు దూరం కాగా, ఆశ్చర్యకరంగా 31 ఏళ్ల షాబాజ్ నదీంను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో 26 ఏళ్ల కుల్దీప్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. ‘‘ సరిగ్గా రెండేళ్ల క్రితం, టెస్టుల్లో ఇండియా ఫస్ట్ చాయిస్ అంటే కుల్దీప్ యాదవ్ అన్న పేరు వినిపించింది. కానీ ఇప్పుడు జట్టులో చోటు కోసం అతడు పోరాడాల్సి వస్తోంది. అయితే అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అశ్విన్, పంత్ పట్టుదలగా పోరాడిన తర్వాతే జట్టులోకి తిరిగి వచ్చారు. ధైర్యంగా ఉండు కుల్దీప్!’’ అని ట్విటర్ వేదికగా అతడికి అండగా నిలిచాడు. ఇక కామెంటేటర్ హర్షా బోగ్లే సైతం.. కుల్దీప్ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనువజ్ఞుడైన నదీంను ఎంపిక చేయడం సరైందే అయినా, కుల్దీప్ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా.. ప్రతిభ ఉండి సుదీర్ఘ కాలంగా జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కుల్దీప్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘‘విరాట్.. నేను మరీ అంత పనికిరానివాడినా. నన్ను పక్కకు పెట్టావు. నేను చేసిన తప్పేంటి? ఒక్క అవకాశం దక్కితే నన్ను నేను నిరూపించుకుంటాను కదా’’ అంటూ కుల్దీప్ ఫొటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లకు చోటు అన్నపుడు సంతోషించిన కుల్దీప్ ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. Just two years ago, Kuldeep Yadav was touted as India's first choice spinner in Tests. Now, he's battling to stay afloat. But he needn't look too far for inspiration. Ashwin & Pant too fought back from periods of self doubt. Stay strong Kuldeep! — Mohammad Kaif (@MohammadKaif) February 5, 2021 Clearly, England's struggle against Embuldeniya has prompted the selection of Shahbaz Nadeem, a fine, vastly experienced finger spinner. But I wonder what this means for Kuldeep. Clearly the team management doesn't rate him too high at thr moment — Harsha Bhogle (@bhogleharsha) February 5, 2021 -
అతడు కచ్చితంగా మాటల యుద్ధానికి దిగుతాడు: కైఫ్
సిడ్నీ: అడిలైడ్ వేదికగా డిసెంబరు 17 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా- ఆసీస్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. తొలి డే- నైట్ టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్‌ల ద్వారా ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఈ మ్యాచ్ భారత జట్టు కూర్పునకు దోహదం చేయగా.. ఆఖరి రోజు ఆస్ట్రేలియా ‘ఏ’ బ్యాట్స్‌మన్ అదరగొట్టినప్పటికీ గాయాల బెడద ఆ జట్టుకు సమస్యగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల అంశం కంగారూలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్షన్ కాగా.. అతడి స్థానంలో వచ్చిన హారిస్ విఫలమయ్యాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్) దీంతో ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్నెట్వర్క్తో మాట్లాడుతూ.. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అదే సమయంలో ఫించ్, వార్నర్, స్మిత్ వంటి ఆటగాళ్లు మాత్రం సంయమనంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు. వారంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు కావడమే ఇందుకు కారణం అని పేర్కొన్నాడు. ‘‘ ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ గానీ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి వాళ్లు భారత ఆటగాళ్లతో వాగ్యుద్దానికి దిగే అవకాశమే లేదు. కానీ టిమ్ పైన్ అలా కాదు. అతడు ఐపీఎల్ ఆడటం లేదు. (చదవండి: వైరల్: కూల్ కెప్టెన్.. అంతగా ఆవేశపడితే ఎలా!!) ఇండియాకు వెళ్లే అవసరం లేదని తనకు తెలుసు. కాబట్టి కచ్చితంగా రెచ్చిపోతాడు. భారత ఆటగాళ్లను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఐపీఎల్‌తో పాటు మరో కారణం కూడా ఉంది. నిజానికి స్మిత్, వార్నర్‌పై బాల్ టాంపరింగ్ వివాదంలో సస్పెండ్ అయినపుడు పైన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో తిరిగి చోటు సంపాదించుకున్నారు. ఒకవేళ ఈ టెస్టు సిరీస్‌లో గనుక పైన్ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే అతడిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జట్టు సారథ్య బాధ్యతల విషయం పక్కన పెడితే తుదిజట్టులో స్థానం సంపాదించుకోవడమే కష్టంగా మారుతుంది. కాబట్టి అతడు వీలైనంత దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. పర్యాటక జట్టుతో మాటల యుద్ధానికి దిగే బదులు ఆట మీద దృష్టి సారిస్తే కాస్తైనా ఫలితం ఉంటుందని హితవు పలికాడు. -
'11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు'
కాన్బెర్రా : రవీంద్ర జడేజా గాయంతో దూరమవడం జట్టుకు లోటు కానుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. 2009లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జడేజా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్ ఆల్‌రౌండర్ స్థాయికి చేరుకున్నాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో కైఫ్ మాట్లాడాడు. 'రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 11 ఏళ్లయింది.. అయినా అతన్ని ఇప్పటికీ తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇన్నేళ్లుగా అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.. తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను చూసుకుంటే మంచి ఫామ్ కనబరుస్తూ పరుగులు సాధించాడు. మూడో వన్డేలో హార్థిక్‌తో కలిసి చేసిన 150 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని ఎవరు మరిచిపోరు. దీంతో జడేజా ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు జడేజా గాయంతో దూరమవడం పెద్ద లోటుగా మారనుంది. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ సేవలను కోల్పోతే జట్టు ఇబ్బందులకు గురవ్వడం సహజమే. టీమిండియా అతని సేవలను మిస్ కానుంది.'అంటూ కైఫ్ తెలిపాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?) కాగా ఆసీస్‌తో జరిగిన మొదటి టీ20లో జడేజా 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతికి స్టార్క్ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడిన జడేజా ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద చహల్‌ను జడేజా స్థానంలో తీసుకువచ్చారు. చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టి20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని బీసీసీఐ ప్రకటించింది. -
'పురాణ సుంతారీ.. మీ పట్టుదలకు హ్యాట్సాఫ్'
మధురై : తమిళనాడుకు చెందిన పురాణా సుంతారీ(25) చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయింది. అయినప్పటికి బెదరకుండా సివిల్స్ సాధించాలన్న తన లక్ష్యం నెరవేర్చుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 2019 సివిల్స్ పరీక్ష తుది ఫలితాల్లో సుంతారీ 286వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. తన అద్భుత ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా పురాణా సుంతారీపై ప్రశంసలు కురిపించారు. ఆమె విజయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 'పురాణ సుంతారీ... మీ కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్. ఆడియో స్టడీ మెటీరియల్‌తో పరీక్షలు రాయడం చాలా కష్టం. ఈ విషయంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. మీ కలలను సాకారం చేసుకోవడం ఇక మీదట కూడా ఎప్పుడూ ఆపొద్దు. మీలాంటి మహిళలు ఈ దేశానికి ఎంతో అవసరం.' అంటూ కైఫ్ చెప్పుకొచ్చాడు. 25yr old visually impaired Purana Sunthari from TN beat the odds and cracked the UPSC exam. Since audio study material was hard to find, her parents and friends helped her in reading & converting books to audio so she could become an IAS officer. Never stop chasing your dreams. pic.twitter.com/3icQ6nPJPo — Mohammad Kaif (@MohammadKaif) August 12, 2020 మధురైకి చెందిన పురాణా సుంతారీ తన ఐదేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. ఒకటో తరగతికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివింది. ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. మొదటి మూడుసార్లు సివిల్స్ లో విజయం సాధించలేకపోయింది. నాలుగోసారి 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది. -
'యూవీ.. నీ ఫిట్నెస్ చాలెంజ్ నాకు పంపు’
ఢిల్లీ : యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్... వీరిద్దరి గురించి ప్రస్తావిస్తే ఒక విషయం తప్పకుండా గుర్తుకు రావాల్సిందే. అదే 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్. ఆ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్ భారత్‌కు 326 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే ఒక దశలో భారత్ ఓడిపోతుందన్న స్థితిలో వీరిద్దరు కలిసి అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియాకు కప్పును సాధించిపెట్టారు. ఆ సందర్భంలోనే అప్పటి జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి లార్డ్స్ బాల్కని నుంచి చొక్కాను తిప్పడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా యూవీ, కైఫ్‌లు కలిసి భారత్‌కు ఎన్నో విజయాలు సాధించిపెట్టారు.(వరుణుడే ఆడుకున్నాడు) తాజాగా యువరాజ్ సింగ్ తన ఫిట్నెస్ మెరుగుపరుచుకునే క్రమంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను బుధవారం ఇన్స్గాగ్రామ్లో షేర్ చేశాడు. మీ బాడీ ఫిట్నెస్గా ఉంచుకోవాలంటే ఈ కసరత్తులను చేయండి అంటూ పేర్కొన్నాడు. దీనిపై మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. 'యూవీ భయ్యా.. మీ ఫిట్నెస్ చాలెంజ్‌ను నాకు పంపండి.. నేను ట్రై చేస్తా. అంతేకాదు నీ ఫిట్నెస్ సీక్రెట్స్ కూడా పంపు. ' అంటూ ట్రోల్ చేశాడు. యూవీ భార్య హాజెల్ కీచ్ కూడా స్పందిస్తూ.. 'ఏయ్ యూవీ.. నీ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చలేదు.' అంటూ పేర్కొంది. బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఎమోజీలు పెట్టి తన సంతోషం వ్యక్తం చేసింది. కాగా డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ గతేడాది ఆటకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. మొత్తం 18 ఏళ్ల కెరీర్లో 304 వన్డేలాడిన యూవీ 8701 పరుగులు చేశాడు. -
టీమిండియా ఫీల్డింగ్ మాతోనే పోయింది!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్‌లో మెరుపులు తమతోనే అంతరించిపోయాయని అంటున్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. గతంలో యువరాజ్ సింగ్‌తో పాటు తాను కూడా భారత ఫీల్డింగ్‌లో కంప్లీట్ ఫీల్డర్ల వలే ఉండేవాళ్లమని ఇప్పుడు అది జట్టులో లోపించిందన్నాడు. గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్‌లో మెరుగుపడినా పూర్తిస్థాయిలో కాలేదన్నాడు. తనతో పాటు యువీ ఆడిన కాలంలో భారత్ ఫీల్డింగ్ అమోఘంగా ఉండేదన్నాడు. ‘ ప్రస్తుతం భారత క్రికెట్ ఫీల్డింగ్ బాలేదని అనడం లేదు. పూర్తిస్థాయి ఫీల్డర్డు లేరని మాత్రమే అంటున్నాను. ఫీల్డింగ్‌లో కంప్లీట్ ప్యాకేజ్ అంటే వికెట్లను నేరుగా గిరాటేయడం కానీ, బంతితో పాటు వేగంగా పరుగెత్తి దాన్ని అందిపుచ్చుకోవడం కానీ, స్లిప్ ఫీల్డింగ్, ఫైన్‌లెగ్ ఫీల్డింగ్, లాంగాన్‌లో ఫీల్డింగ్ ఇలా ఎక్కడైనా ఫీల్డింగ్ చేస్తూ ఆకట్టుకోవడమే కంప్లీట్ ఫీల్డింగ్ ప్యాకేజ్. (ఆసీస్‌కు నంబర్‌వన్ ర్యాంక్ ఎలా ఇచ్చారు?) ఒక బ్యాట్స్‌మన్ కట్ షాట్, హుక్ షాట్, పుల్‌షాట్, బౌన్సర్‌కు ఆడటం, ఇన్‌స్వింగ్ డెలివరిని సమర్ధవంతంగా ఎదుర్కొంటే వారిని గ్రేట్ బ్యాట్స్‌మన్ అంటాం. అలానే ఫీల్డింగ్‌లో కూడా అన్ని రకాల నైపుణ్యం ఉంటేనే సదరు ఆటగాడు కంప్లీట్ ఫీల్డర్ అవుతాడు. అది ఇప్పుడు లేదనే విషయం కనబడుతోంది. నాతోపాటు యువరాజ్ బెస్ట్ ఫీల్డర్లుగా పిలవబడే వాళ్లం. మా ఫీల్డింగే మమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లను చూస్తున్నాం. మనవాళ్లు ఫీల్డింగ్‌లో మెరగయ్యారు. కానీ పూర్తిస్థాయి ఫీల్డింగ్ అనేది మాత్రం లోపించింది’ అని కైఫ్ పేర్కొన్నాడు. కాగా, మీరు, యువరాజ్ కాకుండా కంప్లీట్ ఫీల్డర్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అని సమాధానమిచ్చాడు కైఫ్. ‘ ఏబీ డివిలియర్స్ పూర్తిస్థాయి ఫీల్డర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అతనొక బుల్లెట్. దక్షిణాఫ్రికా తరఫున అద్భుతమైన క్యాచ్‌లను ఏబీ అందుకున్నాడు. ఇక ఐపీఎల్లో కూడా ఏబీ మెరుపులు చూశాం. నేను అతనితో కలిసి ఆర్సీబీకి ఆడాను. అతని ఫీల్డింగ్‌లో ట్రైనింగ్ అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది’ అని కైఫ్ పేర్కొన్నాడు.(కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!) -
'స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం'
లక్నో : కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యక్రమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా పుట్టిన రోజు వేడుకలు, ఇతరత్రా శుభకార్యాలు ఎవరి ఇంట్లో వారే జరుపుకుంటున్నారు. అయితే కొందరు దానిని వినూత్నంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేరిపోయాడు. మంగళవారం.. భార్య పూజా కైఫ్ పుట్టిన రోజు పురస్కరించుకొని మహ్మద్ కైఫ్ ట్విటర్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 'నా జీవిత భాగస్వామి పూజా కైఫ్‌కు ఇవే నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈరోజు డిన్నర్ ఎక్కడ చేద్దాం స్వీట్హార్ట్.. త్వరగా చెప్పు నీ రిప్లై కోసం ఎదురుచూస్తుంటా' అంటూ పేర్కొన్నాడు. అయితే కైఫ్ భార్య పూజా నుంచి ఎటువంటి రిప్లై రాలేదు.('ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు') అయితే కైఫ్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ''బయట కరోనా ఉంది.. కాబట్టి ఇంట్లోనే డిన్నర్ చేయండి... అదేంటి కైఫ్ అదేం ప్రశ్న.. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద చేయండి.. కరోనా పుణ్యమా అని మీకు అదృష్టం కలిసొచ్చింది.. హాయిగా మీ భార్యకు వండిపెట్టి సంతోషంగా తినేయండి'' అంటూ కామెంట్లు పెట్టారు. అంతకుముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కైఫ్ భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు.'వదిన.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ట్విటర్లో తెలిపాడు. Happy birthday, partner! 🎂 Bataayein, aaj dinner ke liye kahan le jaaun? 😉😛 pic.twitter.com/xPp6KwW1BK — Mohammad Kaif (@MohammadKaif) April 21, 2020 -
వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం..
-
మహ్మద్ కైఫ్‌కు షోయబ్ అక్తర్ సవాల్
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌కు ట్విటర్ వేదికగా సవాల్ విసిరాడు. ' కైఫ్.. నీ కొడుకు కబీర్‌కు, నా కొడుకు మైఖేల్ అలీ అక్తర్‌కు చిన్న పోటీ పెడదాం.. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం.. అయితే నీ కొడుకును నేను మనస్పూర్తిగా ఇష్టపడుతున్నా ' అంటూ ట్విటర్లో సవాల్ విసిరాడు. అయితే ఇదంతా సీరియస్ అనుకునేరు.. ముమ్మాటికి కానే కాదు. అసలు విషయం ఏంటంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ ఇంటికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో తన కొడుకు కబీర్‌తో కలిసి పాత క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా భారత్- పాక్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో కైఫ్ ఇన్నింగ్స్ ఆడుతుండగా షోయబ్ అక్తర్ బౌలింగ్ వేశాడు. కాగా షోయబ్ వేగంగా వేసిన బంతిని అంతే వేగంతో బౌండరీకి తరలించడంతో కబీర్ ఆనందంతో గెంతులేశాడు. ' పప్పా.. షోయబ్ బౌలింగ్‌ను ఈజిగా ఎదుర్కోవచ్చు.. ఎంత వేగంతో వేసినా అది కచ్చితంగా బౌండరీకి పంపిచొచ్చు. అందుకు ఉదాహరణ నువ్వే అంటూ' కబీర్ కైఫ్‌కు తెలిపాడు. ('సీనియర్ ఆటగాళ్లకు తగినంత గౌరవం ఇవ్వడం లేదు') ఈ విషయాన్ని మహ్మద్ కైఫ్ తన ట్విటర్లో పంచుకున్నాడు.' థ్యాంక్స్ టూ స్టార్‌స్పోర్ట్ ఇండియా.. ఒక చారిత్రాత్మక మ్యాచ్‌లో నేను బాగస్వామ్యం కావడం.. ఇప్పుడు నా కొడుకు నన్ను పొగడడం సంతోషంగా ఉందంటూ' షేర్ చేశాడు. దీనిపై అక్తర్ స్పందిస్తూ.. ' మా అబ్బాయికి, మీ అబ్బాయికి పోటీ పెడదాం.. మావాడి పేస్‌ను ఎదుర్కొంటాడో లేదో చూద్దాం' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. అంతకుముందు మహ్మద్ కైఫ్ కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఒక వీడియో షేర్ చేశాడు.' దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను అరికట్టాలంటే అందరూ ఇంట్లోనే ఉండండి. ప్రధాని మోదీ చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తూ ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి' అంటూ తెలిపాడు. కాగా ప్రసుత్తం భారత్‌లో 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 150 కి చేరుకుంది. (జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్) -
మహ్మద్ కైఫ్ ట్వీట్‌పై మోదీ ఇలా..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికిన సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. దీనిలో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. దీనిలో భాగంగా‘జనతా కర్ఫ్యూ’కు అందరూ సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్పితే అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. (22న జనతా కర్ఫ్యూ) దీనిపై ఇప్పటికే సచిన్ టెండూల్కర్ స్పందించగా, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ట్వీట్ చేశాడు. ‘ కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ చేసిన సూచన చాలా ముఖ్యమైనది. కరోనా నిరోధానికి జనతా కర్ఫ్యూతో దేశం యుద్ధాన్ని ప్రకటించిన క్రమంలో మోదీ సూచనను అంతా పాటించాలి’ అని కైఫ్ కోరాడు. దీనిపై మోదీ మరో ట్వీట్ చేశారు. ‘ మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది. కరోనాపై పోరాటానికి భారత్ మొత్తం భాగస్వామ్యం కావాలి’ అని కైఫ్ ట్వీట్‌కు మోదీ రిప్లై ఇచ్చారు. దీనిలో భాగంగా 2002లో నాట్‌వెస్ట్ ఫైనల్లో భారత్ 326 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘ఆనాటి ఫైనల్‌ను ఎవరూ మర్చిపోలేరు. మహ్మద్ కైఫ్-యువరాజ్ సింగ్‌లు ఇద్దరూ అసాధారణమైన క్రికెటర్లు. నాట్‌వెస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ భాగస్వామ్యం సాధించిన విషయం ఎప్పటికీ చిరస్మరణీయమే’ అని మోదీ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువరాజ్-కైఫ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్ 69 పరుగులు చేసి ఔటవ్వగా, కైఫ్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. టెయిలెండర్ల సాయంతో మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఆ మ్యాచ్‌లో విజయం తర్వాత అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన చొక్కా విప్పేసి మరీ సంబరాలు చేసుకోవడం క్రికెట్ అభిమానులకు బాగా సుపరిచితం. (‘కరోనాపై పోరాటం టెస్టు క్రికెట్‌లాంటిది’) Here are 2 excellent cricketers whose partnership we will remember forever. Now, as they have said, it is time for another partnership. This time, all of India will be partners in the fight against Coronavirus. #IndiaFightsCoronahttps://t.co/a6JJTh8gUWhttps://t.co/koRYZiRT6K — Narendra Modi (@narendramodi) March 20, 2020 -
'రాహుల్ కత్తి కంటే పదునుగా ఉన్నాడు'
హామిల్టన్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే జట్టుగా ఓటమి పాలైనా టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మాత్రం తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తాజాగా కేఎల్ రాహుల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు.' ప్రసుత్తం కేఎల్ రాహుల్ కత్తి కంటే చాలా పదునుగా ఉన్నాడు. టీమిండియా జట్టులో రాహుల్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. తాజాగా ఐదో స్థానంలో వచ్చి బెస్ట్ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఇలా ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు. రాహుల్ నీ ఆటతీరును ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నా' అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు.(రాహుల్‌కు షాక్.. శుబ్‌మన్ గిల్ ఇన్..) కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న రాహుల్ ఆస్ట్రేలియా, విండీస్, న్యూజిలాండ్‌లతో జరిగిన సిరీస్‌లను పరిశీలిస్తే ఓపెనర్ స్థానం నుంచి ఐదో స్థానం వరకు ఆడాడు. రాహుల్ ఆడిన మ్యాచ్‌ల్లో స్థానాలు మారుతున్నాయే తప్ప తన ఆటతీరు మాత్రం విధ్వంసకరస్థాయిలోనే కొనసాగుతుంది. తాజాగా కివీస్ తో జరిగిన మొదటి వన్డేలో ఐదో స్థానంలో వచ్చి కేవలం 64 బంతుల్లోనే 88 పరుగులు నమోదు చేయగా, రాహుల్ ఇన్నింగ్స్‌ల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ గైర్హార్జీలో మొదటి వన్డేలో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనర్లుగా రావడంతో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో రావాల్సి వచ్చింది. ఏ స్థానంలో వచ్చినా సరే తన విధ్వంసకర ఆటతీరుతో రాహుల్ జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. (కోహ్లిని దాటేసిన రాహుల్) Opens the innings ✅ Keeps wickets ✅ Stands in as captain ✅ Now finishes big for his team ✅ KL Rahul is Team India’s very own Swiss knife! #NZvIND — Mohammad Kaif (@MohammadKaif) February 5, 2020 -
వైరల్ : బౌలర్‌గా అవతారమెత్తిన తల్లి
భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు జెంటిల్మాన్ క్రీడకు పడిచచ్చి పోతారు. మ్యాచ్ ఉందంటే చాలు.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా స్టేడియంలో వాలిపోతారు. ఇటీవల ఓ దివ్యాంగ బాలుడు రెండు కాళ్లు చచ్చుబడిపోయినా.. తోటి పిల్లలతో కలిసి పోటాపోటీగా క్రికెట్ ఆడుతూ అందర్నీ ఆకర్షించాడు. తాజాగా ఓ తల్లి తన రెండేళ్ల కొడుకు కోసం బౌలర్ అవతారమెత్తి.. వీధుల్లో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రద్దీగా ఉన్న రోడ్డులో తన కుమారుడికి బౌలింగ్ చేస్తూ.. కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ట్విటర్లో షేర్ చేశాడు. ‘కొడుకు బ్యాటింగ్.. అమ్మ బౌలింగ్.. మొత్తానికి బ్యాటిఫుల్’ అని క్యాప్షెన్ పెట్టాడు. కాసేపట్లోనే అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. -
నాడు గొప్ప క్రికెటర్.. నేడు కీలుబొమ్మ!
లక్నో: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కప్పుడు గొప్ప క్రికెటర్‌గా ఉన్న ఇమ్రాన్.. నేడు పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారాడంటూ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు సురక్షితమైన అడ్డగా మార్చారని ఘాటూ విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇటీవల ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో భారత్‌పై చేసిన ఆరోపణలను కైఫ్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఇలాంటి ప్రసంగం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమేనంటూ ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా మంది క్రికెటర్లు కూడా దీనిపై స్పందించి.. పాక్ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. Yes ,but your country Pakistan certainly has a lot lot to do with terrorism, a safe breeding ground for terrorists. What an unfortunate speech at the UN and what a fall from grace from being a great cricketer to a puppet of Pakistan army and terrorists. https://t.co/UbUVG30R11 — Mohammad Kaif (@MohammadKaif) October 6, 2019 -
కైఫ్ రికార్డును సమం చేసిన వోక్స్
నాటింగ్‌హామ్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్థానిక ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వోక్స్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. ఇందులో ఓ క్యాచ్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో వోక్స్ ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు(4) పట్టిన ఫీల్డర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సరసన చేరాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ మూడు కీలక వికెట్లు పడగొట్టడం విశేషం. పాక్ సరికొత్త రికార్డు ఇక పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్(63), హఫీజ్ (84), సర్పరాజ్ అహ్మద్(55)లు రాణించడంతో పాక్ 348 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయనప్పటికీ భారీ స్కోర్ సాధించడంతో ప్రపంచకప్‌లో పాక్ సరికొత్త రికార్డును సృష్టించింది. గత వరల్డ్‌కప్‌లో యూఏఈపై దక్షిణాఫ్రికా జట్టులో ఎవరూ శతకం సాధించకుండానే 341 పరుగుల చేసింది. ఇదే ఇప్పటివరకు అత్యుత్తం కాగా ఆ రికార్డును తాజాగా పాక్ బద్దలుకొట్టింది. గెలిస్తే ఇంగ్లండ్ రికార్డే.. పాకిస్తాన్ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే ఇంగ్లండ్ సరికొత్త రికార్డును సృష్టిస్తుంది. ప్రపంచకప్‌లో 329 పరుగుల ఛేజింగే ఇప్పటివరకు అత్యుత్తమం. అది కూడా 2011 ప్రపంచకప్ సందర్భంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును ఇంగ్లండ్ సాధించింది. అయితే ప్రపంచకప్‌కు ముందు పాక్‌తో జరిగిన సిరీస్‌లో భారీ లక్ష్యాలను అవలీలలగా ఛేదించిన విషయం తెలిసిందే. -
‘అంపైర్లూ.. టైమ్ చూడండి’
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో ముగియకపోవడంపై మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ విన్నవించాడు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లు ముగుస్తున్న సమయాన్ని అంపైర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దాదాపు ప్రతీ మ్యాచ్ అర్ధరాత్రి గం.12.00లకు ముగుస్తుంది. ఆయా జట్లు ఫీల్డింగ్ సర్దుబాటు చేసుకునే క్రమంలో మ్యాచ్‌లు ఆలస్యమవుతున్నాయి. ఏ ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలనే సందిగ్థంలో సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనిపై అంపైర్లు దృష్టి నిలపాలి. నిర్ణీత సమయానికి మ్యాచ్‌లు ముగిసే విధంగా చర్యలు తీసుకోండి’ అని కైఫ్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్ వ్యూహాలను కైఫ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని... తగిన కారణం లేకుండా సబ్స్టిట్యూట్లను వాడుకోవడం సరైంది కాదని కైఫ్ వ్యాఖ్యానించాడు. (ఇక్కడ చదవండి: ఇదేం పద్ధతి? ) -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్ వ్యూహాలను మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ కైఫ్ తప్పు పట్టాడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని... తగిన కారణం లేకుండా సబ్స్టిట్యూట్లను వాడుకోవడం సరైంది కాదని కైఫ్ వ్యాఖ్యానించాడు. దీనిపై అంపైర్లు దృష్టి పెట్టాలని, లేదంటే తామే వారికి ఫిర్యాదు చేస్తామని అతను అన్నాడు. ‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రసెల్ స్థానంలో రింకూ సింగ్ వచ్చాడు. చావ్లా వేగంగా తన నాలుగు ఓవర్లను పూర్తి చేసుకొని బయటకు వెళ్లిపోతే మళ్లీ రింకూ సింగ్ బరిలోకి దిగాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సర్ఫరాజ్ గాయం గురించి నాకు స్పష్టత లేదు కానీ అతని స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ అద్భుతమైన క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. నెమ్మదిగా కదిలే ఆటగాళ్ల స్థానంలో చురుకైన ఫీల్డర్లను తెచ్చి ఆయా జట్లు తెలివిగా వ్యవహరించాయని భావిస్తున్నాయి. అయితే నా దృష్టిలో అది తప్పు. దీనిని ఇకపై అంపైర్ల దృష్టికి తీసుకెళతాం’ అని కైఫ్ చెప్పాడు. మరో వైపు ఫీల్డింగ్ చేస్తున్న జట్లు వ్యూహాలు రూపొందించడంలో చాలా సమయాన్ని వృథా చేస్తున్నాయని, నిజానికి అంత అవసరం లేదని అతను అన్నాడు. -
ఇమ్రాన్ ఖాన్‌కు కైఫ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: మైనార్టీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించారు. ‘‘భారత్‌పై పాకిస్తాన్ ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలి. పాక్‌తో పోలిస్తే మైనార్టీలు భారత్‌లోనే క్షేమంగా ఉన్నారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్లో మైనార్టీల జనాభా శాతం 20శాతం ఉంటే ఇప్పడు 2 శాతానికి పడిపోయింది’ అంటూ ట్విటర్ వేదికగా కైఫ్ కౌంటర్ ఇచ్చారు. ‘భారత్‌లో మైనార్టీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇటీవల ఇమ్రాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్‌లోని అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖండించారు. కాగా ఇమ్రాన్, కైఫ్ ఇద్దరూ కూడా మాజీ క్రికెటర్లు కావడం గమన్హారం. There were around 20% minorities at the time of Partition in Pakistan,less than 2% remain now. On the other hand minority population has grown significantly in India since Independence. Pakistan is the last country that should be lecturing any country on how to treat minorities. https://t.co/6GTr3gwyEa — Mohammad Kaif (@MohammadKaif) December 25, 2018 -
నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!
న్యూఢిల్లీ: తొలి ఐపీఎల్లో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు అనూహ్యంగా రాణించి చాంపియన్‌గా నిలిచింది. చెప్పుకోదగ్గ స్టార్లు లేని, కుర్రాళ్లతో నిండిన ఆ టీమ్‌ను వార్న్ సమర్థంగా నడిపించి, వారి ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టాడు. తన ఆత్మ కథ ‘నో స్పిన్’లో 2008 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్ల ఆలోచనలు ఎలా ఉంటాయో, తాము ఇతరులకంటే ఎక్కువ అనే భావనతో ఎలా ప్రవర్తిస్తారో చెబుతూ అతను మొహమ్మద్ కైఫ్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. మునాఫ్ పటేల్, రవీంద్ర జడేజాల గురించి కూడా అతను ఇందులో ప్రస్తావించాడు. ‘రాజస్తాన్ జట్టు హోటల్లోకి ప్రవేశించిన తర్వాత అందరు ఆటగాళ్లు ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే కైఫ్ మాత్రం రిసెప్షన్ వద్దకు వెళ్లి నా పేరు కైఫ్ అని చెప్పాడు. రిసెప్షనిస్ట్ తనకు తెలుసన్న చెప్పిన తర్వాత మరోసారి నా పేరు కైఫ్ అని గుర్తు చేశాడు. నేను దగ్గరకు వెళ్లి ఏమైనా సమస్య ఉందా అని అడిగితే అవును, నా పేరు కైఫ్ అని మూడోసారి అదే మాట అన్నాడు. నువ్వెవరో వారికి తెలుసు కానీ ఇబ్బందేమిటని నేనే అడిగాను. అందరిలాగే నాకు చిన్న గది ఇచ్చారు. నా పేరు కైఫ్ అని అతను మళ్లీ చెప్పాడు! దాంతో అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. నేను సీనియర్‌ను, భారత్ తరఫున ఆడిన వాడిని, కాబట్టి నాకు పెద్ద గది కావాలనేది అతని మాటల్లో ధ్వనించింది. ఎక్కువగా ఆలోచించవద్దని, అందరు ఆటగాళ్లకు ఒకే తరహా గది ఇచ్చారని, నేను ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద గది ఇచ్చారని నేను చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. భారత సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రాధాన్యత కోరుకుంటారని నాకు అర్థమైంది’ అని వార్న్ నాటి ఘటన గురించి వెల్లడించాడు. మునాఫ్ పటేల్‌ను అతని వయసు గురించి అడిగితే ‘అసలు వయసా లేక ఐపీఎల్ వయసా’ అని అతను తిరిగి ప్రశ్నించాడని... చివరకు ఐపీఎల్ ప్రకారం తనకు 24 ఏళ్లని, అసలు వయసు ఒకవేళ 34 అయినా ఐపీఎల్లో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు 24 ఏళ్లే చెబుతానంటూ తనలోని హాస్య చతురతను బయట పెట్టాడని వార్న్ గుర్తు చేసుకున్నాడు. జడేజాను క్రమశిక్షణలో పెట్టేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా దిగ్గజ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ప్రతీసారి జడేజా ఆలస్యంగా వచ్చేవాడని, ఒకసారి హోటల్‌కు తిరిగి వెళుతుండగా మధ్యలో బస్సు నుంచి దించేసి నడుస్తూ రమ్మని శిక్ష విధించడంతో ఆ తర్వాత అంతా మారిపోయిందని వార్న్ వెల్లడించాడు. -
భారత్ విఫలం: కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ గడ్డమీద ఆతిథ్య జట్టు చేతిలో తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను టెస్ట్ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతానని తెలిపాడు. క్రీజులో పాతుకుపోవడం అలవాటే కనుక టెస్టుల్లో తనకెలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని 13 టెస్ట్‌లు ఆడిన కైఫ్ పేర్కొన్నాడు. హార్డ్ హిట్టర్ యువరాజ్ సింగ్‌తో తనను పోల్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను యువీని కాదంటూ సున్నితంగా తిరస్కరించాడు. ‘టెక్నిక్ విషయంలో నాశైలి రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్‌లను పోలి ఉండేది. వారి బ్యాటింగ్‌ను ఎక్కువగా గమనించేవాడిని. కెరీర్ పట్ల ఎలాంటి ఫిర్యాదులు లేవు. అత్యుత్తమ క్రికెటర్లు ఆడుతున్న సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో జట్టులో ఉన్న కొందరు ప్లేయర్లు దిగ్గజాలు అయ్యారు. భారత్‌లో, విదేశాల్లోనూ జట్టుకు సేవలందించాను. సంతృప్తిగానే కెరీర్‌కు వీడ్కోలు పలికానని’ కైఫ్ మనసులో మాటలు వెల్లడించాడు. భారత్ తరఫున 13 టెస్టులు ఆడిన కైఫ్ 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 624 పరుగులు చేశాడు. 125 వన్డేలాడిన ఈ యూపీ క్రికెటర్ 2 శతకాలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 2,753 పరుగులు చేశాడు. అందులో 2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 87 పరుగుల ఇన్నింగ్స్‌ను కైఫ్ మాత్రమే కాదు.. భారత క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ట్రోఫీ నెగ్గిన అనంతరం సంబరాల్లో భాగంగా అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ జెర్సీ(టీషర్ట్) విప్పి గాల్లో తిప్పడం జట్టుకు ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. -
ఇలాంటి జర్నలిజం అవసరమా: కైఫ్
హైదరాబాద్ : ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ‘ది వైర్’ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జర్నలిజం అక్కర్లేదని చురకలింటించాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కైఫ్.. ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు. అయితే ‘ది వైర్’ భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ కులాల ఆటగాళ్లకు దక్కిన ప్రాధాన్యత గురించి ప్రస్తావించింది. అయితే ఈ కథనంపై కైఫ్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. ‘ మీ సంస్థల్లో ఎంత మంది ప్రైమ్ టైమ్ జర్నలిస్టులు ఎస్సీ, ఎస్టీలున్నారు? సీనియర్ ఎడిటర్లు ఎందరున్నారు? కులాల అడ్డుంకులను దాటింది ఒక క్రీడల్లోనే, ఆటగాళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా ఆడుతారు. అలాంటప్పుడు ఇలాంటి విద్వేషాలు వ్యాపింప జేసే జర్నలిజం అవసరమా.’ అని ట్వీట్ చేశాడు. ఇంతకీ ది వైర్ కథనం ఏమిటంటే.. ‘భారత్‌కు టెస్ట్ క్రికెట్ హోదా వచ్చి 86 సంవత్సరాలు అవుతోంది, ఇన్నేళ్లలో ఆడిన 290 మంది క్రికెటర్లలో కేవలం నలుగురు మాత్రం ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. జనాభ ప్రకారం 70 మందికి దక్కాల్సిన అవకాశం కేవలం నలుగురికే దక్కింది. ఇది కేవలం అసమానత్వమే.. దీన్ని తేలికగా తీసుకోలేము’’ అని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చింది. ఈ ఆర్టీకల్‌పై కైఫే కాకుండా నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్లోకి కులాన్ని తీసుకొచ్చి విబేధాలు సృష్టించవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. How many prime time journalists are SC or ST or for that matter how many senior editors in your organisation are SC or ST. Sports is perhaps one field which has successfully broken barriers of caste,players play with inclusiveness but then we have such journalism to spread hatred https://t.co/ludDNpPi3x — Mohammad Kaif (@MohammadKaif) July 29, 2018 చదవండి: క్రికెట్‌కు కైఫ్ వీడ్కోలు -
క్రికెట్‌కు మొహమ్మద్ కైఫ్ వీడ్కోలు
-
క్రికెట్‌కు కైఫ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. సరిగ్గా పదహారేళ్ల క్రితం (2002 జూలై 13) నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత పోరాటంతో వెలుగులోకి వచ్చిన కైఫ్ తన రిటైర్మెంట్కు అదే రోజును ఎంచుకోవడం విశేషం. ‘ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైనది అందుకే రిటైర్మెంట్కు దీన్ని ఎంచుకున్నా’ అని కైఫ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. 37 ఏళ్ల కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన అతను 129 దేశవాళీ మ్యాచ్‌ల్లో 7,581 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అండర్–19 ప్రపంచకప్ (2000) గెలిచిన భారత యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కైఫ్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువ రాజ్‌తో కలిసి ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ మైదానంలో ఈ జోడీ చెలరేగిన తీరు మరుపురానిది. 326 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో యువీతో కలిసి 121 పరుగులు జతచేసిన కైఫ్ (75 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరి వరకు నిలిచి జట్టుకు మధురమైన విజయాన్ని అందించాడు. పాయింట్, కవర్స్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డింగ్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన కైఫ్... ఆసాధ్యం అనదగ్గ ఎన్నో క్యాచ్‌లను ఒడిసిపట్టి ఇండియన్ జాంటీ రోడ్స్‌గా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఫూల్పూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యాడు. -
‘టీమిండియా జాంటీ రోడ్స్’ వీడ్కోలు
హైదరాబాద్: టీమిండియా టార్గెట్ 326.. కానీ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలువగా.. యువరాజ్-మహ్మద్ కైఫ్‌ల జోడి టీమిండియాను విజయతీరాలకు చేర్చి గంగూలీ చొక్కా విప్పి సంతోషపడేలా చేసిన చారిత్రక రోజు నేడు(జులై13). ఇంగ్లండ్‌పై భారత్ నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచి నేటికి 16 సంవత్సరాలు. ఈ శుభదినం రోజున ఆనాటి హీరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కైఫ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. టీమిండియా జెర్సీ ధరించడం ఎంతో గౌరవంగా భావించా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ బోర్డ్ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీలకు మెయిల్ పంపించాడు. టీమిండియా జాంటీరోడ్స్ ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. యువరాజ్‌తో కలిసి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ ఎన్నో మెరుపులాంటి క్యాచ్‌లు, రనౌట్లు చేసిన ఘనత ఈ ఆటగాడిది. అభిమానులు కైఫ్‌ను ‘టీమిండియా జాంటీ రోడ్స్’గా పిలుచుకుంటారు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు అరంగేట్రం చేసిన కైఫ్, వన్డేల్లో 2002లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడాడు. కెరీర్ మధ్యలో బ్యాటింగ్‌లో విఫలమైనా గంగూలీ ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ చివరి టెస్ట్ 2006లో వెస్టీండీస్‌పై, చివరి వన్డే దక్షిణాఫ్రికాపై ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడంలో ఈ క్రికటర్ పాత్ర మరువలేనిది. రికార్డులు.. టీమిండియా తొలిసారి అండర్-19 ప్రపంచకప్(2000) గెలుచుకుంది కైఫ్ సారథ్యంలోనే. భారత్ తరుపున 125 వన్డేల్లో 2753 పరుగులు, 13 టెస్టుల్లో 624 పరుగులు సాధించాడు. వీటిలో మూడు సెంచరీలు, ఇరవై అర్దసెంచరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోహించిన కైఫ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 186 మ్యాచ్‌లు ఆడి పదివేలకు పైగా పరుగులు సాధించాడు. వీటిలో 19 శతకాలు, 59 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ప్రస్తుతం రంజీల్లో ఛత్తీస్‌గఢ్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. -
ఆసీస్‌పై పాక్ గెలుపు : కైఫ్ ఒక దేశద్రోహి!
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. దీంతో ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అయితే ఫఖర్ జమాన్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్ జట్టు అద్భుత విజయం సాధించింది. గ్రేట్ ఇన్నింగ్స్‌తో పాక్ విజయానికి కారణమైన ఫఖర్ జమాన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్.. కంగ్రాచ్యులేషన్స్’ అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు ‘దేశద్రోహి’ అంటూ కైఫ్‌పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ గెలిస్తే మీరు కూడా సంతోషపడతారా‘... ‘పాకిస్తాన్‌పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అయితే అక్కడే ఉండొచ్చుగా’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Well done to Pakistan on winning the T20 series final against Australia. Great innings from Fakhar Zaman , looks a big match player. Congratulations #PakvAus — Mohammad Kaif (@MohammadKaif) July 8, 2018 देशद्रोही 😞😞😞😞 @MohammadKaif — Deepika Padukone FC (@deepikapadukonz) July 8, 2018 -
భారత్‌కు ఇది గొప్ప ఆరంభం: కైఫ్
సాక్షి, స్పోర్ట్స్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారత అథ్లెట్లను క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందించారు. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. తద్వారా ఈ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మరో అథ్లెట్ గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను, గురురాజాలు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు మరింత గుర్తింపు దక్కాలని తన ట్వీట్ ద్వారా కైఫ్ ఆకాంక్షించారు. కాగా, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా గురురాజా నిలిచాడు. Congratulations to #MirabaiChanu for the gold and #Gururaja for the silver at the #CWG2018 . Great start for India. Wish more success and recognition for our talent in the coming days. pic.twitter.com/OR33sFskeK — Mohammad Kaif (@MohammadKaif) 5 April 2018 కరణం మల్లేశ్వరి హర్షం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతంగా బరువులెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిందని వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ప్రశంసించారు. భారతీయ అథ్లెట్లకు ఇది శుభ పరిణామం. ఇతర అథ్లెట్లకు మీరాబాయి స్వర్ణం స్ఫూర్తినిస్తుందన్నారు. తొలి లిఫ్ట్‌తోనే పతకం సాధించడం విశేషమని మల్లేశ్వరి కొనియాడారు. మీరాబాయి ప్రదర్శనను గమనించినట్లయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పథకంపై ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్‌గా కరణం మల్లేశ్వరి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ ధావన్ అయితే బాగుండు!
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో ప్రాంచైజీలు ఎవరిని తీసుకుంటాయా అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సీజన్ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జోరూట్, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్ ఆటగాడు లెండీ సిమ్మన్స్, దక్షిణాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లాలపై అందరి దృష్టి పడింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ట్విటర్లో క్వశ్చన్ పోల్ నిర్వహించాడు. ఇక అంతేగాకుండా సన్‌రైజర్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ రాణించగలడని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు అతను ఇలంటి బాధ్యతలను కూడా తీసుకున్నాడని, అంతేగాకుండా ధావన్ కెప్టెన్ అయితే తొలి సారి భారత్ ఆటగాళ్ల సారథ్యంలో ఐపీఎల్ కొనసాగుతుందని కైఫ్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సన్‌రైజర్స్ పగ్గాలు కన్నె విలియమ్స్‌న్‌కు దక్కే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ఆసీస్ పర్యటనలో భారతే ఫేవరేట్ స్మిత్, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేదం విధించడంతో నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టెస్టె సిరీస్ టీమిండాయేనే హాట్ ఫేవరేట్ కానుందని కైఫ్ ట్వీట్ చేశాడు. ‘స్మిత్, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధంతో పాటు స్మిత్‌ను రెండేళ్ల పాటు కెప్టెన్సీ చేసే అవకాశం లేకుండా చేసింది. నవంబరులో టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించ నుంది. స్మిత్, వార్నర్ లేని ఈ సిరీస్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్. వచ్చే ఏడాది మేలో జరిగే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు. అరోన్ ఫించా? అని’ ట్వీట్లో కైఫ్ పేర్కొన్నాడు. Think Shikhar Dhawan should lead SunRisers Hyderabad .He has been around for sometime & needs to take this responsibility.Will also make it all Indian Captains for the first time.Think will depend on whether Warner will participate as a player. If not, they may go for Williamson. — Mohammad Kaif (@MohammadKaif) 28 March 2018 So with the one year ban on Smith and Warner and also a 2 year captaincy ban on both, think India will be favourites when they tour Australia later this year. Wonder, who will captain Australia at the World Cup. Aaron Finch ? — Mohammad Kaif (@MohammadKaif) 28 March 2018 -
మరి వార్నర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంతో సంబంధమున్న మరో ఆటగాడు డేవిడ్ వార్నర్ సంగతేంటని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.ఔ ‘రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్మిత్ కొనసాగడం లేదా.. నిజంగా ఇది ఆసక్తికరమైన విషయమే..ఊహించని ఘటన కూడా. డెవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ కెప్టెన్సీ నుంచి తొలగించరా..? ఒక వేళ వార్నర్‌ను తొలగిస్తే.. మొత్తం 8 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్‌గా ఉంటారు’ అని కైఫ్ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. మరో వైపు స్మిత్, వార్నర్‌లను తమ బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఈ ఇద్దరితో పాటు ట్యాంపరింగ్‌కు యత్నించిన బెన్‌క్రాఫ్ట్‌లపై జీవిత కాల నిషేధం విధించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఐసీసీ తీసుకున్న చర్యలపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. So Steve Smith is not going to captain Rajasthan Royals. Really interesting, a bit unexpected. Will David Warner too not captain Hyderabad. If it happens that way, we may have all 8 Indian Captains for the first time in IPL history. — Mohammad Kaif (@MohammadKaif) March 26, 2018 -
ద్రవిడ్‌కు చోటివ్వని కైఫ్!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్‌కైఫ్ తన ఆల్‌టైం జట్టులో దివాల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు స్థానం కల్పించలేదు. తాజాగా మాజీ క్రికెటర్లతో జరిగిన ఐస్ క్రికెట్ టోర్నీలో కైఫ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులతో కైఫ్ ట్విటర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కైఫ్ సమాధానం ఇచ్చారు. ‘2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్, మీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ స్లెడ్జింగ్ పాల్పడ్డారా? ’అని ఒకరు ప్రశ్నించగా.. ‘ ఆ సమయంలో నాసర్ తనను బస్ డ్రైవర్ అని పిలిచాడని, దానికి యువీ, నేను కలిసి మ్యాచ్ అనంతరం రైడ్‌కు తీసుకెళ్తాం అని సమాధానమిచ్చాం’ అని కైఫ్ పేర్కొన్నాడు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, విరాట్, యువరాజ్, ధోని, కపిల్‌దేవ్, హర్భజన్, జహీర్, కుంబ్లే, శ్రీనాధ్లు తన ఆల్‌టైం భారతజట్టు సభ్యులని కైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో దివాల్ ద్రవిడ్ లేకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై అభిమానులు కైఫ్‌ను నిలదీస్తున్నారు. కాజోల్ అభిమాన నటి, సచిన్ ఫెవరేట్ క్రికెటర్, జాంటీ రోడ్స్ తన ఆల్‌టైం బెస్ట్ ఫీల్డర్ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ అవుతారా అని ప్రశ్నించగా.. ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. ‘ఒకప్పటి లెజండరీ ఫీల్డర్, ఎప్పటికీ లెజండరీ ఫీల్డర్, ఫినిషరే’ అని ఈ మధ్యే జరిగిన ఐస్ క్రికెట్ సందర్భంగా పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అనడం’ తానందుకున్న గొప్ప కాంప్లిమెంట్ అని కైఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. Sachin Sehwag Ganguly Virat Yuvraj Dhoni Kapil Dev Harbhajan Zaheer Kumble Srinath https://t.co/SCe2jyeJmK — Mohammad Kaif (@MohammadKaif) 27 February 2018 -
‘శ్రీదేవి ఇక లేరా?’
సాక్షి, స్పోర్ట్స్ : సీనియర్ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం షాక్‌కు గురిచేసిందని పలువురు క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ షమీ, ఆకాశ్ చోప్రా, అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, రెజ్లింగ్ స్టార్స్ సింగ్ బ్రదర్స్, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షబోగ్లేలు ట్విటర్ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ వార్తను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధూ, సైనా నెహ్వాలు నివాళులర్పించారు. శ్రీదేవి మరణవార్త విని షాక్‌కు గురయ్యా.. కొద్ది నెలల క్రితమే నా షో సందర్బంగా కలిసా. ఈ వార్తను నమ్మలేకపోతున్నా- సౌరవ్ గంగూలీ శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతి గురయ్యా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం- వీరేంద్ర సెహ్వాగ్ వి మిస్ యూ మేడమ్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- సైనా నెహ్వాల్ ఈ విషాద వార్తతో షాకయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - పీవీ సింధూ ఐకానిక్ నటి శ్రీదేవి మరణ వార్త విని షాక్‌కు గురయ్యా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం- వీవీఎస్ లక్ష్మణ్ శ్రీదేవి ఇక లేరా? ఆమె లేదనే ఈ వార్తా చాలా కష్టంగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి- రవిచంద్రన్ అశ్విన్ శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం- మహ్మద్ కైఫ్ భారత సినీ చరిత్రలో గొప్ప తారగా వెలిగిన శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి. మా చిన్నతనంలో ఆమె సినిమాలెన్నో చూశాం- సింగ్ బ్రదర్స్, రెజ్లింగ్ స్టార్స్ ఈ చేదువార్త నిజం కాకపోతే బాగుండు.. షాకయ్యా- ఆకాశ్ చోప్రా శ్రీదేవి స్వశక్తితో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఓ తార.. ఆమె మరణించే వయస్సే కాదిది - ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షాబోగ్లే భారత సినీ పరిశ్రమకు మీరెంతో కృషి చేశారు. మీ అకాల మరణం తీరని నష్టం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- ప్రజ్ఞాన్ ఓజా నా అభిమాన నటి శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి- పారుపల్లి కశ్యప్ Very shocked to hear about the passing away of iconic actress #Sridevi ji. Condolences to her family and loved ones. May her soul rest in peace. — VVS Laxman (@VVSLaxman281) 25 February 2018 Sridevi no more ? 😳so difficult to fathom that she is no more, such is life I guess. Strong will to those near and dear to her. #RIPSridevi 😢 — Ashwin Ravichandran (@ashwinravi99) 25 February 2018 -
కవర్స్‌లో జూనియర్ కైఫ్ అద్భుతంగా ఆడాడు
-
జూనియర్ కైఫ్ షాట్‌కు సచిన్ ఫిదా !
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కుమారుడు ఆడిన ఓ షాట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. స్మాష్ గేమింగ్ సెంటర్లో బౌలింగ్ మిషన్ సాయంతో జూనియర్ కైఫ్ ఆడిన కవర్స్ షాట్ వీడియోను మాస్టర్ ట్వీట్ చేశాడు. ‘కవర్స్‌లో జూనియర్ కైఫ్ అద్భుతంగా ఆడాడు. వెల్డన్ ఎప్పుడూ.. ఇలానే ఆడుతూ ఉండూ..’ అని ఈ బుడ్డోడిని ప్రశంసించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. 87వేలకు పైగా వ్యూస్ రాగా వెయ్యికి పైగా రీట్వీట్ చేశారు. కైఫ్ సారథ్యంలో భారత్ 2000ల్లో అండర్-19 యూత్ ప్రపంచకప్ గెలిచింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్ అద్భుతంగా రాణించాడు. తనదైన ఫీల్డింగ్ మార్క్‌తో భారత అభిమానులకు గుర్తుండిపోయాడు. 37 ఏళ్ల కైఫ్ ఇప్పటి వరకు అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. తన చివరి వన్డేను దక్షిణాఫ్రికాతో 2006లో ఆడాడు. రంజీ ట్రోఫీలో చత్తీస్‌ఘడ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
మహ్మద్ కైఫ్‌పై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కైఫ్‌ను నెటిజన్లు మతాన్నిప్రస్తావిస్తూ దూషణకు దిగుతున్నారు. సోమవారం కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కైఫ్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. ఈ ఫొటోకు కొంతమంది ‘నీవు నిజమైన భారతీయునివి’ అని సానుకూలంగా స్పందించంగా మరికొంత మంది ఘాటుగా వ్యక్తిగత దూషణకు దిగారు. ఓ ముస్లింగా క్రిస్మమస్ శుభాకాంక్షలు తెలపడం షేమ్ అని కొందరంటే.. నీ మతమేంటో మరిచిపోయావా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే నీ తాత హిందువు నుంచి ముస్లిం మతం ఎంచుకున్నాడా.., ఇలాంటివి పోస్ట్ చేసే ముందు నీ మతం ఏంటో తెలుసుకో అని ట్రోల్ చేస్తున్నారు. కైఫ్ నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలో యోగా చేస్తూ సూర్యనమస్కారాలు పెట్టడం, కొడుకుతో చెస్ ఆడుతున్నఫొటోలతో విమర్శలకు గురయ్యాడు. వీటన్నిటికి స్ట్రాంగానే రిప్లే ఇచ్చిన కైఫ్ తాజా కామెంట్లకు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. Merry Christmas ! A post shared by Mohammad Kaif (@mohammadkaif87) on Dec 24, 2017 at 7:24pm PST -
ఆ క్రికెటర్‌ను మళ్లీ తిట్టేశారు!
సమాజంలోని వివిధ అంశాలపై స్పందించడంలో, నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ముందుంటాడు. ఆయన గతంలో పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా మతవాదులు కైఫ్‌పై విరుచుకుపడ్డారు. కైఫ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని అక్కస్సు వెళ్లగక్కారు. తాజాగా సత్వర ట్రిపుల్ తలాఖ్ చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై కైఫ్ ట్విట్టర్లో స్పందించాడు. 'ట్రిపుల్ తలాఖ్ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఈ తీర్పు మహిళలకు భద్రతను ఇస్తుంది. లింగ సమానత్వం నెలకొనాల్సిన ఆవశ్యకత ఉంది' అని కైఫ్ ట్వీట్ చేశాడు. కైఫ్ స్పందనను నెటిజన్లు చాలామంది స్వాగతించినప్పటికీ.. ఎప్పటిలాగే కొంతమంది ఆయనపై విరుచుకుపడ్డారు. 'ఏ సంతోషం కోసం మీరు ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారు?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'కైఫ్ బాబు నీకు తెలియని విషయంపై స్పందించకు' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'ట్రిపుల్ తలాఖ్ ఖురాన్‌కు వ్యతిరేకమైతే.. వందేమాతరం కూడా ఖూరాన్కు వ్యతిరేకమే. అల్లాను మించిన దేవుడు లేడు' అని నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇలా కైఫ్‌ను కించపరిచే ట్వీట్లు కొన్ని వచ్చినా.. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ కూడా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్ చేశారు. -
ఆ క్రికెటర్ కొడుకుతో చెస్ ఆడినా..!
సోషల్ మీడియాలో విమర్శల వర్షం ఈ మధ్య క్రికెటర్లు, సినిమా స్టార్లు ఏం పోస్టు చేసినా.. అయినదానికి కానిదానికి వారికి కించపరిచడం, పరిహాసించడం సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మతం పేరిట విమర్శలు చేయడం, కించపరచడం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న భార్యతో దిగిన ఫొటోను పోస్టు చేసినందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై కొందరు మతం పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనమస్కారం చేస్తున్న ఫొటోను పోస్టు చేసినందుకు మరో క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌పై పలువురు మండిపడ్డారు. ఇవి తమ మతానికి విరుద్ధమంటూ విద్వేషం వెళ్లగక్కారు. తాజాగా క్రికెటర్ కైఫ్.. తన కొడుకు చెస్ ఆడుతున్న క్యూట్ ఫొటోను పోస్టు చేసినా.. విమర్శలు తప్పలేదు. ఓ మంచి విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నా.. కొందరు మాత్రం మతకోణంలో విపరీత అర్థాలు తీసి విమర్శలు చేశారు. ఇస్లాం మతంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ ఆయన తీరును తప్పుబట్టారు. 'ఇస్లాం ప్రకారం చెస్ ఆడటం నిషేధం. నేను మంచి చెస్ ఆటగాడిని కానీ చెస్ ఆడకూడదని హదీత్లో చదివిన తర్వాత చెస్ ఆడటం మానేశాను' అని నెటిజన్ అభిప్రాయపడగా.. 'మరోసారి ఖూరాన్' చదవమంటూ మరొకరు కైఫ్‌ను తప్పుబట్టారు. ఈమేరకు ఆయన పోస్టుపై పలు వ్యతిరేక, విద్వేష వ్యాఖ్యలు వెల్లువడ్డాయి. మరోవైపు ఇంకొందరు నెటిజన్లు మాత్రం కైఫ్ చర్యను స్వాగతించారు. ఈ విషయంలో కైఫ్ పోస్టుపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. -
సెహ్వాగ్, కైఫ్ కలిసి ఉతికేశారు!
కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలు భారతీయులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించాయి. దాంతో తమకు తోచిన రీతిలో ఆ ఆనందాన్ని పదిమందితో పంచుకున్నారు. అయితే ఇది పాకిస్తానీలకు కంటగింపుగా మారింది. కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పడం, ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందనడం, అసలు ఉరిశిక్ష అమలు మీదే స్టే విధించడం లాంటి కోర్టు నిర్ణయాలు భారతీయులను సంబరాల్లో ముంచెత్తగా పాకిస్తానీలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ చేసిన ట్వీట్ల మీద రెచ్చిపోయి కామెంట్లు పెట్టి.. అడ్డంగా బుక్కైపోయారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయం రాగానే సెహ్వాగ్ కుల్‌భూషణ్ హ్యాష్ ట్యాగ్‌తో 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు. దానికి ఫర్హాన్ జహూర్ అనే పాకిస్తానీ వ్యక్తి స్పందించాడు. ''మీకు బుర్రలు తక్కువా? తుది నిర్ణయం ఇంకా రాలేదు, ఐసీజే స్టే ఇచ్చినా కూడా అతడిని మేం ఉరి తీస్తాం. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లంది'' అని ట్వీట్ చేశాడు. దాంతో సెహ్వాగ్‌కు ఒళ్లు మండింది. ''భారతదేశాన్ని ప్రపంచకప్‌లో ఓడించాలన్నట్లే ఇది కూడా మీకు కలగానే మిగిలిపోతుంది. కుక్కను పెంచుకోండి, పిల్లిని పెంచుకోండి గానీ, దురభిప్రాయాలను పెంచుకోకండి'' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ముల్తాన్ గడ్డ మీదే పాకిస్తాన్ మీద సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక మహ్మద్ కైఫ్ కూడా ఇదే అంశం మీద స్పందించాడు. ''కంగ్రాచ్యులేషన్స్ ఇండియా.. అంతర్జాతీయ కోర్టుకు ధన్యవాదాలు. న్యాయం నిలబడింది'' అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆమిర్ ఆక్రమ్ అనే పాకిస్తానీ ట్విట్టర్ యూజర్ రెచ్చిపోయాడు. ''ముందు నీ పేరు లోంచి మహ్మద్ అనే పదాన్ని తీసెయ్యి'' అని రాశాడు. దానికి కైఫ్ కూడా దీటుగా స్పందించాడు. 'వావ్.. నేను భారతదేశ విజయానికి మద్దతిస్తే, నేను మహ్మద్ అనే పేరు తీసెయ్యాలా.. నా పేరు అంటే నాకు గర్వంగా ఉంటుంది. ఆమిర్ అంటే పూర్తి జీవితం. అది నీకు ఉండాలి'' అంటూ కాస్తంత హెచ్చరికస్వరంతోనే కైఫ్ సమాధానం ఇచ్చాడు. Satyamev Jayate !#KulbhushanJadhav — Virender Sehwag (@virendersehwag) 18 May 2017 @virendersehwag You guys hv less brains? The final decision yet to come and even though icj stays whtever we ll hang him go where ever on ur choic#pak -
గూండాలు లేరు.. సంతోషం
ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కు మక్కువ తగ్గలేదు. తరచు యూపీ రాజకీయాలపైనే ట్వీట్లు చేస్తున్నాడు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పరోక్షంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అక్రమ కబేళాలను నిషేధిస్తూ యోగి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలోని ప్రఖ్యాత 'తుండే కబాబ్' అనే కబాబ్ సెంటర్ వ్యాపారం బాగా తగ్గింది. తమకు గొడ్డు మాంసం దొరక్కపోవడంతో కబాబ్‌లు తయారు చేయలేకపోతున్నామని దాని నిర్వాహకులు తెలిపారు. ఆ విషయం మీదే ఇప్పుడు కైఫ్ ట్వీట్ చేశాడు. 'తుండే మిలే యా న మిలే.. గూండే న మిలే' అని చెప్పాడు. అంటే, తుండే కబాబ్ ఉన్నా లేకపోయినా గూండాలు మాత్రం లేకపోవడం సంతోషమని అర్థం వచ్చేలా చెప్పాడు. మొత్తం గ్యాంగ్స్టర్లు, గూండాలు అందరినీ రాష్ట్రం నుంచి బయటకు విసిరి పారేయాలన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూండాలు లేకుండా ఉండే పరిస్థితి చూడటం ఆనందకరంగా ఉందని చెప్పాడు. అక్రమ వ్యవహారాలు అన్నింటినీ ఆపేయాలని, ఇప్పుడంతా బాగా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. చివర్లో 'యూపీ షుడ్ గో అప్' అని.. రాష్ట్రం పురోగతి సాధించాలని అర్థం వచ్చేలా తెలిపాడు. కొసమెరుపు: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మీద పోటీ చేసి ఓడిపోయిన కైఫ్.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని వరుసపెట్టి ప్రశంసిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కూడా యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సాధించిన బ్రహ్మాండమైన విజయానికి అభినందనలు అంటూ మోదీని, బీజేపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. Tunday milein ya na milein,Gundein na milein!Will be happy to see No Gunday in UP.All illegal stuff must be stopped.Good moves #UPshouldgoUP — Mohammad Kaif (@MohammadKaif) 25 March 2017 -
సీఎం యోగిపై కైఫ్ కామెంట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టడాన్ని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్వాగతించాడు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కు అభినందనలు. ఆయన పాలనలోరాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, యూపీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేయకుండా శుభాకాంక్షలు చెప్పడం మంచిది. దేశాభివృద్ధి బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాన’ని కైఫ్ ట్వీట్ చేశాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కైఫ్ ఘోర పరాజయం చవిచూశాడు. క్రికెటర్ గా అతనికున్న క్రేజ్ ఎన్నికల్లో పనిచేయలేదు. -
'ధోని సత్తా ఏమిటో మరోసారి చూశాం'
కోల్‌కతా: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఛత్తీస్‌గఢ్ తో జరిగిన మ్యాచ్ లో పది ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం సాధించి జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోనిపై ప్రత్యర్థి కెప్టెన్ మొహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. ధోనిలో ఇంకా సత్తా తగ్గలేదనడానికి ఈ తాజా ఇన్నింగ్స్ ఒక నిదర్శమని కొనియాడాడు. 'ధోని సహజసిద్ధమైన పవర్ ఏమిటో మరొకసారి చూశాం. అతను ఇంకా అన్ని ఫార్మాట్లలో ప్రమాదకర ఆటగాడని నేను బలంగా నమ్ముతున్నా. బంతిని ధోని హిట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే తన పవర్ ఇంకా అలాగే ఉంది. ధోని అరంగేట్రం మ్యాచ్ నుంచి అతన్ని నేను చూస్తునే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ అతని ఆట తీరులో ఎటువంటి మార్పు లేదు. ధోని ఏదో ప్రాక్టీస్ కోసమే ఈ టోర్నీలు ఆడుతున్నాడని మనం అనుకుంటే పొరపాటే. అతను ప్రతీ గేమ్‌ను చాలా సీరియస్ గా తీసుకుంటాడు' అని కైఫ్ పేర్కొన్నాడు. ఆదివారం చత్తీస్ గఢ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని 107 బంతుల్లో 129 పరుగులు చేశాడు. దాంతో జార్ఖండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. -
‘లయన్స్ ’అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్
రాజ్‌కోట్: ఐపీఎల్ జట్టు గుజరాత్ లయ న్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఎంపికయ్యాడు. లయన్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. గుజరాత్ హెడ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్‌తో కలిసి కైఫ్ పని చేస్తాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10 వేలకు పైగా పరుగులు సాధించిన 36 ఏళ్ల కైఫ్ తాజా రంజీ సీజన్ లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ప్లేయర్ కం మెంటార్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కు 13 టెస్టుల్లో 125 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఐపీఎల్లో రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. -
నిన్న షమీ భార్య.. నేడు మహ్మద్ కైఫ్
భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇటీవల తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేయగా.. షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకుని ఫొటోలో కనిపించడంపై కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. దీనిపై షమీ ఘాటుగా స్పందించగా, మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతనికి అండగా నిలిచాడు. తాజాగా మహ్మద్ కైఫ్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. కైఫ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోపై వివాదం ఏర్పడింది. ఈ ఫొటోలో కైఫ్ సూర్యనమస్కారాలు చేస్తున్నట్టుగా ఉంది. దీనిని కొందరు మతకోణంలో విమర్శించారు. సూర్య నమస్కారాలు చేయడం ఇస్లాం సంప్రదాయాలకు, సంస్కృతికి వ్యతిరేకమని, వివాదాస్పదమైన ఫొటోను ఎందుకు పోస్ట్ చేశావని ఓ నెటిజన్ కైఫ్‌ను విమర్శించాడు. ఇస్లాంలో సూర్యనమస్కారం వందశాతం నిషేధం అంటూ మరో నెటిజెన్ తప్పుపట్టాడు. దీనికి కైఫ్ ఘాటుగా సమాధానాలిచ్చాడు. సూర్య నమస్కారం అన్నది పూర్తిగా భౌతిక వ్యవస్థ పనితీరుకు సంబంధించినదని, ఏ పరికరం లేకుండా ఎక్సర్సైజ్ చేసే పద్ధతని, తన హృదయంలో అల్లా ఉన్నాడని, సూర్యనమస్కారం చేసినా, జిమ్‌లో కసరత్తులు చేసినా అందరికీ ఉపయోగమని.. కైఫ్ రీ ట్వీట్ చేశాడు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం కోసం కైఫ్ ఈ ఫొటోలను పోస్ట్ చేయడాన్ని చాలామంది ప్రశంసించారు. (చదవండి: క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..) -
కోర్టులో మహ్మద్ కైఫ్ లొంగుబాటు
శివాన్: బిహార్ పోలీసులు వెతుకుతోన్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడంతో బిహార్ రాజకీయాల్లో దుమారం రేపింది. కైఫ్ వ్యవహారం జేడీ(యూ)-ఆర్జేడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాగా, తనకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని అంతకుముందు కైఫ్ ఆరోపించాడు. రాజకీయ కుట్రతో తనపై బురద చల్లుతున్నారని వాపోయాడు.‘నేను నేరస్తుడిని కాదని శివాన్ ప్రజలు, జర్నలిస్టులకు తెలుసు. రాజ్దేవ్ రంజన్ తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నా పెళ్లికి కూడా అతడు వచ్చాడ’ని కైఫ్ వెల్లడించాడు. మహ్మద్ షాబుద్దీన్ ఎందుకు కనిపించావని ప్రశ్నించగా... ’మద్దతుదారుగా వెళ్లాను. అక్కడకు వెళ్లే ముందు మా న్యాయవాది సలహా కూడా తీసుకున్నాన’ని తెలిపాడు. -
నా పేరు కైఫ్.. షార్ప్‌షూటర్‌ను కాను
న్యూఢిల్లీ: బిహార్‌లో జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ తాను హంతకుడ్ని కాదని క్రికెటర్‌ను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గందరగోళానికి తావిచ్చింది. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడం దుమారం రేపింది. కైఫ్‌ను అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర నిరసనలు రావడం.. తర్వాత పోలీసులు ఆయన ఆస్తులను అటాచ్ చేయడం.. కైఫ్‌కు న్యాయం చేయాలంటూ ఆయన అనుచరులు నిరసన తెలపడం.. ఈ వార్తలు జాతీయ మీడియాలో రావడంతో క్రికెట్ అభిమానులు తికమకపడ్డారు. షార్ప్‌షూటర్ కైఫ్ స్వస్థలం బిహార్‌లోని శివాన్ జిల్లా కాగా.. ఇదే పేరు గల మహ్మద్ కైఫ్ టీమిండియా మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ కైఫ్ షార్ప్‌షూటర్ ఎప్పుడు అయ్యాడని నెటిజెన్లు అయోమయంలో పడ్డారు. కొంతమంది ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా, కొంతమంది ఏకంగా కైఫ్ ఇంటికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ విషయం కైఫ్ దృష్టికి రావడంతో వివరణ ఇచ్చాడు. ‘నాకు, నా కుటుంబ సభ్యులకు చాలా మంది ఫోన్లు చేశారు. నా పేరు మహ్మద్ కైఫ్. మీరు అనుకుంటున్న ఆ షార్ప్‌షూటర్ నేను కాను. నేను తుపాకీతో కాల్చను. బంతితో స్టంప్స్‌ను షూట్ చేస్తుంటానంతే. నేను బంతి, బ్యాట్‌తో మాత్రమే ఆడుతా. రంజీ క్రికెట్ సీజన్ కోసం చండీగఢ్‌లో శిక్షణ పొందుతున్నా. దయచేసి గందరగోళం పడవద్దు. ఇందులో సందేహం వద్దు నేను క్రికెటర్‌ను’ అంటూ కైఫ్ చెప్పాడు. -
నేను క్రికెటర్‌ను.. హంతకుడ్ని కాను
పట్నా: తాను క్రికెటర్‌నని, చిన్నారులకు శిక్షణ ఇస్తున్నానని, జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో తనకు సంబంధంలేదని వాంటెడ్ షార్ప్‌షూటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. తల్లిదండ్రులకు తాను ఒక్కడే సంతానమని, ఒక్కగానొక్క కొడుకుని ఎవరైనా నేరస్తుడిగా తయారు చేస్తారా అని చెప్పాడు. సీనియర్ జర్నలిస్టు రంజన్ హత్య కేసులో కైఫ్ నిందితుడిగా ఉన్నాడు. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడం సంచలనం కలిగించింది. పోలీసులు వెంటనే కైఫ్‌ను అరెస్ట్ చేయాలని రంజన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా రంజన్ హత్య కేసులో తన ప్రమేయమున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని కైఫ్ అన్నాడు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ తనలాంటి యువకులకు మార్గదర్శకుడని, ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో రావాలని భావిస్తున్నట్టు కైఫ్ చెప్పాడు. -
30 పరుగులు చేస్తే సెంచరీ చేసినట్లే..
సరిగ్గా 14 ఏళ్ల కిందట గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు సంచలనం సృష్టించింది. జూలై 13, 2002లో నాట్ వెట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్ ను వారి సొంతగడ్డపై ఓడించిన క్షణాలను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్ చివరి 90 నిమిషాలే క్రికెటర్ గా తనకు లైఫ్ ఇచ్చాయని, కెరీర్ లో ఇదే తనకు అత్యుత్తమ ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. సిరీస్ గెలిచిన అనంతరం లార్డ్స్ మైదానం డ్రెస్సింగ్ రూములో గంగూలీ షర్ట్ విప్పి గాల్లో తిప్పడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నాసిర్ హుస్సేన్(115), ట్రెస్కోథిక్(109) సెంచరీలతో కదం తొక్కడంతో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి భారత్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లుగా సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ క్రీజులో దిగారు. 14.3 ఓవర్లలో ఈ జోడీ 106 పరుగులు చేశాక గంగూలీ(60) ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ వెనువెంటనే వికెట్లు చేజార్చుకుంది. 24 ఓవర్లలో 146 పరుగులు చేసి ఓటమికి చేరువైంది. గైల్స్ బౌలింగ్ లో సచిన్(14) బౌల్డయ్యాడు. యువరాజ్, తాను క్రీజులో ఉన్నామని, అయితే గెలుపు గురించి కంటే కూడా ఓటమి అంతరాన్ని తగ్గించడంపైనే దృష్టిపెట్టానని కైఫ్ చెప్పాడు. అయితే గంగూలీ చెప్పిన మాటలు తనకు గుర్తొచ్చాయని... ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 30 పరుగులు చేసినా ఓపెనర్ సెంచరీకి సమానం అని ఎంకరేజ్ చేశాడన్నాడు. యువరాజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటే తాను స్ట్రైక్ రొటేట్ చేశానని, అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ అసాధ్యమనిపించినా, మరో మూడు బంతులు మిగిలుండగా విజయాన్ని సాధించినట్లు వివరించాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్‌కు అందించాడు. -
డిసెంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు ఊడీ అలెన్ (హాలీవుడ్ దర్శకుడు), మొహమ్మద్ కైఫ్ (క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరికి సహజంగానే విద్య, వినయం, వాక్చాతుర్యం అలవ డి, అందరితోటీ మంచివారిగా మన్ననలందుకుంటారు. ఈ సంవత్సరం విద్యార్థులు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షలలో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. 30 సంవత్సరాలు దాటిన వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసించడం వల్ల సంఘగౌరవం లభిస్తుంది. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో వారి వారి రంగాలలో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు రాణిస్తారు. వీరి పుట్టిన తేదీ 1. ఇది సూర్యునికి సంబంధించినది కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, ఏదయినా పనిని ముందుకు తీసుకె ళ్లే చొరవ, కష్టపడి పైకొచ్చే మనసత్తత్వం ఉంటాయి. వీరు కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీనంబర్లు: 1,3,4,6. లక్కీ కలర్స్: వయొలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. లక్కీడేస్: ఆది, సోమ, బుధ, గురు, వారాలు సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను సన్మానించడం, వేదపాఠశాలలకు, మిషనరీలకు, మదరసాలకు సాయం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా వినడం వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
చరిత్ర సృష్టించిన ఆంధ్ర
తొలిసారి ముంబైపై ఆధిక్యం రంజీ మాజీ చాంపియన్‌తో మ్యాచ్ ‘డ్రా’ ఆరు వికెట్లతో రాణించిన అయ్యప్ప విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది. చివరి రోజు ఆదివారం ఆంధ్ర పేసర్ బండారు అయ్యప్ప ఆరు వికెట్లతో హడలెత్తించడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. సిద్ధేశ్ లాడ్ (163 బంతుల్లో 86; 12 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. 37 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను అయ్యప్ప పడగొట్టడంతో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (106 బంతుల్లో 59; 10 ఫోర్లు; 1 సిక్స్), కైఫ్ (135 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. గోవాకు మూడు పాయింట్లు గోవా: హైదరాబాద్, గోవా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌కు చివరి రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గోవా జట్టుకు మూడు పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు ఓ పాయింట్ దక్కింది. ఆదివారం చివరి రోజు 349/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన గోవా వర్షం కురిసే సమయానికి 140.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 425 పరుగులు చేసింది. షగున్ కామత్ (286 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) శతకం సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. -
రాణించిన రికీ భుయ్
సాక్షి, విజయనగరం: రికీ భుయ్ (183 బంతుల్లో 91 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మహ్మద్ కైఫ్ (235 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో పటిష్టమైన ముంబైతో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు భరత్ (1), ప్రశాంత్ (7) విఫలమైనా... కైఫ్, భుయ్‌లు నెమ్మదిగా ఆడుతూ మూడో వికెట్‌కు అజేయంగా 152 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. శార్దూల్ ఠాకూర్, సంధూ చెరో వికెట్ తీశారు. హైదరాబాద్ 246/5 గోవా: కెప్టెన్ విహారి (165 బంతుల్లో 82; 11 ఫోర్లు), అక్షత్ రెడ్డి (118 బంతుల్లో 61; 10 ఫోర్లు)లు రాణించడంతో గోవాతో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసింది. అనిరుధ్ (24 బ్యాటింగ్), ఆకాశ్ బండారీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో 21 ఓవర్ల ముందుగానే ఆటను ముగించారు. రితూ రాజ్ సింగ్ 2 వికెట్లు తీశాడు. వీరూ జోరు మహారాష్ట్రతో జరుగుతున్న గ్రూప్ - ఎ రంజీ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు) జోరు చూపెట్టాడు. హిమాన్షు రాణా (236 బంతుల్లో 138 బ్యాటింగ్; 20 ఫోర్లు)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఇద్దరి జోరుతో హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 303 పరుగులు చేసింది. జయంత్ యాదవ్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వీరూ, రాణాలు మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. సమద్ ఫల్హా 3 వికెట్లు తీశాడు. ళీళీ మరోవైపు రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ గంభీర్ (24) విఫలమయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా నిరాశపర్చడంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. రాజస్తాన్ బౌలర్లు దీపక్ చాహర్ (5/60), అనికేత్ చౌదరి (3/26)లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తర్వాత రాజస్తాన్ 34 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. ప్రణయ్ శర్మ (42) రాణించాడు. ళీళీ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సౌరాష్ర్ట బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా (91) త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చూపెట్టాడు. షెల్డన్ జాక్సన్ (82 బ్యాటింగ్) కూడా రాణించడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 270 పరుగులు చేసింది. అభిజిత్ దేవ్ 4 వికెట్లు తీశారు.ళీళీ బౌలర్ల పరాక్రమంతో సర్వీసెస్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే రోజు 19 వికెట్లు నేలకూలాయి. దివేశ్ పథానియా (6/19), రూషన్ రాజ్ (3/14)ల దెబ్బకు జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. -
‘రంజిం'పజేసేనా!
నేటి నుంచి 82వ రంజీ ట్రోఫీ బరిలో 27 జట్లు తొలి మ్యాచ్‌లలో ముంబైతో ఆంధ్ర, గోవాతో హైదరాబాద్ ‘ఢీ’ భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు వేళయింది. గత కొన్నేళ్లుగా స్టార్ క్రికెటర్లు దూరంగా ఉంటుండటంతో కాస్త కళ తప్పినట్లు కనిపించినా... దాని విలువ మాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చే కుర్రాళ్లు తమ సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇదే సరైన వేదిక. ఇక్కడ నిలబడగలగితే, నిలకడగా రాణిస్తే భవిష్యత్తుకు గట్టి పునాది అవుతుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ మెరుపులతో కొన్ని సార్లు వార్తల్లో నిలిచినా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ అయిన రంజీలో ప్రదర్శన లేకుండా ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేరనేది దిగ్గజాల అభిప్రాయం. ఇక పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న సీనియర్లకూ ఇది మంచి అవకాశం. క్రీడా విభాగం ; రంజీ ట్రోఫీ 2015-16 సీజన్‌కు అన్ని జట్లూ సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు గ్రూప్‌లలో కలిపి మొత్తం 27 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర ఎనిమిది జట్లతో లీగ్ మ్యాచ్‌లలో తలపడుతుంది. ‘ఎ’, ‘బి’ గ్రూప్‌లకు టోర్నీలో సమాన హోదా ఉండగా... ‘సి’ గ్రూప్‌లో మాత్రం చిన్న జట్లు ఉన్నాయి. తొలి రెండు గ్రూప్‌ల నుంచి మూడు జట్లు, చివరి గ్రూప్ నుంచి రెండు జట్లు కలిపి మొత్తం ఎనిమిది టీమ్‌లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్)కు అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 మధ్య ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు అర్హత పొందే జట్లు తర్వాతి ఏడాది పై గ్రూప్‌లకు ప్రమోట్ అవుతాయి. ఆ రెండు గ్రూప్‌లలో ఆఖరి స్థానంలో నిలిచిన టీమ్‌లు ‘సి’కి పడిపోతాయి. 1934-35 సీజన్లో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఇప్పటి వరకు 81 సార్లు జరిగింది. ఇందులో ముంబై (గతంలో బాంబే) ఏకంగా 40 సార్లు విజేతగా నిలవడం విశేషం. ఉత్సాహంగా ఆంధ్ర... చాలా కాలంగా గ్రూప్ ‘సి’కే పరిమితమవుతూ చిన్న జట్లతోనే పోటీ పడుతూ వచ్చిన ఆంధ్ర జట్టు గత ఏడాది అనూహ్యంగా పుంజుకుంది. చక్కటి ప్రదర్శనతో నాకౌట్‌కు అర్హత పొంది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అయింది. ఫలితంగా ఈసారి బలమైన జట్లతో తలపడే అవకాశం లభించింది. దీని వల్ల ఆటగాళ్ల ప్రదర్శనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. విజయనగరంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ముంబైని ఆంధ్ర ఎదుర్కోనుంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే జట్టు ఆత్మవిశ్వాసం అమితంగా పెరగడం ఖాయం. గత ఏడాదిలాగే మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీ, మార్గదర్శనంలో ఆంధ్ర ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి. మళ్లీ మొదటి నుంచి హైదరాబాద్ గత మూడేళ్లుగా పేలవంగా ఆడుతోన్న హైదరాబాద్ మరోసారి గ్రూప్ ‘సి’కే పరిమితమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎక్కడా జట్టు నుంచి చెప్పుకోదగిన ప్రదర్శన రావడం లేదు. జట్టులో సభ్యులంతా ఫర్వాలేదనిపించే స్థాయిలో ‘ఏవరేజ్’ ఆటతోనే నెట్టుకొచ్చేస్తున్నారు తప్ప అద్భుతం అనిపించే ఆటతీరు కనబర్చలేకపోతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే లేదా శాసించే తరహాలో ఒక గొప్ప ఇన్నింగ్స్ గానీ ఒక అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన గానీ హైదరాబాద్ ఆటగాళ్లు చూపించి చాన్నాళ్లయింది. దురదృష్టవశాత్తూ సొంత మైదానంలో కూడా హైదరాబాద్ గొప్పగా రాణించలేకపోతోంది. హనుమ విహారి నాయకత్వంలో ఈసారి అయినా మెరుగ్గా ఆడి పై గ్రూప్‌కు వెళ్లడమే ప్రస్తుతం హైదరాబాద్ లక్ష్యం. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్, గోవాతో తలపడుతుంది. కర్ణాటకనే ఫేవరేట్... గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టింది. ముంబై తర్వాత అత్యధిక టైటిల్స్ (8) సాధించిన రికార్డు ఉన్న ఈ జట్టు వినయ్ కుమార్ నాయకత్వంలో ఈసారి కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. తమిళనాడు నుంచి ఆ జట్టుకు ప్రధానంగా పోటీ ఎదురుకావచ్చు. వీటితో పాటు బరోడా, పంజాబ్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది తమ సొంత జట్ల నుంచి ఇతర జట్లకు మారిన ఆటగాళ్లపై కూడా ప్రధానంగా దృష్టి నిలిచింది. వీరిలో తొలిసారి హర్యానా తరఫున బరిలోకి దిగుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్), వసీం జాఫర్ (విదర్భ), ఆర్పీ సింగ్ (గుజరాత్)లు కూడా తమ కొత్త జట్ల తరఫున రాణించాల్సి ఉంది. జట్ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: అస్సాం, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, ఒడిషా. గ్రూప్ ‘బి’: ఆంధ్ర, ముంబై, పంజాబ్, గుజరాత్, రైల్వేస్, తమిళనాడు, బరోడా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘సి’: హైదరాబాద్, గోవా, జమ్మూ కాశ్మీర్, కేరళ, సౌరాష్ట్ర, త్రిపుర, సర్వీసెస్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈసారి పాత నిబంధనలే... రంజీ ట్రోఫీని ఆసక్తికరంగా మార్చేందుకు అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ పలు సూచనలు చేసింది. గత ఏడాది 108 లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా 51 ‘డ్రా’గా ముగిశాయి. దాంతో జట్లు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం కాకుండా విజయం కోసం ఆడే విధంగా బోనస్ పాయింట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా... గత నెల 28న జరిగిన ఆ సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది. దాంతో పాత నిబంధనలతోనే ఈసారి కూడా టోర్నీ కొనసాగనుంది. -
'అది కోహ్లీకి అతిపెద్ద ఛాలెంజ్'
శ్రీనగర్:త్వరలో టీమిండియా చేపట్టనున్న బంగ్లాదేశ్ పర్యటన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతి పెద్ద ఛాలెంజ్ గా అభివర్ణించాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ప్రస్తుత పరిస్థితులను చూస్తే బంగ్లాదేశ్ చాలా బలంగా కనిపిస్తోందని.. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో వారు అమోఘంగా రాణించి ఆకట్టుకున్నారన్నాడు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్ తప్పకుండా కోహ్లీకి ఒక సవాల్ గా మారనుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా బుధవారం(జూన్ 10) నుంచి టీమిండియా తన తొలి టెస్టును ఆడనుంది. ఈ సంవత్సర ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ ఐదు రోజుల ఫార్మెట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సిరీస్ చివరి టెస్టులో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. -
ముగ్గురే గెలిచారు
ఐదుగురు మాజీ క్రీడాకారులకు నిరాశ అజహర్, కైఫ్లకూ తప్పని ఓటమి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో క్రీడా ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏథెన్స్ ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రాథోడ్ జైపూర్(రూరల్) నుంచి 3.32 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కురువృద్ఢుడు సీపీ జోషిపై విజయ దుందుభి మోగించారు. అర్మీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రాథోడ్ గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరి తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో రాజ్యవర్ధన్‌కు క్రీడల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైపూర్(రూరల్) నియోజకవర్గానికి సేవలందించడమే నా తొలి ప్రాధాన్యం. మా కెప్టెన్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏ బాధ్యతనైనా స్వీకరించేందుకు నేను సిద్ధం’ అని రాథోడ్ ప్రకటించారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్పూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యాడు. -
‘గోల్’ కొడతారా!
ఎన్నికల బరిలో పలువురు క్రీడాకారులు న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆటగాడు బైఛుంగ్ భుటియా, షూటింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన రాజ్యవర్దన్ రాథోడ్, చిన్న వయసులోనే యువ భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన మహమ్మద్ కైఫ్ వరకు పలువురు క్రీడాకారులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భుటియా డార్జిలింగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2011 ఆగస్టులో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫుట్‌బాల్ ఆటగాడిగా పలు గోల్స్ సాధించిన భుటియా ఎన్నికల సమరంలో ఎంతవరకు నెగ్గుకొస్తాడో ఓటర్ల కరుణపైనే ఆధారపడి ఉంది. క్రీడా మైదానంలో చురుకైన కదలికలతో సత్తా చాటిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ యూపీ ఫూల్పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నాడు. మరో మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్ ఈసారి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం తెలిసిందే. జైసల్మేర్‌కు చెందిన ఒలింపిక్ షూటర్ రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ జైపూర్ రూరల్ (బీజేపీ) నుంచి పోటీచేస్తున్నారు. -
నా రెండో ఇన్నింగ్స్ మొదలైంది!
క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్య కాన్పూర్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తన రెండో ఇన్నింగ్స్ ఆరంభమైందని చెప్పాడు. విజయవంతమైన రాజకీయవేత్తగా తాను ఎదుగుతానని అతను అన్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కైఫ్, ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నాడు. ‘ఇక్కడి అలహాబాద్‌లోనే నేను పుట్టి పెరిగాను. గల్లీల్లో క్రికెట్ ఆడాను. నేను భారత్‌కు ఆడినప్పుడు ఇక్కడివారంతా ఎంతో సంతోషించారు. ఎన్నికల్లోనూ వారు నాకు మద్దతుగా నిలుస్తారని నమ్ముతున్నాను’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్లో తాను మంచి ఫామ్‌లో ఉన్నానని, క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే విషయంపై ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. రాజకీయాలు చెడ్డవి కావని అభిప్రాయపడిన కైఫ్ 13 టెస్టుల్లో, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 33 ఏళ్ల కైఫ్ ఆఖరిసారిగా 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. -
యూపీ నుంచి క్రికెటర్ మహ్మద్ కైఫ్ పోటీ
న్యూఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీజేపీ తన రెండో జాబితాను విడుదల చేసి ముందంజంలో ఉండగా, కాంగ్రెస్ తన తొలి జాబితాను శనివారం సాయంత్రం విడుదల చేసింది. 194 మందితో కూడిన లోక్ సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో క్రికెటర్ మహ్మద్ కైఫ్ పోటీ చేసే స్థానాన్ని ఖరారు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని పూల్పూర్ నియోజకవర్గాన్ని కైఫ్ కు కేటాయించింది. ఇదిలా ఉండగా దక్షిణ బెంగళూర్ నుంచి నందన్ నీలేకని, బిలాస్ పూర్ నియోజకవర్గం నుంచి వాజ్ పాయ్ మేనకోడలు కరణా శుక్లా పోటీకి సిద్దమవుతున్నారు. మహారాష్ట లోని సోలాపూర్ నుంచి హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పోటీలో నిలువనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలి నుంచి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమేథీ నుంచి లోక్ సభ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 35 శాతం మంది 50 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 28 మంది మహిళలు సీట్లు దక్కించుకున్నారు.