PC: IPL
IPL 2022- CSK Vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమేశ్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్న తన నిర్ణయం సరైందని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌తో సీఎస్‌కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా, కేకేఆర్ సారథిగా శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం చేశారు. ఇక గత సీజన్‌లో ఫైనల్లో చెన్నైతో తలపడి భంగపాటుకు గురైన కేకేఆర్ ఈసారి శుభారంభం చేసింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించి జయభేరి మోగించింది. ఇక ఈ విజయంలో టీమిండియా సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చెన్నై స్టార్ ఓపెనర్, ఐపీఎల్-2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసిన ఉమేశ్, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే వికెట్ తీశాడు. తద్వారా ఆరంభంలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఎంఎస్ ధోని మినహా మిగతా బ్యాటర్లు కూడా విఫలం కావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. దీంతో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజాకు నిరాశ ఎదురుకాగా, శ్రేయస్‌కు మంచి ఆరంభం లభించింది.
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా బాగుంది. తుదిజట్టులోకి ఉమేశ్‌ను తీసుకోవడం తెలివైన నిర్ణయం. గతంలో అతడు కేకేఆర్‌కు ఆడినా సరైన అవకాశాలు రాలేదు. అయితే, శ్రేయస్ అతడిపై నమ్మకం ఉంచాడు. ఉమేశ్‌తో పాటు శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ సేవలను వినియోగించుకున్న తీరు బాగుంది’’ అని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని కొనియాడాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం అమోఘమని ప్రశంసించాడు.
WHAT. A. WIN. 😍#KKR #KKRHaiTaiyaar #CSKvKKR #IPL2022 #GalaxyOfKnights #কেকেআর
— KolkataKnightRiders (@KKRiders) March 26, 2022
pic.twitter.com/Y07tLfeoxY
Comments
Please login to add a commentAdd a comment