కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(PC: IPL/BCCI)
IPL 2022 KKR Vs RR: గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్-2022 పెద్దగా కలిసిరావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా వరుస పరాజయాలతో డీలా పడింది. ముఖ్యంగా సరైన కాంబినేషన్ సెట్ చేయలేక తరచుగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. స్వయంగా తానే ఈ విషయాన్ని అంగీకరించాడు.
ఇక ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టిక(6 పాయింట్లు)లో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ కేకేఆర్ జట్టు కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కేకేఆర్ అవలంబిస్తున్న వ్యూహాన్ని విమర్శించాడు. చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ యాజమన్యాన్ని తప్పుబట్టాడు.
ఆర్పీ సింగ్(ఫైల్ ఫొటో)
ఈ మేరకు.. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..‘‘మైదానం వెలుపల ఉన్న మనం ఏదేని జట్టు కూర్పు గురించి అంచనాలు వేయడం సహజం. అత్త్యుతమ తుది జట్టునే మనం ఎంచుకుంటాం. కానీ కేకేఆర్ కెప్టెన్, మేనేజ్‌మెంట్‌కు ఏమయిందో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్లు ఎన్ని మార్పులు చేస్తున్నారో చూడండి. వెంకటేశ్ అయ్యర్‌ను టాపార్డర్ నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఓపెనర్‌గా తీసుకువచ్చారు.
ఇక నితీశ్ రాణా విషయంలో ఇలాంటి నిర్ణయమే. ముందు టాపార్డర్.. తర్వాత లోయర్ ఆర్డర్. అసలు కేకేఆర్‌లో ఏ ఒక్క బ్యాటర్‌కు కూడా కచ్చితమైన పొజిషన్ ఉందా!’’ అని ఆర్పీ సింగ్ ప్రశ్నించాడు. ఇక భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సైతం.. ‘‘కేకేఆర్ జట్టు బాగుంది. కానీ తుది జట్టు కూర్పు విషయంలో వాళ్లకు క్లారిటీ లేదు. అందుకే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి’’ అని అభిప్రాయపడ్డాడు.
చదవండి👉🏾IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..!
Arjun had Dronacharya, Harshit has Baz! 🎯@Bazmccullum #HarshitRana • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/V54ef8uSWX
— KolkataKnightRiders (@KKRiders) May 1, 2022
Watch the Knights prepping up ahead of an all-important #KKRvRR! 💜#KnightsTV presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 https://t.co/fBOfU2FTFs
— KolkataKnightRiders (@KKRiders) May 1, 2022
Comments
Please login to add a commentAdd a comment