Pragyan Ojha
-
రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడని, మరి కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడని చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాలని ఓజా తెలిపాడు. కాగా హిట్‌మ్యాన్‌తో ఓజా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్లో ఓజా.. రోహిత్లో కలిసి నాలుగేళ్ల పాటు ముంబై ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించారు."ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబై ఫ్రాంచైజీలో రోహిత్ చాలా కాలం నుంచి అంతర్భాగంగా ఉన్నాడు. వారికి ఐదు టైటల్స్‌ను అందించాడు. రోహిత్‌ని వదిలివేయడం వారికి సులభమో కాదో నాకు తెలియదు.కానీ రోహిత్‌కి మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని అనుకోడు. ఒకవేళ అదే జరిగితే కఠిన నిర్ణయమనే చెప్పవచ్చు. నా వరకు అయితే ముంబై ఇండియన్స్‌లో రోహిత్ కొనసాగితేనే బెటర్. అతడు ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. అందుకే అతడు ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్, కొన్ని సార్లు ఏదైనా జరగవచ్చు" అని ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.చదవండి: టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్ పాండ్యా ..? -
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్ వైఫల్యాలు మరిచి వరల్డ్‌కప్‌నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్-2024 బరిలో దిగాడు.అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్‌కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.బ్యాటర్‌గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్ పేరే గుర్తుకువస్తుంది.అవసరమైన వేళ అదనపు బ్యాటర్‌గా.. బౌలర్‌గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్‌కప్ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. -
IND vs ENG: 'శ్రేయస్ వెళ్లి రంజీల్లో ఆడు.. లేదంటే కష్టమే'
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. దీంతో అతడిని మూడో టెస్టుకు జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలని అయ్యర్‌ను ఓజా సూచించాడు. "ఇంగ్లండ్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. ఒకవేళ మూడో టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులో వస్తే.. అయ్యర్ లేదా రజత్ పాటిదార్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కు పరిమితవ్వాల్సి వస్తోంది. నా దృష్టిలో అయ్యర్‌కు అవకాశాలు ఇవ్వకూడదని కాదు. కానీ అత్యుత్తమ క్రికెటర్లు వెనక్కివచ్చినప్పుడు మనం ఫామ్‌లో లేకపోతే వేటు తప్పదు. కాబట్టి దేశవాళీ క్రికెట్లో ఆడి తన రిథమ్‌ను పొందితే బెటర్ అని ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించే ఛాన్స్ ఉంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆఖరి మూడు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి తమ ఫిట్నెస్ సాధించినట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. -
T20 WC: ప్రపంచకప్ జట్టులో కుల్దీప్‌నకు నో ఛాన్స్! ఆ ముగ్గురే..
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్‌లలో చైనామన్ బౌలర్ కుల్దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కలేదు. రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ రాణించగల ఈ ఆల్‌రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు. చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల -
రోహిత్, కోహ్లి ఓపెన్‌గా మాట్లాడితేనే: టీమిండియా మాజీ బౌలర్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలో ఆడతారా? లేదా? అన్న చర్చ క్రీడావర్గాల్లో జోరుగా నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా చేరాడు. తమ టీ20 భవితవ్యం గురించి రోహిత్, కోహ్లి బోర్డుతో ఓపెన్‌గా మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వాళ్లిద్దరు ఇప్పటికే తమ భవిష్యత్తు గురించి మేనేజ్మెంట్తో చర్చలు మొదలుపెట్టి ఉంటారు. అయితే, సెలక్షన్ కమిటీ కూడా వాళ్ల అభిప్రాయాలను కచ్చితంగా గౌరవిస్తుంది. వాళ్ల భవిష్యత్ ప్రణాళికల గురించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఏ క్రికెట్ బోర్డు అయినా సరే ప్రతి ఆటగాడి విషయంలో ఇలాగే ఆలోచిస్తుంది. వరల్డ్‌కప్- వరల్డ్‌కప్ సైకిల్ మధ్య ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్ అన్నీ దృష్టిలో పెట్టుకుని అంతిమ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్ ముగిసిపోయింది. తదుపరి వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. కాబట్టి రోహిత్, విరాట్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా వాళ్ల నిర్ణయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్లిద్దరు సీనియర్ మోస్ట్ క్రికెటర్లు. దేశం కోసం ఎంతో చేశారు. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్లకు కాస్త ఎక్కువగానే టైమ్ ఇస్తుంది. చర్చలు ముగిసిన తర్వాతే రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లు ఆడతారా లేదా అన్నది తెలుస్తుంది’’ అని ఓజా అభిప్రాయపడ్డాడు. కాగా 36 ఏళ్ల రోహిత్ శర్మ టీ20లకు స్వస్తి పలికితే హార్దిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్లో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం ఈ ఫార్మాట్లో ఇంకొన్నాళ్లు కొనసాగుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్ పాండ్యా -
CWC: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదే: అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్-2023 ఫైనల్ పోరుకు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా అజేయ టీమిండియా- ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో తలపడనుంది. ఇరవై ఏళ్ల క్రితం కంగారూ జట్టు చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, రాజకీయ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేయాలా.. బౌలింగ్ చేయాలా అన్నది పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి భారత జట్టు గెలిచి ప్రపంచ కప్‌ను అందుకుంటుంది. ప్రచారంలో ఉంటూనే తీరికవేళ మ్యాచ్‌ను తిలకిస్తాను’’ అని అజారుద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా మేటి క్రికెటర్‌గా పేరొందిన అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం: ఓజా అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సాక్షితో మాట్లాడుతూ.. ‘‘లీగ్ దశ నుంచి ఒత్తిడిని జయిస్తూ మన భారత క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్ ఫేవరెట్ టీంలను సైతం చిత్తు చేయడం కప్‌ను సాధిస్తామని చెప్పకనే చెప్పారు. బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లో దూసుకుపోతున్న తీరు చూస్తూ ప్రతీ భారతీయుడు ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్నారు. భారత క్రికెట్ ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌కు అతిపెద్ద అభిమానిగా మరోసారి వరల్డ్ కప్ భారత ఒడిలో చేరుతుందని నమ్మకంగా ఉన్నాను’’ అని రోహిత్ సేన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. -
'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు. ''క్రికెట్లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు. చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం -
రోహిత్ శర్మ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన ప్రజ్ఞాన్ ఓజా
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. భారత క్రికెట్ జట్టు ప్రస్తుత సారధి రోహిత్ శర్మకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడిన ఈ ఇద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకోవడంతో వీరి స్నేహ బంధం మరింత బలపడింది. సెటిల్ అవ్వకముందు హిట్‌మ్యాన్ కష్టాలను దగ్గరి నుండి చూసిన ఓజా.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. Pragyan Ojha strolls down the memory lane and recalls Rohit Sharma's struggles in his early stage. He feels very proud about the journey how they started (u15) and where they reached now.#PragyanOjha #RohitSharma pic.twitter.com/O06OjPt2Mp — CricTracker (@Cricketracker) March 28, 2023 మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్.. ఒకానొక సందర్భంలో (అండర్-15 ఆడే రోజుల్లో) కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవాడని ఓజా తెలిపాడు. అక్కడి నుంచి మొదలైన హిట్‌మ్యాన్ జర్నీ ఇవాళ ఎక్కడుందో చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపిన ఓజా.. టీమిండియా కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ యువతరానికి ఆదర్శప్రాయుడని కొనియాడిన ఓజా.. ఫైవ్ టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్ సన్నాహకాల్లో బిజీగా ఉండగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అయిన ఓజా తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌ను ఎలాగైనా గాడిలో పెట్టాలని భావిస్తున్న హిట్‌మ్యాన్, తదనుగుణంగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఏప్రిల్ 2న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2023 సీజన్ జర్నీ మొదలవుతోంది. -
Ind Vs SL: అరంగేట్రంలోనే దుమ్మురేపిన మావి.. అరుదైన జాబితాలో చోటు
India vs Sri Lanka, 1st T20I- Shivam Mavi: అరంగేట్రంలోనే దుమ్ములేపాడు టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ శివం మావి. శ్రీలంకతో స్వదేశంలో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక(1), వన్‌డౌన్ బ్యాటర్ ధనంజయ డి సిల్వా(8) సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ(21), మహీశ్ తీక్షణ(1)లను పెవిలియన్‌కు పంపాడు. నమ్మకం నిలబెట్టుకుని బంతిని తన చేతికి ఇచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదో బంతికి నిసాంకను బౌల్డ్ చేసిన మావి.. మిగతా మూడు వికెట్లు కూల్చే క్రమంలోనూ తడబడలేదు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మావి.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో శివం మావిపై ప్రశంసలు కురుస్తున్నాయి. హుడా, మావి, చహల్ అరుదైన జాబితాలో అరంగేట్రంలోనే ఈ మేరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 24 ఏళ్ల యూపీ క్రికెటర్.. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా, బరీందర్ సరన్ ఈ ఫీట్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. అరంగేట్రంలోనే 4 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు 1. ప్రజ్ఞాన్ ఓజా- 2009లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో- 21/4 2. బరీందర్ సరన్- 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌లో- 10/4 3. శివం మావి- 2022లో శ్రీలంకతో మ్యాచ్‌లో- 22/4. ఇక ఈ ముగ్గురిలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బరీందర్ నిలిచాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! From claiming a four-wicket haul on debut to the feeling of representing #TeamIndia 👏🏻👏🏻 Bowling Coach Paras Mhambrey Interviews Dream Debutant @ShivamMavi23 post India’s win in the first #INDvSL T20I👌🏻 - By @ameyatilak Full interview 🎥🔽 https://t.co/NzfEsb5ydo pic.twitter.com/z9CuqFqlLP — BCCI (@BCCI) January 4, 2023 -
WC 2023: అవునా.. ప్రజ్ఞాన్ కామెంట్రీ చేస్తున్నాడా? మంచిది: రోహిత్ శర్మ
Rohit Sharma- Pragyan Ojha- Shikhar Dhawan: శిఖర్ ధావన్ విషయంలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఓజా కామెంటేటర్‌గా మారాడన్న సంగతి తనకు తెలియదన్న హిట్‌మ్యాన్.. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుందని తెలిపాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన శిఖర్ ధావన్‌ను వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సారథిగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. Ro about opening partnership's with @SDhawan25 pic.twitter.com/URE1boKVer — Manojkumar (@Manojkumar_099) July 28, 2022 అందుకేనేమో ధావన్‌కు అవకాశాలు! ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని, అందుకే బహుశా అతడికి అవకాశాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. తనకు జోడీగా ధావన్ వంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ మాదిరి రోహిత్- ధావన్ మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉందని పేర్కొన్న ఓజా.. ఇప్పటికే వీరిద్దరి జోడీ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిందని పేర్కొన్నాడు. అందుకే వరల్డ్‌కప్-2023 భారత జట్టులో అతడికి చోటు ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అవునా.. నిజమా? ఈ క్రమంలో విండీస్ టీ20 సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ.. ఓజా వ్యాఖ్యలపై సరాదాగా స్పందించాడు. ‘‘అవునా...! ప్రజ్ఞాన్.. ఇప్పుడు కామెంటేటర్‌గా ఉన్నాడా? మంచిది. ఏదేమైనా.. మనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు ఎవరైనా సరే.. అది శిఖర్ లేదంటే మరొకరు.. ఎవరైనా.. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తాం. Sound 🔛 🔊#TeamIndia captain @ImRo45 warming up in the nets ahead of the 1st #WIvIND T20I. 👌 👌 pic.twitter.com/0V5A70l2EY — BCCI (@BCCI) July 29, 2022 అదే సమయంలో స్నేహ బంధం పెంపొందుతుంది. మైదానం వెలుపల కూడా ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. నిజానికి ఆటగాళ్ల మధ్య ఇలాంటి బంధం ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. ఆటలో భాగంగానే జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తామే తప్ప వారితో ఉన్న అనుబంధం కారణంగా కాదని రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక రోహిత్ గైర్హాజరీతో ధావన్ సారథ్యంలోని వన్డే జట్టు కరేబియన్ గడ్డపై విండీస్‌ను మట్టికరిపించి తొలిసారి 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. Moments to savour for the team & moments to savour for the fans at the Queen's Park Oval, Trinidad. ☺️ 👏 Here's #TeamIndia Captain @SDhawan25 doing his bit for the fans 🎥 🔽 - by @28anand #WIvIND pic.twitter.com/gZRwB96OnV — BCCI (@BCCI) July 28, 2022 చదవండి: India Probable XI: ఓపెనర్‌గా పంత్.. అశ్విన్‌కు నో ఛాన్స్! కుల్దీప్ వైపే మొగ్గు! -
WC 2023: అందుకే కెప్టెన్ అయ్యాడు! కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడు!
ICC ODI World Cup 2023: టీమిండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రోహిత్ శర్మకు జోడీగా బరిలోకి అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లలో వన్డేల్లో ధావన్ నమోదు చేసిన అర్ధ శతకాల సంఖ్య తొమ్మిది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్లో గబ్బర్ నిలకడ ఏమిటో! శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమైన శిఖర్ ధావన్.. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. బట్లర్ బృందంతో మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వన్డే జట్టుకు సారథిగా గబ్బర్ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకాల్లో భాగంగానే ధావన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అతడు కెప్టెన్ అయ్యాడు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓజా మాట్లాడుతూ.. ‘‘ఒక సీనియర్ ప్లేయర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన విధానమే! ముఖ్యంగా మెగా టోర్నీకి ముందు బెంచ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడం ముఖ్యం. నిజానికి ధావన్ జట్టులో సీనియర్. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. అందుకే ద్వితీయ శ్రేణి జట్టుకు అతడు కెప్టెన్‌గా ఎంపికవుతున్నాడు. రోహిత్ కోరుకుంటున్నది అదే! అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్‌గా కూడా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో కాస్త నిరాశపరిచినా.. మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. శిఖర్ ధావన్ తనకు జోడీగా ఉండాలని రోహిత్ శర్మ బలంగా కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలు అందించింది కూడా!’’ అని చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ప్రజ్ఞాన్ ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ఆటతో తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని 36 ఏళ్ల గబ్బర్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఇటీవల అజయ్ జడేజా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కోరుకున్నట్లుగా ధావన్ దూకుడైన ఆట కనబరచలేడంటూ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా.. గబ్బర్‌కు అండగా నిలవడం విశేషం. ఇక విండీస్ పర్యటనలో భాగంగా ధావన్ సారథ్యంలోని టీమిండియ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం(జూలై 27) జరుగనుంది. ఈ సిరీస్‌లో ధావన్ ఇప్పటి వరకు వరుసగా 97, 13 పరుగులు సాధించాడు. చదవండి: Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? -
Kane Williamson: ఇంకెంత కాలం భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!
IPL 2022- Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ విమర్శలు గుప్పించాడు. పవర్‌ప్లేలో ఆడే అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నాడని పెదవి విరిచాడు. ఇకనైనా అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని సన్‌రైజర్స్ యాజమాన్యానికి సూచించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో కేన్ మామ బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు మొత్తం కలిపి 208. అత్యధిక స్కోరు 57. అంటే కేన్ విలియమ్సన్ ఆట తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్.. కేన్ విలియమ్సన్ ఆట తీరు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘విలియమ్సన్ జట్టులో ఉంటే బాగుంటుంది. అయితే, అతడిని తుది జట్టు నుంచి తప్పించినా బాగానే ఉంటుంది. ఇంకెంత కాలం అతడిని భరిస్తారు? తనొక ప్రొఫెషనల్ క్రికెటర్. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా అతడిని కొనసాగించాలా? కేన్ విలియమ్సన్ మంచి వ్యక్తి. గొప్ప కెప్టెన్ కూడా! కానీ ఓపెనర్‌గా రాణించలేకపోతున్నాడు. ఇప్పటికీ జట్టులో మార్పులు చేయకపోతే కష్టం. అభిషేక్ శర్మతో కలిసి రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్‌కు దింపండి’’ అని సన్‌రైజర్స్ యాజమాన్యానికి సూచించాడు. ఇక భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సైతం ఓపెనర్‌గా విలియమ్సన్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని, అతడు మిడిలార్డర్లో ఫిట్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా సన్‌రైజర్స్ మంగళవారం(మే 17) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే అవకాశం రైజర్స్‌కు ఉంటుంది. చదవండి👉🏾IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే.. #OrangeArmy, before our game tonight, @nicholas_47 has a message from the #Riser camp for all of you. 🗣️🧡#MIvSRH #ReadyToRise #TATAIPL pic.twitter.com/VrCIRczoN3 — SunRisers Hyderabad (@SunRisers) May 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: కేకేఆర్ కెప్టెన్, మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు!
IPL 2022 KKR Vs RR: గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్-2022 పెద్దగా కలిసిరావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా వరుస పరాజయాలతో డీలా పడింది. ముఖ్యంగా సరైన కాంబినేషన్ సెట్ చేయలేక తరచుగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. స్వయంగా తానే ఈ విషయాన్ని అంగీకరించాడు. ఇక ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టిక(6 పాయింట్లు)లో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ కేకేఆర్ జట్టు కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కేకేఆర్ అవలంబిస్తున్న వ్యూహాన్ని విమర్శించాడు. చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ యాజమన్యాన్ని తప్పుబట్టాడు. ఆర్పీ సింగ్(ఫైల్ ఫొటో) ఈ మేరకు.. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..‘‘మైదానం వెలుపల ఉన్న మనం ఏదేని జట్టు కూర్పు గురించి అంచనాలు వేయడం సహజం. అత్త్యుతమ తుది జట్టునే మనం ఎంచుకుంటాం. కానీ కేకేఆర్ కెప్టెన్, మేనేజ్మెంట్కు ఏమయిందో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్లు ఎన్ని మార్పులు చేస్తున్నారో చూడండి. వెంకటేశ్ అయ్యర్‌ను టాపార్డర్ నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఓపెనర్‌గా తీసుకువచ్చారు. ఇక నితీశ్ రాణా విషయంలో ఇలాంటి నిర్ణయమే. ముందు టాపార్డర్.. తర్వాత లోయర్ ఆర్డర్. అసలు కేకేఆర్‌లో ఏ ఒక్క బ్యాటర్‌కు కూడా కచ్చితమైన పొజిషన్ ఉందా!’’ అని ఆర్పీ సింగ్ ప్రశ్నించాడు. ఇక భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సైతం.. ‘‘కేకేఆర్ జట్టు బాగుంది. కానీ తుది జట్టు కూర్పు విషయంలో వాళ్లకు క్లారిటీ లేదు. అందుకే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి👉🏾IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..! Arjun had Dronacharya, Harshit has Baz! 🎯@Bazmccullum #HarshitRana • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/V54ef8uSWX — KolkataKnightRiders (@KKRiders) May 1, 2022 Watch the Knights prepping up ahead of an all-important #KKRvRR! 💜#KnightsTV presented by @glancescreen | #KKRHaiTaiyaar #IPL2022 https://t.co/fBOfU2FTFs — KolkataKnightRiders (@KKRiders) May 1, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తీవ్ర విషాదంలో పార్థివ్ పటేల్.. భావోద్వేగ పోస్టుతో..
Parthiv Patel Father Passed Away: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’’ అని అతడు ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. కాగా కొంతకాలం క్రితం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పార్థివ్ తండ్రిని.. స్వస్థలం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ పటేల్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్ కీపర్‌గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt — parthiv patel (@parthiv9) September 26, 2021 -
Pragyan Ojha: గేల్, పూరన్.. మీ ఆలోచన తప్పు
అహ్మదాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమికి వారి బ్యాటింగ్ అప్రోచ్ సరిగా లేకపోవడమేనని టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా విమర్శించాడు. వారు బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు భారీ స్కోర్లు నమోదు చేయాలనే లక్ష్యంతో వచ్చి చిత్తు అవుతున్నారని ఓజా అభిప్రాయపడ్డాడు. కనీసం బోర్డుపై ఎంత స్కోరు ఉంచితే బాగుంటుందో అనే విషయంలో క్లారిటీ లేక ఒత్తిడిలో పడిపోతున్నారన్నాడు. ప్రధానంగా క్రిస్‌గేల్-నికోసల్ పూరన్‌లు అనవసరపు ఒత్తిడితో ఘోరంగా విఫలమవుతున్నారన్నాడు. వారిపై భారీ అంచనాలు ఉండటంతో ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో సహజసిద్దమైన ఆటను వదిలేశారన్నాడు. అసలు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్లానింగ్ బాలేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. క్రిక్‌బజ్ మాట్లాడిన ఓజా.. ‘ ఆ ఇద్దరూ కేవలం భారీ స్కోర్లు చేయాలనే వస్తున్నారు. ఒక మంచి ఆరంభం దొరికిన తర్వాత ఆ ఆలోచన చేయాలి. పరిస్థితుల్ని బట్టి గేమ్ ప్లాన్స్ మార్చడం లేదు. పెద్ద క్రికెటర్లమనే ఆలోచన పక్కన పెట్టండి.. అప్పుడే మీరు పరుగులు చేయగలరు. ముందు 160-170 స్కోరు బోర్డుపై ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్‌కు రండి.. వారిద్దరూ 180-190 పరుగులు చేయాలనే లక్ష్యంతో వస్తున్నారు. అదే మీపై ఒత్తిడి పెంచుతుంది. అసలుకే ఎసరు తెస్తుంది. మీ ఆలోచన తప్పు’ అని ఓజా విమర్శించాడు. నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (31), క్రిస్ జోర్డాన్ (30)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గేల్ గోల్డెన్ డక్‌గా ఔట్ కాగా, పూరన్(19)లు ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చదవండి: మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్ఆర్ రిక్వెస్ట్ హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు -
వారిద్దరు సూపర్.. పరిస్థితులకు తగ్గట్టు ఆడారు
చెన్నై: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను రాహుల్ (60*), గేల్(43*) గెలిపించి హాట్రిక్ ఓటముల నుంచి కాస్త ఉపశమనం పొందారు. కాగా పంజాబ్ ఆటతీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా ప్రసంశలు కురిపించాడు. ''ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్‌లో వారి సహజమైన ఆటతీరు కనిపించలేదు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఇన్నింగ్స్‌ను నడిపించిన రాహుల్, గేల్లు కడవరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. వాస్తవానికి ఇద్దరు దూకుడుగా ఆడేవాళ్లే.. కానీ అక్కడి పరిస్థితిని అర్థం చేసుకొని ఆడారు.. తమకోసం కాకుండా టీంను గెలిపించాలనేదానిపై ప్రతీ ఆటగాడు దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. గేల్ ఆటతీరు కూడా నాకు కొత్తగా అనిపించింది. వస్తూనే బాదుడే లక్ష్యంగా పెట్టుకొని నిర్లక్ష్యంగా వికెట్ ఇచ్చుకునే గేల్ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం పరిణితితో ఆడాడు. కానీ ఒకసారి కుదురుకున్నాక తన మార్క్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతను చేసిన 43 పరుగుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించకుండా కనిపిస్తున్న చెన్నై పిచ్‌పై ఓపికగా ఆడితే పరుగులు వస్తాయనేది మరోసారి నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సూర్య కుమార్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్ (2/21), షమీ (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలుపొందింది. చదవండి: ‘పిచ్‌లు తయారుచేసే టైమ్ లేదు.. ఇది బాధాకరం’ -
ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే
ముంబై: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని.. బౌలర్లకు, ఫీల్డర్లకు మధ్య ఏ మాత్రం కమ్యునికేషన్ లేకుండానే మ్యాచ్ ఆడారని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఘోర పరాభవం చూసిన సంగతి తెలిసిందే. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పడిక్కల్, కోహ్లిల సోరుతో పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం రాజస్తాన్ టాపార్డర్ ప్రదర్శనపై ఓజా మండిపడ్డాడు. ''నిన్నటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ముఖ్యంగా వారి టాప్ ఆర్డర్ బలహీనంగా తయారైంది. టాప్ ఆర్డర్ బలంగా ఉంటేనే కదా.. మిడిల్ ఆర్డర్ నుంచి మంచి ప్రదర్శన వచ్చేది. 30 పరుగులలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టను శివమ్ దూబే, తెవాటియాలు తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారిద్దరు ఆడారు గనుకనే కనీసం పోరాడే స్కోరును నమోదు చేయగలిగింది. శివమ్ దూబే ఔటైన తీరు నాకు అస్సలు నచ్చలేదు. అతను ఆ షాట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. దూబే అవుట్ అవ్వడానికి ముందు ఆ జట్టు కోచ్ సంగక్కర వచ్చి వెళ్లాడు. అతను ఏం చెప్పాడో.. దూబే ఏం విన్నాడో వారిద్దరికే తెలియాలి. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో బౌలర్లు, ఫీల్డర్లకు పొంతన లేకుండా పోయింది. వీళ్లు కనీసం కమ్యునికేషన్ లేకుండా మ్యాచ్‌ను ఆడేశారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం లీగ్ నుంచి మొదటగా నిష్క్రమించేది రాజస్తాన్ రాయల్స్.. '' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రగ్యాన్ ఓజా ఐపీఎల్లో 92 మ్యాచ్‌లాడి 82 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు. కాగా కోహ్లి ఇదే మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో 6వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. చదవండి: ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు.. పడిక్కల్‌కు సాయం చేసిన బట్లర్.. వీడియో వైరల్ -
‘ఫామ్‌లోకి రావాలంటే ముందు బ్రేక్ తీసుకో’
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పెట్టుకున్న నమ్మకాన్ని అందుకోలేకపోయిన మనీష్ పాండే తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటేనే మంచిదని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. గడిచిన మూడు మ్యాచ్‌లను చూస్తే ఒక్క సొగసైన ఇన్నింగ్స్(మ్యాచ్‌ను గెలిపించే) కూడా అతని బ్యాట్ నుంచి రాలేదని, దాంతో కాస్త విరామం తీసుకుంటే గాడిలో పడతాడన్నాడు. మనీష్ బ్రేక్ తీసుకుంటే అది అతనికి ఉపయోగపడుతుందని తెలిపాడు. స్పోర్ట్స్ టుడేతో ఓజా మాట్లాడుతూ.. ‘ ఈ ఐపీఎల్ సీజన్లో మనీష్‌కు అతని స్థాయిలో రాణించాలంటే కాస్త విశ్రాంతి అవసరం. వార్నర్, బెయిర్ స్టోలు ఆరంభం విఫలం కాకుండా మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు ఫేవర్‌గా ఉండాలంటే కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లని మిడిల్ ఆర్డర్ పరీక్షించండి. కేవలం వార్నర్-బెయిర్ స్టోలే మ్యాచ్‌లను గెలిపించలేరు. మనీష్‌కు కొన్ని మ్యాచ్‌లు రెస్ట్ ఇవ్వండి. అది అతనికే మంచిదే అవ్వడమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుంది’ అని ఓజా స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సన్‌రైజర్స్ ఇంకా ఖాతా తెరవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట పరాజయం చెందింది. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే పూర్తిస్థాయిలో ఆకట్టులేకవడం ఆ జట్టును నిరాశపరుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీష్ 44 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 7 బంతులాడి 2 పరుగులతో నిరాశపరిచాడు. ఇక్కడ చదవండి: గాయాల బారిన ‘సన్‌రైజర్స్’ అందుకోసమే బంతి విసిరాను..రనౌట్ ఊహించలేదు రోహిత్ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. -
సంజూ.. నువ్వు పోస్ట్ పెయిడ్ సిమ్ అవ్వాలి!
న్యూఢిల్లీ: ఒక మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం, ఆపై వెంటనే మళ్లీ నిరాశపరచడం ఇదే సంజూ సామ్సన్ విషయంలో మనం తరచు చూసేది. గత కొంతకాలంగా ఇదే తరహా ప్రదర్శన కారణంగానే సంజూ నిలకడలేని ఆటగాడని విమర్శలు వస్తున్నాయి. భారత క్రికెట్ జట్టులో ఆరేళ్ల క్రితం చోటు దక్కించుకున్న సామ్సన్.. కానీ ఇప్పటివరకూ రెగ్యులర్ ఆటగాడు కాలేకపోయాడు సామ్సన్. అతనికంటే ఎంతో వెనకాల వచ్చిన రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు భారత జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటే పోతే, సామ్సన్ మాత్రం అప్పడప్పుడు మాత్రమే టీమిండియా జట్టులోకి వస్తున్నాడు. అక్కడ కూడా ఇదే తరహా ప్రదర్శన. ఆడితే పించ్ హిట్టర్ తరహాలో మోత మోగించడం, ఆపై వెంటనే సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం సంజూ విషయంలో జరుగుతూ వస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 119 పరుగులు సాధించిన సంజూ.. ఆపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇలా విఫలం కావడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తనదైన శైలిలో విశ్లేషించాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన ఓజా.. సంజూ సామ్సన్ ఇంకా ప్రీ పెయిడ్‌లోనే ఉన్నాడు. . పోస్ట్ పెయిడ్ కావాలి అంటూ చమత్కరించాడు. ‘సంజూ సామ్సన్ 2015లో భారత క్రికెట్ జట్టులో అరంగేట్రం సరికి రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు లేరు. కానీ ఇప్పుడు భారత జట్టులో సంజూ లేడు. ఇందుకు కారణం అతనిలో నిలకడ లేకపోవడమే. సంజూ సామ్సన్ పోస్ట్ పెయిడ్ కావాలంటే నిలకడ అవసరం. యువ క్రికెటర్లకు నేను ఇదే చెబుతాను. నిలకడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టులో కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు పోస్ట్ పెయిడ్ ఆటగాళ్లని, వారు కొన్నాళ్లు బిల్లు కట్టకపోయినా వారికి నడుస్తుందన్నాడు. కోహ్లి, రోహిత్‌లు ఒకవేళ విఫలమైనా వారికి ఇప్పట్లో నష్టమేమీ లేదని పోస్ట్ పెయిడ్తో పోల్చాడు ప్రజ్ఞాన్ ఓజా. ఇక్కడ చదవండి: ఢిల్లీ ఓటమి: పంత్ మిస్టేక్ వెరీ క్లియర్..! ఐపీఎల్ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్ ‘అశ్విన్‌కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’ -
ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు.. అదే మీ కొంప ముంచుతుంది
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ఆ జట్టు మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా చిన్న వార్నింగ్ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా ఆర్సీబీతో ముంబై ఆడనున్న నేపథ్యంలో ప్రగ్యాన్ ఓజా స్పందించాడు. ఈ మ్యాచ్‌కు ముంబైకి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని.. అదే మీ కొంప ముంచుతుందని తెలిపాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగియగా.. ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020 రూపంలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్స్ అన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబయి ఇండియన్స్ టీమ్ గెలవడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్‌ని ముంబయి ఇండియన్స్ గెలిస్తే..? టోర్నీ చరిత్రలో వరుసగా మూడు సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా నిలవనుంది. ఇప్పటికే టోర్నీలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబయి టీమ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘‘ముంబై ఇండియన్స్ జట్టు మంచి సమతూకంతో కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఆ టీమ్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. ఈ ఏడాది మినీ వేలంలో కూడా ఆ జట్టు ఓ రెండు మూడు స్థానాల్ని భర్తీ చేసుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. ఎందుకంటే.. ఆ జట్టు ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. వరుసగా 2019, 2020లో టైటిల్ గెలవడం ద్వారా ముంబయి టీమ్ ఇప్పుడు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కానీ.. ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాత్రం టోర్నీలో ఆడకూడదు’’ అని ప్రగ్యాన్ ఓజా హెచ్చరించాడు. -
'కేకేఆర్‌కు భజ్జీ కీలకంగా మారనున్నాడు'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలకంగా మారనున్నాడని మాజీ బౌలర్ ప్రగ్యాన్ ఓజా జోస్యం చెప్పాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా మాట్లాడుతూ.. టీమిండియా తరపున హర్భజన్ సింగ్ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అతని అనుభవం ఈ ఐపీఎల్లో ఎంతో ఉపయోగపడుతుంది. భజ్జీ తుది జట్టులో ఉంటే మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారుతాడు. అయితే కరోనా దృష్యా ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే వెసులబాటు కల్పించకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు తటస్థ వేదికల్లో ఆడనున్నాయి. ఇక భజ్జీ గతంలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ తరపున ఆడడంతో ఆయా వేదికల్లో భజ్జీ కీలకపాత్ర పోషించనున్నాడు. సీఎస్కేకు రైనా అనుభవం ఎలా ఉపయోగపడుతుందో.. కేకేఆర్‌కు హర్భజన్ అలా అవసరమవుతాడు. గతేడాది సీజన్‌కు ఈ ఇద్దరు దూరంగా ఉన్నా.. ఇప్పటికే ప్రాక్టీస్‌లో తలమునకలవడంతో మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. అంటూ చెప్పుకొచ్చాడు. కాగా హర్భజన్ వ్యక్తిగత కారణాల రిత్యా గత సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో హర్భజన్‌ను కేకేఆర్ రూ. 2 కోట్ల కనీస మద్దతు ధరకే సొంతం చేసుకుంది. ఇటీవలే ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న హర్భజన్ జట్టుతో చేరి ప్రాక్టీస్ ఆరంభించాడు. ఇక కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. చదవండి: IPL 2021: మరో స్టార్ ఆటగాడికి కరోనా కోహ్లి, రోహిత్‌ల నుంచి మెసేజ్‌లు వచ్చాయి: శాంసన్ -
'రోజు వేరు కావొచ్చు.. సెలబ్రేషన్‌కు కారణం పాజీనే'
రాయ్‌పూర్: టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజుగా పిలుస్తారనడంలో సందేహం లేదు. వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు.. టెస్టులు, వన్డేలు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇలా ఎవరికి సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు. అలాంటి సచిన్‌కు ఈరోజు(మార్చి 16) ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సరిగ్గా ఇదే రోజున(మార్చి 16, 2012) బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన 100వ సెంచరీని సాధించాడు. మీర్పూర్ షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో సచిన్ ఈ ఘనత అందుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 114 పరుగులు చేయగా.. బంగ్లా ముందు టీమిండియా 290 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాలుగు బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ విజయం తన ఖాతాలో వేసుకున్నది. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఆడుతున్న సచిన్‌కు ఇండియా లెజెండ్స్ ఆటగాళ్లు కంగ్రాట్స్ చెబుతూ అతని చేత కేక్ కట్ చేయించారు. ఇండియా లెజెండ్స్ ఆటగాళ్లైన యువరాజ్, సెహ్వాగ్, ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్.. తదితర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ..''రోజు వేరు కావొచ్చు.. కానీ సెలబ్రేషన్‌కు కారణం మాత్రం ఒకటే.. కంగ్రాట్స్ పాజీ'' అంటూ ట్వీట్ చేశారు.దీనికి సంబందించిన వీడియోను ప్రగ్యాన్ ఓజా తన ట్విటర్లో షేర్ చేశాడు. సచిన్‌కు 100 వ అంతర్జాతీయ సెంచరీ సాధించడం అంత సులభమేం కాలేదు. ఎందుకంటే అతను ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు ఒక ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 2011 మార్చిలో దక్షిణాఫ్రికాపై 99వ సెంచరీ చేసిన సచిన్.. ఆ తర్వాత రెండు సందర్బాల్లో 90 పరుగుల వద్ద అవుటయ్యాడు. మార్చి 18 న సచిన్ వన్డే కెరీర్లో తన చివరి మ్యాచ్‌ను.. ఆఖరి అంతర్జాతీయ మ్యచ్‌ను ఆడాడు.మాస్టర్ ఆ మైలురాయిని సాధించి 9సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ రికార్డు పదిలంగా ఉండడం విశేషం. కాగా, ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు. టీమిండియా తరపున సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు.. 200 టెస్టుల్లో 15921 పరుగులు.. వన్డే, టెస్టులు కలిపి వంద సెంచరీలు( వన్డేల్లో 49, టెస్టుల్లో 51) సాధించాడు. చదవండి: సిక్సర్లతో యువీ, బౌండరీలతో సచిన్.. వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు Different day but the reason remains the same. Celebrating @sachin_rt paaji’s 100th 100. pic.twitter.com/gKvubhsBHI — Pragyan Ojha (@pragyanojha) March 16, 2021 -
'ధోనికి మీరిచ్చే విలువ ఇదేనా'
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ధోని, కేదార్ జాదవ్ ఆటతీరుపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం క్రికెటర్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేసుకొని అసభ్యకరవ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎంఎస్ ధోని కూతురు జీవాపై నీచమైన వ్యాఖ్యలు చేయడం పట్ల జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ కూడా అయింది. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. మ్యాచ్ ఓడిపోతే దానికి ఆటగాళ్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించి దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిచిన ధోని లాంటి ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) 'ఇది మనమందరం పరిష్కరించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్రీడకు సంబంధించిందో లేక వ్యక్తిగత విషయమో కాదు.. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న విషయం. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు.. అవతలి వ్యక్తికి అది చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆటగాడిని విమర్శించడం వరకు ఓకే కానీ.. కుటుంబసభ్యులను ముడిపెడుతూ వ్యక్తిగత దూషణలు దిగడం తగదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుంది.. పిల్లలు ఉంటారు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు.. నా వృత్తి రిత్యా కొంతమంది మహిళలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆటలో ఎంఎస్ ధోని ప్రదర్శన గురించి ఎన్ని కామెంట్స్ రాసినా పట్టించుకోరు.. ఎందుకంటే అది ఆట.. అందులోనూ ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం నడుస్తుంది. దీన్ని సాకుగా తీసుకొని కుటుంబసభ్యుల వరకు వెళ్తే ఎవరు ఊరుకోరు. మేము మనుషులమే.. మాకు మనుసులుంటాయి. ఎదుటివారి గురించి హాస్యాస్పదంగా చెప్పినంత వరకు మంచిగానే ఉంటుంది.. కానీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీ వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంటర్టైన్మెంట్ జోనర్ వరకు ఉపయోగించండి తప్పులేదు.. ఉదా : ఆటగాళ్లు సరిగా ఆడడం లేదని ట్రోల్ చేయడం.. వారి ఆటతీరుపై ఫన్నీ మీమ్స్ పెట్టడం లాంటివి ఓకే. (చదవండి : జీవా ధోనికి భద్రత పెంపు) కానీ ఇదే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మరీ పిచ్చిరాతలు రాసున్నారు. అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తూ అసభ్యపరుషజాలం ఉపయోగిస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి.ఈరోజు ధోని, సచిన్ లాంటి వ్యక్తుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం సిగ్గుగా ఉంది. టీమిండియాలో క్రికెట్ బతికున్నంత కాలం వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎప్పటికి వాళ్లు దిగ్గజాలుగాను కనబడుతారు. అలాంటి వ్యక్తులు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు. కానీ ఇదంతా ఒక నాన్సెన్స్.. ఒక భారతీయుడిగా ఇలాంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ' విరుచుకుపడ్డాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. -
ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ప్రధానంగా ధోని వైఫల్యాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. (చదవండి:సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) కాగా, ధోనికి మద్దతుగా నిలిచాడు మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో ఓజా మాట్లాడుతూ.. ‘ ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా..వరుసగా సీఎస్కే వరుస పరాజయాలకు ధోని కారణమా. ఐపీఎల్ ఆరంభమైన తర్వాత సీఎస్కే క్యాంపులో ఏమి జరుగుతుంతో చూడటం లేదా. ఓవరాల్‌గా ఆ జట్టు ప్రదర్శన బాగాలేదు. ఇది ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. ఇక వెంటనే ధోని వైపు వేలెత్తి చూపుతున్నారు. జట్టు మొత్తంగా విఫలమైతే ధోని ఒక్కడే ఏం చేస్తాడు. సమిష్టి వైఫల్యానికి వ్యక్తిగత దూషణలకు దిగడం భావ్యం కాదు. ఇక్కడ ధోనిని విమర్శించలేం. కేదార్ జాదవ్ ఉన్నాడు.. ఏమైనా స్కోరు చేశాడా.. అతని నుంచి సీఎస్కే ఏమి ఆశిస్తుందో అది ఇంతవరకూ ఇవ్వలేదు. ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా మాట్లాడుతున్నారు. బ్యాటింగ్ గ్యాప్‌ను సర్దుబాటు చేసేందుకే ధోని యత్నిస్తున్నాడు. సీఎస్కేలో రెండు పెద్ద గ్యాప్‌లు ఉన్నాయి. ఒకటి సురేశ్ రైనా జట్టును వీడి వెళ్లిపోవడం, ఇంకొటి జాదవ్ సరిగా ఆడకపోవడం. వీటిని ఫిల్ చేయడం చాలా కష్టం. ధోని ఏమి చేసినా కామెంట్లు చేయడం ఆపితే మంచిది. ఎప్పుడైనా ఏ ఒక్కడో పరాజయాలకు కారణం కాదు. జట్టుగా ఆడుతున్నప్పుడు ఓవరాల్ జట్టు విఫలమైతే అందుకు మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు సీఎస్కే యూనిట్లో అదే పరిస్థితి ఉంది’ అని ఓజా పేర్కొన్నాడు.(చదవండి: ఆ విషయాన్ని పంత్ గ్రహించాడు: లారా) -
సచిన్ వికెట్ పడగొట్టు.. గిఫ్ట్ పట్టు
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటను ఆస్వాదించిన వారు కొందరైతే.. అతడి ఆటతో స్పూర్థి పొంది క్రికెట్‌నే వృత్తిగా ఎంచుకున్న వారు మరికొంత మంది ఉన్నారు. అలా స్పూర్తి పొంది క్రికెట్లో అడుగుపెట్టిన ఏ బౌలర్‌కైనా సచిన్ వికెట్‌ను పడగొడితే ఆ ఆనందం టన్నుల్లో ఉంటుంది. ప్రత్యర్థి వ్యూహం, ప్రతీ బౌలర్ టార్గెట్ సచిన్‌ను ఔట్ చేయడమే ప్రధానంగా ఉండేది. ఇక సచిన్ వికెట్ పడగొడితే సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి అభినందనలే కాదు బహుమతులు కూడా రావడం విశేషం. ఇలా సచిన్ వికెట్ పడగొట్టి బహుమతి తీసుకున్నానని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. (క్రికెట్లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ) దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009 సందర్భంగా డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఓజా ప్రాతినిథ్యం వహించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సీజన్లో డర్బన్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొట్టిన విషయాన్ని ఓజా గుర్తుచేసుకున్నాడు. ‘ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా డెక్కన్ ఛార్జర్స్ ఓనర్ వచ్చి సచిన్ వికెట్ పడగొడితే స్పెషల్ గిఫ్గ్ ఇస్తానన్నాడు. అప్పుడు సచిన్ వికెట్ పడగొడితే నాకు వాచ్ గిఫ్ట్‌గా కావాలని కోరాను. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొట్టడంతో నాకు వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. సచిన్ వికెట్ తీసిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అది’ అంటూ ఓజా పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరుపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో పాల్గొన్న ఓజా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. (వారే విఫలమైతే నా పరిస్థితి ఏమిటి?)