వీవీఎస్ లక్ష్మణ్ తనకు ఆదర్శప్రాయుడని భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. శుక్రవారం నిజాంపేటలోని విజ్ఞాన్ విద్యాలయంలో జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓజా కాసేపు విద్యార్థులతో ముచ్చటించాడు.
జింఖానా, న్యూస్‌లై న్: వీవీఎస్ లక్ష్మణ్ తనకు ఆదర్శప్రాయుడని భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. శుక్రవారం నిజాంపేటలోని విజ్ఞాన్ విద్యాలయంలో జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓజా కాసేపు విద్యార్థులతో ముచ్చటించాడు. ‘చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలనే తపన ఉండేది. ఈ విషయంలో నేను చదివిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహాన్నిచ్చారు. జీవితంలో శ్రమించిన వారికి ఫలితం తప్పక దక్కుతుంది. ఆట పట్ల అంకిత భావమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.
వీవీఎస్ లక్ష్మణ్ నాకు ఆదర్శం. క్రికెటర్‌గానే కాకుండా మానవత్వమున్న మనిషిగా నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాడు’ అని ప్రజ్ఞాన్ అన్నాడు. ఐపీఎల్‌లో సచిన్ నుంచి పర్పుల్ క్యాప్ తీసుకోవడం తన కెరీర్‌లో మధురానుభూతిగా నిలిచిందని ఓజా గుర్తుచేసుకున్నాడు. విజ్ఞాన్ విద్యాలయం నిర్వహిస్తున్న ఈ ఖోఖో పోటీలు 27 వరకు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 50 పాఠశాలల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.