ఫిట్‌నెస్‌పై దృష్టి: పుజారా | Cheteshwar Pujara ascends in ICC Test rankings | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌పై దృష్టి: పుజారా

Published Tue, Jan 7 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

చతేశ్వర్ పుజారా

చతేశ్వర్ పుజారా

 ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రదర్శన పట్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానని... దీనివల్ల ప్రదర్శనతో పాటు ర్యాంకింగ్ కూడా మెరుగవుతోందని చెప్పాడు. ‘2011లో మోకాలుకు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నా. ఆ తర్వాత ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు కఠోరంగా శ్రమిస్తూ వచ్చాను. దీంతో గత ఏడాదిన్నర నుంచి నా ప్రదర్శన కూడా బాగా మెరుగుపడింది. మొదట్లో నేను జిమ్‌లో బద్ధకించేవాడిని. కానీ ఇప్పుడు బాగా మారాను’ అని అన్నాడు. అయితే సఫారీ గడ్డపై భారత వైఫల్యంపై మాట్లాడేందుకు నిరాకరించాడు.
 కెరీర్‌లో ఉత్తమ ర్యాంకుకు...
 ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పుజారా కెరీర్‌లో ఉత్తమంగా ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో అతను రెండు స్థానాల్ని మెరుగుపర్చుకోగా... కోహ్లి ఓ స్థానం కోల్పోయి 11వ ర్యాంకుకు దిగజారాడు. టెస్టు బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడు, ప్రజ్ఞాన్ ఓజా తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement